టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్‌ను బీసీబీ నియమించింది. ఈ విషయాన్ని బీసీబీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. వరల్డ్‌కప్ నేపథ్యంలో తమ స్పిన్ బౌలింగ్ విభాగాన్ని మెరుగుపరచడానికి బంగ్లా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా 53 ఏళ్ల ముస్తాక్ అహ్మద్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. ముస్తాక్ గతంలో ఇంగ్లండ్, వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లకు స్పిన్ బౌలింగ్ కోచ్ పనిచేశాడు. ఇక బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినందుకు ముస్తాక్ అహ్మద్ సంతోషం వ్యక్తం చేశాడు. వరల్డ్ క్రికెట్‌లో అత్యుత్తమ జట్లలో బంగ్లాదేశ్ ఒకటని ముస్తాక్ కొనియాడాడు.
ముస్తాక్ అహ్మద్ పాకిస్తాన్ తరపున 52 టెస్టులు, 144 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించాడు. అతడు వరుసగా 52 టెస్టుల్లో 185 వికెట్లు, 144 వన్డేల్లో 161 వికెట్లు పడగొట్టాడు. 1992లో పాకిస్తాన్ తొలి వన్డే వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోవడంలో అహ్మద్ కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment