సర్దేశాయ్పై దాడి అవమానకరం: వీహెచ్ | rajdeep sardesai attacked in US is Shame, says hanumantha rao | Sakshi
Sakshi News home page

సర్దేశాయ్పై దాడి అవమానకరం: వీహెచ్

Published Mon, Sep 29 2014 2:13 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

సర్దేశాయ్పై దాడి అవమానకరం: వీహెచ్ - Sakshi

సర్దేశాయ్పై దాడి అవమానకరం: వీహెచ్

సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్పై అమెరికాలో జరగడం అవమానకరమన్నారు వి. హనుమంతరావు.

హైదరాబాద్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. మోడీ ప్రభుత్వంలా కనిపిస్తోందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టంతా పరిశ్రమలు,  కార్పొరేట్ రంగాలపైనే ఉందని విమర్శించారు. పేదల గురించి మాటలు మాత్రమే చెబుతున్నారని, కార్యాచరణ మాత్రం కార్పొరేట్ సెక్టార్లకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. నల్లధనం వెలికితీతపై మోదీ మాట్లాడడం లేదన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్పై అమెరికాలో జరగడం అవమానకరమన్నారు. దీన్ని ప్రధాని మోదీ ఖండించకపోవడం సరికాదని వీహెచ్ అన్నారు. న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన మోదీ సభలో రాజ్దీప్ సర్దేశాయ్పై పలువురు దాడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement