Mushtaq Ahmed
-
బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్‌గా పాక్ దిగ్గజం.. ఎవరంటే?
టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్‌ను బీసీబీ నియమించింది. ఈ విషయాన్ని బీసీబీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. వరల్డ్‌కప్ నేపథ్యంలో తమ స్పిన్ బౌలింగ్ విభాగాన్ని మెరుగుపరచడానికి బంగ్లా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా 53 ఏళ్ల ముస్తాక్ అహ్మద్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. ముస్తాక్ గతంలో ఇంగ్లండ్, వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లకు స్పిన్ బౌలింగ్ కోచ్ పనిచేశాడు. ఇక బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినందుకు ముస్తాక్ అహ్మద్ సంతోషం వ్యక్తం చేశాడు. వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ జట్లలో బంగ్లాదేశ్ ఒకటని ముస్తాక్ కొనియాడాడు. ముస్తాక్ అహ్మద్ పాకిస్తాన్ తరపున 52 టెస్టులు, 144 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించాడు. అతడు వరుసగా 52 టెస్టుల్లో 185 వికెట్లు, 144 వన్డేల్లో 161 వికెట్లు పడగొట్టాడు. 1992లో పాకిస్తాన్ తొలి వన్డే వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోవడంలో అహ్మద్ కీలక పాత్ర పోషించాడు. -
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. కొత్త క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన షాహిద్ అఫ్రిది
Shahid Afridi Launches Mega Star League: పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది క్రికెట్ ప్రేమికులకు శుభవార్త చెప్పాడు. మెగా స్టార్ లీగ్ (ఎమ్ఎస్ఎల్) పేరుతో త్వరలో సరికొత్త క్రికెట్ టోర్నీని ప్రారంభించనున్నట్లు వెల్లడించాడు. ముస్తాక్ అహ్మద్, ఇంజమామ్ ఉల్ హక్, వకార్ యూనిస్ తదితర పాక్ మాజీ క్రికెటర్లను కలుపుకుని లీగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహకాలు మొదలుపెట్డాడు. ఈ లీగ్‌లో పాకిస్థాన్ మాజీలతో పాటు పలువురు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు, చలన చిత్ర, సంగీత రంగానికి చెందిన సెలబ్రిటీలు పాల్గొంటారని తెలిపాడు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్లు, అథ్లెట్లు, జర్నలిస్టులకు చేయూతనిచ్చేందుకు ఈ లీగ్‌ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించాడు. పాకిస్థాన్‌లోని రావల్పిండి వేదిగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెగా స్టార్ లీగ్ ప్రారంభమవుతుందని ప్రకటించాడు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయని పేర్కొన్నాడు. పాక్ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడిన షాహిద్ ఆఫ్రిది 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. అనంతరం అతను కొంతకాలం పాటు పాక్ సూపర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్, టీ20 బ్లాస్ట్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫ్రాంఛైజీ లీగ్‌ల్లో పాల్గొన్నాడు. అఫ్రిది భారత్ వేదికగా జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడాడు. 2008 ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్‌లో అతను డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 37 బంతుల్లోనే వన్డే సెంచరీ సాధించడం ద్వారా అఫ్రిది తొలిసారి వార్తల్లోకెక్కాడు. చదవండి: ధోని తలా, కోహ్లి కింగ్ అయితే శిఖర్ టీ20 ఖలీఫా..! -
నా అద్భుతమైన ఫామ్‌కు కారణం అతడే: జోస్ బట్లర్
ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో బట్లర్ ఇప్పటి వరకు మూడు సెంచరీలతో పాటు 491 పరుగులు సాధించాడు. కాగా ప్రస్తుత సీజన్లో బట్లర్ తన ఫామ్ వెనుక మాజీ పాకిస్తాన్ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్ ఉన్నాడని తెలిపాడు. స్పిన్ బౌలింగ్‌లో తన బలహీనతలను బలాలుగా మార్చుకోవడంలో ముస్తాక్ అహ్మద్ ఎంతో తోడ్పడ్డాడని బట్లర్ చెప్పాడు. “ముస్తాక్ అహ్మద్ ఎప్పుడూ నన్ను మొదట ఆఫ్‌సైడ్‌లో ఆడమానేవాడు. ఆ తర్వాతే లెగ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించమనేవాడు. ఆ తర్వాతే నా బ్యాటింగ్ స్టైల్లో మార్పు చేసుకున్నాను అని జోస్ బట్లర్ పేర్కొన్నట్లు క్రికెట్ పాకిస్తాన్ పేర్కొంది. కాగా 2008 నుంచి 2014 వరకు ఇంగ్లండ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ముస్తాక్ అహ్మద్ పనిచేశాడు. చదవండి: IPL 2022: నాలుగు భారీ రికార్డులపై కన్నేసిన ధవన్ -
‘టీమిండియాలో అంతర్గత విభేదాలు.. త్వరలోనే కోహ్లి రిటైర్మెంట్’
Mushtaq Ahmed comments on Virat Kohli Quitting T20I Captaincy: టీ20ల్లో టీమిండియా కెప్టెన్సీకు విరాట్ కోహ్లి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. భారత తదుపరి టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్ సంచలన వాఖ్యలు చేశాడు. టీమిండియాలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ, అందుకే కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని అతడు ఆరోపించాడు. త్వరలో అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి కూడా కోహ్లి రిటైర్ అవుతాడని అహ్మద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. "ఒక విజయవంతమైన కెప్టెన్ తాను కెప్టెన్సీనుంచి తప్పుకున్నాడంటే.. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం ఏమీ బాగాలేదని అర్థం. నేను ప్రస్తుతం టీమిండియాలో రెండు గ్రూపులను చూస్తున్నాను. ఒకటి ఢిల్లీ గ్రూప్, రెండోది ముంబై. కోహ్లి త్వరలో అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడని, కేవలం ఐపీఎల్‌లోనే కొనసాగుతాడని నేను భావిస్తున్నాను. టీ20 ప్రపంచకప్‌లో ఐపీఎల్ కారణంగానే భారత్ ఓడిపోయింది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీకి ముందు సుదీర్ఘకాలం బయోబబుల్‌లో ఉండటం టీమిండియా ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీసింది" అని అతడు జియో న్యూస్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: Faf du Plessis: టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్ పాకిస్తాన్... -
హాకీ ఇండియా అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ రాజీనామా
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారమే అహ్మద్ తన రాజీనామా పత్రాన్ని హెచ్‌ఐకి అందజేయగా... శుక్రవారం సమావేశమైన హెచ్ఐ ఎగ్జిక్యూటివ్ బోర్డు దాన్ని ఆమోదించింది. అతని స్థానంలో హాకీ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు జ్ఞానేంద్రో నిగోంబమ్ (మణిపూర్)ను నియమించినట్లు బోర్డు ప్రకటించింది. అయితే జాతీయ క్రీడా నిబంధనలకు వ్యతిరేకంగా 2018లో అహ్మద్ ఎన్నిక జరిగిందని పేర్కొన్న భారత క్రీడా మంత్రిత్వ శాఖ అతన్ని అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని గతంలోనే పేర్కొంది. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వరుసగా రెండు పర్యాయాలు మాత్రమే ఆఫీస్ బేరర్‌గా వ్యవహరించేందుకు అవకాశముంది. ముస్తాక్ అహ్మద్ 2010–2014 వరకు హాకీ ఇండియా కోశాధికారిగా, 2014–2018 వరకు కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం 2018–2022 కాలానికిగానూ అధ్యక్షునిగా నియమితులయ్యారు. ప్రస్తుతం వ్యక్తిగత కారణాలను చెబుతున్నప్పటికీ క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. -
సాక్షి అవార్డులు గౌరవానికే గౌరవం
న్యూఢిల్లీ: సియాచిన్‌లో ప్రాణాలు అర్పించిన వీర జవాను ముస్తాక్ అహ్మద్ ధైర్యసాహసాలు గుర్తించి సాక్షి మీడియా గ్రూప్ అవార్డు ఇవ్వడం గౌరవానికే గౌరవం ఇవ్వడంలాంటిదని ప్రముఖ జర్నలిస్టు.. టీవీ వ్యాఖ్యాత రాజ్ దీప్ సర్దేశాయ్ అన్నారు. ప్రతిభకు పట్టం కడుతూ వరుసగా రెండో ఏడాది సాక్షి ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేసింది. ఆదివారం అతిరథ మహారథుల మధ్య హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ పురస్కారాల ప్రదానోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా పాల్గొన్నారు. సియాచిన్‌లో ప్రాణాలొదిన సిపాయి ముస్తాక్ అహ్మద్‌కు ప్రకటించిన జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డును ఆయన భార్య నసీమున్కు సర్దేశాయ్ అందించారు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్న సర్దేశాయ్ వీర జవాను ముస్తాక్ అహ్మద్ భార్యకు సాక్షి అవార్డు అందించడంపట్ల ముగ్దుడయ్యారు. హైదరాబాద్‌లో చక్కటి సాయంత్రం వేళ నిజమైన తెలుగు హీరోల మధ్య గౌరవానికి గౌరవం దక్కిందని చెప్పారు. ఇందరు తెలుగువాళ్ల మధ్య వేదికపై తానొక్కడినే తెలుగేతరుడినని ఆయన అన్నారు. ముస్తాక్‌కు అవార్డు ప్రకటించిన సాక్షి మీడియా గ్రూప్ ను ప్రశంసించారు. Honoured for the honour of presenting Sakshi award for bravery to Widow of Mushtaq Ahmed, martyred at Siachen. pic.twitter.com/DwspvNK2jx — Rajdeep Sardesai (@sardesairajdeep) 24 April 2016 Honoured to be honoured in Hyderabad at a spl evening celebrating real Telugu heroes.As only non Telugu on stage! pic.twitter.com/uXTENfQVdF — Rajdeep Sardesai (@sardesairajdeep) 24 April 2016 -
అమర జవానుకు ఇదా గౌరవం?
♦ రాష్ర్టప్రభుత్వ తీరుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం ♦ కేబినెట్లో నివాళులర్పించరా? సీఎం కనీసం పట్టించుకోరా? ♦ ముందు రూ.5 లక్షలు ప్రకటించి చేతులు దులుపుకున్నారు ♦ పరిహారం కోసం మేం దీక్షలు, ధర్నాలు చేయాల్సి వచ్చింది ♦ నేను వస్తున్నాననే రూ. 25 లక్షలు ప్రకటించారు... ♦ సంతాపంగా ఒకరోజు సెలవు ప్రకటించాలి ♦ మాట తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ♦ ప్రతిపక్షనేత డిమాండ్.. ముస్తాక్ కుటుంబానికి పరామర్శ సాక్షి ప్రతినిధి, కర్నూలు: సియాచిన్‌లో మంచుకొండలు విరిగిపడి మరణించిన జవాన్ ముస్తాక్ అహ్మద్ విషయంలో రాష్ర్టప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ముస్తాక్ మృతికి కేబినెట్లో కనీసం నివాళులు కూడా అర్పించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు దేశం మొత్తం నివాళులు అర్పిస్తుంటే రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తాక్ మరణానికి సంతాప సూచకంగా ఒక రోజు సెలవు ప్రకటించాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి పార్నపల్లె చేరుకున్న జగన్.. అమర జవాన్ ముస్తాక్ పార్థివదేహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సిగ్గుతో తలదించుకునేలా ప్రభుత్వ తీరు ‘‘ఒక సిపాయి చనిపోతే దేశం మొత్తం ఆయనను గౌరవిస్తూ ఘనంగా నివాళులర్పిస్తోంది. మన రాష్ట్రానికి చెందిన ఓ ముస్లిం పిల్లాడు సిపాయి విధులు నిర్వర్తిస్తూ చనిపోతే మనం ఇంకా ఎక్కువ గౌరవించాల్సిన అవసరం ఉంది. కారణం ఏమిటంటే దేశ భద్రత కోసం ముస్లింలు కూడా ఏ స్థాయిలో కష్టపడుతున్నారో చెప్పే ఉదాహరణ ఇది. అందుకే ఎక్కువగా గౌరవించాల్సిన సందర్భం ఇది. అలాంటి ది ఇక్కడ మన రాష్ట్రం తీరు చూస్తే నిజంగా సిగ్గుతో తలదించుకునేలా ఉంది. మొదట రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. అది కూడా ముఖ్యమంత్రి రారు. పట్టించుకోరు. పక్కన కర్ణాటక రాష్ట్రంలో రూ.25 లక్షలతో పాటు ఇల్లు ఇచ్చారు. పొలాలు ఇచ్చారు. ఉద్యోగాలు ఇచ్చారు. ఆ విషయం గుర్తు చేస్తూ ఇక్కడ ధర్నాలు, దీక్షలు చేయాల్సి వచ్చింది. ఆ కుటుంబ సభ్యులతో పాటు మా ఎమ్మెల్యే కూడా ధర్నాలు, దీక్షలు చేశారు. ఆ తర్వాత నేను ఇక్కడకు వస్తున్నానని తెలిసి పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి.. ముస్తాక్ కుటుంబానికి ప్రభుత్వం సానుభూతితో సహాయం చేయలేదు. అతి కష్టంమీద కేబినెట్లో పరిహారం ప్రకటించారు. సిపాయి మృతికి కేబినెట్లో కనీసం నివాళులు కూడా అర్పించలేదు. ఒక సిపాయి చనిపోతే రాష్ర్టప్రభుత్వ వ్యవహారం తీరు ఇలా ఉంది. కర్ణాటక రాష్ట్రం తరహాలో మీరు ఎందుకు ప్యాకేజీ ఇవ్వరని ఒత్తిడి చేసిన తర్వాతే వీళ్లు ఒప్పుకున్నారు. మాట తప్పకుండా కనీసం అవైనా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. కర్ణాటక మాదిరిగా ఇల్లు, పొలం, ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయమై.. మానవతా దృక్పథంతో ఆలోచించాలి. దేశభద్రత కోసం ముస్లింలు కూడా ఎంతగా పోరాడుతున్నారో చెప్పవలసిన అవసరం ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఒక రోజు సెలవును ప్రకటించడంతో పాటు దేశం మొత్తం మనవైపు చూసే విధంగా సహాయం ప్రకటించి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. సిపాయి మరణానికి సంతాపసూచకంగా ఒక రోజు సెలవు ప్రకటించండి. కర్ణాటకతో కాదు.. దేశంతో పోటీపడండి. దేశంలోకెల్లా అతి మెరుగైన ప్యాకేజీ ఆ కుటుంబానికి ఇచ్చి ఆదర్శంగా నిలబడండి.’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. గవర్నర్‌తో నేటి సాయంత్రం జగన్ భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం ఐదు గంటలకు రాజ్‌భవన్‌లో కలవనున్నారు. జగన్‌తోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా గవర్నర్ వద్దకు వెళ్లనున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఇటీవల జరిగిన రైలు దహనం ఘటన, తదనంతరం సీఎం చంద్రబాబు వైఎస్సార్సీపీ మీద నిరాధారమైన ఆరోపణలతో చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఆయనకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలి
దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘతన ముస్తాక్ అహ్మద్‌ది అని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ముస్తాక్‌కు దేశ ప్రజలంతా ఘనంగా నివాళి అర్పించారన్నారు. ఏపీలో మాత్రం సీఎం చంద్రబాబు ముస్తాక్ మరణంపై చిన్నచూపు చూశారన్నారు. తొలుత ముస్తాక్ కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా మాత్రమే ప్రకటించారని, కర్ణాటకలో హనుమంతప్ప కుటుంబానికి రూ. 25 లక్షలు, ఇల్లు, పొలం, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో ఆలస్యంగా స్పందించిన చంద్రబాబు ముస్తాక్ కుటుంబానికి రూ. 25 లక్షలు అందించారని వైఎస్ జగన్ చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని కోరారు. దేశ భద్రత కోసం ముస్లిం సోదరుడు ప్రాణాలు అర్పించిన వైనాన్ని చాటి చెప్పాల్సిన సమయం ఇదని ఆయన అన్నారు. ముస్తాక్ మరణానికి నివాళిగా ఒకరోజు సెలవు దినంగా ప్రకటించాలని ఆయన కోరారు. దేశం మొత్తం ముస్తాక్ కుటుంబం వైపు చూసేలా ఆదుకోవాలని ఆయన అన్నారు. అయితే.. ముస్తాక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాకపోవడం మాత్రం విచారకరమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. -
వీర జవాన్ అంత్యక్రియలకు హాజరైన వైఎస్ జగన్
-
ముస్తాక్ కుటుంబానికి చెక్కు అందజేసిన కేఈ
కర్నూలు : సియాచిన్‌లో మరణించిన ఆర్మీ జవాన్ ముస్తాక్ భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని పార్నపల్లెలో ముస్తాక్ భౌతికకాయాన్ని కేఈ సందర్శించారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ముస్తాక్ కుటుంబసభ్యులకు రూ. 25 లక్షల చెక్కును కేఈ కృష్ణమూర్తి అందజేశారు. -
మొహిసీన్‌కు డాడీ
► దేశానికి సిపాయి. ► అల్లాకి ముద్దుబిడ్డ. ► మొహిసీన్కి డాడీ. ► నేడు అమరుడు. ► మంచుకు కన్నీళ్లుండవు. ► అది కరిగి ఉంటే ముస్తాక్ బతికేవాడు. ► ముస్తాక్ కుటుంబానికి కన్నీళ్లున్నాయి. ► వాటికి మనం కరగాలి. మూడు కారణాలు ముస్తాక్ అహ్మద్‌ను ఆర్మీ వైపు కవాతు చేయించాయి. దేశంపై ఉన్న ప్రేమ. తల్లిదండ్రులపై ఉన్న ప్రేమ. కుటుంబంపై ఉన్న ప్రేమ. దేశంపై ప్రేమతో సిపాయి అయ్యాడు. అమ్మానాన్నలపై ప్రేమతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి వారి కల నెరవేర్చాడు. కుటుంబంపై ప్రేమతో బాధ్యతల మంచు పర్వతాన్ని భుజాలపైకి ఎత్తుకున్నాడు. ఆ రోజు నసీమూన్‌కు బాగా గుర్తు. ‘ఎంత! ఆరు నెలల్లో మళ్లీ వస్తాను, రంజాన్‌కి’ అన్నాడు. వెళుతూ వెళుతూ కొడుకును ముద్దాడాడు. వదల్లేక వదల్లేక వెనక్కొచ్చి మళ్లీ ముద్దాడాడు. అప్పటికి సయ్యద్ మొహిసీన్ వయసు పదిహేను రోజులు. 2015 ఆగస్టు 3న పుట్టాడు. వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు.. ‘ఉండిపోకూడదా..’ అన్నట్లు చూసింది భార్య. ‘మిమ్మల్ని చూడకుండా ఉండగలనా?’ అన్నట్లు భార్యాబిడ్డల్ని చూసుకున్నాడు ముస్తాక్. కానీ తాను ఇక్కడుంటే కుటుంబం మాత్రమే బాగుంటుంది. అదే సరిహద్దుకు వెళ్తే దేశమంతా భద్రంగా ఉంటుంది. అదే మాట భార్యతో అన్నాడు. బయల్దేరాడు. ఏడు రోజుల నిరీక్షణ! మంచుకొండల్లో చిక్కుకున్న ముస్తాక్ ఆచూకీ కోసం తల్లిదండ్రులతో పాటు భార్య ఎదురుచూపులు! అతడు క్షేమంగా తిరిగి రావాలన్న దేశ ప్రజల ఆకాంక్ష! అన్నీ నిష్ఫలమయ్యాయి. ఆత్మీయుల హృదయాలు మూగబోయాయి. అంతలోనే కూలిపడ్డ మంచు కొండ చరియల్లోంచి పది మంది సైనికుల్లో ఒకరు బయటపడ్డారనే సమాచారం! ఎక్కడో మినుకు మినుకు మంటూ చిన్న ఆశ. ఆ వెంటనే దిగ్భ్రాంతి. మిగిలిన వారెవరూ బతికిలేరనే ప్రకటన ! ముస్తాక్ కుటుంబంలో విషాదం. కన్నీరు మున్నీరు ‘...నీ ఆరోగ్యం జాగ్రత్త... బాబును బాగా చూసుకో.. ఆరునెలల్లో వస్తా.. అందరం కలసి మూడు రోజులు.. నీ పుట్టిన రోజు, నా పుట్టిన రోజు, మన అబ్బాయి పుట్టిన రోజు, మన పెళ్లి రోజు అన్నీ జరుపుకుందాం’ అని చెప్పి వెళ్లాడు. వెళ్లిన ఈ మూడు నెలల్లో ఆరంటే ఆరుసార్లు మాట్లాడాడు. అది కూడా ఒక్కొక్క నిమిషమే. డ్యూటీ ఎత్తై మంచు పర్వతాల్లో.. ప్రమాదకరమైన ప్రదేశంలో.. సియాచిన్‌లో.. అంటూ వెళ్లాడు. మొన్న ఫిబ్రవరి 3న కూడా ఫోన్ చేసి ‘బాగున్నా’ అని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది గంటలకే వినలేని వార్త..’ అంటూ ముస్తాక్ భార్య నసీమూన్ కన్నీటి పర్యంతమైంది. నసీమూన్ది నంద్యాల పట్టణంలోని సాదిక్ నగర్ . ముస్తాక్‌ది బండిఆత్మకూరు మండలం పార్నపల్లె. ఇద్దరికీ 2014 ఆగస్టు 7న వివాహమైంది. అప్పట్లో ముస్తాక్ పంజాబ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. వివాహం తర్వాత భార్య నసీమూన్ను నవంబర్‌లో తనతో పాటు పంజాబ్ తీసుకొని వెళ్లాడు. భార్య గర్భవతి కావడంతో 2015 ఏప్రిల్‌లో నంద్యాలకు తీసుకొచ్చి ఆమె పుట్టింట్లో వదిలి వెళ్లాడు. మధ్యలో ఆరు నెలల ఎడబాటు. కాన్పు సమయంలో తన దగ్గరే ఉండాలని నసీమూన్ పట్టుపట్టడంతో నెల రోజులు సెలవు పెట్టి వచ్చాడు. ఆగస్టులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది నసీమూన్. బిడ్డను చూసుకున్న ముస్తాక్ అహ్మద్ జీవితంలో ఆనందం వెల్లి విరిసింది. దంపతులిద్దరూ కొడుకు పేరు కోసం ఆలోచించారు. అందంగా ఉన్న కుమారుడిని సయ్యద్ మొహిసీన్ అంటూ పిలుచుకున్నారు. ముస్తాక్ తిరిగి పంజాబ్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్లో రెండు నెలలు విధులు నిర్వహించాక 2015 డిసెంబర్లో తనను సియాచిన్‌కు బదిలీ చేశారని.. అక్కడ పరిస్థితి కష్టంగా ఉంటుందని, వాతావరణం అనుకూలంగా ఉండదని, ఆరునెలల తర్వాత తిరిగి వస్తానని భార్యకు ఫోన్లో చెప్పి ఎత్తై మంచుపర్వతాల్లోకి వెళ్లాడు ముస్తాక్. సాధారణ రైతు కుటుంబం కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలంలోని పార్నపల్లె గ్రామానికి చెందిన ఇబ్రహీం, నజీమున్నిసా దంపతుల కుమారుడు ముస్తాక్. వ్యవసాయమే ఆ కుటుంబానికి ఆధారం. నాలుగు ఎకరాల పొలం సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చివరి సంతానమైన ముస్తాక్ బండిఆత్మకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత నంద్యాలలోని నేషనల్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుండగా ఆర్మీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2004లో ఉద్యోగంలో చేరి 11 ఏళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పని చేశాడు. ఎముకలు కొరికే చలిలో... మిలటరీలో ఉద్యోగం చేస్తున్న ముస్తాక్ అహ్మద్ మద్రాస్ బెటాలియన్‌లో పని చేశాడు. మంచుకొండల్లో విధులు నిర్వహించే సమయంలో ఎదురయ్యే విపత్తులను ఏ విధంగా ఎదుర్కోవాలో జమ్మూకశ్మీర్, నార్థ్పూ ప్రాంతాల్లో కఠోర శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ముస్తాక్ చురుకుదనం చూసి ఉన్నతాధికారులు అతడిని సియాచిన్ గ్లేసియర్‌లో విధులు నిర్వహించేందుకు ఎంపిక చేశారు. పది మంది బృందంలో 9వ సిపాయిగా ఉన్న ముస్తాక్.. మంచుకొండల్లో ఫైబర్ టెంట్లను ఏర్పాటు చేసుకొని ఎముకలు కొరికే చలిలో దేశ భద్రతకే అంకితమయ్యారు. విధి నిర్వహణలో మంచు చరియలు కూలి మరణించాడు. రంజాన్‌కి వస్తానన్నాడు గత ఏడాది ఆగస్టు నెలలో విధులు నిర్వహించేందుకు వెళ్లిన ముస్తాక్ ఈ ఏడాది రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జూన్ నెలలో వస్తానని చెప్పినట్లు అతని సోదరులు మునీర్‌సాహెబ్, ముజఫర్ అహ్మద్, మగ్బుల్ తెలిపారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇచ్చిన నాలుగు సెంట్ల స్థలంలో ఇల్లు కట్టుకోవాలని ఎన్నో కలలు కనేవాడన్నారు. తమతో మాట్లాడినప్పుడంతా ఇల్లు ఏవిధంగా ఉండాలనే విషయమై ఎన్నో ప్లాన్లు చెప్పేవాడనీ, ఇలా... తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్త వినవలసి వస్తుందనుకోలేదని విలపించారు. అన్ని వేడుకలూ ఆగస్టులోనే! ముస్తాక్ అహ్మద్, నసీమూన్లకు మరిచిపోలేని అనుభూతి ఆగస్టు నెల. ఆ నెల వారి జీవితాల్లో వెలుగులు, ఆనందాలను నింపింది. 2014 ఆగస్టు 7న వివాహం జరిగింది. ఆగస్టు 2వ తేది ముస్తాక్ అహ్మద్ జన్మదినం. ఆగస్టు 3వ తేదిన కుమారుడు సయ్యద్ మొహిసీన్ జన్మదినం, ఆగస్టు 4వ తేదిన భార్య నసీమూన్ జన్మదినం కావడం విశేషం. - ఎన్.ప్రతాప్‌రెడ్డి, బండి ఆత్మకూరు, - పి. కిరణ్‌కుమార్, నూనెపల్లి సాక్షి, కర్నూలు