
మోటో ఎం(గ్రే కలర్) పై భారీ డిస్కౌంట్ నేడే
ముంబై: ప్రముఖ చైనా మొబైల్ సంస్థ మోటోరోలా తన తాజా స్మార్ట్‌ఫోన్ మోటో ఎం (గ్రే వేరియంట్) పై భారీ డిస్కౌంట్ ఆఫర్ నేడే (సోమవారం) ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లో ఈ భారీ ఆఫర్ అందుబాటులోకి రానుంది. సుమారు రూ.15 వేల దాకా భారీ తగ్గింపుతో మోటో ఎం కొత్త వేరియంట్ ను వెబ్‌సైట్ ద్వారా విక్రయించనుంది. ఏదైనా స్మార్ట్‌ఫోన్ ఎక్సేంజ్ ద్వారా మెటా ఎం గ్రే కలర్ వేరియంట్‌ను కేవలం రూ. 2,999కే అందించనుంది. ఈ మధ్యాహ్నం నుంచి విక్రయాలు ప్రారంభంకానున్నాయి.
మోటో తాజా స్మార్ట్ ఫోన్ మోటో ఎం (64జీబీ స్టోరేజ్) భారీ తగ్గింపుతో కేవలం 2,999 కే ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. గత ఏడాది డిశెంబర్‌లో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.17,999 గా నిర్ణయించింది. ఇపుడు గ్రే ఆప్షన్‌లో లాంచ్ చేస్తోంది. అయితే పాత స్మార్ట్‌ఫోన్తో స్పెషల్ ఎక్సేంజ్ ఆఫర్ లో మాత్రమే ఈ సౌలభ్యం అందుబాటులో ఉండనుంది. పూర్తి వివరాలుకు ఫ్లిప్కార్ట్ వెబ్ సైట్ ను సందర్శించగలరు.
మోటో ఎం ఫీచర్లు...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, మాలి టి860 ఎంపీ2 గ్రాఫిక్స్
4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్
4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్
బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి
3050 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్