
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లుండి(బుధవారం) తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం జరగనున్న ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం జగన్ పాల్గొననున్నారు. 24వ తేదీ మధ్యాహ్నం తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ తిరుపతికి బయలుదేరి వెళ్లనున్నారు.
తిరుపతిలోని తాజ్ హోటల్‌లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొని.. అనంతరం ఆయన తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక.. సీఎం జగన్ తిరుపతి పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
చదవండి: మా కుమారుడికి పునర్జన్మనిచ్చారు
Comments
Please login to add a commentAdd a comment