C Voter survey
-
విశ్వసనీయత లేని సీ-ఓటర్ సంస్థ సర్వేలు
-
సీ–ఓటర్ నేతిబీర సర్వే
సాక్షి, అమరావతి: ప్రజల మనోగతం పేరుతో సీ–ఓటర్ సంస్థ నిర్వహిస్తున్న సర్వేలకు ఏమాత్రం విశ్వసనీయత లేదనేందుకు ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికలతోపాటు 2019 ఎన్నికల్లో ఆ సంస్థ లెక్కలు తప్పడమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. గత నవంబర్‌లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో సీ ఓటర్ అంచనాలు గల్లంతయ్యాయి. టైమ్స్ నౌ లాంటి డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని, టీడీపీ ఉనికి కోల్పోవడం ఖాయమని ఇప్పటికే వెల్లడించాయి. ఎలాంటి విశ్వసనీయత లేని సీ–ఓటర్ మాత్రం తనకు అలవాటైన రీతిలో సర్వే చేసినట్లు పేర్కొనగా దాన్ని పట్టుకుని టీడీపీ, ఎల్లో మీడియా చంకలు గుద్దుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కోతికి కొబ్బరి చిప్ప మాదిరిగా సీ–ఓటర్ సర్వే పేరుతో హడావుడికి తెర తీశారని పేర్కొంటున్నారు. 2019లో ఎన్నికల్లో టీడీపీ 14 లోక్‌సభ, 90–100 శాసనసభ స్థానాల్లో విజయం సాధిస్తుందని తన సర్వేలో వెల్లడైనట్లు సీ–ఓటర్ ప్రకటించింది. చివరకు ఫలితాలను చూస్తే 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేయగా టీడీపీ 23 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. చెప్పిందంటే.. జరగదంతే! దేశంలో ఇప్పటిదాకా జరిగిన అధిక శాతం ఎన్నికల్లో సీ–ఓటర్ నిర్వహించిన ప్రీ–పోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలు లెక్కలు తప్పాయి. ఏదైనా ఓ పార్టీ అధికారంలోకి వస్తుందని సీ–ఓటర్ తేలి్చందంటే కచ్చితంగా మరో పారీ్టనే అధికారంలోకి వస్తుందని పలు సందర్భాల్లో రుజువు కావటాన్ని బట్టి ఆ సంస్థ విశ్వసనీయత ఎంతన్నది వెల్లడవుతోంది. -
జయహో జగన్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీదే అధికారం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ మళ్లీ ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే తేల్చి చెప్పింది. సార్వత్రిక ఎన్నికలు జరిగి 40 నెలలు పూర్తవుతున్నప్పటికీ, వైఎస్సార్సీపీ హవా ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని వెల్లడించింది. ఏకంగా 57 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగనే కావాలని బలంగా కోరుకుంటున్నట్లుగా తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాదరణలో సీఎం వైఎస్ జగన్‌కు దరిదాపుల్లో మరో నేత లేరని తెగేసి చెప్పింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపబోవని ఈ సర్వేలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్‌కు, వైఎస్సార్సీపీకి తిరుగులేదన్నది దీన్ని బట్టి తెలుస్తోందంటూ ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్, ఇండియా టుడే గ్రూప్ న్యూస్ ఎడిటర్ రాహుల్ కన్వల్‌లు విశ్లేషించారు. సీ ఓటర్–ఇండియా టుడేలు సంయుక్తంగా ఈ నెల 11న దేశ వ్యాప్తంగా ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో సర్వే నిర్వహించాయి. 2,41,553 మంది అభిప్రాయాలను తీసుకుని.. 96,676 మందితో ముఖాముఖి (ఇంటర్వ్యూ) చర్చించారు. ప్రజాభిప్రాయం, ముఖాముఖి చర్చల్లో వెల్లడైన అంశాల ఆధారంగా శుక్రవారం ఇండియా టుడే చానల్లో ఆ సర్వే ఫలితాలను విశ్లేషించారు. ఈ చర్చలో దేశంలో ప్రసిద్ధికెక్కిన పలువురు రాజకీయ నేతలు, విశ్లేషకులు పాలుపంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీకి, సీఎం వైఎస్ జగన్‌కు ఎదురేలేదని రాజ్‌దీప్ సర్దేశాయ్ విశ్లేషిస్తే.. ప్రజాదరణలో వైఎస్ జగన్‌కు మరేవరూ సాటి లేరని రాహుల్ కన్వల్తోపాటు పలువురు విశ్లేషకులు స్పష్టం చేశారు. సంక్షేమాభివృద్ధి.. సుపరిపాలన వైఎస్సార్సీపీ ఆఖండ విజయంతో 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలు అమలు చేసి.. ఎన్నికల మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం చెప్పారు. అర్హతే ప్రామాణికంగా.. కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చారు. కేవలం డీబీటీ ద్వారానే ఇప్పటిదాకా రూ.1.65 లక్షల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేసి.. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. మంత్రివర్గం నుంచి నామినేటెడ్ పదవుల వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సింహభాగం పదవులు ఇచ్చి సామాజిక న్యాయ సాధనలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. ప్రజల సౌకర్యం, పరిపాలన సౌలభ్యం కోసం 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. నాడు–నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్ది.. విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు తోడు, నీడగా ప్రభుత్వం ఉండేలా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టారు. రైతులకు చేదోడుగా నిలవడం కోసం గ్రామ సచివాలయాలకు అనుంబంధంగా ఏర్పాటు చేసిన ఆర్బీకేల (రైతు భరోసా కేంద్రాలు) పనితీరును నీతి ఆయోగ్‌తో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసిస్తున్నాయి. ప్రజాభిప్రాయానికి అద్దం పట్టిన సర్వే సీఎం వైఎస్ జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలు, సామాజిక న్యాయం, సుపరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక.. బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి తిరుగులేని విజయాన్ని ప్రజలు అందించారు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీకి ప్రజలు ఘన విజయాన్ని అందిస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్‌కు, ఆ పార్టీకి ప్రతి ఎన్నికలోనూ ఓట్ల శాతం పెరుగుతూనే వస్తోంది. సీఓటర్–ఇండియా టుడే సర్వే.. ఏకంగా 57 శాతం మంది సీఎంగా వైఎస్ జగనే కావాలంటూ బలంగా కోరుకున్నట్లు తేల్చింది. ఈ సర్వే ప్రజాభిప్రాయాన్ని మరోసారి ప్రతిబింబించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో వరుసగా యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), ఎంకే స్టాలిన్(తమిళనాడు), వైఎస్ జగన్ (ఆంధ్రప్రదేశ్)లు అగ్రభాగాన నిలిచారు. స్వరాష్ట్రంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన సీఎంలలో కూడా వైఎస్ జగన్ అదే స్థానంలో ఉండటం విశేషం. -
ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలొస్తే.. బిహార్‌లో వారిదే హవా
పట్నా: జనతాదళ్ (యునైటెడ్) నేత నితీశ్ దెబ్బకు ఎన్డీఏ చేజారిన బిహార్‌లో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు గనక వస్తే ఆ కూటమికి ఎదురుదెబ్బ తప్పదని ఇండియాటుడే–సీ వోటర్ బుధవారం జరిపిన స్నాప్ పోల్ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీఏకు 14 దక్కుతాయని పేర్కొంది. ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్, వామపక్షాల మహా ఘట్బంధన్ 26 స్థానాలు సొంతం చేసుకుంటుందని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 39 సీట్లు నెగ్గగా ఘట్బంధన్ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన విషయం తెలిసిందే. జేడీ(యూ) అప్పుడు ఎన్డీఏ భాగస్వామిగా ఉంది. ఎన్డీఏకు ఓట్లు 54 నుంచి 41 శాతానికి తగ్గనున్నాయి. అయితే నితీశ్‌కు జనాదరణ తగ్గుతోందని సర్వే తేల్చడం విశేసం. తర్వాతి సీఎం ఎవరన్న ప్రశ్నకు ఏకంగా 43 మంది బిహారీలు ఆర్జేడీ నేత, లాలుప్రసాద్ తనయుడు తేజస్వీ యాదవ్‌కు ఓటేశారు. సుపరిపాలనకు చిరునామాగా చెప్పే నితీశ్‌ను 24 శాతం మందే ఎంచుకున్నారు. 19 శాతం మంది బీజేపీ నేత సీఎం కావాలని కోరుకున్నారు. చదవండి: (ప్రధాని మోదీకి బిహార్ సీఎం నితీశ్ కుమార్ 2024 సవాల్!) -
ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే కేంద్రంలో బీజేపీ.. ఏపీలో వైఎస్సార్సీపీ..
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా వరుసగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోదీనే కోరుకుంటున్నారని సీ ఓటర్– ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చింది. నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే) సీట్ల సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని చెప్పింది. ఎంపీల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సీ ఓటర్– ఇండియా టుడే సర్వే తేల్చిచెప్పింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రజాదరణ అణుమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క సీటు కూడా రాదని కుండబద్దలు కొట్టింది. సర్వే విశ్లేషణలో నిపుణులుగా పరిగణించే సీనియర్ జర్నలిస్టులు రాహుల్ కన్వల్ (ఇండియా టుడే గ్రూపు న్యూస్ డైరెక్టర్), రాజ్ చెంగప్ప (ఇండియా టుడే గ్రూపు ఎడిటోరియల్ డైరెక్టర్)లు ప్రజాదరణ విషయంలో జగన్‌కు తిరుగులేదని దీన్ని బట్టి తెలుస్తోందని విశ్లేషించారు. చదవండి: (ఎన్నికలొస్తే... కేంద్రంలో మళ్లీ బీజేపీయే) -
యూపీ పీఠం మళ్లీ బీజేపీదే
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే మళ్లీ గెలుస్తుందని ఏబీపీ–సీ ఓటర్ తాజా సర్వేలో వెల్లడైంది. అయితే సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ బలపడడం వల్ల గత ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లలో 100 స్థానాలు పైగా బీజేపీ కోల్పోతుందని అంచనా వేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలపై ఓటరు నాడిని సి–ఓటర్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుందని, చివరికి ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదని సర్వేలో తేలింది. అయిదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ స్థానాల్లో 1,07,190 మందిని ఏబీపీ–సీ ఓటర్ ప్రశ్నించింది. యూపీలో బీజేపీ, దాని మిత్రపక్షాలు విజయం సాధిస్తాయని అయితే ఈ సారి బీజేపీ 108 స్థానాలను కోల్పోయి 217 స్థానాలకే పరిమితమవుతుందని సర్వే అంచనాకి వచ్చింది. సమాజ్‌వాది పార్టీకి 156, బీఎస్పీకి 18, కాంగ్రెస్‌కి 8 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, ఆప్‌కి 51 స్థానాలు, కాంగ్రెస్‌కి 46 స్థానాలు వస్తే, శిరోమణి అకాలీదళ్ 20 స్థానాలను గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. ఇక ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ బాగా పుంజుకుంటుందని, బీజేపీ స్వల్ప ఆధిక్యంతో నెగ్గుతుందని సీ–ఓటర్ సర్వే తెలిపింది. బీజేపీకి 38 స్థానాలు, కాంగ్రెస్‌కి 32 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. 40 స్థానాలున్న గోవాలో 21 స్థానాలతో బీజేపీ బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కుతుందని వెల్లడైంది. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో బీజేపీ 25–29 స్థానాలు..కాంగ్రెస్‌కు 20–24, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కి 4–8, ఇతరులకి 3–7 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. -
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ-సీ ఓటర్ సర్వే ఇలా!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ సీఓటర్ సర్వే నిర్వహించింది. ఇందులో యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో బీజేపీ అధికారం కైవసం చేసుకోన్నుట్లు ఏబీపీ సీ-ఓటర్ సర్వేలో వెల్లడించింది. కాగా పంజాబ్‌లో అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించనున్నట్లు ఏబీపీ సీఓటర్ సర్వే పేర్కొంది. పంజాబ్‌లో 31.5 ఓట్ షేర్‌తో ఆప్ 55 సీట్లు సాధిస్తుందని ఏబీపీ సీఓటర్ సర్వే తెలిపింది. ఇక రెండో స్థానంలో కాంగ్రెస్ 37 సీట్లకు పరిమితమవుతుందని ఏబీసీ సీఓటర్ సర్వేలో స్పష్టం చేసింది. దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తప్పదనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. యూపీలో బీజేపీకి 259 నుంచి 267 సీట్లు యూపీలో బీజేపీకి కాస్త ప్రాబల్యం తగ్గినా తిరిగి అధికారం దక్కించుకుంటుందని సర్వే తెలిపింది. బీజేపీ సుమారు 60 సీట్లను యూపీలో కోల్పోయినా అధికారానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని పేర్కొంది. ఇక్కడ బీజేపీ 259 నుంచి 267నుంచి గెలుస్తుందని అంచనా వేసింది. అదే సమయంలో ఎస్పీ 109 నుంచి 117 సీట్లను గెలుచుకుంటుందని పేర్కొంది. ఇక బీఎస్పీ 12 నుంచి 16 సీట్లు గెలుచుకుంటుందని తెలిపిన సర్వే.. కాంగ్రెస్ 3 నుంచి 7 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఏబీపీ-సీ ఓటర్ సర్వే నిర్వహించిన సర్వేలో 44 శాతం మంది సీఎం యోగి నాయకత్వం పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపింది. గోవాలోనూ బీజేపీదే హవా! గోవాలో కూడా బీజేపీకే తిరిగి అధికారం కట్టబెట్టనున్నట్లు సర్వే తెలిపింది. బీజేపీ 39. 4 ఓట్ల శాతంతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, అదే సమయంలో ఆప్ 22.2 ఓట్ల శాతాన్ని సాధిస్తుందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ 15.4 శాతానికి పరిమితం కానుందని తెలిపింది. బీజేపీకి 22 నుంచి 26 సీట్లు వస్తాయని వెల్లడించిన సర్వే.. ఆప్‌కు 4 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ 3 నుంచి 7 సీట్లకు పరిమితం కానుందని వెల్లడించింది. మణిపూర్‌లో బీజేపీకే ఆధిక్యం మణిపూర్‌లో సైతం బీజేపీనే ఆధిక్యంలో నిలిచి అధికారం దక్కించుకుంటుందని తెలిపింది. ఇక్కడ బీజేపీ 40.5 ఓట్ల శాతంతో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంటుందని తెలిపిన సర్వే.. కాంగ్రెస్ 34.5 శాతంలో రెండో స్థానానికి పరిమితం కానుందని స్పష్టం చేసింది. ఇక్కడ బీజేపీకి 32 నుంచి 36 సీట్లు, కాంగ్రెస్ 18 నుంచి 22 సీట్లు వస్తాయని పేర్కొంది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ కూటమికి 46 సీట్లు 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని కూటమి 46 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్ 21 సీట్లు గెలుస్తుంది ఏబీపీ-సీఓటర్ తన సర్వేలో పేర్కొంది. అయితే ప్రస్తుతం ఉన్న సీట్లలో బీజేపీ 11 కోల్పోయే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు 38-46 సీట్లు, ఆప్‌కు 51-57 సీట్లు రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 38-46 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, ఆప్ 51-57 సీట్లు గెలుస్తుందని ఏబీపీ-సీఓటర్ తెలిపింది. చదవండి: ‘బాబుకు హఠాత్తుగా ఉత్తరాంధ్ర ఎందుకు గుర్తొచ్చిందో అర్థం కావడం లేదు’ చదవండి: Karnataka: ఆరు నెలలు జైల్లో ఉన్నా: హోంమంత్రి -
యూపీ సీఎం మళ్లీ యోగియే!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని ఐఏఎన్ఎస్–సి ఓటరు సర్వేలో వెల్లడైంది. 52% మంది యోగిదే మళ్లీ సీఎం పదవి అభిప్రాయపడితే, 37% మంది మళ్లీ ఆయన అధికారంలోకి రాలేరని అన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో విఫలమయ్యారని ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, కుంభమేళా, గంగానదిలో శవాలు కొట్టుకొని రావడం వంటివన్నీ ఆయనపై వ్యతిరేకతను పెంచాయి. అయినప్పటికీ 52% మంది యోగికే మొగ్గు చూపించారని ఐఏఎన్ఎస్–సీఓటరు సర్వే పేర్కొంది. ఇక కొత్త కేబినెట్‌తో దేశంలో పరిస్థితులు మెరుగవుతాయని సర్వేలో 46% మంది అభిప్రాయపడితే, 41% మంది పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదని అన్నారు. ఐఎఎన్ఎస్–సీ ఓటరు మొత్తం 1,200 మంది ఇంటర్వ్యూలు తీసుకొంది. బీడీసీ సభ్యుడి బంధువు హత్య యూపీ బహరిచ్లో బ్లాక్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడి బావమరిది దారుణ హత్యకు గురయ్యాడు. బీజేపీ అభ్యర్థి భర్త కిడ్నాప్ చేస్తూ ఉంటే అడ్డుకోవడంతో ఆయనను దారుణంగా చంపారని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. -
ఐదు రాష్ట్రాల్లో అధికారం ఆ పార్టీలదే..
న్యూఢిల్లీ: బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమబెంగాల్లో ఆ పార్టీకి విజయం దక్కకపోవచ్చని ‘టైమ్స్ నౌ – సీ ఓటర్’ సర్వే పేర్కొంది. సీట్ల సంఖ్యను, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకున్నా మెజారిటీ స్థానాలను గెల్చుకోలేదని తేల్చింది. 2016లో సాధించిన సీట్ల కన్నా తక్కువే గెల్చుకున్నప్పటికీ మెజారిటీకి అవసరమైన సీట్లను టీఎంసీ గెల్చుకుంటుందని పేర్కొంది. తమిళనాడులో డీఎంకే, పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలుస్తా్తయని వెల్లడించింది. అస్సాంలో ఎన్డీఏ, కేరళలో ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకుంటాయని వివరించింది. పశ్చిమబెంగాల్: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని టైమ్స్ నౌ– సీ ఓటర్ సర్వే తేల్చింది. అయితే, చివరకు విజయం మాత్రం మమత బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌కే దక్కుతుందని, రాష్ట్రంలో రాజకీయంగా బీజేపీ భారీగా బలపడుతుందని పేర్కొంది. మొత్తం 294 సీట్లకు గానూ టీఎంసీ 152 నుంచి 168 స్థానాలను, బీజేపీ 104 నుంచి 120 స్థానాలను గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. లెఫ్ట్, కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ కూటమికి 18 – 26 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. స్వతంత్రులు రెండు స్థానాలు గెల్చుకోవచ్చని పేర్కొంది. 2016 ఎన్నికల్లో టీఎంసీ 211 సీట్లను గెల్చుకుని ఘనవిజయం సాధించగా, ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది 3 సీట్లలోనే కావడం గమనార్హం. ఓట్ల శాతంలో బీజేపీ, టీఎంసీల మధ్య తేడా పెద్దగా ఉండకపోవచ్చని సర్వే అభిప్రాయపడింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ 42.1%, బీజేపీ 37.4% ఓట్లు గెల్చుకుంటాయని తేల్చింది. కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్ఎఫ్ కూటమికి 13% ఓట్లు వస్తాయని తెలిపింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఈ ఎన్నికల్లో టీఎంసీ గెలుస్తుందని 44.6%, బీజేపీ గెలుస్తుందని 36.9% అభిప్రాయపడ్డారు. తదుపరి సీఎంగా మమత బెనర్జీనే సరైన వ్యక్తి అని 55% మంది, రాష్ట్ర బీజేపీ చీఫ్ గౌతమ్ ఘోష్ సీఎంగా సరైన వ్యక్తి అని 32.3% అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చ్ 3వ వారంలో 17850 మంది నుంచి ‘టైమ్స్ నౌ – సీ ఓటరు’ అభిప్రాయాలు సేకరించింది. తమిళనాడు: తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, పలు ఇతర ప్రాంతీయ పార్టీల కూటమి యూపీఏ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటరు సర్వే తేల్చింది. మొత్తం 234 స్థానాలకు గానూ.. ఆ కూటమికి 173 నుంచి 181 సీట్లు వస్తాయని, అన్నాడీఎంకే, బీజేపీల ఎన్డీఏ 45 నుంచి 53 సీట్లు మాత్రమే గెల్చుకుంటుందని పేర్కొంది. ఎంఎన్ఎం, ఏఎంఎంకే 3 చొప్పున సీట్లు గెల్చుకుంటాయని, ఇతరులు రెండు సీట్లలో విజయం సాధిస్తారని పేర్కొంది. మార్చ్ 17 – 22 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 8709 మందిపై ఈ సర్వే జరిపారు. యూపీఏకు 46%, ఎన్డీఏకు 34.6% ఓట్లు వస్తాయని తేల్చింది. గత ఎన్నికల్లో ఎన్డీయేకు 136 సీట్లు, యూపీఏకు 98 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ఓట్లను టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే గణనీయంగా చీలుస్తుందని 39% అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా డీఎంకే నేత స్టాలిన్‌కు 43.1% మంది మద్దతు పలకగా, పళనిసామి(అన్నాడీఎంకే)కు 29.7% మంది, శశికళకు 8.4% మంది ఓటేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 50% ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. అస్సాం: అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చింది. ఎన్డీయేకు 69 సీట్లు, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకు 56 సీట్లు వస్తాయని, ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది. అస్సాంలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 126. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 45%, యూపీఏకు 41.1% ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ప్రస్తుత సీఎం శర్బానంద సొనోవాల్కు 46.2% మంది, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయి 25.2% మంది మద్దతు పలికారు. కేరళ: ఈ ఎన్నికల్లో వామపక్ష ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని టైమ్స్ నౌ, సీ ఓటరు సర్వే వెల్లడించింది. మొత్తం 140 స్థానాలకు గానూ, మెజారిటీ కన్నా స్వల్పంగా అధికంగా 77 సీట్లను ఎల్డీఎఫ్ గెల్చుకుంటుందని పేర్కొంది. 2016లో గెల్చుకున్న సీట్ల కన్నా ఇది 14 సీట్లు తక్కువ. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ 62 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. బీజేపీ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని తేల్చింది. గత ఎన్నికల్లో యూడీఎఫ్ 47 స్థానాల్లో గెలుపొందింది. 42.4% ఓట్లను ఎల్డీఎఫ్, 38.6% ఓట్లను యూడీఎఫ్ గెల్చుకుంటాయని పేర్కొంది. సీఎం క్యాండిడేట్‌గా ముఖ్యమంత్రి విజయన్‌కు 39.3% ఓటేయగా, కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీకి 26.5% మద్దతిచ్చారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పనితీరుకు సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 60% మంది సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. పుదుచ్చేరి: ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటరు తేల్చింది. బీజేపీ, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకేల ఎన్డీఏ మొత్తం 30 స్థానాలకు గానూ 21 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. డీఎంకే కాంగ్రెస్‌ల యూపీఏకు 9 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎన్డీఏకు 47.2% , యూపీఏకు 39.5% ఓట్లు వస్తాయని పేర్కొంది. ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగసామికి 49.2% మంది మద్దతు పలికారు. -
ఒపినీయన్ పోల్: వచ్చే ఎన్నికల్లో వారిదే గెలుపు
న్యూఢిల్లీ: పంచతంత్రంగా పేర్కొన్నే ఐదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ఈ ఉత్కంఠ నేపథ్యంలో ఓ సర్వే చెబుతున్న ఫలితాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. మళ్లీ పశ్చిమబెంగాల్లో మమత, కేరళలో వామపక్షాలే, అస్సోలో బీజేపీ ప్రభుత్వాలే ఏర్పాటు చేస్తాయని.. ఇక తమిళనాడులో పదేళ్ల తర్వాత డీఎంకే కూటమి, ఇక పుదుచ్చేరిలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని సర్వే చెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావం చూపేవి కావడంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే అంశంపై ఏబీపీ-సీ ఓటర్ సంస్థ సర్వే చేసింది. అంటే ఒపీనియన్ పోల్ నిర్వహించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో చేసిన సర్వే ప్రకారం పై ఫలితాలు వెల్లడయ్యాయి. ఏ పార్టీ గెలుస్తుందనే దానితో పాటు ఏ పార్టీకి ఎన్ని శాతం ఓట్లు.. ఎన్నేసి సీట్లు వస్తాయో ఓ అంచనా రూపొందించింది. ఆ ఒపినీయన్ పోల్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సర్వే ఒక అంచనా మాత్రమే. ఏది ఏమున్నా ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఏప్రిల్ 2వ తేదీన తెలియనుంది. పశ్చిమ బెంగాల్ పదేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే మళ్లీ పట్టం కట్టే అవకాశం ఉంది. మళ్లీ మమత బెనర్జీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారని అభిప్రాయాలు వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్: 148-164 సీట్లు (43 శాతం ఓట్లు) బీజేపీ: 92-108 సీట్లు (38 శాతం ఓట్లు) కాంగ్రెస్ + మిత్రపక్షాలు: 31-39 సీట్లు (13 శాతం ఓట్లు) కేరళ దేవభూమిగా ఉన్న కేరళలో మళ్లీ వామపక్ష కూటమికే అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎల్డీఎఫ్: 83-91 సీట్లు యూడీఎఫ్: 47-55 సీట్లు బీజేపీ: 0-2 సీట్లు, ఇతరులు 0-2 సీట్లు తమిళనాడు ఈసారి తమిళనాడులో ప్రభుత్వం మారే అవకాశం ఉంది. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న అన్నాడీఎంకేకు పరాభవం తప్పేటట్టు లేదు. మిత్రపక్షాలతో కలిసి డీఎంకే అధికారం చేపట్టేలా పరిస్థితులు ఉన్నాయి. డీఎంకే + మిత్రపక్షాలు: 154-162 సీట్లు అన్నాడీఎంకే: 58-66 సీట్లు ఇతరులు: 8-20 సీట్లు అసోం ఈశాన్య ప్రాంతం రాష్ట్రంగా ఉన్న అసోంలో మళ్లీ కమలం విరబూయనుంది. బీజేపీకి రెండోసారి అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ+ మిత్రపక్షాలు: 68-76 సీట్లు కాంగ్రెస్ + మిత్రపక్షాలు: 43-51 సీట్లు ఇతరులు: 5-10 సీట్లు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరిలో ఇటీవల పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. అయితే ఆ పరిణామాలు బీజేపీకి ప్లస్ అయ్యాయని తెలుస్తోంది. ఎందుకంటే జరగబోయే ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందనుందని ఈ సర్వే తెలిపింది. అధికారంలో బీజేపీకి దక్కేలా ఉంది. బీజేపీ+ మిత్రపక్షాలు: 17-21 సీట్లు కాంగ్రెస్+ మిత్రపక్షాలు: 8-12 సీట్లు ఇతరులు: 1-3 సీట్లు చదవండి: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. చదవండి: మూడో కూటమి.. నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి -
బిహార్‌లో ఎన్డీఏదే విజయం!
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికే విజయమని ‘టైమ్స్‌నౌ–సీ ఓటర్’ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. బిహార్ అసెంబ్లీలోని 243 సీట్లలో ఈ కూటమి 160 వరకు స్థానాలు సాధిస్తుందని పేర్కొంది. ఎన్డీఏలోని బీజేపీ 80 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. అదేవిధంగా, మరో పెద్ద పార్టీ నితీశ్‌కుమార్ సారథ్యంలోని జేడీయూ 70 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని తేలింది. కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీలతో ఏర్పడిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్(యూపీఏ) 76 స్థానాలు సాధిస్తుందని అంచనా వేసింది. రాష్ట్రంలోని 32 శాతం మంది మళ్లీ నితీశ్‌కుమారే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడైంది. సీఎంగా నితీశ్ పనితీరు మంచిగా ఉందని 28.7 శాతం మంది తెలపగా మామూలుగా ఉందని 29.2%, బాగోలేదని 42.0% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెల 1–10 తేదీల మధ్య 243 నియోజకవర్గాలకు చెందిన 12,843 మంది నుంచి టెలిఫోన్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విశ్లేషణ జరిపారు. రెబల్ అభ్యర్థులపై బీజేపీ వేటు: పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ తిరుగుబాటు అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన నేతలను బీజేపీ బహిష్కరించింది. మొత్తం 9 మందిని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. వీరిలో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తిరుగుబాటుదారుల్లో చాలామంది బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఎన్డీయే అభ్యర్థులపై పోటీకి దిగుతున్నారు. -
పాకిస్తాన్ కంటే చైనాయే డేంజర్!
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వ్యవహారంలో ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకముందని 73 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 17 శాతం ప్రజలు విపక్షాలపై నమ్మకం ఉందన్నారు. చైనాతో ఘర్షణలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానంపై సీఓటర్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇక సర్వేలో పాల్గొన్న 61 శాతం మంది రాహుల్ గాంధీపై నమ్మకం లేదన్నారు. జాతీయ భద్రత విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై నమ్మకం ఉందని 73 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇదే విషయంలో 14 శాతం మాత్రమే రాహుల్ గాంధీ పై నమ్మకం ఉందని అన్నారు. (చదవండి: ఆ వార్త అవాస్తవం: చైనా) ఇక 68 శాతం మంది చైనా వస్తువులను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. మరో 31 శాంత మంది చైనా వస్తువులను కొనడంలో అభ్యంతరం లేదని చెప్పారు. పాకిస్థాన్ కన్నా చైనాయే భారత్‌కు పెద్ద సమస్య అని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. చైనా వైఖరి భారత్‌కు ప్రధాన ఆందోళన అని 68 శాతం మంది తెలిపారు. 32 శాతం మంది పాకిస్తాన్ ప్రమాదకరమని అన్నారు. గల్వాన్ హింసాత్మక ఘటనల్లో భారత్ ఇంకా చైనాకు గట్టి జవాబు ఇవ్వలేదని 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. (చదవండి: భారత్- చైనా సరిహద్దు ‘చిచ్చు’కు కారణం?) -
చంద్రబాబు ఎన్ని జన్మలెత్తినా..: అంబటి
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ పతనం దిశగా వెళుతోందని ఆయన విమర్శించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. దేశంలో ఉన్న సీఎంలలో వైఎస్ జగన్ నాలుగో స్థానంలో ఉన్నారు. టీడీపీ నేతలే దిగజారుడు విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు చూసి టీడీపీలో ఆందోళన మొదలైంది. చంద్రబాబు రోజు రోజుకు పతనం అవుతోంటే.. ముఖ్యమంత్రి ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఏడాది కాలంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం రూ. 40, 130 కోట్లను 3.57 కోట్ల లబ్దిదారులకు అందచేశాం. ప్రజా వ్యతిరేక పాలన చేశారు కాబట్టే ప్రజలు ఆ పార్టీకి 23 స్థానాలు ఇచ్చారు. చంద్రబాబు ఔట్ డేటెడ్ అయ్యారు. ఇక ఆయన వారసుడిగా లోకేష్ అప్డేట్ కాలేకపోతున్నారు. (‘చంద్రబాబుకి అదే స్థానం శాశ్వతం’) చంద్రబాబువి జూమ్ కూతలు.. చంద్రబాబు పాలనంతా దోపిడీ మయం.. వేల కోట్లు గంగలో పోశారు. ఆయన పాలనలో రూ.15 వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆ బకాయిలు తీర్చారు. చంద్రబాబు ఎన్ని జన్మలెత్తినా తిరిగి అధికారంలోకి రాలేరు. కరోనా విషయంలో 4 లక్షల టెస్టులు చేసిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అభినందించినా చంద్రబాబు మాత్రం జూమ్ కూతలు కూస్తున్నారు. సీ ఓటర్ సర్వేలో సీఎం జగన్ నాలుగో స్థానంలో నిలిచిన విషయం చంద్రబాబు గమనించడం లేదా..?. న్యాయస్థానాలపై మాకు అపారమైన గౌరవం ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. చంద్రబాబు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. లేక్‌వ్యూ గెస్ట్ హౌస్, హైదరాబాదులోని ఎల్ బ్లాకు కోసం చంద్రబాబు పెట్టిన ఖర్చు వసూలు చేయాలంటే చాలా ఉంటుంది. (బెస్ట్ సీఎం వైఎస్ జగన్) -
సీఓటర్ సర్వే
-
‘చంద్రబాబుకి అదే స్థానం శాశ్వతం’
సాక్షి, అమరావతి : టీడీపీ కుట్రలు చేసినా, పచ్చమీడియా పిచ్చి పిచ్చిగా రాసుకున్నా, దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న సీఎంల జాబితాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగో స్థానంలో నిలిచారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నాయకుడంటే ప్రజల హృదయాల్లో చోటు సంపాదించాలని ట్విటర్లో పేర్కొన్నారు. కుట్రలు కుతంత్రాల చంద్రబాబునాయుడికి అదే స్థానం శాశ్వతమయ్యేలా ఉందని ఎద్దేవా చేశారు. (బెస్ట్ సీఎం వైఎస్ జగన్) కాగా, దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ నాలుగో స్థానంతో సీనియర్ల సరసన నిలిచిన విషయం తెలిసిందే. ‘సీ ఓటర్–ఐఏఎన్ఎస్’ సంయుక్తంగా దేశవ్యాప్తంగా మే నెల చివరివారంలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా డాట్‌కామ్’ మంగళవారం ఈ వివరాలను ప్రముఖంగా ప్రచురించింది. ప్రజాదరణ చూరగొన్న ముఖ్యమంత్రుల్లో తొలి మూడు స్థానాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు తలలు పండిన సీనియర్లే కావడం విశేషం. యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి సరసన నిలవడం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. (రూపాయి కూడా అప్పు లేకుండా ఇల్లు..) -
ది లీడర్
-
బెస్ట్ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి జనరంజకంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం వైఎస్ జగన్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ నాలుగో స్థానంతో సీనియర్ల సరసన నిలిచారు. మరోవైపు వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరు పట్ల దేశవ్యాప్తంగా 65.69 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై 62 శాతం సంతృప్తి వ్యక్తమైంది. ప్రధాని మోదీ పట్ల అత్యంత సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో ఒడిశా (95.6 శాతం) ముందు వరుసలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 83.6 శాతం సంతృప్తి వ్యక్తమైంది. నవీన్ పట్నాయక్‌కు ప్రథమ స్థానం.. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రథమ స్థానం దక్కింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మిగతా రెండో స్థానంలోనూ, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మూడో స్థానంలోనూ నిలిచారు. ‘సీ ఓటర్–ఐఏఎన్ఎస్’ సంయుక్తంగా దేశవ్యాప్తంగా మే నెల చివరివారంలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా డాట్‌కామ్’ మంగళవారం ఈ వివరాలను ప్రముఖంగా ప్రచురించింది. ప్రజాదరణ చూరగొన్న ముఖ్యమంత్రుల్లో తొలి మూడు స్థానాలు పొందిన వారిలో ఇద్దరు తలలు పండిన సీనియర్లే కావడం విశేషం. యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి సరసన నిలవడం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. సీఎంలకు ప్రజాదరణ ఇలా... – నవీన్ పట్నాయక్ పాలనపై 82.96 శాతం మంది ఒడిషా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. – భూపేష్ భగేల్ పాలనపై 81.06 శాతం మంది ఛత్తీస్‌గఢ్ ప్రజలు, పినరయ్ పాలనపై కేరళలో 80.28 శాతం సంతృప్తి వ్యక్తమైంది. – ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై మొత్తం 78.01 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. – 72.56 శాతం మంది ప్రజల మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఐదో స్థానంలోనూ, 74.18 శాతం మంది మద్దతుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 6వ స్థానంలోనూ నిలిచారు. – 54.26 శాతం మంది ప్రజల మద్దతుతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 16వ స్థానంలో నిలిచారు. – కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యూడ్యూరప్ప 67.21 శాతం మంది మద్దతుతో 8వ స్థానంలోనూ, 41.28 శాతం ప్రజాదరణతో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి 19వ స్థానంలో ఉన్నట్లు వెల్లడైంది. ప్రధాని మోదీకి 65.69 శాతం ప్రజల మద్దతు సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు పట్ల దేశవ్యాప్తంగా 65.69 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా కేంద్ర ప్రభుత్వం పనితీరుపై 62 శాతం సంతృప్తి చెందినట్లు ‘సీ ఓటర్– ఐఏఎన్ఎస్’ సర్వే తెలిపింది. ప్రధాని మోదీ పట్ల ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల ప్రజలు అత్యంత సంతృప్తి ప్రకటించారు. ప్రధానికి ఒడిశాలో అత్యంత ప్రజాదరణ – ప్రధాని మోదీ పనితీరు పట్ల దేశవ్యాప్తంగా 58.36 శాతం మంది ప్రజలు అత్యంత సంతృప్తి కనబరచగా, 24.04 శాతం సంతృప్తి కనబరచారు. 16.71 శాతం సంతృప్తి చెందలేదని సర్వే తేల్చింది. స్థూలంగా 65.69 శాతం మంది ప్రధాని పట్ల సంతృప్తిని ప్రకటించారు. – ప్రధాని మోదీ పట్ల అత్యంత సంతృప్తి వ్యక్తంచేసిన రాష్ట్రాల్లో ఒడిశా (95.6 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (93.95 శాతం), ఛత్తీస్‌గఢ్ (92.73 శాతం), ఆంధ్రప్రదేశ్ (83.6 శాతం), జార్ఖండ్ (82.87 శాతం), కర్ణాటక (82.56 శాతం), గుజరాత్ (76.42 శాతం), అసోం (74.59 శాతం), తెలంగాణ (71.51 శాతం), మహారాష్ట్ర (71.48 శాతం) వరుసగా తొలి పది స్థానాల్లో నిలిచాయి. దక్షిణాదిన తమిళనాడు(32.89 శాతం), కేరళ (32.15 శాతం) రాష్ట్రాల్లో ప్రధాని పట్ల అతి తక్కువగా సంతృప్తి కనబరిచారు. కేంద్రంపై 62 శాతం మంది సంతృప్తి – కేంద్ర ప్రభుత్వం పట్ల అత్యంత సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, అసోం, ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణ, కర్ణాటక ఉన్నాయి. అత్యంత తక్కువగా సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో గోవా, హర్యానా, కేరళ, తమిళనాడు, జమ్మూ కశ్మీర్ ఉన్నాయి. మొత్తంగా 62 శాతం మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పనితీరు పట్ల తమిళనాడు, కేరళ, అసోం, ఒడిశా, జమ్మూ కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో సంతృప్తి మెరుగ్గా ఉంది. -
మోదీపై విశ్వాసం: టాప్-5లో సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ : చాయ్‌వాలాగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనతికాలంలో దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగారు. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన మోదీ.. బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంపూర్ణ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. తొలి ఐదేళ్ల పాలనాకాలంలో తనదైన ముద్రవేసుకున్న ప్రధాని.. వందేళ్ల చరిత్రగల పార్టీని కోలుకోలేని దెబ్బతీసి రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే రెండోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి మే 29 నాటికి తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సర్వే సంస్థ ‘సీ ఓటర్’ ఓ సర్వేను నిర్వహించింది. (మోదీ ఏడాది పాలనకు 62 శాతం మంది జై!) ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రుల ప్రజాదరణపై ఓ నివేదికను విడుదల చేసింది. ఆరేళ్ల కాలంలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ప్రధాని మోదీకి దేశ వ్యాప్తంగా 65శాతం ప్రజలు మద్దతు లభించిందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దూసుడైన నిర్ణయాలతో ప్రజల దృష్టిని మోదీ ఆకర్శించారని తెలిపింది. మోదీ పనితీరుపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని సర్వేలో వెల్లడించింది. (గ్లోబల్ లీడర్‌గా భారత్!) టాప్-5 లో సీఎం జగన్ ఇక ముఖ్యమంత్రులపై ‘సీ ఓటర్’ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దేశ వ్యాప్తంగా టాప్-5 సీఎంల జాబితాలో చోటు దక్కింది. ప్రభుత్వ నిర్ణయాలు, పనితీరు ఆధారంగా ఈ సర్వే రూపొందించగా.. సీఎం జగన్‌కు 78.1శాతం మంది ప్రజల మద్దతు లభించింది. నాలుగో స్థానంలో సీఎం జగన్ చోటు దక్కించుకున్నారని సీ ఓటర్ సర్వే నివేదికలో తెలిపింది. ముఖ్యమంత్రిగా పాలనాబాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాది కాలంలోనే అనేక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది. ఇక అత్యధిక ప్రజాదరణ లభించిన ముఖ్యమంత్రి జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తొలి స్థానంలో ఉండగా, తరువాత స్థానాల్లో ఛత్తీస్‌గఢ్, కేరళ ముఖ్యమంత్రులు భూపేశ్ వాఘేలా, పినరయి విజయన్ ఉన్నారు. ఐదో స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిలిచారు. -
సోనియా కంటే రాహులే పాపులర్
న్యూఢిల్లీ: ఓ వైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాపులారిటీ తగ్గుతుండగా, మరోవైపు రాహుల్ గాంధీ పాపులర్ అవుతున్నారని ఐఏఎన్ఎస్–సీఓటర్ రిపబ్లిక్ డే ‘స్టేట్ ఆఫ్ నేషన్’ సర్వే వెల్లడించింది. ఈ నెల 25 వరకూ గత 12 వారాలుగా ఈ సర్వే కొనసాగిందని నిర్వాహకులు ఆదివారం తెలిపారు. 543 పార్లమెంటు నియోజకవర్గాల్లో 30,240 మంది పౌరుల అభిప్రాయాలతో ఈ సర్వే చేపట్టారు. ఇందులో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ సంతృప్తికరంగా పని చేస్తున్నట్లు 49.5% మంది అభిప్రాయపడ్డారు. అందులో తెలంగాణాలో 50.5% మంది, కేరళలో 43.3% మంది, ఆంధ్రప్రదేశ్‌లో 37.9% మంది ఆమె పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో 14.5% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. తల్లికంటే ముందంజలో తనయుడు.. కేరళలోని వయానాడ్ నుంచి ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. 51.9% మంది ఆయన పట్ల చాలా సంతృప్తిగా ఉన్న్టట్లు సర్వే తెలిపింది. పుదుచ్చేరిలో ఏకంగా 76% మంది చాలా సంతృప్తికంగా ఉన్నారు. మరోవైపు హరియాణాలో రాహుల్ పట్ల కేవలం 17.7%మంది సంతృప్తిగా ఉన్నారు. ప్రధానికి రాజ్యాంగం ప్రతిని పంపిన కాంగ్రెస్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి కాంగ్రెస్ వినూత్న బహుమతిని పంపింది. భారత రాజ్యాంగం ప్రతిని మోదీకి పంపినట్లు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సమయం దొరికినప్పుడు ఈ ప్రతిని చదవాలని ప్రధానికి సూచించింది. ‘ప్రియమైన ప్రధాని మోదీ గారికి.. కాంగ్రెస్ పార్టీ తరఫున దేశ రాజ్యాంగ ప్రతిని పంపుతున్నాము. దేశాన్ని విభజించాలనుకునే ముందు దీనిని తప్పకుండా చదవండి’అని పేర్కొంది. వీటితో పాటు అమెజాన్‌లో రాజ్యాంగ ప్రతిని కొన్న ఫొటోను కూడా ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యాంగ ప్రవేశికను చదువుతోన్న వీడియోలను సైతం కాంగ్రెస్ ట్వీట్ చేసింది. -
కాషాయ ప్రభంజనమే!
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ ప్రభంజనం ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్ అనంతరం సోమవారం పలు మీడియా సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. గెలిచే సంఖ్యలో కొద్ది తేడాలున్నా గెలుపైతే ఖాయమేనని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి సునాయాసంగా డబుల్ సెంచరీ సాధిస్తుందని న్యూస్ 18– ఐపీఎస్ఓఎస్, ఏబీపీ– సీ ఓటరు పోల్స్ తేల్చాయి. బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధించడానికి 3 స్థానాల దూరంలో ఆగిపోయిందని న్యూస్ 18– ఐపీఎస్ఓఎస్ పేర్కొంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ సగటును పరిగణనలోకి తీసుకుంటే బీజేపీ శివసేన కూటమికి 211, కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమికి 64 సీట్లు వస్తాయని తేలింది. హరియాణాలో కూడా బీజేపీ విజయం లాంఛనమేనని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. 90 స్థానాల అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తుందని పేర్కొన్నాయి. టైమ్స్ నౌ పోల్ బీజేపీ 71, కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. జన్ కీ బాత్ సర్వే బీజేపీకి 57, కాంగ్రెస్‌కు 17 స్థానాలు ఇచ్చింది. న్యూస్ ఎక్స్ 77 సీట్లు బీజేపీవేనంది. టీవీ9 భారత్‌వర్‡్ష ఎగ్జిట్ పోల్ మాత్రం బీజేపీ మెజారిటీ కన్నా ఒక స్థానం ఎక్కువగా 47 సీట్లు గెలుస్తుందంది. కాంగ్రెస్ 23 స్థానాల్లో, ఇతరులు 20 స్థానాల్లో గెలుస్తారని చెప్పింది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి 46.4 శాతం వస్తాయని ఐఏఎన్ఎస్– సీఓటర్ సర్వే పేర్కొంది. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి 47.2 శాతం ఓట్లు సాధించాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమి 38.3% ఓట్లు పొందగా, ఈ సారి 36.9% ఓట్లు వస్తాయని ఐఏఎన్ఎస్– సీఓటర్ సర్వే తెలిపింది. -
2019 హంగ్!
-
19 ఎంపీ సీట్లతో వైఎస్సార్సీపీ స్వీప్!
సాక్షి, అమరావతి: మరి కొద్ది నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సీట్లలో నెగ్గి ఘన విజయం సాధించనుందని ‘రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్’ సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సీఎం చంద్రబాబు సారథ్యంలోని అధికార టీడీపీ 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరుతో జరిగిన ఈ సర్వే ఫలితాలను రిపబ్లిక్ టీవీ గురువారం విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగానూ వైఎస్సార్ సీపీకి 19 ఎంపీ సీట్లు, టీడీపీకి కేవలం ఆరు సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఏపీలో ఒక్క స్థానంలో కూడా గెలవలేవని పేర్కొంది. ఓట్ల శాతంలోనూ వైఎస్సార్ సీపీ స్పష్టమైన ఆధిక్యం ఓట్ల శాతం పరంగా చూసినా కూడా సర్వేలో వైఎస్సార్సీపీదే పైచేయిగా ఉంది. వైఎస్సార్ సీపీకి 41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసినా ఏపీలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు మాత్రమే లభించడం గమనార్హం. బీజేపీకి రెండు ఎంపీ సీట్లు రావడం తెలిసిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 8 ఎంపీ సీట్లను సాధించింది. సీ ఓటర్ సంస్థ గతంలో వెల్లడించిన సర్వేలో కూడా వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
రిపబ్లిక్ టీవీ సర్వే: లోకసభ ఎన్నికల్లో కారు జోరు..
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించనుందని రిపబ్లిక్-సీ ఓటర్ సర్వే తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను టీఆర్ఎస్ 16 స్థానాలు, ఎంఐఎం ఒక్క స్థానం సాధిస్తాయని సర్వే స్పష్టం చేసింది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ కూడా లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 16 స్థానాలు సాధిస్తుందని చెబుతున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదని సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా తెలంగాణలో తమ ఖాతాను తెరవవని సర్వే పేర్కొంది. ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే.. టీఆర్ఎస్ 42.4 శాతం, కాంగ్రెస్ 29 శాతం, బీజేపీ 12.7 శాతం, ఎంఐఎం 7.7 శాతం, ఇతరులు 8.2 శాతం ఓట్లు సాధిస్తాయని పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో సర్వే వివరాలు వెల్లడించిన సీ-ఓటర్ సంస్థ.. టీఆర్ఎస్ 9 స్థానాల్లో, కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలుపొందుతాయని తెలిపింది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన అనంతరం పరిస్థితుల్లో భారీ మార్పు వచ్చినట్టుగా తెలుస్తోంది. కాగా, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 2 స్థానాలు సాధించిన సంగతి తెలిసిందే. -
కర్ణాటకలో హోరాహోరీ
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇప్పటికిప్పడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ, యూపీఏ సమవుజ్జీలుగా నిలుస్తాయని రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. 28 సీట్లు ఉన్న కర్ణాటకలో ఎన్డీఏ 14, యూపీఏ 14 స్థానాలు గెలిచే అవకాశముందని సర్వేలో తేలింది. (ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం) ఓట్ల శాతంలో ఎన్డీఏపై యూపీఏ పైచేయి సాధిస్తుందని వెల్లడించింది. యూపీఏకు 47.9 శాతం, ఎన్డీఏకు 44 శాతం, ఇతరులు 8.1 శాతం ఓట్లు దక్కించుకోనున్నారు. గత డిసెంబర్లో జరిపిన సర్వేతో పోలిస్తే ఇప్పుడు ఎన్డీఏకు 4 సీట్లు తగ్గాయి. యూపీఏ తన ఓట్ల శాతాన్ని 37.6 నుంచి 47.9 శాతానికి పెంచుకుంది. (మోదీకి భారీ షాక్) -
లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం