న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని ఐఏఎన్‌ఎస్–సి ఓటరు సర్వేలో వెల్లడైంది. 52% మంది యోగిదే మళ్లీ సీఎం పదవి అభిప్రాయపడితే, 37% మంది మళ్లీ ఆయన అధికారంలోకి రాలేరని అన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో విఫలమయ్యారని ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఆ సమయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, కుంభమేళా, గంగానదిలో శవాలు కొట్టుకొని రావడం వంటివన్నీ ఆయనపై వ్యతిరేకతను పెంచాయి. అయినప్పటికీ 52% మంది యోగికే మొగ్గు చూపించారని ఐఏఎన్‌ఎస్–సీఓటరు సర్వే పేర్కొంది. ఇక కొత్త కేబినెట్‌తో దేశంలో పరిస్థితులు మెరుగవుతాయని సర్వేలో 46% మంది అభిప్రాయపడితే, 41% మంది పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదని అన్నారు. ఐఎఎన్‌ఎస్–సీ ఓటరు మొత్తం 1,200 మంది ఇంటర్వ్యూలు తీసుకొంది.
బీడీసీ సభ్యుడి బంధువు హత్య
యూపీ బహరిచ్‌లో బ్లాక్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యుడి బావమరిది దారుణ హత్యకు గురయ్యాడు. బీజేపీ అభ్యర్థి భర్త కిడ్నాప్ చేస్తూ ఉంటే అడ్డుకోవడంతో ఆయనను దారుణంగా చంపారని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment