India Today Suspends Rajdeep Sardesai For 2 Weeks Over Reporting Fake News - Sakshi
Sakshi News home page

ట్వీట్‌పై దుమారం‌: రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కు చేదు అనుభవం

Published Fri, Jan 29 2021 8:48 AM | Last Updated on Fri, Jan 29 2021 12:15 PM

India Today takes Rajdeep Sardesai Off Air Over Tweet On Farmer Demise - Sakshi

న్యూఢిల్లీ: సీనియర్‌ జర్నలిస్టు, ఇండియా టుడే న్యూస్‌ ప్రజెంటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రైతు ఆందోళనలకు సంబంధించి చేసిన ట్వీట్‌ ఆయనను చిక్కుల్లో పడేసింది. ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం నాడు ట్రాక్టర్ల ర్యాలీతో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ సిక్కు వ్యక్తి మరణించారు. 

ఈ విషయంపై స్పందించిన రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌.. ‘‘ పోలీసు కాల్పుల్లో 45 ఏళ్ల నవనీత్‌ మరణించాడు. అతడి త్యాగం వృథాగా పోనివ్వమని రైతులు నాకు చెప్పారు’’ అని ట్వీట్‌ చేశారు. వాస్తవానికి ట్రాక్టర్‌ బోల్తాపడటంతో నవనీత్‌ మృతి చెందారు.  ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. బారికేడ్ల వైపు ట్రాక్టర్‌పై వేగంగా దుసుకువచ్చిన నవనీత్‌, వాహనం పల్టీ కొట్టడంతో తీవ్రగాయాల పాలయ్యారు. తల పగలడంతో ఆయన మృత్యువాత పడినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. దీంతో రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.(చదవండి: రైతు ఉద్యమంలో చీలికలు)

ఈ క్రమంలో ఆయన ట్వీట్‌ డెలీట్‌ చేశారు. అనంతరం.. ట్రాక్టర్‌ మీద ఉండగానే, పోలీసులు నవనీత్‌ను కాల్చేశారని రైతులు ఆరోపించినట్లు మరో ట్వీట్‌ చేశారు. ఢిల్లీ పోలీసులు షేర్‌ చేసిన వీడియోను పోస్ట్‌ చేసి, అందులో ట్రాక్టర్‌ బోల్తా పడినట్లు స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో పూర్తి సమాచారం తెలుసుకోకుండా ప్రజలను పక్కదోవ పట్టించేలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ ఇండియా టుడే గ్రూప్‌ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల పాటు సస్పెండ్‌ చేయడంతో పాటు నెల జీతం కోత విధించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఇండియా టుడే కన్సల్టింగ్‌ ఎడిటర్‌, న్యూస్‌ యాంకర్‌గా పనిచేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement