
సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే ఏపీ దూసుకెళుతోందని, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అభినందిస్తున్నట్టు ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ చెప్పారు. ఆయన శనివారం ఏపీలో జరుగుతున్న కోవిడ్ టెస్టులపై ట్విట్టర్‌లో స్పందించారు. ఓ వైపు కేసులు పెరుగుతున్నా సరే టెస్టుల్లో దూకుడు తగ్గించకపోగా, మరింతగా పెంచడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
కొన్ని రాష్ట్రాల్లో లాగా టెస్టులు తగ్గించడం, కేసులను తగ్గించి చూపించడం వంటివి ఏపీ చేయడం లేదని ప్రశంసించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేటింగ్.. ఈ మూడు విధానాల ద్వారానే వైరస్ కట్టడికి ఏపీ కృషి చేస్తోందని రాజ్‌దీప్ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment