2047 ఎన్నికల కోసం సిద్ధమవుతున్నా..
‘ఇండియా టుడే’ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: మీడియాలో ప్రచారం కోసం, పత్రికల్లో హెడ్‌లైన్ల కోసం తాను ఆరాటపడే వ్యక్తిని కాదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. హెడ్‌లైన్ల కోసం కాకుండా, డెడ్‌లైన్ల కోసం పని చేస్తున్నామని స్పష్టం చేశారు. శనివారం ‘ఇండియా టుడే’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. తొలుత ఇండియా టుడే ఎడిటర్–ఇన్–చీఫ్ అరుణ్ పురీ ప్రారం¿ోపన్యాసం చేశారు. 2029 జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం మోదీ సిద్ధమవుతున్నారని చెప్పారు. అనంతరం మోదీ ప్రసంగించారు.
2029 ఎన్నికల కోసం కాదు, 2047 ఎన్నికల కోసం సిద్ధమవుతున్నానని పేర్కొన్నారు. మీరు 2029లోనే ఆగిపోయారు, నేను మాత్రం 2047 కోసం ఇప్పటినుంచే కార్యాచరణ ప్రారంభించానని అరుణ్ పురీని ఉద్దేశించి చెప్పారు. మోదీ ఏం చేయబోతున్నారో తెలుసుకోవడానికి మీ మొత్తం బృందాన్ని రంగంలోకి దించండి అని సూచించారు.
తాము వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి, అధికారం నిలబెట్టుకుంటామని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో దేశ ప్రజలు నిర్ణయాత్మక విధానాలను చూడబోతున్నారని చెప్పారు. కీలకమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయబోతున్నామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్ మాత్రం వృద్ధిబాటలో మరింత వేగంగా పరుగులు తీయబోతోందని స్పష్టం చేశారు. ‘దేశమే ప్రథమం’ అనే విధానంతో తాను ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. కొందరికి మాత్రం ‘కుటుంబమే ప్రథమం’ అంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ‘స్థిరమైన, సమర్థవంతమైన, బలమైన ఇండియా’ అనేది వచ్చే ఐదేళ్ల కాలం ప్రపంచానికి ఇవ్వబోతున్న గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. దేశంలో అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరబోతోందన్నారు.
అవినీతిని సహించం
అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, ఈ విషయంలో దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. అవినీతిని సహించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. తాము అవినీతిపై ఉక్కుపాదం మోపుతుండడంతో కొందరు కడుపు మంటతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు తనను ఇష్టానుసారంగా దూషిస్తున్నారని, వారిని ప్రజలు ఏమాత్రం విశ్వసించడం లేదని చెప్పారు. తమ పదేళ్ల పదవీ కాలంలో పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశామని, వాటికి మీడియాలో గుర్తింపు రానప్పటికీ లబి్ధదారులపై ఎంతో ప్రభావం చూపాయని వివరించారు. కాలం చెల్లిన వందలాది చట్టాలను, నియంత్రణలను తొలగించామని మోదీ గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment