
సాక్షి, న్యూఢిల్లీ: భారత సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని 2015 ప్రపంచకప్‌కు ముందే తండ్రైన విషయం తెలిసిందే. అయితే కూతురు జీవా పుట్టిన విషయం ధోనికి బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా ద్వారా తెలిసిందంటా.. రాజ్‌దీప్ సర్దేశాయ్ రాసిన ‘డెమోక్రసీ ఎలెవన్: ది గ్రేట్ ఇండియన్స్ క్రికెట్ హిస్టరీ’ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా జీవా పుట్టిన శుభావార్తను రైనా ద్వారా ధోనికి తెలియజేసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని పుస్తక పబ్లిషర్ జగ్గర్నాట్ బుక్స్ ‘ 2015 ప్రపంచకప్‌లో ధోని తండ్రైన విషయాన్ని సాక్షి.. ధోని మొబైల్ తీసుకెళ్లకపోవడంతో, రైనా మొబైల్ ద్వారా తెలియజేసింది’. అని ట్వీట్ చేసింది.
When @msdhoni becm a father arnd 2015 World Cup, he wasn’t carryg a mobile. His wife sent an SMS thru @ImRaina to inform him! #RajdeepsBook
— Juggernaut Books (@juggernautbooks) 20 October 2017
ధోని భార్య సాక్షి ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో జీవాకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ధోని పూర్తిగా ప్రపంచకప్‌పై ధృష్టి సారించాడు. అప్పటికే టీమిండియా ఆస్ట్రేలియాలో వార్మప్ మ్యాచ్‌లు ఆడుతోంది. బిడ్డ పుట్టిన విషయం తెలిసినా కూడా ధోని రాలేని పరిస్థితి. అప్పట్లో ఈ విషయంపై ధోనిని ప్రశ్నిస్తే.. కూతురు పుట్టిందని తెలిసింది. తల్లి బిడ్డ క్లేమంగా ఉన్నారు. దేశం కోసం పనిచేస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వేచి ఉండక తప్పదు. ఎందుకంటే ప్రపంచకప్ చాలా ముఖ్యమైనదని పేర్కొన్నాడు. ఇక ఈ టోర్నిలో భారత్ సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment