డిప్యూటీ సీఎంగా ప్రమాణంచేశాక నితీశ్ ఆశీర్వాదం తీసుకుంటున్న తేజస్వీ యాదవ్
పట్నా: జనతాదళ్ (యునైటెడ్) నేత నితీశ్ దెబ్బకు ఎన్డీఏ చేజారిన బిహార్‌లో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు గనక వస్తే ఆ కూటమికి ఎదురుదెబ్బ తప్పదని ఇండియాటుడే–సీ వోటర్ బుధవారం జరిపిన స్నాప్ పోల్ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీఏకు 14 దక్కుతాయని పేర్కొంది. ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్, వామపక్షాల మహా ఘట్‌బంధన్ 26 స్థానాలు సొంతం చేసుకుంటుందని తెలిపింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 39 సీట్లు నెగ్గగా ఘట్‌బంధన్ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన విషయం తెలిసిందే. జేడీ(యూ) అప్పుడు ఎన్డీఏ భాగస్వామిగా ఉంది. ఎన్డీఏకు ఓట్లు 54 నుంచి 41 శాతానికి తగ్గనున్నాయి. అయితే నితీశ్‌కు జనాదరణ తగ్గుతోందని సర్వే తేల్చడం విశేసం. తర్వాతి సీఎం ఎవరన్న ప్రశ్నకు ఏకంగా 43 మంది బిహారీలు ఆర్జేడీ నేత, లాలుప్రసాద్ తనయుడు తేజస్వీ యాదవ్‌కు ఓటేశారు. సుపరిపాలనకు చిరునామాగా చెప్పే నితీశ్‌ను 24 శాతం మందే ఎంచుకున్నారు. 19 శాతం మంది బీజేపీ నేత సీఎం కావాలని కోరుకున్నారు.
చదవండి: (ప్రధాని మోదీకి బిహార్ సీఎం నితీశ్ కుమార్ 2024 సవాల్!)
Comments
Please login to add a commentAdd a comment