సాక్షి అవార్డులు గౌరవానికే గౌరవం
న్యూఢిల్లీ: సియాచిన్లో ప్రాణాలు అర్పించిన వీర జవాను ముస్తాక్ అహ్మద్ ధైర్యసాహసాలు గుర్తించి సాక్షి మీడియా గ్రూప్ అవార్డు ఇవ్వడం గౌరవానికే గౌరవం ఇవ్వడంలాంటిదని ప్రముఖ జర్నలిస్టు.. టీవీ వ్యాఖ్యాత రాజ్ దీప్ సర్దేశాయ్ అన్నారు. ప్రతిభకు పట్టం కడుతూ వరుసగా రెండో ఏడాది సాక్షి ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేసింది.
ఆదివారం అతిరథ మహారథుల మధ్య హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ పురస్కారాల ప్రదానోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా పాల్గొన్నారు. సియాచిన్‌లో ప్రాణాలొదిన సిపాయి ముస్తాక్ అహ్మద్‌కు ప్రకటించిన జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డును ఆయన భార్య నసీమున్కు సర్దేశాయ్ అందించారు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్న సర్దేశాయ్ వీర జవాను ముస్తాక్ అహ్మద్ భార్యకు సాక్షి అవార్డు అందించడంపట్ల ముగ్దుడయ్యారు. హైదరాబాద్లో చక్కటి సాయంత్రం వేళ నిజమైన తెలుగు హీరోల మధ్య గౌరవానికి గౌరవం దక్కిందని చెప్పారు. ఇందరు తెలుగువాళ్ల మధ్య వేదికపై తానొక్కడినే తెలుగేతరుడినని ఆయన అన్నారు. ముస్తాక్‌కు అవార్డు ప్రకటించిన సాక్షి మీడియా గ్రూప్ ను ప్రశంసించారు.
Honoured for the honour of presenting Sakshi award for bravery to Widow of Mushtaq Ahmed, martyred at Siachen. pic.twitter.com/DwspvNK2jx
— Rajdeep Sardesai (@sardesairajdeep) 24 April 2016
Honoured to be honoured in Hyderabad at a spl evening celebrating real Telugu heroes.As only non Telugu on stage! pic.twitter.com/uXTENfQVdF
— Rajdeep Sardesai (@sardesairajdeep) 24 April 2016