ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ ప్రత్యేకతే వేరు. ప్రత్యర్థులను తనదైన పంచ్‌లతో తిప్పి కొట్టడం ఈ కాంగ్రెస్ సీనియర్‌నేతకు బాగా అలవాటు. దీపావళి సందర్భంగా ప్రజల సంక్షేమం కోసం కొరడా దెబ్బలు తిన్నా, ఇటీవల కీలక సమావేశంలో కాండ్రీ క్రష్ ఆడినా ఆయనకే చెల్లు. తాజాగా బొంగరం తిప్పుతూ వార్తల్లో నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో నెటిజన్లును ఆకట్టుకుంటోంది. దీంతో బొంగరం తిప్పినంత ఈజీగా ఈ సారి కూడా రాజకీయాల్లో చక్రం తిప్పుతారా అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు.
ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్ దేశాయ్ దీనికి సంబంధించిన ఒక వీడియోను ఎక్స్( ట్విటర్)లో షేర్ చేశారు. అలా విసిరి.. ఇలా అలవోకగా అరచేతిలో బొంగరం తిప్పుతూ ప్రత్యర్థులకు పరోక్షంగా సవాల్ విసురుతున్నట్టే కనిపించారు. దీంతో ‘వారెవ్వా.. లట్టూ మాస్టర్... డౌన్ టూ ఎర్త్ పోలిటీషియన్’ అంటూ సీఎంను రాజ్‌దీప్ అభివర్ణించారు.
కాగా 2023 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా తన సత్తా చాటుకునేందుకు భూపేష్ భగెల్ సర్వ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రైతులే నిర్ణయాత్మక అంశం అని, వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలు తమకు విజయాన్ని అందిస్తాయనే విశ్వాసాన్ని ప్రకటించారు. అధికార కాంగ్రెస్ 90లో 75 ప్లస్ సీట్లు గెలుచు కుంటుందనే ధీమా వ్యక్తం చేశారు భూపేష్ బఘేల్. సీఎం పటాన్ నుంచి, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవో అంబికాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. అటు రాష్ట్ర అసెంబ్లీ పోల్స్ కి సంబంధించి మొత్తం 90 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. ఆ క్రమంలో నలుగురు అభ్యర్థులతో కూడిన చివరి జాబితాను బీజేపీ బుధవారం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
A chief minister who is a master of the ‘lattoo’. Chattisgarh CM @bhupeshbaghel is hoping to spin a top around his opponents.. comes across as a down to earth politician. #ElectionsOnMyPlate is back with a new season from next week. We start with the battle for Chattisgarh. 👍 pic.twitter.com/jL5VpanSMB
— Rajdeep Sardesai (@sardesairajdeep) October 26, 2023
Comments
Please login to add a commentAdd a comment