rajdeep sardesai
-
‘రైట్ టు రీకాల్’ రావాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంస్కరణల్లో భాగంగా.. వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ దాకా ఎవరైనా సరే, అధికారంలో ఉన్నవారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా, ప్రజలు కోరుకున్నట్టు పనిచేయకపోయినా వారిని తొలగించే హక్కు (రైట్ టు రీకాల్) తీసుకురావాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చెప్పారు. అదేవిధంగా ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే పదేళ్లదాకా మంత్రి కాకుండా నిషేధం, ‘ప్రభుత్వ నిధి’ (స్టేట్ ఫండ్)తో ఎన్నికల నిర్వహణ వంటివి రావాలన్నారు. ఇటువంటి వాటిపై రాజకీయవేత్తలు ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. శనివారం ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’లో రాజ్‌దీప్ కొత్త పుస్తకం ‘2024: ఎలక్షన్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియా’పై చర్చాగోష్టి నిర్వహించారు. దీనికి సమన్వయకర్తగా వ్యవహరించిన హెచ్ఎల్ఎఫ్ కోర్ గ్రూపు సభ్యురాలు సునీతారెడ్డి ఈ పుస్తకంపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా సమకాలీన రాజకీయాలు, రాజ్‌దీప్ పుస్తకంలోని అంశాలు, ఇతర విషయాలను ప్రస్తావిస్తూ ప్రశ్నలు వేశారు. సంస్థాగతంగా బలంగా ఉండటం అవసరం మోదీ గత పదేళ్లలో ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేయలేదని రాజ్‌దీప్ చెప్పారు. రాజకీయ వేత్తగా రాహుల్‌గాంధీ మంచివాడే అయినా అది సరిపోదన్నారు. నేటి రాజకీయ నాయకత్వానికి రోజువారీ ‘మైక్రో మేనేజ్మెంట్’ ముఖ్యమని.. అందుకు వ్యూహాలు, సంస్థాగతంగా పార్టీ బలంగా ఉండటం అవసరమని స్పష్టం చేశారు. అధికారమనేది విషం అనే మాటను అధికారం కోరుకుంటున్న పార్టీ నేత రాహుల్‌గాంధీ పేర్కొనడం సరికాదని వ్యాఖ్యానించారు. సీట్ల సంఖ్యపై ముందే చెప్పా.. ‘2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిచాయా?’ అని సునీతారెడ్డి ప్రశ్నించగా రాజ్‌దీప్ మిశ్రమంగా స్పందించారు. ‘‘గత ఏడాది రామమందిర ప్రారంభం, మోదీ ఇమేజీని ఒక్కసారిగా పెంచేయడం, అబ్కీ బార్ చార్ సౌ(400) పార్ అంటూ బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వంటివి కొంత అయోమయానికి గురిచేశాయి. అయితే 2024 మే 12న (ఫలితాలు రావడానికి ముందు) బీజేపీ 270 సీట్ల వద్ద ఆగిపోవచ్చని నా వీడియో బ్లాగ్‌లో పేర్కొన్నాను. అది రికార్డెడ్‌గా ఉంది’’ అని రాజ్‌దీప్ చెప్పారు. ఎన్నికల కవరేజీ నిమిత్తం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న క్రమంలో.. ఓటర్లు, ముఖ్యంగా మహిళలు విభిన్నంగా స్పందించారని ఆయన తెలిపారు.నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి తదితర అంశాలను గురించి ప్రస్తావించారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ పార్టీ, బ్రిటన్‌లో రిషి సునాక్ వంటి వాళ్లు ఓటమిని చవిచూసినా.. ఇక్కడ మోదీ మాత్రం పూర్తి మెజారిటీ రాకపోయినా గెలవగలిగారని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే సామాజిక మాధ్యమాల్లో, మరీ ముఖ్యంగా వాట్సాప్‌లో ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. భారీ మార్పులు రావాలిచర్చాగోష్టిలో సభికులు అడిగిన ప్రశ్నలకు రాజ్‌దీప్ స్పందిస్తూ... ‘ఒక దేశం.. ఒక ఎన్నిక ’ వంటి సంస్కరణలను ‘వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ (సామూహిక హనన ఆయుధాలు)’గా తాను భావిస్తానని రాజ్‌దీప్ చెప్పారు. పార్లమెంట్, న్యాయస్థానాలు, మీడియా వంటి వ్యవస్థలతోపాటు ప్రజాస్వామ్య సంస్థల్లో సంస్థాగతంగా భారీ మార్పులు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యూరోక్రసీ కూడా ఓ అడ్డుగోడగా మారుతున్నందున, ఇది కూడా మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో ఓ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థి రూ.75 కోట్లు ఖర్చుచేశారని.. ఇంత భారీగా ఎన్నికల ఖర్చు వంటి విష వలయం నుంచి కూడా దేశం బయటపడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. -
కళ్లెదుటి ఫలితాలకు కారణమేంటి?
గడచిన సార్వత్రిక ఎన్నికలు అన్ని పక్షాలనూ సమంగా ఆశ్చర్యపరిచాయి. మునుపటికన్నా ఎక్కువ మెజారిటీ సీట్లు సాధిస్తామని ఆశించిన బీజేపీ కలలు కల్లలుకాగా, అందలం అందుకోవటమే ఆలస్యమన్నట్టు పొంగిపోయిన ఇండియా కూటమికి భంగపాటు తప్పలేదు. ఈ ఫలితాల ఆంతర్యమేమిటి... ఎవరెవరు ఎలా, ఎందుకు దెబ్బతిన్నారన్న అంశాలపై సీనియర్ పాత్రికేయుడు, టీవీ న్యూస్ ప్రెజెంటర్ రాజ్‌దీప్ సర్దేశాయి వెలువరించిన తాజా పుస్తకం ‘2024 ది ఎలక్షన్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియా’. ఈ అసమ సమాజంలో నిత్యం దగా పడుతున్న సగటు మనిషి మౌనంగా, ప్రశాంతంగా ఉన్నట్టు కనబడుతూనే నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా ఇచ్చిన తీర్పు ఇది అంటారు రాజ్‌దీప్. అందుకే ఈ ఎన్నికల అసలు విజేత సగటు వోటరేనని చెబుతారు.పార్లమెంటరీ రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉన్నవారికి సైతం వెగటుపుట్టించే విధంగా మన ఎన్నికల తంతు తయారైంది. ఇంతటి రణగొణ ధ్వనులమధ్య కూడా నాయకులతో చర్చించటం, సాధారణ పౌరులను కలవటం, ఎవరివైపు మొగ్గు ఉందో అంచనావేయటం వివిధ చానెళ్లు చేస్తున్న పని. దీన్ని ఎంతో నిష్ఠగా, దీక్షగా నెరవేర్చే కొద్దిమంది పాత్రికేయుల్లో రాజ్‌దీప్ సర్దేశాయ్ ఒకరు.ఉత్తేజాన్నివ్వని హ్యాట్రిక్!రాజ్‌దీప్ తాజా పుస్తకం ‘2024 ది ఎలక్షన్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియా’ 528 పేజీల సమగ్ర గ్రంథం. ఇప్పుడే కాదు... ‘2014 ది ఎలక్షన్ దట్ ఛేంజ్డ్ ఇండియా’ మొదటి పుస్తకంగా, 2019 ‘హౌ మోదీ వన్ ఇండియా’ రెండో పుస్తకంగా వచ్చాయి. తాజా పుస్తకం మూడోది. దీనికి ‘హ్యాట్రిక్ 2024’ అన్న శీర్షిక పెడదామనుకున్నారట. కానీ ఫలితాలు విశ్లేషించాక పునరాలోచనలో పడ్డారట. రచయిత దృక్ప థమేమిటో పుస్తకం శీర్షికే వెల్లడిస్తుంది. స్వతంత్ర భారతంలో నెహ్రూ తర్వాత వరసగా మూడోసారి అందలం అందుకున్నది మోదీ మాత్రమే! ఆ రకంగా ఆయనకైనా, బీజేపీకైనా ఇది ఘనవిజయం కిందే లెక్క. కానీ 272 అనే ‘మేజిక్ మార్క్’ ఎక్కడ? కనీసం దాని దరిదాపుల్లోకి కూడా రాలేక 240 దగ్గరే బీజేపీ ఆగిపోయింది. అందుకే ‘హ్యాట్రిక్’ విజయోత్సవ హోరు లేదు. 2024 ఎన్నికలు అందరినీ సమంగా ఆశ్చర్యపరిచాయి. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అని ప్రధాని నరేంద్ర మోదీ నినాదమిచ్చి తమ శ్రేణుల్ని ముందుకురికించారు.అందరం కలిశాం గనుక, ‘ఇండియా’ అన్న సంక్షిప్తీకరణ పదం దొరి కింది గనుక విజయం ఖాయమన్న భ్రమలో ప్రతిపక్ష కూటమి నాయ కులున్నారు. లాక్‌డౌన్‌తో జనం ఆర్థిక అగచాట్లు, వేలాది కిలోమీటర్ల నడక, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం, పీఎమ్ కేర్స్ ఫండ్, సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమం, సీఏఏ, విపక్ష సర్కార్ల కూల్చివేతలు, విద్వేష పూరిత ప్రసంగాలు... ఇవన్నీ ఎన్డీయే ప్రభుత్వంపై ఏవగింపు కలిగించాయని ‘ఇండియా’ కూటమి నమ్మింది. విపక్ష నేతలపై ఈడీ, ఐటీ దాడులు, అరెస్టులు విపక్ష వ్యూహాన్ని ఏదో మేర దెబ్బతీసిన మాట వాస్తవమే. కానీ ఇందుకే మెజారిటీ సాధనలో ‘ఇండియా’ విఫలమైందని చెప్పటం కష్టమంటారు రాజ్‌దీప్. బిహార్ సీఎం నితీష్‌కుమార్‌ను చేజార్చుకోవటం, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విషయంలో తప్ప టడుగుల వంటివి దెబ్బతీశాయన్నది ఆయన విశ్లేషణ. ఇలాంటివి చోటుచేసుకోనట్టయితే బీజేపీకి ఇప్పుడొచ్చిన 240 స్థానాల్లో మరో 40 వరకూ కోతపడేవని రాజ్‌దీప్ అభిప్రాయం. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎన్డీయేగా బరిలోకి దిగినా బీజేపీ సొంతంగానే మెజా రిటీ సాధించుకుంది. కేవలం మిత్ర ధర్మాన్ని పాటించి మాత్రమే భాగ స్వామ్య పక్షాలకు పదవులిచ్చింది. ఇప్పుడలా కాదు... నిలకడలేని టీడీపీ, జేడీ(యూ) వంటి పార్టీల దయాదాక్షిణ్యాలపై నెట్టుకురాక తప్పదు.ఒక్కటైన దళిత, ముస్లిం వర్గాలుగతంలో ఇతర వర్గాలతోపాటు వెన్నుదన్నుగా నిలిచిన దళిత ఓటుబ్యాంకు 2024 ఎన్నికల్లో బీజేపీకి దూరమైందని రాజ్‌దీప్ చెబు తారు. బీజేపీకి భారీ మెజారిటీ వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని ఆ వర్గాలు భయపడ్డాయి. కంచుకోట అనదగ్గ యూపీలో 2022లో ‘బుల్డోజర్ మ్యాండేట్’ వస్తే రెండేళ్లు గడిచేసరికల్లా ‘మండలైజ్డ్ కుల స్పృహ’ పెరిగి దళిత ఓటుబ్యాంకుకు అక్కడ 10 శాతం కోతపడిందని ఆయన విశ్లేషణ. వీరికి ముస్లింల ఓటు బ్యాంకు తోడైందంటారు. 2015–16 నుంచి 2022–23 మధ్య సంఘటిత రంగంలో 63 లక్షలు, అసంఘటిత రంగంలో కోటీ 60 లక్షల ఉద్యోగాలు ఆవిరయ్యాయన్న ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఐఆర్ఆర్) సంస్థ గణాంకాలను రాజ్‌దీప్ ఉటంకిస్తారు. రాజ్‌దీప్ పుస్తకం కళ్ల ముందు జరిగిన అనేక పరిణామాల వెనకున్న కారణాలేమిటో, నాయకుల అతి విశ్వాసంలోని అంతరార్థమేమిటో విప్పిజెబుతుంది. మనమంతా చూస్తున్నట్టు ఇప్పుడేలుతున్నది నిజంగా బీజేపీ యేనా? రాజ్‌దీప్ లెక్కలు చూస్తే క్షణకాలమైనా ఆ ప్రశ్న రాకమానదు. ఈసారి ఎన్నికల్లో ఏకంగా 114 మంది కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన నేతలకు బీజేపీ టిక్కెట్లు వచ్చాయట. బీజేపీ ‘కాంగ్రెస్ ముక్త భారత్’ నినాదం కాస్తా ‘కాంగ్రెస్ యుక్త బీజేపీ’ అయిందంటారాయన. అసలు జాతీయ రాజకీయాల్లో మోదీ ఆగమనానికి ముందే ఒక పార్టీగా కాంగ్రెస్ మతాన్ని పులుముకోవడం, వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం, నిలదీసిన సొంత పార్టీ నేతలపై సైతం అక్రమ కేసులు మోపి జైళ్లపాలు చేయడం వగైరాలు పెంచింది. ఆ రకంగా మోదీ రాకకు ముందే ‘మోదీయిజాన్ని’ పరిచయం చేసింది. ఆ నొప్పి ఎలా ఉంటుందో దశాబ్దకాలం నుంచి చవిచూస్తోంది.ఫలిస్తున్న ‘ప్రచారయావ’ప్రచారం విషయంలో మోదీ తీసుకునే శ్రద్ధను రాజ్‌దీప్ వివరి స్తారు. గుజరాత్లో బీజేపీ కార్యక్రమాలపై సింగిల్ కాలమ్ వార్త ఇవ్వ టానికి కూడా మీడియా సిద్ధపడని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా రాష్ట్రంలోని 182 నియోజకవర్గాల నుంచీ ప్రచార రథాలను తరలించి అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని ఆయన ప్రతి పాదించారట. ఇందువల్ల డబ్బు ఖర్చుతప్ప ఒరిగేదేమీ లేదని పార్టీ నాయకులు గుసగుసలు పోగా, ర్యాలీ జరిగిన మర్నాడు ఎప్పుడూ లేనట్టు మీడియాలో అది ప్రముఖంగా వచ్చిందట. ప్రచారం భారీ స్థాయిలో చేయటం అప్పటినుంచీ మోదీకి అలవాటు. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ వెనకా ఈ వ్యూహమే ఉంది.‘గోదీ మీడియా’ ప్రస్తావనఅమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ తదితరుల తీరుతెన్నులపై రాజ్ దీప్ వివరంగానే ప్రస్తావించారు. సద్విమర్శలను వ్యక్తిగతంగా తీసు కుని బెదిరించటంలో, అమర్యాదగా ప్రవర్తించటంలో అమిత్ మాల వీయ వంటి కొందరు బీజేపీ నేతల ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పారు. మరోపక్క మీడియా మొత్తాన్ని చాలామంది ఒకే గాటనకట్టి ‘గోదీ మీడియా’గా ముద్రేయటంపై విచారిస్తూనే కొన్ని ప్రధాన చానెళ్ల, పత్రికల తీరుపై ఈ గ్రంథంలో నిశితమైన విమర్శ వుంది. తాను ఈసారి ఎన్డీయే ఓడుతుందని భావించకపోయినా ‘మేజిక్ ఫిగర్’ దాటుతుందని గుడ్డిగా నమ్మిన వైనాన్ని వివరిస్తారు. అదే సమ యంలో ఎప్పుడూ అంచనాలు తప్పని ప్రదీప్ గుప్తా వంటి ప్రఖ్యాత సెఫాల జిస్టు సైతం ఎన్డీయేలో ఒక్క బీజేపీకే 322–340 మధ్య వస్తాయని చెప్పడాన్ని వెల్లడిస్తారు. సుదీర్ఘకాలం ఢిల్లీలో పాత్రికేయు డిగా పని చేసిన అనుభవం, ఉన్నత స్థానాల్లోని వారితో కలిగిన పరి చయాలు పుస్తక రచనలో రాజ్‌దీప్‌కు బాగా అక్కరకొచ్చాయి. ‘ఈవీఎంల గారడీ’ ఎక్కడ?అయితే ఒక విమర్శ – ఈవీఎంల వ్యవహారంపై అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఏకరువు పెట్టిన అంశాల గురించి ప్రస్తావించినా ఆ ఎపిసోడ్‌ను లోతుగా చర్చించకపోవటం లోటనే చెప్పాలి. వాస్తవానికి దానిపై విడిగా పుస్తకమే రావాలి. మొత్తం 543 నియోజకవర్గాలకుగాను 537 చోట్ల ఈవీఎంలలో పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ పొంతన లేదని ఏడీఆర్ బయటపెట్టింది. ‘ఇది కేవలం సాంకేతిక లోపమే... దీనివల్ల అంతిమ ఫలితం తారుమారు కాబోద’ని వాదించటానికి ముందు కనీసం అందుకు హేతుబద్ధమైన సంజాయిషీ ఇవ్వాల్సిన బాధ్యతని ఎన్నికల సంఘం గుర్తించక పోవటం విచారించదగ్గది. మొదలుపెడితే చివరి వరకూ చదివించే శైలితో, ఆశ్చర్యపరిచే సమాచారంతో ఈ పుస్తకం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి గ్రంథం ఇంగ్లిష్‌లో మాత్రమే సరి పోదు. ప్రాంతీయ భాషల్లో సైతం వస్తేనే ప్రజల అవగాహన పెరుగుతుంది.తెంపల్లె వేణుగోపాలరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడుvenujourno@gmail.com -
నాలుక్కర్చుకున్న ఇండియాటుడే– యాక్సిస్ మై ఇండియా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలపై వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌పై ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా నాలుక్కర్చుకుంది. యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌ను ఇండియాటుడే శనివారం ప్రసారం చేసింది. ఈ సర్వేపై దేశ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేయడంతో.. ఆదివారం ఇండియాటుడే టీవీలో చర్చ చేపట్టింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. ఐదేళ్లలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మారిపోయాయి.డీబీటీ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్ల లబ్ది పేదలకు నేరుగా చేరాయి. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల గ్రామీణ ప్రజలు..ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. వారంతా ఈ ఎన్నికల్లో జగన్‌కు అండగా నిలిచారని అంచనా వేస్తున్నాం’ అని ఇండియా టుడే కన్సలి్టంగ్ ఎడిటర్ రాజీదీప్ సర్దేశాయ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌పై ఆదివారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగిన మార్పును నేను స్వయంగా చూసాను. పాఠశాలలు, ఆస్పత్రుల్లోచాలా మార్పు కన్పించిందన్నారు. ఈ నేపథ్యంలో మీరు చేసిన సర్వే సహేతుకంగా లేదన్నది స్పష్టమవుతోందంటూ యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తాకు రాజ్‌దీప్ సర్దేశాయ్ చురకలంటించారు.స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి.. దక్షిణాది రాష్ట్రాల్లో ఐదేళ్లకు ఓ సారి ప్రభుత్వాన్ని మార్చే సాంప్రదాయం ఉండటం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి అనుకూలించిందని ప్రదీప్ గుప్తా చెప్పారు. దీనిపై యాంకర్ రాహుల్ కన్వల్ స్పందిస్తూ.. కేజ్రివాల్ అరెస్టు వల్ల ఢిల్లీ, పంజాబ్‌ల్లో.. హేమంత్ సోరేన్ అరెస్టు వల్ల జార్ఖండ్‌లో ప్రజల్లో సానుభూతి రాలేదా.. అక్కడ ఎగ్జిట్ పోల్స్‌లో అది ప్రతిబింబించలేదేం అంటూ ప్రదీప్ గుప్తాను నిలదీశారు. తమిళనాడులో జయలలిత.. తెలంగాణలో కేసీఆర్ వరుసగా రెండు సార్లు విజయం సాధించారని ఎత్తిచూపారు.వీటిని పరిశీలిస్తే.. మీ సర్వేలో శాస్త్రీయంగా లేదేమోనని అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రదీప్‌గుప్తా నీళ్లు నమిలారు. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ 2021లో పశ్చిమ్ బంగాలోనూ అంచనాలు తప్పాయి. అక్కడ బీజేపీ విజయం సాధిస్తుందని తేల్చిచెప్పగా.. టీఎంసీ ఘనవిజయం సాధించింది. ఇక గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. కానీ.. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. -
CM YS Jagan Interview: అదే నా కల.. ఎప్పటికీ జనం గుండెల్లో బతికి ఉండాలి
‘అణగారిన, వెనుకబడిన వర్గాల ప్రజలు, అగ్రవర్ణ పేదల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడని గట్టిగా నమ్ముతున్నా.ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. నేను మరణించినా, ప్రజలగుండెల్లో బతికి ఉండాలన్నదే నా కల’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలనేపథ్యంలో సీఎం వైఎస్ జగన్‌ను ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూ చేసింది.రాజ్‌దీప్: మీరు మళ్లీ గెలిస్తే విశాఖపట్నన్నిరాజధానిని చేసే విషయంలో మీరు కచ్చితమైన స్పష్టతతో ఉన్నారా? సీఎం జగన్: అమరావతి గురించి మాట్లాడే వారు రూ. లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారో చెప్పగలరా.. కనీసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేదు. ఒక వేళ అమరావతి కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయడం మొదలు పెడితే పది పదిహేనేళ్లు పడుతుంది. అప్పటికి ఈ లక్ష కోట్లు పది లక్షల కోట్లు అవుతుంది. రాజధాని అనేది కలగానే మిగులుతుంది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లో నంబర్ వన్ నగరం. విశాఖలో ఇప్పటికే రహదారులు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు ఉంది. మౌలిక సదుపాయాలన్నీ అక్కడ ఉన్నాయి. కేవలం రూ.5 వేల కోట్లు నుంచి రూ.10 వేల కోట్లు వెచ్చిస్తే రాబోయే 5–10 సంవత్సరాలలో హైదరాబాద్, బెంగళూరు లేదా చెన్నైతో వైజాగ్ పోటీ పడడాన్ని మీరు నిజంగా చూస్తారు.రాజ్‌దీప్: మీరు 2019 ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసి చంద్రబాబును చాలెంజ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మీకు చాలెంజ్ చేస్తున్నారు. మీరు అధికారంలో ఉండి ఎన్నికలకు వెళ్లడం గతంతో పోలిస్తే ఇది కఠినంగా అనిపిస్తోందా? సీఎం జగన్: సాధారణ పరిస్థితుల్లో అనిపించొచ్చు. కానీ, ఇక్కడ వాస్తవం ఏమంటే.. మేము ప్రజలకు సుపరిపాలన అందించాం. మా మేనిఫెస్టోలోని 99 శాతం వాగ్దానాలను త్రికరణ శుద్ధిగా అమలు చేసి చూపించాం. అర్హతే ప్రామాణికంగా, ఎలాంటి వివక్ష లేకుండా.. అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబి్ధదారుల ఖాతాల్లో జమ చేశాం. రాజ్‌దీప్: మీరు చాలా డబ్బు ప్రజలకు చేరిందని చెబుతున్నారు.. ఇలా నగదు బదిలీ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని కొంత మంది ఆరోపిస్తున్నారు.. ఏపీలో నేరుగా రైతులకు డబ్బులు ఇస్తున్నారు. ఇలా క్యాష్ ట్రాన్స్ఫర్ కాకుండా.. ఉత్పాదక ఉపాధి కోరుకుంటున్న వాళ్లకి ఏం చెబుతారు? సీఎం జగన్: ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజ్‌దీప్.. కొందరిలో ఆ కన్ఫ్యూజన్ ఉంది. మేం చాలా సమగ్రమైన విధానాలను అనుసరించాం. రైతుల గురించే తీసుకుంటే.. ఏ విధంగా వ్యవసాయానికి భరోసా ఇచ్చామో తెలుస్తుంది. రాష్ట్రంలో 50 శాతం మంది అర్ధ హెక్టార్, 70 శాతం మంది ఒక హెక్టార్‌లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులున్నారు. ఇలాంటి వారందిరి కోసమే రైతు భరోసా ప్రవేశపెట్టాం. ఏటా రూ.13,500 పెట్టుబడి సాయంగా ఇస్తున్నాం. మేము ఐదేళ్లలో రూ.50 వేలు ఇస్తామని చెప్పి.. రూ.67,500 ఇచ్చాం. ఇది రైతులకు 80 శాతం సాగు ఖర్చులుగా ఉపయోగ పడుతుంది. దీనికి తోడు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) తీసుకొచ్చాం. గ్రామ సచివాలయాన్ని పెట్టాం. 60–70 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున సేవలు అందిస్తున్నారు. ప్రతి పథకం అవినీతి, వివక్ష లేకుండా క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుడి దగ్గరకు నేరుగా చేరుతోంది. సమస్త ప్రభుత్వ సేవలన్నీ పేదల ఇంటి ముంగిటనే నిలిచాయి. రాజ్‌దీప్: సంక్షేమ పథకాలతో రాష్ట్రం దివాలా తీస్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అందుకే కేంద్రం సాయం కోసం ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపించాయి కదా? సీఎం జగన్: రాజ్‌దీప్.. మనం డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తున్నామో చూడాలి. ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. పథకానికి ఏ పేరు పెట్టినా ఆ డబ్బు ఎవరికి వెళ్లి.. ఎంత మేలు చేసిందో చూసుకోవాలి. దీన్ని సామాజిక పెట్టుబడిగా చూడాలి. రాజ్‌దీప్: రాష్ట్రంపై రూ.4.42 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ డబ్బుల కోసమే మీరు కేంద్రంపై ఆధారపడ్డారా? సీఎం జగన్: ఇదంతా ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకే ఏ రాష్ట్రమైనా అప్పులు చేస్తుంది. ఆ పరిమితులను దాటి ఏ రాష్ట్రం కూడా అప్పు చేయలేదు. రాజ్‌దీప్: నేరుగా డీబీటీతో ఆర్థిక భరోసా కల్పించడం ద్వారానే మీరు తిరిగి మరోసారి అధికారంలోకి వస్తారని నమ్ముతున్నారా? ఇదే మీ విన్నింగ్ కార్డు అనుకోవచ్చా? సీఎం జగన్: ఇక్కడ సరిగా అర్థం చేసుకోవాలి. డబ్బు ఎక్కడికి.. ఎలా.. వెళ్లిందో చూడాలి. మేము ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇంగ్లిష్ మీడియంలోకి తీసుకొచ్చాం. ద్విభాషా పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించాం. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో ఐఎఫ్‌పీ ప్యానల్స్‌ను పెట్టి డిజిటల్ బోధన అందిస్తున్నాం. ప్రతి ఎనిమిదో తరగతి విద్యార్థి చేతిలో బైజ్యూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు పెట్టాం. ఇది సిలబస్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా చూస్తే విద్యా వ్యవస్థలో చాలా మార్పులు కనిపిస్తాయి. టోఫెల్ శిక్షణ కోసం ప్రత్యేక పీరియడ్ తీసుకొచ్చాం. ఇదంతా ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థుల కోసం జరుగుతోంది. 2025 విద్యా సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ విద్యార్థి ఐబీ సిలబస్‌లో చదువుకుంటాడు. 2035 నాటికి మా పిల్లలు ఐబీ బోర్డు పరీక్షలు రాస్తారు. ప్రతి ఏటా ఒక్కో తరగతికి ఐబీని అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాం. సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చే ప్రతి రూపాయి పేదవాడి భవితను మారుస్తోందనడానికి ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.రాజ్‌దీప్: 81 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను మీరు మార్చారు. వైఎస్సార్సీపీలో వన్ మ్యాన్ షో జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వైఎస్ జగన్ అనే పేరు చెప్పి ఈ రోజున ఓట్లు అడుగుతున్నారు. ప్రాంతీయ పారీ్టలో ఇది హైరిస్క్ ఫార్ములా కాదంటారా? సీఎం జగన్: ప్రతి రాజకీయ పార్టీకి ఒక సొంత సర్వే ఉంటుంది. ఆ సర్వేల ప్రకారం ఈ రోజున మా ప్రభుత్వం మీద, సీఎంగా నా మీద ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు. ఇది రియాలిటీ. అందుకే నేను చాలా నమ్మకంగా ఉన్నాను. రాజ్‌దీప్: అందుకేనా జగన్ పేరిటే ఓట్లు అడుగుతున్నారు? సీఎం జగన్: అవును. నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలకు ఒకటే చెబుతున్నా. ప్రస్తుతం జరుగుతున్నవి ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు కాదు. మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని వివరిస్తున్నా. ‘మీ భవిష్యత్ జగన్‌తో ఉంటే భద్రంగా ఉంటుంది. జగన్ ద్వారానే మీ భవిష్యత్ మంచి మలుపు తిరుగుతుంది’ అంటేనే వైఎస్సార్సీపీకి ఓటేయమని అడుగుతున్నా. అంతేకాదు.. గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినట్లయితేనే, మంచి పరిపాలన అందించారని భావిస్తేనే ఓటేయాలని అడుగుతున్న ఏకైక పార్టీ కూడా వైఎస్సార్సీపీ. రాజ్‌దీప్: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మీ సొంత చెల్లి షర్మిల ఇలా అందరూ అటు వైపు ఉంటే మీరొక్కరే ఇటువైపు ఉన్నారు. వాళ్లందరూ ఒక్కటిగా వస్తున్నారు. ఇది మీకు ఇబ్బందికరంగా లేదా? సీఎం జగన్: గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన నేను అందించాను. మంచి చేశాను కాబట్టే నేను ధైర్యంగా ఒంటరిగా ప్రజల్లోకి వెళుతున్నాను. ప్రజలకు కూడా నాపై నమ్మకం ఉంది. నన్ను ఒంటరిగా ఎదుర్కోడానికి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. అందుకే గుంపులుగా వస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 50 శాతం పైగా ఓట్లు ఎవరికి వస్తే వాళ్లు విజయం సాధిస్తారు.రాజ్‌దీప్: అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా చేసేందుకు చాలా కష్టపడ్డానని, ఎంతో ఖర్చు చేశానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ మీరు మూడు రాజధానులు మా విధానం అంటున్నారు. రాజధాని అంశం సుప్రీంకోర్టులో స్ట్రక్ అయ్యింది. శాశ్వత రాజధాని లేకుండా పరిపాలన ఎలా? రైతుల నుంచి భూములు తీసుకుంటే ప్రస్తుత సీఎం వాటిని వెనక్కు ఇచ్చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. సీఎం జగన్: అమరావతి ఎక్కడుంది.. అమరావతి అంటే ఏమిటనేది ముందుగా మనం ఆలోచించాలి. అమరావతి.. గుంటూరు, విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. 50 వేల ఎకరాల భూ సమీకరణ జరిగింది.‡ అదంతా మూడు పంటలు పండే భూమి. అమరావతి రాజధాని అనేది ఒక కుంభకోణం. తన సన్నిహితులు ముందే భూములు కొనుగోలు చేసేశాక అప్పుడు చంద్రబాబు అక్కడ రాజధానిని డిక్లేర్ చేశారు. రహదారులు, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికే వారి సొంత నివేదిక ప్రకారమే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుంది. అంటే మొత్తంగా రూ. లక్ష కోట్లు కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత డబ్బును రాష్ట్రం ఎక్కడి నుంచి తెస్తుంది? రాజ్‌దీప్: జగన్‌పై రాయితో దాడి చేయడం అనేది పూర్తిగా ఓ డ్రామా అని, అదంతా సింపతీ కోసం జగనే క్రియేట్ చేసుకున్నాడని చంద్రబాబు అంటున్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి, జైలుకు పంపారని, జగన్ ఆంధ్రాలో డిక్టేటర్‌గా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.. సీఎం జగన్: ఎవరి ద్వారా ఈ రాయి వచ్చింది? వాళ్ల మనుషుల ద్వారానే వచ్చింది. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ చంద్రబాబు నిలబడి, అదే వేగంతో అదే రాయితో కొట్టించుకుని, మూడు కుట్లు వేయించుకోమనండి. ఆయనకూ సింపతీ వస్తుంది.రాజ్‌దీప్: పాత కేసుల్లో సీఐడీని వాడి చంద్రబాబును జైలుకు పంపారని, జగన్ శత్రువులను, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లను ఈ విధంగా వేధిస్తారనే వాదన ఉంది. సీఎం జగన్: ఎవరు తప్పు.. ఎవరు ఒప్పు అనేది న్యాయస్థానం పెట్టే పరీక్షలో తేలుతుంది. చంద్రబాబుని 52 రోజులు జైలుకు పంపడం సరైనదేనని కోర్టులు భావించాయి. అంటే అతను ఏదో చేశాడనే కదా అర్థం. బెయిల్ అనేది ప్రతి ఒక్కరి హక్కు. అది ఏదో సమయంలో వస్తుంది. నిజం ఏంటంటే ఆ కుంభకోణం జరిగిందనడానికి సరిపడా ఆధారాలు ఉన్నాయి.రాజ్‌దీప్: ఎన్నికల అనంతరం కేంద్రంతోనూ, ప్రధానితోనూ మీ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? అభివృద్ధి కోసమే తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని చంద్రబాబు అంటున్నారు. సీఎం జగన్: ప్రస్తుతం చంద్రబాబు, మోదీ పొత్తులో ఉన్నారు. వారు పొత్తు పెట్టుకుంటే అభివృద్ధి కోసమా.. అదే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉంటే అది ఇంకోదానికోసమా?రాజ్‌దీప్: సర్వశక్తులు ఒడ్డుతున్న వారితో పోరాటంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నదేమిటి? సీఎం జగన్: అణగారిన వర్గాలు, నిరుపేదల జీవితాలను మార్చే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడని నేను గట్టిగా నమ్ముతాను. దాని కోసం దేవుని దయ వల్ల నేను ఏం చేయగలనో అది చేస్తున్నాను. నాకు కావాల్సింది.. నా కల ఒక్కటే. నేను మరణించినా ప్రజల గుండెల్లో బతికుండాలి. రాజ్‌దీప్: ఇంగ్లిష్ మీడియం విద్య, ఐబీ, ఇలాంటి విప్లవాత్మక మార్పులన్నీ గ్రామ స్థాయిలో సాధ్యం అవుతాయా? క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయని అందరూ అంటున్నారు.. సీఎం జగన్: ఎవరు అంటున్నారు? ఈ రోజు మీరు ఒక గ్రామానికి వెళ్లండి. మార్పు మీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఈ సచివాలయం ద్వారా ప్రజలకు గ్రామ స్థాయిలోనే 600 రకాల ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. 60, 70 ఇళ్లకు ఒక వలంటీర్ ఉంటున్నారు. వీళ్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి గ్రామస్తుడి చేయి పట్టి ముందుకు నడిపే కార్యక్రమం చేస్తున్నారు. అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తే వైఎస్సార్ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు ముందుకు వెళితే ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ బడి ఉంటుంది. ఇంకొంచెం ముందుకు పోతే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది. ఇవన్నీ గ్రామ స్థాయిలో అభివృద్ధికి తార్కాణాలు. గతంలో ఇవన్నీ ఎక్కడా మనకు కనిపించేవి కాదు. ప్రభుత్వం లేదా ఒక పెద్ద పరిశ్రమ ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి కల్పన సాధ్యపడదు. ఎకానమీని డ్రైవ్ చేసే ఎంఎస్ఎంఈలు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్లను మేం ప్రోత్సహించాం. ఈ రోజున 62 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అదే విధంగా స్వయం సహాయక బృందాల్లోని మహిళలు, మత్స్యకారులు, స్ట్రీట్ వెండర్స్, బార్బర్స్, టైలర్లు, ఆటో డ్రైవర్లు వీళ్లంతా రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తారు. ఈ క్రమంలో వీరందరికీ బ్యాంక్‌లు, వివిధ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూతగా నిలిచాం. రాజ్‌దీప్: మీరేమో అవినీతి లేదంటున్నారు? ప్రతిపక్ష నేత చంద్రబాబు భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు.. సీఎం జగన్: చంద్రబాబు నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయి అలా మాట్లాడుతున్నారు. మీరే నేరుగా ప్రజల దగ్గర మైక్ పెట్టి అడగండి. మేము చెప్పిన హామీలు, పథకాలతో ఎంత ఆరి్థక మేలు జరిగిందో చెబుతారు. పైస్థాయిలో నేను చెప్పిన ప్రతి రూపాయి కింది స్థాయిలోని లబి్ధదారులకు నేరుగా చేరింది. సంక్షేమ పథకాలకు సంబంధించి డీబీటీ ద్వారా కోట్ల రూపాయలు లబి్ధదారుల ఖాతాల్లో పడుతుంటే అవినీతి, వివక్ష ఎక్కడ ఉంటుంది? రాజ్‌దీప్ : ఈ ఎన్నికల్లో మీ సోదరి మీకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇది ప్రతిష్టకు భంగంగా భావిస్తున్నారా? సీఎం జగన్: ఆమె డిపాజిట్ కోల్పోతుండటం నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఏ పార్టీ అయితే నా తండ్రి పేరును సీబీఐ చార్జ్ షీట్లో చేర్చిందో.. ఏ పార్టీ అయితే కలి్పత కేసులను నాపై పెట్టిందో అందరికీ తెలుసు. అవి కాంగ్రెస్, టీడీపీలు. ఈ రోజు నా సోదరిని ఎవరు నడిపిస్తున్నారో తెలుసా.. రేవంత్ ద్వారా చంద్రబాబు నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రిమోట్ చంద్రబాబు చేతిలో ఉంది. బీజేపీ రిమోట్ చంద్రబాబు చేతిలో ఉంది. ఈ రోజు జగన్ ఫైట్ చేస్తోంది కేవలం ఒక్క బీజేపీతోనే కాదు. కాంగ్రెస్‌తో కూడా.రాజ్‌దీప్: కేంద్రంలో అధికారం కోసంమోదీకి సీట్లు తగ్గితే మీరు 20 ఎంపీ సీట్లతో సపోర్ట్ చేస్తారా? సీఎం జగన్: ఊహాజనిత పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడటం.. ఇప్పుడు వారు నేను ఒకరికొకరం వ్యతిరేకంగా పోరాడుతున్నాం. -
సీఎం జగన్, చంద్రబాబు మధ్య తేడా ఇదే
ఏపీ ముఖ్యమంంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్‌లో ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను గమనించారా? ఎంత అందంగా సాగింది! అందం అన్న పదం ఎందుకు వాడవలసి వచ్చిందంటే రాజ్ దీప్ ఆంగ్లంలో అడిగిన అన్ని ప్రశ్నలకు అందమైన ఆంగ్ల భాషలో చిరునవ్వుతో జగన్మోహన్రెడ్డి సమాధానం చెప్పడం విని సంతోషం అనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్న ఒక నాయకుడు దేశ, విదేశాలలో తనకు ఉన్న ఆంగ్ల పరిజ్ఞానంతో ఎదుటివారిని మెప్పించడం అంటే తేలికైన విషయం కాదు. అందులోను ప్రముఖ పాత్రికేయులతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా తప్పులు దొర్లకుండా ఉండాలి. వినడానికి కూడా హాయిగా ఉంటుంది. అలా అని తెలుగును విస్మరించాలని ఎవరూ చెప్పడం లేదు. తెలుగు నేర్చుకుంటూనే ఆంగ్లం, హిందీ వంటి భాషలు అభ్యసిస్తే దేశంలోకాని, విదేశాలలోకాని ఎక్కడైనా సులువుగా ఉపాది అవకాశాలు పొందవచ్చు. జీవితం సాఫీగా సాగిపోతుంది. జగన్మోహన్రెడ్డి ఆంగ్ల మీడియంలో చదువుకోబట్టి దాని విలువను గుర్తుంచుకుని ఏపీలోని స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు తేవడానికి యత్నిస్తున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చీరాని ఆంగ్లంలో మాట్లాడుతుంటే వినడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇంగ్లీష్ రాకపోవడం తప్పుకాదు. కాని భాష రాకపోయినా తాను పండితుడినే అనుకుని మాట్లాడితే ఎదుటి వారికి ఇబ్బందిగా ఉంటుంది. పైకి ఏమీ అనకపోయినా, ఎదురుగా మాట్లాడకపోయినా, ఆ తర్వాత నవ్వుకుంటారు. దానివల్ల ఆయన నాయకత్వం వహించే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చిన్నతనంగా ఉంటుంది. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్, లండన్ పర్యటనల సందర్భంగా ఆంగ్ల భాష పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారన్నది అర్ధం అవుతుంది. ఒక విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ విషయం మరింత స్పష్టంగా తెలిసిపోయింది. దాంతో సంబంధిత వీడియో వైరల్‌గా మారింది. బయటనుంచి వచ్చే ప్రముఖులకు తెలుగు రాదు. అందువల్ల వారు ఆంగ్లంలోనే మాట్లాడుతుంటారు. దానిని మనం అర్ధం చేసుకుని సమాధానం ఇవ్వకపోతే సంభాషణ గందరగోళంగా మారుతుంది. అలాగే ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తమకు వచ్చిన భాషలోనే మాట్లాడి అనువదించుకోవాలని చెప్పాలి. జగన్మోహన్రెడ్డికి ఆ ఇబ్బంది లేదు. ఆంగ్లంపై మంచి పట్టు ఉండడంతో రాజ్ దీప్ సర్దేశాయి ఆంగ్లంలో అడిగిన ప్రశ్నలకు ఎక్కడా తడుముకోకుండా స్పష్టమైన జవాబులు ఇచ్చారు. గతంలో చంద్రబాబు ఇదే రాజ్ దీప్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ గుర్తుకు తెచ్చుకోండి. అప్పట్లో ప్రధాని మోదీని ఆయన తీవ్రంగా విమర్శించేవారు. ఆ సందర్భంలో చంద్రబాబు ఏమి చెబుతున్నది అర్ధం చేసుకోవడానికి రాజ్ దీప్ కష్టపడవలసి వచ్చింది. మోడీని ఫలానా విధంగా విమర్శిస్తున్నారా? అని రాజ్ దీప్ మళ్లీ అడిగి తెలుసుకోవలసి వచ్చింది. తిరుపతిలో జగన్మోహన్రెడ్డి చక్కగా మాట్లాడారు. అందుకే ఎడ్యుకేషన్ సమ్మిట్ అంత నీట్‌గా జరిగింది. అంతేకాక రాజ్ దీప్తో పాటు ఇండియా టుడె ప్రతినిధి బృందం స్వయంగా తిరుపతిలో నాడు-నేడు కింద ఆధునీకరించిన కొన్ని స్కూళ్లను చూసి వచ్చారు. స్కూళ్లు మారిన తీరును గమనించి వారు ఆశ్చర్యపోయారు. స్కూళ్లలో డిజిటల్ తరగతులు, మంచి మౌలిక వసతులు, స్టార్ హోటల్ స్థాయి టాయిలెట్లు, ఆంగ్ల మీడియం, సీబీఎస్ఈ సిలబస్, టోఫెల్‌కు చిన్నతనం నుంచే ట్రైనింగ్ వంటి విశేషాలు తెలుసుకుని ప్రభుత్వ స్కూళ్లలో ఇన్ని మార్పులు చేయడం ఎక్కడా చూడలేదని స్పష్టంగా చెప్పారు. ఇదే విధానం కొనసాగితే విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్ అవుతుందని చెప్పారు. జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు స్కూల్ డ్రెస్‌ల మొదలు, వారు తినే గోరుముద్ద వరకు ఎంత శ్రద్ద తీసుకుంటున్నది వివరించారు. పిల్లలకు చదువే సంపద అని తన ప్రభుత్వం నమ్ముతోందని, అందుకే ఈ విదమైన మార్పులు తీసుకువస్తున్నామని ఆయన వివరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటివారు తెలుగు మీడియంకు మద్దతుగా మాట్లాడుతున్నారు కదా అని రాజ్ దీప్ అడిగినప్పుడు జగన్మోహన్రెడ్డి చాలా స్పష్టంగా ఇంగ్లీష్ మీడియం వద్దనేవారు తమ పిల్లలు, తమ మనుమళ్లు ఎక్కడ ఏ మీడియంలో చదువుతున్నారో ప్రశ్నించుకోవాలని జవాబు ఇచ్చారు. ఏపీలో పుస్తకాలన్నిటిని రెండు భాషలలోను ముద్రించిన సంగతిని ఆయన వివరించారు. నిజంగానే వెంకయ్య నాయుడు కాని, చంద్రబాబు నాయుడు కాని, పవన్ కళ్యాణ్ కాని, రామోజీరావు కాని.. వీరెవ్వరూ తమ పిల్లలను, మనుమళ్లను తెలుగు మీడియంలో చదివించడం లేదు. కాని పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఆంగ్ల మీడియానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటారు. దీనిపై బహుశా దేశంలో ఎక్కడా జరగనంత చర్చ ఏపీలో జరిగింది. ఏపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా జగన్మోహన్రెడ్డి వివరించారు. ఇంత మార్పు జరుగుతుంటే సరైన ప్రచారం ఎందుకు చేసుకోలేకపోతున్నారని రాజ్ దీప్ ప్రశ్నించడం విశేషం. ఇంతకాలం కేరళ రాష్ట్రం విద్యారంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. ఏపీలో క్రమేపి ఆ స్థానానికి చేరుకుంటోంది. ఈ మద్య తెలంగాణకు చెందిన ప్రముఖ మేధావి ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఒక సెమినార్లో మాట్లాడుతూ ఏపీలో స్కూళ్లలో తీసుకువచ్చిన విశేషమైన సంస్కరణలు, ఆంగ్ల మీడియంలో బోధన వంటివాటి గురించి ప్రస్తావించి వీటిని కొనసాగించాల్సిన అవసరం ఎంతగానో ఉందని అన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన అభినందిస్తూ ఒకవేళ అవి కొనసాగకపోతే ఏపీ వందేళ్లు వెనక్కి పోతుందని హెచ్చరించారు. విద్యార్ధులంతా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన పరోక్షంగా చెప్పారు. తాను ఇంతవరకు జగన్‌మోహన్‌రెడ్డిను కలవలేదని, కలవబోవడం లేదని, అయినా అక్కడ విద్యారంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను గమనించి ఇలా వ్యాఖ్యానిస్తున్నానని కంచ ఐలయ్య అన్నారు. చంద్రబాబు కొడుకు, కోడలు, మనుమడు అంతా ఇంగ్లీష్‌లో చదవాలి కాని, దళిత, కమ్మరి, కుమ్మరి, కురుమ, మంగళి తదితర బీసీ వర్గాలు మాత్రం ఆంగ్లమాద్యమంలో చదువుకోరాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అంబేద్కర్ తప్పనిసరిగా ఆంగ్ల బోధన ఉండాలని కోరుకున్నారని కూడా ఐలయ్య చెప్పారు. నాలుగున్నరేళ్లుగా జగన్మోహన్రెడ్డి ఏపీలో చేస్తున్న కృషికి ఇప్పుడిప్పుడే గుర్తింపు రావడం ఆరంభం అయింది. గత ఏడాది ఏపీ పిల్లలు అమెరికాకు వెళ్లడం, ఐక్యరాజ్యసమితిలో మాట్లాడడం వంటివి చేయడంతో రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడించింది. ఈ నేపధ్యంలో ఈ సమ్మిట్ జరగడం, ఏపీలో విద్యారంగంలో సాగుతున్న సమూల మార్పులకు మంచి ప్రాధాన్యం రావడం శుభపరిణామం అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
అంతరాలపై 'విద్యా యుద్ధం' : సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘పేదరిక నిర్మూలన నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమని నేను నమ్ముతాను. అది ప్రతి ఒక్కరి హక్కు కావాలి. పేద పిల్లలు తెలుగు మీడియంకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. సంపన్నులకు అందే నాణ్యమైన చదువులు పేద పిల్లలకూ అందాలన్నదే మా లక్ష్యం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తిరుపతిలో జరుగుతున్న ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమంలో బుధవారం సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన ఓ ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పారు. పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి వారి గురించి ఎవరూ పట్టించుకోరని, ఇది దురదృష్టకరమని అన్నారు. అయితే పిల్లలు మంచి విద్యావంతులైతేనే, వారికి నాణ్యతతో కూడిన విద్యను అందిస్తేనే.. సమాజంలో దారిద్య్రం పోతుందని నొక్కి చెప్పారు. పది మంది నిరుపేద విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమెరికాకు పంపించడమే కాకుండా వైట్‌హౌస్‌కు కూడా తీసుకెళ్లడం గొప్ప విషయమని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న విద్యా సంస్కరణలు, పథకాలు చాలా ఆకర్షిస్తున్నాయని ఈ సందర్భంగా రాజ్‌దీప్ అభినందించారు. రాజ్‌దీప్, సీఎం వైఎస్ జగన్ మధ్య జరిగిన సంభాషణ వివరాలు ఇలా ఉన్నాయి. రాజ్‌దీప్: నిజంగా ఇంగ్లిష్ మీడియం, తెలుగు మీడియం మధ్య ఉన్న గ్యాప్‌ను అంత సులభంగా మార్చగలరా? దానివల్ల పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాదా? సీఎం జగన్: గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను ఏకపక్షంగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడం లేదు. ప్రతి ఒక్కటీ ఒక పద్ధతి ప్రకారం, శాస్త్రీయ విధానంలో సాగుతోంది. ఒక సమగ్ర విధానంలో కొనసాగుతోంది. ప్రతి పుస్తకాన్ని బైలింగ్యువల్.. అంటే ఒక పేజీ ఇంగ్లిష్, పక్క పేజీ తెలుగులో ముద్రిస్తున్నాం. ఇంకా బైజూస్ కంటెంట్‌ను కూడా తీసుకొచ్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో అనూహ్య మార్పులు చేస్తున్నాం. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఆరో తరగతి నుంచి, ఆపై తరగతుల్లోని ప్రతి క్లాస్‌రూమ్‌లో ఐఎఫ్‌పీ (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్) ఏర్పాటు చేస్తున్నాం. ఆ మేరకు 62 వేల తరగతులు ఉండగా, ఇప్పటికే 40 వేల తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేశాం. మిగిలిన తరగతి గదుల్లో వచ్చే నెల చివరి నాటికి ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేసే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఆ విధంగా ఒక ప్రణాళికా బద్దంగా పాఠశాల విద్యా రంగంలో వినూత్న మార్పుల దిశలో పని చేస్తున్నాం. బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం పెంపు, బైజూస్ కంటెంట్, తరగతి గదుల్లో ఐఎఫ్‌పీల ఏర్పాటు.. ఇలా వీటన్నింటి వల్ల ప్రాథమిక విద్యా రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నే కాకుండా.. పిల్లలు 8వ తరగతిలోకి వచ్చే సరికి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు ఇస్తున్నాం. రాజ్‌దీప్ సర్దేశాయ్ : విద్యా రంగంలో ఇంత మంచి చేస్తున్నా, ప్రచారానికి ఎందుకు దూరంగా ఉంటారు? సీఎం జగన్ : ఇండియా టుడే జర్నలిస్టులు ఇక్కడి స్కూల్స్ సందర్శించి, అభివృద్ధి పనులు స్వయంగా చూడడం ఎంతో ఆనందంగా ఉంది. అందుకు మీకు అభినందనలు. ఇక్కడ మేము ఏయే పనులు చేశామనేది చెప్పుకోవడం కాకుండా, మీరు స్వయంగా చూడడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. రాజ్‌దీప్ : సాధారణంగా అన్ని ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలపై ఎక్కువగా వ్యయం చేయవనే విమర్శలు వినిపిస్తుంటాయి. అందుకు భిన్నంగా మీరు ఈ రెండు రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, వాటిని అభివృద్ధి చేసి చూపించాలనుకుంటున్నారా? సీఎం జగన్ : పేదరిక నిర్మూలనకు నాణ్యతతో కూడిన విద్య అనేది కీలకమని నేను గట్టిగా నమ్ముతాను. విద్యా హక్కు అనేది ఇంకా నినాదంగా మిగలకూడదు. నాణ్యతతో కూడిన విద్య అనేది హక్కుగా మారాలి. నిరుపేదలు ఒక చదువుకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు వేరే చదువులు చదువుతున్నారు. నిరుపేద పిల్లలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవడం, అది కూడా కేవలం తెలుగు మీడియంలోనే చదవడం.. మరోవైపు ధనికులైన పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో చదవడం సరికాదు. నిరుపేదలు, ధనికుల మధ్య కొనసాగుతున్న ఈ వ్యత్యాసం, తేడా తొలగాలి. ధనికుల మాదిరిగా నిరుపేద పిల్లలు కూడా చదవాలి. వారికి ఆ విధంగా విద్యను అందించాలి. ఆ ఆలోచన నుంచి వచ్చినవే ఈ మార్పులు. మా ప్రభుత్వం ఆ దిశలోనే పని చేస్తోంది. నిరుపేద పిల్లలకు కూడా అత్యుత్తమ నాణ్యతతో కూడిన విద్య, ఇంగ్లిష్ మీడియంలో బోధన కొనసాగాలి. రాజ్‌దీప్: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన, మూడో తరగతి నుంచే గ్లోబల్ విద్య, టోఫెల్లో శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి నేత కూడా దీనిపై విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్: ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తున్నారని విమర్శలు చేస్తున్న వారందరినీ నేను ఒక్కటే అడుగుతున్నాను. వారి పిల్లలు, వారి మనవళ్లు, మనవరాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు? వారిని తెలుగు మీడియం స్కూళ్లకే పంపిస్తున్నారా? అదే నా సూటి ప్రశ్న. ఇంగ్లిష్ మీడియం వైపు నా చొరవను ప్రశ్నించే ముందు.. ముందుగా నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. రాజ్‌దీప్ : 8వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి మీరు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు ఇచ్చారు. ఇకపై కూడా ఇది కొనసాగుతుందా? సీఎం జగన్: రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9 తరగతి పిల్లలందరి వద్ద ట్యాబ్‌లు ఉన్నాయి. ఇప్పటికే రెండుసార్లు ఇచ్చాం. నా పుట్టిన రోజు సందర్భంగా నేను స్వయంగా స్కూళ్లకు వెళ్లి, పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాను. అది నాకెంతో ఇష్టం, సంతోషం కలిగిస్తోంది. ఇది ప్రతి ఏటా కొనసాగుతుంది. రాజ్‌దీప్: ప్రభుత్వ యంత్రాంగంలో ఏదీ అంత త్వరగా మారదు, ఇది అందరికీ తెలుసు. కానీ కేవలం పెద్ద నగరాల్లోనే ప్రతిష్టాత్మక స్కూళ్లలో ఉన్న ‘ఇంటర్నేషనల్ బాకలారియెట్’ (ఐబీ) సిలబస్‌ను మీరు తీసుకువస్తున్నారు. దీని ప్రభావం ఎంత వరకు ఉంటుంది? సీఎం జగన్: రాష్ట్రంలో ఐబీ సిలబస్‌కు సంబంధించి ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్)తో ఈ నెల 31న ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. తొలి ఏడాది.. అంటే 2024–25 విద్యా సంవత్సరంలో కేవలం టీచర్ల సామర్థ్యం పెంపుపైనే పనిచేస్తాం. తర్వాత 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రతి ఏడాది.. ఫస్ట్ క్లాస్‌తో మొదలు ఒక్కో తరగతికి ఐబీ సిలబస్ అమలు చేస్తాం. ఆ విధంగా 10 ఏళ్లలో.. అంటే 2035లో ఇక్కడి ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు, పదో తరగతిని ఐబీ సిలబస్‌తో పూర్తి చేస్తారు. ఆ సిలబస్‌తోనే పరీక్ష రాస్తారు. వారికి ఐబీ సర్టిఫికెట్ కూడా వస్తుంది. దీనివల్ల వారు ప్రపంచంలో పోటీని సమర్థవంతంగా ఎదుర్కోగలరు. నాణ్యతతో (క్వాలిటీ) కూడిన విద్య లేకపోతే మన పిల్లలు పోటీ ప్రపంచంలో నిలబడలేరు. వారు జీవితంలో ఎదగలేరు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటేనే వారు ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంతో పోటీ పడగలరు. అయితే ఈ అవకాశం కేవలం ధనికుల పిల్లలు.. ప్రైవేటు స్కూళ్లలో చదువుకున్న వారికే కాకుండా, నిరుపేద పిల్లలకు కూడా ఉండాలన్న ధృఢ సంకల్పంతో ప్రభుత్వం ఇవన్నీ చేస్తోంది. రాజ్‌దీప్: మీరు ఆశిస్తున్నట్లు ఆ పిల్లలను ఆ స్థాయిలో తీర్చి దిద్దేలా టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం ఉందా? సీఎం జగన్: ఐబీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో కలిసి పని చేస్తున్నాయి. వారు మాతో కలిసి పనిచేసేలా ఐబీ డైరెక్టర్ జనరల్‌తో నేను స్వయంగా మాట్లాడాను. వారు రాష్ట్ర ఎస్సీఈఆర్టీతో ఒప్పందం చేసుకుని, వారితో భాగస్వామ్యం అయ్యాక.. మాతో పూర్తి స్థాయిలో కలిసి పని చేస్తారు. వారు ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారికంగా ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్థాయిలో ఇక్కడ వారి భాగస్వామ్యం వస్తుంది కాబట్టి మేము లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా 2035 నాటికి మా పిల్లలు (గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులు) 10వ తరగతి పరీక్షలు ఐబీ సిలబస్‌లో రాస్తారు. తొలి ఏడాది టీచర్ల నైపుణ్యం, సామర్థ్యం పెంచుతాం. ఆ తర్వాత ఒకటో తరగతి నుంచి మొదలుపెట్టి, ఒక్కో ఏడాది ఒక్కో తరగతిలో ఐబీ సిలబస్ ప్రారంభించి, ఆ పిల్లలు 10వ తరగతి చేరే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రాజ్‌దీప్: ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది కదా? అందుకు తగిన నిధులు ఉన్నాయా? సీఎం జగన్: ఇది ప్రభుత్వ ప్రాజెక్టు, మా లక్ష్యం ఏమిటన్నది ఐబీకి కూడా స్పష్టంగా తెలుసు. అందుకే వారు మాతో భాగస్వామ్యం అవుతున్నారు. అందుకే వారు వ్యాపార ధోరణితో కాకుండా, మా లక్ష్య సాధనలో మాతో కలిసి పని చేస్తున్నారు. ఆ మేరకే అవగాహనకు వచ్చాం. అందుకే ఖరీదైన స్కూళ్ల మాదిరిగా, మేము ఐబీకి రాయల్టీ వంటివి చెల్లించడం లేదు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా ఐబీ సిలబస్‌తో చదివి పోటీ ప్రపంచంలో దీటుగా నిలబడాలన్న మా ప్రభుత్వ లక్ష్య సాధనలో, ఐబీ కూడా పూర్తి భాగస్వామి అవుతోంది. ఇక నిధులకు సంబంధించి చూస్తే.. ఇప్పటికే స్కూళ్లలో పూర్తి మౌలిక సదుపాయాల కల్పన మొదలైంది. మొత్తం రూ.14 వేల కోట్ల అంచనాతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే రూ.8,300 కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్రంలో 44 వేల స్కూళ్లు ఉండగా, నాడు–నేడు తొలి దశలో ఇప్పటికే 15,575 స్కూళ్లలో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించాం. నాడు–నేడు రెండో దశలో 16 వేలకు పైగా స్కూళ్లలో పనులు సాగుతున్నాయి. వచ్చే మార్చి నాటికి ఆ పనులు పూర్తవుతాయి. దీంతో రాష్ట్రంలో రెండో వంతు స్కూళ్లలో పూర్తి మౌలిక వసతులు ఏర్పడతాయి. మిగిలిన స్కూళ్లలో వచ్చే ఏడాదిలో పనులు చేపట్టి పూర్తి చేస్తాం. రాజ్‌దీప్: 2018లో రాష్ట్రంలో ప్రాథమిక విద్యా రంగంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) 84.48 శాతం ఉండగా.. అప్పుడు జాతీయ స్థాయి సగటు జీఈఆర్ 99.21 శాతం ఉంది. ఇప్పటి పరిస్థితి ఏమిటి? మీ పిల్లల డ్రాపవుట్స్ తగ్గకుండా ఏం చర్యలు తీసుకున్నారు? సీఎం జగన్ : అప్పట్లో జీఈఆర్‌లో మా రాష్ట్రంలో దేశంలో చాలా తక్కువ స్థాయిలో ఉంది. 29 రాష్ట్రాలు, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలు ఏడింటిలో చూస్తే.. మా రాష్ట్రం జీఈఆర్‌లో దారుణంగా 32వ స్థానంలో ఉండింది. అలాంటి పరిస్థితుల్లో అన్ని కోణాల్లో ఆలోచించి, వినూత్న చర్యలు మొదలుపెట్టాం. పిల్లలు స్కూళ్లకు ఎందుకు వెళ్లడం లేదన్న కారణాలు తెలుసుకున్నాం. ఆ దిశలో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాం. అందులో కీలకమైంది మధ్యాహ్న భోజనం. దాన్ని సమూలంగా మారుస్తూ.. రోజుకో మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇస్తూ గోరుముద్ద అమలు చేస్తున్నాం. అమ్మ ఒడి ద్వారా.. తల్లిదండ్రులు వారి పిల్లలను బడులకు పంపేలా ప్రోత్రహిస్తున్నాం. ఫలితంగా జీఈఆర్‌ను వంద శాతానికి తీసుకెళ్లాం. రాజ్‌దీప్: తమిళనాడులో పిల్లలకు మ్యాంగో షేక్ ఇస్తున్నారు. ఇక్కడ మీరు వారంలో ప్రతి రోజూ ఒక్కో మెనూతో పథకం అమలు చేస్తున్నామంటున్నారు. ఇది నిజమా? మా రిపోర్టర్లు స్కూళ్లకు వెళ్లి చెక్ చేయొచ్చా? సీఎం జగన్: నిరభ్యరంతంగా వెళ్లొచ్చు. ఎక్కడికైనా వెళ్లి చూడొచ్చు. గోరుముద్దలో ఏమేం ఇస్తున్నామో చూడొచ్చు. అదేవిధంగా పిల్లలను బడికి పంపేలా తల్లిదండ్రులను కూడా ప్రోత్సహిస్తున్నాం. నీటి సదుపాయంతో కూడిన టాయిలెట్స్, 6వ తరగతి నుంచి క్లాస్‌రూమ్‌లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్, పిల్లలకు పరిశుభ్రమైన మంచినీరు, స్కూళ్లకు అవసరమైన మరమ్మతులు, పెయింటింగ్.. ఇలా 10 రకాల మార్పులు చేస్తున్నాం. రాజ్‌దీప్: ఇది రాష్ట్రంలో ప్రతిచోటా అమలవుతోందా? సీఎం జగన్: ఇక్కడ మానిటరింగ్ వ్యవస్థ పక్కాగా ఉంది. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మాత్రమే కాకుండా.. నా స్థాయిలో నేను కూడా స్వయంగా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాను. సీఎం స్థాయిలో ఈ ప్రక్రియలో పాలుపంచుకుని, పనిచేస్తున్నప్పుడు.. మిగిలిన యంత్రాంగం కూడా ఎలా పనిచేస్తుందో తెలుసు కదా? రాజ్‌దీప్: విద్య అనేది ఉద్యోగ, ఉపాధి కల్పన దిశలో ఉండాలనేది కూడా ఒక సవాల్. ఈ పరిస్థితిని మీరెలా మార్చగలుగుతారు? సీఎం జగన్: రాష్ట్రంలో మా ఫోకస్ కేవలం స్కూళ్ల మీదనే కాదు.. ఉన్నత విద్యా రంగంలో కూడా చాలా మార్పులు చేశాం. ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా కరికులమ్‌లో మార్పులు చేశాం. మూడేళ్ల డిగ్రీ కోర్సులో ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేశాం. వేసవి సెలవులు కూడా ఉపయోగించుకుని, ఇంటర్న్‌షిప్ చేసేలా అవకాశం కల్పిస్తున్నాం. అన్ని డిగ్రీ కోర్సులను అనర్స్గా మార్చి, నాలుగేళ్లు చేస్తున్నాం. కరికులమ్‌లో భాగంగా ఆన్లైన్ వర్టికల్స్ ప్రారంభిస్తున్నాం. ఇంటర్న్‌షిప్, కరిక్యులమ్‌లో మార్పులు.. ఇవన్నీ కూడా మా లక్ష్య సాధనకు మార్గం వేస్తున్నాయి. ఎడెక్స్‌తో కూడా వచ్చే నెలలో ఒప్పందం చేసుకోబోతున్నాం. మనకు 1800 సబ్జెక్టŠస్ ఉన్నాయి. ఈ కోర్సులు అందించడం కోసం ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకోబోతున్నాం. కరికులమ్‌ను కూడా మారుస్తున్నాం. హార్వర్డ్, ఎల్లెస్సీ వంటి ప్రీమియమ్ సంస్థలను ఎడెక్స్ ద్వారా కోర్సులను ఆన్లైన్లో ఆఫర్ చేసేలా చర్యలు చేపడుతున్నాం. రాజ్‌దీప్: దానికి సంబంధించి ఉదాహరణ చెప్పగలరా? సీఎం జగన్: ఉదాహరణకు.. బికామ్ కోర్సు తీసుకోండి. ఆ కోర్సు విద్యార్థులు కూడా ఎసెట్ మేనేజ్మెంట్ తదితర అంశాలు నేర్చుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నాం. అవన్నీ పాఠ్య ప్రణాళికలో భాగం చేస్తున్నాం. పశ్చిమ దేశాల్లో మాత్రమే కనిపించే అంశాలను, ఇక్కడ కరికులమ్‌లో చేరుస్తూ.. పిల్లలను ఆ స్థాయిలో తీర్చిదిద్దే చర్యలు చేపడుతున్నాం. ఎడెక్స్ ఒప్పందం ద్వారా ఆన్లైన్ విద్యాబోధన ద్వారా.. ప్రతిష్టాత్మకమైన ఎల్లెసీ, హార్వర్డ్ సంస్థలు.. సర్టిఫికెట్ ఇస్తాయి. ఇది మా పిల్లలకు ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తుంది. రాజ్‌దీప్: ఇక్కడ సీఎం జగన్ అక్షరాస్యత వృద్ధి కోసం ఎంతో చేస్తున్నారు. విద్యా రంగాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేశారు. ఇక్కడ ఇవన్నీ మిమ్మల్ని ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తాయని అనుకుంటున్నారా? సీఎం జగన్: రాజకీయాలు వేరు. పిల్లలు, విద్యార్థులు ఓటర్లు కారు కాబట్టి, వారి గురించి ఎవరూ పట్టించుకోరు. ఇది దురదృష్టకరం. అయితే పిల్లలు మంచి విద్యావంతులైతేనే, వారికి నాణ్యతతో కూడిన విద్యను అందిస్తేనే.. సమాజంలో పేదరికం పోతుంది. పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే.. వచ్చే 10, 15 ఏళ్లలో వారు ఎంతో వృద్ధి చెందుతారు. తద్వారా సమాజం కూడా మారుతుంది. పిల్లలకు ఈ స్థాయిలో ఉన్నత ప్రమాణాలు, నాణ్యతతో కూడిన విద్యను అందిస్తే వారు పోటీ ప్రపంచంలో ధైర్యంగా నిలబడగలరు. ప్రపంచ స్థాయిలో పోటీ ఎదుర్కోగలరు. రాజ్‌దీప్: మీ స్పష్టమైన విజన్‌ను అందరూ అభినందించాల్సిందే. మీ విజన్ సఫలమైతే విద్యా రంగంలో మీరు ఆంధ్రా మోడల్‌ను అవిష్కరించిన వారవుతారు. (అందరూ చప్పట్లతో అభినందించారు) -
నాడు నేడు ద్వారా 15వేల పాఠశాలలు అభివృద్ధి చేశాం: సీఎం జగన్
-
అరచేతిలో బొంగరం తిప్పిన ఛత్తీస్‌గఢ్ సీఎం: ప్రత్యర్థులకు సవాలేనా?
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ ప్రత్యేకతే వేరు. ప్రత్యర్థులను తనదైన పంచ్‌లతో తిప్పి కొట్టడం ఈ కాంగ్రెస్ సీనియర్‌నేతకు బాగా అలవాటు. దీపావళి సందర్భంగా ప్రజల సంక్షేమం కోసం కొరడా దెబ్బలు తిన్నా, ఇటీవల కీలక సమావేశంలో కాండ్రీ క్రష్ ఆడినా ఆయనకే చెల్లు. తాజాగా బొంగరం తిప్పుతూ వార్తల్లో నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో నెటిజన్లును ఆకట్టుకుంటోంది. దీంతో బొంగరం తిప్పినంత ఈజీగా ఈ సారి కూడా రాజకీయాల్లో చక్రం తిప్పుతారా అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్ దేశాయ్ దీనికి సంబంధించిన ఒక వీడియోను ఎక్స్( ట్విటర్)లో షేర్ చేశారు. అలా విసిరి.. ఇలా అలవోకగా అరచేతిలో బొంగరం తిప్పుతూ ప్రత్యర్థులకు పరోక్షంగా సవాల్ విసురుతున్నట్టే కనిపించారు. దీంతో ‘వారెవ్వా.. లట్టూ మాస్టర్... డౌన్ టూ ఎర్త్ పోలిటీషియన్’ అంటూ సీఎంను రాజ్‌దీప్ అభివర్ణించారు. కాగా 2023 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా తన సత్తా చాటుకునేందుకు భూపేష్ భగెల్ సర్వ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రైతులే నిర్ణయాత్మక అంశం అని, వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలు తమకు విజయాన్ని అందిస్తాయనే విశ్వాసాన్ని ప్రకటించారు. అధికార కాంగ్రెస్ 90లో 75 ప్లస్ సీట్లు గెలుచు కుంటుందనే ధీమా వ్యక్తం చేశారు భూపేష్ బఘేల్. సీఎం పటాన్ నుంచి, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవో అంబికాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. అటు రాష్ట్ర అసెంబ్లీ పోల్స్ కి సంబంధించి మొత్తం 90 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. ఆ క్రమంలో నలుగురు అభ్యర్థులతో కూడిన చివరి జాబితాను బీజేపీ బుధవారం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. A chief minister who is a master of the ‘lattoo’. Chattisgarh CM @bhupeshbaghel is hoping to spin a top around his opponents.. comes across as a down to earth politician. #ElectionsOnMyPlate is back with a new season from next week. We start with the battle for Chattisgarh. 👍 pic.twitter.com/jL5VpanSMB — Rajdeep Sardesai (@sardesairajdeep) October 26, 2023 -
రాజ్‌దీప్ సర్దేశాయ్పై ఇండియా టుడే చర్యలు
న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్టు, ఇండియా టుడే న్యూస్ ప్రజెంటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రైతు ఆందోళనలకు సంబంధించి చేసిన ట్వీట్ ఆయనను చిక్కుల్లో పడేసింది. ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం నాడు ట్రాక్టర్ల ర్యాలీతో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ సిక్కు వ్యక్తి మరణించారు. ఈ విషయంపై స్పందించిన రాజ్‌దీప్ సర్దేశాయ్.. ‘‘ పోలీసు కాల్పుల్లో 45 ఏళ్ల నవనీత్ మరణించాడు. అతడి త్యాగం వృథాగా పోనివ్వమని రైతులు నాకు చెప్పారు’’ అని ట్వీట్ చేశారు. వాస్తవానికి ట్రాక్టర్ బోల్తాపడటంతో నవనీత్ మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. బారికేడ్ల వైపు ట్రాక్టర్‌పై వేగంగా దుసుకువచ్చిన నవనీత్, వాహనం పల్టీ కొట్టడంతో తీవ్రగాయాల పాలయ్యారు. తల పగలడంతో ఆయన మృత్యువాత పడినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. దీంతో రాజ్‌దీప్ సర్దేశాయ్పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.(చదవండి: రైతు ఉద్యమంలో చీలికలు) ఈ క్రమంలో ఆయన ట్వీట్ డెలీట్ చేశారు. అనంతరం.. ట్రాక్టర్ మీద ఉండగానే, పోలీసులు నవనీత్‌ను కాల్చేశారని రైతులు ఆరోపించినట్లు మరో ట్వీట్ చేశారు. ఢిల్లీ పోలీసులు షేర్ చేసిన వీడియోను పోస్ట్ చేసి, అందులో ట్రాక్టర్ బోల్తా పడినట్లు స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో పూర్తి సమాచారం తెలుసుకోకుండా ప్రజలను పక్కదోవ పట్టించేలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ ఇండియా టుడే గ్రూప్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల పాటు సస్పెండ్ చేయడంతో పాటు నెల జీతం కోత విధించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్, న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్నారు. He posted (and later deleted) this tweet at such a sensitive time? Unbelievable pic.twitter.com/ZLUlbl54Ug — Swati Goel Sharma (@swati_gs) January 26, 2021 While the farm protestors claim that the deceased Navneet Singh was shot at by Delhi police while on a tractor, this video clearly shows that the tractor overturned while trying to break the police barricades. The farm protestors allegations don’t stand. Post mortem awaited.👇 pic.twitter.com/JnuU05psgR — Rajdeep Sardesai (@sardesairajdeep) January 26, 2021 -
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద కథ నడుస్తోంది..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పనితీరుపై, దానిని ప్రభావితం చేస్తున్న సుప్రీంకోర్డు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డేకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. దీనిపై పలువురు ప్రముఖులు ట్విటర్ ద్వారా ఇలా స్పందించారు. (ఏపీ హైకోర్టుకు ‘సుప్రీం’ కమాండ్) సీఎం వర్సెస్ సుప్రీంకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలను ప్రభావితం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డేకు లేఖ రాశారు. - బార్ అండ్ బెంచ్ [CM vs Supreme Court Judge] Andhra Pradesh Chief Minister YS Jagan Reddy writes to CJI SA Bobde. Complains that Justice NV Ramana is influencing the sittings of Andhra Pradesh High Court. @ysjagan @AndhraPradeshCM @JaiTDP pic.twitter.com/XYrdBTdWwK — Bar & Bench (@barandbench) October 10, 2020 ఇప్పుడు స్పష్టం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవహారాలు బహిర్గతం చేసినప్పటి నుంచి ఆయన సన్నిహితుడైన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ద్వారా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేశారని ఇప్పుడు స్పష్టమైందని జగన్ ప్రధాన సలహాదారు అజేయ కల్లం ఆరోపించారు. - పాయల్ మెహతా ఏపీలో పెద్ద కథ.. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద కథ నడుస్తోంది. సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ కుటుంబ అవినీతిపై ఒక సీఎం నేరుగా ఆరోపించారు. ఈ కథను నివేదించకుండా హైకోర్టు ఒక వింత గాగ్ ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ దీనిని ప్రజలు, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. - రాజ్‌దీప్ సర్దేశాయ్ Big story is brewing in Andhra: a CM has directly accused next SC chief justice’s family of corruption. So far there has been a strange HC gag order on reporting this story! Now @ysjagan seems to have decided to take the battle to the public and the SC! Watch this space! pic.twitter.com/LH0k60p14S — Rajdeep Sardesai (@sardesairajdeep) October 10, 2020 ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర : హిందుస్తాన్ టైమ్స్ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు, కూల్చి వేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, రాష్ట్ర హైకోర్టు ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఆరోపించిందని హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది. ఈ మేరకు ఆ పత్రిక వెబ్సైట్లో పూర్తి వివరాలతో ఓ కథనం ప్రచురించింది. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. (అచ్చు గుద్దినట్లు ఇద్దరిదీ ఒకే మాట) జస్టిస్ రమణపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఐ బొబ్డేకు లేఖ రాశారు. ఎన్వీ రమణ గతంలో టీడీపీ ప్రభుత్వానికి న్యాయ సలహాదారు, అదనపు అడ్వకేట్ జనరల్ అని ఆ లేఖలో వివరించారు. రాష్ట్ర న్యాయ వ్యవస్థ టీడీపీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తూ.. ఆ పార్టీ ప్రయోజనాల కోసం అవినీతి వ్యవహారాలపై తొలి దశలోనే దర్యాప్తులు జరగకుండా స్టే ఇస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో స్వార్థ ప్రయోజనాలను పరిరక్షించడం కోసం మూడు రాజధానుల బిల్లులను అడ్డుకోవడం సహా తన ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు వరుస తీర్పులు ఇచ్చిందని సీఎం జగన్ పేర్కొన్నారు. వివిధ దశల్లో దాదాపు 30 ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో (పిల్) ముఖ్యమంత్రిని ప్రతివాదిగా పేర్కొన్నారని వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ అవినీతిపై తమ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించిన వెంటనే, జస్టిస్ రమణ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి ద్వారా రాష్ట్రంలోని న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపడం ప్రారంభించారని ఆరోపించారు. జస్టిస్ ఎవి శేషసాయి, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ డి రమేష్, జస్టిస్ కె.లలిత, మరికొంత న్యాయమూర్తులు టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించేలా తీర్పులిచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రకటనతో పాటు సీఎం రాసిన లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ కల్లం శనివారం ఆలస్యంగా మీడియాకు విడుదల చేశారు. (జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) -
కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ భేష్
సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే ఏపీ దూసుకెళుతోందని, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అభినందిస్తున్నట్టు ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ చెప్పారు. ఆయన శనివారం ఏపీలో జరుగుతున్న కోవిడ్ టెస్టులపై ట్విట్టర్లో స్పందించారు. ఓ వైపు కేసులు పెరుగుతున్నా సరే టెస్టుల్లో దూకుడు తగ్గించకపోగా, మరింతగా పెంచడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాగా టెస్టులు తగ్గించడం, కేసులను తగ్గించి చూపించడం వంటివి ఏపీ చేయడం లేదని ప్రశంసించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేటింగ్.. ఈ మూడు విధానాల ద్వారానే వైరస్ కట్టడికి ఏపీ కృషి చేస్తోందని రాజ్‌దీప్ కొనియాడారు. -
ప్రశంసలు కురిపించిన రాజ్‌దీప్
-
కరోనా కట్టడి: ఏపీ చర్యలు భేష్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాతీయ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసించారు. కేసులు పెరుగుతున్నా.. ఏపీ సర్కార్ టెస్టులు తగ్గించకపోవడం అభినందనీయం అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. వైరస్ కట్టడి కోసం ఏపీ అనుసరిస్తోన్న పద్దతి ప్రశంసనీయం అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నట్లుగా.. ఏపీలో కరోనా లెక్కలను దాచడంలేదన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేటింగ్.. ఇవే కరోనా కట్టడికి మార్గాలన్నారు రాజ్‌దీప్ సర్దేశాయ్. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్ చేశారు. గతంలో ఏపీలో 108, 104 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించనప్పుడు కూడా రాజ్‌దీప్.. క్లిష్ట సమయంలో ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందంటూ ప్రశంసించిన సంగతి తెలిసిందే. (104 కాల్ సెంటర్ బలోపేతం) And a word of praise for the Andhra govt: despite surge in cases, the state continues to ramp up testing.. that’s the way forward.. not trying to reduce testing/hide numbers as some states have done. Testing/tracing/isolating is the way to containment. @AndhraPradeshCM @ysjagan — Rajdeep Sardesai (@sardesairajdeep) August 1, 2020 ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం టెస్టులను తగ్గించడం లేదు. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జూలై 31 నాటికి రాష్ట్రంలో 19,51,776 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దేశంలో కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ ముందంజలో ఉంది. -
ఏపీ సర్కారుపై సర్దేశాయ్ ప్రశంసల జల్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడానికి, అందులోనూ అత్యంత క్లిష్ట సమయంలో కొత్త 108, 104 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించడాన్ని ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయి అభినందించారు. ఒకేసారి 1088 ఆంబులెన్స్‌లను ప్రవేశపెట్టిన విషయంపై ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. బుధవారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కరోనా వైరస్‌పై పోరాటంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని అన్నారు. (ఆరోగ్య చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభం) కొత్తగా ప్రారంభించిన 1088 అంబులెన్స్‌లు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తాయన్న విషయాన్ని సర్దేశాయి ప్రస్తావించారు. వీటిని స్థానిక ఆరోగ్య కేంద్రాలు, డాక్టర్లతో అనుసంధానం చేశారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తాయని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. (‘అమరరాజా’కు షాక్; 253.61 ఎకరాలు వెనక్కి) -
ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను: వైఎస్ జగన్
‘‘ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ప్రతి కాంట్రాక్టునూ పారదర్శకంగా పరిశీలిస్తాం. అవినీతి ఉందని తెలిస్తే తిరిగి టెండర్లు పిలుస్తాం. కాంట్రాక్టర్లతో ఎలాంటి లాలూచీ ఉండదు. వాళ్లు తప్పు చేస్తే టెండర్లు రద్దు చేసి, మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ప్రక్రియను మారుస్తాం. అతి తక్కువ కోట్ చేసేవాళ్లకే టెండర్లు ఇస్తాం. చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి కాంట్రాక్టునూ రద్దు చేస్తాం. తిరిగి టెండర్లు పిలుస్తాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మరో మూడు రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ‘ఇండియా టుడే’ ప్రతినిధి రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు. పగ తీర్చుకోవాలన్నది తన అభిమతం కాదని చెప్పారు. తనను కేసులతో వేధించిన వారిని దేవుడే శిక్షిస్తాడని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు... రాజ్‌దీప్ సర్దేశాయ్: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత భారీ విజయం సాధ్యమవుతుందని మీరు ఊహించారా? జగన్మోహన్రెడ్డి: ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప విజయం. ఇదంతా దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్లే సాధ్యమైంది. నేను 14 నెలల పాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినప్పుడే కిందిస్థాయి నుంచి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని గ్రహించాను. మా పార్టీ అఖండ విజయం సాధించబోతోందని అవగతమైంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నేను చేసిన తొలి ప్రకటన మీకు గుర్తుండే ఉంటుంది. వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించబోతోందని చెప్పాను. సర్దేశాయ్: మీ పార్టీని చీల్చుతూ 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తమ పార్టీలోకి తీసుకున్నారు. మీ పార్టీని లేకుండా చేయాలనుకున్నారు. అసలు మీ విజయంలో మలుపు తిప్పిన అంశం ఏమిటి? జగన్: నా పాదయాత్రనే ఈ విజయంలో ప్రధాన పాత్ర వహించింది. మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారు. ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను రూ 20–30 కోట్లిచ్చి, ప్రలోభాలకు గురిచేసి తీసుకోవడమే కాకుండా వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అది చట్ట విరుద్ధం కానట్లుగా వ్యవహరించారు. పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా కూడా చేయలేదు. వారి చేత రాజీనామాలు కూడా చేయించలేదు. స్పీకర్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అన్యాయంగా వ్యవహరిస్తోందో ప్రజలు తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి తారస్థాయికి చేరుకుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని రుజువయ్యాయి. సర్దేశాయ్: మీరేమో చంద్రబాబు అవినీతి, దుశ్చర్యల వల్ల ఆగ్రహంతో ఓట్లేశారని అంటున్నారు. మరి ఇందులో జగన్‌కు సానుకూల ఓటు లేదా? ఇంతకీ ఈ ఓటు చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటా? లేక జగన్ అనుకూల ఓటా? జగన్: ఇందులో రెండూ కలిసి ఉన్నాయి. ఎన్నికలప్పుడు ప్రజలు రెండు అంశాలు చూస్తారు. ప్రభుత్వంలో ఉన్న వారిపై వ్యతిరేకతతో పాటు తమ ఆశలను నెరవేర్చే నాయకుడు ఎవరని కూడా చూస్తారు. ఈ రెండు అంశాలు కలిసినప్పుడే సహజంగా అది అఖండ విజయం అవుతుంది. ఉన్న నాయకుడిని వద్దనుకున్నప్పుడు, మరో నాయకుడిని కావాలనుకున్నప్పుడే ప్రజలు అఖండ విజయాన్ని అందిస్తారు. సర్దేశాయ్: ఏపీలో ఎన్నికలు మీకు, చంద్రబాబుకు మధ్య హోరాహోరీగా జరిగాయి కదా. ఎన్నికల ప్రచారంలో ఆయన మిమ్మల్ని టార్గెట్ చేశారు. మీరు ఆయన్ను తీవ్రస్థాయిలో విమర్శించారు కదా. చివరకు వచ్చేటప్పటికి మీ ఇద్దరిలో ఒకరిని ఎన్నుకునే పరిస్థితిని కల్పించారు కదా! జగన్ : మౌలికంగా ఇది ప్రాంతీయ పార్టీల సమరం. జాతీయ పార్టీలకు ఇక్కడ ఆ అవకాశం లేకుండా పోయింది. అలాంటప్పుడు నాకు, చంద్రబాబుకూ మధ్యనే పోరాటం జరుగుతుంది కదా! సర్దేశాయ్: రాష్ట్రాన్ని 12 నెలల్లో మారుస్తానని చెప్పారు? మీరు అనేక హామీలు ఇచ్చారు. అసలు మీ ఎజెండా ఏంటి? మోడల్ స్టేట్ అంటే ఏంటి? జగన్: ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ప్రజలు మెచ్చుకునే పారదర్శక పాలన అందిస్తా. ఏం చేస్తామో, ఎలా చేస్తామో చెబుతాం. ఒక్క ఏడాదిలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మారుస్తా. పూర్తిగా ప్రక్షాళన చేస్తా. అప్పుడు మీరే వెల్డన్ అంటారు. ప్రతీ కాంట్రాక్టును పారదర్శకంగా పరిశీలిస్తాం. అవినీతి ఉందని తెలిస్తే తిరిగి టెండర్లు పిలుస్తాం. కాంట్రాక్టర్లతో ఎలాంటి లాలూచీ ఉండదు. వాళ్లు తప్పు చేస్తే టెండర్లు రద్దు చేసి, మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ప్రక్రియను మారుస్తాం. అతి తక్కువ కోట్ చేసేవాళ్లకే టెండర్లు ఇస్తాం. రివర్స్ టెండరింగ్ విధానానికి ప్రాధాన్యం ఇస్తాం. చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి కాంట్రాక్టునూ రద్దు చేస్తాం. సర్దేశాయ్: వచ్చే ఏడాదిలో కాంట్రాక్టర్ల వ్యవస్థలో మార్పు తెస్తారా? జగన్: అవును. పెద్ద మార్పు ఉంటుంది. ఉదాహరణకు పవర్ టారిఫ్‌నే తీసుకోండి. సంప్రదాయేతర ఇంధన వనరులను పరిశీలిద్దాం. సౌర విద్యుత్ గ్లోబల్ టెండర్ల ద్వారా అయితే యూనిట్ రూ.2.65కే లభిస్తోంది. పవన విద్యుత్ విషయంలో నరేంద్ర మోదీ అనుసరించిన పారదర్శక విధానం అభినందనీయం. దీనివల్ల యూనిట్ రూ.3కే లభిస్తోంది. కానీ, మన రాష్ట్రంలో విద్యుత్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పవన విద్యుత్ యూనిట్ రూ.4.84 ఉంది. పీక్ అవర్స్‌లో ఏకంగా రూ.6 పెట్టి కొనడానికి ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలో సిస్టమ్ ఏమిటంటే, నువ్వో రూపాయి తీసుకో. నాకో రూపాయి అనే విధానం కొనసాగుతోంది. చంద్రబాబు ఆయనకు కావాల్సింది తీసుకుని ఇలాంటివి ప్రోత్సహించాడు. మేము ఈ వ్యవస్థను మారుస్తాం. గ్లోబల్ స్థాయిలోకి వెళ్లి ఇప్పుడున్న ధరలు తగ్గిస్తాం. ఇదొక్కటే కాకుండా జ్యుడీషియల్ కమిటీ వేస్తాం. న్యాయబద్ధంగా వ్యవహరిస్తాం. రాష్ట్రంలో ఒక వర్గం మీడియా చంద్రబాబుకు అనుకూలంగా మారింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి వాటికి చంద్రబాబు ఎంత చెబితే అంత. వాళ్లు వేరే పక్షాన్ని మట్టిలో కలపాలని కంకణం కట్టుకున్నారు. రాష్ట్రంలో సిస్టమ్‌ను పూర్తిగా మార్చాలని చూస్తున్నాం. జ్యుడీషియల్ కమిటీని వేసి, సిట్టింగ్ జడ్జిని పెడతాం. జరిగే ప్రతి టెండర్‌ను ఆయన ముందుంచుతాం. ఆయన ఏ విధమైన మార్పులు సూచిస్తే దాన్ని అనుసరిస్తాం. వాళ్ల నిర్ణయానికి అడ్డురాము. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ఏ మీడియా అడిగినా ఫైళ్లు చూపిస్తాం. అసత్య ప్రచారం చేసే మీడియాపై పరువు నష్టం కేసులు వేసేందుకు కూడా వెనుకాడం. సర్దేశాయ్: మీకు కూడా సొంత మీడియా ఉంది కదా? ఇది మీడియా పోరాటం కాదా? జగన్: ఉద్దేశపూర్వకంగా ప్రతిష్ట దిగజారిస్తే వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కదా! ఇది అమలు జరిగితే దేశానికే మంచి సంకేతాలు వెళ్తాయి. గుడ్ గవర్నెన్స్ అంటే ఇదీ అని అందరికీ తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా ఉండి అవినీతిపరుడని పేరు తెచ్చుకోకూడదు. కానీ, రాష్ట్రంలో ఒక వర్గం మీడియా వాస్తవాలు కాకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. సర్దేశాయ్: రాష్ట్రం ఇమేజ్, మీ ఇమేజ్ మీ టార్గెట్. మోడల్ స్టేట్‌గా మార్చడం మీ ప్రధాన ఆశయం.. అంతేనా? ఏడాది తర్వాత మళ్లీ మీ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. మీకు బలమైన ఎజెండా ఉంది. మోదీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తారా? ఆయన సహకారం కోరుకుంటున్నారా? కేంద్రంతో మంచిగా ఉండాలనుకుంటున్నారా? జగన్: మోదీని కలిసిన ప్రతీసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతాను. ఆయన ప్రధానమంత్రి. ఆయన ఆశీస్సులు అవసరం. మోదీ నుంచి మనకు నిధులు రావాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా నేను చెయ్యాల్సింది నేను చేస్తా. సర్దేశాయ్: గతం వదిలేద్దాం. ఇప్పుడు మీరు సాధించిన ఘన విజయం తరువాత వెంటనే మీకేమనిపించింది? జగన్: అఖండ విజయం సాధించిన క్షణంలో ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను. అవి నిజంగా భావోద్వేగమైన క్షణాలు. సర్దేశాయ్: ప్రజల్లో మీ బలం ఏమిటో అంచనా వేసుకోవడానికి ఓదార్పు యాత్ర తలపెట్టారనేది కాంగ్రెస్ పార్టీ భావన. పదేళ్ల తరువాత ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు సొంతంగా గెలిచి ఏపీకి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు తమ తప్పు తెలుసుకుని మిమ్మల్ని మళ్లీ ఆ పార్టీలోకి ఆహ్వానిస్తే మీరు వెళ్లే విషయం పరిశీలిస్తారా? లేక ఇక ఎప్పటికీ ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: (ఆవేదనగా) కాంగ్రెస్ పార్టీ నా విషయంలో ఏం చేసిందో నాకు తెలుసు. పగ తీర్చుకోవాలన్నది నా అభిమతం కాదు. వారిని దేవుడే చూసుకోవాలి. నేను రోజూ బైబిల్ చదువుతాను. నేను దేవుడిని ప్రార్థిస్తాను. దేవుడే వారికి శిక్ష వేస్తాడు. సర్దేశాయ్: అంటే ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: నాకు సంబంధించినంత వరకూ నాపై చేసిన దానికి ఎప్పుడో క్షమించేశాను. ఎందుకంటే క్షమిస్తే శాంతి వస్తుంది. ప్రస్తుతం నా దృష్టి అంతా నా రాష్ట్రంపైనా, నా ప్రజలపైనా మాత్రమే ఉంది. నా వ్యక్తిగత అంశాలు దేనికీ అడ్డు కారాదు. ఇవాళ నా ఆలోచన అంతా నా ప్రజల గురించే. నేను ఆలోచించాల్సిందల్లా నా రాష్ట్రానికి ఎలా మంచి జరుగుతుందనే. నేనిప్పుడు ఏపీ ప్రజల తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాను. వారికి నేను బాధ్యుడిగా ఉన్నాను. నాపై వారు పెట్టుకున్న నమ్మకం గురించి ఆలోచించకుండా వ్యక్తిగత విషయాలను తీసుకురావడం మంచిది కాదు. సర్దేశాయ్: ఒకవేళ ఇవాళ సోనియాగాంధీ కనుక మీ వద్దకు వచ్చి... ‘జగన్ కమాన్.. మళ్లీ మన ఇంటికి వచ్చేయ్. మీ తండ్రి మా కాంగ్రెస్ వారే’ అని ఆహ్వానిస్తే స్పందిస్తారా? లేక ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: మీరే చెప్పారు కాంగ్రెస్‌కు అత్యల్పంగా ఓట్లు వచ్చాయని. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? వారితో నాకు అవసరం ఏమిటి? సర్దేశాయ్: మీకు వాళ్ల అవసరం లేదు. కానీ, వాళ్లకు మీ అవసరం ఉంది. జగన్: వాళ్లకు నా అవసరం ఉందంటే అది వారి సమస్య. -
ప్రజలు ఆశీర్వదిస్తే చరిత్ర సృష్టిస్తా..
సాక్షి, అమరావతి : ‘ప్రజలు ఆశీర్వదిస్తే చరిత్ర సృష్టిస్తాం. భవిష్యత్ కోసం ప్రజల ఆశా, ఆకాంక్షలే ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపిస్తాయి. ప్రజల సుఖసంతోషాలే లక్ష్యంగా పనిచేస్తాను’అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎన్నికలను ప్రభావితం చేయాలన్న చంద్రబాబు పన్నాగాన్ని ప్రజలుతిప్పికొడతారు’అని కూడా ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ‘చంద్రబాబు ఆనాడు హైదరాబాద్‌ను నిర్మించనూ లేదు. ప్రస్తుతం అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదు’అని విమర్శించారు. ఏ పార్టీతోనూ తమకు పొత్తుగానీ, సాన్నిహిత్యంగానీ లేదని స్పష్టం చేస్తూ ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతిస్తామని తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ‘ఇండియా టుడే’ టీవీ ఛానల్ కన్సల్టెంట్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్రంలో ఎన్నికలు, జాతీయస్థాయి రాజకీయాలపై తన అభిప్రాయాలను ఇలా వెల్లడించారు రాజ్‌దీప్ సర్దేశాయ్ : ఏడాదిన్నరపాటు రోడ్డు మీదే ఉన్నారు. మీ పాదయాత్ర జయప్రదమైంది. మీ గెలుపునకు ఎన్ని రోజుల దూరంలో ఉన్నారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి : 14 నెలల పాటు ప్రజాసంకల్పయాత్ర చేశా. అది పూర్తి చేసిన వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాను. రాజ్‌దీప్ సర్దేశాయ్ : పాదయాత్ర మీ రాజకీయ జీవితంలో చాలా కీలకమైంది. మీనాన్న గారు చనిపోయి ఇప్పటికి పదేళ్లు అయింది. ఈ పదేళ్ల ప్రయాణం మీకు ఎలా అనిపిస్తోంది? జగన్మోహన్ రెడ్డి : ప్రతి నిత్యం పోరాటమే. ప్రతిపక్షంలో ఉన్నందునక్షణ క్షణమూ పోరాటమే చేస్తున్నాం. ఇప్పుడది క్లైమాక్స్‌కు వచ్చింది. రాజ్‌దీప్ సర్దేశాయ్ : ఓదార్పు యాత్రకు అనుమతించని కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ పూర్తిగా దెబ్బతింది. మీరు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ పార్టీపై ప్రతికారం తీర్చుకోవాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి : నేనెందుకు ప్రతికారం తీర్చుకోవాలి ? నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నా. నేనిప్పుడు నా ప్రజలకు ఎంతమేర మంచి చేయాలన్న దాని గురించే ఆలోచిస్తాను. ప్రస్తుతం కూడా అదే ఆలోచిస్తున్నా. రాజ్‌దీప్ సర్దేశాయ్ : చంద్రబాబు ఇప్పటికీ మీపైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ప్రతీ శుక్రవారం విచారణ కోసం కోర్టుకు హాజరవుతున్నారని పదే పదే విమర్శిస్తున్నారు కదా? జగన్మోహన్ రెడ్డి :మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేను కాదు ఎంపీనీ కాదు. ఏనాడూ సెక్రటేరియట్‌కు కూడా వెళ్లలేదు. అప్పుడు నేను అసలు హైదరాబాద్‌లోనే లేను. మా పిల్లల చదువు కోసం మేము బెంగళూరులో ఉన్నాం. నా మీద కేసులకు సంబంధించి మరో విషయాన్ని గమనించాలి. మా నాన్న జీవించి ఉన్నన్నాళ్లూ నాపై ఎలాంటి కేసులూ లేవు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతవరకూ కూడా కేసులు లేవు. నా మీద ఈ కేసులన్నీ ఎప్పుడు వచ్చాయి... నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన తరువాతే నా మీద కేసులు వేశారు. కాంగ్రెస్, టీడీపీ కలసి కుమ్మక్కై నా మీద అక్రమ కేసులు బనాయించారు. ఇవన్నీ రాజకీయ కక్షతో వేసిన కేసులే. రాజ్‌దీప్ సర్దేశాయ్ : 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, చంద్రబాబు మధ్య ఎన్నికల పోరు సాగింది. ఇప్పుడు చంద్రబాబే మీకు ప్రధాన శత్రువు కదా? జగన్మోహన్ రెడ్డి : నాకు చంద్రబాబుగానీ కాంగ్రెస్ గానీ శత్రువులు కారు. నాకు ప్రజా క్షేమమే ముఖ్యం. ప్రజల సంతోషమే కావాలి. ప్రజలు ఆశీర్వదించి నాకు అవకాశం ఇస్తే గొప్పగా పనిచేస్తాను. చరిత్ర పునరావృతం అవుతుంది. రాజ్‌దీప్ సర్దేశాయ్ : చంద్రబాబు శత్రువు కాదు... ప్రధాన ప్రత్యర్థి అని ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి : కావచ్చు. రాష్ట్రంలో ఇప్పుడు రెండే ప్రధాన పార్టీలు ఉన్నాయి. అధికార పార్టీపైన విపరీతమైన ప్రజా వ్యతిరేకత కన్పిస్తోంది. ఇది మాకు ఎన్నికల్లో అనుకూలిస్తుందని భావిస్తున్నాం. రాజ్‌దీప్ సర్దేశాయ్ : చంద్రబాబు తాను ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో పోరాడుతున్నాను అంటున్నారు. మీరు మాత్రం ఎన్నికల తరువాత నరేంద్రమోదీతో కలవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు అని విమర్శిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి : మాకు బీజేపీ, కాంగ్రెస్ రెండు సమాన దూరమే. మా లక్ష్యం చాలా నిర్ధిష్టంగా ఉంది. ఎవరైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారో వారికే మేము మద్దతిస్తాం. దీనికి కూడా కారణం ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి షరతులు లేకుండా మాకు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు. అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసే ఆ హామీ ఇచ్చాయి. రాజధాని ఉన్నప్రాంతం తాము ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతామని అడగడం దేశచరిత్రలో అదే తొలిసారి. అంతవరకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ వెళ్లిపోయాక మా రాష్ట్రంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు కోసం ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అందుకే ప్రత్యేక హోదా అన్నది మాకు అత్యంత కీలకమైంది. రాజ్‌దీప్ సర్దేశాయ్ : తాము అధికారంలోకి వస్తే వారంరోజుల్లోనే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే మీరు రాహుల్ గాంధీకి మద్దతిస్తారా? జగన్మోహన్ రెడ్డి : ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం లేదు. నాకు నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మా మద్దతు ఉంటుంది. తొలుత మా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఏమి చేసింది. రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టి మోసం చేసింది. ఆ తర్వాత బీజేపీ కూడా అదే విధంగా చేసింది. అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలసి రాష్ట్రాన్ని విభజించింది. 2014లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ కూడా వారి పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి అయిన తరువాత ప్రత్యేక హోదా ఇచ్చే స్థాయిలో ఉండి కూడా ఆయన మాకు వెన్నుపోటు పొడిచారు. కాబట్టి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా మా రాష్ట్రాన్ని మోసం చేశాయి. అందుకే ఇప్పుడు మేము ఎవ్వరినీ నమ్మే స్థితిలో లేం. ప్రజల మనోభీష్టం మేరకు మేము ఇప్పుడు ఒక ప్రతిపాదన పెడుతున్నాము. దేవుడి దయవల్ల పార్లమెంటులో 25 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే ... ప్రత్యేక హోదాకు సంతకం పెట్టండి... మా మద్దతిస్తాము అని కచ్చితంగా చెబుతాం. రాజ్‌దీప్ సర్దేశాయ్ : ఒకవేళ నరేంద్ర మోదీకి 25 సీట్లు తగ్గి.. మీ చేతిలో 25 సీట్లు ఉంటే.. ప్రత్యేక హోదాపై సంతకం పెట్టు.. మద్దతు ఇస్తానంటారు. అంతేనా? జగన్మోహన్ రెడ్డి : అవును. కచ్చితంగా అంతే. రాజ్‌దీప్ సర్దేశాయ్ : మీ పార్టీకి మైనార్టీల మద్దతు ఉంది. ఎన్నికల తరువాత మీరు బీజేపీతో కలిస్తే ఆ ఓటర్లు మిమ్మల్ని వీడుతారని అనుకుంటున్నారా... ఎన్నికల తరువాత ఇలాంటి అంశాలు మీ పొత్తును ప్రభావితం చేస్తాయా... లేక ప్రత్యేక హోదా ఒక్కటే మీ అంశమా...? జగన్మోహన్ రెడ్డి : మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. అయితే ప్రత్యేక హోదా విషయంలో మాకు మద్దతు ప్రకటించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. రాజ్‌దీప్ సర్దేశాయ్ : బీజేపీ సిద్ధాంతాల గురించి ఏం చెబుతారు? వాటిని మీరు పరిగణలోకి తీసుకోరా? జగన్మోహన్ రెడ్డి : రాష్ట్రంలో మేం 25 ఎంపీ సీట్లు గెలిచి ఆ బలానికి తెలంగాణ కూడా మద్దతిస్తే కలిపి 42 ఎంపీ స్థానాలతో మేం ఓ గణనీయమైన శక్తిగా ఉంటాం. అపుడు మేం ప్రత్యేక హోదా డిమాండ్ చేసే బలమైన శక్తిగా ఉంటాం. రాజ్‌దీప్ సర్దేశాయ్ : చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు కదా. ప్రత్యేక హోదా కావాలి, ఈ విషయంలో మోదీ ద్రోహం చేశారు అని చెబుతున్నారు కదా? జగన్మోహన్ రెడ్డి : ఐదేళ్ల పాలనలో 4 ఏళ్లు చంద్రబాబు–బీజేపీ కలిసి మెలిసి ఉన్నారు. వారి ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ నాలుగేళ్లలో టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు మంత్రివర్గం తీసుకున్న చాలా నిర్ణయాల్లో భాగస్వాములుగా ఉన్నారు. అయితే వాళ్లెప్పుడూ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడనే లేదు. ఇంకా దారుణమైన అంశం ఏమంటే ఈ నాలుగేళ్లు వారు బాగా అతుక్కుపోయి ఉన్నారు. బీజేపీ–టీడీపీ కలిసి ప్రయాణం చేశారు. ఇక వాస్తవానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను విభేదించారు. 2017, సెప్టెంబర్ 8న అర్థరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదా లేదని చెబుతూ దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ఇస్తున్నట్లు ప్రకటించినపుడు టీడీపీ మంత్రులు ఆయన పక్కనే ఉన్నారు. జైట్లీ ప్యాకేజీ ప్రకటన చేసిన నాలుగు నెలలకు, జనవరి 27, 2018న చంద్రబాబు విలేకరుల సమావేశం పెట్టి బీజేపీ ప్రభుత్వం ఏపీకి చేసినంత మేలు చరిత్రలోనే ఎప్పుడూ చూడలేదని పొగిడారు. రాజ్‌దీప్ సర్దేశాయ్ : మీరు అధికారంలోకి వస్తే చంద్రబాబుపై విచారణకు ఆదేశిస్తారా? జగన్మోహన్ రెడ్డి : తప్పకుండా ఆయనపై విచారణ జరిపిస్తాం. నేరస్తులను జైలుకు పంపేలా కచ్చితంగా చేస్తాం. రాజ్‌దీప్ సర్దేశాయ్ : చంద్రబాబుపై మీరు చేస్తున్న అధికార దుర్వినియోగం, ఆయన ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపైన వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తారా? మీపై కేసులు చంద్రబాబు పెట్టించారు కనుక మీరు చంద్రబాబుపై అలాగే కేసులు పెట్టి ఆయన్ను బాధ్యునిగా చేసేందుకు ప్రయత్నిస్తారా? జగన్మోహన్ రెడ్డి : మీరే చెప్పండి నేనేం చేయాలో.... ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపుల సాక్షిగా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. కోట్లాది రూపాయల నల్లధనం ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు. నల్లధనంతో ప్రలోభపెడుతూ దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాంటి వ్యక్తిని విడిచిపెట్టాలా? అదెలా సాధ్యం? ... ఇలా అడ్డంగా దొరికిన ముఖ్యమంత్రి అసలు తన పదవికి రాజీనామా చేయలేదు. ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. ఆయన్ను జైలుకూ పంపలేదు. మరి అలాంటి ఆయనపై కేసు పెట్టి విచారించాలి కదా. రాజ్‌దీప్ సర్దేశాయ్ : జగన్మోహన్రెడ్డి, కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ ఓ విధమైన ఎన్నికల ముందస్తు పొత్తుతో ఉన్నారని భావించాలా? అందరూ కలిస్తే 42 సీట్లు అవుతాయని మీరంటున్నారు కనుక అలా అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి : మా మధ్య ఎలాంటి పొత్తూ లేదు. అయితే మా మధ్య ప్రజల ఉమ్మడి ప్రయోజనాలున్నాయి. జాతీయ స్థాయిలో మేం కోరుకునేదేమిటంటే మా మొర ఆలకించడానికి, మా వినతులు పట్టించుకోవడానికి ఎవరో ఒకరుండాలి. పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను ఇవ్వక పోతే ఇక ప్రజాస్వామ్యం ఎటు పోతుందనుకోవాలి? రాజ్‌దీప్ సర్దేశాయ్ : కేంద్రంలో ఎవరు ఉంటే మీకు బాగుంటుందనిపిస్తోంది? కాంగ్రెస్ సారథి రాహుల్ గాంధీనా? బీజేపీ సారథి నరేంద్ర మోదీనా? జగన్మోహన్ రెడ్డి : మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని సంతకం చేసే వారు ఎవరైనా సరే మాకు బాగానే ఉంటుంది. కేంద్రంలో ఎవరికీ మెజారిటీ రాని పరిస్థితి ఉండాలి. అక్కడ ఫలితాలు ఏకపక్షంగా ఉండ కూడదని కోరుకుంటున్నాను. రాజ్‌దీప్ సర్దేశాయ్ : అంటే మీరు హంగ్ పార్లమెంటు ఏర్పడాలని కోరుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి : అవును, మేం హంగ్ పార్లమెంటు రావాలని కోరుకుంటున్నాం. రాజ్‌దీప్ సర్దేశాయ్ : హంగ్పార్లమెంటు కావాలనే విషయంలో స్పష్టంగా ఉన్నారన్న మాట? జగన్మోహన్ రెడ్డి : కచ్చితంగా హంగ్ పార్లమెంటు కావాలనుకుంటున్నాను. అలా కాకుంటే పార్లమెంటులో ఇచ్చిన హామీకి దిక్కు లేకుండా పోతుంది. ఆరోజు పార్లమెంటులో అధికారపక్షం, ప్రతిపక్షం రెండూ కూడా మాకు ప్రత్యేక హోదా ఇస్తామన్నాయి . ఆ షరతుపైనే విభజించారు. పార్లమెంటులో ఇచ్చిన హామీ అమలు కాక పోతే ప్రజాస్వామ్యం నవ్వులపాలు అవుతుంది కదా! రాజ్‌దీప్ సర్దేశాయ్ : అంటే మీరు, కేసీఆర్, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, ఫెడరల్ ఫ్రంట్ లాంటివి (కేసీఆర్ చెబుతున్న విధంగా) వంటివి ఉంటే రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, మరింత స్వయం ప్రతిపత్తి లభిస్తుందని భావిస్తున్నారన్న మాట. జగన్మోహన్ రెడ్డి : నేను కచ్చితంగా అలాంటి పరిస్థితే కావాలని కోరుకుంటున్నాను. నా రాష్ట్రం, నేను ప్రత్యేక హోదా విషయంలో ద్రోహానికి గురయ్యాము. మోసపోయాము కాబట్టి అలా కోరుకోవడంలో తప్పేమీ లేదనుకుంటున్నా. రాజ్‌దీప్ సర్దేశాయ్ : ఏపీ రాజకీయాల్లో డబ్బు కూడా కీలక పాత్ర పోషిస్తోంది కదా. ఎన్నికల్లో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టగలిగే పార్టీయే గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడంలో మీరు చంద్రబాబుతో పోటీ పడగలరా? జగన్మోహన్ రెడ్డి : ఎన్నికల్లో డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుందని నేను భావించడం లేదు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతే ఎక్కువగా ఓటింగ్‌ను ప్రభావితం చేస్తుంది. చంద్రబాబు ఈ ఐదేళ్ల పాలనలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. ఆయన ఎన్నికల్లో డబ్బు వెదజల్లి అందర్నీ అవినీతిపరులను చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక్కో ఓటుకు రూ.3వేలు కూడా ఇవ్వడానికి సిద్ధపడతారు. కానీ భవిష్యత్ కోసం ఆశ, ఆకాంక్షలే ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేసేలా చేస్తాయి. రాజ్‌దీప్ సర్దేశాయ్ : బీజేపీ మీకు డబ్బులు ఇస్తామనడం లేదా? ఎన్నికల తరువాత వారికి మద్దతివ్వాలనే షరతుతో ఇప్పుడు మీకు ఎన్నికల్లో డబ్బు సహాయం చేస్తామనడం లేదా...? జగన్మోహన్ రెడ్డి : బీజేపీగానీ కాంగ్రెస్ గానీ మాకు డబ్బులు ఏమీ ఇస్తామనడం లేదు. మాకు వారి డబ్బు వద్దు కూడా. రాజ్‌దీప్ సర్దేశాయ్ : ఈ ఎన్నికల్లో పవన్ కీలకంగా మారారు కదా? జగన్మోహన్ రెడ్డి : ఆయన గత ఎన్నికల్లో టీడీపీతో ఉన్నారు. టీడీపీ తరపున ప్రచారం చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడానికి ఆయన కూడా దోహదపడ్డారు. ఈ ఐదేళ్లలో నాలుగున్నరేళ్లు ఆయన పూర్తిగా టీడీపీతోనే కలసి ఉన్నారు కూడా. రాష్ట్రంలో టీడీపీ ప్రజావ్యతిరేక పాలనలో ఆయన కూడా భాగస్వామి. ప్రభుత్వ వైఫల్యాలకు ఆయన బాధ్యత కూడా ఉంది. రాజ్‌దీప్ సర్దేశాయ్ : మీరు సీఎం అయితే సింగపూర్‌వంటి అంతర్జాతీయ నగరంగా అమరావతిని నిర్మించాలన్న చంద్రబాబు కలను కొనసాగిస్తారా? జగన్మోహన్ రెడ్డి : రాజ్‌దీప్ అసలు నిజం ఏమిటంటే... రాజధాని అమరావతిలో చూస్తే ఏం కనిపిస్తోంది. శాశ్వత రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు ఒక్క ఇటుకు కూడా వేయ లేదు. అక్కడ ఉన్నది అంతా తాత్కాలికమే. రాజ్‌దీప్ సర్దేశాయ్ : వైఎస్ జీవించి ఉన్నప్పుడు మీరు ఈస్థాయిలో ఉంటానని ఎప్పుడైనా అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి : అస్సలు అనుకోలేదు. ఇటువంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. ఆయన కాంగ్రెస్‌లో చాలా పెద్ద నాయకుడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయం.. రాజ్‌దీప్ సర్దేశాయ్ : రాజకీయాల్లోకి రావాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి : మా నాన్న జీవించి ఉండగానే ఆయన ప్రోద్భలం వల్లే నేను రాజకీయాల్లోకి వచ్చాను. 2009లో ఆయన నన్ను రాజకీయాలలోకి తీసుకువచ్చారు. నీకు మంచి మనసు ఉంది. నీలాంటి వాళ్లు తప్పక రాజకీయాల్లోకి రావాలన్నారు. దురదృష్టవశాత్తు ఆ తర్వాత వంద రోజులకు ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. దాంతో ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉండాల్సి వచ్చింది. మా నాన్న హెలికాఫ్టర్ కూలి చనిపోయిన ప్రాంతాన్ని చూశా. ఒక్కసారి మాట ఇస్తే వెనుకడుగు వేయని మా నాన్నకు ప్రజలతో ఉన్న అనుబంధం ఏమిటో తెలిసింది. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో జరిగిన సంతాప సభను చూసిన తర్వాత ఆయన కోసం మరణించిన వారి అన్ని కుటుంబాలను స్వయంగా పరామర్శిస్తానని నిర్ణయం ప్రకటించాను. వాళ్లందరూ నా కుటుంబ సభ్యులుగా భావించా. అందుకే ఆ మాట ఇచ్చాను. అది సెంటిమెంట్‌తో కూడిన అంశం. అదే విషయాన్నే కాంగ్రెస్ నాయకులకు చెప్పా. నేను రాజకీయాలకు కొత్త. అందువల్ల, అటువంటి మాట ఇచ్చేటప్పుడు నేను వాళ్ల అనుమతి తీసుకోవాలని కూడా తెలియదు. సోనియా గాంధీని మూడుసార్లు కలిసి ఆ విషయమే చెప్పా. ఈ విషయమై అహ్మద్ పటేల్‌ను ఆరేడు సార్లు కలిశా. మా నాన్న కోసం కన్నుమూసిన వారి కుటుంబాలన్నింటినీ పరామర్శించేందుకు అనుమతి ఇమ్మని పదేపదే కోరా. కారణమేమిటో తెలియదు గాని వాళ్లు నాకు అనుమతి ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో నేను ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అలా ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న నిర్ణయమే నా గమ్యాన్ని మార్చేసింది. రాజ్‌దీప్ సర్దేశాయ్ : తాను హైదరాబాద్ నిర్మించాను. అమరావతి నిర్మిస్తాను అని చంద్రబాబు అంటున్నారు కదా? జగన్మోహన్ రెడ్డి : చంద్రబాబు హైదరాబాద్ నిర్మించారా...!?... మీకు కావాలంటే చంద్రబాబు ప్రభుత్వంలో హైదరాబాద్ అభివృద్ధి, నాన్నగారి ప్రభుత్వంలో హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన గణాంకాలు, వివరాలు అన్నీ ఇస్తాను. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రమాణాలు కూడా నాన్న ప్రభుత్వ హయాంలో కంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తక్కువగానే ఉన్నాయి. ఆయన అప్పుడు హైదరాబాద్‌ను నిర్మించ లేదు. ఇప్పుడు ప్రపంచస్థాయి అమరావతి రాజధానిని నిర్మించడమూ లేదు. -
ఏపీకి వైఎస్సార్ లాంటి నాయకుడి అవసరం ఉంది
సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ప్రజలతో మమేకమైన నాయకుడికి బలం ప్రజలే అని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిరూపించారని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చెప్పారు. వైఎస్సార్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇంటర్వ్యూ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. జనం నుంచి ఎదిగిన నేతగా రాజశేఖరరెడ్డిని అభివర్ణించారు. 2004 ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు లేకపోయినా.. గెలిపించి చూపించిన సాహసోపేత నేతగా పేర్కొన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రాజశేఖరరెడ్డి గురించి ఆయన ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘2003లో అనుకుంటా.. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాను. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలవడం అంత సులభం కాదనే అభిప్రాయంతో వారంతా ఉన్నారు. కేంద్రం (వాజ్‌పేయి నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం) అండదండలు పుష్కలంగా ఉండటంతో భారీగా నిధులు కూడా ఆంధ్రప్రదేశ్‌కు అందుతున్నాయని చెప్పడం విన్నాను. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాను. మీ పార్టీ అధిష్టానం పెద్దలకే గెలుపు పట్ల పెద్దగా నమ్మకం లేదు కదా! మీ నమ్మకం ఏమిటి? మీ పాదయాత్ర వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారా? అని అడిగాను. ‘నాకు నా రాష్ట్ర ప్రజల పట్ల విశ్వాసం ఉంది. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాను. ప్రజలు నాతో ఉంటే నన్ను, పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరు’ అని ఆయన సమాధానం ఇచ్చారు. ఆయన చెప్పింది నిజమయింది. 2004–2014 వరకు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉందంటే.. అది రాజశేఖరరెడ్డి చలువే. ఆయనకు పార్టీ రుణపడి ఉండాలి. ఆయన లేకుంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం అందేది కాదు. -
టీఆర్పీ కోసం మీడియా పాకులాట
హైదరాబాద్: ప్రస్తుతం మీడియా రంగంలో రాజకీయ నేతల జోక్యం ఎక్కువగా ఉంటోందని, గతంతో పోలిస్తే మీడియాలో విలువలు తగ్గిపోతున్నాయని ఇండియా టుడే కన్సల్టింగ్ గ్రూప్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. టీఆర్పీ రేటింగ్ కోసం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోం దన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ 53వ వ్యవస్థాపక దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజమౌళిచారి, ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘మీడియా ఇన్ బ్రేకింగ్ న్యూస్ ఎరా’అనే అంశంపై రాజ్‌దీప్ సర్దేశాయ్ ఉపన్యసించారు. ప్రస్తుతం మీడియా యాజమాన్యాలు కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎడిటోరియల్ కథనాలకు ఎంతో విలువ ఉండేదని, కానీ నేడు అవి రాజకీయ నేతల ప్యాకేజీలుగా మారి పోయాయన్నారు. జర్నలిజాన్ని పెయిడ్ న్యూస్ ఒక కేన్సర్ వ్యాధిలా పట్టిపీడిస్తోందన్నారు. మరుగున పడిపోతున్న ప్రజా సమస్యలు ప్రజల సమస్యలపై వార్తలు ప్రసారం చేయడం, ప్రచురించడం తగ్గిపోయిందని రాజ్‌దీప్ వాపోయారు. దేశవ్యాప్తంగా 400 చానళ్లు ఉండగా అందులో ఎక్కువ శాతం రాజకీయాల కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. నేడు ప్రధానులు, ముఖ్యమంత్రులు సైతం కనీసం మీడియాకి ఇంటర్వూలు కూడా ఇవ్వడం లేదని.. ప్రెస్మీట్లు పెట్టడానికి సైతం ఆసక్తి చూపడం లేదని అన్నారు. గతంలో ఎన్టీఆర్ లాంటి మహానేతలు ప్రతినిత్యం మీడియాతో కలసిమెలసి ఉండేవారని గుర్తుచేశారు. సంచలనాల కోసమే చానళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్నారు. ఇంటర్నెట్, మొబైల్, వాట్సప్ జర్నలిజం పెరిగిపోవడంతో తప్పుడు వార్తలు ప్రసారమవుతున్నాయన్నారు. ఇటీవలి కాలంలో జాతీయ మీడియా కులా లు, మతాలు, ప్రాంతీయ భేదాలతో ప్రజల్ని విడదీసే విధంగా కథనాలు ప్రసారం చేయడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఐజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్.. రాజ్‌దీప్ సర్దేశాయ్‌ను ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. జర్నలిజంలో 45 సంవత్సరాలు పూర్తిచేసిన రామచంద్రమూర్తిని, ఐజేయూ అధ్యక్షుడిగా ఎన్నికైన అమర్‌ను, అల్లం నారాయణను రాజ్‌దీప్ సత్కరించారు. -
సోషల్ మీడియా ద్వారా అసత్య వార్తాలు పెరుగుతున్నాయి
-
‘ముఖ్యమంత్రులు ప్రెస్మీట్లు పెట్టట్లేదు’
సాక్షి, హైదరాబాద్ : వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రెస్మీట్లు పెట్టట్లేదని, మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వారు సిద్ధంగా లేరని ప్రముఖ జర్నలిస్టు, ఇండియా టుడే కన్సల్టింగ్ గ్రూపు ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ 53వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన ‘మీడియా ఇన్ బ్రేకింగ్ న్యూస్ ఎరా’ అనే అంశంపై మాట్లాడారు. హైదరాబాద్ అనేక మంది గొప్ప పాత్రికేయులను ఇచ్చిందని, ఇక్కడికి రావడం తనకు గర్వంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుత మీడియాను అడ్వటైజ్మెంట్ విభాగాలే శాసిస్తున్నాయిని అన్నారు. కేవలం సంచలనాల కోసమే ఇప్పటి మీడియా ప్రయత్నిస్తుందని, ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, వ్యవసాయంపై అవసరమైన మేర స్పందించట్లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియా విస్తరణ తర్వాత అందరూ జర్నలిస్టులుగా వ్యవహరిస్తున్నారని, అయితే సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య వార్తాలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
ప్రాంతీయ పార్టీలదే హవా!
హైదరాబాద్: వచ్చే 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవాకు అవకాశం ఉందని, 10 మంది ఎంపీలుంటే కేంద్రాన్ని శాసించవచ్చని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ సోమాజిగూడలోని పార్క్ హోటల్లో మీడియా ఇన్ న్యూస్ పేరుతో నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అభిప్రాయాలను పంచుకున్నారు. రానున్న ఎన్ని కల్లో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా ‘వాట్సాప్’ వేదికగా ఎన్నికల యుద్ధం జరిగే అవకాశం ఉందన్నారు. మీడియా ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయిందని, దేశవ్యాప్తంగా వందల చానళ్లు నిర్వహిస్తున్నారని, ప్రముఖ చానళ్లు కూడా లాభాల్లో లేవని, కేవలం ఎన్నికల అవసరాల కోసమే మీడియా సంస్థలు పని చేస్తున్నాయని అన్నారు. అప్రాధాన్య వార్తలు ప్రాధాన్యత పొందుతున్నాయని, నిజమైన వార్తలు లోపలి పేజీలకు పరిమితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూస్ కాకుండా కేవలం వ్యూస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని.. టీఆర్పీ రేటింగ్స్, సంచలనాల కోసం పాకులాడుతూ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని రాజ్‌దీప్ అన్నారు. మీడియా క్రమంగా ‘మెక్‌డొనాల్డ్ డైజేషన్’( అప్పటికప్పుడు తయారు చేసుకొని తినడం), ‘విండో జర్నలిజం’, ‘రావన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం’కి దిగజారుతోందని అభిప్రాయపడ్డారు. మీడియా ‘వాచ్ డాగ్ ఆఫ్ సొసైటీ’ స్థాయి నుంచి ‘ద ల్యాబ్ డాగ్ ఆఫ్ ద సొసైటీ’గా శరవేగంగా మారిపోతోందన్నారు. దేశంలోని పలు పార్టీలు, నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీడియాను నియంత్రిస్తున్నారని, వారికి వ్యతిరేకంగా రాసే వార్తలను ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జయలలిత, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ సహా కేసీఆర్ కూడా ఇదే విధానం అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంతో పోలిస్తే అమెరికాలో మీడియా మరింత శక్తివంతంగా, పక్షపాత రహితంగా ఉందని, మీడియా దెబ్బకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అభిశంసనకు గురైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు. మహిళలు నిజాయితీగా రాజకీయాలు చేస్తారని చెప్పడం కష్టమని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నబ్‌కు, తనకు వ్యక్తిగత వైరం లేదని, వృత్తిపరమైన పోటీ మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఎఫ్ఎల్వో చైర్పర్సన్ కామిని షరాఫ్ అనుసంధానకర్తగా వ్యవహరించగా, పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
ఇంతకీ టీడీపీ మోదీ ప్రభుత్వంలోనే ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : ఓవైపు హోదాను కేంద్రం వద్ద తాకట్టుపెట్టిన తెలుగుదేశం పార్టీ.. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చే ధైర్యం చేయలేకపోతోంది. మరోవైపు నేటి సభలో గందరగోళం సృష్టించి మొక్కుబడిగా ఏదో చేస్తున్నామనే హడావుడిని సృష్టిస్తోంది. బీజేపీ మాత్రం ఈ వ్యవహారంపై ఎటూ తేల్చలేకపోతోంది. అయితే ఈ పరిణామాలపై ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ‘లోక్‌సభలో ఊహించని సన్నివేశాలు కనిపించాయి. సభను అర్థాంతరంగా వాయిదా పడింది. అసలేం జరుగుతోంది? టీడీపీ.. మోదీ ప్రభుత్వంలో భాగస్వామి అవునా? కాదా?’’ అంటూ ట్విటర్లో ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఓ వైపు నిరసనలంటూనే.. మరోవైపు కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావటం టీడీపీ ద్వంద్వ వైఖరిని తేటతెల్లం చేస్తోంది. Crazy scenes in Lok Sabha: TDP MPs, part of ruling alliance, disrupt the house over AP special status. Force adjournment. Isn't TDP part of the Modi Govt? What the hell is going on here? — Rajdeep Sardesai (@sardesairajdeep) 6 February 2018 -
బ్రేకింగ్ న్యూస్ బిజినెస్ న్యూస్‌గా మారాయి
-
బ్రేకింగ్ న్యూస్ బిజినెస్ న్యూస్‌గా మారాయి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పలు ప్రధాన న్యూస్‌చానల్స్‌లో ప్రసారమవుతున్న బ్రేకింగ్ న్యూస్.. బిజినెస్ న్యూస్‌గా మారాయని, జర్నలిస్టులు బిజినెస్ ట్రేడర్స్‌గా మారారని సీనియర్ జర్నలిస్ట్, ఇండియాటుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నా రు. ఆదివారం బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్స్కూల్లో లిటరరీ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘మీడియా ఇన్ ది ఏజ్ ఆఫ్ బ్రేకింగ్ న్యూస్’అన్న అంశంపై జరిగిన సదస్సులో రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రసంగించారు. దేశంలో ప్రస్తుతం 397 న్యూస్, కరెంట్ అఫైర్స్ చానల్స్ ఉన్నాయని.. ఇవన్నీ రాజకీయ నాయకులు, పార్టీ లు, బిల్డర్ల చేతిలోనే ఉన్నాయని, వీరంతా తమ వాణిజ్య, రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం చానల్స్ నడుపుతున్నారన్నారు. క్రమేణా నైతిక విలువలు కనుమరుగవుతుండటంతో ప్రస్తుతం మీడియా విశ్వసనీయత కోల్పోతోందన్నారు. తెలుగు రాష్ట్రా ల్లోని 25 ప్రధాన న్యూస్ చానల్స్ రాజకీయ పార్టీల చేతిలోనే ఉన్నాయని గుర్తుచేశారు. పలు ప్రధాన చానల్స్‌లో ప్రసారమవుతున్న వార్తల్లో వాస్తవికత ఉండట్లేదని, టీవీ స్టూడియోల్లో అర్థవంతమైన చర్చలకు బదులు అనవసర వివాదాలు జరుగుతూండటం దురదృష్టకరమన్నారు. సోషల్ మీడియాలో స్వేచ్ఛ అపరిమితమని.. కానీ బాధ్యత శూన్యంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు స్వేచ్ఛా గొంతుక వినిపించేందుకు బెటర్ మీడియా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ న్యూస్ కాపిటల్స్‌గా మారాయన్నారు. -
జీవా పుట్టిన విషయం రైనాకే తెలుసు..
సాక్షి, న్యూఢిల్లీ: భారత సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని 2015 ప్రపంచకప్‌కు ముందే తండ్రైన విషయం తెలిసిందే. అయితే కూతురు జీవా పుట్టిన విషయం ధోనికి బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా ద్వారా తెలిసిందంటా.. రాజ్‌దీప్ సర్దేశాయ్ రాసిన ‘డెమోక్రసీ ఎలెవన్: ది గ్రేట్ ఇండియన్స్ క్రికెట్ హిస్టరీ’ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా జీవా పుట్టిన శుభావార్తను రైనా ద్వారా ధోనికి తెలియజేసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని పుస్తక పబ్లిషర్ జగ్గర్నాట్ బుక్స్ ‘ 2015 ప్రపంచకప్‌లో ధోని తండ్రైన విషయాన్ని సాక్షి.. ధోని మొబైల్ తీసుకెళ్లకపోవడంతో, రైనా మొబైల్ ద్వారా తెలియజేసింది’. అని ట్వీట్ చేసింది. When @msdhoni becm a father arnd 2015 World Cup, he wasn’t carryg a mobile. His wife sent an SMS thru @ImRaina to inform him! #RajdeepsBook — Juggernaut Books (@juggernautbooks) 20 October 2017 ధోని భార్య సాక్షి ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో జీవాకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ధోని పూర్తిగా ప్రపంచకప్‌పై ధృష్టి సారించాడు. అప్పటికే టీమిండియా ఆస్ట్రేలియాలో వార్మప్ మ్యాచ్‌లు ఆడుతోంది. బిడ్డ పుట్టిన విషయం తెలిసినా కూడా ధోని రాలేని పరిస్థితి. అప్పట్లో ఈ విషయంపై ధోనిని ప్రశ్నిస్తే.. కూతురు పుట్టిందని తెలిసింది. తల్లి బిడ్డ క్లేమంగా ఉన్నారు. దేశం కోసం పనిచేస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వేచి ఉండక తప్పదు. ఎందుకంటే ప్రపంచకప్ చాలా ముఖ్యమైనదని పేర్కొన్నాడు. ఇక ఈ టోర్నిలో భారత్ సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి నిష్క్రమించిన విషయం తెలిసిందే. -
దాదాకు బాగా కోపమొచ్చింది
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొంత కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ ఛానెల్ ఇండియా టుడే ‘టూ ది పాయింట్’ కార్యక్రమం కోసం సీనియర్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ దాదాను ఇంటర్వ్యూ చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంభాషణ బయటకు వచ్చింది. ఇంటర్వ్యూలో భాగంగా ఓ ప్రశ్నకు ప్రణబ్ సమాధానం చెప్పబోతుంటే.. మధ్యలో రాజ్‌దీప్ కలగజేసుకుని ఏదో అడగాలని యత్నించారు. దీంతో సహనం కోల్పోయిన ప్రణబ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ‘ మాట్లాడేటప్పుడు మధ్యలో కలగజేసుకునే అలవాటు నీకు మంచిది కాదు. ముందు నన్ను పూర్తి చెయ్యనివ్వు. నీ ముందుంది ఓ మాజీ రాష్ట్రపతి అని గుర్తుంచుకుని ప్రవర్తించు. నేను మాట్లాడేటప్పుడు విను. నా సమాధానం పూర్తయ్యాకే మరో ప్రశ్న అడుగు. నేనేం టీవీల్లో కనిపించేందుకు ఆత్రుతతో రాలేదు. మీరు పిలిస్తేనే వచ్చా’ అంటూ ప్రణబ్ మందలించాడు. అయితే చివర్లో ఇంటర్వ్యూ అయ్యాక తాను చేసిన కఠువు వ్యాఖ్యలపై ప్రణబ్ క్షమాపణలు చెప్పబోతుండగా.. వాటిని సానుకూలంగానే తీసుకున్నట్లు రాజ్‌దీప్ చెప్పటం కొసమెరుపు. మాములుగా అయితే ఇలాంటి వీడియోలు ఎడిటింగ్‌లో లేపేయటం జరుగుతుంటుంది. కానీ, రాజ్‌దీప్‌కు అలా చెయ్యటం ఎంత మాత్రం ఇష్టం లేదంట. అందుకు ఆ సంభాషణను యథాతథంగా ఉంచేశారు. అయితే రాజ్‌దీప్‌ను ఏకేసిన ప్రణబ్ అంటూ... దీనిని కొందరు మరోలా వైరల్ చెయటం సీనియర్ జర్నలిస్ట్‌కు చికాకు తెప్పించింది. అంతే వెంటనే మరో ట్వీట్ చేశారు. ‘మేం(జర్నలిస్టులు) బొద్దింకల్లాంటి వాళ్లం. సెలబ్రిటీలు సీతాకోకచిలుకలాంటోళ్లు. మర్యాదగా నడుచుకోవటం మేం వారి దగ్గరి నుంచే నేర్చుకుంటాం. అందుకే మేం వారిని గౌరవిస్తాం అంటూ ఓ ట్వీట్లో తెలిపారు. అయినా ఆ ట్రోలింగ్ ఆపకపోవటంతో కాస్త చికాకుగా ఇక తర్వాతి ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తే మంచిందంటూ ఆ ఎపిసోడ్‌కు పుల్ స్టాప్ పెట్టేశారు. Journalists are cockroaches my friend. VVIPs are butterflies who teach us manners when we question them. I respect their greater intellect. https://t.co/7jF4mABoTz — Rajdeep Sardesai (@sardesairajdeep) 14 October 2017 -
ఈ క్రికెటర్ ను గుర్తు పట్టగలరా?
న్యూఢిల్లీ: టీమిండియాలో ఆపద్భాంధవుడి పాత్ర పోషించిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా? నిలకడకు నిర్వచనంగా, ప్రొఫెషనలిజంకు పర్యాయపదంగా అతడు క్రికెట్ చరిత్రలో ప్రసిద్ధికెక్కాడు. జట్టు ఓటమి ముందు నిలబడిన ప్రతిసారి అడ్డుగోడలా నిలబడి నిబ్బరంగా ఆడేవాడు. తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకుంటూ ‘మిస్టర్ డిపెండబుల్’ ప్లేయర్ గా ప్రఖ్యాతిగాంచాడు. అతడెవరో కాదు రాహుల్ ద్రవిడ్. ఫొటోలోని చిన్నారి అతడే. ద్రవిడ్ చిన్నప్పటి ఫొటో ఇది. ఈ రోజు ద్రవిడ్ 43 పుట్టినరోజు. ఎంతో మంది అభిమానులు, ప్రముఖులు, క్రికెటర్లు అతడికి సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ద్రవిడ్ ఆటను, అతడి వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు, ఫొటోలు పెట్టారు. క్రికెటోపియా పోస్టు చేసిన ద్రవిడ్ చిన్ననాటి ఫొటోను ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ రీట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తన ఆటతీరుతో ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ల సరసన స్థానం సంపాదించుకున్న దవ్రిడ్ రిటైర్మెంట్ తర్వాత కూడా కోచ్ గా క్రికెట్ కు సేవలు అందిస్తున్నాడు. -
ఈ జర్నలిస్టు.. ఉగ్రవాద నిందితుడట!!
రాజ్‌దీప్ సర్దేశాయ్ పేరు తెలియని భారతీయులు చాలా తక్కువ మంది. ఎన్నికలతో పాటు దేశంలో ప్రధాన రాజకీయ పరిణామాలు ఎప్పుడు చోటుచేసుకున్నా తనదైన శైలిలో జాతీయ మీడియా చానళ్లలో విశ్లేషణలు అందిస్తుంటారు. అలాంటి వ్యక్తి ఫొటోను ఒడిషాకు చెందిన ఒక వార్తాపత్రిక తన మొదటి పేజీలో ప్రచురించింది. ఆయన ఏదో పెద్ద పాత్రికేయుడని ఆ ఫొటో వేస్తే పర్వాలేదు.. ఉగ్రవాద కేసులో నిందితుడు ఈయనే అంటూ ఆ ఫొటోను ఫొటోషాప్‌లో కొద్దిగా మార్పుచేర్పులు చేసి ప్రచురించింది. దాంతో.. సర్దేశాయ్ తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. సంబద్ అనే ఒడియా పత్రిక తన ఫొటోను స్కెచ్ గా మార్చి ప్రచురించిందని, ట్విట్టర్లో ఎవరో ఏదో చెబితే దాన్ని పట్టుకుని ఇలా వేసేశారని ఆయన ట్వీట్ చేశారు. ఫొటోషాప్ చేసిన ఫొటోలు, అబద్ధాలు, తప్పుడు రిపోర్టింగ్.. వీటితో ఇంకెంత కాలం ఈ భక్తుల సైన్యం ట్విట్టర్లో తనవెంట పడతారని ఆయన ప్రశ్నించారు. దాంతో సంబద్ పత్రిక ఎడిటర్ ట్విట్టర్ ద్వారా సర్దేశాయ్‌కి క్షమాపణలు తెలిపారు. అయినా ఆయన శాంతించలేదు. క్షమాపణలను అంగీకరిస్తాను గానీ, తప్పు చేసిన విషయాన్ని పత్రిక మొదటిపేజీలో తన ఫొటోతో మళ్లీ ప్రచురించాలని డిమాండ్ చేశారు. ఆయన చెప్పినట్లే మొదటిపేజీలో ఆయన ఫొటోతో సహా క్షమాపణ వార్తను బాక్సు కట్టి మరీ ప్రచురించారు. దాన్ని కూడా రాజ్‌దీప్ మళ్లీ ట్వీట్ చేసి చెప్పారు. గతంలో రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్విట్టర్ అకౌంటును కొంతమంది హ్యాక్ చేశారు. దాన్నుంచి అసభ్యకర సందేశాలు పంపారు. దాంతో కొన్నాళ్ల పాటు ఆయన తన ట్విట్టర్ ఖాతాను ఆపేశారు. Just saw a Odhiya newspaper Sambad puts up my sketch as a terror suspect based on RW Twitter gang mischief.If not war, these guys will kill! — Rajdeep Sardesai (@sardesairajdeep) 23 September 2016 Photo shopped pics,lies,fake reporting, abuse: what next will this bhakt army stoop to on Twitter? And who will call their diabolical bluff? — Rajdeep Sardesai (@sardesairajdeep) 23 September 2016 @sambad_odisha is this journalism? U should be ashamed to put up photo shopped pics as news — Rajdeep Sardesai (@sardesairajdeep) 23 September 2016 @sardesairajdeep Sir, we sincerely apologise for this grave error on our part. — Sambad (@sambad_odisha) 23 September 2016 Apology accepted but expect it with the same prominence on your front page Tomw. And start a refresher course. https://t.co/Z7IAqbUE4a — Rajdeep Sardesai (@sardesairajdeep) 23 September 2016 Appreciate unreserved apology from editor @sambad_odisha on front page. Lesson for all of us to be more careful. pic.twitter.com/QPF6sWB976 — Rajdeep Sardesai (@sardesairajdeep) 24 September 2016 -
సాక్షి అవార్డులు గౌరవానికే గౌరవం
న్యూఢిల్లీ: సియాచిన్‌లో ప్రాణాలు అర్పించిన వీర జవాను ముస్తాక్ అహ్మద్ ధైర్యసాహసాలు గుర్తించి సాక్షి మీడియా గ్రూప్ అవార్డు ఇవ్వడం గౌరవానికే గౌరవం ఇవ్వడంలాంటిదని ప్రముఖ జర్నలిస్టు.. టీవీ వ్యాఖ్యాత రాజ్ దీప్ సర్దేశాయ్ అన్నారు. ప్రతిభకు పట్టం కడుతూ వరుసగా రెండో ఏడాది సాక్షి ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేసింది. ఆదివారం అతిరథ మహారథుల మధ్య హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ పురస్కారాల ప్రదానోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా పాల్గొన్నారు. సియాచిన్‌లో ప్రాణాలొదిన సిపాయి ముస్తాక్ అహ్మద్‌కు ప్రకటించిన జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డును ఆయన భార్య నసీమున్కు సర్దేశాయ్ అందించారు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్న సర్దేశాయ్ వీర జవాను ముస్తాక్ అహ్మద్ భార్యకు సాక్షి అవార్డు అందించడంపట్ల ముగ్దుడయ్యారు. హైదరాబాద్‌లో చక్కటి సాయంత్రం వేళ నిజమైన తెలుగు హీరోల మధ్య గౌరవానికి గౌరవం దక్కిందని చెప్పారు. ఇందరు తెలుగువాళ్ల మధ్య వేదికపై తానొక్కడినే తెలుగేతరుడినని ఆయన అన్నారు. ముస్తాక్‌కు అవార్డు ప్రకటించిన సాక్షి మీడియా గ్రూప్ ను ప్రశంసించారు. Honoured for the honour of presenting Sakshi award for bravery to Widow of Mushtaq Ahmed, martyred at Siachen. pic.twitter.com/DwspvNK2jx — Rajdeep Sardesai (@sardesairajdeep) 24 April 2016 Honoured to be honoured in Hyderabad at a spl evening celebrating real Telugu heroes.As only non Telugu on stage! pic.twitter.com/uXTENfQVdF — Rajdeep Sardesai (@sardesairajdeep) 24 April 2016 -
ప్రసాదంలాంటిది సాక్షి అవార్డు
► సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన వేడుకలో జీవిత సాఫల్య పురస్కార గ్రహీత కె.విశ్వనాథ్ ► కనులపండువగా అవార్డుల ప్రదానోత్సవం.. హాజరైన అతిరథులు ► తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి.. బెస్ట్ లిరిసిస్ట్‌గా సిరివెన్నెల ► తెలుగు ఎన్నారై ఆఫ్ ద ఇయర్‌గా బాల థెరిస్సా సింగరెడ్డి.. మోస్ట్ పాపులర్ యాక్టర్‌గా మహేశ్‌బాబు సాక్షి, హైదరాబాద్: సమాజంలోని జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులు, సంస్థలను ‘సాక్షి’ సమున్నతంగా గౌరవించింది. ప్రతిభకు పట్టం కడుతూ వరుసగా రెండో ఏడాది ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డులను ప్రదానం చేసింది. ఆదివారం అతిరథ మహారథుల మధ్య హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ పురస్కారాల ప్రదానోత్సవం కన్నులపండువగా జరిగింది. కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్‌ను జీవిత సాఫల్య పురస్కారం వరించింది. సినీ దర్శకుడు దాసరి నారాయణ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్, సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్లో ఎన్నో అవార్డులు వచ్చాయి. మనకు లడ్డూలు ఎన్నో ఉంటాయి. అయితే తిరుపతి లడ్డూ ఆ దేవుడి ప్రసాదం. ఎంతో ప్రత్యేకం. ఈ అవార్డు కూడా నాకు అలాంటిదే..’’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. ఇక మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నటుడు మహేశ్‌బాబు(శ్రీమంతుడు), తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి, తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్‌గా బాల థెరిస్సా సింగరెడ్డి, యంగ్ అచీవర్ స్పోర్ట్స్(ఫిమేల్) జ్యోతి సురేఖ, యంగ్ అచీవర్ స్పోర్ట్స్(మేల్) శ్రీకాంత్ , మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిలను అవార్డులు వరించాయి. అత్యంత వైభవంగా సాగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్, దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు, సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతి, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం అభినందనీయం: కె.విశ్వనాథ్ జీవన సాఫల్య పురస్కారం అందుకున్న అనంతరం కె.విశ్వనాథ్ మాట్లాడుతూ.. సాక్షి ఎంపికలో వైవిధ్యం ఉందని కొనియాడారు. సియాచిన్ సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన ఓ సైనికుడి సేవలను గుర్తిస్తూ ఆయన భార్య, బిడ్డలకు ‘సాక్షి’ అవార్డు ఇవ్వడం తన హృదయాన్ని కదలించిందన్నారు. అలాంటి వీరులతో పాటు వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి సాక్షి చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమం అభినందనీయమన్నారు. అలాంటివారి మధ్య పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. విశ్వనాథ్‌కు సాక్షి చేస్తున్న ఈ సత్కారం సినీపరిశ్రమకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.అవార్డులు వీరికే మెడ్‌ప్లస్ మెడికల్ షాప్‌లను వేలల్లో విస్తరించిన వ్యాపారవేత్త డాక్టర్ మధుకర్ గంగడికి ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్(లార్జ్)’ దక్కింది. అంధుడైన చక్కని చిట్కాలతో డిస్పోజబుల్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో దూసుకెళుతున్న బొల్లా శ్రీకాంత్ (బొల్లాంట్ ఇండస్ట్రీస్)ను ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్(స్మాల్/మీడియం) అవార్డు వరించింది. విద్యారంగంలో ఉత్తమ సేవలందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు ఎడ్యుకేషన్ ఇన్ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. లక్షల్లో కుటుంబ నియంత్రణ అపరేషన్లు చేసిన డాక్టర్ మదసి వెంకయ్యకు ఎక్సలెన్సీ ఇన్ హెల్త్‌కేర్ అవార్డు దక్కింది. ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌కు యంగ్ అచీవర్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు లభించింది. సియాచిన్‌లో ప్రాణాలొదిన సిపాయి ముస్తాక్ అహ్మద్‌కు ప్రకటించిన జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డును ఆయన భార్య నసీమున్ అందుకున్నారు. తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్‌గా అవార్డు గెల్చుకున్న బాల థెరిస్సా సింగరెడ్డి తరఫున శౌరిరెడ్డి పురస్కారాన్ని స్వీకరించారు. సేంద్రియ సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్న మహిళా రైతు ఎం.వినోదకు ఎక్సలెన్సీ ఇన్ ఫామింగ్ అవార్డు దక్కింది. ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’కు ఎక్సలెన్సీ ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డు, యంగ్ అచీవర్-సోషల్ సర్వీసు అవార్డు సోనీవుడ్‌ను వరించాయి. ఫోర్మ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున పద్మనాభరెడ్డి.. ప్రముఖ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, అవార్డుల జ్యూరీ చైర్పర్సన్ శాంతా సిన్హా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.పాపులర్ విభాగంలో వీరికే.. మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ది ఇయర్‌గా ‘శ్రీమంతుడు’ నిలిచింది. దర్శకుడు కొరటాల శివ, రవిశంకర్, సినీ నటుడు మహేశ్‌బాబు... రాజ్‌దీప్ సర్దేశాయ్, దాసరి నారాయణ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మహేశ్‌బాబు సినీ నటి జయప్రద, వైఎస్ భారతి చేతుల మీదుగా అందుకున్నారు. మోస్ట్ పాపులర్ హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ (పండుగ చేస్కో), మోస్ట్ పాపులర్ డెరైక్టర్‌గా గుణశేఖర్(రుద్రమదేవి), మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డెరైక్టర్‌గా దేశీ శ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు, సన్నాఫ్ సత్యమూర్తి, కుమార్ 21ఎఫ్), పాపులర్ సింగర్‌గా సత్య యామిని, పాపులర్ సింగర్(మేల్)గా కారుణ్య అవార్డులు అందుకున్నారు. జ్యూరీ స్పెషల్ అవార్డు-బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్‌గా కంచె సినిమా అవార్డు దక్కించుకుంది. మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డెరైక్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును దేవీ శ్రీ ప్రసాద్ తరఫున సుకుమార్ అందుకున్నారు. వీరికి రాజ్‌దీప్ సర్దేశాయ్, దాసరి నారాయణ, జయప్రద, ఆర్పీ పట్నాయక్, గుణశేఖర్, క్రిష్ తదితరులు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, సెల్కాన్ కంపెనీ ఎండీ గురుస్వామి నాయుడు, సీఐఐ ప్రెసిడెంట్ వనిత దాట్ల, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి, మార్కెటింగ్ డెరైక్టర్ కేఆర్పీ రెడ్డి, కమ్యూనికేషన్ డెరైక్టర్ రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.గొప్పగా గౌరవిస్తోంది: రాజ్‌దీప్ తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులను గుర్తించి సాక్షి అవార్డులు ఇచ్చి ఎంతో గొప్పగా గౌరవిస్తోందని రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నారు. సాక్షి చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమంటూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. చాలా చాలా ఆనందం... శ్రీమంతుడు సినిమా నా జీవితంలోనే బెస్ట్ టర్నింగ్ పాయింట్. సాక్షి మీడియా గ్రూప్ ద్వారా వరుసగా రెండోసారి మోస్ట్ పాపులర్ మేల్ ఆర్టిస్ట్ అవార్డు అందుకోవడం నిజంగా చాలా చాలా ఆనందం కలిగిస్తోంది. - హీరో మహేశ్‌బాబు ఈ అవార్డు తిరుపతి లడ్డూ లాంటిది... న్యాయస్థానాల్లో నిజం చెప్పమని అడుగుతూ భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. ఇక్కడ ఆ అవసరం లేకపోయినా, నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి మనస్ఫూర్తిగా చెబుతున్నాను... ఇక్కడకు వచ్చి, ఇక్కడ అవార్డులు అందుకున్న కొందరి ప్రొఫైల్స్ చూశాక... నేను సాధించింది చాలా తక్కువ అని నేను చాలా చిన్నవాడ్ని అని భావిస్తున్నాను. మనకు లడ్డూలు ఎన్నో ఉంటాయి. అయితే తిరుపతి లడ్డూ ఆ దేవుడి ప్రసాదం. ఎంతో ప్రత్యేకం. ఈ అవార్డు కూడా నాకు అలాంటిదే. - కళాతపస్వి కె.విశ్వనాథ్ ప్రభుత్వ అవార్డుల కన్నా మిన్న విభిన్న రంగాల నుంచి సేవ చేసిన వారిని ఎంపిక చేసి సాక్షి మీడియా అవార్డులు ఇచ్చి సత్కరించడం గొప్ప విషయం. మీడియా అవార్డులు ప్రభుత్వ అవార్డుల కన్నా గొప్పవి అంటాన్నేను. కళాతపస్వి దర్శకులు కె.విశ్వనాధ్‌కి లైఫ్‌టైమ్ ఎఛీవ్మెంట్ అవార్డ్ అందించడం నాకెంతో ఆనందం కలిగిస్తోంది. ఆయన సినిమాలు వేటికవే ఆణిముత్యాలు. ఆయన తీసిన సిరిమువ్వల సింహనాదం అనే ఒక్క సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు. అది చాలా గొప్ప సినిమా. బహుశా దాన్ని నేనే విడుదల చేస్తానేమో - సినీ దర్శకుడు దాసరి నారాయణరావు సినిమా గౌరవాన్ని పెంచిన దర్శకుడు సినీరంగం అంటే కొందరికి చిన్న చూపు. అయితే అలాంటివారు కూడా గౌరవం ప్రకటించక తప్పని గొప్ప సినిమాలను తీసిన దర్శకుడు కె.విశ్వనాధ్. అలాంటి కళాతపస్విని సాక్షి మీడియా సత్కరించడం ఎంతైనా సముచితం. ఆయన సినిమా ద్వారా పుట్టిన రచయితగా ఈ వేడుకలో పాలు పంచుకోవడం నాకెంతో ఆనందాన్ని అందిస్తోంది. ఇదే కార్యక్రమంలో నాకు కూడా అత్యధిక ప్రజాదరణ పొందిన సినీ రచయిత పురస్కారం అందించినందుకు సాక్షికి, కంచె సినిమాలో ఆ పాట రాసే అవకాశం ఇచ్చిన సినిమా రూపకర్తలకు కృతజ్ఞతలు. - సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు వారి ఆదరణకు చిహ్నం సన్ను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. నేను సాధించింది చాలా తక్కువే అయినా... ఇలాంటి అరుదైన పురస్కారాలతో నన్ను అభిమానిస్తున్నారు. ఈ అవార్డు తెలుగు ప్రేక్షకుల నన్ను ఆదరిస్తున్న తీరుకు మరో నిదర్శనం.- సినీ తార రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నత ప్రమాణాల సాక్షి... మీడియా గ్రూప్‌గా ఉన్నత ప్రమాణాలు పాటించే సాక్షి నుంచి అవార్డు అందుకోవడం సంతృప్తిని అందించింది. - సినీ దర్శకుడు గుణశేఖర్ స్పెషల్ థ్యాంక్స్ టు సాక్షి వ్యక్తిగతంగా మంచి సక్సెస్‌ని అందించిన సినిమా శ్రీమంతుడు. దానికే సాక్షి ద్వారా మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకోవడం ఆనందంగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు సాక్షి. - సినీ దర్శకుడు కొరటాల శివ వెరీ హ్యాపీ మంచి పాట పాడే అవకాశాన్ని అందించిన బాహుబలి సినిమా దర్శకులు, సంగీత దర్శకులకు కృతజ్ఞతలు. ఈ అవార్డు వచ్చినందుకు వెరీ హ్యాపీ. - గాయని సత్య యామిని ఈ వేదిక ఎంతో గొప్పది.. అవార్డు వస్తే జనం వై అనకూడదు. వైనాట్ అనాలి. గమ్యం నుంచి అలాంటి సినిమాలే తీస్తూ వస్తున్నాను. ఇక్కడ అవార్డు అందుకుంటున్న వారిని చూశాక... ఈ వేదిక నాకు చాలా గొప్పదిగా అనిపిస్తోంది. ఇలాంటి వేదిక మీద నేను కూడా అవార్డు తీసుకోవడం చాలా ఆనందం కలిగించింది. - సినీ దర్శకుడు క్రిష్ అమ్మ పాట తెచ్చిన అవార్డు... నాకు మనసుకు బాగా నచ్చిన పాట ద్వారా ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. నాకు జన్మనిచ్చి, తద్వారా ఈ పాటకి జన్మనిచ్చిన అమ్మకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. - సినీ గాయకుడు కారుణ్య ఆయన ఫొటో పక్కనే పెట్టుకుంటా... నా భర్త దేశం కోసం ప్రాణాలర్పించారు. ఆయన లేకపోయినా, ఆయన త్యాగాన్ని గుర్తించి సాక్షి గ్రూప్ ఈ అవార్డు అందించడం ద్వారా నా భర్తను మరోసారి గౌరవించింది. ఇంటికి వెళ్లాక సాక్షి పురస్కారాన్ని నా భర్త ఫొటో పక్కనే పెట్టుకుంటా. - నసీమున్, అమర జవాను ముస్తాక్ అహ్మద్ భార్య మీడియా చేసిన తొలి సత్కారమిది క్రీడాకారిణిగా ఎన్నో అవార్డులు అందుకున్నాను. అయితే ప్రతిభావంతురాలైన విద్యార్ధినిగా, అదీ ఒక ప్రతిష్టాత్మక మీడియా గ్రూప్ నుంచి ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు అందుకోవడం చాలా తృప్తినిచ్చింది. ఎన్ని అవార్డులు వచ్చినా ఇది నాకెంతో ప్రత్యేకం. -నైనా జైస్వాల్ వైఫల్యాలపై పోరాడే శక్తిని ఇచ్చింది జీవితంలో సామాజిక సేవ పరంగా ఎన్నో ఆశయాలున్నా, ఏమీ సాధించలేదని, నిస్పృహ చెందుతూ, అన్నింటా ఫెయిల్యూర్ అని బాధపడుతున్న నాకు సాక్షి అవార్డు కొత్త ఉత్సాహాన్ని అందించింది. సాక్షి దినపత్రిక అభిమాని అయిన నా భార్య ఈ పోటీకి దరఖాస్తు చేయమని ప్రోత్సహించింది. నేను చేసిన సామాజిక సేవకు వచ్చిన ఈ గుర్తింపు స్ఫూర్తిగా ముందడుగు వేస్తాను. - సోనీ వుడ్, సామాజికవేత్త మీడియా సంస్థ నుంచి తొలి అవార్డు ఇది ఒక మీడియా సంస్థ నుంచి నేను స్వీకరిస్తున్న తొలి అవార్డ్. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో జరిగే వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలలో వ్యక్తిగత మెడల్ సాధించాలనేదే లక్ష్యం. ఈ లక్ష్యసాధనకు ఇలాంటి పురస్కారాలు ప్రోత్సాహాన్నిస్తాయి. - జ్యోతి సురేఖ, క్రీడాకారిణి సేవా హృదయాల కోసం డబ్బుండటం కాదు, సేవా హృదయం ఉండడం ముఖ్యం. అనంతపురంలో ప్రారంభించిన మా సేవాకార్యక్రమాలకు మరింత మంది ఊతంగా నిలవాలి. అందుకు ఇలాంటి పురస్కారాలు ఉపకరిస్తాయి. - మాచో ఫై, సామాజికవేత్త మంచికి ప్రోత్సాహమిది బాల థెరిసా కొన్నేళ్లుగా 6 వేల గ్రామాల్లో సేవ చేస్తున్నారు. ఆమె తరపున ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. సమాజంలో మంచి అనేదే కొద్దిగా ఉంది. ఉన్న కొంచెం మంచిని ప్రోత్సహించడం మరీ కొరతగా ఉంది. అలాంటి ప్రోత్సాహం అందిస్తున్న సాక్షికి కృతజ్ఞతలు. -శౌరి రెడ్డి శాస్త్రవేత్తలందరికీ... అత్యాధునిక క్షిపణి సామర్థ్యం కలిగిన టాప్ 7 దేశాల్లో మన భారత్ ఒకటి. అందుకు హైదరాబాద్‌లోని తయారీ సంస్థలే ప్రధాన కారణం. నాకు లభించిన ఈ అవార్డ్‌ను ఈ రక్షణ రంగంలో పనిచేసిన శాస్త్రవేత్తలకు ఇచ్చినట్టుగా భావిస్తున్నా. - సతీశ్‌రెడ్డి, ప్రధాని రక్షణ సలహాదారు లక్ష్యసాధనలో స్ఫూర్తి... రాజకీయాల్లోకి నీతివంతులు, నేరచరిత్ర లేనివారు, మంచి వారు రావాలని, ప్రభుత్వ శాఖలు సమర్ధవంతంగా పనిచేయాలని మా సంస్థ కృషి చేస్తోంది. దీని కోసం ఎన్నో చర్యలు చేపట్టింది. ఇంకా ఎన్నో చేయాలి. లక్ష్యసాధనలో మాకు ఈ అవార్డు స్ఫూర్తి. -పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆనందంగా అనిపిస్తోంది నాణ్యమైన ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు అనేది మా నినాదం. మన దేశ జనాభాలో ఇప్పటికీ 70శాతం గ్రామాల్లోనే ఉంది. వీరికి మంచి వైద్యం అందేందుకు కృషి చేస్తున్నాం. మా కృషిని సాక్షి గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఈ స్ఫూర్తితో మరింత పట్టుదలగా పనిచేస్తాం.- డాక్టర్ మాదాసి వెంకయ్య మహిళా రైతులకు గుర్తింపు వ్యవసాయం చేసే మహిళలకు ప్రోత్సాహం కావాలి. అందరి ఆరోగ్యానికి మేలు చేసేలా, ప్రకృతి సహజమైన, సేంద్రియ సాగుకు కట్టుబడి ఉన్న మాకు సాక్షి ఇచ్చిన ఈ అవార్డు ఎంతో శక్తిని అందించింది. -వినోద, ఆదర్శ రైతు థ్యాంక్స్ టు సాక్షి గత పదేళ్లుగా మెడికల్ స్టోర్స్ నిర్వహణలో ఉన్నాం. నకిలీ మందుల విజృంభణకు విరుగుడుగా, మంచి, నాణ్యమైన మందులు అందుబాటు ధరలలో అందిస్తున్నాం. ప్రస్తుతం 12 రాష్ట్రాలకు విస్తరించిన మా సంస్థను గుర్తించి అవార్డ్‌ని అందించినందుకు థ్యాంక్స్ టు సాక్షి -గంగాడి మధుకర్, వ్యాపారవేత్త వినూత్నంగా ఉండాలనుకున్నా ఒక వయసు రాగానే ప్రభుత్వోగం, పెళి...్ల మన దేశంలో పేరెంట్స్ ఐడియాలజీ అలా ఉంటుంది. అయితే నాకంటూ ఒక ప్రత్యేకత సాధించాలనుకున్నాను. ఎంచుకున్న రంగంలో నాదైన ముద్ర వేయాలనుకున్నాను. నా సక్సెస్‌కు సాక్షి ఇచ్చిన గుర్తింపు ఆనందాన్నిచ్చింది. -శ్రీకాంత్, అంధ వ్యాపారవేత్త -
సామాన్యులకు షాకిచ్చి.. వీఐపీల సేవలో ఎయిరిండియా!
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంస్థ అయిన ఎయిరిండియా వీఐపీల సేవలో మునిగిపోవడం వల్ల సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. షెడ్యూల్ ప్రకారం వెళ్లాల్సిన విమానాన్ని వదిలేసి.. మధ్యప్రదేశ్ మంత్రి, ఇద్దరు న్యాయమూర్తులు ఎక్కిన విమానాన్ని నడిపేందుకు ఎయిరిండియా ప్రాధాన్యమివ్వడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి రాత్రి 7.30 గంటలకు భువనేశ్వర్‌కు ఎయిరిండియా విమానం బయలుదేరాల్సి ఉంది. అయితే, ఈ విమానాన్ని పక్కనబెట్టి, భోపాల్‌కు వెళ్లే విమానాన్ని ముందు నడుపాల్సిందిగా ఎయిరిండియా తన పైలట్లకు చెప్పినట్టు తెలిసింది. భోపాల్ విమానంలో బీజేపీ మంత్రి సర్తాజ్ సింగ్‌తోపాటు ఇద్దరు న్యాయమూర్తులు ప్రయాణించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో భువనేశ్వర్‌కు వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా తెల్లవారుజామున 2.30 గంటలకు బయలుదేరింది. తీవ్ర అవస్థలు పడిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికుల్లో ఒడిశా ఎంపీ తథాగత్ సత్పథీ, సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ఉన్నారు. ప్రయాణికుల ఆందోళన కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్న హైడ్రామాను వారు ట్విట్టర్లో ఎప్పకటిప్పుడు పంచుకున్నారు. మధ్యప్రదేశ్ మంత్రి, ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారన్నకారణంతోనే భోపాల్ విమానాన్ని ముందు నడిపంచాలని నిర్ణయించారని తెలుస్తోందని సర్దేశాయ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎయిరిండియా తీరును తప్పుబడుతూ బీజేపీ ఎంపీ తథాగత్ ప్రయాణికులతో కలిసి ఆందోళన చేపట్టారు. -
లలిత్ మోదీ ఎందుకు ఎదురు తిరిగారు?
న్యూఢిల్లీ: ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ లలిత్ మోదీ బ్రిటన్ ఇమిగ్రేషన్ వీసా కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె పీకలోతువరకు ఇరుక్కుపోయారు. తన ఇమిగ్రేషన్ వీసాకు సిఫారసు చేసింది వసుంధర రాజె అని ముందుగా వెల్లడించిన లలిత్ మోదీ 2012, 2013లలో తన బార్య మినాల్‌ను పోర్చుగల్ కేన్సర్ ఆస్పత్రికి వసుంధర రాజెనే స్వయంగా తీసుకెళ్లారని కొత్తగా బయటపెట్టారు. ఈ విషయాన్ని ఆయన మాంటెనిగ్రోలో ‘ఇండియా టుడే టీవీ’ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అందుకేనేమో ఈ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను వెనకేసుకొస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వం వసుంధర గురించి మాట్లాడడం లేదు. 30 ఏళ్ల నుంచి వసుంధర రాజె తనకు ఫ్యామిలీ ఫ్రెండని, తన భార్యకు అత్యంత సన్నిహితురాలని చెబుతున్న మోదీ, హఠాత్తుగా వసుంధర రాజె కు ఎందుకు ఎదురు తిరిగారు? తన ఎదుగుదలకు ఆమె కారణమని చెబుతూ వచ్చి, అందుకు ప్రతిఫలంగా(క్విడ్ ప్రోకో) ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్‌కు చెందిన ‘నియంత్ హెరిటేజ్ హోటల్ ప్రవేట్ లిమిటెడ్ కంపెనీలో పది రూపాయల షేరును ఏకంగా 96 వేల రూపాలకు కొనుగోలు చేసిన మోదీ ఎందుకు ఆమెను ఈ కేసులో ఇరికిస్తున్నారనే సందేహం ఎవరికైనా రావచ్చు. దీనివెనక పెద్ద కథే ఉంది. ఐపీఎల్ ఫిక్సింగ్, ఫెమా కేసుల్లో నిందితుడైన లలిత్ మోదీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 2013, సెప్టెంబర్ నెలలో బోర్డు నుంచి శాశ్వతంగా వెలివేసిన విషయం తెల్సిందే. ఆదే ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన వసుంధర రాజె తన పలుకుబడిని ఉపయోగించి రాజస్థాన్ క్రికెట్ అసోసియోషన్ అధ్యక్షుడిగా లలిత్ మోదీ ఎన్నికయ్యేలా చూశారు. 2014, మే నెలలో రాజస్థాన్ క్రికెట్ అసోసియోషన్‌కు మోదీ ఎన్నికవడం పట్ల బీసీసీఐ కన్నెర్ర చేసింది. తాము శాశ్వతంగా బహిష్కరించిన ఓ వ్యక్తిని ఎలా ఎన్నుకుంటారంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియోషన్ను హెచ్చరించడమే కాకుండా ఏ లీగ్ మ్యాచుల్లోనూ ఆ రాష్ట్ర జట్టును ఆడనీయమని తాకీదు ఇచ్చింది. దీనిపై అసోసియోషన్ కోర్టుకెక్కింది. రాష్ట్రానికి చెందిన దాదాపు 75 మంది క్రికెట్ క్రీడాకారులు తాము రోడ్డునపడుతున్నామంటూ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పైనుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు వసుంధర రాజె జోక్యం చేసుకొని 2014, అక్టోబర్ నెలలో లలిత్ మోదీని తొలగించి, ఆ స్థానంలో రాష్ట్ర బీజేపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు అమిన్ పఠాన్‌ను ఎంపికయ్యేలా చూశారు. దీంతో లండన్‌లోవున్న మోదీకి కోపం వచ్చింది. ఆగ్రహంతో వసుంధర రాజె స్థానంలో బీజేపీ నాయకులు ఓం మాథూర్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిందిగా కూడా రాష్ట్ర బీజేపీ నేతలకు ట్వీట్ పంపించారు. లలిత్ మోదీకి ఇమిగ్రేషన్ వీసా ఇవ్వండంటూ సిఫారసు లేఖపై సంతకం చేసిన వసుంధర రాజె, అసలు సంతకం చేశానా, లేదా, ఏ పత్రం మీద సంతకం చేశానో కూడా గుర్తులేదంటూ బుకాయిస్తున్న వసుంధర రాజె, మోదీ వెల్లడించిన తాజా అంశంపై ఓం మాట్లాడతారో చూడాలి. -
ప్రశ్నకు ప్రశ్నే సమాధానం
-
'ఆధిపత్య ధోరణిలో ఇందిరా, మోదీలకు దగ్గర పోలికలు'
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిత్వ తీరు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పోలి ఉంటుందని సీనియర్ జర్నలిస్ట్, ప్రఖ్యాత న్యూస్ యాంకర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ లాగానే నరేంద్రమోదీ కూడా వ్యవస్థ కన్నా వ్యక్తే అధికుడనే తీరులో వ్యవహరిస్తుంటారని పేర్కొన్నారు.తాజా పుస్తకం ‘2014- ద ఎలక్షన్ దట్ చేంజ్డ్ ఇండియా’లో పలువురు జాతీయ స్థాయి రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలను ఆ పుస్తకంలో వెల్లడించారు. ప్రతిపక్షాన్ని కలుపుకుపోవడంపై కూడా ఇందిర తరహాలోనే ప్రతికూల ధోరణితోనే ఉంటారు. అందుకే కాంగ్రెస్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయంలో ఆ పార్టీ ఒత్తిడికి ఏమాత్రం తలొగ్గలేదన్నారు. -
సర్దేశాయ్పై దాడి అవమానకరం: వీహెచ్
హైదరాబాద్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. మోడీ ప్రభుత్వంలా కనిపిస్తోందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టంతా పరిశ్రమలు, కార్పొరేట్ రంగాలపైనే ఉందని విమర్శించారు. పేదల గురించి మాటలు మాత్రమే చెబుతున్నారని, కార్యాచరణ మాత్రం కార్పొరేట్ సెక్టార్లకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. నల్లధనం వెలికితీతపై మోదీ మాట్లాడడం లేదన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్పై అమెరికాలో జరగడం అవమానకరమన్నారు. దీన్ని ప్రధాని మోదీ ఖండించకపోవడం సరికాదని వీహెచ్ అన్నారు. న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన మోదీ సభలో రాజ్‌దీప్ సర్దేశాయ్పై పలువురు దాడి చేశారు. -
రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు చుక్కలు చూపిన చంద్రబాబు
సీఎన్ఎన్-ఐబీఎన్ ఇంటర్వ్యూలో పొంతనలేని సమాధానాలు రాష్ట్ర విభజన విషయంలో వైఖరి తెలుసుకోవడానికి ప్రయత్నించిన సీఎన్ఎన్-ఐబీఎన్ చానల్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు.. టీడీపీ అధినేత చంద్రబాబు చుక్కలు చూపారు. ఢిల్లీలో దీక్ష చేస్తున్న చంద్రబాబును.. సీఎన్ఎన్-ఐబీఎన్ చానల్ ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది. అసలు విభజన అంశంలో చంద్రబాబు వైఖరి ఏమిటో తెలుసుకోవడానికి.. రాజ్‌దీప్ సర్దేశాయ్ వీలైనంతగా ప్రయత్నించినా, ఏమీ తెలుసుకోలేకపోయారు. తాను అడిగిన ప్రతీ ప్రశ్నకూ చంద్రబాబు పొంతనలేని సమాధానాలు ఇస్తుండడంతో ఆశ్చర్యపోవడం రాజ్‌దీప్ వంతు అయిం ది. చివరకు... ‘‘మిమ్మల్ని పదిహేను నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేసినా.. మీరు తెలంగాణకు అనుకూలమా? సీమాంధ్రకు అనుకూలమా? అనేది మాత్రం నాకు అర్థం కాలేదు’’ అంటూ రాజ్‌దీప్ ఇంటర్వ్యూను ముగించారు. అంతేకాదు.. చంద్రబాబు ఇంటర్వ్యూలో ఏమీ తెలుసుకోలేకపోయానంటూ సర్దేశాయ్ ట్విట్టర్లోనూ వాపోయారు. ఈ ఇంటర్వ్యూలో కొంత భాగం.. * మీరు తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా స్పష్టంగా చెప్పండి? మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ఇది చాలా సార్లు చెప్పాను. మేం తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చాం. కానీ, జరిగిందేమిటి? వాళ్లు (యూపీఏ) రాష్ట్రాన్ని విభజించిన తీరు ఏమిటి? రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుజాతిని నాశనం చేస్తున్నారు. వాళ్లు రెండు ప్రాంతాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. సామరస్యపూర్వకంగా నిర్ణయం తీసుకోవాలి. * సామరస్యపూర్వక పరిష్కారం అంటే.. సమైక్యాంధ్రనా? విభజన జరగాలనా? మేం చెప్పేదేమిటంటే వారి (సీమాంధ్ర ప్రజల) గోడు పట్టించుకోండి. ఇరు ప్రాంతాల ప్రజలను పిలిచి మాట్లాడాలి. * అఖిలపక్షాల్లో తెలంగాణకు అనుకూలంగా టీడీపీ మాట్లాడింది. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది. ఇప్పుడేమో ఇదంతా కుట్ర అని మీరు అంటున్నారు? నేను చెప్పేదేమిటంటే.. ఇక్కడ చాలా సమస్యలున్నాయి. వాళ్ల (సీమాంధ్ర ప్రజల)ను కట్టుబట్టలతో వెళ్లిపొమ్మనలేం. వాళ్ల సమస్యలను పట్టించుకోనప్పుడు వాళ్లని వెళ్లాలని ఎలా అంటాం. * అంటే తెలంగాణ ఇవ్వొద్దంటారా? కాదు. దీనిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. * తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలంటారా? అదికాదు నేను చెప్పేది. తెలుగువారందరికీ శాంతి కావాలి. అదే సమయంలో ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కావాలి. * మిగతా పార్టీల సంగతి సరే. మీరు ఒక పార్టీ అధినేత, మాజీ సీఎం.. మరి మీరు తెలంగాణ తీర్మానానికి మద్దతిస్తారా? లేదా? స్పష్టంగా చెప్పండి అదికాదు.. మీకు ఇద్దరు పిల్లలుంటే మీరు ఎవరిని ఎన్నుకుంటారు? ఎవరో ఒకరు మాత్రమే కావాలంటారా? * ఈ అంశంలో రెఫరెండం పెట్టాలా? మరో అఖిలపక్ష సమావేశం పెట్టాలా? అసలు ఇప్పుడు దీనంతటినీ నిర్ణయిస్తున్నదంతా ఢిల్లీ నేతలే. అందులో ఆంధ్రప్రదేశ్ వారెవరూ లేరు. అలాంటప్పుడు వారెలా నిర్ణయం తీసుకుంటారు? జేఏసీలు, ప్రజలు ఉద్యమిస్తున్నారు. వారితో చర్చించాలి. అధికారంలో ఉన్న సోనియాగాంధీ ఈ సమస్యను సృష్టించారు. కేంద్రం వల్లే రాష్ట్రం రావణకాష్టంలా మారింది. దీనికి కేంద్రమే పరిష్కారం చూపాలి.