V. Hanumantha Rao
-
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు అస్వస్థత
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వీ హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని అంబర్‌పేట ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆయన ప్రస్తుత ఆరోగ్యంపై సమాచారం అందాల్సి ఉంది. -
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి... అసెంబ్లీకి రావాలి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు త్వరగా కోలుకుని శాసనసభకు రావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలసి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్.. కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, వైద్యులతోనూ మాట్లాడారు. తర్వాత ఆస్పత్రి బయట రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ను పరామర్శించాను. క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఇప్పటికే ఆదేశించాం. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నా. మంచి ప్రభుత్వ పాలన అందించడానికి ఆయన సూచనలు అవసరం. ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరముంది. ఆయన త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నా..’’అని రేవంత్ అన్నారు. కేటీఆర్, హరీశ్‌లను కలసిన పొన్నం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యశోద ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గానికి చెందిన ఓ కార్యకర్తను పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చానని.. అక్కడే ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులను కలసి మాట్లాడానని పొన్నం ప్రభాకర్ చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని కేటీఆర్, హరీశ్‌రావు చెప్పారన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, కేసీఆర్ త్వర గా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. కేసీఆర్‌కు వీహెచ్, కోదండరెడ్డి పరామర్శ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, కోదండరెడ్డి పరామర్శించారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రికి ఆదివారం వెళ్లిన ఇద్దరు నేతలు కేసీఆర్‌ను కలిశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొలుత కేసీఆర్‌ను కలిసేందుకు ఆసుపత్రి వర్గాలు అనుమతించకపోవడంతో.. మాజీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని ఇద్దరు కాంగ్రెస్ నేతలను లోపలికి తీసుకెళ్లారు. మరో రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ డిశ్చార్జ్? సాధారణంగా తుంటి మారి్పడి సర్జరీ చేయించుకున్న అనంతరం రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తారు. అయితే వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ డిశ్చార్జిని కొద్దిగా పొడిగించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆయన బాగానే కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు సాధారణ మందుల వాడకం, సులభమైన వ్యాయామాలు తప్ప మరే ప్రత్యేకమైన వైద్య సేవలూ అవసరం లేదని అంటున్నారు. దీంతో ఆయనను మరో 2, 3 రోజుల్లోనే డిశ్చార్జి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పూర్తిగా కోలుకుని తన కార్యకలాపాలు య «థావిధిగా నిర్వర్తించేందుకు మరి కొన్ని వారా లు పడుతుందని వైద్యులు అంటున్నారు. -
అగ్నిప్రమాద స్పాట్లో కేటీఆర్, వీహెచ్..
-
చాకిరీ మాది... పదవులు మీకా?
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యమివ్వడం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, 51కి తగ్గకుండా తమకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని టీపీసీసీ బీసీ నేతల సమావేశం డిమాండ్ చేసింది. ‘అగ్రవర్ణాల నేతలకు టికెట్లు ఇప్పటికే ఖరారయ్యాయి. వారంతా వారివారి నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్నారు. మరి, బీసీ నేతలకు టికెట్లు ఎప్పు డు ప్రకటిస్తారు? చాకిరీ మాది..సీట్లు, పదవులు మీకా? సమీకరణల పేరుతో ప్రతీసారి ఆఖరి నిమిషంలో టికెట్లు ఇస్తున్నారు. అలాకాకుండా 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలి. అప్పుడే నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పనిచేసుకునే అవకాశం లభిస్తుంది’అని సమావేశంలో పలువురు నేతలు వ్యాఖ్యానించారు. పార్టీలోని ఏ ఒక్క సామాజిక వర్గానికి తాము వ్యతిరేకం కాదని, కానీ జనా భా ప్రాతిపదికన తమ కోటా సీట్లు, పార్టీ పదవులు తమ కు ఇవ్వాల్సిందేనని ఉద్ఘాటించారు. పీసీసీ మాజీ అధ్య క్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీ సీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యల నేతృత్వంలో మంగళ వారం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతల సమావేశం జరిగింది. ఇందులో 100 మందికిపైగా బీసీ నేతలు పాల్గొన్నారు. 1% జనాభా లేని వారితో సమానంగా టికెట్లా? సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, పార్టీలో తమ వర్గాలకు ప్రాధాన్యమివ్వాలని అటు ఏఐసీసీ, ఇటు టీపీసీసీలను కోరారు. ప్రతి పార్లమెంటు స్థానంలో కనీసం 3 అసెంబ్లీ స్థానాల చొప్పున 51కి తగ్గకుండా మెజార్టీ కులాలకు టికెట్లు కేటా యించాలని ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 30–32 సీట్లకే బీసీలను సరిపెడుతున్నారని, ఒక్క శాతం జనాభా లేని వారితో సమానంగా టికెట్లు ఇస్తున్నారన్నారు. బీసీల గురించి మాట్లాడితే తొక్కేస్తారనే భయం ఇప్పటికీ పార్టీలో ఉందని, పార్టీ పదవుల కేటాయింపులో మార్పు రావాలని చెప్పారు. జిల్లాల వారీగా సమావేశాలు దేశవ్యాప్తంగా బీసీ కులాలకు ప్రాధాన్యమివ్వాలన్న పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఓబీసీల జనగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని, పార్టీలో బీసీలకు తగిన ప్రాధాన్యమిస్తామని వెల్లడించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించారు. బీసీలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్‌ను దెబ్బతీయాలన్న ఆలోచనతో రాహుల్ ఓబీసీలను కించపర్చారంటూ బీజేపీ చేస్తున్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరిని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ గర్జన సభనిర్వహణపై మరోసారి సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల జనాభా, ఓట్ల వివరాలతో కూడిన నివేదికను సోనియా, రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గేలకు అందజేయాలని నిర్ణయించారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్, పార్టీ నేతలు శ్యాంమోహన్ పాల్గొన్నారు. -
పీసీసీ అధ్యక్షుడు అందర్నీ కలుపుకొని పోవాలి: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అందరినీ కలుపుకొని పోవాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) హితవు పలికారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత అధిష్టానం సమీక్ష చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సమీక్ష చేసి ఓటమి కారణాలు తెలుసుకుని పార్టీని బలోపేతం చేసుకొనే దిశగా ముందుకెళ్లాలని సూచించారు. ప్రస్తుత రిజర్వేషన్ల కారణంగా ఎక్కువ జనాభా ఉన్న ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని వీహెచ్ ఆవేదన వ్యక్తంచేశారు. జనగణనతోపాటు కులగణన చేయాలని, ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 20న ఢిల్లీలో నిర్వహించే అన్ని పార్టీల ఓబీసీ ఎంపీలతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వీహెచ్ వెల్లడించారు. చదవండి: కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. పీసీసీ పదవులకు 12 మంది రాజీనామా -
కోవర్టు రెడ్డిగా ఉంటావో.. కోమటిరెడ్డిగా ఉంటావో నీ ఇష్టం: వీహెచ్
జడ్చర్ల: ‘మునుగోడు ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండి మంత్రి కేటీఆర్ అన్నట్లు కోవర్టురెడ్డిలా ఉంటావో.. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషిచేసి కోమటిరెడ్డిలా ఉంటా వో నీ ఇష్టం’.. అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను మంగళవారం కోమటిరెడ్డిని కలిసిన ప్పుడు.. తమ్ముడి కోసం రాజకీయ భవిష్యత్ ను ఎందుకు పణంగా పెడుతున్నావని ప్రశ్నించినట్లు చెప్పారు. మునుగోడు ఆడబిడ్డను అందరం కలిసి గెలిపించుకుందామని వెంకట్ రెడ్డికి నచ్చజెప్పానని పేర్కొన్నారు. -
రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై స్పందించిన వీహెచ్
-
కాంగ్రెస్‌లో కల్లోలం: వీహెచ్ వ్యవహారంపై రేవంత్‌రెడ్డి సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ నేతలు కలవలేదు. కానీ టీపీసీసీ ఆదేశాలను పక్కనపెట్టి సిన్హాను వీహెచ్ కలిశారు. ఆయన వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ: మంత్రి తలసాని సిన్హాను కలవబోమని ముందే టీపీసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీని నిర్ణయాన్ని ఎవ్వరైనా పాటించాల్సిందేనని.. పార్టీ నిర్ణయం కాదని వ్యక్తిగతంగా మాట్లాడితే గోడకేసి కొడతామని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆ ఇంటిపై వాలిన కాకిని మా ఇంటిపై వాలనీయం’’ అంటూ ధ్వజమెత్తారు. మన ఇంటికి వచ్చినప్పుడే మనం కలవాలని రేవంత్‌రెడ్డి అన్నారు. -
ఢిల్లీ పర్యటనకు నాకు ఆహ్వానం అందలేదు: వీహెచ్
-
బిహార్ ఐఏఎస్‌లపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ల ఆగ్రహం
-
రేపటి నుంచి నా సంగతి ఏంటో చూపిస్తా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎల్పీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాజీ ఎంపీ వీ హనుమంతరావు భేటీ అయ్యారు. రేవంత్‌కి పీసీసీ ఇచ్చినప్పటి నుంచి కోమటిరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు నచ్చజెప్పే బాధ్యతను పొలిటికల్ అఫైర్స్ కమిటీ వీహెచ్‌కి అప్పగించింది. ఇదిలా ఉండగా శనివారం సీఎల్పీ ఆఫీస్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'కామారెడ్డి- ఎల్లారెడ్డి నుంచి నా ఉద్యమం మొదలుపెడతా. రేపటి నుంచి నా సంగతి ఏంటో చూపిస్తా. కాంగ్రెస్ పార్టీ నా ప్రాణం- సోనియాగాంధీ నా దేవత. మా పార్టీ నేతలే అప్పుడు దయ్యం ఇప్పుడు దేవత అంటున్నారు. పెద్ద లీడర్లు అని చెప్పుకొని పదవుల పంపకాలు చేసుకున్నారు. నేను జిల్లా లీడర్‌ను వాళ్లంతా పెద్ద గొప్ప లీడర్లు. ఏపీలో కాంగ్రెస్ లేదనుకుంటే 6 వేల ఓట్లు వచ్చాయి. తెలంగాణలో ప్రభుత్వం వస్తదని చెప్పుకున్నా డిపాజిట్లు రాలే. చదవండి: (ఇది చేతకాని ప్రభుత్వం: వైఎస్ షర్మిల) గెలుపోటములు సహజం కేసీఆర్ ఇక రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల గురించి ఆలోచన చేయాలి. కేటీఆర్ సూటు, బూటు వేసుకుంటే పెట్టుబడులు రావు. కాంగ్రెస్ అభివృద్ధి వల్లే ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి. కేటీఆర్ ఎందుకు రైతుల గురించి వాళ్ల కష్టాల గురించి మాట్లాడరు. రైతుబంధు వల్ల ఎవరికి ఉపయోగం. మా ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రిని చూసి కేసీఆర్ బుద్ది తెచ్చుకోవాలి అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చదవండి: (హరీశ్.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో) -
ఎంఐఎంకు ఇచ్చారు.. మాకు ఎందుకివ్వరు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ట్రాఫిక్ క్లియర్ చేసి ఆరెస్సెస్ కవాతుకు ఎలా అనుమతిచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ వాళ్లు కర్రలతో భయానక వాతావరణం సృష్టిస్తే, దానికి పోలీసులు సహకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ ర్యాలీకి సంబంధించిన వీడియోను పవర్‌పాయింట్ ద్వారా మీడియాకు చూపించాడు. గాంధీభవన్‌లో శుక్రవారం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు మున్సిపల్ ఎన్నికలు, చేపట్టాల్సిన ర్యాలీ, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘తిరంగ్ యాత్ర’, ‘సేవ్ నేషన్-సేవ్ కాన్స్టిట్యూషన్’కు అనుమతులివ్వడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. 130 కోట్ల మంది భారతీయులు హిందువులేనంటూ రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నది ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదని కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక 135వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం నాడు అన్ని జిల్లాల్లో జెండావిష్కరణ చేసుకుని ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ చేరుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్తంగా ర్యాలీలు చేశామని హైదరాబాద్‌లో కూడా ర్యాలీ చేయాలనుకున్నామన్నారు. కానీ ట్రాఫిక్ సమస్య పేరుతో అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు. తాము అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మాత్రమే వెళతామంటున్నాం. కానీ అంబేద్కర్ అంటే కేసీఆర్‌కు ఎలర్జీ అని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎంఐఎం సభకు ఎలా అనుమతి ఇచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. మజ్లీస్, బీజేపీతో కేసీఆర్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఈ దేశంలో హిందువులు మాత్రమే కాదు.. అన్ని మతాల వారు ఉన్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఇది సెక్యులర్ దేశమని నొక్కి చెప్పారు. ఆర్ఎస్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎలాగైనా రేపు సేవ్ ఇండియా-సేవ్ కాన్స్టిట్యూషన్ ర్యాలీ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. -
భట్టి ముందే బాహాబాహీ!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సన్మాన కార్యాక్రమం రసాభాసగా మారింది. సీనియర్ నేత వి హనుమంతరావును అంబర్‌పేట నియోవర్గ నేత శ్రీకాంత్ అనచరులు అడ్డుకున్నారు. శ్రీకాంత్‌కు టికెట్ రాకుండా వీహెచ్ అడ్డుకున్నారని ఆరోపిస్తూ.. ఆయన అనచరులు ఆందోళన చేపట్టారు. సహనం కోల్పోయిన వీహెచ్ వారిపై దుర్భాషలాడారు. దీంతో శ్రీకాంత్ అనచరులు వీహెచ్‌పైకి దూసుకెళ్లారు. అతనికి వ్యతిరేకంగా వీహెచ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వీహెచ్ వర్గీయులు కూడా దూసుకురావడంతో సమావేశం రచ్చ రచ్చైంది. ఇరువర్గాల నేతలు కుర్చీలతో, పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఇరువర్గాల కార్యకర్తలను సీనియర్ నేతలు శాతింపజేసే ప్రయత్నం చేశారు. సీఎల్పీనేతగా ఎన్నికైన భట్టి విక్రమార్కను శనివారం సన్మానించేందుకు పార్టీ వర్గాలు గాంధీభవన్‌లో ఏర్పాటు చేశాయి. అయితే వీహెచ్-శ్రీకాంత్ వర్గపోరుతో ఈ సమావేశం రసాభాసగా మారింది. -
కోమటిరెడ్డి, వీహెచ్‌పై అధిష్టానం సీరియస్
సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీనియర్ నేత వి. హనుమంతరావుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంగా ఆగ్రహంగా ఉంది. ఎన్నికల కమిటీల కూర్పును విమర్శిస్తూ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన వీరిపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమైంది. కమిటీ చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. కోమటిరెడ్డి, వీహెచ్ వ్యవహారంపై కమిటీ చర్చించింది. కోమటిరెడ్డికి నోటీసులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. కుంతియా, కమిటీల ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా ఆయనపై చాలా ఫిర్యాదులు వచ్చాయని కమిటీ తెలిపింది. ఏఐసీసీ ఇంఛార్జ్, కమిటీల కూర్పు, కమిటీ సభ్యులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా, అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించినట్లు గుర్తించామని పేర్కొంది. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మీడియా ముందు పార్టీ వ్యతిరేకంగా మాట్లాడొద్దని సూచించినా పట్టించుకోకుండా పార్టీకి నష్టం జరిగేలా చేసిన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని కమిటీ తెలిపింది. రెండు రోజుల్లో వివరణ ఇవ్వకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. స్పందించిన కుంతియా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి కుంతియా తెలిపారు. వీరిద్దరి వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణ కమిటీలో చర్చ జరుగుతుందన్నారు. పార్టీ నిబంధనల ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. కాగా, కుంతియా శనిలా దాపురించారంటూ కోమటిరెడ్డి గురువారం తీవ్రస్థాయిలో విరుకుపడ్డారు. -
‘ఇక మా గెలుపు ఎవరూ ఆపలేరు’
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో సగం మందికిపైగా డిపాజిట్ కూడా రాదని కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన చూస్తే ఇక కాంగ్రెస్ గెలుపు ఎవరూ ఆపలేరని అర్థమవుతుందన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థుల జాబితాతో సీఎం సెల్ఫ్‌గోల్ నెరవేర్చుకున్నారని విమర్శించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని అందుకు కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితానే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేస్తే 100 సీట్లు రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. గెలిచే అభ్యర్థుల కోసం పార్టీల్లో కొట్లాడుతానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కొడుకును సీఎం చేయడం కోసమే ముందస్తు : వీహెచ్ కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడం కోసమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు ఆరోపించారు. నిజామాబాద్‌లోని కల్లూరు గ్రామంలో ఆయన మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి సోనియా గాంధీకి అప్పజెప్పడమే తన లక్ష్యమన్నారు. ‘కల్లూరు గ్రామం నుంచి మట్టిని తెచ్చి గాంధీ భవన్లో పెడతా. కేసీఆర్‌ను గద్దె దించి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే గ్రామంలో చల్లుతానని శపధం చేశారు. ఎన్నికల మేనిపెస్ట్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. -
‘శ్యామల చెప్పింది నిజమైతది’
సాక్షి, హైదరాబాద్: ఉజ్జయిని అమ్మవారి బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం, పోలీసు శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జోగిని శ్యామలకు కాంగ్రెస్ మాజీ ఎంపీ వి. హన్మంతరావు మద్దతు తెలిపారు. శ్యామల చెప్పింది నిజమైతదని, తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వపాలన ముగియక తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణలో సర్పంచులకు అధికారాలు ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా కేసీఆర్ అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు కావాలనే నిర్వహించడంలేదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. గ్రామాలకు ప్రత్యేక అధికారుల వస్తే తరిమి కొట్టండని వీహెచ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో డిక్టేకర్ రాజ్యం నడుస్తోందని, ప్రజలు ఈ ప్రభుత్వంపైన తిరగబడితే కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుందని వీహెచ్ స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను టీఆర్ఎస్ ప్రభుత్వం అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు తాయిలాలే తప్ప రాజకీయంగా న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య చెప్పి, ఇప్పుడు మళ్లీ బీసీల గణన అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవిని త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని వీహెచ్ కోరారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయించే ఆనవాయితీ ఉందని తెలిపారు. ప్రజల్లో తిరిగే ఓపిక ఇంకా ఉందని, కాంగ్రెస్ కోసం ఒక కార్యకర్తలా పనిచేస్తానని పేర్కొన్నారు. -
శక్తి యాప్‌తో కార్యకర్తకు శక్తి
సాక్షి, హైదరాబాద్: కార్యకర్తలకు శక్తినివ్వడానికే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ శక్తి యాప్‌ను క్రియేట్ చేయించారని టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. యాప్ రిజిస్ట్రేషన్‌పై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అధ్యక్షతన గాంధీభవన్‌లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చించడం కోసమే.. ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు తెలిపారు. రాహుల్ ఆదేశాల మేరకే శక్తి యాప్ రివ్యూ మీటింగ్ కోసం చిదంబరం తెలంగాణకు వచ్చారన్నారు. ప్రతి రోజు కార్యకర్తలకు పార్టీ కార్యక్రమాన్ని తెలియజేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్‌లో శక్తి యాప్ మరింత అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే యాప్‌లో లక్ష మెంబర్ షిప్ దాటిందని ఉత్తమ్ తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. వీహెచ్ గరంగరం అంబర్‌పేటలో నూతి శ్రీకాంత్ అనే నేత శక్తి యాప్‌లో కార్యకర్తలను చేర్పించారని తెలిపిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను చేర్పించిన ఘనత శ్రీకాంత్ ఒక్కడికే ఇవ్వడం సరికాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. తన నియోజక వర్గంలో తనకు తెలియకుండా కార్యకర్తలను ఎలా చేర్పిస్తావంటూ రాంమోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనతో పెట్టుకోవద్దంటూ వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు. -
‘ప్రతి ఇంటికి తాళం వేయండి’
సాక్షి, హైదరాబాద్ : కత్తి మహేశ్, స్వామి పరిపూర్ణానందలను నగర బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని కాగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతి భద్రతల పేరిట ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలెవరూ బయటకి రాకుండా ప్రతి ఇంటికి తాళం వేయండి ..శాంతి భద్రతలు ఇంకా బాగుంటాయని ఎద్దెవా చేశారు. పరిపూర్ణానంద స్వామి బహిష్కరణపై చినజీయర్ స్వామి ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. స్వామీజీ ఎం తప్పు చేశారని ఆయనపై గుండా యాక్ట్ పెట్టారని మండిపడ్డారు. ప్రగతి భవన్ వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేడయం దారుణమన్నారు. ముఖ్యమంత్రి ప్రతి చర్యను గవర్నర్ సమర్థించడం సరికాదన్నారు. -
బీజేపీది అక్కడో మాట, ఇక్కడో మాట: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కేంద్ర నేతలు టీఆర్ఎస్ పాలన బాగుందంటే, రాష్ట్ర నేతలేమో ప్రభుత్వంతో కొట్లాడుతు న్నారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై ద్వంద్వ వైఖరితో ఉన్న బీజేపీ నేతలు.. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనడం హాస్యాస్పదమ న్నారు. కొత్త సచివాలయం నిర్మాణాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. దీనిపై ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తామన్నారు. నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదన్నారు. -
దళితులకు రక్షణ లేదు: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దళితులకు రక్షణ కరువైందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనలో బాధితుడి బంధువులు ఆగ్రహంతో ఇసుక లారీలు తగలబెట్టారని, అయితే పోలీసులు ప్రమాదానికి కారణమైన నిందితులను వదిలేసి లారీలను తగలబెట్టిన దళితులను అదుపులోకి తీసుకొని వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దళితులపై దాడులకు నిదర్శనమని అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఇసుక దందాలు పెరిగిపోతున్నాయని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని పేర్కొన్నారు. దీని వెనుక మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ప్రజలు అనుకుంటున్నారని ఆరోపించారు. -
మీరాకుమార్ను ఓడిస్తారా..!
కేసీఆర్‌పై వీహెచ్ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ స్పీకర్‌గా తెలంగాణ ఇచ్చిన మీరాకుమార్ను రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించాలని సీఎం కేసీఆర్ ఎలా పనిచేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ప్రశ్నించారు.గురువారం ఆయన మాట్లాడుతూ మీరాకుమార్‌కు వ్యతిరేకంగా ఓటేయాలనే కేసీఆర్ నిర్ణయం దారుణమన్నారు. ఆర్ఎస్ఎస్కు విధేయుడైన రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వంపై ఎంఐఎం వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. మియాపూర్ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేస్తామంటే హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. -
నరసింహన్‌తో ఒరిగిందేమీ లేదు
కేంద్ర హోం మంత్రికి వీహెచ్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: గవర్నర్ నరసింహన్ వల్ల గత ఏడేళ్లలో తెలుగు రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదని, ఆయన పదవీ కాలం పొడిగింపును పునఃసమీక్షించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు శనివారం లేఖ రాశారు. బాధ్యతాయుతమైన గవర్నర్ పదవిలో ఉన్న నరసింహన్ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది పోయి.. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పాల్ప డుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలకు వంతపాడుతున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. నరసింహన్ పదవీ కాలాన్ని పొడిగిస్తే ఏపీ, తెలంగాణలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఏపీలో టీడీపీ ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నా గవర్నర్ చర్యలు తీసుకోకపోగా.. పార్టీ ఫిరాయించిన వారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు విస్మరించిందని, రైతుల సమస్యలను పట్టించుకోవట్లేదని, మద్దతు ధర లేక ఆందోళన చేపట్టిన మిర్చి రైతులను గూండాలుగా చిత్రీకరించి జైల్లో పెడుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నా గవర్నర్ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆలయాలు సందర్శించడానికే గవర్నర్ సమయం కేటాయిస్తున్నారు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవ డం లేదన్నారు. కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారన్నారు. ఆయన పదవీ కాలం పొడిగింపును సమీక్షించి.. కొత్త గవర్నర్‌ను నియమించాలని కోరారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లందరినీ వెనక్కి పిలిచి.. నరసింహన్‌ను ఎందుకు కొనసాగిస్తున్నారని వీహెచ్ ప్రశ్నించారు. -
అమ్ముకున్నవారికీ ‘మద్దతు’ ఇవ్వాలి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: మిర్చి పంటను ఇప్పటికే 40శాతం దాకా రైతులు అమ్మేసుకున్నారని, వారికీ కేంద్రం అందించే ధర, బోనస్‌ను ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం కనీసం క్వింటాలు మిర్చికి రూ.10 వేలు ఇవ్వాల్సిందన్నారు. మిర్చి పంటను కొనుగోలు చేయ లేని అసమర్థత నుంచి, దృష్టి మళ్లించడానికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వం కేసులను పెట్టిందని ఆరోపించారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న గవర్నర్
ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ ఫిరా యించిన ఎమ్మెల్యే లతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించి గవర్నర్ నరసింహన్ ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఏఐసీసీ కార్య దర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని పట్టించు కోకుండా అధికారంలో ఉన్నవారికి గవర్నర్ భజన చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించినవారిని మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడం రాజ్యాం గాన్ని తూట్లు పొడవడమేనన్నారు. దీనిపై చర్యలు తీసుకోకుండా ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఓ పార్టీలో గెలిచి, మరో పార్టీకి మారడం వ్యభిచారం కంటే పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమిషన్ని కలుస్తానని వీహెచ్ తెలిపారు. -
'ఫిరాయింపు నేతలతో ప్రమాణం చేయించొద్దు'