India Today
-
CM YS Jagan Interview: అదే నా కల.. ఎప్పటికీ జనం గుండెల్లో బతికి ఉండాలి
‘అణగారిన, వెనుకబడిన వర్గాల ప్రజలు, అగ్రవర్ణ పేదల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడని గట్టిగా నమ్ముతున్నా.ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. నేను మరణించినా, ప్రజలగుండెల్లో బతికి ఉండాలన్నదే నా కల’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలనేపథ్యంలో సీఎం వైఎస్ జగన్‌ను ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూ చేసింది.రాజ్‌దీప్: మీరు మళ్లీ గెలిస్తే విశాఖపట్నన్నిరాజధానిని చేసే విషయంలో మీరు కచ్చితమైన స్పష్టతతో ఉన్నారా? సీఎం జగన్: అమరావతి గురించి మాట్లాడే వారు రూ. లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారో చెప్పగలరా.. కనీసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేదు. ఒక వేళ అమరావతి కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయడం మొదలు పెడితే పది పదిహేనేళ్లు పడుతుంది. అప్పటికి ఈ లక్ష కోట్లు పది లక్షల కోట్లు అవుతుంది. రాజధాని అనేది కలగానే మిగులుతుంది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లో నంబర్ వన్ నగరం. విశాఖలో ఇప్పటికే రహదారులు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు ఉంది. మౌలిక సదుపాయాలన్నీ అక్కడ ఉన్నాయి. కేవలం రూ.5 వేల కోట్లు నుంచి రూ.10 వేల కోట్లు వెచ్చిస్తే రాబోయే 5–10 సంవత్సరాలలో హైదరాబాద్, బెంగళూరు లేదా చెన్నైతో వైజాగ్ పోటీ పడడాన్ని మీరు నిజంగా చూస్తారు.రాజ్‌దీప్: మీరు 2019 ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసి చంద్రబాబును చాలెంజ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మీకు చాలెంజ్ చేస్తున్నారు. మీరు అధికారంలో ఉండి ఎన్నికలకు వెళ్లడం గతంతో పోలిస్తే ఇది కఠినంగా అనిపిస్తోందా? సీఎం జగన్: సాధారణ పరిస్థితుల్లో అనిపించొచ్చు. కానీ, ఇక్కడ వాస్తవం ఏమంటే.. మేము ప్రజలకు సుపరిపాలన అందించాం. మా మేనిఫెస్టోలోని 99 శాతం వాగ్దానాలను త్రికరణ శుద్ధిగా అమలు చేసి చూపించాం. అర్హతే ప్రామాణికంగా, ఎలాంటి వివక్ష లేకుండా.. అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబి్ధదారుల ఖాతాల్లో జమ చేశాం. రాజ్‌దీప్: మీరు చాలా డబ్బు ప్రజలకు చేరిందని చెబుతున్నారు.. ఇలా నగదు బదిలీ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని కొంత మంది ఆరోపిస్తున్నారు.. ఏపీలో నేరుగా రైతులకు డబ్బులు ఇస్తున్నారు. ఇలా క్యాష్ ట్రాన్స్ఫర్ కాకుండా.. ఉత్పాదక ఉపాధి కోరుకుంటున్న వాళ్లకి ఏం చెబుతారు? సీఎం జగన్: ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజ్‌దీప్.. కొందరిలో ఆ కన్ఫ్యూజన్ ఉంది. మేం చాలా సమగ్రమైన విధానాలను అనుసరించాం. రైతుల గురించే తీసుకుంటే.. ఏ విధంగా వ్యవసాయానికి భరోసా ఇచ్చామో తెలుస్తుంది. రాష్ట్రంలో 50 శాతం మంది అర్ధ హెక్టార్, 70 శాతం మంది ఒక హెక్టార్‌లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులున్నారు. ఇలాంటి వారందిరి కోసమే రైతు భరోసా ప్రవేశపెట్టాం. ఏటా రూ.13,500 పెట్టుబడి సాయంగా ఇస్తున్నాం. మేము ఐదేళ్లలో రూ.50 వేలు ఇస్తామని చెప్పి.. రూ.67,500 ఇచ్చాం. ఇది రైతులకు 80 శాతం సాగు ఖర్చులుగా ఉపయోగ పడుతుంది. దీనికి తోడు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) తీసుకొచ్చాం. గ్రామ సచివాలయాన్ని పెట్టాం. 60–70 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున సేవలు అందిస్తున్నారు. ప్రతి పథకం అవినీతి, వివక్ష లేకుండా క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుడి దగ్గరకు నేరుగా చేరుతోంది. సమస్త ప్రభుత్వ సేవలన్నీ పేదల ఇంటి ముంగిటనే నిలిచాయి. రాజ్‌దీప్: సంక్షేమ పథకాలతో రాష్ట్రం దివాలా తీస్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అందుకే కేంద్రం సాయం కోసం ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపించాయి కదా? సీఎం జగన్: రాజ్‌దీప్.. మనం డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తున్నామో చూడాలి. ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. పథకానికి ఏ పేరు పెట్టినా ఆ డబ్బు ఎవరికి వెళ్లి.. ఎంత మేలు చేసిందో చూసుకోవాలి. దీన్ని సామాజిక పెట్టుబడిగా చూడాలి. రాజ్‌దీప్: రాష్ట్రంపై రూ.4.42 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ డబ్బుల కోసమే మీరు కేంద్రంపై ఆధారపడ్డారా? సీఎం జగన్: ఇదంతా ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకే ఏ రాష్ట్రమైనా అప్పులు చేస్తుంది. ఆ పరిమితులను దాటి ఏ రాష్ట్రం కూడా అప్పు చేయలేదు. రాజ్‌దీప్: నేరుగా డీబీటీతో ఆర్థిక భరోసా కల్పించడం ద్వారానే మీరు తిరిగి మరోసారి అధికారంలోకి వస్తారని నమ్ముతున్నారా? ఇదే మీ విన్నింగ్ కార్డు అనుకోవచ్చా? సీఎం జగన్: ఇక్కడ సరిగా అర్థం చేసుకోవాలి. డబ్బు ఎక్కడికి.. ఎలా.. వెళ్లిందో చూడాలి. మేము ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇంగ్లిష్ మీడియంలోకి తీసుకొచ్చాం. ద్విభాషా పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించాం. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో ఐఎఫ్‌పీ ప్యానల్స్‌ను పెట్టి డిజిటల్ బోధన అందిస్తున్నాం. ప్రతి ఎనిమిదో తరగతి విద్యార్థి చేతిలో బైజ్యూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు పెట్టాం. ఇది సిలబస్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా చూస్తే విద్యా వ్యవస్థలో చాలా మార్పులు కనిపిస్తాయి. టోఫెల్ శిక్షణ కోసం ప్రత్యేక పీరియడ్ తీసుకొచ్చాం. ఇదంతా ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థుల కోసం జరుగుతోంది. 2025 విద్యా సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ విద్యార్థి ఐబీ సిలబస్‌లో చదువుకుంటాడు. 2035 నాటికి మా పిల్లలు ఐబీ బోర్డు పరీక్షలు రాస్తారు. ప్రతి ఏటా ఒక్కో తరగతికి ఐబీని అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాం. సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చే ప్రతి రూపాయి పేదవాడి భవితను మారుస్తోందనడానికి ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.రాజ్‌దీప్: 81 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను మీరు మార్చారు. వైఎస్సార్సీపీలో వన్ మ్యాన్ షో జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వైఎస్ జగన్ అనే పేరు చెప్పి ఈ రోజున ఓట్లు అడుగుతున్నారు. ప్రాంతీయ పారీ్టలో ఇది హైరిస్క్ ఫార్ములా కాదంటారా? సీఎం జగన్: ప్రతి రాజకీయ పార్టీకి ఒక సొంత సర్వే ఉంటుంది. ఆ సర్వేల ప్రకారం ఈ రోజున మా ప్రభుత్వం మీద, సీఎంగా నా మీద ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు. ఇది రియాలిటీ. అందుకే నేను చాలా నమ్మకంగా ఉన్నాను. రాజ్‌దీప్: అందుకేనా జగన్ పేరిటే ఓట్లు అడుగుతున్నారు? సీఎం జగన్: అవును. నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలకు ఒకటే చెబుతున్నా. ప్రస్తుతం జరుగుతున్నవి ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు కాదు. మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని వివరిస్తున్నా. ‘మీ భవిష్యత్ జగన్‌తో ఉంటే భద్రంగా ఉంటుంది. జగన్ ద్వారానే మీ భవిష్యత్ మంచి మలుపు తిరుగుతుంది’ అంటేనే వైఎస్సార్సీపీకి ఓటేయమని అడుగుతున్నా. అంతేకాదు.. గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినట్లయితేనే, మంచి పరిపాలన అందించారని భావిస్తేనే ఓటేయాలని అడుగుతున్న ఏకైక పార్టీ కూడా వైఎస్సార్సీపీ. రాజ్‌దీప్: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మీ సొంత చెల్లి షర్మిల ఇలా అందరూ అటు వైపు ఉంటే మీరొక్కరే ఇటువైపు ఉన్నారు. వాళ్లందరూ ఒక్కటిగా వస్తున్నారు. ఇది మీకు ఇబ్బందికరంగా లేదా? సీఎం జగన్: గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన నేను అందించాను. మంచి చేశాను కాబట్టే నేను ధైర్యంగా ఒంటరిగా ప్రజల్లోకి వెళుతున్నాను. ప్రజలకు కూడా నాపై నమ్మకం ఉంది. నన్ను ఒంటరిగా ఎదుర్కోడానికి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. అందుకే గుంపులుగా వస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 50 శాతం పైగా ఓట్లు ఎవరికి వస్తే వాళ్లు విజయం సాధిస్తారు.రాజ్‌దీప్: అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా చేసేందుకు చాలా కష్టపడ్డానని, ఎంతో ఖర్చు చేశానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ మీరు మూడు రాజధానులు మా విధానం అంటున్నారు. రాజధాని అంశం సుప్రీంకోర్టులో స్ట్రక్ అయ్యింది. శాశ్వత రాజధాని లేకుండా పరిపాలన ఎలా? రైతుల నుంచి భూములు తీసుకుంటే ప్రస్తుత సీఎం వాటిని వెనక్కు ఇచ్చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. సీఎం జగన్: అమరావతి ఎక్కడుంది.. అమరావతి అంటే ఏమిటనేది ముందుగా మనం ఆలోచించాలి. అమరావతి.. గుంటూరు, విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. 50 వేల ఎకరాల భూ సమీకరణ జరిగింది.‡ అదంతా మూడు పంటలు పండే భూమి. అమరావతి రాజధాని అనేది ఒక కుంభకోణం. తన సన్నిహితులు ముందే భూములు కొనుగోలు చేసేశాక అప్పుడు చంద్రబాబు అక్కడ రాజధానిని డిక్లేర్ చేశారు. రహదారులు, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికే వారి సొంత నివేదిక ప్రకారమే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుంది. అంటే మొత్తంగా రూ. లక్ష కోట్లు కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత డబ్బును రాష్ట్రం ఎక్కడి నుంచి తెస్తుంది? రాజ్‌దీప్: జగన్‌పై రాయితో దాడి చేయడం అనేది పూర్తిగా ఓ డ్రామా అని, అదంతా సింపతీ కోసం జగనే క్రియేట్ చేసుకున్నాడని చంద్రబాబు అంటున్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి, జైలుకు పంపారని, జగన్ ఆంధ్రాలో డిక్టేటర్‌గా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.. సీఎం జగన్: ఎవరి ద్వారా ఈ రాయి వచ్చింది? వాళ్ల మనుషుల ద్వారానే వచ్చింది. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ చంద్రబాబు నిలబడి, అదే వేగంతో అదే రాయితో కొట్టించుకుని, మూడు కుట్లు వేయించుకోమనండి. ఆయనకూ సింపతీ వస్తుంది.రాజ్‌దీప్: పాత కేసుల్లో సీఐడీని వాడి చంద్రబాబును జైలుకు పంపారని, జగన్ శత్రువులను, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లను ఈ విధంగా వేధిస్తారనే వాదన ఉంది. సీఎం జగన్: ఎవరు తప్పు.. ఎవరు ఒప్పు అనేది న్యాయస్థానం పెట్టే పరీక్షలో తేలుతుంది. చంద్రబాబుని 52 రోజులు జైలుకు పంపడం సరైనదేనని కోర్టులు భావించాయి. అంటే అతను ఏదో చేశాడనే కదా అర్థం. బెయిల్ అనేది ప్రతి ఒక్కరి హక్కు. అది ఏదో సమయంలో వస్తుంది. నిజం ఏంటంటే ఆ కుంభకోణం జరిగిందనడానికి సరిపడా ఆధారాలు ఉన్నాయి.రాజ్‌దీప్: ఎన్నికల అనంతరం కేంద్రంతోనూ, ప్రధానితోనూ మీ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? అభివృద్ధి కోసమే తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని చంద్రబాబు అంటున్నారు. సీఎం జగన్: ప్రస్తుతం చంద్రబాబు, మోదీ పొత్తులో ఉన్నారు. వారు పొత్తు పెట్టుకుంటే అభివృద్ధి కోసమా.. అదే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉంటే అది ఇంకోదానికోసమా?రాజ్‌దీప్: సర్వశక్తులు ఒడ్డుతున్న వారితో పోరాటంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నదేమిటి? సీఎం జగన్: అణగారిన వర్గాలు, నిరుపేదల జీవితాలను మార్చే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడని నేను గట్టిగా నమ్ముతాను. దాని కోసం దేవుని దయ వల్ల నేను ఏం చేయగలనో అది చేస్తున్నాను. నాకు కావాల్సింది.. నా కల ఒక్కటే. నేను మరణించినా ప్రజల గుండెల్లో బతికుండాలి. రాజ్‌దీప్: ఇంగ్లిష్ మీడియం విద్య, ఐబీ, ఇలాంటి విప్లవాత్మక మార్పులన్నీ గ్రామ స్థాయిలో సాధ్యం అవుతాయా? క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయని అందరూ అంటున్నారు.. సీఎం జగన్: ఎవరు అంటున్నారు? ఈ రోజు మీరు ఒక గ్రామానికి వెళ్లండి. మార్పు మీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఈ సచివాలయం ద్వారా ప్రజలకు గ్రామ స్థాయిలోనే 600 రకాల ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. 60, 70 ఇళ్లకు ఒక వలంటీర్ ఉంటున్నారు. వీళ్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి గ్రామస్తుడి చేయి పట్టి ముందుకు నడిపే కార్యక్రమం చేస్తున్నారు. అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తే వైఎస్సార్ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు ముందుకు వెళితే ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ బడి ఉంటుంది. ఇంకొంచెం ముందుకు పోతే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది. ఇవన్నీ గ్రామ స్థాయిలో అభివృద్ధికి తార్కాణాలు. గతంలో ఇవన్నీ ఎక్కడా మనకు కనిపించేవి కాదు. ప్రభుత్వం లేదా ఒక పెద్ద పరిశ్రమ ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి కల్పన సాధ్యపడదు. ఎకానమీని డ్రైవ్ చేసే ఎంఎస్ఎంఈలు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్లను మేం ప్రోత్సహించాం. ఈ రోజున 62 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అదే విధంగా స్వయం సహాయక బృందాల్లోని మహిళలు, మత్స్యకారులు, స్ట్రీట్ వెండర్స్, బార్బర్స్, టైలర్లు, ఆటో డ్రైవర్లు వీళ్లంతా రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తారు. ఈ క్రమంలో వీరందరికీ బ్యాంక్‌లు, వివిధ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూతగా నిలిచాం. రాజ్‌దీప్: మీరేమో అవినీతి లేదంటున్నారు? ప్రతిపక్ష నేత చంద్రబాబు భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు.. సీఎం జగన్: చంద్రబాబు నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయి అలా మాట్లాడుతున్నారు. మీరే నేరుగా ప్రజల దగ్గర మైక్ పెట్టి అడగండి. మేము చెప్పిన హామీలు, పథకాలతో ఎంత ఆరి్థక మేలు జరిగిందో చెబుతారు. పైస్థాయిలో నేను చెప్పిన ప్రతి రూపాయి కింది స్థాయిలోని లబి్ధదారులకు నేరుగా చేరింది. సంక్షేమ పథకాలకు సంబంధించి డీబీటీ ద్వారా కోట్ల రూపాయలు లబి్ధదారుల ఖాతాల్లో పడుతుంటే అవినీతి, వివక్ష ఎక్కడ ఉంటుంది? రాజ్‌దీప్ : ఈ ఎన్నికల్లో మీ సోదరి మీకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇది ప్రతిష్టకు భంగంగా భావిస్తున్నారా? సీఎం జగన్: ఆమె డిపాజిట్ కోల్పోతుండటం నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఏ పార్టీ అయితే నా తండ్రి పేరును సీబీఐ చార్జ్ షీట్లో చేర్చిందో.. ఏ పార్టీ అయితే కలి్పత కేసులను నాపై పెట్టిందో అందరికీ తెలుసు. అవి కాంగ్రెస్, టీడీపీలు. ఈ రోజు నా సోదరిని ఎవరు నడిపిస్తున్నారో తెలుసా.. రేవంత్ ద్వారా చంద్రబాబు నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రిమోట్ చంద్రబాబు చేతిలో ఉంది. బీజేపీ రిమోట్ చంద్రబాబు చేతిలో ఉంది. ఈ రోజు జగన్ ఫైట్ చేస్తోంది కేవలం ఒక్క బీజేపీతోనే కాదు. కాంగ్రెస్‌తో కూడా.రాజ్‌దీప్: కేంద్రంలో అధికారం కోసంమోదీకి సీట్లు తగ్గితే మీరు 20 ఎంపీ సీట్లతో సపోర్ట్ చేస్తారా? సీఎం జగన్: ఊహాజనిత పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడటం.. ఇప్పుడు వారు నేను ఒకరికొకరం వ్యతిరేకంగా పోరాడుతున్నాం. -
Lok sabha elections 2024: హెడ్లైన్లు కాదు.. డెడ్లైన్ల కోసం పని చేస్తున్నా
న్యూఢిల్లీ: మీడియాలో ప్రచారం కోసం, పత్రికల్లో హెడ్లైన్ల కోసం తాను ఆరాటపడే వ్యక్తిని కాదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. హెడ్లైన్ల కోసం కాకుండా, డెడ్లైన్ల కోసం పని చేస్తున్నామని స్పష్టం చేశారు. శనివారం ‘ఇండియా టుడే’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. తొలుత ఇండియా టుడే ఎడిటర్–ఇన్–చీఫ్ అరుణ్ పురీ ప్రారం¿ోపన్యాసం చేశారు. 2029 జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం మోదీ సిద్ధమవుతున్నారని చెప్పారు. అనంతరం మోదీ ప్రసంగించారు. 2029 ఎన్నికల కోసం కాదు, 2047 ఎన్నికల కోసం సిద్ధమవుతున్నానని పేర్కొన్నారు. మీరు 2029లోనే ఆగిపోయారు, నేను మాత్రం 2047 కోసం ఇప్పటినుంచే కార్యాచరణ ప్రారంభించానని అరుణ్ పురీని ఉద్దేశించి చెప్పారు. మోదీ ఏం చేయబోతున్నారో తెలుసుకోవడానికి మీ మొత్తం బృందాన్ని రంగంలోకి దించండి అని సూచించారు. తాము వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి, అధికారం నిలబెట్టుకుంటామని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో దేశ ప్రజలు నిర్ణయాత్మక విధానాలను చూడబోతున్నారని చెప్పారు. కీలకమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయబోతున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్ మాత్రం వృద్ధిబాటలో మరింత వేగంగా పరుగులు తీయబోతోందని స్పష్టం చేశారు. ‘దేశమే ప్రథమం’ అనే విధానంతో తాను ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. కొందరికి మాత్రం ‘కుటుంబమే ప్రథమం’ అంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ‘స్థిరమైన, సమర్థవంతమైన, బలమైన ఇండియా’ అనేది వచ్చే ఐదేళ్ల కాలం ప్రపంచానికి ఇవ్వబోతున్న గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. దేశంలో అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరబోతోందన్నారు. అవినీతిని సహించం అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, ఈ విషయంలో దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. అవినీతిని సహించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. తాము అవినీతిపై ఉక్కుపాదం మోపుతుండడంతో కొందరు కడుపు మంటతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు తనను ఇష్టానుసారంగా దూషిస్తున్నారని, వారిని ప్రజలు ఏమాత్రం విశ్వసించడం లేదని చెప్పారు. తమ పదేళ్ల పదవీ కాలంలో పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశామని, వాటికి మీడియాలో గుర్తింపు రానప్పటికీ లబి్ధదారులపై ఎంతో ప్రభావం చూపాయని వివరించారు. కాలం చెల్లిన వందలాది చట్టాలను, నియంత్రణలను తొలగించామని మోదీ గుర్తుచేశారు. -
ఇండియా టుడే యాంకర్ తో సీఎం జగన్ సరదా సన్నివేశం
-
సీఎం జగన్ గురించి ఇండియా టుడే శివాని సింగ్ గొప్ప మాటలు
-
సీఎం జగన్ సమాధానాలకు ఇండియా టుడే క్లాప్స్
-
ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో సీఎం జగన్
-
చంద్రబాబు అరెస్ట్ పై..సీఎం జగన్ కామెంట్స్
-
వైఎస్సార్ కుటుంబంపై విభజించు–పాలించు ప్రయోగం: సీఎం జగన్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో తన సంక్షేమాభివృద్ధి పాలనే గీటురాయిగా వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేయడమే కాకుండా.. ఆ మేనిఫెస్టోను ప్రజల దగ్గరకు తీసుకెళ్లి ఆమోదం పొందుతున్నట్టు చెప్పారు. గ్రామ/వార్డు సచివాలయ, వలంటీర్ వ్యవస్థతో ప్రజల చెంతకే పాలనను తీసుకెళ్లడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. అర్హతే ప్రామాణికంగా, అవినీతికి తావులేకుండా రూ.2.53 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. దీనికి తోడు విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారతలో విప్లవాత్మక మార్పులతో ప్రజల జీవన ప్రమాణాలను పెంచామని చెప్పారు. 56 నెలల పాలనలో తన శాయశక్తులా, చిత్తశుద్ధితో ప్రజల కోసం పని చేశానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నానన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ మళ్లీ నీచ రాజకీయాలు మొదలు పెట్టిందన్నారు. విభజించు.. పాలించు విధానాన్ని రాష్ట్రంలోనే కాకుండా వైఎస్సార్ కుటుంబంలోనూ అమలు చేస్తోందన్నారు. తిరుపతిలో రెండో రోజు బుధవారం జరిగిన ‘ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్’లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు. రాజ్‌దీప్: వచ్చే ఎన్నికల్లో మీ ఐదేళ్ల పాలన చూపి ఓట్లు అడగడం సులభంగా ఉంటుందా? లేక 2019కి ముందు ప్రతిపక్షంలో యాత్ర చేసి ఓట్లు అడిగారు.. గెల్చారు. రెండింటిలో ఏది బాగుందని అనుకుంటున్నారు? సీఎం జగన్: వాస్తవం కంటే విశ్వాసం అనేది ఎప్పటికైనా బలమైంది. నా విషయంలో నేను ఏం చెప్పాను? ఏ హామీలు ఇచ్చాను? ఏం చేశాను? అన్న దే ముఖ్యం. మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో 99 శాతం అమలు చేశాం. అంతటితో ఆగకుండా ఆ మేని ఫెస్టోను తీసుకెళ్లి ప్రజలకు చూపించి వారి ఆమోదం పొందుతున్నాం. ప్రజల్లో ఇదే మా ప్రభుత్వంపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుతోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో విప్లవాత్మక పాలనకు శ్రీకారం చుట్టాం. ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను ఇంటికే అందజేస్తున్నాం. మా పాలనలో ఎక్కడా వివక్ష చూపడం లేదు. అర్హతే ప్రామాణికంగా ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నాం. అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా సాయం అందిస్తున్నాం. రాజ్‌దీప్: మేనిఫెస్టో అమలు, అవినీతికి తావు లేకుండా డీబీటీ ద్వారా పథకాల పంపిణీ.. ఇవే మీ ప్రచార అంశాలా? సీఎం జగన్: మొత్తం మార్పులో డీబీటీ ఒక భాగం మాత్రమే. నిజం చెప్పాలంటే.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చాలా మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ పనితీరు మారింది. మహిళా సాధికారత పెరిగింది. వీటన్నింటికీ తోడుగా డీబీటీ పేదల జీవన పరిస్థితులను మెరుగు పర్చింది. ఇందులో ఎక్కడా వివక్ష, అవినీతికి తావు లేకుండా చేశాం. ఇవన్నీ మా ప్రభుత్వాన్ని నిలబెడతాయనే దృఢమైన విశ్వాసం మాకుంది. రాజ్‌దీప్: మీరు చేసిన మంచే మిమ్మల్ని గెలుపిస్తుందని అంటున్నారు. కానీ, విపక్షాలు మాత్రం మీ ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని, అవినీతి పెరిగిందని ఆరోపిస్తున్నాయి.. దీనికి మీ సమాధానం? సీఎం జగన్: ఏ పార్టీ కూడా మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పలేదు. ఏ ఒక్క నాయకుడు కూడా మేము అవినీతి చేశామని చూపలేరు. ఎందుకంటే ఈ 56 నెలల్లో వివిధ పథకాల ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లో పూర్తి పారదర్శకంగా రూ.2.53 లక్షల కోట్లు డీబీటీ విధానంలో జమ చేశాం. ఇలా గతంలో ఎందుకు చేయలేదన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు. రాజ్‌దీప్: 2024లో మీ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి పార్టీలు ఎవరని భావిస్తున్నారు? సీఎం జగన్: రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు నామమాత్రమే. కాంగ్రెస్, బీజేపీకి ఇక్కడ బలం లేదు. కాబట్టి సహజంగానే ఇక్కడ మా వైఎస్సార్ సీపీకి, తెలుగుదేశం–జనసేన కూటమితో పాటు, వారికి మద్దతు ఇచ్చే వారితోనే పోటీ ఉంటుంది. రాజ్‌దీప్: చంద్రబాబు బీజేపీకి సన్నిహితంగా ఉన్నారు కాబట్టే రామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్లారనిపిస్తుంది? మీరు ఇష్యూ ఆధారంగా బీజేపీకి సపోర్టు చేస్తూ వచ్చారు? ఆంధ్రా పార్టీలను బీజేపీ, మోదీల విషయంలో ఎలా చూడాలి? సీఎం జగన్: మాకు తొలి నుంచి ఒక స్పష్టమైన విధానం ఉంది. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సయోధ్య కొనసాగిస్తున్నాం. రాజ్‌దీప్: 2009లో ఎంపీగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్‌కు.. ఇప్పటి సీఎం జగన్‌కు మధ్య మార్పు ఏమిటి? సీఎం జగన్: రాజకీయాల్లో నా ప్రస్థానం, నాలో మార్పులను నా కంటే మీరే (రాజ్‌దీప్) ఇంకా బాగా చెప్పగలరు. ఈ 56 నెలల పాలనలో నా వంతుగా నేను శాయశక్తులా, చిత్తశుద్ధితో పని చేశా. దాన్ని ఆత్మ విశ్వాసంతో చెప్పగలను. కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలు తాకాను. అది నాకెంతో తృప్తినిస్తోంది. అన్ని బహిరంగ సభల్లో నేను ఒకటే చెబుతున్నాను. నేను మీకు మంచి చేశానని అనుకుంటే, మీకు మేలు జరిగిందని భావిస్తే.. నాకు తోడుగా నిలవమని ప్రజలను కోరుతున్నాను. రాజ్‌దీప్: మీ చెల్లెలు షర్మిలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది? ఇది వైఎస్సార్ లెగస్సీలో చీలకతేవడం కాదా? వైఎస్సార్ వల్లే కదా 2004, 2009లో యూపీఏ అధికారంలోకి వచ్చింది.. కానీ, కాంగ్రెస్ మీ విషయంలో చేస్తున్నదానికి కోపం లేదా? సీఎం జగన్: రాష్ట్రంలో కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోంది. వారి స్వార్థం కోసం ఆనాడు రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారు. విభజించు– పాలించు అన్నది రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా, మా కుటుంబంలో కూడా చేశారు. నేను కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిలబడినప్పుడు నా సొంత బాబాయిని మంత్రిగా చేశారు. తర్వాత మా పార్టీ అభ్యర్థిపైనే పోటీకి నిలబెట్టారు. ఆ విధంగా కాంగ్రెస్ ఎప్పుడూ విభజించు–పాలించు అన్న రాజకీయాలే చేసింది. ఇప్పుడు కూడా అదే చేశారు. నా కుటుంబాన్ని విడగొట్టారు. మా చెల్లిని తీసుకొచ్చి, ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిని చేశారు. కానీ, వారొక విషయాన్ని మర్చిపోతున్నారు. పైన దేవుడనే వాడు న్నాడు. ఎవరికి ఎప్పుడు, ఎలా గుణపాఠం చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. నాకు ఆ నమ్మకం ఉంది. కాంగ్రెస్ చేసిన పనులకు తగిన ఫలితం అనుభవించక తప్పదు. రాజ్‌దీప్: మాజీ సీఎం చంద్రబాబు జైలుకు వెళ్లాడు. దీనిని ప్రతీకార రాజకీయంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి? సీఐడీని దుర్వినియోగం చేశారనడం నిజమేనా? సీఎం జగన్: చంద్రబాబు అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. అందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టే.. కోర్టు జైలుకు పంపింది. అలాంటప్పుడు ఎవరైనా అది ప్రతీకార రాజకీయమని ఎలా అంటారు? ఎవరైనా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయలేరు. ఎందుకంటే, ఏం చేసినా కోర్టుల్లో లిట్మస్ టెస్ట్ ఉంటుంది కదా? ఆధారాలు లేకపోతే, ఆరోపణల్లో వాస్తవాలు లేకపోతే, కేసులు కోర్టుల్లో నిలబడవు కదా? ఆధారాలు ఉన్నాయని కోర్టులు కన్విన్స్ అయితే తప్ప, నిర్ణయాలు తీసుకోవు కదా? పైగా ఇక్కడ హైప్రొఫైల్ కేసు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏ సీఎం కూడా, అలాంటి చర్యలకు దిగరు. కచ్చితమైన ఆధారాలు ఉంటే తప్ప.. కేసు బలంగా ఉంటే తప్ప.. అలాంటివి జరగవు కదా! రాజ్‌దీప్: మీ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మారుస్తున్నారు. కొందరు బయటకు వెళ్తున్నారు. ఇది వ్యతిరేకతను పెంచదా? సీఎం జగన్: ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ స్వయంగా సర్వే నిర్వహిస్తుంది. దాని ప్రకారం వ్యూహ రచన ఉంటుంది. మేము ప్రజలకు మనస్ఫూర్తిగా చాలా మేలు చేశాం. ఇదే మా ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకాన్ని పదిలం చేసింది. కానీ స్థానికంగా కొందరు నాయకుల తీరు, ప్రజలతో మమేకం కాకపోవడం, వారిపై వ్యతిరేకత కారణాలతో మార్పులు, చేర్పులు అనివార్యం అయ్యింది. మాకు సంబంధించి.. ఎన్నికలు మరో 70, 80 రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఆఖరి క్షణం వరకు ఆగి అప్పుడు మార్పులు చేస్తే లేనిపోని గందరగోళం సృష్టించినట్టు అవుతుంది. దానికి బదులు ముందుగా చేస్తే అందరికీ క్లారిటీ ఉంటుంది. అదే ప్రభుత్వం.. అదే బడ్జెట్. గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే.. ఇప్పుడే అప్పులు తక్కువ. ఇక్కడ మారిందల్లా సీఎం మాత్రమే. ఈ ప్రభుత్వం ఇన్ని చేయగలిగినప్పుడు.. గతంలో ఎందుకు చేయలేదన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ఇదే నాంది. – సీఎం వైఎస్ జగన్ -
24న సీఎం జగన్ తిరుపతి పర్యటన
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి(బుధవారం) తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం జరగనున్న ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం జగన్ పాల్గొననున్నారు. 24వ తేదీ మధ్యాహ్నం తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ తిరుపతికి బయలుదేరి వెళ్లనున్నారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొని.. అనంతరం ఆయన తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక.. సీఎం జగన్ తిరుపతి పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి: మా కుమారుడికి పునర్జన్మనిచ్చారు -
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
-
ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్.. తెలంగాణలో అధికారం ఎవరిదంటే?
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే పలు సర్వేలు ఆసక్తికర వివరాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా తెలంగాణ ఎన్నికలపై ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ సర్వే కీలక నెంబర్లను వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్ పేర్కొంది. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. BRS.. 34-44 Congress.. 63-73 BJP.. 4-8 Others.. 5-8 ఇక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నట్టు స్పష్టం పేర్కొంది ఇండియా టుడే. బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు దాదాపు లేనట్టేనని ఇండియా టుడే తెలిపింది. ఇక, గురువారం ఎగ్జిట్‌పోల్స్‌లో పలు సర్వేలు కాంగ్రెస్, బీజేపీకి రెండింటికి ఛాన్స్ ఉందని తెలిపిన విషయం తెలిసిందే. According INDIA Today - Axis my India Congress winning 68 seats I. Telangana!#ExitPolls #ExitPolls2023 #ExitPoll pic.twitter.com/WoeSqLf8t1 — Ashish Singh (@AshishSinghKiJi) December 1, 2023 -
ఎన్నికల్లో గెలుపు కోసం తాంత్రిక పూజలా?
భోపాల్: కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ తన గెలుపుకోసం మంత్ర పూజలు చేయిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు వైరల్‌గా మారాయి. ఉజ్జయినిలోని ఓ శ్మశానంలో ఓ తాంత్రికుడు కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ చిత్రపటం ఎదురుగా పెట్టుకుని నిమ్మకాయలు, పూలు, క్షుద్రపూజల సామగ్రితో పూజలు చేస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కమల్‌నాథ్ ముఖ్యమంత్రి కావాలనే ఈ పూజలు జరిపిస్తున్నట్లు తాంత్రిక పూజారి భయ్యూ మహరాజ్ ‘ఇండియా టుడే’టీవీ ప్రతినిధికి చెప్పడం విశేషం. ఈ వ్యవహారంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ‘ఎవరైనా భక్తి మార్గంలో లేదా ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవ్వాలనుకుంటే, దానిని స్వచ్ఛంగా, ధర్మబద్ధంగా నిర్వహించుకోవాలి. అదికాదని, ఇలా క్షుద్రపూజలు చేయడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది’అని పేర్కొన్నారు. ‘మేం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు చేరువవుతున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవలు చేయాలి. వారి విశ్వాసాన్ని గెలుచుకోవడానికి, వారికి సేవ చేయడానికి ఇదే మార్గం. కొందరు మాత్రం శ్మశానవాటికలో ‘తాంత్రిక క్రియ’లు నిర్వహిస్తున్నారు. వీటితో దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా ఉపయోగముందా?’అని చౌహాన్ ప్రశ్నించారు. -
Karnataka Assembly election 2023: కర్నాటకలో మెజార్టీకి మించి...
బెంగళూరు: కర్ణాటకలో అధికార పీఠాన్ని నిలబెట్టుకుంటామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. ‘‘మెజార్టీ కంటే 15 నుంచి 20 సీట్లు ఎక్కువే గెలుస్తాం. కొందరు సీనియర్ నేతలు పార్టీని వీడినా క్షేత్రస్థాయిలో మద్దతు ఏమాత్రం తగ్గలేదు. చరిత్ర చూసినా బీజేపీ రెబెల్స్ గెలిచిన సందర్భాలు లేవు. ఈసారీ అదే నిరూపితమవనుంది’’ అని శనివారం ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటుపడటంపై బీజేపీని కాంగ్రెస్ పార్టీ విమర్శించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ దేశంలో ఏ కుటుంబం కూడా చట్టం కంటే గొప్పదికాదు. అన్నింటికంటే చట్టమే అత్యున్నతమైంది’ అని వ్యాఖ్యానించారు. ఎంపీ బంగ్లా ఖాళీచేస్తూ ఈ ఉదంతంలో బాధితుడినయ్యానని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై షా స్పందించారు. ‘ ఓబీసీలను కించపరిచేలా మాట్లాడాలని రాహుల్‌ను మేం అడగలేదు. ఇప్పుడు క్షమాపణ చెప్పకూడదని నిర్ణయించుకుంది కూడా ఆయనే. ఏ చట్టం కింద అయితే ఆయన దోషిగా తేలారో ఆ చట్టం కాంగ్రెస్ హయాంలో రూపొందిందే. ఆ చట్టాన్ని ఉపసంహరించేందుకు నాటి ప్రధాని మన్మోహన్ ప్రయత్నిస్తే ఆర్డినెన్స్ పత్రాలు చించి రాహులే అడ్డుకున్నారు. ఇప్పుడు ‘బాధితుడిని’ అంటూ నాటకాలు ఆడొద్దు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ మోదీని విమర్శించారనే జమ్మూకశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ సమన్లు జారీచేసిందనేది అబద్ధం. గతంలోనూ ప్రశ్నించేందుకు ఆయనను సీబీఐ పిలిచింది’ అని గుర్తుచేశారు. ఏటీఎంలా వాడుకున్న కాంగ్రెస్ ‘‘కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఇంతవరకూ ఏ కోర్టులోనూ నిరూపణకాలేదు. ఇవన్నీ కాంగ్రెస్ కట్టుకథలు’’ అని అమిత్ షా అన్నారు. అధికారంలో ఉండగా కాంగ్రెసే రాష్ట్రాన్ని ‘ఏటీఎం’లా వాడుకుందని ఆరోపించారు. ‘‘యూపీఏ హయాంలో 2009–19లో కర్ణాటకకు కేవలం రూ.94 వేల కోట్ల నిధులొచ్చాయి. మా హయాంలో 2014–19లో ఏకంగా రూ.2.26 లక్షల కోట్ల నిధులు ఇచ్చి ఆదుకున్నాం. వాళ్లు పన్నులు, గ్రాంట్–ఎయిడ్ కింద రూ.22 వేల కోట్లు ఇస్తే మేం రూ.75 వేల కోట్లు ఇచ్చాం’’ అని చెప్పారు. -
Mood of the Nation: ఎన్డీఏ కూటమికి నితీశ్ దెబ్బ!
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ దెబ్బకొట్టేలా కన్పిస్తున్నారు. ఎన్డీఏ సంకీర్ణం నుంచి నితీశ్ కుమార్ బయటకు వెళ్లిపోవడం దెబ్బేనని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ వెల్లడించింది. ఇప్పటికిప్పుడు (ఆగస్టు 1) లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 307 సీట్లు సాధిస్తుందని పోల్ ఆధారంగా వెల్లడైంది. అయితే బీజేపీతో నితీశ్ తెగతెంపులు చేసుకోవడంతో ఎన్డీఏ సాధించే సీట్ల సంఖ్య తగ్గుతుందని పేర్కొంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉంది. ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ చెక్కు చెదరలేదని పోల్‌లో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ ఆయనే ప్రధానమంత్రి అవుతారని తేల్చింది. ఎన్డీఏకు 307, యూపీఏకు 125 సీట్లు వచ్చే అవకాశముంది. ఇతరులు 111 స్థానాలు దక్కించుకుంటారని అంచనా. సీ-ఓటర్‌తో కలిసి ఆగస్టు 1 వరకు ఇండియా టుడే ఈ పోల్ నిర్వహించింది. అయితే ఇప్పుడు నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు కాబట్టి ప్రత్యక్షంగా 21 సీట్లు తగ్గుతాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిహార్‌లో ప్రత్యర్థులను ఎదుర్కొని బీజేపీ ఏమేరకు ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి. (క్లిక్: ప్లీజ్ వదిలేయండి.. ఆ విషయం మళ్లీ అడగకండి) -
ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలొస్తే.. బిహార్‌లో వారిదే హవా
పట్నా: జనతాదళ్ (యునైటెడ్) నేత నితీశ్ దెబ్బకు ఎన్డీఏ చేజారిన బిహార్‌లో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు గనక వస్తే ఆ కూటమికి ఎదురుదెబ్బ తప్పదని ఇండియాటుడే–సీ వోటర్ బుధవారం జరిపిన స్నాప్ పోల్ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీఏకు 14 దక్కుతాయని పేర్కొంది. ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్, వామపక్షాల మహా ఘట్బంధన్ 26 స్థానాలు సొంతం చేసుకుంటుందని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 39 సీట్లు నెగ్గగా ఘట్బంధన్ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన విషయం తెలిసిందే. జేడీ(యూ) అప్పుడు ఎన్డీఏ భాగస్వామిగా ఉంది. ఎన్డీఏకు ఓట్లు 54 నుంచి 41 శాతానికి తగ్గనున్నాయి. అయితే నితీశ్‌కు జనాదరణ తగ్గుతోందని సర్వే తేల్చడం విశేసం. తర్వాతి సీఎం ఎవరన్న ప్రశ్నకు ఏకంగా 43 మంది బిహారీలు ఆర్జేడీ నేత, లాలుప్రసాద్ తనయుడు తేజస్వీ యాదవ్‌కు ఓటేశారు. సుపరిపాలనకు చిరునామాగా చెప్పే నితీశ్‌ను 24 శాతం మందే ఎంచుకున్నారు. 19 శాతం మంది బీజేపీ నేత సీఎం కావాలని కోరుకున్నారు. చదవండి: (ప్రధాని మోదీకి బిహార్ సీఎం నితీశ్ కుమార్ 2024 సవాల్!) -
ఎన్నికలొస్తే... కేంద్రంలో మళ్లీ బీజేపీయే
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా వరుసగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోదీనే కోరుకుంటున్నారని సీ ఓటర్– ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చింది. నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే) సీట్ల సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని చెప్పింది. ఎంపీల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని తేల్చింది. అయితే జాతీయ స్థాయిలో మోదీకి, బీజేపీకి ఆదరణ చెక్కుచెదరకున్నా... రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క సీఎంకు పూర్తిస్థాయి ప్రజాదరణ కనిపించడం లేదు. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క సీఎం కూడా సంతృప్తకర పాలన అంశంలో సగం మార్కు అయిన 50 శాతాన్ని దాటలేకపోవడం గమనార్హం. అలాగే ఐదు రాష్ట్రాల సీఎంలపైనా 34 శాతం మంది ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉండటం గమనార్హం. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగింటిలో బీజేపీ సీఎంలే ఉన్నారు. పాలన సంతృప్తకర స్థాయిలో ఉందనే అంశంలో ఐదు రాష్ట్రాల్లో పోల్చినపుడు 49 శాతం అనుకూల ఓట్లతో అందరికంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌యే ఆధిక్యంలో ఉన్నారు. విశేషమేమిటంటే వ్యతిరేకతలోనూ ఆయనే టాప్. దేశంలో అన్నింటికంటే పెద్ద రాష్ట్రమైన యూపీ, 2.13 కోట్ల ఓటర్లున్న పంజాబ్‌లతో కలిపి మొత్తం ఐదు రాష్ట్రాల్లో 18.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సర్వే దేశ జనాభాలో మొత్తం 12.8 శాతం మంది అభిప్రాయాలను ప్రతిఫలిస్తుందనుకోవచ్చు. ► ఎవరు చేశారు: (మైక్, రిసీవర్ ఫోటోస్) సీ ఓటర్– ఇండియా టుడే టీవీ సంయుక్త సర్వే ► ఎక్కడ చేశారు: ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో. ► సర్వే శాంపిల్ (ఎంతమందిని ఇంటర్వ్యూ చేశారో చెప్పే సంఖ్య): 60,141 ► తొలిదశలో: 20,566 (ఆగస్టు 16, 2021– జనవరి 10– 2022 మధ్య) ► మలిదశలో: 39,575 (గత మూడు వారాల్లో) ఎలా చేశారు: కరోనా నేపథ్యంలో ప్రత్యక్షంగా చేయకుండా టెలి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. ప్రేమించు లేదా ద్వేషించు ఐదు రాష్ట్రాల సీఎంలతో పోల్చిచూసినపుడు అనుకూలత– వ్యతిరేకతల్లో యూపీ సీఎం యోగియే టాప్‌లో ఉన్నారు. అంటే కరడుగట్టిన హిందూత్వ వాదిగా పేరుపడ్డ యోగిని ప్రేమించే వాళ్లు ఎంత అధికంగా ఉన్నారో... ద్వేషించే వాళ్లూ అధికాంగానే ఉన్నట్లు లెక్కని ఇండియా టుడే ఎడిటోరియల్ డైరెక్టర్ రాజ్ చెంగప్ప, ఇతరు నిపుణులు అభిప్రాయపడ్డారు. సామర్థ్యాన్ని శంకించే వారు సొంత పార్టీలోనే ఎక్కువ కాంగ్రెస్‌కు ఈ వైల్డ్‌కార్డ్ బాగానే పనిచేస్తోంది. అయితే పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సామర్థ్యాన్ని శంకించే వారిలో బయటివారికంటే సొంత పార్టీలోనే ఎక్కువగా ఉన్నారు. -
సీనియర్ పాత్రికేయులు ఎం.రాజేంద్ర కన్నుమూత
బంజారాహిల్స్: సీనియర్ జర్నలిస్ట్, కథా రచయిత ముత్తిరేవుల రాజేంద్ర (84) బంజారాహిల్స్ జర్నలిస్ట్ కాలనీ లోని తన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య రాజేశ్వరితో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. రాజేంద్ర ఇండియాటుడే తెలుగు ఎడిషన్‌కు మొదటి ఎడిటర్‌గా పనిచేయడంతో పాటు కథా రచయితగానూ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన ఈనాడు చీఫ్ సబ్ఎడిటర్గా, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, జనతా పత్రికలలో కూడా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఇండియాటుడే వార్షిక సాహిత్య సంచిక తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత రాజేంద్రదే. చిత్తూరు జిల్లా అరగొండకు చెందిన రాజేంద్ర అపోలో ఆస్పత్రిచైర్మన్ ప్రతాప్‌రెడ్డికి బంధువు. ఆయన అంత్యక్రియలు మంగళవారం పంజాగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించారు. చదవండి: మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య ఇకలేరు.. -
రాజ్‌దీప్ సర్దేశాయ్పై ఇండియా టుడే చర్యలు
న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్టు, ఇండియా టుడే న్యూస్ ప్రజెంటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రైతు ఆందోళనలకు సంబంధించి చేసిన ట్వీట్ ఆయనను చిక్కుల్లో పడేసింది. ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం నాడు ట్రాక్టర్ల ర్యాలీతో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ సిక్కు వ్యక్తి మరణించారు. ఈ విషయంపై స్పందించిన రాజ్‌దీప్ సర్దేశాయ్.. ‘‘ పోలీసు కాల్పుల్లో 45 ఏళ్ల నవనీత్ మరణించాడు. అతడి త్యాగం వృథాగా పోనివ్వమని రైతులు నాకు చెప్పారు’’ అని ట్వీట్ చేశారు. వాస్తవానికి ట్రాక్టర్ బోల్తాపడటంతో నవనీత్ మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. బారికేడ్ల వైపు ట్రాక్టర్‌పై వేగంగా దుసుకువచ్చిన నవనీత్, వాహనం పల్టీ కొట్టడంతో తీవ్రగాయాల పాలయ్యారు. తల పగలడంతో ఆయన మృత్యువాత పడినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. దీంతో రాజ్‌దీప్ సర్దేశాయ్పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.(చదవండి: రైతు ఉద్యమంలో చీలికలు) ఈ క్రమంలో ఆయన ట్వీట్ డెలీట్ చేశారు. అనంతరం.. ట్రాక్టర్ మీద ఉండగానే, పోలీసులు నవనీత్‌ను కాల్చేశారని రైతులు ఆరోపించినట్లు మరో ట్వీట్ చేశారు. ఢిల్లీ పోలీసులు షేర్ చేసిన వీడియోను పోస్ట్ చేసి, అందులో ట్రాక్టర్ బోల్తా పడినట్లు స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో పూర్తి సమాచారం తెలుసుకోకుండా ప్రజలను పక్కదోవ పట్టించేలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ ఇండియా టుడే గ్రూప్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల పాటు సస్పెండ్ చేయడంతో పాటు నెల జీతం కోత విధించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్, న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్నారు. He posted (and later deleted) this tweet at such a sensitive time? Unbelievable pic.twitter.com/ZLUlbl54Ug — Swati Goel Sharma (@swati_gs) January 26, 2021 While the farm protestors claim that the deceased Navneet Singh was shot at by Delhi police while on a tractor, this video clearly shows that the tractor overturned while trying to break the police barricades. The farm protestors allegations don’t stand. Post mortem awaited.👇 pic.twitter.com/JnuU05psgR — Rajdeep Sardesai (@sardesairajdeep) January 26, 2021 -
మన్మోహన్ కన్నా మోదీ సర్కార్ బెటర్..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఏర్పడిన అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని ‘ఇండియా టుడే – కార్వీ’ సంయుక్తంగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే తేల్చింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రకటించిన లాక్డౌన్ కారణంగా గత 4 దశాబ్దాల్లో తొలిసారి భారత్ ఆర్థికమాంద్యం బారిన పడింది. పారిశ్రామిక రంగం, సేవల రంగం వృద్ధి నిలిచిపోయింది. నిరుద్యోగం ప్రబలింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థిక రంగాన్ని ప్రభుత్వం సమర్దవంతంగా నిర్వహించిందని ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ వెల్లడించింది. ఆర్థిక రంగంలో మోదీ ప్రభు త్వ తీరు అద్భుతంగా ఉందని సర్వేలో పాల్గొన్న వారిలో 20%, బావుందని 46%, సాధారణంగా ఉందని 21% అభిప్రాయ పడ్డారు. కరోనా, లాక్డౌన్ల కారణంగా తమ ఆర్థిక పరిస్థితి దిగజారిందని 12% ప్రజలు పేర్కొన్నారు. 2020 జనవరిలో జరిగిన మూడ్ ఆఫ్ ది నేషన్‌లో కరోనా, లాక్డౌన్ల వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారిందని 27% ప్రజలు వెల్లడించడం గమనార్హం. మన్మోహన్ కన్నా బెటర్.. ఆర్థిక రంగ నిర్వహణలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కన్నా మోదీ సర్కారు మెరుగ్గా వ్యవహరించిందని 47% ప్రజలు తెలిపారు. 36% మాత్రం యూపీఏ ప్రభుత్వంతో సమానంగా ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు ఉందన్నారు. ఆర్థిక రంగ నిర్వహణలో యూపీఏతో పోలిస్తే ఎన్డీఏ పనితీరు అత్యంత దారుణంగా ఉందని 13% ప్రజలు పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక రంగ ఉద్దీపన పథకాలతో తమ ఆర్థిక పరిస్థితిలో మార్పేంలేదని 43%, పరిస్థితి దిగజారిందని 20%, సానుకూల మార్పు వచ్చిందని 35% ప్రజలు తెలిపారు. -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏకు 321 సీట్లు!
న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో చైనా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు, దేశవ్యాప్తంగా కరోనా, అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థ.. ఇలా అసాధారణ వరుస సవాళ్లను ఎదుర్కొన్న ఏ ప్రభుత్వ ప్రజాదరణ అయినా సహజంగానే తగ్గుముఖం పడుతుంది. కానీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రజాదరణ మాత్రం ఈ అసాధారణ సవాళ్లలోనూ చెక్కు చెదరలేదని, ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని ‘ఇండియా టుడే –కార్వీ’ జరిపిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంఓటీఎన్)’ సర్వే తేల్చింది. మెజారిటీ మార్క్‌ను దాటి 43% ఓట్లతో 321 స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని తేల్చింది. గత సంవత్సరం ఆగస్ట్ నెలలో జరిపిన సర్వేలో ఎన్డీఏ 316 సీట్లు గెలుచుకుంటుందని తేలగా, దానిపై మరో ఐదు స్థానాలు అధికంగానే గెలుస్తుందని ప్రస్తుత సర్వే పేర్కొనడం విశేషం. అయితే, 2019 ఎన్నికల్లో ఎన్డీఏ గెల్చుకున్న 357 సీట్ల కన్నా ఈ నెంబర్ తక్కువగానే ఉండటం గమనార్హం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విపక్ష యూపీఏ కూటమి 93 సీట్లు గెల్చుకుంటుందని ఈ ఎంఓటీఎన్ సర్వే పేర్కొంది. ప్రాంతాల వారీగా తీసుకుంటే, హిందీ, హిందుత్వ రాజకీయాలు బలంగా ఉన్న ఉత్తర భారతదేశంలో ఎన్డీఏ అత్యధికంగా 104 సీట్లను, పశ్చిమ భారతదేశంలో 85 సీట్లను, తెలివైన పొత్తులతో తూర్పు భారతంలో 100 స్థానాలను గెల్చుకుంటుందని ఈ సర్వే తేల్చింది. దక్షిణ భారత్‌లో మాత్రం ఆశించిన ఫలితాలను సాధించలేదని, అక్కడ 32 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. పార్టీల వారీగా చూస్తే బీజేపీ మరొకసారి సొంతంగా మెజారిటీ సాధిస్తుందని, మెజారిటీ మార్క్ అయిన 272ని దాటి 291 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ 51 సీట్లు మాత్రమే సాధిస్తుందంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు గెల్చుకున్న విషయం తెలిసిందే. మోదీపై విశ్వాసం కరోనాపై పోరుకు అనూహ్య లాక్డౌన్ ప్రకటన, కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో నిలవడం, వలస కూలీల సంక్షోభం, కనిష్ట స్థాయికి జీడీపీ, ప్రబలిన నిరుద్యోగం, లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా దూకుడు.. తదితర అంశాల్లో విమర్శలు వచ్చినప్పటికీ.. ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం సడలలేదని సర్వేలో తేలింది. ఎంఓటీఎన్ సర్వేలో పాల్గొన్నవారిలో 74% మంది మోదీ ప్రధానిగా అత్యుత్తమ పనితీరు చూపారని ప్రశంసించారు. వరుసగా ఏడో సంవత్సరం అధికారంలో ఉన్న నేతకు ఈ స్థాయిలో ప్రజాదరణ లభించడం అరుదైన విషయమే. అలాగే, ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై 66% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యుత్తమ ప్రధాని రేసులోనూ మోదీ చాలా ముందున్నారు. దేశ అత్యుత్తమ ప్రధానిగా 38% రేటింగ్‌తో మోదీ తొలి స్థానంలో నిలిచారు. తరువాతి స్థానాల్లో వరుసగా అటల్ బిహారీ వాజ్‌పేయి(18%), ఇందిరాగాంధీ(11%), జవహర్లాల్ నెహ్రూ(8%), మన్మోహన్ సింగ్(7%) ఉన్నారు. అయితే, దక్షిణ భారత్‌లో మోదీ హవా, బీజేపీ ప్రభావం అంతగా కనిపించలేదు. ప్రధానిగా మోదీ పాపులారిటీ దక్షిణ భారతదేశంలో 63 శాతం ఉంది. ముస్లింలలో 38% మోదీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం సాధించిన రెండు గొప్ప విజయాలుగా సర్వే తేల్చినవి ఆరెస్సెస్ అజెండాకే సంబంధించినవి కావడం విశేషం. -
సీఎం జగన్‌కు టాప్ ర్యాంక్
దేశవ్యాప్తంగా 12,021 మందిని 2020 జూలై 15 నుంచి జూలై 27 మధ్య టెలిఫోన్ ద్వారా సర్వేచేశారు. వీరిలో 67 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కాగా.. 33 శాతం మంది పట్టణ ప్రాంతాల వారున్నారు. మొత్తం మీద 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ.. 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించారు. ‘సొంత రాష్ట్రంలో ఆదరణ’లో నంబర్‌వన్ సొంత రాష్ట్రంలో 87 శాతం ప్రజల మద్దతుతో అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రిగా నంబర్ వన్ స్థానంలో వైఎస్ జగన్ నిలిచారు. ఈ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 63 శాతం, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 59 శాతం ప్రజల మద్దతు లభించింది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు 55 శాతం ప్రజల ఆదరణ లభించగా.. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా స్థానం సంపాదించిన యోగి ఆదిత్యనాథ్‌కు మాత్రం ఉత్తరప్రదేశ్‌లో 49 శాతం ప్రజాదరణ మాత్రమే దక్కింది. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్రంలో తిరుగులేని ప్రజాదరణ లభించింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమంగా పనిచేసే ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ 11 శాతం ఓట్లతో మూడో స్థానం కైవసం చేసుకున్నప్పటికీ.. సొంత రాష్ట్రంలో మాత్రం ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులందరి కంటే బాగా ముందంజలో ఉండి 87 శాతం ప్రజల మద్దతును పొందగలిగారు. తన ఏడాదిన్నర పాలనలోపే.. దేశంలో బాగా పనిచేస్తున్న ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ జగన్ మూడో స్థానంలో నిలిచి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వే వివరాలను ఆ పత్రిక వెల్లడించింది. ముఖ్యమంత్రి జగన్‌కు పెరిగిన ఆదరణ మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ఈ ఏడాది జనవరిలో చేసినప్పుడు.. వైఎస్ జగన్‌కు దేశవ్యాప్తంగా 7 శాతం మంది నుంచి ఆదరణ లభించగా, తాజా సర్వేలో అది 11 శాతానికి పెరిగింది. హామీలు వరుసగా అమలుచేయడం, మేనిఫెస్టోలో లేని పథకాలనూ ప్రవేశపెట్టడం, పాలనలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలాలు ప్రజలకు బాగా అందుతుండటంవల్ల ఆదరణ పెరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో అత్యుత్తమ సీఎం యోగి దేశవ్యాప్తంగా జరిగిన ఈ సర్వేలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నెంబర్ 1 స్థానంలో నిలిచారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నెంబర్ 2లో, నంబర్ 3 స్థానాన్ని వైఎస్ జగన్ సొంతం చేసుకున్నారు. ఈ సర్వేలో యోగి ఆదిత్యనాథ్‌కు 24, అరవింద్ కేజ్రీవాల్‌కు 15, వైఎస్ జగన్‌కు 11 శాతం ఓట్లు వచ్చాయి. 4, 5 స్థానాల్లో పశ్చిమబెంగాల్, బీహార్ సీఎంలు మమతా బెనర్జీ, నితీష్‌కుమార్ ఉన్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మూడు శాతం ఓట్లతో 9వ స్థానంలో నిలిచారు. అందరి దృష్టిని ఆకర్షించిన వైఎస్ జగన్ రాష్ట్రంలో అత్యధిక శాతం (87) ప్రజల మద్దతు పొందడానికిగల ప్రధాన కారణాలను ఇండియా టుడే వెల్లడించింది. అవేమిటంటే.. ► అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ దాదాపు నెరవేర్చడం. ► సంతృప్తస్థాయిలో సంక్షేమ పథకాలు అమలుచేయడం. ► పాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలను వలంటీర్ల ద్వారా సమర్థవంతంగా ప్రజలకు చేర్చడం. ► ఈ ‘సచివాలయ వ్యవస్థ’ను భవిష్యత్ పాలనకు చుక్కానిలా నిర్మించడం. ► తద్వారా దాదాపు 4 లక్షల ఉద్యోగాలివ్వడం. -
ప్రధానిగా మోదీకి డిస్టింక్షన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగులేని ప్రజాదరణ ఉందని మరోసారి తేలింది. ప్రధానిగా మోదీనే అత్యుత్తమం అని ‘ఇండియా టుడే – కార్వీ ఇన్సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే తాజాగా తేల్చింది. ప్రధానిగా మోదీ పనితీరు అద్భుతంగా ఉందని సర్వేలో పాల్గొన్నవారిలో 30% మంది, బావుందని 48%, సాధారణంగా ఉందని 17% అభిప్రాయపడ్డారు. 5% మాత్రం మోదీ పనితీరు బాగాలేదన్నారు. ఒకవైపు, దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా, మరోవైపు, దేశ ఆర్థిక రంగ కుంగుబాటు, ఇంకోవైపు చైనాతో తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న క్లిష్ట సమయంలో జరిగిన ఈ సర్వేలో.. దేశ ప్రజలు మోదీపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. ఫిబ్రవరి 2016 – ఆగస్టు 2020 మధ్య నిర్వహించిన 10 సర్వేలను పోలిస్తే.. మోదీకి ప్రజాదరణ గణనీయంగా పెరగడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానమంత్రిగా మోదీని ప్రజలు డిస్టింక్షన్లో పాస్ చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి çఏడాదైన విషయం తెలిసిందే. మోదీ ప్రజాదరణ గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో అత్యధికంగా(4 పాయింట్ స్కేల్‌పై 3.14గా) ఉంది. ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తర భారతంలో 4 పాయింట్ స్కేల్‌పై 3.01గా, తూర్పు భారత్‌లో 3.02గా, దక్షిణ భారతంలో 2.99గా ఉంది. మతాల వారీగా చూస్తే హిందువుల్లో 3.13, ముస్లింల్లో 2.33 గా మోదీపై ప్రజాదరణ ఉంది. కులాలవారీగా మోదీ ఓబీసీ, ఎంబీసీల్లో అత్యధికంగా 3.08, దళితుల్లో 3.01, అగ్రవర్ణాల్లో 2.99 స్కోరు సాధించడం గమనార్హం. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పనితీరు చాలా బావుందని కేవలం 9% మంది అభిప్రాయపడగా, బావుందని 35%, సాధారణమని 32%, బాగాలేదని 21% మంది తెలిపారు. కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకురాగలిగే నేత రాహుల్ గాంధీయేనని 23% మంది పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రియాంకాగాంధీకి 14%, మన్మోహన్ సింగ్‌కు 18%, సోనియా గాంధీకి 14% మంది ఓటేశారు. సర్వే లోని ఇతర ముఖ్యాంశాలు.. ► కరోనా తమను తీవ్రంగా దెబ్బతీసిందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. ఆదాయం పూర్తిగా పడిపోయిందని 63%, ఉద్యోగం/వ్యాపారం పోయిందని 22%, పెద్దగా మార్పేమీ లేదన్న వారు 15%. ► ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమికి 316 సీట్లు..కాంగ్రెస్ కూటమికి 93, ఇతరులకు 134 సీట్లు వస్తాయి. ► మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు పనితీరు చాలా బావుందని 24%, బావుందని 48%, సంతృప్తి కానీ, అసంతృప్తి కానీ లేదని 19%, అసంతృప్తి అని 8%, ఏమీ చెప్పలేమని 1% చెప్పారు. ► మోదీ ప్రభుత్వ అతిపెద్ద విజయం జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అని 16%, రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు అని 13% అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతిరహిత పాలన అని 9%, మౌలిక వసతుల వృద్ధి అని 11% అభిప్రాయపడ్డారు. ► కరోనాను సరిగ్గా నియంత్రించలేకపోవడం మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యమని 25%, నిరుద్యోగమని 23%, వలస కార్మికుల సంక్షోభమని 14% మంది తెలిపారు. ► ఆర్థిక రంగ పునరుత్తేజానికి కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ తమ ఆర్థిక స్థితిగతులను మారుస్తుందని 55% మంది విశ్వాసం వ్యక్తం చేయడం విశేషం. ► లాక్‌డౌన్‌తో ప్రభుత్వం చెప్పినట్లు లక్షలాది ప్రాణాలు నిలిచాయన్నది వాస్తవమని 34% మంది తెలిపారు. ఆర్థిక తిరోగమనానికి దారి తీసిందని 25%..ఆర్థిక తిరోగమనానికి దారితీసినా ఎక్కువ ప్రాణాలు కాపాడిందని 38% మంది చెప్పారు. ► వలస కార్మికుల దుస్థితికి బాధ్యులు.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అని 43%, రాష్ట్ర ప్రభుత్వాలు అని 14%, యాజమాన్యాలు అని 13%, సరైన సమాచారం లేకపోవడం అని 12%, కేంద్రం అని 10%, చెప్పలేమని 8% మంది చెప్పారు. ► తూర్పు లద్దాఖ్‌లో చైనాకు సరైన గుణపాఠం చెప్పిందని 69%, సరిగ్గా వ్యవహరించలేదని 15%, ప్రభుత్వం సమాచారం దాచి పెట్టిందని 10% తెలిపారు. ► చైనా వస్తువుల బహిష్కరణకు 90 శాతం మంది మద్దతు పలికారు. 7 శాతం మంది నో అన్నారు. చైనా యాప్స్‌ను నిషేధించడం, కాంట్రాక్టులు రద్దు చేయడం సరైన విధానమేనని 91% స్పష్టం చేశారు. ► కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ పనితీరు అత్యుత్తమంగా ఉందని 8%, బావుందని 33%, యావరేజ్ అని 35%, బాగాలేదని 20% మంది చెప్పారు. ► పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతిస్తామని 50% మంది స్పష్టం చేశారు. బెస్ట్ పీఎం మోదీయే.. అత్యుత్తమ భారత ప్రధాని ఎవరన్న ప్రశ్నకు.. 44% మోదీకి, 14% వాజ్‌పేయికి, 12% ఇందిరా గాంధీకి, 7% నెహ్రూకి, 7% మంది మన్మోహన్‌కు ఓటేశారు. తదుపరి ప్రధానిగా 66% మోదీనే ఎన్నుకున్నారు. 8% రాహుల్‌కి, 5% సోనియాకి, 4% అమిత్‌షాకు ఓటేశారు. -
చైనా కుయుక్తులకు సాక్ష్యమీ ఫొటోలు!
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా దుందుడుకు చర్యలను తెలిపే కీలకమైన ఉపగ్రహ ఛాయాచిత్రాలు బయటపడ్డాయి. మిలటరీ అధికారుల చర్చల అనంతరం ఉద్రిక్తతలకు కారణమైన గాల్వన్ లోయ నుంచి సైనికులను వెనక్కి రప్పించాలనే ఇరు దేశాల ఒప్పందాన్ని చైనా తుంగలో తొక్కిందని ఇండియా టుడే తన వ్యాసంలో పేర్కొంది. ఘర్షణలకు ముందు, మరుసటి రోజు (మంగళవారం) కూడా డ్రాగన్ సైనికులు గాల్వన్ లోయ ప్రాంతంలో తిష్ట వేశారని తెలిపింది. అక్కడ పెద్ద ఎత్తున చైనా బలగాలు, దాదాపు 200లకు పైగా సైనిక వాహనాలు, అనేక గుడారాలు ఉన్నాయని పేర్కొంది. భారత బలగాల కన్నా ఎన్నోరెట్లు ఆ ప్రాంతంలో చైనా దళాలు మోహరించాయని వెల్లడించింది. అంతేకాకుండా.. మూడు భాగాలుగా చైనా దళాలు వాస్తవాధీన రేఖ వైపునకు చొచ్చుకొస్తున్నట్టు ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో స్పష్టంగా తెలుస్తోందని ఇండియా టుడే వివరించింది. అదే సమయంలో భారత బలగాలు తమ పరిధిమేరకు నిలిచి ఉన్నాయని తెలిపింది. ఉపగ్రహ చిత్రాలను నిశితంగా పరిశీలిస్తే డ్రాగన్ కుయుక్తులు తెలుస్తాయని సూచించింది. (చదవండి: విషం చిమ్మిన చైనా..) ఫొటో కర్టెసీ: ఇండియా టుడే సైనిక బలగాల ఉపసంహరణకు జూన్ 6న ఒప్పందం జరగ్గా 10 రోజులు కాకుండానే చైనా దానికి తూట్లు పొడిచిందనేందుకు ఈ ఫొటోలే సాక్ష్యమని ఇండిటు టుడే చెప్పింది. చైనా-భారత బలగాలు తలపడిన ఘటనకు సంబంధించి ఇవే తొలి ఫొటోలని ఆ వార్తా సంస్థ పేర్కొంది. ఇక ఘర్షణల అనంతరం కూడా భారత బలగాలు తమ పరిధిలోనే నిలిచి ఉన్నాయని చెప్పింది. కాగా, గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. మరోవైపు 43 మంది చైనా సైనికులు భారత సైనికుల దాడిలో చనిపోయినట్టు ఆ దేశ మీడియా ప్రకటించింది.(చదవండి: జవాన్ల మధ్య ఘర్షణకి కారణం ఏంటంటే..) -
సుపరిపాలనలో రాష్ట్రానికి ఇండియా టుడే అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సుపరిపాలనకు గానూ ఇండియా టుడే ఏటా ఇచ్చే స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్క్లేవ్–2019 అవార్డు తెలంగాణకు దక్కింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఈ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతుల మీదుగా రాష్ట్ర సర్కార్ తరఫున టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఆర్థిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. సర్కార్ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు చేరువయ్యేలా సీఎం కేసీఆర్ నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. -
హరియాణాలో ఎగ్జిట్ ఫోల్స్‌కు షాక్
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ ఫోల్స్‌కు షాక్ ఇచ్చాయి. ప్రముఖ సంస్థలు ఇండియాటుడే, ఆక్సిస్ వన్ మినహా అన్ని ఎగ్జిట్ ఫోల్స్ బీజేపీకి 90 సీట్లకుగాను 70 సీట్లు సాధిస్తాయని తెలిపాయి. కానీ, ఫలితాలు ఎగ్జిట్ ఫోల్స్ అంచనాలకు బిన్నంగా రావడం గమనార్హం. ప్రస్తుత ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ బట్టి చూస్తే బీజేపీకి 40సీట్లు, కాంగ్రెస్‌కు 31సీట్లు, జేజేపీ 10, ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించాయి. 2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి 58శాతం ఓట్లు రాగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో 36శాతానికి పడిపోవడంతో రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జాట్యేతర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌ను సీఎంగా నియమించడం వల్ల జాట్లు బీజేపీకి దూరమయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా వీస్తున్నప్పటికి స్థానిక నాయకత్వం వాటిని ఓట్ల రూపంలో మలుచుకోవడంలో విఫలమయ్యారని పలువురు విశ్లేషిస్తున్నారు. -
ఉన్నత విద్యావంతుల పార్టీ వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసిన లోక్‌సభ అభ్యర్థుల్లో అత్యధికంగా ఉన్నత విద్యావంతులకు టికెట్లు ఇచ్చిన పార్టీగా వైఎస్సార్ సీపీ రికార్డు సృష్టించింది. ‘ఇండియాటుడే’ తాజా సంచికలో ఈ వివరాలను ప్రచురించింది. జాతీయ పార్టీలేవీ విద్యావంతులకు టికెట్లు ఇవ్వడంలో అగ్రస్థానంలో నిలవలేకపోయాయని ఇండియా టుడే అనుబంధ విభాగమైన ‘డేటా ఇంటెలి జెన్స్ యూనిట్’ పేర్కొంది. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థుల్లో బాగా చదువుకున్నవారే ఉండటంతో జాతీయ స్థాయిలో ‘పఢీ లిఖీ పార్టీ’ (ఉన్నత విద్యావంతుల పార్టీ)గా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. నూతన ఒరవడికి నాంది ఆంధ్రప్రదేశ్‌లోని 25 ఎంపీ స్థానాలకు వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది పట్టభద్రులు, ఆపై విద్యార్హతలు కలిగిన వారే ఉన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండి తీరాలని బలంగా ఆకాంక్షించే వైఎస్ జగన్ ప్రతి సందర్భంలోనూ నైతిక విలువలకు పెద్దపీట వేస్తున్నారు. రాసి కాదు వాసి ముఖ్యమని భావించిన జగన్ ఏరి కోరి ఉన్నత విద్యార్హతలు కలిగిన వారిని ఎంపిక చేసి ఎన్నికల బరిలోకి దింపారు. ఎంతో ముందుచూపుతో రాజకీయాల్లో నూతన ఒరవడి నెలకొల్పాలని ఆయన తీసుకున్న నిర్ణయం నేడు జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అగ్రభాగాన వైఎస్సార్ సీపీ ఇండియాటుడే అనుబంధ విభాగమైన ‘డేటా ఇంటెలిజెన్స్ యూనిట్’ దేశవ్యాప్తంగా ఆరో విడత వరకు వివిధ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల విద్యార్హతలను సేకరించి క్రోడీకరించింది. ప్రాంతీయ పార్టీల నుంచే ఎక్కువ మంది విద్యావంతులైన అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలోకి దిగారని తెలిపింది. అలాంటి ఐదు ప్రాంతీయ పార్టీల్లో వైఎస్సార్ సీపీ అగ్రభాగాన నిలిచింది. అభ్యర్థుల విద్యార్హతల ప్రాతిపదికన ఈ నిర్థారణ జరిగింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీలున్నా దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీలే విద్యావంతులకు టికెట్లు ఇవ్వడంలో అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం మంది ఉన్నత విద్యావంతులున్నారు. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అభ్యర్థుల్లో 87.5 శాతం మంది ఉన్నత విద్యార్హతలు కలిగిన వారున్నారు. ఏఐడీఎంకే అభ్యర్థుల్లో 86 శాతం మంది, టీఆర్ఎస్ (తెలంగాణ) అభ్యర్థుల్లో 82 శాతం, తమిళనాడుకే చెందిన నామ్ తమిళ్ కచ్చి (ఎన్టీసీ) పార్టీ అభ్యర్థుల్లో 80 శాతం మంది విద్యార్హతలు గల వారున్నారు. బీఎస్పీలో స్వల్పం... జాతీయ పార్టీల విషయానికి వస్తే ఉన్నత విద్యావంతులైన అభ్యర్థుల శాతం తక్కువగా ఉంది. బీజేపీ ఎంపీ అభ్యర్థుల్లో 70.8 శాతం మంది, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల్లో 75.7 శాతం మంది మాత్రమే ఉన్నత విద్యావంతులున్నారు. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థుల్లో చాలా తక్కువగా 52.5 శాతం మంది మాత్రమే ఉన్నత విద్యావంతులున్నారు. పలుచోట్ల ఇబ్బడి ముబ్బడిగా రంగంలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థుల విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుంటే కేవలం 38 శాతం మంది మాత్రమే పట్టభద్రులు న్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్థుల్లో పట్టభద్రులైన విద్యావంతులు సగటున 48 శాతం మంది మాత్రమే ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్(పశ్చిమ బెంగాల్) అభ్యర్థుల్లో 74.5 శాతం, బిజూ జనతాదళ్ (ఒడిషా) అభ్యర్థుల్లో 71.4 శాతం మంది పట్టభద్రులున్నారు. చదువురానివారు 2 శాతం.. దేశం మొత్తం మీద ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థుల్లో 2 శాతం మంది బొత్తిగా చదువురాని వారున్నారు. అన్ని రంగాల్లో తీవ్ర పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఉన్నత విద్యార్హతలకు ప్రాధాన్యం పెరిగింది. ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఇంటా బయటా దిగ్విజయంగా రాణిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత విద్యావంతులదే పై చేయిగా ఉంది. దేశ రాజకీయాల్లోనూ అది పరిస్థితి ఉత్పన్నమవుతోందని జాతీయ స్థాయి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో రాజకీయాల్లో ఉండే వారికి విద్యార్హతలతో పెద్దగా పనిలేదు. కానీ క్రమంగా ఉన్నత పదవుల్లో ఉన్న వారి విద్యార్హతల విషయంలో ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై చర్చ, వివాదం రేకెత్తిన నేపథ్యంలో రాజకీయాల్లో విద్యకు ప్రాధాన్యం పెరుగుతోందని విశ్లేషిస్తున్నారు. -
సోనియా, రాహుల్ అంతంతే!
న్యూఢిల్లీ: 16వ లోక్‌సభ కాలపరిమితి త్వరలో ముగిసిపోనుంది. ప్రస్తుతం వివిధ దశల్లో జరుగుతున్న ఎన్నికలు ముగిస్తే మరికొద్ది రోజుల్లోనే 17వ లోక్‌సభ కొలువుకానుంది. ఈ నేపథ్యంలో 16వ లోక్‌సభలో కష్టపడి పని చేసిందెవరు? కాలక్షేపం చేసిందెవరు? ఎవరు ఉత్తములు? అట్టడుగున ఉన్నదెవరు? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇండియాటుడే. ఇందుకోసం ఇండియాటుడే ‘డేటా ఇంటెలిజెన్స్ యూనిట్’ కొన్ని ప్రామాణికాలను రూపొందించింది. అవి. వారు పార్లమెంటుకు హాజరైన రోజులు, అడిగిన ప్రశ్నల సంఖ్య, ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుల సంఖ్య, ఎంపీల్యాడ్స్ వినియోగం, వారిపై ఆయా నియోజకవర్గాల ప్రజల అభిప్రాయం అనే ఐదు అంశాలు. వీటి ప్రకారం ఎంపీల పనితీరుపై చేసిన విశ్లేషణలో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అందులో ప్రధానంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా చివరి స్థానాల్లో నిలవగా బీజేపీకి చెందిన బిహార్ బీజేపీ ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రివాల్ అన్ని పరామితుల్లోనూ అగ్రగామిగా నిలిచి మొదటి ర్యాంకు, ఏ ప్లస్ గ్రేడ్ పొందారు. టాప్ టెన్‌లో ఉన్న ప్రముఖుల్లో బీజేపీకి చెందిన మీనాక్షి లేఖి 7వ, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే 10వ ర్యాంకులు పొందారు. కాగా, ఇండియాటుడే ‘డేటా ఇంటెలిజెన్స్ యూనిట్’ మొత్తం 543 ఎన్నిౖMðన సభ్యుల్లో 416 మందిని మాత్రమే ర్యాంకింగ్స్‌లో లెక్కలోకి తీసుకుంది. 2014 మే 18వ తేదీన ఎన్నికైన రోజు నుంచి వారి పనితీరును పరిగణనలోకి తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభలో సమావేశాలకు 52 శాతం హాజరయ్యారు. అదేవిధంగా, ఎంపీల్యాడ్స్ కింద ఐదేళ్లలో కేటాయించిన రూ.25 కోట్లలో రూ.19.6 కోట్లు తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఖర్చుపెట్టారు. దీంతో రాహుల్‌కు 387వ ర్యాంకు దక్కగా రాహుల్ కంటే కొద్దిగా మెరుగ్గా 60 శాతం హాజరు శాతం ఉన్న సోనియాకు 381వ ర్యాంకులో ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన 39 మంది ఎంపీల్లో 11 మందికి అత్యల్ప డీ, డీ ప్లస్ గ్రేడులు రాగా బీజేపీకి చెందిన 195 మంది ఎంపీల్లో 33 మందికి డీ, డీ ప్లస్ గ్రేడులు వచ్చాయి. బీజేపీకి చెందిన ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రతిపక్ష నేతలు పార్లమెంట్ హాజరు పట్టికలో సంతకాలు చేయనవసరం ఉండదు కాబట్టి, వారి హాజరు వివరాలు వెల్లడికాలేదు. పూర్తి స్థాయి సమాచారం లేనందున వారిని ర్యాంకుల ప్రక్రియ నుంచి మినహాయించింది. దీంతో రెండు ప్రధాన జాతీయ పార్టీల అగ్రనేతల పనితీరు అంచనా వేయలేదు. రాహుల్ గాంధీ తనదైన శైలిలో సభా చర్చలను కొన్ని సందర్భాల్లో ముందుండి నడిపారు. కానీ, ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలేవీ అడగలేదు. ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టలేదు. దీంతో ర్యాంకింగ్ ప్రక్రియలో ఆయన వెనుకబడ్డారని ఇండియా టుడే పేర్కొంది. చివరి స్థానాల్లో టీడీపీ ఎంపీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై టీడీపీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి 416వ ర్యాంకుతో అట్టడుగున ఉండగా, బుట్టా రేణుక 337వ ర్యాంకు పొందారు. అలాగే, టీడీపీ ఎంపీలు మాగంటి వెంకటేశ్వరరావు 323వ ర్యాంకుతో డీప్లస్ గ్రేడ్, కేశినేని శ్రీనివాస్ 348వ ర్యాంకు డీప్లస్ గ్రేడ్, జేసీ దివాకర్‌రెడ్డి 401వ ర్యాంకు డీ గ్రేడ్ పొందారు. జనార్దన్ సింగ్ సిగ్రివాల్, ఎస్పీవై రెడ్డి, మీనాక్షి లేఖి, సుప్రియా సూలే -
ప్రజలు ఆశీర్వదిస్తే చరిత్ర సృష్టిస్తా..
సాక్షి, అమరావతి : ‘ప్రజలు ఆశీర్వదిస్తే చరిత్ర సృష్టిస్తాం. భవిష్యత్ కోసం ప్రజల ఆశా, ఆకాంక్షలే ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపిస్తాయి. ప్రజల సుఖసంతోషాలే లక్ష్యంగా పనిచేస్తాను’అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎన్నికలను ప్రభావితం చేయాలన్న చంద్రబాబు పన్నాగాన్ని ప్రజలుతిప్పికొడతారు’అని కూడా ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ‘చంద్రబాబు ఆనాడు హైదరాబాద్‌ను నిర్మించనూ లేదు. ప్రస్తుతం అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదు’అని విమర్శించారు. ఏ పార్టీతోనూ తమకు పొత్తుగానీ, సాన్నిహిత్యంగానీ లేదని స్పష్టం చేస్తూ ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతిస్తామని తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ‘ఇండియా టుడే’ టీవీ ఛానల్ కన్సల్టెంట్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్రంలో ఎన్నికలు, జాతీయస్థాయి రాజకీయాలపై తన అభిప్రాయాలను ఇలా వెల్లడించారు రాజ్‌దీప్ సర్దేశాయ్ : ఏడాదిన్నరపాటు రోడ్డు మీదే ఉన్నారు. మీ పాదయాత్ర జయప్రదమైంది. మీ గెలుపునకు ఎన్ని రోజుల దూరంలో ఉన్నారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి : 14 నెలల పాటు ప్రజాసంకల్పయాత్ర చేశా. అది పూర్తి చేసిన వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాను. రాజ్‌దీప్ సర్దేశాయ్ : పాదయాత్ర మీ రాజకీయ జీవితంలో చాలా కీలకమైంది. మీనాన్న గారు చనిపోయి ఇప్పటికి పదేళ్లు అయింది. ఈ పదేళ్ల ప్రయాణం మీకు ఎలా అనిపిస్తోంది? జగన్మోహన్ రెడ్డి : ప్రతి నిత్యం పోరాటమే. ప్రతిపక్షంలో ఉన్నందునక్షణ క్షణమూ పోరాటమే చేస్తున్నాం. ఇప్పుడది క్లైమాక్స్‌కు వచ్చింది. రాజ్‌దీప్ సర్దేశాయ్ : ఓదార్పు యాత్రకు అనుమతించని కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ పూర్తిగా దెబ్బతింది. మీరు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ పార్టీపై ప్రతికారం తీర్చుకోవాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి : నేనెందుకు ప్రతికారం తీర్చుకోవాలి ? నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నా. నేనిప్పుడు నా ప్రజలకు ఎంతమేర మంచి చేయాలన్న దాని గురించే ఆలోచిస్తాను. ప్రస్తుతం కూడా అదే ఆలోచిస్తున్నా. రాజ్‌దీప్ సర్దేశాయ్ : చంద్రబాబు ఇప్పటికీ మీపైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ప్రతీ శుక్రవారం విచారణ కోసం కోర్టుకు హాజరవుతున్నారని పదే పదే విమర్శిస్తున్నారు కదా? జగన్మోహన్ రెడ్డి :మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేను కాదు ఎంపీనీ కాదు. ఏనాడూ సెక్రటేరియట్‌కు కూడా వెళ్లలేదు. అప్పుడు నేను అసలు హైదరాబాద్‌లోనే లేను. మా పిల్లల చదువు కోసం మేము బెంగళూరులో ఉన్నాం. నా మీద కేసులకు సంబంధించి మరో విషయాన్ని గమనించాలి. మా నాన్న జీవించి ఉన్నన్నాళ్లూ నాపై ఎలాంటి కేసులూ లేవు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతవరకూ కూడా కేసులు లేవు. నా మీద ఈ కేసులన్నీ ఎప్పుడు వచ్చాయి... నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన తరువాతే నా మీద కేసులు వేశారు. కాంగ్రెస్, టీడీపీ కలసి కుమ్మక్కై నా మీద అక్రమ కేసులు బనాయించారు. ఇవన్నీ రాజకీయ కక్షతో వేసిన కేసులే. రాజ్‌దీప్ సర్దేశాయ్ : 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, చంద్రబాబు మధ్య ఎన్నికల పోరు సాగింది. ఇప్పుడు చంద్రబాబే మీకు ప్రధాన శత్రువు కదా? జగన్మోహన్ రెడ్డి : నాకు చంద్రబాబుగానీ కాంగ్రెస్ గానీ శత్రువులు కారు. నాకు ప్రజా క్షేమమే ముఖ్యం. ప్రజల సంతోషమే కావాలి. ప్రజలు ఆశీర్వదించి నాకు అవకాశం ఇస్తే గొప్పగా పనిచేస్తాను. చరిత్ర పునరావృతం అవుతుంది. రాజ్‌దీప్ సర్దేశాయ్ : చంద్రబాబు శత్రువు కాదు... ప్రధాన ప్రత్యర్థి అని ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి : కావచ్చు. రాష్ట్రంలో ఇప్పుడు రెండే ప్రధాన పార్టీలు ఉన్నాయి. అధికార పార్టీపైన విపరీతమైన ప్రజా వ్యతిరేకత కన్పిస్తోంది. ఇది మాకు ఎన్నికల్లో అనుకూలిస్తుందని భావిస్తున్నాం. రాజ్‌దీప్ సర్దేశాయ్ : చంద్రబాబు తాను ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో పోరాడుతున్నాను అంటున్నారు. మీరు మాత్రం ఎన్నికల తరువాత నరేంద్రమోదీతో కలవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు అని విమర్శిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి : మాకు బీజేపీ, కాంగ్రెస్ రెండు సమాన దూరమే. మా లక్ష్యం చాలా నిర్ధిష్టంగా ఉంది. ఎవరైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారో వారికే మేము మద్దతిస్తాం. దీనికి కూడా కారణం ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి షరతులు లేకుండా మాకు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు. అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసే ఆ హామీ ఇచ్చాయి. రాజధాని ఉన్నప్రాంతం తాము ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతామని అడగడం దేశచరిత్రలో అదే తొలిసారి. అంతవరకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ వెళ్లిపోయాక మా రాష్ట్రంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు కోసం ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అందుకే ప్రత్యేక హోదా అన్నది మాకు అత్యంత కీలకమైంది. రాజ్‌దీప్ సర్దేశాయ్ : తాము అధికారంలోకి వస్తే వారంరోజుల్లోనే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే మీరు రాహుల్ గాంధీకి మద్దతిస్తారా? జగన్మోహన్ రెడ్డి : ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం లేదు. నాకు నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మా మద్దతు ఉంటుంది. తొలుత మా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఏమి చేసింది. రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టి మోసం చేసింది. ఆ తర్వాత బీజేపీ కూడా అదే విధంగా చేసింది. అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలసి రాష్ట్రాన్ని విభజించింది. 2014లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ కూడా వారి పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి అయిన తరువాత ప్రత్యేక హోదా ఇచ్చే స్థాయిలో ఉండి కూడా ఆయన మాకు వెన్నుపోటు పొడిచారు. కాబట్టి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా మా రాష్ట్రాన్ని మోసం చేశాయి. అందుకే ఇప్పుడు మేము ఎవ్వరినీ నమ్మే స్థితిలో లేం. ప్రజల మనోభీష్టం మేరకు మేము ఇప్పుడు ఒక ప్రతిపాదన పెడుతున్నాము. దేవుడి దయవల్ల పార్లమెంటులో 25 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే ... ప్రత్యేక హోదాకు సంతకం పెట్టండి... మా మద్దతిస్తాము అని కచ్చితంగా చెబుతాం. రాజ్‌దీప్ సర్దేశాయ్ : ఒకవేళ నరేంద్ర మోదీకి 25 సీట్లు తగ్గి.. మీ చేతిలో 25 సీట్లు ఉంటే.. ప్రత్యేక హోదాపై సంతకం పెట్టు.. మద్దతు ఇస్తానంటారు. అంతేనా? జగన్మోహన్ రెడ్డి : అవును. కచ్చితంగా అంతే. రాజ్‌దీప్ సర్దేశాయ్ : మీ పార్టీకి మైనార్టీల మద్దతు ఉంది. ఎన్నికల తరువాత మీరు బీజేపీతో కలిస్తే ఆ ఓటర్లు మిమ్మల్ని వీడుతారని అనుకుంటున్నారా... ఎన్నికల తరువాత ఇలాంటి అంశాలు మీ పొత్తును ప్రభావితం చేస్తాయా... లేక ప్రత్యేక హోదా ఒక్కటే మీ అంశమా...? జగన్మోహన్ రెడ్డి : మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. అయితే ప్రత్యేక హోదా విషయంలో మాకు మద్దతు ప్రకటించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. రాజ్‌దీప్ సర్దేశాయ్ : బీజేపీ సిద్ధాంతాల గురించి ఏం చెబుతారు? వాటిని మీరు పరిగణలోకి తీసుకోరా? జగన్మోహన్ రెడ్డి : రాష్ట్రంలో మేం 25 ఎంపీ సీట్లు గెలిచి ఆ బలానికి తెలంగాణ కూడా మద్దతిస్తే కలిపి 42 ఎంపీ స్థానాలతో మేం ఓ గణనీయమైన శక్తిగా ఉంటాం. అపుడు మేం ప్రత్యేక హోదా డిమాండ్ చేసే బలమైన శక్తిగా ఉంటాం. రాజ్‌దీప్ సర్దేశాయ్ : చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు కదా. ప్రత్యేక హోదా కావాలి, ఈ విషయంలో మోదీ ద్రోహం చేశారు అని చెబుతున్నారు కదా? జగన్మోహన్ రెడ్డి : ఐదేళ్ల పాలనలో 4 ఏళ్లు చంద్రబాబు–బీజేపీ కలిసి మెలిసి ఉన్నారు. వారి ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ నాలుగేళ్లలో టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు మంత్రివర్గం తీసుకున్న చాలా నిర్ణయాల్లో భాగస్వాములుగా ఉన్నారు. అయితే వాళ్లెప్పుడూ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడనే లేదు. ఇంకా దారుణమైన అంశం ఏమంటే ఈ నాలుగేళ్లు వారు బాగా అతుక్కుపోయి ఉన్నారు. బీజేపీ–టీడీపీ కలిసి ప్రయాణం చేశారు. ఇక వాస్తవానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను విభేదించారు. 2017, సెప్టెంబర్ 8న అర్థరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదా లేదని చెబుతూ దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ఇస్తున్నట్లు ప్రకటించినపుడు టీడీపీ మంత్రులు ఆయన పక్కనే ఉన్నారు. జైట్లీ ప్యాకేజీ ప్రకటన చేసిన నాలుగు నెలలకు, జనవరి 27, 2018న చంద్రబాబు విలేకరుల సమావేశం పెట్టి బీజేపీ ప్రభుత్వం ఏపీకి చేసినంత మేలు చరిత్రలోనే ఎప్పుడూ చూడలేదని పొగిడారు. రాజ్‌దీప్ సర్దేశాయ్ : మీరు అధికారంలోకి వస్తే చంద్రబాబుపై విచారణకు ఆదేశిస్తారా? జగన్మోహన్ రెడ్డి : తప్పకుండా ఆయనపై విచారణ జరిపిస్తాం. నేరస్తులను జైలుకు పంపేలా కచ్చితంగా చేస్తాం. రాజ్‌దీప్ సర్దేశాయ్ : చంద్రబాబుపై మీరు చేస్తున్న అధికార దుర్వినియోగం, ఆయన ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపైన వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తారా? మీపై కేసులు చంద్రబాబు పెట్టించారు కనుక మీరు చంద్రబాబుపై అలాగే కేసులు పెట్టి ఆయన్ను బాధ్యునిగా చేసేందుకు ప్రయత్నిస్తారా? జగన్మోహన్ రెడ్డి : మీరే చెప్పండి నేనేం చేయాలో.... ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపుల సాక్షిగా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. కోట్లాది రూపాయల నల్లధనం ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు. నల్లధనంతో ప్రలోభపెడుతూ దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాంటి వ్యక్తిని విడిచిపెట్టాలా? అదెలా సాధ్యం? ... ఇలా అడ్డంగా దొరికిన ముఖ్యమంత్రి అసలు తన పదవికి రాజీనామా చేయలేదు. ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. ఆయన్ను జైలుకూ పంపలేదు. మరి అలాంటి ఆయనపై కేసు పెట్టి విచారించాలి కదా. రాజ్‌దీప్ సర్దేశాయ్ : జగన్మోహన్రెడ్డి, కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ ఓ విధమైన ఎన్నికల ముందస్తు పొత్తుతో ఉన్నారని భావించాలా? అందరూ కలిస్తే 42 సీట్లు అవుతాయని మీరంటున్నారు కనుక అలా అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి : మా మధ్య ఎలాంటి పొత్తూ లేదు. అయితే మా మధ్య ప్రజల ఉమ్మడి ప్రయోజనాలున్నాయి. జాతీయ స్థాయిలో మేం కోరుకునేదేమిటంటే మా మొర ఆలకించడానికి, మా వినతులు పట్టించుకోవడానికి ఎవరో ఒకరుండాలి. పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను ఇవ్వక పోతే ఇక ప్రజాస్వామ్యం ఎటు పోతుందనుకోవాలి? రాజ్‌దీప్ సర్దేశాయ్ : కేంద్రంలో ఎవరు ఉంటే మీకు బాగుంటుందనిపిస్తోంది? కాంగ్రెస్ సారథి రాహుల్ గాంధీనా? బీజేపీ సారథి నరేంద్ర మోదీనా? జగన్మోహన్ రెడ్డి : మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని సంతకం చేసే వారు ఎవరైనా సరే మాకు బాగానే ఉంటుంది. కేంద్రంలో ఎవరికీ మెజారిటీ రాని పరిస్థితి ఉండాలి. అక్కడ ఫలితాలు ఏకపక్షంగా ఉండ కూడదని కోరుకుంటున్నాను. రాజ్‌దీప్ సర్దేశాయ్ : అంటే మీరు హంగ్ పార్లమెంటు ఏర్పడాలని కోరుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి : అవును, మేం హంగ్ పార్లమెంటు రావాలని కోరుకుంటున్నాం. రాజ్‌దీప్ సర్దేశాయ్ : హంగ్పార్లమెంటు కావాలనే విషయంలో స్పష్టంగా ఉన్నారన్న మాట? జగన్మోహన్ రెడ్డి : కచ్చితంగా హంగ్ పార్లమెంటు కావాలనుకుంటున్నాను. అలా కాకుంటే పార్లమెంటులో ఇచ్చిన హామీకి దిక్కు లేకుండా పోతుంది. ఆరోజు పార్లమెంటులో అధికారపక్షం, ప్రతిపక్షం రెండూ కూడా మాకు ప్రత్యేక హోదా ఇస్తామన్నాయి . ఆ షరతుపైనే విభజించారు. పార్లమెంటులో ఇచ్చిన హామీ అమలు కాక పోతే ప్రజాస్వామ్యం నవ్వులపాలు అవుతుంది కదా! రాజ్‌దీప్ సర్దేశాయ్ : అంటే మీరు, కేసీఆర్, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, ఫెడరల్ ఫ్రంట్ లాంటివి (కేసీఆర్ చెబుతున్న విధంగా) వంటివి ఉంటే రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, మరింత స్వయం ప్రతిపత్తి లభిస్తుందని భావిస్తున్నారన్న మాట. జగన్మోహన్ రెడ్డి : నేను కచ్చితంగా అలాంటి పరిస్థితే కావాలని కోరుకుంటున్నాను. నా రాష్ట్రం, నేను ప్రత్యేక హోదా విషయంలో ద్రోహానికి గురయ్యాము. మోసపోయాము కాబట్టి అలా కోరుకోవడంలో తప్పేమీ లేదనుకుంటున్నా. రాజ్‌దీప్ సర్దేశాయ్ : ఏపీ రాజకీయాల్లో డబ్బు కూడా కీలక పాత్ర పోషిస్తోంది కదా. ఎన్నికల్లో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టగలిగే పార్టీయే గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడంలో మీరు చంద్రబాబుతో పోటీ పడగలరా? జగన్మోహన్ రెడ్డి : ఎన్నికల్లో డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుందని నేను భావించడం లేదు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతే ఎక్కువగా ఓటింగ్‌ను ప్రభావితం చేస్తుంది. చంద్రబాబు ఈ ఐదేళ్ల పాలనలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. ఆయన ఎన్నికల్లో డబ్బు వెదజల్లి అందర్నీ అవినీతిపరులను చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక్కో ఓటుకు రూ.3వేలు కూడా ఇవ్వడానికి సిద్ధపడతారు. కానీ భవిష్యత్ కోసం ఆశ, ఆకాంక్షలే ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేసేలా చేస్తాయి. రాజ్‌దీప్ సర్దేశాయ్ : బీజేపీ మీకు డబ్బులు ఇస్తామనడం లేదా? ఎన్నికల తరువాత వారికి మద్దతివ్వాలనే షరతుతో ఇప్పుడు మీకు ఎన్నికల్లో డబ్బు సహాయం చేస్తామనడం లేదా...? జగన్మోహన్ రెడ్డి : బీజేపీగానీ కాంగ్రెస్ గానీ మాకు డబ్బులు ఏమీ ఇస్తామనడం లేదు. మాకు వారి డబ్బు వద్దు కూడా. రాజ్‌దీప్ సర్దేశాయ్ : ఈ ఎన్నికల్లో పవన్ కీలకంగా మారారు కదా? జగన్మోహన్ రెడ్డి : ఆయన గత ఎన్నికల్లో టీడీపీతో ఉన్నారు. టీడీపీ తరపున ప్రచారం చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడానికి ఆయన కూడా దోహదపడ్డారు. ఈ ఐదేళ్లలో నాలుగున్నరేళ్లు ఆయన పూర్తిగా టీడీపీతోనే కలసి ఉన్నారు కూడా. రాష్ట్రంలో టీడీపీ ప్రజావ్యతిరేక పాలనలో ఆయన కూడా భాగస్వామి. ప్రభుత్వ వైఫల్యాలకు ఆయన బాధ్యత కూడా ఉంది. రాజ్‌దీప్ సర్దేశాయ్ : మీరు సీఎం అయితే సింగపూర్‌వంటి అంతర్జాతీయ నగరంగా అమరావతిని నిర్మించాలన్న చంద్రబాబు కలను కొనసాగిస్తారా? జగన్మోహన్ రెడ్డి : రాజ్‌దీప్ అసలు నిజం ఏమిటంటే... రాజధాని అమరావతిలో చూస్తే ఏం కనిపిస్తోంది. శాశ్వత రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు ఒక్క ఇటుకు కూడా వేయ లేదు. అక్కడ ఉన్నది అంతా తాత్కాలికమే. రాజ్‌దీప్ సర్దేశాయ్ : వైఎస్ జీవించి ఉన్నప్పుడు మీరు ఈస్థాయిలో ఉంటానని ఎప్పుడైనా అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి : అస్సలు అనుకోలేదు. ఇటువంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. ఆయన కాంగ్రెస్‌లో చాలా పెద్ద నాయకుడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయం.. రాజ్‌దీప్ సర్దేశాయ్ : రాజకీయాల్లోకి రావాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి : మా నాన్న జీవించి ఉండగానే ఆయన ప్రోద్భలం వల్లే నేను రాజకీయాల్లోకి వచ్చాను. 2009లో ఆయన నన్ను రాజకీయాలలోకి తీసుకువచ్చారు. నీకు మంచి మనసు ఉంది. నీలాంటి వాళ్లు తప్పక రాజకీయాల్లోకి రావాలన్నారు. దురదృష్టవశాత్తు ఆ తర్వాత వంద రోజులకు ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. దాంతో ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉండాల్సి వచ్చింది. మా నాన్న హెలికాఫ్టర్ కూలి చనిపోయిన ప్రాంతాన్ని చూశా. ఒక్కసారి మాట ఇస్తే వెనుకడుగు వేయని మా నాన్నకు ప్రజలతో ఉన్న అనుబంధం ఏమిటో తెలిసింది. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో జరిగిన సంతాప సభను చూసిన తర్వాత ఆయన కోసం మరణించిన వారి అన్ని కుటుంబాలను స్వయంగా పరామర్శిస్తానని నిర్ణయం ప్రకటించాను. వాళ్లందరూ నా కుటుంబ సభ్యులుగా భావించా. అందుకే ఆ మాట ఇచ్చాను. అది సెంటిమెంట్‌తో కూడిన అంశం. అదే విషయాన్నే కాంగ్రెస్ నాయకులకు చెప్పా. నేను రాజకీయాలకు కొత్త. అందువల్ల, అటువంటి మాట ఇచ్చేటప్పుడు నేను వాళ్ల అనుమతి తీసుకోవాలని కూడా తెలియదు. సోనియా గాంధీని మూడుసార్లు కలిసి ఆ విషయమే చెప్పా. ఈ విషయమై అహ్మద్ పటేల్‌ను ఆరేడు సార్లు కలిశా. మా నాన్న కోసం కన్నుమూసిన వారి కుటుంబాలన్నింటినీ పరామర్శించేందుకు అనుమతి ఇమ్మని పదేపదే కోరా. కారణమేమిటో తెలియదు గాని వాళ్లు నాకు అనుమతి ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో నేను ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అలా ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న నిర్ణయమే నా గమ్యాన్ని మార్చేసింది. రాజ్‌దీప్ సర్దేశాయ్ : తాను హైదరాబాద్ నిర్మించాను. అమరావతి నిర్మిస్తాను అని చంద్రబాబు అంటున్నారు కదా? జగన్మోహన్ రెడ్డి : చంద్రబాబు హైదరాబాద్ నిర్మించారా...!?... మీకు కావాలంటే చంద్రబాబు ప్రభుత్వంలో హైదరాబాద్ అభివృద్ధి, నాన్నగారి ప్రభుత్వంలో హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన గణాంకాలు, వివరాలు అన్నీ ఇస్తాను. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రమాణాలు కూడా నాన్న ప్రభుత్వ హయాంలో కంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తక్కువగానే ఉన్నాయి. ఆయన అప్పుడు హైదరాబాద్‌ను నిర్మించ లేదు. ఇప్పుడు ప్రపంచస్థాయి అమరావతి రాజధానిని నిర్మించడమూ లేదు. -
క్షీణిస్తున్న చంద్రబాబు నాయుడి గ్రాఫ్
-
కేజ్రీవాల్‌కు ఆదరణ పెరుగుతోంది: సర్వే∙
న్యూఢిల్లీ: ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై ప్రజాదరణ పెరుగుతున్నట్లు ‘ఇండియా టుడే’ చేపట్టిన పొలిటికల్ స్టాక్ ఎక్ఛ్సేంజి సర్వేలో వెల్లడైంది. గత అక్టోబర్‌లో చేపట్టినప్పటి కంటే తాజా సర్వేలో 2 శాతం వరకు ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగిందని తేలింది. సుమారు 49% మంది ప్రజలు కేజ్రీవాల్ పాలన సంతృప్తికరంగా ఉన్నట్లు వెల్లడించారు. తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్నకు కేజ్రీవాల్ వైపే అత్యధికులు మొగ్గు చూపగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, మాజీ సీఎం షీలా దీక్షిత్ ఉన్నారు. ప్రధాని పదవికి మోదీకి 49% మంది, రాహుల్ 40% మంది అనుకూలంగా సమాధానమిచ్చారు. ఈ సర్వేను యాక్సిస్ మై ఇండియా సంస్థ 2018 డిసెంబర్ 27– 2019 జనవరి 3 మధ్య చేసింది. -
‘గౌరవ్.. నా గదిలోకి వచ్చి...’
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘మీటూ’ ఉద్యమ సెగ ప్రస్తుతం ఇండియా టుడే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గౌరవ్ సావంత్‌ను కూడా తాకింది. పదిహేనేళ్ల క్రితం గౌరవ్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ మహిళా జర్నలిస్టు విద్యా కృష్ణన్ ఆరోపించారు. ఈ క్రమంలో గౌరవ్ ఆమెతో ప్రవర్తించిన తీరును వివరిస్తూ ‘ద కారవాన్’ మ్యాగజీన్ కథనం ప్రచురించడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. కాగా విద్యా ఆరోపణలను ఖండించిన గౌరవ్.. కారవాన్ కథనాన్ని తప్పుబట్టారు. తనపై అసత్య ఆరోపణలు ప్రచారం చేసినందుకుగాను ఆ మ్యాగజీన్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు. The article published by Caravan is irresponsible, baseless, and completely false. I am talking to my lawyers and will take full legal action. So grateful to my family, friends, and viewers for their support. — GAURAV C SAWANT (@gauravcsawant) November 12, 2018 గదిలోకి వచ్చి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ‘అది నా మొదటి అవుట్ స్టేషన్ అసైన్మెంట్. అందులో భాగంగా పంజాబ్‌లోని బియాస్ మిలిటరీ స్టేషన్లో భారత ఆర్మీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యాను. ఆ సమయంలో గౌరవ్ డిఫెన్స్ కరస్పాండెంట్‌గా ఉన్నాడు. అతడు కూడా నేను వెళ్లిన కార్యక్రమానికి వచ్చాడు. అందులో భాగంగా మేము ఒకే వాహనంలో ప్రయాణించాల్సి వచ్చింది. ఆ సమయంలో నా వెనుక నుంచి భుజంపై చేయి వేసిన గౌరవ్.. ఒళ్లంతా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో నాకు చాలా భయం వేసింది. ఈ విషయం ఎవరితో చెప్పాలో అర్థం కాలేదు. ఆ తర్వాత మళ్లీ నార్మల్‌గానే ప్రవర్తించాడు. మళ్లీ ఏమయ్యిందో తెలీదు.. ఆరోజు రాత్రి నా హోటల్ గది ముందు వచ్చి నిలబడ్డాడు. బెల్ కొట్టగానే తెరిచాను. ఎందుకు వచ్చారని అడిగే లోపే లోపలికి వచ్చేశాడు. మీరు స్నానం చేస్తారా నేను కంపెనీ ఇవ్వాలా అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. ఆ తర్వాత వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కానీ ఆ సమయంలో నేను గట్టిగా అరవడంతో కాస్త వెనక్కి తగ్గాడు. హోటల్ సిబ్బందిని పిలుస్తానని బెదిరించడంతో గది నుంచి వెళ్లి పోయాడు’ అంటూ ‘ద హిందూ’ హెల్త్ మాజీ ఎడిటర్ విద్యా కృష్ణన్ తను ఎదుర్కొన్న భయానక అనుభవం గురించి కారవాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇటువంటి విషయాలు బయటపెడితే వృత్తిపరంగా ఎదిగేందుకు అవరోధాలు ఎదురవుతాయని తనకు తెలుసనని.. అయితే ఆరోజు తాను నోరు మూసుకుని ఉండటానికి ప్రధాన కారణం ఆనాటి సామాజిక పరిస్థితులేనని ఆమె తన అసహాయత గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా టుడే వివరణ తమ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గౌరవ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇండియా టుడే యాజమాన్యం స్పందించింది. ‘గౌరవ్ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పిన సమయంలో అతడు మా సంస్థలో లేడు. ఆర్టికల్‌పై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. అయితే ఈ విషయంపై మేము అతడిని వివరణ కోరాం. ఈ ఆరోపణలను కొట్టిపారేసిన గౌరవ్ చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యానని చెప్పారు’ అని మరో జాతీయ మీడియాతో పేర్కొంది. -
టాటా స్కై యూజర్లకు షాక్ : సోని ఛానల్స్ క్లోజ్
ముంబై : 1.6 కోట్ల టాటా స్కై సబ్స్క్రైబర్లకు షాకింగ్ న్యూస్. మీకు ఎంతో ఇష్టమైన, నిరంతరం చూసే సోని పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా(ఎస్పీఎన్)కు చెందిన 32 ఛానల్స్‌ను టాటా స్కై తన ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. అంతేకాక ఇండియా టుడే నెట్‌వర్క్‌కు చెందిన మూడు ఛానల్స్‌ను కూడా తన ప్లాట్‌ఫామ్‌ను నుంచి తొలగిస్తున్నట్టు టాటా స్కై వెల్లడించింది. ధరల సమస్యలతో ఈ ఛానల్స్‌ను తన ప్లాట్‌ఫామ్ నుంచి తొలగిస్తున్నట్టు టాటా స్కై ప్రకటించింది. టాటా స్కై ఆపివేసిన ఛానల్స్ల్లో పాపులర్ టీవీ ఛానల్స్ సోని ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, ఎస్‌ఏబీ, మ్యాక్స్, ఏఎక్స్‌ఎన్, సోని పిక్స్, ఆజ్ తక్, ఇండియా టుడే ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి టాటా స్కైలో ఈ ఛానల్స్‌ను ప్రసారం చేయడం లేదు. ఈ విషయం తెలిసిన కొంతమంది సబ్స్క్రైబర్లు ఇప్పటికే టాటా స్కైపై మండిపడుతున్నారు. ట్విటర్, ఫేస్బుక్ వేదికగా విమర్శలు కురిపిస్తున్నారు. టాటా స్కై నిర్ణయం దురదృష్టకరమైనదని సోని పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా ప్రకటించింది. టాటా స్కైతో సోని పిక్చర్స్‌కు ఉన్న మూడేళ్ల డిస్ట్రిబ్యూషన్ డీల్ జూలై 31తో ముగిసింది. కొత్త డీల్‌పై ఇరు పార్టీలు చర్చించుకోవాల్సి ఉంది. కానీ ధరల విషయంలో ఈ రెండింటికీ పొంతన కుదరలేదు. మూడేళ్ల క్రితం టాటా స్కై సబ్స్క్రైబర్ల సంఖ్య కోటి వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆ సంఖ్య 1.6 కోటికి పైగా చేరింది. టాటా స్కై తమకు ఎక్కువ రెవెన్యూ ఇవ్వాలని సోని పిక్చర్స్ డిమాండ్ చేసింది. దానికి టాటా స్కై ఆమోదించలేదు. ‘సోని పిక్చర్స్‌తో ఉన్న వాణిజ్య చర్చలు విఫలమయ్యాయి. ధరలు పెంచాలని వారు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము కొన్ని ఛానల్స్‌ను తొలగించాలని నిర్ణయించాం. సబ్స్క్రైబర్లు అర్థం చేసుకోవాలి’ టాటా స్కై ఎండీ హరిత్ నాగ్‌పాల్ కోరారు. అయితే సోని పిక్చర్స్ మాత్రం టాటా స్కైపై తీవ్ర ఆరోపణలు చేసింది. వినియోగదారుల ఆసక్తికి తగ్గట్టు టాటా స్కై వ్యవహరించడం లేదని, వరల్డ్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ను, లైవ్ స్పోర్టింగ్ యాక్షన్‌ను చూసే అవకాశాన్ని యూజర్లకు టాటా స్కై ఇవ్వడం లేదని సోని పిక్చర్స్ అధికారి ప్రతినిధి ఆరోపించారు. తమ ఛానల్స్‌ను చూడాలనుకునే వారు, తమకు సెపరేటుగా మిస్డ్ కాల్ ఇవ్వాలని తెలిపింది. అయితే మిస్డ్ కాల్ ఇవ్వాలంటూ.. ఇచ్చిన నెంబర్ కలువడం లేదు. కస్టమర్ కేర్ సర్వీసు క్రాష్ అయింది. దీంతో సబ్స్క్రైబర్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. అయితే 10 సోని పిక్చర్స్ ఛానల్స్‌ను మాత్రం టాటా స్కై అలానే ఉంచింది. టాటా స్కై తన ప్లాట్‌ఫామ్‌పై తొలగించకుండా ఉంచిన ఛానల్స్ల్లో ఎస్ఈటీ, ఎస్ఈటీ హెచ్డీ, సోని ఎస్‌ఏబీ, మ్యాక్స్, సోని సిక్స్, సోని టెన్, టెన్ 1 హెచ్డీ, సోని టెన్ 2 హెచ్డీ, సోని టెన్ 3, పిక్స్ హెచ్డీ, వన్ ఇండియా టుడే ఛానల్(ఆజ్ తక్) ఉన్నాయి. -
‘ముఖ్యమంత్రులు ప్రెస్మీట్లు పెట్టట్లేదు’
సాక్షి, హైదరాబాద్ : వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రెస్మీట్లు పెట్టట్లేదని, మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వారు సిద్ధంగా లేరని ప్రముఖ జర్నలిస్టు, ఇండియా టుడే కన్సల్టింగ్ గ్రూపు ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ 53వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన ‘మీడియా ఇన్ బ్రేకింగ్ న్యూస్ ఎరా’ అనే అంశంపై మాట్లాడారు. హైదరాబాద్ అనేక మంది గొప్ప పాత్రికేయులను ఇచ్చిందని, ఇక్కడికి రావడం తనకు గర్వంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుత మీడియాను అడ్వటైజ్మెంట్ విభాగాలే శాసిస్తున్నాయిని అన్నారు. కేవలం సంచలనాల కోసమే ఇప్పటి మీడియా ప్రయత్నిస్తుందని, ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, వ్యవసాయంపై అవసరమైన మేర స్పందించట్లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియా విస్తరణ తర్వాత అందరూ జర్నలిస్టులుగా వ్యవహరిస్తున్నారని, అయితే సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య వార్తాలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
భారత్‌లోనూ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’లు
న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కన్సల్టెన్సీ సంస్థ 8.7 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అంతకు మించిన సమాచార కుంభకోణాలు మన దేశంలోనే జరుగుతున్న విషయం ‘ఇండియా టుడే’ రహస్య పరిశీలనలో తాజాగా తేటతెల్లమైంది. ఆన్లైన్ వ్యవస్థ, సమాచారంపై దేశంలో సరైన నియంత్రణ, చట్టాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రజల ఓట్లను ప్రభావితం చేయడం కోసం భారత్‌లోనూ వివిధ ప్రధాన నగరాల్లో కన్సల్టెన్సీ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఉద్యోగాల కోసం జాబ్ పోర్టళ్లలో రెజ్యూమె పెట్టినప్పుడు, షాపింగ్ యాప్‌లు, ఆఫ్‌లైన్ స్టోర్లలో షాపింగ్ చేసినప్పుడు, క్రెడిట్, డెబిట్ కార్డులు వాడినప్పుడు, బ్యాంకులు, టెలికం, డీటీహెచ్ సేవలను ఉపయోగించుకున్నప్పుడు.. ఇలా ప్రతీ సందర్భంలోనూ కోట్లాది మంది ప్రజల అమూల్యమైన సమాచారాన్ని అవి తస్కరిస్తున్నాయి. తర్వాత ఆ వివరాలను ఉపయోగించుకుని వినియోగదారుల అభిరుచులను బట్టి వారి ఓట్లను ప్రభావితం చేసేలా వివిధ రాజకీయ పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని మొబైల్‌తోపాటు వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లోనూ మెసేజ్‌లు పంపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేస్తాం.. ఢిల్లీకి చెందిన ‘జనాధార్’ అనే కన్సల్టెన్సీ సంస్థ వ్యవస్థాపకుడు మనీశ్ మాట్లాడుతూ అనేక మార్గాల్లో సేకరించిన ఓటర్ల జాబితా తమ వద్ద ఉందనీ, ఈ నెలలోనే జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తామని ఇండియా టుడే విలేకరికి హామీనిచ్చాడు. రెండోసారి విలేకరి మనీశ్‌ను కలిసినప్పటికి దక్షిణ బెంగళూరు నియోజకవర్గానికి చెందిన రెండు లక్షల ఓటర్ల వివరాలను అతను సేకరించి పెట్టాడు. ఓటరు పేరు, చిరునామా, ఫోన్ నంబర్, పాన్, ఆధార్ నంబర్, ఆర్థిక పరమైన వివరాలు కూడా ఉన్నాయి.‘ఎవరైనా ఉద్యోగం కోసం జాబ్ పోర్టళ్లలో రెజ్యూమె పెట్టినా, క్రెడిట్ కార్డు వాడినా, లాయల్టీ ప్రోగ్రాంలలో సభ్యత్వం తీసుకున్నా వారికి సంబంధించిన సమాచారం నాకు అందుతుంది. వారు వారి సమాచారాన్ని ఎక్కడ ఇచ్చినా అది నాకు చేరుతుంది’ అని మనీశ్ చెప్పుకొచ్చాడు. అయితే బెంగళూరు నగరంలోని ఒక నియోజకవర్గ ఓటర్ల సమాచారాన్ని ఇచ్చేందుకే అతను ఏకంగా 1.2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. టెలికం అధికారులతో లాలూచీ.. టెలికాం కంపెనీల అధికారులతో కుమ్మక్కయ్యి ఒక్కో ప్రాంతంలోని టవర్ల నుంచి ప్రతి వినియోగదారుడి సమాచారాన్ని తాము సేకరిస్తున్నామని పోల్స్టర్ అనే మరో సంస్థ ప్రతినిధి వెల్లడించారు. అలాగే ఓటు హక్కుపై అవగాహన కల్పించే నెపంతో తమ సిబ్బంది వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి ఓటర్ల సమాచారాన్ని సేకరిస్తారని కూడా ఆయన తెలిపారు. ఈ విధంగా వచ్చిన సమాచారంతో కనీసం 5 నుంచి 6 శాతం ఓటర్లను ప్రభావితం చేయొచ్చని వివరించారు. ఢిల్లీకి చెందిన మావరిక్ డిజిటల్, ముంబై కేంద్రంగా పనిచేసే క్రోనో డిజిటల్ తదితర కంపెనీలు కూడా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఇండియా టుడే పరిశీలనలో బయటపడింది. -
కర్ణాటకలో హంగ్!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ తరుణంలో కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. తాజాగా కర్ణాటక ఎన్నికలపై వెలువడిన ఇండియా టుడే-కార్వీ ఒపీనియన్ పోల్ ఫలితాల్ని పరిశీలిస్తే... కాంగ్రెస్ పార్టీనే మరోసారి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది కాంగ్రెస్‌కు 90-101 సీట్లు వచ్చే అవకాశం బీజేపీకి 78-86 సీట్లు వచ్చే అవకాశం జేడీఎస్‌కు 34-43 సీట్లకు ఛాన్స్ ఇతరులు 4-7 సీట్లు దక్కించుకోవచ్చు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్న జేడీఎస్ 33 శాతం ప్రజలు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు -
‘నాకు లేని అభ్యంతరం వారికెందుకు?’
సాక్షి, సినిమా : దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి బాలీవుడ్లో ‘అయ్యారీ’తో ప్రేక్షకులను పలకరించబోతోంది రకుల్. ఈ క్రమంలో ఓవైపు హీరో సిధార్థ్ మల్హోత్రాతోపాటు చిత్ర ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంది. మరోవైపు హాట్ ఫోటో షూట్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సౌత్‌లో ‘కాస్త’ పద్ధతిగల పాత్రల్లో నటించిన రకుల్ ఒక్కసారిగా ‘అలా’ కనిపించేసరికి ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లతో విరుచుకుపడ్డారు. తాజాగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై రకుల్ స్పందించింది. వారికేమైనా సందేశం ఇవ్వదల్చుకున్నారా? అన్న ప్రశ్నకు ఆమె మాంచి సమాధానమే ఇచ్చింది. ‘ఆ ఫోటోషూట్‌పై కొందరు సానుకూలంగా కూడా కామెంట్లు చేశారు. ఎవరి అభిప్రాయం వారిది. పాజిటివ్ కామెంట్లకు మురిసిపోవటం.. నెగటివ్ కామెంట్లకు కుంగిపోవటం నాకు అలవాటు లేదు. కెరీర్లో ఒక్కసారైనా ప్రముఖ మాగ్జైన్ కవర్ పేజీలపై మెరవాలన్న కోరిక ప్రతీ నటీనటులకు ఉంటుంది. నాకూ ఆ అవకాశం దక్కింది.. వాడుకున్నా. అసలు ఆ కామెంట్లను చదివేందుకు నాకు ఆసక్తి, తీరిక రెండూ లేవు. నేను చేసే పని నాకు నచ్చింది. నా కుటుంబ సభ్యులకే అభ్యంతరం లేనప్పుడు.. వారికి ఎందుకు ఉంటుందో అర్థం కావట్లేదు. ఎవరేమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం నాకైతే లేదు’ అని రకుల్ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యల తర్వాత కూడా తనను కొందరు విమర్శించే అవకాశం లేకపోలేదని.. కానీ, వాటిని కూడా తాను పట్టించుకోనని ఆమె తెలిపింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ తానెప్పుడూ అలాంటి వేధింపులు ఎదుర్కోలేదని.. టాలీవుడ్లో కొత్త ప్రాజెక్టులకు అంగీకరించకపోవటంపై వస్తున్న విమర్శలపై స్పందించింది. తెలుగులో మంచి కథలు దొరక్కపోవటంతోనే తాను ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదని.. బాలీవుడ్, కోలీవుడ్‌లో వరుసగా అవకాశాలు వచ్చినా టాలీవుడ్ మాత్రం తనకు సొంతిల్లు లాంటిదని రకుల్ వివరించింది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన అయ్యారీ ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో సిధార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్‌పాయి, రకుల్ ప్రధాన పాత్రలు పోషించారు. Sending you all a little love this Feb with my cover for @maxim.india #rakulformaxim ❤️ A post shared by Rakul Singh (@rakulpreet) on Feb 6, 2018 at 11:44pm PST -
మోటో ఎం(గ్రే కలర్) పై భారీ డిస్కౌంట్ నేడే
ముంబై: ప్రముఖ చైనా మొబైల్ సంస్థ మోటోరోలా తన తాజా స్మార్ట్‌ఫోన్ మోటో ఎం (గ్రే వేరియంట్) పై భారీ డిస్కౌంట్ ఆఫర్ నేడే (సోమవారం) ప్రారంభం కానుంది. ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లో ఈ భారీ ఆఫర్ అందుబాటులోకి రానుంది. సుమారు రూ.15 వేల దాకా భారీ తగ్గింపుతో మోటో ఎం కొత్త వేరియంట్ ను వెబ్సైట్ ద్వారా విక్రయించనుంది. ఏదైనా స్మార్ట్‌ఫోన్ ఎక్సేంజ్ ద్వారా మెటా ఎం గ్రే కలర్ వేరియంట్‌ను కేవలం రూ. 2,999కే అందించనుంది. ఈ మధ్యాహ్నం నుంచి విక్రయాలు ప్రారంభంకానున్నాయి. మోటో తాజా స్మార్ట్ ఫోన్ మోటో ఎం (64జీబీ స్టోరేజ్) భారీ తగ్గింపుతో కేవలం 2,999 కే ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. గత ఏడాది డిశెంబర్లో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.17,999 గా నిర్ణయించింది. ఇపుడు గ్రే ఆప్షన్లో లాంచ్ చేస్తోంది. అయితే పాత స్మార్ట్‌ఫోన్‌తో స్పెషల్ ఎక్సేంజ్ ఆఫర్ లో మాత్రమే ఈ సౌలభ్యం అందుబాటులో ఉండనుంది. పూర్తి వివరాలుకు ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్ ను సందర్శించగలరు. మోటో ఎం ఫీచర్లు... 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, మాలి టి860 ఎంపీ2 గ్రాఫిక్స్ 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్ 4జీ వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్ బ్లూటూత్ 4.1 ఎల్ఈ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సి 3050 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్ -
తప్పులో కాలేసిన టీవీ చానల్
న్యూఢిల్లీ: టీవీ చానల్ ఇండియా టుడేలో కనిపించిన ఓ బ్రేకింగ్ న్యూస్ చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో కొనసాగుతున్న గందరగోళ పరిస్థితులపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని బ్రేకింగ్ న్యూస్‌గా ఇచ్చే క్రమంలో ఇండియా టుడేలో పెద్ద తప్పిదమే దొర్లింది. పార్లమెంట్లో ఎంపీల వ్యవహారశైలి మూలంగా చర్చ జరగకుండా పోతుందని.. దీనిపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారని టీవీ చానల్ ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ కాస్తా.. టైపింగ్‌లో తప్పు దొర్లి, మధ్యలో ఆంగ్ల అక్షరం 'ఈ' చేరడంతో ఎలా మారిందో మీకు కనిపిస్తోంది! -
'మోటో ఎం' స్మార్ట్ ఫోన్ లాంచింగ్ నేడే
ముంబై: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ లెనోవో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మంగళవారం లాంచ్ చేయనుంది. లెనోవా సొంతమైన మోటో.. ఇండియాలో మొట్టమొదటి ఆల్ -మెటల్ ఫోన్ ను ప్రారంభించనుంది. మోటో ఎం పేరుతో తీసుకొస్తున్న ఈ కొత్త డివైస్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. ముంబైలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే చైనాలో ఈ లాంచ్ అయిన మోటో ఎం ధర సుమారు రూ. 20వేలుగా ఉండనుంది. మోటో ఎం ఫీచర్లు: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే,1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, మాలి టి860 ఎంపీ2 గ్రాఫిక్స్ 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్ 4జీ వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్ 3050 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్ ఆండ్రాయిడ్ 6.0.1 మార్షమిల్లౌ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. -
శాంసంగ్ గెలాక్సీ జె 5, జె 7లాంచింగ్ నేడే
న్యూఢిల్లీ: ఇండియన్ మొబైల్ మార్కెట్ లో దూసుకుపోతున్న శాంసంగ్ జె సిరీస్ లో రెండు స్మార్ట్ ఫోన్లను సోమవారం భారత మార్కెట్ లో రిలీజ్ చేయనుంది. స్మార్ట్ పోన్ సెగ్మెంట్ లో శాంసంగ్ 'గెలాక్సీ జె7' ., గెలాక్జీ జె 5' లను ఈ రోజు విడుదల చేయనుంది. మొబైల్ అమ్మకాల్లో యాపిల్ సంస్థకు ఇప్పటికే చెక్ పెట్టిన శాంసంగ్, గెట్ రెడీ టూ విట్నెస్ ద నెక్ట్స్ అంటూ ప్రత్యర్థి కంపెనీలకు సవాలు విసురుతోంది. తన తాజా గెలాక్సీ J5ను సుమారు Rs. 17,000, గెలాక్సీ J7ను సుమారు 21,000 రూపాయలకు వినియోగదారులకు లభ్యం కానుంది. మెటల్ ఫ్రేమ్స్ తో వస్తున్న ఈ రెండు ఫోన్ల ఫీచర్స్ఇలా వున్నాయి. శాంసంగ్ గెలాక్సీ జె7 (2016) ఫీచర్లు... 5.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.6 జీహెచ్‌జెడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.1 3300 ఎంఏహెచ్ బ్యాటరీ శాంసంగ్ గెలాక్సీ జె7 (2016) ఫీచర్లు... 5.20 డిస్ ప్లే 1.2 జీహెచ్‌జెడ్ ప్రాసెసర్, 5 మోగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 720x1280 పిక్సెల్ రిజల్యూషన్, 2జీబీ ర్యామ్, 6.0.1 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 3100 ఎంఏహెచ్ బ్యాటరీ రేడియంట్ గోల్డ్, మిడ్ నైట్ బ్లాక్, పెర్ల్ వైట్, వేరియంట్లలో మంగళవారం నుంచి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటాయి. గత ఏడాది మార్చిలో చైనాలో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్లు, కొరియాలో గతవారం మార్కెట్లను పలకరించాయి. -
బాలకృష్ణపై ఇండియాటుడే ప్రత్యేక సంచిక
ఆవిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్: సమాజంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవితాలపై పుస్తకాలు రావాల్సి ఉందని.. అలాంటి పుస్తకాలు, ప్రత్యేక సంచికలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఇండియా టుడే ప్రచురించిన ప్రత్యేక సంచికను గురువారం హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో ఆయన ఆవిష్కరించారు. తొలి కాపీని బాలకృష్ణకు అందించిన అనంతరం మాట్లాడారు. ‘‘ఒక వ్యక్తి గురించిన అంశాలను వేర్వేరు చోట్ల చదువుకునే కన్నా.. అంతా కలిపి ఒకేచోట గుదిగుచ్చి ఇచ్చిన పుస్తకంలో చదువడం బాగుంటుంది. ఇండియా టుడే పత్రిక చాలా శ్రమించి, అత్యున్నత ప్రమాణాలతో వేసిన ఈ బాలకృష్ణ ప్రత్యేక సంచిక బాగా వచ్చింది. మంచి టైమ్‌లో వచ్చిన మంచి పుస్తకం ఇది. భవిష్యత్ తరాలకు ఒక రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుంది’’ అని అన్నారు. సినీ, రాజకీయ, సేవా రంగాలు మూడింటిలోనూ తన కృషిని గుర్తించి ఇండియా టుడే ఈ ప్రత్యేక సంచిక వేయడంపై బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఐదారు నెలల పాటు శ్రమించి ఎన్నో ఇంటర్వ్యూలు, అరుదైన ఫోటోలను క్రోడీకరించి, ఈ సంచికను అందంగా తీసుకొచ్చారు. నాలోని అన్ని కోణాలనూ స్పృశిస్తూ వచ్చిన ఈ సంచిక అందరినీ ఆకట్టుకుంటుంది..’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సంచిక రూపకల్పనలో పాలుపంచుకొన్న కొమ్మినేని వెంకటేశ్వరరావు, డాక్టర్ సురేంద్ర, సీనియర్ జర్నలిస్టులు ఎ.రామ్మోహన్రావు, ప్రదీప్, ఎల్.వేణుగోపాల్, ‘ఇండియా టుడే’ మార్కెటింగ్ విభాగానికి చెందిన శ్రీనివాసబాబు తదితరులను చంద్రబాబు, బాలకృష్ణ అభినందించారు. ఈ సంచిక కోసం ప్రత్యేకంగా బాలకృష్ణ పెయింటింగ్ వేసిన ప్రముఖ చిత్రకారుడు ఈశ్వర్‌ను చంద్రబాబు, బాలకృష్ణ సన్మానించారు. -
‘ఖేడ్’ అభివృద్ధి బాధ్యత నాదే
♦ నియోజకవర్గ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకుంటాం: మంత్రి హరీశ్ ♦ ప్రత్యేక ప్యాకేజీతో సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తా ♦ విపక్షాలు ఇకనైనా మారాలి.. అభివృద్ధికి కృషి చేయాలి ♦ మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ♦ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన భూపాల్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘‘నారాయణ ఖేడ్ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకుంటాం. నియోజకవర్గం అభివృద్ధికి పూర్తిగా నాదే బాధ్యత. ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తా. సీఎం వద్ద ప్రత్యేక ప్యాకేజీ సాధించి సాగు, తాగునీరు, విద్య, వైద్యం, రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటా...’’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన భూపాల్‌రెడ్డి ఆదివారం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. స్పీకర్ ఎస్.మధుసూదనాచారి.. భూపాల్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి తదితరులు హజరయ్యారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఎం అందిస్తున్న సుపరిపాలన వల్లే ఖేడ్‌లో విజయం సాధ్యమైంద న్నారు. ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రతిపక్షాలు ఎంత దివాలాకోరు ప్రచారం చేసినా ప్రజలు తిప్పికొట్టారని, అభివృద్ధి, సంక్షేమానికే జై కొట్టారని హరీశ్ అన్నారు. తెలంగాణ కోసం ఎలా కలిసి కొట్లాడామో, అభివృద్ధి కోసం కూడాఅలాగే కలిసి కృషి చేద్దామని విపక్షాలకు హితవు పలికారు. విపక్షాలు ఇకనైనా, ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. దేశంలోనే అత్యంత ఆదరణ కలిగిన సీఎంగా కేసీఆర్ అని ‘ఇండియా టుడే’ ప్రకటించిందని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆ పత్రికకు కనిపించినా, ఇక్కడి ప్రతిపక్షాలకు మాత్రం కనిపించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. తమిళనాడు వంటి రాష్ట్రాలే కరెంటు కష్టాల నుంచి బయటపడలేక పోతున్నాయని, తెలంగాణ ఇంత తక్కువ కాలంలో కరెంటు సమస్యను ఎలా అధిగమించిందో విపక్షాలు ఆలోచించాలని సూచించారు. మిషన్ భగీరథ తరహా పథకాన్ని తాము కూడా అమలు చేస్తామని యూపీ, బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయని, మిషన్ కాకతీయ పథకానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. విలేకరుల సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. జల విధానంపై అర్థవంతమైన చర్చ జరగాలి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 2వ వారంలో నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ సమావేశాలు వేదికగా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన సమగ్ర జల విధానాన్ని సీఎం సభలో చర్చకు పెడతారని చెప్పారు. ప్రభుత్వం అర్థవంతమైన చర్చ కోరుకుంటోందన్నారు. ఖేడ్ ప్రజల రుణం తీర్చుకుంటా: భూపాల్‌రెడ్డి నారాయణ ఖేడ్ నియోజకవర్గ ప్రజలకు తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానని ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. -
నంబర్ వన్ ‘ఓయూ’
♦ దేశంలోని అన్ని రాష్ట్ర వర్సిటీల్లో అగ్రస్థానం ♦ ఇండియా టుడే - నీల్సన్ ఇండియా సర్వేలో వెల్లడి హైదరాబాద్ : చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోని అన్ని రాష్ట్ర యూనివర్సిటీల్లో ఉత్తమ వర్సిటీగా ఓయూ ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేగాక దక్షిణ భారత్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ, రాష్ట్ర యూనివర్సిటీ లను వెనక్కినెట్టి ఓయూనే అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వీటితోపాటు దేశంలోని అన్ని కేంద్ర, డీమ్డ్ వర్సిటీల్లో ఐదో స్థానాన్ని సంపాదించింది. ఇటీవల ఇండియా టుడే - నీల్సన్ ఇండియా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వర్సిటీకి ఈ గౌరవం దక్కింది. ఓయూలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేశ్‌కుమార్ ఈ వివరాలు వెల్లడించారు. వర్సిటీ గత కీర్తి, ఫ్యాకల్టీ, రీసెర్చ్ పబ్లికేషన్స్, ఆవిష్కరణలు, పరిపాలన, రిపోర్ట్స్, మౌలిక వసతులు, అడ్మిషన్ల ప్రక్రియ, విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ కల్పన తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ సర్వే నిర్వహించారని తెలిపారు. మిగతా వర్సిటీలతో పోల్చుకుంటే ఈ కేటగిరీల్లో వర్సిటీ మెరుగ్గా ఉండడంతోనే ఈ ఘనత సాధ్యపడిందన్నారు. ఈ సందర్భంగా ఓయూ అధ్యాపక బృందానికి, సిబ్బందికి రిజిస్ట్రార్ అభినందనలు తెలిపారు. త్వరలో 300 పోస్టులు భర్తీ.. ఓయూలో త్వరలో 300 అధ్యాపక పోస్టులు భర్తీ కానున్నాయని రిజిస్ట్రార్ సురేశ్‌కుమార్ తెలిపారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిందని వెల్లడించారు. వర్సిటీలో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలను ప్రభుత్వానికి అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కామర్స్ డీన్ అక్బర్ అలీఖాన్, యూజీసీ డీన్ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘర్ వాపసితోనే మోదీ పాపులారిటీ తగ్గింది
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఇండియా టుడే - సిసిరో సర్వే నిర్వహించింది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని 'ఘర్‌వాపసి' కార్యక్రమం విపరీతంగా దెబ్బతీస్తోందని ఈ సర్వేల్లో వెల్లడైంది. ఈ కార్యక్రమంతో ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీ బాగా తగ్గిందని ఈ సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలతో పోలిస్తే.. మరో 27 సీట్లు తగ్గుతాయని ఈ సర్వేలు తేల్చాయి. గత ఎన్నికల్లో వచ్చిన 282 సీట్ల నుంచి 255 కు తగ్గే అవకాశం ఉందని ఈ సర్వేలు వెల్లడించాయి. ఈ సర్వేలోని మరిన్ని అంశాలు.. ఈ సర్వేలో మొత్తం 12 వేల మంది అభిప్రాయాలను సేకరించారు. నిజాయితీ పరుడిగా మోదీకి దేశంలోనే అగ్రస్థానం. తిరుగులేని నేతగా మోదీ అంటూ 36 శాతం మంది ఓటు వేశారు. మోదీ ప్రభుత్వం బాగుందంటూ 38 శాతం మంది ఓటు వేశారు. మోదీ ప్రభుత్వం ఎక్సలెంట్ అంటే 22 శాతం మంది సమాధానం ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై 11 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ 9 స్థానాలు మెరుగుపడింది. బీజేపీ యూపీలో పట్టు కోల్పోతోంది. యూపీలో పెరిగిన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ బలాలు. రాజస్థాన్‌లో కూడా కాంగ్రెస్ బలం పెరుగుతోంది. పాపులారిటీలో మోదీ తర్వాత అరవింద్ కేజ్రీవాల్‌దే. కేజ్రీవాల్‌కు 15 శాతం మంది అనుకూలంగా సమాధానం ఇచ్చారు. ఉత్తమ ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్. 2014 ఆగస్టు నెలతో పోలిస్తే.. తగ్గిన మోదీ వ్యక్తిగత పాపులారిటీ. -
కమలం వికసిస్తుంది
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధిక సీట్లు రావచ్చని, ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలవవచ్చని ఇండియా టుడే గ్రూప్, సిసెరో ఢిల్లీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో వెల్లడైంది. ముఖ్యమంత్రిగా మాత్రం అర్వింద్ కేజ్రీవాల్ ఉండాలని ఢిల్లీవాసుల్లో అత్యధికులు కోరుకుంటున్నారు. ఈ విషయంలో బీజేపీకి చెందిన హర్షవర్ధన్ రెండో స్థానంలో నిలిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం పని తీరు ప్రభావం చూపనుందని, తద్వారా బీజేపీ లబ్ధి పొందగలదని ఆ సర్వే అంచనా వేసింది. బీజేపీ 39 శాతం ఓట్లను పొంది ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని, 36 శాతం ఓట్లతో ఆప్ రెండో స్థానంలో ఉంటుందని ఆ సర్వే పేర్కొంది. ముఖ్యమంత్రి పదవికి 35 శాతం కేజ్రీవాల్‌ను ఎన్నుకోగా, 19 శాతం మాత్రమే హర్షవర్ధన్‌కు మద్దతు పలికారు. ప్రభుత్వాన్ని నడపడానికి బదులు నిరసనలు, ఆందోళనలపైనే కేజ్రీవాల్ దృష్టి కేంద్రీకరించారని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని పాలించే అవకాశం అతనికే ఇవ్వాలని 55 శాతం మంది చెప్పారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4,273 ఓటర్లను ప్రశ్నించి ఈ వివరాలు సేకరించారు. ఈ ఎన్నికల్లో ఆప్‌కు ఒక శాతం, బీజేపీకి 5.9 శాతం ఓట్లు పెరుగుతాయని ఆ సర్వే అంచనా వేసింది. కాగా కాంగ్రెస్‌కు 8.5 శాతం ఓట్లు తగ్గుతాయని తెలిపింది. ఈ ఎన్నికల్లో అవినీతి ప్రధాన అంశం కానుంది. అవినీతిని అరికట్టే వారికే పట్టం గడతామని 21 శాతం మంది తేల్చి చెప్పారు. మరో చర్చనీయాంశమైన మహిళల భద్రతకు 17 శాతం మంది ప్రాముఖ్యతనిచ్చారు. 15 శాతం తాగునీటిని, 12 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని, కరెంటు సమస్యను పది శాతం మంది ప్రాధాన్యత అంశాలుగా చెప్పారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు పాలన దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కన్నా ఢిల్లీపై అధిక ప్రభావం చూపగలదని ఆ సర్వే తెలిపింది. మోడీ సర్కారు ఊహించినదాని కన్నా బాగా పని చేస్తోందని 34 శాతం పేర్కొనగా, తమ ఊహలకు దగ్గరగా ఉందని 33 శాతం మంది చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ పాలన తమ ఊహలను మించిపోయిందని 35 శాతం మంది అభిప్రాయపడ్డారు. తాము ఆశించిన విధంగానే ఆప్ సర్కారు పని చేసిందని 32 శాతం మంది చెప్పగా, తమ ఆశలను నీరుగార్చిందని 22 శాతం మంది అన్నారు. కేజ్రీవాల్ తన బాధ్యతల (సీఎం పదవి) నుంచి పారిపోయాడని, ఇందుకు అతడిని క్షమించలేమని 55 శాతం మంది అన్నారు. అయితే 49 రోజుల పాలనా కాలంలో అవి నీతిని తగ్గించాడని 60 శాతం మంది ప్రశంసించారు. విద్యుత్, నీటి చార్జీలను తగ్గించాడని వారు చెప్పారు. సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది కాంగ్రెస్‌ను అవినీతి పార్టీ అని, బంధు ప్రీతిని ప్రోత్సహిస్తుందని 51 శాతం మంది పేర్కొన్నారు. -
అరాచకానికి విరుగుడు ఆశ
అరాచకత్వం తారస్థాయికి చేరడాన్ని 1960లలో చూశాం. మనం ఆ దివాలాకోరు దశాబ్దం నుంచి ఎంతో దూరం వచ్చేశాం. కానీ యువతలోని ఆగ్రహం భారీ నష్టాన్ని కలిగిస్తుంది. కొత్త ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యం అత్యంత సామాన్యమైనది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఉపాధి కల్పన, పేదల జీవితాలు మెరుగయ్యేలా భారీగా పెట్టుబడులు పెట్టడం. చిన్న చిన్న వాస్తవాలు తరచూ పెద్ద సత్యాన్ని వెలుగు లోకి తెస్తుంటాయి. గత సోమవారం ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో అలాంటి ఓ బంగారు ఇటుక ప్రత్యక్షమైంది. ఆ రోజు ఆ పత్రిక పలు పొరలుగా ప్రచురించిన ఎన్నికల వార్తల్లో ఒక కథనం అది. అంతకు ముందటి రోజన ప్రధాన ఎన్నికల ప్రచార సారధులు ఎవరెవరు ఎక్కడున్నారనే వివరాలను అది ఆ కథనంలో ప్రచురించింది. కర్ణాటకలో బీజేపీ గత కొన్నేళ్లుగా అల్లకల్లోలానికి గురైంది. ఎగుడు దిగుడులను చవి చూసింది. ఆ రాష్ట్రంలో పార్టీని పునరుజ్జీవితం చేయడం కోసం నరేంద్రమోడీ ఆ రోజంతా హెలికాప్టర్లో గిరగిరా తిరిగారు. ఎల్కే ఆద్వానీ గుజరాత్లో ఉండగా, అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ రోడ్లపై రోడ్‌షోలతో దుమ్ము రేపుతున్నారు.ఇంకా ఇలాంటి వివరాలే చాలా ఇచ్చింది.ఇంతకూ రాహుల్ గాంధీ ఎక్కడున్నట్టు? ‘బహిరంగ కార్యక్రమాలేవీ లేవు’ అని ఆ పత్రిక సరళంగానూ, ఒకింత చప్పగానూ తెలిపింది. అది ప్రశ్నకు సమాధానమే గానీ వివరణ కాదు. ఆ రోజు ఆదివారం కాబట్టి రాహుల్‌కు సెలవు దినం. నాటకీయమైన ఎన్నికల ప్రచార కాలంలో రాహుల్ బహిరంగ చర్చ నుంచి అంతర్థానమైపోతున్నట్టు అనిపించడానికి చాలానే కారణాలుండొచ్చు.కానీ కాంగ్రెస్ స్టార్ నాయకునికి ఎక్కువ పని ఒత్తిడి గిట్టదేమోననే అనుమానం వేధించక మానదు. లేకపోతే రాహుల్‌కు ఉపన్యాసాలు రాసిచ్చేవాళ్లు అక్కడక్కడా చిలకరించిన అర్థరహితమైన పంక్తులకు మించి ఆయనకు మాట్లాడటానికి ఎక్కువ ఏమీ ఉండదేమో. వేగంగా తిరుగుతున్న ఇరుసుపై దేశం ముందుకు దూసుకు పోతూనే ఉంది. ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అత్యంత దిగ్భ్రాంతికరమైన గణాంకం తాజా ‘ఇండియా టుడే’ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. బీహార్‌లో నరేంద్ర మోడీ ఆశ్యర్యకరమైన రీతిలో 23 శాతం ముస్లిం ఓట్లను సంపాదించుకోబో తున్నారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ఢిల్లీ గద్దెనెక్కే అవకాశం గురించి భారత ముస్లింల గుండెల్లో భయం, కారు మబ్బులు గూడు కట్టుకున్నాయనే కథనాన్ని కాంగ్రెస్ అదే పనిగా వల్లె వేస్తోంది. ఆ కథనం కుప్పకూలిపోనున్నదనే దానికి ఈ వాస్తవమే సంకేతం. ఈ భయం, కారు మబ్బులే త్వరత్వరగా విచ్ఛిన్నమైపోతున్న కాంగ్రెస్, దాని మిత్రులైన లాలూ ప్రసాద్, నితీష్‌కుమార్‌ల ఆయుధాగారంలోని చిట్టచివరి ఆయుధం.జోస్యాలు చెప్పడం ఎప్పుడూ ప్రమాదకరమే. అయితే లోక్‌సభకు 88 మంది ఎంపీలను పంపే బీహార్, మహారాష్ట్రల నుంచి అత్యంత ఆశ్చర్య కరమైన ఫలితాలు వెలువడబోతున్నాయని గణాంకపరమైన, స్వీయకథనాల పరమైన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఒకప్పుడు లాలూకు మౌలిక పునాదిగా ఉండిన యాదవులు, ముస్లింలు ఎన్డీయే వైపు గణనీయంగా వలసపోతున్నారు. ఇది సాంప్రదాయకమైన దేశ కుల, మత రాజకీయాల చీలికలకు అతీతమైన పరివర్తనను ప్రతిఫలిస్తుంది. లాలూ, కాంగ్రెస్‌లకు ముస్లింల మద్దతు 52 శాతంనుంచి 40 శాతానికి పడిపోగా, బీజేపీ దాని మిత్రులకు వారి మద్దతు రెట్టింపైందనీ, 12 శాతం నుంచి 23 శాతానికి చేరిందని ‘ఇండియా టుడే’ ప్రజాభిప్రాయ సేకరణ ధ్రువీకరిస్తోంది. ఇక యాదవులలో వారికి మద్దతు 40 శాతం నుంచి 29 శాతానికి క్షీణించగా, బీజేపీ దాని మిత్రులకు మద్దతు 22 శాతం నుంచి 47 శాతానికి పెరిగింది. ఎందువలన? ఈ ఎన్నికలు జరుగుతున్నది అభివృద్ధి, సంక్షేమాల గురించి. భ్రమాత్మక రాజకీయాలు ఉత్తర భారత ఎన్నికల్లోని ప్రధానాంశం. అవి ఓడిపోయాయి. మన ప్రజలు ఆకలి కడుపుల కోసం ఓటు వేసినప్పుడల్లా వాళ్లు బలమైన ప్రభుత్వాన్నే ఎన్నుకున్నారు. భావోద్వేగాలు ప్రధానమైనప్పుడల్లా ఎవరికీ పూర్తి ఆధిక్యతలేని పార్లమెంటును ఎన్నుకున్నారు. ‘‘వాళ్లు ఇందిరాగాంధీని తొలగించాలని అనుకుంటున్నారు. నేను పేదరికాన్ని తొలగించాలని అనుకుంటున్నాను’’ అనే సందేశంతో ఇందిరాగాంధీ 1971లో తన ప్రత్యర్థులందరినీ చిత్తు చేశారు. అదే ఆ 1971 తిరిగి ప్రతిధ్వనిస్తోంది. నాడు ఆమె నిర్ణయాత్మక ప్రభావాన్ని నెరపేలా తన వాగ్దానాన్ని వ్యక్తిగతీకరించారు. నరేంద్రమోడీ ఆమె జ్ఞాపకాన్ని గుర్తుకు తేవడం కాకతాళీయం కాదు. ‘‘మీరు ఒకప్పుడు ఇందిరాగాంధీకి అధికారం కట్టబెట్టారు. యువతరానికి ఆమె గుర్తుండి ఉండరు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆమెలాంటి వారు ఎవరూ లేరు. నన్ను ప్రధానిగా ఎన్నుకుంటే ఆమె చేసిన దానికి పదిరెట్లు ఎక్కువ చేసి చూపిస్తా’’ అని ఆయన కర్ణాటకలోని ఒక ఎన్నికల ప్రచార సభలో అన్నారు. పార్టీ ప్రణాళికలను ఎవరూ చదవరు అనేది ప్రస్తుతం వాడు కలో ఉన్న ఎన్నికల నానుడులలో ఒకటి. అయితే అత్యున్నత అంతస్తులకు చెందిన వ్యాఖ్యాతలు వాటితో తలమునకలవుతూ ఉండొచ్చు. ఓటర్లు మాత్రం పార్టీలు ఏమి ఇవ్వదలచుకున్నాయి అనే విషయాన్ని విశాల అర్థంలో స్వీకరిస్తారు. బీజేపీ ప్రణాళిక మైనారిటీలకు ఉద్యోగాలు, విద్య, సంపాదన కల్పించగల నైపు ణ్యాలపై పెట్టుబడులకు అగ్ర తాంబూలమిచ్చింది. అది ఆడ శిశు వులపై ప్రత్యేక శ్రద్ధను కోరింది. మైనారిటీల వారసత్వసంపద రక్షణను, ఉర్దూ భాషకు ప్రోత్సాహాన్ని వాగ్దానం చేసింది. ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగం అండదండలతో వక్ఫ్ ఎండోమెంట్ ఆస్తు లను కొల్లగొట్టడాన్ని అంతం చేయాలని కోరింది. అమోధ్యలో రామాలయ నిర్మాణం డిమాండును అది గుర్తించింది. అయితే దాన్ని అది సాంస్కృతికపరమైన అంశంగానే తప్ప ఎన్నికల అంశంగా వర్గీకరించలేదు. ఇవి ఆ పార్టీ చేసిన చెప్పుకోదగిన వాగ్దానాలు. ప్రతి ఎన్నికలకు ప్రధాన కథావస్తువుతో పాటూ ఒక ఉప కథావస్తువు కూడా ఉంటుంది. విజయాన్ని పసి గట్టిన పార్టీలు తమ పునాది మద్దతును సంఘటితం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మెల్లగా వేరెక్కడి నుంచైనా ఓట్లను రాబట్టుకునే క్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. అవి రెండూ ఇప్పుడు కూడా జరుగుతుండటాన్ని మనం చూడొచ్చు. 1971లో ఇందిరాగాంధీ ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తిని పరిపక్వానికి తెచ్చి ఆశలు ఉప్పొంగేట్టుగా చేశారు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ముందుకు పెద్ద గంతు వేయగలిగింది. అరాచకానికి విరుగుడు ఆశ. అరా చకత్వం పెరిగి 1960లలో తారస్థాయికి చేరడాన్ని మనం చూశాం. నక్సలైట్ ఉద్యమం వ్యాపించడమే కాదు పలు పెడ ధోరణి సంఘర్షణలు దేశ సామా జిక ఉపరితలానికి తూట్లు పొడుస్తున్నాయి. 2014 ఎన్నికలు 1960 ఎన్నికల ప్రతిబింబం కాజాలదు. ఎందుకంటే మనం ఆ దివాలాకోరు దశాబ్దం నుంచి ఎంతో దూరంగా వచ్చేశాం. కానీ ఆగ్రహానికి నేటికీ భారీ ఎత్తున నష్టాన్ని కలిగించే శక్తి ఉంది. యువతలో ప్రశాంతతను పునరుద్ధరించడానికి ఉన్న ఏకైక మార్గం ఉద్యోగాలను కల్పించడమే. ఆలోచనలేని ప్రభుత్వం పదేళ్ల కాలంలో వారిని పనిలేకుండా ఉంచేసింది. మరో కొన్ని వారాల్లో కొత్త ప్రభుత్వం వస్తుంది. దాని తక్షణ ప్రాధాన్యం అత్యంత సామాన్యమైనది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఉపాధి కల్పన, పేదల జీవితాలు మెరుగయ్యే విధంగా భారీ పెట్టుబడులు. బైలైన్: ఎంజే అక్బర్ (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) -
రెండు పార్టీల పైనా వెల్లువెత్తుతోన్న నిరసనలు
-
‘ఇండియాటుడే’ తీయబోతున్నా
ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర, తెలంగాణ విభజన ఉద్యమాల నేపథ్యంలో నేతల స్వార్థ ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు జయం మూవీస్ పతాకంపై ‘ఇండియాటుడే’ సినిమా తీయనున్నట్టు ప్రముఖ నిర్మాత, వైఎస్సార్సీపీ నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలి పారు. తన 50వ పుట్టినరోజును పురస్కరించుకుని సూళ్లూరుపేటలో చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం 500 మందికి జగదీశ్వరరెడ్డి అన్నదానం చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనది సొంత జిల్లా నెల్లూరే అన్నారు. సొంత బ్యానర్‌పై స్వీయ దర్శకత్వలో ఇండియాటుడే చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కేతిరెడ్డి చెప్పారు. ఇందులో అందరూ కొత్త నటులే నటిస్తారన్నారు. అన్యాయాన్ని ఎదిరించే జర్నలిస్టు పాత్రను సినిమాలో ప్రధానంగా చిత్రీకరించనున్నట్టు జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఇది వరకు జయం, నిజం, జై, అందరం, కేక సినిమాలతో పాటు ఎన్నో ఇంగ్లిష్ సినిమాలను డబ్బింగ్ చేసినట్టు కేతిరెడ్డి తెలిపారు. గత ఏడాది శ్రీలంకలో తమిళులు పడుతున్న బాధల ఇతివృత్తంగా తీసిన ‘రావణదేశం’ సినిమాను తమిళ రాజకీయ నేతలు వైగో, విజయ్‌కాంత్ లాంటి వారు చూసి తాము చేయలేని పనిని తెలుగువాడివైన నీవు చేశావని తనను ప్రశంసించారన్నారు. రాజకీయ జీవితంలో గత 35 ఏళ్లుగా మహానేత వైఎస్సార్ అభిమానినన్నారు. అలాగే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానిగా ఉంటున్నానని చెప్పారు. ఇండియాటుడే సినిమాను వీలైనంత త్వరలో ప్రారంభించి దక్షిణాదిలో అన్ని భాషల్లో విడుదల చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలకా యుగంధర్ పాల్గొన్నారు. -
కిరణ్‌కు ‘ఉత్తమ పాలన’ పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరును విశ్లేషించి ‘ఇండియా టుడే’ పత్రిక అందజేసే పురస్కారాల్లో ‘ఉత్తమ పాలన’ విభాగంలో ‘ఉత్తమ పెద్ద రాష్ట్రం’ పురస్కారాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అందుకున్నారు. ఈ విజయం అంకితభావంతో పని చేసే ఉద్యోగులు, నైపుణ్యమున్న అధికారుల సమష్టి కృషి ఫలితమన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఇండియా టుడే నిర్వహించిన ‘రాష్ట్రాల స్థితిగతుల వార్షిక సదస్సు-2013’లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేశ్ చేతుల మీదుగా కిరణ్ అవార్డును స్వీకరించారు. అనంతరం జైరాం, ముఖ్యమంత్రులు భూపీందర్ సింగ్ హూడా (హర్యానా), మనోహర్ పారికర్ (గోవా)లతో కలిసి ప్యానెల్ చర్చలో పాల్గొన్నారు. అభివృద్ధికి అవరోధంగా మారిన సమ్మెలు, బంద్‌ల అడ్డంకులను రాష్ట్రం ఎలా పరిష్కరించిందంటూ ప్యానెల్ చర్చ నిర్వాహకుడు కిరణ్‌ను ప్రశ్నించారు. తాను పరిస్థితులన్నింటినీ చక్కదిద్దానని, మంచి పథకాలను అమలు చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘ఆందోళనల వల్ల స్కూళ్లు, వ్యాపార సంస్థలు కూడా పని చేయని, ఉపాధి అవకాశాల్లేని, సంక్షేమ పథకాలపై రూ.9,000 కోట్లు అప్పులు పేరుకున్న స్థితిలో నేను సీఎంగా బాధ్యతలు చేపట్టాను. సాధారణ పరిస్థితులు నెలకొల్పడాన్ని ప్రథమ ప్రాధాన్యంగా భావించాను. ప్రభుత్వం గట్టి నిర్ణయాలతో ముందుకు సాగడంతో అప్పులు తీర్చడంతో పాటు కొత్త పథకాలనూ చేపట్టగలిగాం. 1.45 కోట్ల మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఏటా 28 లక్షల మంది విద్యార్థులకు రూ.3,000 కోట్ల ఉపకార వేతనాలు ఇచ్చాం. ఉపాధి హామీ పథకంపై దాదాపు ఐదారు వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం. మహిళా గ్రూపులు సకాలంలో బ్యాంకు రుణాలను చెల్లిస్తున్నందుకు ప్రభుత్వం వైపు నుంచి రూ.1,400 కోట్ల మొత్తాన్ని వడ్డీ కింద బ్యాంకులకు చెల్లిస్తున్నాం. ప్రజాకర్షక కార్యక్రమాలను వారి శ్రేయస్సు కోసమే అమలు చేస్తున్నాం తప్ప ఎన్నికల కోసం కాదు. ప్రజల జీవనశైలిని మెరుగు పరచడానికి, వారికి సాధికారతను ఇవ్వడానికి, నైపుణ్యాన్ని పెంచడానికి మీసేవ, రాజీవ్ యువ కిరణాలు వంటి పథకాలను నేను చేపట్టాను’’ అని చెప్పారు. గడ్డు పరిస్థితుల్ని అధిగమించింది గడ్డు పరిస్థితులను ఆంధ్రప్రదేశ్ అధిగమించిందని ఇండియాటుడే న్యాయనిర్ణేతల బృందం తన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర విభజన అంశంపై నిరంతర ఆందోళనల వంటి క్లిష్ట పరిస్థితుల మధ్య కూడా రాష్ట్రం ఉత్తమ పాలనను అందించే దిశగా పయనించిందని తెలిపింది. ‘‘అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్‌లోనే పెండింగ్ కేసులు బాగా తగ్గాయి. జాతీయ స్థాయిలో 4 శాతం పెరిగితే రాష్ట్రంలో మాత్రం అవి 3 శాతం మేర తగ్గాయి. అత్యాచార కేసుల్లో 7 శాతం, కిడ్నాపుల్లో 13 శాతం, హత్యల్లో 3 శాతం తగ్గుదల నమోదైంది’’ అని వివరించింది.