Uttar Pradesh Assembly elections
-
టైమ్ చూసి... హ్యాండిస్తున్నారు..!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ తేదీకి గడువు దగ్గరకొస్తున్న కొద్దీ, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీని మరింత బలహీన పరిచేలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ మినహా మిగతా హస్తిన నేతలు ఎవరూ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో పార్టీ నేతలు ఒక్కొక్కరుగా గుడ్‌బై చెప్పేస్తున్నారు. పార్టీని వీడుతున్న నేతలను బుజ్జగించే చర్యలు ఏవీలేకపోవడం, పార్టీలో ప్రాధాన్యంపై ఎలాంటి హామీలు ఇవ్వకపోవడం, పార్టీ గెలిచే అవకాశాలపై నమ్మకంలేకపోవడంతో పార్టీ విధేయులే ఇతర పార్టీల్లోకి జారుకుంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, యూపీ ఇంఛార్జ్‌గా ప్రియాంకా గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, పార్టీ పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుందని భావించినా, ఇప్పటికే 20 మందికి పైగా కీలక నేతలు పార్టీని వీడడం తలనొప్పి వ్యవహారంలా మారింది. కేంద్ర మాజీ మంత్రి, పార్టీ అధిష్టానానికి సన్నిహితుడైన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాదతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పార్టీని వీడగా, షెడ్యూల్ విడుదలయ్యాక పశ్చిమ యూపీలో కీలక ముస్లిం నేత, గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన ఇమ్రాన్ మసూద్ ఎస్పీలో చేరారు. తాజాగా స్టార్ క్యాంపెయినర్ జాబితా ప్రకటించిన మరుసటిరోజే మాజీ కేంద్రమంత్రి ఆర్పీఎన్ సింగ్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఎన్నికల సమయంలో పేరున్న నేతలే కాకుండా, క్షేత్రస్థాయిలోనూ పార్టీని వదిలివెళ్లేవారిని ఆపలేకపోవడం పార్టీ అవకాశాలను దెబ్బతీస్తోంది. కాంగ్రెస్‌ను వీడిన కొందరు కీలక నేతలు వీరు.. -
తగ్గేదేలే..! తొలిసారి అసెంబ్లీ బరిలోకి సీఎం యోగి ఆదిత్యనాథ్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో గడిచిన ఎన్నికల్లో అధికారపగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రులంతా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు అనాసక్తి చూపితే.. తొలిసారి ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం కదనరంగంలో తేల్చుకునేందకు సిధ్దమయ్యారు. హిందూ, ధార్మిక భావజాలం ఉండే అయోధ్య లేక మథుర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయనను పోటీ చేయిస్తారని ప్రచారం జరిగినా బీజేపీ అధిష్టానం అనూహ్యంగా ఆయన్ను తూర్పు యూపీలోని స్వస్థలమైన గోరఖ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో నిలిపింది. గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన చరిత్ర ఉండటంతో అక్కడే నుంచే ఆయన ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నష్ట నివారణచర్యల్లో భాగంగానే.. అయితే యోగిని గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేయించడానికి అనేక కారణాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతు న్నాయి. గోరఖ్‌పూర్ తూర్పు యూపీలో ఉంది. తూర్పు యూపీకి చెందిన ఇద్దరు కేబినెట్ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్లు ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. మౌర్య 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఖుషీనగర్ జిల్లా కేంద్రమైన పద్రౌనా నుంచి గెలుపొందగా, మవూ జిల్లాలో ఉన్న మధుబన్ నుండి దారాసింగ్ గత ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిద్దరూ స్థానికంగా బలవంతులు. సామాజికవర్గంపై బాగా ప్రభావం చూపుతారు.వీరి రాజీనామాతో పార్టీకి నష్టం కగిలే అవకాశాలున్నాయి. చదవండి: రాజకీయ దురంధరుడైన తండ్రినే వ్యూహాలతో మట్టికరిపించి.. గోరఖ్‌పూర్ నుంచి యోగి అభ్యర్థిగా బరిలోకి దిగితే ఈ నష్టాన్ని తగ్గించుకోవచ్చని బీజేపీ అభిప్రాయపడుతోంది. ఇక్కడ యోగిని నిలపడం ద్వారా సీట్లు తగ్గకుండా చూసుకోవడంతో పాటు, గోరఖ్‌పూర్ పొరుగు జిల్లాలైన బస్తీ, సిద్ధార్థనగర్, ఖుషీనగర్, మహరాజ్‌గంజ్, బలరాంపూర్, సంత్ కబీర్‌నగర్, డియోరియాలలో మద్దతును పెంచుకోవాలన్నది. బీజేపీ వ్యూహంగా ఉంది. అదీగాక యోగి 1998, 1999, 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికలలో వరుస విజయాలను నమోదు చేసి, గోరఖ్‌పూర్ నుండి ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. అంతేకాకుండా అ త్యంత ప్రజాదరణ పొందిన గోరఖ్‌నాథ్ మఠానికి అధిపతిగా ఉన్నారు. గోరఖ్‌పూర్ నుండి పోటీ చేయడం ద్వారా, యోగికి యూపీలోని ఇతర ప్రాంతాలపై దృష్టి పెట్టడా నికి ఎక్కువ సమయం ఉంటుందని బీజేపీ అంచనా. సీఎం అభ్యర్థులంతా పోటీకి దూరమే యూపీలో 2007 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారపగ్గాలు చేపట్టిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల్లో ప్రత్యక్ష పోరుకు దిగలేదు. శానమండలి సభ్యురాలిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ ఆమె అసెంబ్లీకి పోటీ చేయలేదు. ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్ సైతం పార్లమెంట్‌కు గెలిచినా, 2012లో ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే బరిలో దిగలేదు. మండలి నుంచి ఎన్నికై సీఎంగా కొనసాగారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ వీరిద్దరూ పోటీకి దూరంగా ఉన్నారు. ఇక ఐదుసార్లు ఎంపీగా గెలిచిన ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. చదవండి: Punjab Assembly Election 2022: ఆప్‌కు ముప్పు: విజయావకాశాలను దెబ్బతీసేలా ఆయన్ను అసెంబ్లీ బరిలో నిలిపే విషయమై అనేక తర్జనభర్జనలు జరిగాయి. ఒకవేళ పోటీలో నిలిపితే శ్రీకృష్ణ జన్మభూమి అయిన మథుర, రామ జన్మభూమి అయిన అయోధ్యల్లో ఒక నియోజకవర్గం నుంచి పోటీ నిలుపుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ మూడ్రోజుల కింద ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో యోగికి గోరఖ్‌పూర్ నియోజకవర్గాన్ని కేటాయించారు. ఒటమి భయంతోనే యోగీని తిరిగి సొంతింటికి పంపారని ఎస్పీ అప్పుడే ప్రచారాలు సైతం మొదలుపెట్టింది. మథుర, అయోధ్యకు దూరానికి భిన్న కారణాలు.. ఇక మథుర, అయోధ్యలో యోగిని పోటీ దిగకపోవడానికి పార్టీ వర్గాలు అనేక కారణాలను విశ్లేషిస్తున్నాయి. మథురలో ఇప్పటికే బీజేపీ నుంచి బ్రాహ్మణ వర్గానికి చెందిన శ్రీకాంత్ శర్మ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ అగ్రనాయకత్వానికి అత్యంత సన్నిహితుడైన శర్మ విద్యుత్ శాఖ మంత్రిగానూ కొనసాగుతున్నారు. ఆయన్ను పక్కనపెట్టి యోగికి టిక్కెట్ ఇవ్వడం అంటే బ్రాహ్మణ వర్గానికి కోపం తెప్పిచ్చినట్లే అవుతుంది. అదీగాక విద్యుత్ సంస్కరణలు తెచ్చామని చెబుతున్న ప్రభుత్వంలో ఆ శాఖ మంత్రికే టిక్కెట్ నిరాకరించడం పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వెనక్కి తగ్గారు. ఇక అయోధ్యలో బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్యే వేద్‌ప్రకాశ్ గుప్తా ఎస్పీ ప్రభుత్వంలోని మాజీ మంత్రి తేజ్ నారాయణ్ పాండేను 50 వేల పైచిలుకు ఓట్లతో ఓడించారు. దీంతో ఆయనకు టిక్కెట్ నిరాకరించడం సాథ్యం కాదు. ఈ దృష్ట్యానే అయోధ్యలో పోటీపై వెనక్కి తగ్గారు. -
బీజేపీ రివర్స్ పంచ్! ఎస్పీ చీఫ్ సోదరుడి భార్య అపర్ణకు బీజేపీ గాలం?
ముగ్గురు ఓబీసీ మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేల (ఇందులో ఇద్దరు బీజేపీ మిత్రపక్షం ‘అప్నాదళ్–ఎస్’కు చెందిన వారు)ను చేర్చుకొని ఊపుమీదున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చేలా బీజేపీ పావులు కదుపుతోంది. అఖిలేశ్ సవతి సోదరుడైన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్‌కు కండువా కప్పేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అపర్ణ కొంతకాలంగా మోదీ ప్రభుత్వ విధానాలకు బాహటంగా మద్దతు పలుకుతున్నారు. ఆమెతో బీజేపీ టచ్‌లో ఉంది. ఇరుపక్షాల మధ్య అపర్ణ పార్టీ ఫిరాయింపుపై చర్చలు జరుగుతున్నాయని... ఇప్పుడవి ఒక కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి, సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ చేతిలో 33,796 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఫిబ్రవరి– మార్చిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ లక్నో కంటోన్మెంట్ సీటునే అడుగుతున్నట్లు వినికిడి. అయితే సీనియర్ రీటా బహుగుణను కదపడం ఇష్టం లేని బీజేపీ ములాయం సింగ్ కోడలిని మరో చోటు నుంచి పోటీ చేయించాలని చూస్తోంది. కుంభస్థలాన్ని కొట్టాలని... బీజేపీ నుంచి ఎస్పీకి ఇటీవలి వలసలతో కమలదళం లోలోపల రగిలిపోతోంది. పెద్ద ఎత్తున ప్రతిదాడి చేయకపోతే బీజేపీ చేష్టలుగిడి చూస్తోందనే అభిప్రాయం బలపడుతుంది. అందుకే అపర్ణా యాదవ్‌కు గాలం వేసింది. తమ్ముడి భార్యను ఆపలేకపోతే... అఖిలేశ్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో తనతో విబేధించి వేరుకుంపటి పెట్టుకున్న బాబాయ్ శివపాల్ యాదవ్ (ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ– లోహియా)తో అఖిలేశ్ ఇటీవలే సయోధ్య కుదుర్చుకున్నారు. ప్రతి ఒక్క ఓటు ముఖ్యమే అన్నట్లుగా బీజేపీ వ్యతిరేకంగా చిన్న పార్టీలన్నింటినీ కలుపుకుపోతున్నారు. ఇప్పుడు బీజేపీ అపర్ణను లాగేస్తే... మళ్లీ ఇంటిపోరు మొదలైనట్లే. ‘మా జోలికొస్తే ఊరుకుంటామా? మీ ఇంటికొస్తాం.. నట్టింటికొస్తాం’ అన్నట్లుగా బీజేపీ ప్రతిదాడికి దిగింది. ములాయంసింగ్ ఇంట్లో చిచ్చు పెట్టడం ద్వారా ఎస్పీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టవచ్చేనేది కమలనాథుల వ్యూహం. ములాయంసింగ్ రెండో భార్య సాధనా గుప్తాకు మొదటి వివాహం ద్వారా జన్మించిన కుమారుడే ప్రతీక్ యాదవ్. – నేషనల్ డెస్క్, సాక్షి -
పార్టీ షాక్ ఇచ్చింది.. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోయాడు
లక్నో: దేశవ్యాప్తంగా అందరి చర్చ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీద సాగుతోంది. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అన్ని పార్టీలు టికెట్ల కేటాయింపు విషయంతో జాగ్రత్త వహిస్తూ గెలుపుగుర్రాలను మాత్రమే బరిలోకి దించుతున్నాయి. ఆయా పార్టీల అధిష్టానం ఇచ్చే షాక్‌లకు అసెంబ్లీ టికెట్ ఆశావహులు తీవ్రమైన భంగపాటుకు గురవుతున్నారు. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎమ్మెలే టికెట్ ఆశించి దక్కకపోవటంతో ఓ నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం ఎదుట అలీగఢ్‌కు చెందిన ఎస్పీ నేత ఆదిత్య ఠాకూర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. అయితే ఆదిత్య ఠాకూర్ అలీగఢ్‌లోని ఛారా నియోజకవర్గ నుంచి ఎస్పీ తరపున పోటీ చేయాలని భావించాడు. పార్టీ కోసం పని చేస్తున్న ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కచ్చితంగా వస్తుందని ఆశించాడు. కానీ, చివర క్షణంలో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆదిత్య ఠాకూర్.. పార్టీ ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ముజఫర్‌నగర్‌లోని చార్తావాల్ స్థానం నుంచి టికెట్ రాకపోవడంతో ఆందోళన చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత అర్షద్ రాణా మీడియా ముందు భోరున విలపించిన విషయం తెలిసిందే. చదవండి: Punjab Elections 2022: నన్ను కాదని సోనూసూద్ సోదరికి సీటిచ్చారు..! అందుకే బీజేపీలోకి..: కాంగ్రెస్ ఎమ్మెల్యే -
బీజేపీ తొలి జాబితా విడుదల..ఎన్నికల బరిలో సీఎం యోగి...
-
UP Election 2022: అయోధ్య కాదు గోరఖ్‌పూర్
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం మధ్యాహ్నం ఒక లిస్ట్‌ను ప్రకటించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. ఈ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ నుంచి బరిలోకి దిగుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీ, యోగిపై సెటైర్లు పేల్చాడు. ఇంతకు ముందు ఆయన అయోధ్య, మథుర, ప్రయాగ్‌రాజ్ నుంచి యోగి పోటీ చేయొచ్చని బీజేపీ బహిరంగంగా ప్రకటించుకుంది. ఇప్పుడేమో ఆయన్ని.. బీజేపీ ఆయన సొంత స్థానానికే పంపించింది. యోగిగారు మీరు అక్కడే ఉండిపోండి. మీరు మళ్లీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అంటూ సెటైర్లు పేల్చాడు అఖిలేష్. ఇదిలా ఉంటే.. పార్టీ ప్రకటన తర్వాత ‘పార్టీ ఎక్కడి నుంచి ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాన’ని సీఎం యోగి ప్రకటించడం తెలిసిందే. అయితే గోరఖ్‌పూర్ ఎంపికపై యోగి అసంతృప్తితో ఉన్నారంటూ వస్తున్న మీడియా కథనాలను రాష్ట్ర ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్ కొట్టిపారేశారు. గతంలో యోగి గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మఠ్లోమహంత్(ప్రధాన అర్చకుడిగా) పని చేశారు. ఆపై రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించాక.. గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానంలో 1998 నుంచి ఐదుసార్లు వరుసగా ఐదు సార్లు ఎంపీగా గెలుపొందారు. 2017 నుంచి ఎమ్మెల్సీ హోదాలో యూపీ సీఎంగా ఆయన కొనసాగుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నుంచి మొట్టమొదటిసారి పోటీ చేయనున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక మొదటి, రెండో దశ పోలింగ్‌కు సంబంధించి.. మొత్తం 105 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్‌ను రిలీజ్ చేసింది బీజేపీ. ఇందులో 63 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపేర్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 10 నుంచి మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. రెయిన్బో కూటమి ద్వారా ప్రాంతీయ పార్టీలతో జతకట్టిన మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. రూలింగ్ పార్టీకి గట్టి పోటీనే ఇవ్వబోతున్నారు. కొన్నిసర్వేలు యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండడంతో ఎస్పీకి జంప్ అవుతున్న బీజేపీ నేతల సంఖ్య పెరుగుతూ వస్తోంది. -
వైరల్ వీడియో: ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఏడ్చేసిన బీఎస్పీ నాయకుడు
లక్నో: ప్రస్తుతం దేశమంతా అయిదు రాష్ట్రాల ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. ఈ అయిదింటిలో అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి చాలా ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. 403 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. కాగా ఉత్తరప్రదేశ్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. జనవరి 14 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 21 వరకు నామినేషన్లు ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ లో 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 11 జిల్లాలు ఫస్ట్ ఫేజ్‌లో ఓటింగ్‌కు వెళ్లనున్నాయి. ఎన్నికల తేదీలు ప్రకటించడంతో పార్టీ టిక్కెట్ల విషయంలోనూ రగడ మొదలైంది. ముజఫర్‌నగర్‌లోని చార్తావాల్ స్థానం నుంచి టికెట్ రాకపోవడంతో ఆందోళన చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) నాయకుడు అర్షద్ రాణా మీడియా ముందు ఏడుస్తూ కనిపించాడు. రెండేళ్ల క్రితం పార్టీ సీనియర్ నాయకుడు టికెట్ కోసం రూ. 67 లక్షలు డిమాండ్ చేశాడని, అయితే తనకు తెలియకుండానే తన టికెట్ తొలగించారని అర్షద్ రాణా పోలీసుల ముందు ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరించారు. చదవండి: యూపీ రాజకీయాల్లో కీలక మార్పులు.. ఎస్పీలో చేరిన ఇద్దరు బీజేపీ మంత్రులు కాగా చార్తావాల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దధేడు గ్రామానికి చెందిన అర్షద్ రాణా చాలా కాలంగా బీఎస్పీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆయన భార్య కూడా జిల్లా పంచాయతీ సభ్యుని పదవికి బీఎస్పీ తరపున పోటీ చేశారు. పార్టీ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న రాణా కొంత కాలంగా బీఎస్పీ నుంచి చార్తావాల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇంతలో బీఎస్పీ అధినేత్రి మాయావతి చార్తావాల్ అసెంబ్లీ స్థానం నుంచి సల్మాన్ సయీద్‌ను పార్టీ పోటీకి దింపినట్లు ట్వీట్ చేసింది. సల్మాన్ సయీద్ హోం శాఖ మాజీ రాష్ట్ర మంత్రి సయీదుజ్జమాన్ కుమారుడు. చదవండి: రెండే రెండు నిమిషాల్లో బాద్షా సాంగ్, స్పందించిన ర్యాపర్ #मुजफ्फरनगर विधानसभा का टिकट न मिलने के कारण थाने में फूट फूट कर रोते ये है बसपा नेता अरशद राणा। इनका आरोप है कि बसपा नेता शमशुद्दीन राइन ने इनसे टिकट के नाम पर 67 लाख रुपए ले लिए। पीड़ित नेता जी अब आत्मदाह करने की घोषणा कर रहे है।#UPElection2022 @bspindia #ViralVideos pic.twitter.com/mhz2mXymjw — Zuber Akhtar (@Zuber_IndiaTV) January 14, 2022 అయితే యామవతి ప్రకటనతో కంగుతున్న రాణా తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. బీఎస్పీ నేత షంషుద్దీన్ రైన్ టికెట్ పేరుతో తమ నుంచి రూ.67 లక్షలు తీసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం తన మద్దతుదారులతో కలిసి కొత్వాలి నగరానికి చేరుకొని బీఎస్పీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశాడు. కాగా దీనిపై విచారణ జరుపుతున్నామని, విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిటీ కొత్వాలి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ దేవ్ మిశ్రా తెలిపారు. -
యూపీలో బీజేపీకి భారీ షాక్.. పార్టీని వీడిన మూడో మంత్రి
-
యూపీలో బీజేపీకి భారీ షాక్.. పార్టీని వీడిన మూడో మంత్రి
లక్నో: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే యూపీలో అధికార బీజేపీ నుంచి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, బీజేపీకి చెందిన మరో మంత్రి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన స్వతంత్ర మంత్రి ధరమ్‌సింగ్ సైనీ పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖేష్ వర్మ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే మంత్రి రాజీనామా చేయడం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీని మారిన విషయం తెలిసిందే. యూపీలో వరుస నిష్క్రమణలకు కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఆద్యం పోసినట్లు చర్చకొనసాగుతుంది. పార్టీని వీడిన నాయకులు.. ప్రధానంగా బీజేపీ అధికార నాయకత్వం.. వెనుక బడిన వర్గాలపై వివక్ష చూపిస్తుందని, ప్రజా ప్రతినిధులను పట్టించుకోకుండా, అగౌరవ పర్చిందని ఎద్దేవా చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ముఖేష్ వర్మ తన లేఖలో ఒక అడుగు ముందుకేసి ‘స్వామి ప్రసాద్ మౌర్య వెనుకబడిన వర్గాల గొంతు’అని, ‘మా నాయకుడని’ లేఖలో అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, స్వామి ప్రసాద్ మౌర్యతోపాటు.. మరికొందరు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరనున్నారో మరికొన్నిరోజుల్లో తెలువనుంది. ప్రస్తుతం బీజేపీ నుంచి వరుస వలసలతో పెద్ద రాజకీయా దుమారం కొనసాగుతుంది. చదవండి: యూపీ ఎన్నికలు.. ఉన్నవ్ అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్ -
యూపీ ఎన్నికలు.. ఉన్నవ్ అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్
లక్నో: అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బీజేపీ, కాంగ్రెస్ సహా మిగతా పార్టీలన్నీ తీవ్ర కసరత్తు ప్రారంభించాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొన్న తరుణంలో తమ ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. ఈ క్రమంలో 125 మంది అభ్యర్థులతో కూడిన కాంగ్రెస్ తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో ఉన్నవ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్‌కు టికెట్ ఇచ్చినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. 125 మందిలో 40 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 40 శాతం యువతకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గౌరవ వేతనాల కోసం పోరాడిన ఆశా వర్కర్ పూనమ్ పాండే షాజహాన్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రియాంక చెప్పారు. మహిళలు, యువతకు కాంగ్రెస్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని, తమ నిర్ణయంతో యూపీలో సరికొత్త రాజకీయాలకు తెరలేస్తుందని ఆమె అన్నారు. దీని ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చదవండి: అయోధ్య నుంచి యోగి పోటీ! -
అయోధ్య నుంచి యోగి పోటీ!
న్యూఢిల్లీ: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించాలని బీజేపీ యోచిస్తోంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయోధ్యలో యోగిని నిలిపితే ఎలా ఉంటుందనే చర్చ అగ్రనేతల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం జరగలేదు. అయోధ్య, మథుర, గోరఖ్‌పూర్‌ల నుంచి ఒకచోట యోగి పోటీలో ఉండే అవకాశాలున్నాయి. చదవండి: యూపీ ఎన్నికల బరిలో శివసేన.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుందంటే! -
యూపీ ఎన్నికల బరిలో శివసేన.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుందంటే!
లక్నో: అయిదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వడంతో దేశంలో రాజకీయ వేడి మొదలైంది. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికల, ప్రచార వ్యూహాలతో జిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న యూపీ ఎన్నికలపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న శివసేన పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని శివసేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ వెల్లడించారు. యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకుగాను 50 నుంచి 100 అసెంబ్లీ స్థానాల్లో తాము కూడా బరిలో దిగబోతున్నామని చెప్పారు. యూపీలో రాజకీయ అనిశ్చితి ఉందన్న ఆయన.. యోగి పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు. బీజేపీని గద్దె దించేందుకు ఎస్పీ, బీఎస్పీ సహా అన్ని పార్టీలు ఏకీకృతం కావాల్సిన అవసరం ఉందని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. అటు ఎన్నికలకు ముందు కార్మికశాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య సహా నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడటం.. ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనమని సంజయ్ రౌత్ అన్నారు. చదవండి: 10 సూత్రాలతో 'పంజాబ్ మోడల్'.. ప్లాన్ రెడీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ కాగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఇప్పటికే యూపీలో అధికార బీజేపీ విపక్ష ఎస్పీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీఎస్పీ, స్థానిక చిన్న పార్టీలతో పాటు హైదరాబాద్‌కు చెందిన ఎంఐఏం కూడా ఎన్నికల బరిలో నిలిచింది. ఇదిలా ఉండగా మార్చి 10వ తేదీన ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. చదవండి: యూపీలో బీజేపీకి భారీ షాక్.. 24 గంటల వ్యవధిలో.. -
బీజేపీకి షాక్ మీద షాక్.. యూపీలో 24 గంటల వ్యవధిలో..
Uttar Pradesh Minister Dara Singh Chauhan: ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. మరో ఓబీసీ నాయకుడు, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి దారాసింగ్ చౌహాన్ బుధవారం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రముఖ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిన మర్నాడే చౌహాన్ రాజీనామా చేయడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. గవర్నర్ ఆనందిబెన్‌కు తన రాజీనామా లేఖ పంపిన తర్వాత చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ దళితులు, వెనుకబడిన వర్గాల ఓట్లతో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ గత అయిదేళ్లలో వాళ్లకి చేసిందేమీ లేదని ఆరోపించారు. దళితులు, ఓబీసీలు, నిరుద్యోగ యువతకి బీజేపీ హయాంలో న్యాయం జరగలేదన్నారు. చౌహాన్ సమాజ్‌వాదీ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. ఓబీసీ నాయకులంతా ఎస్పీలో చేరితే యాదవేతర వెనుకబడిన వర్గాల్లో ఆ పార్టీ పట్టు పెంచుకోవడానికి వీలు కలుగుతుంది. ఎన్నికల వేళ సమీకరణాలు వేగంగా మారిపోనున్నాయి. కార్మిక మంత్రిగా తాను రాజీనామా చేశాక బీజేపీలో భూకంపం వచ్చిందని స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ గూటికే చేరే అవకాశాలున్నాయంటూ సంకేతాలు ఇచ్చారు. తన వెంట మరింత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారన్నారు. భవిష్యత్ కార్యాచరణను శుక్రవారం ప్రకటిస్తానన్నారు. బీజేపీని వీడిన మర్నాడే మౌర్యకు సుల్తాన్పూర్ జిల్లా కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. హిందూ దేవుళ్లపై ఏడేళ్ల క్రితం మౌర్య అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు రావడంతో అప్పట్లో కేసు నమోదైంది. ఏడేళ్ల నాటి ఆ కేసు ఇప్పుడు హఠాత్తుగా తెరపైకి వచ్చి మౌర్యకి అరెస్ట్ వారెంట్లు జారీ కావడం గమనార్హం. చదవండి: (యూపీలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ) -
పోటీకి మాయావతి దూరం
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయావతి ఈసారి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం లేదు. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగకపోయినా, మాయావతి తన సొంత పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని మిశ్రా వివరించారు. -
యూపీ బీజేపీలో కరోనా కలకలం.. ఎంపీకి పాజిటివ్.. నిన్నంతా సీఎం యోగీతోనే
లక్నో: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ బీజేపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాధామోహన్ సింగ్ వైరస్ బారినపడ్డారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తో కలిసి ఎన్నికల సమావేశంలో పాల్గొన్న గంటల వ్యవధిలోనే ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఈ భేటీలో సీఎం యోగి పక్కనే రాధామోహన్‌సింగ్ కూర్చోని, అభ్యర్థుల ఎంపికపై చర్చించడం గమనార్హం. చదవండి: భారీగా కేసులు.. వారందరికీ వర్క్ ఫ్రం హోం ఇవ్వండి! రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన ఈ సమావేశంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ పాల్గొన్నారు. అయితే స్వల్ప లక్షణాలు ఉండటంతో హోమ్ ఐసోలేషన్ ఉన్నట్లు రాధామోహన్ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, తనను ఇటీవల కలిసిన వారందరూ కోవిడ్ టెస్ట్ చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో యూపీ బీజేపీ ఆఫీస్ సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చదవండి: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ -
ఎవరీ మౌర్య ?.. యూపీలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ
లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో కీలక మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సమాజ్‌వాదీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే అధికారికంగా ప్రకటించలేదు. ఆయన వెంటే మరో నలుగురు ఎమ్మెల్యేలు నడవనున్నారు. స్వామి ప్రసాద్ రాజీనామా వార్త యూపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. బీజేపీని నిర్ఘాంతపర్చింది. కార్మిక, ఉపాధి శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ ఆనందిబెన్‌కు లేఖ రాశారు. ఆ లేఖను ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. ‘కార్మిక మంత్రిగా నేను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ యోగి కేబినెట్లో అంకిత భావంతో పని చేశాను. కానీ దళితులు, వెనుకబడిన వర్గాలు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్న మధ్య తరగతి వ్యాపారుల్ని అణచివేస్తూ, క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం చేస్తూ ఉండటంతో నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని మౌర్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మౌర్య రాజీనామా లేఖను సామాజిక మాధ్యమాల్లో ఉంచిన కాసేపటికే ముగ్గురు ఎమ్మెల్యేలైన రోషన్ లాల్ వర్మ, బ్రజేష్ ప్రజాపతి , భగవతి సాగర్ వినయ్ శాఖ్యలు తాము మౌర్యకు మద్దతుగా పార్టీని వీడుతామని ప్రకటించారు. మౌర్య ఏ పార్టీలో ఉంటే తాను అక్కడే ఉంటానని తిల్హర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వర్మ చెప్పారు. తిండ్వారీ ఎమ్మెల్యే బ్రజేష్ ప్రజాపతి, బిల్హార్ ఎమ్మెల్యే భగవతి సాగర్ వెనుకబడిన వర్గాల గళమైన మౌర్య తమ నాయకుడని స్పష్టం చేశారు. యూపీ అసెంబ్లీ తొలి దశ (ఫిబ్రవరి 10న) ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుపై కసరత్తు చేయడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఇతర ముఖ్య నాయకులు ఢిల్లీలో సమావేౖశమెన వేళ లక్నోలో మౌర్య మంత్రి పదవికి రాజీనామా చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. అఖిలేశ్‌ను కలిసిన మౌర్య కేబినెట్‌కు రాజీనామా చేసిన వెంటనే మౌర్య నేరుగా సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయానికి వెళ్లి అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ను కలుసుకున్నారు. ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. మౌర్యతో కలిసి ఉన్న ఫొటోను అఖిలేశ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేస్తూ పార్టీలోకి ఆయనకి స్వాగతం పలికారు. ‘‘సామాజిక న్యాయం సాధించడానికి మౌర్య నిరంతరం పాటుపడతారు. అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడు. మౌర్యని, ఇతర నాయకుల్ని, వారి మద్దతుదారుల్ని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను’’ అని అఖిలేశ్ ట్వీట్ చేశారు. ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా అణగారిన వర్గాలన్నీ ఏకమవుతున్నాయని, ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమని జోస్యం పలికారు. మంగళవారం జరిగిన పరిణామాలు సమాజ్‌వాదీ శ్రేణులకు నైతిక స్థైర్యాన్ని ఇస్తాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు నేనేంటో తెలుస్తుంది: మౌర్య మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత మౌర్య విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడు అందరికీ స్వామి ప్రసాద్ అంటే ఎవరో తెలిసి వస్తుందని అన్నారు. తాను ఎక్కడ ఉంటే ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాగా చెప్పారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. స్వామి ప్రసాద్ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని ట్విట్టర్ వేదికగా కోరారు. తొందర పాటు నిర్ణయాలు ఎప్పుడూ తప్పు అవుతాయని, ఒక్కసారి అందరం కలిసి కూర్చొని చర్చిద్దామని కోరారు. ఎవరీ మౌర్య ? మౌర్య అత్యంత శక్తిమంతమైన ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) నాయకుడు. మౌర్య, కుషావా వర్గాల్లో అపారమైన పట్టు ఉంది. అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీజేపీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ ఇతర వెనుకబడిన వర్గాల వారిని ఆకర్షించడానికి, సమాజ్‌వాదీ పార్టీని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేసేవారు. 2016లో మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన పార్టీలో టిక్కెట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపిస్తూ పార్టీకి గుడ్ బై కొట్టారు. ఆ తర్వాత సొంతంగా లోక్తాంత్రిక్ బహుజన్ మంచ్ అనే సంస్థని స్థాపించి ప్రజల్లోనే ఉంటూ పట్టు నిలుపుకున్నారు. 2017లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి పడ్రౌనా నుంచి శాసనసభకి ఎన్నికై కార్మిక మంత్రి అయ్యారు. మౌర్య కుమార్తె సంఘమిత్ర బీజేపీలోనే ఎంపీగా ఉన్నారు. ఆమె బదౌన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మౌర్య నిష్క్రమణ 20 నియోజకవర్గాల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయవచ్చు. ఖుషీనగర్, ప్రతాప్‌గఢ్, కాన్సూర్ దెహత్, బండా, షాహజాన్పూర్ జిల్లాల్లో ఈ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. నాన్న ఏ పార్టీలో చేరలేదు.. మౌర్య ఏ పార్టీలో చేరలేదని ఆయన కూతురు, బదౌన్ బీజేపీ ఎంపీ సంఘమిత్ర అన్నారు. రెండు రోజుల్లో ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను, వ్యూహాన్ని వెల్లడిస్తారని చెప్పారు. కాగా బిదునా ఎమ్మెల్యే వినయ్ శాఖ్యను బలవంతంగా తమ కుటుంబసభ్యులే లక్నోకు పట్టుకెళ్లారని ఆయన కూతురు రియా శాఖ్య ఆరోపించారు. తన తండ్రికి 2018లో బ్రెయిన్ సర్జరీ జరిగిందని, తర్వాత ఆయన ఆలోచనా శక్తి కూడా క్షీణించిందని ఆమె తెలిపారు. చదవండి: (గోవా బీజేపీకి షాక్) -
విజయతీరాలను చేరాలని.. ‘సామాజిక’ ఫార్ములా!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలన్నీ రాజకీయ వ్యూహాల్లో దిట్టలైన సామాజిక ఇంజనీర్లు(పొలిటికల్ సోషల్ ఇంజనీర్స్), వారు సిద్ధం చేసే సోషల్ ఇంజనీరింగ్ మీదే ఆధారపడి ఉంటోంది. పార్టీకి విజయవంతమైన ఎన్నికల ప్రచారాన్ని సిద్ధం చేయడం, సామాజిక సమూహాలు, వారి అవసరాలను గుర్తించడం, ఆపై పథకాలు, ప్రోత్సాహకాలు ప్రకటించడం, సామాజిక మాధ్యమాల్లో సందేశాల ద్వారా పార్టీకి అనుకూలంగా వారిని సానుకూలంగా ప్రభావితం చేసే వ్యూహాన్ని సిద్ధం చేయడంతో సోషల్ ఇంజనీర్లే కీలక భూమిక పోషిస్తున్నారు. దేశంలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే ప్రతి పార్టీ సోషల్ ఇంజనీరింగ్ ప్రాధాన్యాన్ని బాగా గుర్తించాయి. సామాజిక సమీకరణ కోసం వివిధ కులాలు, వర్గాలు, మత సమూహాలతో తమ పార్టీలకు సంబంధాలను బలపరిచే, సామాజిక పొత్తులను నిర్మించగల శక్తిసామర్థ్యాలున్న నేతలను దీనికి వినియోగిస్తున్నాయి. వీరికి ప్రజాకర్షక శక్తి లేకున్నా.. తెరవెనుక వ్యవహారాలను చక్కబెట్టగల నేర్పు ముఖ్యం. హోంమంత్రి అమిత్ షా బీజేపీకి గొప్ప సోషల్ ఇంజనీర్ అనేది గత సార్వత్రిక, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది. ప్రధాన్ నేతృత్వంలో బీజేపీ... ప్రస్తుతం అమిత్ షా కేంద్ర వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో యూపీ ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ బాధ్యతలను సమర్థ్ధుడైన ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ కట్టబెట్టింది. ప్రధాన సామాజికవర్గాల్లో ఏదైనా అసంతృప్తి ఉంటే దానిని వెంటనే గుర్తించి, వాటితో చర్చలు జరిపి, వారి ద్వారా అందే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పరిష్కారాలు చూపించే పనిని ప్రధాన్ బృందం సూక్ష్మస్థాయిలో చేస్తోంది. ముఖ్యంగా పూర్వాంచల్. తూర్పు యూపీలో బ్రాహ్మణ వర్గం బీజేపీకి దూరమవుతోంది. రాజ్‌పుత్‌లకు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్న కినుకతో వారు ఎస్పీలో చేరుతున్నారు. దీంతో యూపీలో 14 శాతం ఉన్న బ్రాహ్మణులు దూరం కాకుండా కమలదళం చర్యలు చేపట్టింది. లఖీంపూర్ ఖేరీ ఘటనలో బ్రాహ్మణ వర్గానికి చెందిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు ఉద్వాసన పలకాలని ఎంత గట్టిగా డిమాండ్లు వచ్చినా, ఆ వర్గానికి ఆగ్రహం కల్గించరాదన్న ఉద్దేశంతోనే ఆయనకు బీజేపీ కాపు కాస్తోంది. మరోవైపు రాజ్‌పుత్ ఓట్లు జారిపోకుండా కీలక నేతలందరితో ఎప్పటికప్పుడు మంతనాలు చేస్తోంది. ముఖ్యంగా రైతుల్లో ఎక్కువగా బీసీలు, ఎస్సీ వర్గాల వారే ఉండటంతో వారిని మచ్చిక చేసుకునేలా ఇప్పటికే రూ.35 వేల కోట్ల రుణాలను అందించగా, 2.21 కోట్ల మంది రైతులను ఫసల్ బీమా యోజనలో చేర్చింది. వీటన్నింటినీ బీజేపీ బృందాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వారిని ఆకర్షించే పనిలో పడ్డాయి. బ్రాహ్మణ వర్గాన్ని ఆకర్షిస్తున్న ఎస్పీ ఇక యూపీ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఎదుర్కోవాలని గట్టి పట్టుదలతో ఉన్న విపక్షాలు సైతం తమతమ సోషల్ ఇంజనీరింగ్‌కు పదునుపెట్టాయి. సమాజ్‌వాదీ పార్టీ కోసం అఖిలేశ్ యాదవ్ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాన్ని రచిస్తున్నారు. మహాన్ దళ్, సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ వంటి యాదవేతర కుల ఆధారిత పార్టీలతో పొత్తులు ఏర్పరచుకోవడం ద్వారా వివిధ సామాజిక వర్గాలను దగ్గర చేసుకునే యత్నాలకు దిగారు. ముఖ్యంగా బీజేపీ అనుబంధంగా ఉంటున్న బ్రాహ్మణులకు దగ్గరయ్యేలా ఆయన చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే బ్రాహ్మణ వర్గానికి చెందిన బీఎస్పీ మాజీ ఎంపీ రాకేశ్ పాండేని పార్టీలో చేర్చుకున్నారు. 2012 ఎన్నికల్లో ఎస్పీ 224 ఓట్లు సాధించడంలో ఓబీసీలు, ముస్లిం, వైశ్యులు కీలకంగా ఉన్నారు. 19 శాతంగా ఉన్న ముస్లింలకు 2017లో అధిక సీట్లు కేటాయించినా, కేవలం మూడో వంతు మాత్రమే ఎస్పీ నుంచి గెలిచారు. ఓట్ల చీలిక ఇక్కడ ప్రధాన భూమిక పోషించింది. ఈ దృష్ట్యా ముస్లింల ఓట్లు చీలకుండా కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న మాజీ ఎంపీ సలీమ్ షేర్వానీని ఇప్పటికే పార్టీలో చేర్చుకోగా, కొత్తగా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఇమ్రాన్ మసూద్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అఖిలేశ్ ఇటీవల నిర్వహించిన విజయ్ రథయాత్రకు ముస్లిం ఓటర్లు ఎక్కువగా హాజరయ్యేలా పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. ఇక పశ్చిమ యూపీలో జాట్ల మద్దతు కూడగట్టేందుకు ఆర్ఎల్డీతో ప్రాథమిక చర్చలు పూర్తి చేసింది. ఓబీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు ఆయన బీసీ కులగణన అంశానికి మద్దతిస్తున్నారు. రిజర్వ్డ్ స్థానాలతో పాటు ముస్లిం ఓట్లపై కన్నేసిన బీఎస్పీ ఇక మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ కోసం సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా రూపొందిస్తున్నారు. బ్రాహ్మణులతో సహా దళితేతర కులాల నుండి వీలైనంత ఎక్కువ మంది మద్దతు పొందే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ’బహుజన్ టు సర్వజన్’ అనే నినాదం ఆధారంగా ఆయన వ్యూహాలున్నాయి. గతంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో 86 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో బీఎస్పీ 60కి పైగా స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ఆ స్థానాల్లో పార్టీ నేత సతీశ్‌చంద్ర శర్ము రెండుసార్లు పర్యటించి వచ్చారు. ఇదే సమయంలో ముస్లిం ఓటర్లు గంపగుత్తగా ఎస్పీ వైపునకు వెళ్లకుండా 2012–17 మధ్య అఖిలేశ్ సీఎంగా ఉన్న సమయంలో 134 చోట్ల మతకల్లోల సంఘటనలు జరిగిన అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇదే అంశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ‘ఆడపిల్లను... పోరాడగలను’ యూపీలో కాంగ్రెస్ ప్రాబల్యం నానాటికీ తగ్గుతూ వస్తోందనేది అక్షరసత్యం. 2019లో కాంగ్రెస్ కంచుకోటగా భావించే అమేథిలో రాహుల్‌గాంధీ ఓడిపోయారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గౌరవప్రదమైన స్థానంలో నిలపడానికి ప్రియాంకా గాంధీ శ్రమిస్తున్నారు. స్వయం సహాయక బృందాలు, ఇతర మహిళా సంస్థలతో ఎక్కువగా టచ్‌లో ఉంటూ వారి మద్దతు కూడగట్టే యత్నాలు చేస్తున్నారు.‘లడ్కీ హూ..లడ్ సక్తీ హూ’ నినాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, మహిళలకు భద్రత కావాలి, మహిళలకు 40 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఎస్పీ లేదా బీజేపీ హామీ ఇవ్వగలవా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి జాట్లు అధికంగా ఉండే పశ్చిమ యూపీలో తన ప్రాబల్యాన్ని నిలుపుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్‌తో సంబంధాలు నెరుపుతున్నారు. ముస్లిం–జాట్ కాంబినేషన్ సైతం మంచి ఫలితాలిస్తాయని ఆశిస్తున్న జయంత్ చౌదరి ఎస్పీతో పరస్పర అంగీకారం దిశగా చర్చలు చేస్తున్నారు. -
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్; నాయకులు ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ శనివారం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాయి. ఎన్నికల షెడ్యూల్‌ను స్వాగతిస్తున్నట్టు పలువురు రాజకీయ నేతలు పేర్కొన్నారు. (ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఆన్లైన్లో నామినేషన్ వేసే అవకాశం) అధికారాన్ని నిలబెట్టుకుంటాం ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మార్చి 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అఖండ మెజారిటీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఇందులో ఎటువంటి సందేహాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ తేదీలతో యూపీలో భారీ మార్పు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. తాజాగా ప్రకటించిన ఎన్నికల తేదీలు యూపీలో భారీ మార్పును తీసుకురానున్నాయని పేర్కొన్నారు. ఈసీ విధించిన నిబంధనలను తమ పార్టీ పాటిస్తుందని స్పష్టం చేశారు. అధికార బీజేపీ ఈ మార్గదర్శకాలను అనుసరించేలా చూడాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. ప్రవర్తనా నియమావళికి కట్టుబడతాం ఉత్తరాఖండ్ ఎన్నికల తేదీల ప్రకటనను గతిస్తున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు, ప్రవర్తనా నియమావళికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. మీడియా ద్వారా ప్రచారం చేస్తాం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని పంజాబ్ మంత్రి రాజ్ కె వెర్కా పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కఠినమైన నిబంధనలను విధించాలని తాము కోరుకున్నామని ఆయన వెల్లడించారు. పంజాబ్ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోలింగ్ శాతం నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను సోషల్ మీడియా, టీవీ, ఇతర మీడియా ద్వారా ప్రచారం చేస్తామని చెప్పారు. మా కోసం పంజాబ్ ప్రజల ఎదురుచూపు పంజాబ్ ప్రజలు ఈసారి తమకు అధికారం కట్టబెడతారని శిరోమణి అకాలీదళ్‌అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ దీమా వ్యక్తం చేశారు. శాంతి, మత సామరస్యానికి కట్టుబడే బలమైన ప్రభుత్వం కోసం పంజాబీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రస్తుత పాలకులు పాలనను సర్కస్‌గా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనకు ప్రజలు ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఉచ్చులో పడొద్దు వర్చువల్, ఇంటింటి ప్రచారానికి సిద్ధమవుతున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా బీజేపీ ఓటు వేసినట్టేనని ఆయన అన్నారు. గోవా, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇది నిరూపితమయిందని.. ఇప్పుడు చండీగఢ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఉచ్చులో పడొద్దని పంజాబ్ ఓటర్లకు సిసోడియా విజ్ఞప్తి చేశారు. -
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
'అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ఉచిత్ విద్యుత్'
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గెలిస్తే గృహావసరాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని, వ్యవసాయానికి ఉచిత్ విద్యుత్‌ను సరఫరా చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. యూపీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అఖిలేశ్ శనివారం ట్విట్టర్లో ఈ మేరకు ప్రకటన చేశారు. యూపీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా గృహావసరాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామని 2021 సెప్టెంబరులోనే ప్రకటించింది. అధికారంలోకి వస్తే 38 లక్షల కుటుంబాలకు విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తామని, రోజుకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని కూడా హామీలు ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి– మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాలు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలోనూ ఆప్ ఇదే హామీ ఇచ్చింది. చదవండి: (హిజాబ్ ధరించారని క్లాస్‌లోకి రానివ్వలేదు) -
ఆ మూడు అంశాల చుట్టూనే యూపీ ఎన్నికల రాజకీయం
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ప్రచార హోరులో అయోధ్య రామమందిర నిర్మాణం, వారణాసి కాశీ విశ్వనాధ ఆలయ అభివృధ్ధితో పాటు కొత్తగా మథురలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం కీలక అంశంగా మారింది. పురాతన ఘాట్లు, ఐకానిక్ దేవాలయాలు, శ్రీకృష్ణుని యొక్క అనేక కథలు, విభిన్న సంస్కృతులతో మేళవించి యమునా నది ఒడ్డున ఉన్న మథుర, బృందావనాల్లో ఆలయ నిర్మాణాలే తమ తదుపరి అజెండా అని కేంద్ర, రాష్ట్రాల్లోని అధికార భారతీయ జనతా పార్టీ ప్రచారం మొదలు పెట్టడంతో దీని చుట్టూ యూపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఓ అడుగు ముందుకేసిన స్థానిక లోక్‌సభ ఎంపీ, సినీ నటి హేమమాలిని మథుర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనా«థ్‌ను కోరడం, పశ్చిమ యూపీలోని ఈ ప్రాంతంలో తమ ప్రాబల్యాన్ని నిలుపుకునేందుకు బీజేపీ గట్టిగానే పోరాడుతుండటంతో శ్రీకృష్ణుడి ఆలయం చుట్టూతే ఇక్కడి రాజకీయం ప్రదక్షిణలు చేస్తోంది. ఇప్పటికే మథురలో రాజుకున్న చిచ్చు అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, కొన్ని సంస్థలు మథుర భూవివాద అంశాన్ని లేవనెత్తాయి. గత ఏడాది సెప్టెంబర్ 25న స్థానిక మథుర కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఇందులో శ్రీకృష్ణ జన్మ స్థలానికి 10.9 ఎకరాలు, పక్కనే ఉన్న 2.5 ఎకరాలు షాహీ ఈద్గా మసీదుకు చెందేటట్లుగా 1968లో ఒప్పందాలు జరిగాయని, అయితే వాటిని రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ భూమిలో ఈద్గాను నిర్మించాడని పిటిష¯న్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగానే ఇటీవల అఖిల భారత హిందూ మహాసభ మథురలోని షాహీ ఈద్గా మసీదులో పాదయాత్ర నిర్వహించి, శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో అక్కడ ప్రభుత్వం భద్రతను పెంచడంతో పాటు 144 సెక్షన్ విధించింది. అనంతరం కొద్ది రోజులకే యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అయోధ్య, కాశీ మందిరాల తర్వాత తమ తదుపరి నిర్మాణం మథురలోనే అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు సైతం రాజకీయ వేడిని సృష్టించాయి. అనంతరం ఎంపీ హేమమాలిని మథురలో శ్రీకృష్ణుని ఆలయాన్ని నిర్మించాలని కోరడంతో ఈ వేడి కొనసాగుతూనే ఉంది. యోగి తాజా వ్యాఖ్యలతో మరింత హీట్.. ప్రస్తుత ఎన్నికల సీజన్లో తొలిసారి మథుర ఆలయనిర్మాణంపై యోగి ఆదిత్యనా«థ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలోని అమ్రోహాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన యోగి, ‘అయోధ్య, వారణాసిల మాదిరిగానే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మథుర, బృందావన్ నగరాలకు దేవాలయం వస్తుంది. దానికి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి’అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ‘అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చాం. మోదీ ఆ పని ప్రారంభించారు. ఇక కాశీలో శివుని గొప్ప నివాసం రాబోతోంది. అలాంటప్పుడు మథుర, బృందావనం ఎలా మిగిలిపోతాయి?’అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం తమ తదపరి అజెండా అని చెప్పకనే చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అప్పుడే రాజకీయ దుమారం రాజుకుంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఏఐఎంఎంఐలు స్పందించాయి. మళ్లీ మతపరమైన ఎజెండాతో బీజేపీ ఓట్లు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని, ప్రజలకు పెనుభారంగా మారిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గింపుపై మాట్లాడటం మానేసి, మతపర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని ప్రశ్నించాయి. మథురకు ఎందుకంత ప్రాధాన్యత? ప్రస్తుత ఎన్నికల్లో మథుర ఆలయ నిర్మాణం తెరపైకి తేవడానికి రాజకీయ ప్రాధాన్యం చాలా ఉంది. మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు పశ్చిమ యూపీలో 76 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో మథుర ఒకటి. 2017 ఎన్నికల్లో 76 స్థానాలకు బీజేపీ 66 స్థానాలు గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 4, బీఎస్పీ 3, కాంగ్రెస్ రెండు, రాష్ట్రీయ్ లోక్ దళ్ ఒకచోట నెగ్గాయి. ఇటీవలి రైతు చట్టాల నేపథ్యంలో పశ్చిమ యూపీలో బీజేపీ వ్యతిరేకత పెరిగింది. చట్టాలను బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పటికీ ఓ వర్గంలో ఆవేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ తిరిగి తమ ప్రాభల్యాన్ని నిలబెట్టుక్కోవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ మథుర ఆలయ అంశాన్ని తెరపైకి తెచ్చింది. యోగి ఆదిత్యనా«థ్‌ను మథుర నుంచి పోటీ చేయాలని డిమాండ్లు పెట్టించడం ద్వారా ప్రజల్లో మరింత ఆసక్తిని పెంచారు. ఇప్పటికే కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మథురలో పర్యటించిన యోగి, కృష్ణ జన్మస్థాన్ పరిసర ప్రాంతాన్ని మాంసం, మద్యం అమ్మకాలను నిషేధించే పవిత్ర స్థలంగా ప్రకటించారు. ఈ ప్రకటన మంచి స్పందన రావడంతో ఆయన ఆలయ నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
నిర్ణీత సమయానికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
-
షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: ఎలక్షన్ కమిషన్
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఎన్నికల కమిటీ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ప్రకటించింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని అన్ని పార్టీలు కోరుకున్నట్లు ఈసీ వెల్లడించింది. అయితే పోలింగ్ సమయంలో ఓటర్లు భౌతిక దూరం పాటించేలా బూత్‌ల సంఖ్య పెంచనున్నట్లు తెలిపింది. కాగా, దేశంలో విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల వాయిదా విషయాన్ని పరిశీలించమని అలహాబాద్ హైకోర్టు ఎన్నికల కమీషన్‌కు సూచించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికల కమీషనర్లు సమీక్ష జరపగా అన్ని పార్టీలు ఎన్నికలకు వెళ్లడానికే మొగ్గుచూపాయి. చదవండి: (కరెంట్ షాక్‌తో నలుగురు కాలేజీ ఉద్యోగుల దుర్మరణం) -
యూపీలో పొత్తు పొడుపులు: దీదీకి ఆహ్వానం.. ప్రియాంకకు మొండిచేయి
లక్నో: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు పొత్తు రాజకీయాలు కూడా ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఎస్పీలతో పొత్తు ఉండదని ముందే ప్రకటించిన సమాజ్‌వాది పార్టీ అధ్యక్షడు అఖిలేష్ యాదవ్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్వర్యంలో ఏర్పడబోయే రాజకీయ కూటమిలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి కోసం అఖిలేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. (చదవండి: యూపీలో ‘పొత్తు’ పొడుపులు!) ఝాన్సీలో నిర్వహించిన యాత్రలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘దీదీకి సాదర స్వాగతం పలుకుతున్నాను. బెంగాల్లో ఆమె ఏవిధంగా బీజేపీని తుడిచిపెట్టిందో.. అలానే యూపీ ప్రజలు ఇక్కడ బీజేపీని తుడిచి పెట్టాలి’’ అని పిలుపునిచ్చారు. మమతతో జట్టు కట్టడం గురించి ప్రశ్నించగా.. సరైన సమయంలో దాని గురించి మాట్లాడతాను అన్నారు. (చదవండి: ఎస్పీ, ఆర్ఎల్డీ సీట్ల చర్చ) అలానే కాంగ్రెస్‌పార్టీపై ఘాటు విమర్శలు చేశారు అఖిలేష్ యాదవ్. ముఖ్యంగా ప్రియాంక గాంధీ చేస్తోన్న విమర్శల్ని ఈ వేదిక మీదుగా తిప్పి కొట్టారు. ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ.. ‘‘జనాలు వారిని(కాంగ్రెస్ పార్టీ) తిరస్కరించారు. వచ్చే ఎన్నికల్లో వారు సున్నా సీట్లు సాధిస్తారు’’ అని ఎద్దేవా చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేశాయి. అయితే ఇరువురికి ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అఖిలేష్ ‘ఇంద్రధనస్సు’ కూటమిని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. అనగా కాంగ్రెస్, బీఎస్పీ మినహా మిగతా అన్ని పార్టీలతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాక అఖిలేష్, దీదీతో జట్టు కట్టి.. దేశ రాజకీయాల్లో నుంచి కాంగ్రెస్‌ను పూర్తిగా తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ, ఎస్పీ ఒకరికొకరు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: యూపీ పీఠం మళ్లీ బీజేపీదే -
ఎస్పీ, ఆర్ఎల్డీ సీట్ల చర్చ
లక్నో: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) పొత్తు కుదుర్చుకున్నాయి. సీట్ల పంపకాలపై చర్చించేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరీలు మంగళవారం లక్నోలో భేటీ అయ్యా రు. భేటీ తర్వాత ‘మంతనాలు ముగిశాయి’ అనే శీర్షికతో జయంత్ ఒక ట్వీట్ చేశారు. అఖిలేశ్‌ను కలిసినప్పటి ఫొటోను ట్వీట్‌కు జతచేశారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఇంకా ఖరారుకాలేదు. -
యూపీ పీఠానికి ఎక్స్‌ప్రెస్‌వే ఇదేనా?
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలలు గడువు ఉందనగా 341 కి.మీ. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేని ప్రారంభించిన ప్రధాని మోదీ ఎన్నికల సమరశంఖం పూరించారు. తూర్పు యూపీలోని లక్నో, బారాబంకి, అమేథి, అయోధ్య, సుల్తాన్పూర్, అంబేద్కర్ నగర్, అజమ్గఢ్, మావూ, ఘాజీపూర్ జిల్లాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతాన్నే రాష్ట్రానికే ఆర్థికంగా అండదండ ఉండేలా మార్చడానికి వ్యూహరచన చేసిన బీజేపీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని ప్రారంభించింది. ఎన్నికలు ముంచుకొస్తూ ఉండడంతో ఇంకా సదుపాయాలు పూర్తిగా కల్పించకుండా ఆగమేఘాల మీద ప్రారంభోత్సవం నిర్వహించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలోని ఎనిమిది ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడర్ల నిర్మాణానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిద్ధమయ్యారు. రైతుల ఆందోళనలకు అభివృద్ధితో చెక్..! యూపీలో 403 స్థానాలకు గాను పూర్వాంచల్ ప్రాంతంలో 160 స్థానాలున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రతిపక్ష ఎస్పీ, బీఎస్పీలకే ఒకప్పుడు పట్టు ఉంది. 2017 ఎన్నికల్లో మోదీ మ్యాజిక్‌తో బీజేపీ ఈ ప్రాంతంలో మెజార్టీ సీట్లు సాధించి విపక్షాలకు చెక్ పెట్టింది. అజమ్గఢ్, అంబేద్కర్ నగర్లో ఎస్పీ, బీఎస్పీల ధాటికి నిలవలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో తన పట్టు కొనసాగించడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. ‘వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో రైతుల ఆందోళన, ఎస్పీతో రాష్ట్రీయ లోక్‌దళ్ జత కట్టడం వల్ల పశ్చిమ యూపీలో ఆశించిన స్థాయిలో సీట్లు రావనే భయం బీజేపీలో ఉంది. తూర్పున ఎవరి గాలి వీస్తే వారికే ఈ సారి యూపీ పీఠం దక్కే అవకాశం ఉంది. అందుకే బీజేపీ ఈ ప్రాంతంపైనే అత్యధికంగా దృష్టి సారించింది’ అని రాజకీయ విశ్లేషకుటు ఎస్.కె శ్రీవాస్తవ అన్నారు. ఈ ప్రాంతంలో అజంగఢ్, అంబేద్కర్ నగర్, ఘజియాపూర్, మావూ, సుల్తాన్పూర్ జిల్లాల్లో తమ పార్టీ బలహీనపడిందని బీజేపీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు అజంగఢ్‌లో యూనివర్సిటీ, ఖుషీనగర్లో విమానాశ్రయం, సిద్ధార్థ్నగర్లో మెడికల్ కాలేజీ , గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్, వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎక్స్‌ప్రెస్ వే ప్రత్యేకతలు ► లక్నో– సుల్తాన్పూర్ హైవే మీదనున్న చాంద్‌సరాయ్ గ్రామం నుంచి ఈ హైవే మొదలవుతుంది. మొత్తం 341 కి.మీ. దూరం ఉన్న ఈ హైవే ఘజియాపూర్ జిల్లా హల్దారియా వరకు కొనసాగుతుంది. ► లక్నో, బారాబంకి, అమేథి, అయోధ్య, సుల్తాన్పూర్, అంబేద్కర్ నగర్, ఆజమ్గఢ్, మావూ, ఘాజీపూర్ జిల్లాల మీదుగా సాగుతుంది. ► దీని నిర్మాణానికి 2018 జులైలో ఆజంగఢ్ వద్ద మోదీ శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి రూ.22,500 కోట్లు ఖర్చు అయింది ► ఆరు లేన్లతో నిర్మించిన దీనిని ఎనిమిది లేన్లకు విస్తరించుకునే అవకాశం ఉంది. ► ఈ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి రాకపోకలు సాగిస్తే లక్నో నుంచి ఘజియాపూర్‌కు పట్టే ప్రయాణం ఆరు గంటల నుంచి 3.5 గంటలకు తగ్గిపోతుంది. ► ప్రతీ వంద కిలోమీటర్లకి ప్రయాణికులు సేదతీరడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్‌లు, టాయిలెట్ సదుపాయాలు, మోటార్ గ్యారేజ్‌లు ఏర్పాటు చేస్తారు. ► దేశ అత్యవసర పరిస్థితుల్లో వాయుసేనకు చెందిన యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ కోసం సుల్తాన్పూర్ జిల్లా కుదేబహార్‌లో 3 కి.మీ.ల పొడవైన రన్ వే నిర్మించారు ► 18 ఫ్లై ఓవర్లు, ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, ఏడు పొడవైన వంతెనలు , 104 చిన్న వంతెనలు, 13 చోట్ల ఇంటర్‌ఛేంజ్ మార్గాలు ఉన్నాయి. ఇక హైవేపై రోడ్డుకు ఇరువైపులా ప్రయాణించడానికి వీలుగా 271 అండర్‌పాసెస్ ఉన్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
యూపీ పీఠం మళ్లీ బీజేపీదే
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే మళ్లీ గెలుస్తుందని ఏబీపీ–సీ ఓటర్ తాజా సర్వేలో వెల్లడైంది. అయితే సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ బలపడడం వల్ల గత ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లలో 100 స్థానాలు పైగా బీజేపీ కోల్పోతుందని అంచనా వేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలపై ఓటరు నాడిని సి–ఓటర్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుందని, చివరికి ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదని సర్వేలో తేలింది. అయిదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ స్థానాల్లో 1,07,190 మందిని ఏబీపీ–సీ ఓటర్ ప్రశ్నించింది. యూపీలో బీజేపీ, దాని మిత్రపక్షాలు విజయం సాధిస్తాయని అయితే ఈ సారి బీజేపీ 108 స్థానాలను కోల్పోయి 217 స్థానాలకే పరిమితమవుతుందని సర్వే అంచనాకి వచ్చింది. సమాజ్‌వాది పార్టీకి 156, బీఎస్పీకి 18, కాంగ్రెస్‌కి 8 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, ఆప్‌కి 51 స్థానాలు, కాంగ్రెస్‌కి 46 స్థానాలు వస్తే, శిరోమణి అకాలీదళ్ 20 స్థానాలను గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. ఇక ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ బాగా పుంజుకుంటుందని, బీజేపీ స్వల్ప ఆధిక్యంతో నెగ్గుతుందని సీ–ఓటర్ సర్వే తెలిపింది. బీజేపీకి 38 స్థానాలు, కాంగ్రెస్‌కి 32 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. 40 స్థానాలున్న గోవాలో 21 స్థానాలతో బీజేపీ బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కుతుందని వెల్లడైంది. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో బీజేపీ 25–29 స్థానాలు..కాంగ్రెస్‌కు 20–24, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కి 4–8, ఇతరులకి 3–7 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. -
సమాజ్‌వాదీ పార్టీలోకి ఏడుగురు ఎమ్మెల్యేలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ అధికార బీజేపీతోపాటు బహుజన సమాజ్ పార్టీకి(బీఎస్పీ) చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరారు. బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యే, బీఎస్పీ నుంచి ఆరుగురు బహిష్కృత ఎమ్మెల్యేలు శనివారం మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాదీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ బీజేపీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలూ ఒక్కటేనని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రాథోడ్ తమ పార్టీలో చేరారని, మరికొందరు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పారు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరని ఎద్దేవా చేశారు. బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలు అస్లాం రైనీ, సుష్మా పటేల్, అస్లాం అలీ, హకీంలాల్ బింద్, ముజ్తబా సిద్దిఖీ, హరగోవింద్ భార్గవ ఎస్పీలో చేరారు. -
కేంద్రంలో మోదీ.. యూపీలో యోగి
సాక్షి, న్యూఢిల్లీ: 2024లో కేంద్రంలో నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రిగా చేయాలంటే.. 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ గెలిపించి, యోగి ఆదిత్యనాథ్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన యూపీ రాజధాని లక్నోలో పర్యటించారు. ‘మేరా పరివార్–బీజేపీ పరివార్’ పేరిట సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా మార్చేందుకు మరో ఐదేళ్లు బీజేపీ అధికారంలో ఉండడం అవసరమని చెప్పారు. రాష్ట్రంలో మాఫియాను తరిమికొట్టే అతిపెద్ద పనిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేశారని ప్రశంసించారు. 1.43 లక్షల మందికి పైగా పోలీసు సిబ్బంది నియామకంలో ఎక్కడా ఎలాంటి అవినీతి జరగలేదని గుర్తుచేశారు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తి, వరదల సమయంలో అఖిలేష్ యాదవ్, రాహుల్‌గాంధీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు. యూపీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 300 సీట్లకు పైగా గెలుచుకోవాలని బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 1.5 కోట్ల నూతన కార్యకర్తలే లక్ష్యం: యోగి ఏక్ భారత్, శ్రేష్ట భారత్ కలను ప్రధాని మోదీ సాకారం చేశారని సీఎం యోగి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశంలో కొత్త చైతన్యం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు 1.5 కోట్ల మంది కొత్త కార్యకర్తలను తయారు చేసుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా నేతృత్వంలో అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరుగుతుండడంపై ప్రజలంతా గర్వపడుతున్నారని తెలిపారు. -
యూపీలో కాంగ్రెస్ ప్రతిజ్ఞా యాత్రలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు, బలమైన శక్తిగా ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాలకు పదునుపెడుతోంది. పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరగబోయే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిజ్ఞా యాత్రల పేరుతో శనివారం నుంచి ప్రజల్లోకి వెళ్లనుంది. మొదటి దశలో జరిగే మూడు ప్రతిజ్ఞా యాత్రలు వారణాసి, బారాబంకీ, శహరాన్‌పూర్ నుంచి ప్రారంభమవుతాయి. శనివారం బారాబంకీలో బహిరంగ సభ తర్వాత ప్రియాంక గాంధీ ప్రతిజ్ఞా యాత్రలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ యాత్రలు నవంబర్ 1న ముగుస్తాయి. నాలుగో యాత్ర దీపావళి తర్వాత ప్రారంభం కానుందని కాంగ్రెస్ నేత పీఎల్ పునియా తెలిపారు. ఈ యాత్రల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇవ్వనున్న హామీలను ప్రియాంక ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు తాము 40 శాతం టిక్కెట్లు ఇస్తానని ప్రియాంక ఇప్పటికే మొదటి హామీని ప్రకటించారు. 31న గోరఖ్‌పూర్‌లో భారీ ర్యాలీ నవరాత్రుల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో భారీ ర్యాలీ నిర్వహించిన ప్రియాంకా గాంధీ ఇప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా అక్టోబర్ 31న గోరఖ్‌పూర్‌లో రెండు లక్షల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. మహిళా శక్తితో ఉత్తరప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాలనుకుంటున్న ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకున్నారు. యూపీలోని పూర్వాంచల్‌లో 125 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందుకే ఈ ప్రాంతంపై ప్రియాంకా గాంధీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. -
సిట్టింగ్‌లకు నో ఛాన్స్.. సుమారు 150 మందికి అవకాశం లేదు !
సాక్షి, న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు, వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను కమలదళం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులోభాగంగా క్షేత్రస్థాయి నుంచి తీసుకున్న అభిప్రాయాలు, నివేదికల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు చేయాలని బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అసెంబ్లీ ఎన్నికలకు టిక్కెట్ల పంపిణీ కోసం ఒక ఫార్ములాను రూపొందించింది.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలతో సహా సుమారు 150 మంది అభ్యర్థులకు ఈసారి టికెట్ ఇవ్వకుండా ఉండేందుకు పార్టీ సిద్ధమవుతోంది. వీరిలో 2017 ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులు ఉండనున్నారు. టార్గెట్ 350– క్షేత్రస్థాయిలో సర్వేలు.. వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటు బ్యాంకుతో 403 స్థానాలున్న అసెంబ్లీలో కనీసం 350 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు వడపోత ద్వారా దశలవారీగా అభ్యర్థుల ఎంపిక చేయాలని నిర్ణయించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎంతో కీలకమైన ఉత్తర్ప్రదేశ్పై తమ పట్టు నిలబెట్టుకోవడం వల్ల రాబోయే రెండు, మూడేళ్ళలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమ ప్రభావాన్ని కొనసాగించొచ్చని కమలదళం యోచిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక సర్వే నిర్వహిస్తున్నారు. అంతేగాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం వివిధ ఏజెన్సీల ద్వారా సర్వేలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: (బీజేపీని ముక్కలు–ముక్కలు చేస్తాను) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి గుడ్‌బై.. అంతేగాక పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, గత నాలుగున్నరేళ్ళుగా పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యకలాపాల్లో ఏమాత్రం చురుగ్గాలేని ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం ఇవ్వరాదని నిర్ణయించారు. అదే సమయంలో గత నాలుగున్నరేళ్ళలో తమ అనవసర, వివాదాస్పద ప్రకటనలు, వ్యాఖ్యలతో పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఏర్పరిచిన ఎమ్మెల్యేలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించారు. వీరితో పాటు వయసురీత్యా 70 ఏళ్లు దాటిన, వివిధ రకాల తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న ఎమ్మెల్యేలకు సైతం టికెట్లు ఇవ్వరాదని పార్టీ అధిష్టానం ఒక ఫార్ములా రూపొందించింది. ముఖ్యంగా స్థానిక ప్రజలు, కార్యకర్తలు, పార్టీ కార్యవర్గ సభ్యులు కోపంగా ఉన్న ఎమ్మెల్యేలకు బదులుగా, పార్టీలో నిబద్ధతగా పనిచేస్తున్న ఇతర నాయకులు, కొత్తవారికి అవకాశం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. దీంతోపాటు వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మె ల్యేలకు, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోయిన అభ్యర్థులకు మరోసారి అవకాశం ఇవ్వరాదని పార్టీ పెద్దలు విశ్వసిస్తున్నారు. చదవండి: (అన్న ఐపీఎస్, తమ్ముడు ఐఏఎస్) ఒక్కో సీటుకి ఇద్దరు లేదా ముగ్గురితో ప్యానెల్.. అంతేగాక అభ్యర్థుల ఎంపిక కోసం జిల్లా అధ్యక్షులు వారి పరిధిలోని సీట్లలో ఒక్కొక్క స్థానానికి మూడు పేర్ల చొప్పున ప్యానెల్‌ను, ప్రాంతీయ బృందాల నుంచి మరో మూడు పేర్ల ప్యానెల్‌ను తీసుకుంటారు. వీటిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ రాధా మోహన్ సింగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, డాక్టర్ దినేష్ శర్మ, పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ కమిటీ ప్రాంతాలు, జిల్లాల నుంచి వచ్చిన ప్యానెల్లను పరిశీలించి మూడు పేర్లతో ఉన్న ఒక ప్యానెల్‌ను సిద్ధం చేస్తుంది. ఈ కమిటీ తరపున, ప్రతి అసెంబ్లీ స్థానానికి సంబంధించి ప్రాధాన్యత క్రమంలో రెండు నుంచి మూడు పేర్లతో ఉన్న ప్యానెల్‌ను తయారుచేసి పార్టీ పార్లమెంటరీ బోర్డుకు పంపిస్తారు. అయితే పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆర్ఎస్ఎస్ అభిప్రాయం కూడా కీలకంగా మారనుంది. సంఘ్ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలే, సహ సర్కార్యవాహ కృష్ణగోపాల్లు గత కొంతకాలంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంతో పాటు, 2022 అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నారు. -
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా యూపీ మంత్రివర్గ విస్తరణ
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఆదివారం మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఏడుగురిని కేబినెట్లో చేర్చుకున్నారు. వీరిలో ఒకరు బ్రాహ్మణ నాయకుడు కాగా, ముగ్గురు ఓబీసీ, ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ నాయకుడు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన బ్రాహ్మణ నేత జితిన్ ప్రసాదకు ఊహించినట్లుగానే కేబినెట్లో స్థానం దక్కింది. ఓబీసీ వర్గానికి చెందిన ఛత్రపాల్ గంగ్వార్ (ఎమ్మెల్యే), ధరంవీర్ ప్రజాపతి(ఎమ్మెల్సీ), డాక్టర్ సంగీతా బల్వంత్ బిండ్(ఎమ్మెల్యే), ఎస్సీ సామాజిక వర్గం నుంచి దినేష్ ఖతీక్(ఎమ్మెల్యే), పల్తూరామ్(ఎమ్మెల్యే), ఎస్టీ సామాజిక వర్గం నుంచి సంజీవ్ కుమార్(ఎమ్మెల్యే) మంత్రులయ్యారు. చదవండి: (యూపీ బరిలో ఒవైసీ అలజడి) బ్రాహ్మణుల్లో అసంతృప్తిని చల్లార్చడానికేనా! ఉత్తరప్రదేశ్ ఓటర్లలో బ్రాహ్మణులు 13 శాతం ఉన్నారు. రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుదారులైన బ్రాహ్మణులు క్రమంగా బీజేపీ వైపు చేరిపోయారు. ఠాకూర్ సామాజికవర్గం నాయకుడైన సీఎం యోగి పట్ల వారిలో అసంతృప్తి రగులుతోంది. యోగి ప్రభుత్వంలో తమను అణచివేస్తున్నారన్న భావన బ్రాహ్మణుల్లో పెరిగిపోతోంది. పరిస్థితిని గమనించిన బీజేపీ అధిష్టానం బ్రాహ్మణ వర్గాన్ని మంచి చేసుకొనే ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ బ్రాహ్మణ నాయకుడు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న జితిన్ ప్రసాదపై వల విసిరింది. తమ పార్టీలోకి వస్తే సముచిత గౌరవం కల్పిస్తామని హమీ ఇచ్చింది. దీంతో ఆయన ఈ ఏడాది జూన్‌లో బీజేపీలో చేరారు. అనుకున్నట్లుగానే మంత్రి పదవిని కట్టబెట్టింది. తద్వారా బ్రాహ్మణుల ఓట్లను గంపగుత్తగా బీజేపీ వైపు మళ్లించే బాధ్యతను ఆయనపై మోపింది. చదవండి: (Punjab: 15 మందితో నూతన మంత్రి వర్గం) -
యూపీ బరిలో ఒవైసీ అలజడి
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల అసెంబ్లీ కదనరంగంలోకి తొలిసారిగా దిగుతున్న అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం పలు పారీ్టలకు సవాల్ విసురుతోంది. రాష్ట్రంలో ముస్లిం నాయకత్వం లేదని, దాని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమంటూ ఎన్నికల బరిలో దిగిన హైదరాబాద్ ఎంపీ ఒవైసీ ఎంత మేరకు ప్రభావం చూపిస్తారన్న చర్చ మొదలైంది. మజ్లిస్ పోటీ ఇన్నాళ్లూ మైనార్టీ ఓటు బ్యాంకుని నమ్ముకున్న పార్టీల్లో ఆందోళన రేపుతోంది. రాష్ట్ర జనాభాలో 19 శాతం మంది ముస్లింలు ఉన్నప్పటికీ సరైన నాయకులు లేని కొరత వారిని వెంటాడుతూనే ఉంది. యాదవులు, రాజ్బహర్లు, నిషాద్‌లు, జాటవులు వంటి తక్కువ జనాభా ఉన్న కులాలకు కూడా ఎంతో కొంత పేరు పొందిన నేతలు ఉన్నారు. ముస్లింలో ఆ నాయకత్వ లేమి సమస్యనే ఒవైసీ ఎన్నికల అస్త్రంగా చేసుకున్నారు. సమాజ్‌వాది (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాల్లో నలిగిపోతున్న ముస్లింలను సంఘటితం చేసి నాయకుల్ని తయారు చేస్తానన్న ఒవైసీ మాటలు ఆ పారీ్టల గుండెల్లో తూటాలై పేలుతున్నాయి. 403 లోక్‌సభ స్థానాలున్న యూపీలో 82 స్థానాల్లో ముస్లింలు గెలుపోటముల్ని నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. గత ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో అయిదు సీట్లు దక్కించుకొని ఆర్జేడీ, కాంగ్రెస్ ఓట్లను ఎంఐఎం భారీగా చీలి్చంది. ఆ విజయం ఇచి్చన ధీమాతో యూపీలో 100 సీట్లలో భాగదారి మోర్చా కూటమితో చేతులు కలిపి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ముస్లింల అభ్యున్నతి కోసం సమర్థులైన నాయకుల్ని ఎదగనివ్వడమే తమ లక్ష్యమని ఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ అసిమ్ వకార్ వెల్లడించారు. ఇన్నాళ్లూ ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచి్చన పారీ్టలేవీ ఆ వర్గానికి చెందిన నాయకుల్ని ఎదగనివ్వలేదని, సచార్ కమిటీ నివేదిక కూడా అదే చెబుతోందని ఆయన విమర్శించారు. మరోవైపు ఎస్పీ, బీఎస్పీలు ఒవైసీ అధికార బీజేపీ చెప్పినట్టుగా ఆడుతున్నారని, ఓట్లు చీల్చడానికి యూపీలో పోటీకి వచ్చారని ఆరోపిస్తున్నాయి. ఎస్పీ విజయావకాశాలను గండి కొట్టడానికే బీజేపీ అడుగులకి మడుగులొత్తుతూ ఒవైసీ నడుచుకుంటున్నారని సీనియర్ ఎస్పీ నేత అబూ అజ్మీ ఆరోపించారు. సత్తా చాటగలరా? అయోధ్యలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఒవైసీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. ఒవైసీ తాను అనుకున్నది సాధిస్తారా లేదా అన్నదానిపై రాజకీయ పరిశీలకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిహార్‌లో గెలిచినంత సులభంగా యూపీ రాజకీయాల్లో ఒవైసీ నెగ్గలేరని, కానీ ఓట్లు భారీగా చీల్చి విజయావకాశాలను తారుమారు చేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎస్పీ, బీఎస్పీ వంటి పారీ్టలు ముస్లిం ఓట్లతో నెగ్గినా వారి సమస్యలపై ఎప్పుడూ మౌనం వహిస్తున్నాయని, అందుకే ఒవైసీ ప్రభావం ఉంటుందని మరికొందరు అంటున్నారు. ‘‘ముస్లింలకు నాయకత్వం లేకపోతే వారిపై అరాచకాలు కొనసాగుతాయన్న భావన వారిలో మొదలైంది. ఎన్నికల నాటికి ఇది బలోపేతమై ఒవైసీకి కలిసొస్తుంది’’ అని రాజకీయ విశ్లేషకుడు పర్వేజ్ అహ్మద్ అన్నారు. యూపీలో ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముస్లింలలో నాయకత్వం అంశంపై చర్చ జరుగుతూనే ఉంటుందని... అయినప్పటికీ వారు దానిని పెద్దగా పట్టించుకోకుండా ఎస్పీ, బీఎస్పీకి ఓటు వేస్తూ వచ్చారని ఎన్నికల విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ అన్నారు. ► జనాభాలో ముస్లింల శాతం: 19.26% ► నిర్ణయాత్మక పాత్ర పోషించే స్థానాలు: 82 ► రామ్‌పూర్‌లో ముస్లిం జనాభా: 50.57% ► మొరాదాబాద్: 47.12% n బిజ్నార్: 43.04% n ► n ముజఫర్‌నగర్: 41.3% n అమ్రోహ్: 40.78% ► బలరామ్‌పూర్, అజమ్గఢ్, బరేలి, మీరట్, బహ్రెయిచ్, గోండా, శ్రావస్తిలలో: 30%పైగా -
గెలిస్తే ఉచితంగా 300 యూనిట్ల కరెంట్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్ గృహ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. గురువారం లక్నోలో ఆప్ యూపీ ఇన్‌ఛార్జి సంజయ్ సింగ్‌తో కలిసి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడారు. బీజేపీ హయాంలో గృహ అవసరాల నిమిత్తం 300 యూనిట్ల విద్యుత్తుకు రూ.1,900 చెల్లిస్తున్నారని అదే ఆప్ ప్రభుత్వం వస్తే ఏమీ చెల్లించనవసరం లేదని స్పష్టం చేశారు. యూపీలో గెలిస్తే అధిక కరెంట్ బిల్లులతో సతమతమవుతోన్న 48 లక్షల కుటుంబాల విద్యుత్ బిల్లులను రద్దుచేస్తామన్నారు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తామని, పాత బకాయిలు మాఫీ చేస్తామని సిసోడియా పేర్కొన్నారు. ఇదే తరహా హామీని ఇప్పటికే ఆప్ పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లోనూ ఇచ్చింది. యూపీలోని మొత్తం 403 స్థానాల్లో పోటీకి దిగుతామని ఆప్ గతంలోనే స్పష్టంచేసింది. ఢిల్లీలో విజయవంతం అయిన విద్యుత్తు ఫార్మూలాను 2017లో పంజాబ్ ఎన్నికల్లో ప్రయోగించి అత్యధిక స్థానాలు పొందిన రెండో పార్టీగా ఆప్ నిలిచింది. ఈ సారి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లోనూ తమదైన ముద్ర వేయాలని ఏడాది నుంచే పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నెల మొదటి వారంలో వివిధ సర్వేలు పంజాబ్‌లో ఆప్ గణనీయమైన పురోగతి సాధిస్తుందని పేర్కొనడంతో పార్టీని పక్క రాష్ట్రాలకు విస్తరించడానికి సరైన తరుణమని కేజ్రీవాల్ భావించారు. ఉత్తరప్రదేశ్‌లాంటి పెద్ద రాష్ట్రంలో పార్టీని ప్రజల్లోకి తీసుకురావాలంటే ఛరిష్మా ఉన్న అగ్రనేత తప్పనిసరి. ఇటు అధికార బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ పునాదులు బలంగా ఉండడంతో ఢిల్లీ విద్యుత్ ఫార్మూలానే యూపీలోనే ప్రయోగించాలని ఆప్ విశ్వసిస్తోంది. కరోనా నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం మంది ఆదాయం పడిపోయిందని ఓ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా తరలివెళ్లిన వలస కార్మికులు కరోనా వల్ల తిరిగి రావడమూ ఓ కారణమని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యుత్తు ఫార్మూలా యూపీలో ప్రభావం చూపుతుందని ఆప్ భావిస్తోంది. -
పాక్ ప్రేరేపిత ఉగ్ర కుట్ర భగ్నం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద కుట్రను ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ భగ్నం చేసింది. పాక్– ఐఎస్ఐ వద్ద శిక్షణ పొందిన ఇద్దరు టెర్రరిస్టులతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలను లక్ష్యంగా చేసుకొని దేశవ్యాప్తంగా పలు పేలుళ్లకు వీరు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో జాన్ మహ్మద్ షేక్ అలియాస్ సమీర్, ఒసామా, మూల్‌చంద్, జేషన్ ఖమర్, మహ్మద్ అబూ బకర్, మొహ్మద్ అమీర్ జావెద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒసామా, ఖమర్‌లు ఐఎస్ఐ వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ, యూపీల్లో ఐఈడీ(పేలుడు పదార్థం) ఉంచేందుకు సరైన ప్రదేశాలను వెతకడానికి వీరిని నియమించినట్లు తెలిపారు. వీరి అరెస్టుతో పాక్– ఐఎస్ఐ– ఉగ్రవాదుల సంబంధం బయటపడిందని, అండర్‌వరల్డ్ సహకారంతో ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో పలు పేలుళ్లు జరిగే ప్రమాదాన్ని నివారించినట్లయిందని స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ సింగ్ చెప్పారు. అలహాబాద్‌లో జరిపిన సోదాల్లో పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉగ్రకుట్రలో వివిధ పనులు చేసేందుకు వీరంతా నియమితులయ్యారన్నారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీంకు సమీర్ దగ్గరి వాడన్నారు. పాక్‌లో ఉంటున్న అనీస్ ఆదేశాల మేరకు పేలుడు పదార్థాలను, ఆధునిక ఆయుధాలను, గ్రెనేడ్లను భారత్‌లోని వివిధ ప్రాంతాల్లోని టెర్రరిస్టులకు అందించేందుకు సమీర్ తయారయ్యాడన్నారు. మూల్‌చంద్, ఆమిర్ జావెద్ రాజకీయ ర్యాలీలే లక్ష్యం? వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల వేళ జరిగే రాజకీయ ర్యాలీలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొనే అవకాశాలను కొట్టిపారేయలేమని పోలీసులు తెలిపారు. తమ గ్రూపులో 14–15 మంది బెంగాలీ మాట్లాడే వాళ్లున్నారని అరెస్టయిన ఉగ్రవాదులు వెల్లడించినట్లు చెప్పారు. వీరంతా కూడా ఉగ్రట్రైనింగ్ తీసుకొని ఉండొచ్చని, వీరికి పాక్ నుంచి సహకారం అందుతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఉగ్రదాడిని నిర్వహించేందుకు టెర్రరిస్టులు రెండు బృందాలుగా ఏర్పడ్డారని, ఒక బృందాన్ని అనీస్ సమీక్షిస్తుంటాడని చెప్పారు. రెండో బృందం హవాలా మార్గాల్లో నిధులు సమీకరించడానికి సన్నాహాలు చేస్తుందని తెలిపారు. కేంద్ర ఏజెన్సీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పలు రాష్ట్రాల్లో ఈ సోదాలు నిర్వహించామని, రాజస్తాన్‌లోని కోట వద్ద ఒకరిని, ఢిల్లీలో ఇద్దరిని, యూపీలో ముగ్గురిని అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన ఓఖ్లా అనే వ్యక్తి ఈ కుట్రలో కీలకమని, ఇతనికి దేశవ్యాప్తంగా సంబంధాలున్నాయని చెప్పారు. ఒసామా, ఖమర్‌లు మస్కట్ మీదుగా పాక్ వెళ్లి 15 రోజుల పాటు థట్టా వద్ద ఉన్న ఒక క్యాంపులో ఉగ్రవాద శిక్షణ పొందారని చెప్పారు. ప్రయాగ్‌రాజ్‌లో ఒక లైవ్ ఎల్ఈడీని బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. టెర్రరిస్టు కుట్రను సమూలంగా ఛేదించేందుకు సమగ్ర దర్యాప్తు ఆరంభించామని పోలీసులు తెలిపారు. మహ్మద్‌షేక్ కుటుంబసభ్యులను ప్రశ్నించిన ఏటీఎస్ ఢిల్లీలో అరెస్టయిన ఉగ్రవాది జాన్ మహ్మద్ షేక్ కుటుంబ సభ్యులను ముంబై పోలీసులు, ఏటీఎస్ అధికారులు విచారించారు. షేక్ ఇంట్లో సోదాలు సైతం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సెంట్రల్ ముంబైలో షేక్ కుటుంబం ఉంటోంది. కొన్నేళ్లుగా ఇక్కడే షేక్ నివాసముంటున్నాడని, అతనికి ఇద్దరు కూతుర్లున్నారని పోలీసులు చెప్పారు. జాన్ గురించి ఇరుగుపొరుగును కూడా పోలీసులు విచారించారు. జాన్‌కు ఉగ్రవాదులతో ఏలా సంబంధం ఏర్పడిందన్న విషయమై ఆరాతీశారు. -
‘మాఫియా లీడర్లకు, బాహుబలలకు టికెట్లు ఇవ్వం’
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాఫియా లీడర్లకు, బాహుబలులకు టికెట్లు ఇచ్చేది లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. మావు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఆశించిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి పార్టీ టికెట్ నిరాకరిస్తూ.. మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు. మావు స్థానం నుంచి యూపీ బీఎస్పీ అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్ పేరు ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. మావు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్సారీ ప్రస్తుతం బండాలోని జైలులో ఉన్నారు. అంతేకాక ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో 52 కేసులను ఎదుర్కొంటున్నారు. వీటిలో 15 కేసులు విచారణ దశలో ఉన్నాయని ఏఎన్ఐ నివేదించింది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తాజాగా ప్రారంభించిన మాయావతి.. ప్రజల ఆకాంక్షలు, అంచనాలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా శ్రద్ధ వహించాలని పార్టీ ఇంచార్జీకి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: చిన్న పార్టీల జోరు.. అధిక సీట్ల కోసం బేరసారాలు) 1. बीएसपी का अगामी यूपी विधानसभा आमचुनाव में प्रयास होगा कि किसी भी बाहुबली व माफिया आदि को पार्टी से चुनाव न लड़ाया जाए। इसके मद्देनजर ही आजमगढ़ मण्डल की मऊ विधानसभा सीट से अब मुख्तार अंसारी का नहीं बल्कि यूपी के बीएसपी स्टेट अध्यक्ष श्री भीम राजभर के नाम को फाइनल किया गया है। — Mayawati (@Mayawati) September 10, 2021 దీనిపై శుక్రవారం మాయావతి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి మాఫియా నేపథ్యం ఉన్నవారు బాహుబలులు ఎవరూ పోటీ చేయరు. దీనిని దృష్టిలో ఉంచుకుని మావు నియోజకవర్గం నుంచి ముఖ్తార్ అన్సారీని తొలగించి యూపీ బీఎస్పీ అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్‌ను ఖరారు చేశాం. ప్రజల అంచనాలను చేరుకోవాడానికి పార్టీ అందుకునే విధంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని పార్టీ ఇంచార్జీకి విజ్ఞప్తి చేశాను. సమస్యలు లేకుండా ఇటువంటి అంశాలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం చట్టం ద్వారా నిర్మితమైన చట్టబద్ధ పాలన కావాలని బీఎస్పీ సంకల్పిస్తోంది. యూపీ ప్రస్తుత చిత్రాన్ని మార్చడానికి బీఎస్పీ కృషి చేస్తుంది. బీఎస్పీ ఏం చెప్పినా చేసి చూపిస్తుంది. అదే మా పార్టీకి నిజమైన గుర్తింపు’’ అని మాయావతి వరుస ట్వీట్లు చేశారు. 2. जनता की कसौटी व उनकी उम्मीदों पर खरा उतरने के प्रयासों के तहत ही लिए गए इस निर्णय के फलस्वरूप पार्टी प्रभारियों से अपील है कि वे पार्टी उम्मीदवारों का चयन करते समय इस बात का खास ध्यान रखें ताकि सरकार बनने पर ऐसे तत्वों के विरूद्ध सख्त कार्रवाई करने में कोई भी दिक्कत न हो। — Mayawati (@Mayawati) September 10, 2021 చదవండి: బుజ్జగింపులో వింత కోణం -
ఈసారి అధికారంలోకి వస్తే విగ్రహాలు పెట్టం.. అభివృద్ధి చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పలు మార్గాల్లో ఓటర్లను తమవైపు తిప్పుకొనే పనిలో బిజీగా ఉన్నాయి. తాజాగా మంగళవారం లక్నోలో జరిగిన ప్రబుద్ధ్ వర్గ్ విచార్ సమ్మేళన్ కార్యక్రమంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 2007లో ఫలితాన్ని ఇచ్చిన దళితులు– బ్రాహ్మణుల ఫార్ములాతో 2022లో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని మాయావతి ఆకాంక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణులు కేంద్రంగా ఉంటారని మాయావతి స్పష్టం చేశారు. వేదికపై నుంచి త్రిశూలాన్ని ఊపుతూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం వెయ్యిమంది బ్రాహ్మణ కార్యకర్తలను పార్టీ తయారు చేస్తుందని బీఎస్పీ అధినేత్రి తెలిపారు. అంతేగాక వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అధికారంలోకి వస్తే గతంలో మాదిరిగా విగ్రహాలు, స్మారకాల ఏర్పాటు కాకుండా రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే విధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిపెడతానని మాయావతి పేర్కొన్నారు. (చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్) ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మైనారిటీలను దత్తత తీసుకున్నట్లుగా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎందుకు పరిగణిస్తున్నాయని ఆమె విమర్శించారు. అదే సమయంలో తమ పార్టీ ఏ వర్గంపట్ల వివక్ష చూపదని ఆమె భరోసా ఇచ్చారు. 2022లో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2007లో చేసిన విధంగా ‘సర్వజన్ హితయ్.. సర్వజన్ సుఖయ్’ అనే విధానాన్ని అమలు చేస్తామని మాయావతి హామీ ఇచ్చారు. గతంలో తాము కేవలం దళితులు, వెనుకబడిన వారి ప్రయోజనాలను మాత్రమే చూడలేదని, అగ్రవర్ణాలకు సైతం సమప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. బీఎస్పీ ఒక కులం లేదా మతం కోసం పనిచేసే పార్టీ కాదని, ఇది సమాజంలోని అన్ని వర్గాల పార్టీ అని పునరుద్ఘాటించారు. కేబినెట్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం గత కొన్ని సంవత్సరాలుగా సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీలు తమ ప్రభుత్వాల విధానాలతో పేదలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు, చిన్న వ్యాపారులు, దళితులు, వెనుకబడిన వర్గాలను అణగదొక్కారని మాయావతి ఆరోపించారు. అంతేగాక బీజేపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ సమాజంలోని ప్రజలు చాలా వేధింపులకు గురయ్యారని, 2022లో ఏర్పడే కేబినెట్లో బ్రాహ్మణ సమాజంలోని వారికి గౌరవనీయమైన స్థానాన్ని ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడితే బ్రాహ్మణ సమాజ భద్రత, పూర్తి గౌరవం దక్కేలా చూసుకుంటామన్నారు. ఇప్పటికే బీఎస్పీతో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కలిపే ప్రణాళికల్లో భాగంగా మొదటి దశలో తమ పార్టీ నేత సతీష్ చంద్ర మిశ్రా విజయవంతంగా పనిచేశారని మాయావతి తెలిపారు. ఇక రెండవ దశలో చిన్న పట్టణాలు, గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన బీఎస్పీతో అనుసంధానించే ప్రచారం జరుగుతుందని, ప్రతి సభలో బ్రాహ్మణ సమాజానికి చెందిన కనీసం వెయ్యిమంది కార్యకర్తలు సిద్ధంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అంతేగాక ఈసారి ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళలను సైతం పార్టీతో అనుసంధానం చేసే పని జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వంలో రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని, 3 వ్యవసాయ చట్టాల ద్వారా రైతులను మరింత హింసించారని మాయావతి ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 13% బ్రాహ్మణ ఓటర్లు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలలో బ్రాహ్మణులు కీలక పాత్ర పోషిస్తున్నారు. జనాభాపరంగా రాష్ట్రంలో దాదాపు 13% మంది బ్రాహ్మణులు ఉన్నారు. కొన్ని అసెంబ్లీ స్థానాలలో అయితే బ్రాహ్మణ ఓటర్లు 20% కంటే ఎక్కువగా ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి రాజకీయపార్టీ బ్రాహ్మణ ఓటుబ్యాంకును తమవైపు తిప్పుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతాయి. మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, దేవరియా, జౌన్పూర్, అమేథి, వారణాసి, చందౌలి, కాన్పూర్, ప్రయాగరాజ్, బలరాంపూర్, బస్తీ, సంత్ కబీర్ నగర్ల్లో బ్రాహ్మణ ఓట్లు 15% కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థి గెలుపోటముల్లో బ్రాహ్మణ ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. 2017లో బ్రాహ్మణ అభ్యర్థులు 56 సీట్లను గెలుచుకున్నారు. కాగా 2007లో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ బ్రాహ్మణ, దళిత, ముస్లిం ఫార్ములాతో బరిలో నిలిచి అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. 2007 ఎన్నికల్లో బీఎస్పీ బ్రాహ్మణ అభ్యర్థులకు 86 టిక్కెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. -
బీజేపీని ఓడిద్దాం
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతల్ని అరాచక శక్తులుగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ గడ్డ వారిని సహించలేదన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఆదివారం యూపీలోని ముజఫర్‌నగర్‌లో గవర్నమెంట్ ఇంటర్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన మహా పంచాయత్‌కు వేలాది మంది రైతులు తరలివచ్చారు. ‘దేశాన్ని కాపాడుకుందాం’ అన్న లక్ష్యంతో నిర్వహించిన ఈ మెగా సదస్సుకి ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన 300 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. బస్సులు, కారులు, ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో వేలాది మంది రైతులు రావడంతో నగర వీధులు, ఫ్లై ఓవర్లు కిక్కిరిసిపోయాయి. భారీ సంఖ్యలో మహిళా రైతులు కూడా వచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోతే ఓట్లు కూడా రాలవని తికాయత్ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఇదే తమ నినాదమని స్పష్టం చేశారు. ఇండియా ఫర్ సేల్: కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టిందని అదే ప్రభుత్వ విధానమని మహాపంచాయత్ వేదికగా రాకేశ్ తికాయత్ ఆరోపించారు. రైల్వేలు, విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు, విద్యుత్, రోడ్లు, బ్యాంకులు ఇలా అన్నింటిని అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. సేల్ ఆఫ్ ఇండియా బోర్డులు ఎక్కడికక్కడ పెట్టారని అంబానీ, అదానీలే వాటిని కొనుగోలు చేస్తారని ఆరోపించారు. ‘‘మనం ఈ దేశాన్ని అమ్మకుండా అడ్డుకోవాలి. రైతులు, ఉద్యోగులు, యువత, వ్యాపారాలు ఇలా అన్నింటిని కాపాడు కోవాలి. అందుకే మహాపంచాయత్ ర్యాలీలు చేస్తున్నాం’’ అని తికాయత్ చెప్పారు. ‘‘9 నెలలుగా మేం ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం చర్చించడానికి ముందుకు రావడం లేదు. ఉద్యమం సమయంలో ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయినా ఈ ప్రభుత్వం కనీసం ఒక్క నిమిషం మౌనం పాటించలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం ఆగదు’’ అని తికాయత్ చెప్పారు. ప్రధానే లక్ష్యం: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ప్రధాని మోదీ లక్ష్యంగా ప్రచారం చేస్తామని కిసాన్ మహాపంచాయత్ ప్రకటించింది. నేరుగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావిస్తూ వ్యతిరేక ప్రచారం చేస్తామని రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. వారణాసి వేదికగా ముజఫర్‌నగర్‌లో జరిగిన మెగా సదస్సుని మిషన్ ఉత్తరప్రదేశ్–ఉత్తరాఖండ్గా రైతు సదస్సు అభివర్ణించింది. రాబోయే రోజుల్లో మరిన్ని మహాపంచాయత్‌లు నిర్వహిస్తామన్న రాకేశ్ తికాయత్ ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసి రెండో ప్రధాని కార్యాలయం వంటిదని తదుపరి సదస్సు అక్కడే జరుపుతామన్నారు. లక్నోలో సదస్సు నిర్వహించి రైతుల సత్తా చాటుతామన్నారు. -
చిన్న పార్టీల జోరు.. అధిక సీట్ల కోసం బేరసారాలు
లక్నో: ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనుండడంతో ఇప్పట్నుంచే ఆ రాష్ట్రంలో పొత్తులు ఎత్తులు, వ్యూహాలు ప్రతివ్యూహాలతో రాజకీయాలు వేడెక్కాయి. అందులోనూ చిన్న పార్టీల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. కుల ప్రాతిపదికన ఏర్పడిన ఈ పార్టీలపై ప్రధాన పార్టీలు వల వేశాయి. వారిని తమ వైపు లాక్కుంటే ఓట్లు చీలకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ఎన్నికల్లో వారిని కలుపుకొని వెళ్లాలని ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఎందుకంటే కొన్ని వందల ఓట్లను ఈ పార్టీలు దక్కించుకున్నా ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం అధికంగా ఉంది. దీంతో డజనుకి పైగా చిన్న పార్టీలు గొంతెమ్మ కోర్కెలకి దిగుతున్నాయి. అధిక సీట్లను ఆశిస్తూ బేరసారాలకు దిగుతున్నాయి. 2017 ఎన్నికల్లో వివిధ చిన్న పార్టీలకు చెందిన ఎనిమిది మంది అభ్యర్థులు వెయ్యి ఓట్ల తేడాతో విజయాన్ని సాధించినట్టు ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిన్న పార్టీలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని సమాజ్‌వాదీ పార్టీ చెబుతూ ఉంటే, బీజేపీ కూడా వారితో పొత్తుకు సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సంస్థాగతంగా బలపడి తాము ఒంటరిపోరాటానికి దిగుతామని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు 2022 మార్చి 14తో ముగియనుంది. ఆలోపే రాష్ట అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఏ పార్టీ సత్తా ఎంత అప్నాదళ్, నిషాద్ పార్టీ, జేడీ(యూ), ఆర్పీఐ, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అయితే సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఏర్పాటైన నిషాద్ పార్టీకి దాదాపుగా ఆరు లోక్‌సభ స్థానాల్లో గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. ఇక అప్నాదళ్ (ఎస్), ఓం ప్రకాశ్ రాజ్‌భర్ నేతృత్వంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీలకు (ఎస్బీఎస్పీ) ఓబీసీల్లోని కుర్మీ వర్గంపై పట్టు ఉంది. బీజేపీతో కలిసి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్బీఎస్పీ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్న ప్రకాశ్ రాజ్‌భర్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చారు. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేశారు. తూర్పు యూపీలో యాదవుల తర్వాత రాజ్భర్ల ప్రాబల్యమే ఎక్కువ. ఇటీవల ఓం ప్రకాశ్ రాజ్‌భర్ పార్టీ ఆధ్వర్యంలో 10 చిన్నాచితకా పార్టీలతో భగధారి సంకల్ప్ మోర్చా ఏర్పాటైంది. ఈ కూటమిలో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. 100 సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ మినహా మరే ఇతర పార్టీలైనా తమతో చేతులు కలపవచ్చునని ఆ కూటమి పిలుపునిచ్చింది. ఇక సమాజ్‌వాదీ పార్టీకి రాష్ట్రీయ లోక్ దళ్, మహన్ దళ్, జన్వాడీ సోషలిస్టు పార్టీ, మరికొన్ని ఇతర పార్టీల మద్దతు ఉంది. మహన్ దళ్ పార్టీకి శక్య, సైని, మౌర్య, కుష్వాహ ఓబీసీ వర్గాల్లో పట్టు ఉంది. రాష్ట్రంలోని ఓబీసీ జనాభాల్లో వీరి ఓట్లే దాదాపు నలభై శాతం వరకు ఉన్నాయి. సంజయ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని జన్వాడీ సోషలిస్టు పార్టీకి బింద్, కశ్మప్ వర్గాల్లో మంచి పట్టు ఉంది. డజనుకు పైగా జిల్లాల్లో ఈ పార్టీ తన ప్రభావాన్ని చూపించగలదు. శివపాల్ యాదవ్ నాయకత్వంలోని ప్రగతి శీల సమాజ్‌వాదీ పార్టీ బీజేపీయేతర పార్టీలతో చేతులు కలపాలని ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల్లోకి తొంగి చూస్తే.. ► 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 200పైగా పార్టీలు తమ అభ్యర్థుల్ని బరిలో దింపాయి ► 2017 ఎన్నికల్లో ఏకంగా 290 పార్టీలు పోటీ చేశాయి ► ఎస్బీఎస్పీ పార్టీ ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే నాలుగు స్థానాల్లో గెలిచింది. ఈ పార్టీ తాము పోటీ చేసిన స్థానాల్లో 34.14 శాతం ఓట్లను కొల్లగొట్టింది. ► అప్నాదళ్ (ఎస్) 11 స్థానాల్లో పోటీ చేసి 39.21 శాతం ఓట్లను సాధించింది. మొత్తం అన్ని స్థానాల ఓట్ల పరంగా చూస్తే 0.98 శాతం ఓట్లను దక్కించుకున్నట్టయింది. ► పీస్ పార్టీ 68 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఎక్కడా విజయం సాధించలేదు. అయితే తాము పోటీ చేసిన స్థానాల్లో 1.56 శాతం ఓట్లను సాధించింది. మొత్తం ఓట్లలో 0.26% ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. ► 2017 ఎన్నికల్లో 32 చిన్న పార్టీలకు 5 వేల నుంచి 50 వేల మధ్య ఓట్లు వచ్చాయి. ► మరో ఆరు చిన్న పార్టీలు 50 వేలకు పైగా ఓట్లు సాధిస్తే, ఇంకో ఆరు పార్టీలు లక్షకు పైగా ఓట్లు సాధించాయి. ► గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ చిన్న పార్టీలు 56 అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలకు గండికొట్టాయి. -
బుజ్జగింపులో వింత కోణం
ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటర్లను బుజ్జగించే పనిలో అటు బహుజన్ సమాజ్ పార్టీ, ఇటు సమాజ్‌వాదీ పార్టీ తలమునకలవుతున్నాయి. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటర్లు ఓటు వేయని కారణంగా ఈ రెండు పార్టీలూ ఓడిపోలేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ వర్గాన్ని బుజ్జగించడానికి యూపీ వ్యాప్తంగా బ్రాహ్మణ సమ్మేళనాలను నిర్వహిస్తామంటూ బీఎస్పీ ప్రకటించగా, తర్వాత ఎస్పీ కూడా దానికి వంతపాడింది. మరి తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్న క్రమంలో ఇన్నాళ్ళూ ఈ పార్టీలు ప్రబోధిస్తూ వచ్చిన సామాజిక న్యాయం, సెక్యులరిజం సిద్ధాంతాల గతేమిటి అనేది ప్రశ్న. మొత్తం మీద, ఎస్పీ, బీఎస్పీలు తమ రాజకీయాలను సరైన దిశలో నడిపించడానికి బదులుగా సైద్ధాంతిక విలువలను పక్కనబెడుతున్నాయి. ఈ సరికొత్త బుజ్జగింపు యూపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందనేది ఆసక్తికరం. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ 2018 నవంబర్ 20న ‘బ్రాహ్మణ పితృస్వామ్యాన్ని తుదముట్టించండి’ అనే పోస్టర్ పట్టుకుని తీవ్ర వివాదాన్ని రేకెత్తించారు. దాన్ని చూడగానే కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ఆగ్రహోదగ్రులయ్యారు. తివారీ ఆగ్రహం వెనుక సారం లేనప్పటికీ సరిగ్గా మూడేళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో మండల్ రాజకీయాల పతాక ధారులు బీఎస్పీ, ఎస్పీలు తన ప్రకటనను సీరియస్‌గా తీసుకుంటారని తివారీ అసలు ఊహించి ఉండరు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ కమ్యూనిటీని బుజ్జగించడానికి యూపీ వ్యాప్తంగా బ్రాహ్మణ సమ్మేళనాలను నిర్వహిస్తామంటూ బీఎస్పీ ప్రకటించగా, తర్వాత సమాజ్ వాదీ పార్టీ కూడా దానికి వంతపాడింది. ఈ మార్పు అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. బీఎస్పీ, ఎస్పీ వంటి మండల్ రిజర్వేషన్ల అనుకూల పార్టీలను తమ రాజకీయాలను పునర్నిర్వచించుకునేలా బీజేపీ ఒత్తిడి పెడుతోందా? తమను తాము కొత్తగా ఆవిష్కరించుంటున్న క్రమంలో ఇన్నాళ్లు ఈ పార్టీలు ప్రబోధిస్తూ వచ్చిన సామాజిక న్యాయం, సెక్యులరిజం సిద్ధాంతాల గతేమిటి అనేది ప్రశ్న. ఇలాంటి మౌలిక పరివర్తనతో ఈ పార్టీలు ఎన్నికల్లో ప్రయోజనం సాధిస్తాయా అన్నదీ ప్రశ్నే. 2019 లోక్ సభ ఎన్నికల పోలింగ్ అనంతరం లోక్‌నీతి–సీఎస్డీఎస్ నిర్వహించిన సర్వే ప్రకారం యూపీలో 72 శాతం యాదవేతరులు, కొయిరి–కుర్మీ ఓబీసీలు బీజేపీకే ఓటు వేసినట్లు తేలింది. వీరిలో 18 శాతం మంది మాత్రమే ఘట్బంధన్ కూటమికి ఓట్లేశారు. దిగువ తరగతి ఓబీసీలు, దళితులలో ఇంత మౌలిక మార్పు ఆశ్చర్యం గొలుపుతుంది. ఎందుకంటే బీజేపీలో వారి ప్రాతినిధ్యం కనీస స్థాయిలోకూడా లేదు. ఉత్తరప్రదేశ్‌లో 44.9 శాతం అగ్రకులాలు, 19.7 శాతం ఓబీసీలు గత యూపీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేశారు. ప్రధానంగా అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతున్న బీజేపీకి దిగువ తరగతి ఓబీసీల, దళితుల ఓట్లు తరలిపోవడం ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి ప్రధాన కారణం ఉంది. మండల్ రాజకీయాలు యూపీలోని దిగువ తరగతి ఓబీసీలకు, దళితులకు భౌతికపరంగా (ఉద్యోగాలు, విద్య), రాజకీయపరంగా (రాజకీయ ప్రాతినిధ్యం, గుర్తింపు) ఎలాంటి ప్రయోజనాలు కలిగించలేదు. పలుకుబడిన కొన్ని బీసీ, ఓబీసీ కులాలకు మాత్రమే ప్రయోజనాలు సిద్ధించాయి. ఉదాహరణకు, 2017 అక్టోబర్‌లో నియమించిన కమిషన్ కేంద్ర స్థాయిలో ఓబీసీలో ఉప వర్గీకరణకు సంబంధించిన సమస్యను అధ్యయనం చేసింది. యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, ఏఐఐఎమ్లతోపాటు కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీల ప్రవేశంపై గత మూడేళ్ల డేటాను చూస్తే 97 శాతం ఓబీసీ కోటా ప్రయోజనాలు ఓబీసీల్లోని 25 శాతం ఉప–కులాలకు మాత్రమే అందాయి. మొత్తం 983 ఓబీసీ కమ్యూనిటీలకు (ఓబీసీల్లో 37 శాతం) ఉద్యోగాలు, అడ్మిషన్లలో సున్నా ప్రాతినిధ్యం దక్కింది. పైగా, ఓబీసీల్లో 10 కమ్యూనిటీలు మాత్రమే 24.95 శాతం ఉద్యోగాలు, అడ్మిషన్లు పొందాయి. అంటే రిజర్వేషన్లు రెండంచుల కత్తిలాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా దిగువ కులాలను ఐక్యం చేయడంలో రిజర్వేషన్లు ఒక సాధనంగా పనిచేసినప్పటికీ, అదే సమయంలో రిజర్వేషన్ల ప్రయోజనాలు ఇంత అసమానంగా పంపిణీ కావడంతో ఒక విస్తృతస్థాయి సంఘీభావం, సామూహిక కార్యాచరణ దిగువకులాల్లో లోపించింది. అదే సమయంలో ఏక జాతి సిద్ధాంతాన్ని బలంగా ప్రబోధించే బీజేపీ వైపు దీర్ఘకాలిక ఆలోచన లేకుండా ఓబీసీల్లో విశ్వాసం పెరగడానికి కూడా ఇదే కారణం. దిగువ కులాలు చీలిపోవడం, బీజేపీ దూకుడుగా వ్యవహరించడం అనేవి మండల్ రాజకీయాలను ద్వంద్వ సంక్షోభంలోకి నెట్టివేశాయి. కుల రాజకీయాల గుణపాఠాలు దిగువ తరగతి ఓబీసీల, దళితుల ఆందోళనలు నిజమైనవే అయినప్పటికీ బీఎస్పీ, ఎస్పీ నాయకత్వం వీరి సమస్యలను చిత్తశుద్ధితో పరిశీలించడంపై నిర్లక్ష్యం వహించాయి. పైగా వారి సమస్యలను కనీ సంగా గుర్తించడంలో కూడా ఈ రెండు పార్టీలు విఫలమయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఘోర పరాజయానికి కారణాలను సమీక్షించుకోవడంలో కూడా ఈ రెండు పార్టీలు వెనుకబడ్డాయి. పైగా ప్రతి ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల వ్యూహాల్లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఉదాహరణకు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభివృద్ధి సాధనను తన నినాదంగా తీసుకొచ్చింది. ఎక్స్‌ప్రెస్ రహదారులు, మెట్రోలు, ల్యాప్‌టాప్‌ల పంపిణీ వంటివి తన ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంది. కానీ 2019 లోక్ సభ ఎన్నికల సమయానికి సామాజిక న్యాయం వైపు దిశ మార్చి మహాపరివర్తనకు అదొక్కటే మార్గమని ఢంకా భజాయించింది. కానీ ఆ రెండు ఎన్నికల్లోనూ ఎస్పీ ఘోర వైఫల్యం చవిచూసింది. అదే సమయంలో బీఎస్పీ సైతం ముస్లిం ఓటర్లను గెల్చుకోవడానికి ప్రయత్నించి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 100 టికెట్లను ముస్లింల పరం చేసింది. ఇది కూడా పనిచేయలేదు. కానీ ఇప్పుడు కూడా ఆ పార్టీ బ్రాహ్మణులను బుజ్జగించడం అనే ప్రయోగం చేస్తోంది. అంటే అభివృద్ది పంథా కానీ మండల్ శైలి రాజకీయాలు కానీ ఈ రెండు పార్టీలకు ప్రయోజనాలు కలిగించలేకపోయాయని స్పష్టమవుతోంది. మరోవైపున బీజేపీ నిస్సందేహంగానే కుల ప్రాతిపదికన ఓటర్ల సమీకరణను పునర్నిర్వచించి, ఓబీసీల్లో కొన్ని సెక్షన్లను మరికొన్ని సెక్షన్లకు వ్యతిరేకంగా నిలిపింది. ఇన్నాళ్లూ తమకు మద్దతు పలికిన వర్గాలను తిరిగి గెల్చుకునే ప్రయత్నం చేపట్టడానికి బదులుగా ఎస్పీ, బీఎస్పీలు తాజాగా బ్రాహ్మణులను బుజ్జగించే పనిలో పడిపోయాయి. తమ రాజకీయాలకు కొత్తదనం తీసుకొచ్చే క్రమంలో ఈ రెండు పార్టీలు దళిత బహుజన రాజకీయాలు, సామాజిక న్యాయం, సెక్యులరిజం మౌలిక సూత్రాలకు భిన్న మార్గంలో పయనిస్తున్నాయి. అందుకే సామాజిక న్యాయం, ఉనికిలో ఉన్న కోటాలను అమలు చేయకపోవడం, నీట్ పరీక్షల్లో ఓబీసీ రిజర్వేషన్లను తిరస్కరించడం, కులాలవారీ జనగణనకు ప్రభుత్వ తిరస్కరణ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలుపర్చడం వంటి అనేక కీలక సమస్యలపై ఈ రెండు పార్టీలు ఎలాంటి స్ఫూర్తిదాయకమైన పోరాటాలను చేపట్టలేకపోయాయి. పైగా, అయోధ్యలో బీఎస్పీ నిర్వహించిన బ్రాహ్మణ్ సమ్మేళనం బీజేపీకీ, బీఎస్పీకి మధ్య తేడా లేకుండా చేసింది. ఆ సమ్మేళనంలో బీఎస్పీ ‘జై శ్రీరాం’ అని నినదించడమే కాకుండా పాలక బీజేపీ కంటే రామాలయాన్ని వేగంగా నిర్మిస్తానని శపథం చేసింది కూడా. యూపీలో ఇటీవలి సంవత్సరాల్లో కులపరమైన అత్యాచారాలు, అణచివేత పెరుగుతున్నప్పటికీ బీఎస్పీ తన మౌలిక విలువలతో రాజీపడుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద, ఏస్పీ, బీఎస్పీలు తమ రాజకీయాలను సరైన దిశలో నడిపించడానికి బదులుగా సైద్ధాంతిక విలువలను పక్కనబెడుతున్నాయి. బిహార్‌లో ముస్లింలు మజ్లిస్ పార్టీ వైపు తరలిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ పార్టీలు ఇకపై ముస్లిం ఓట్లను గంపగుత్తగా ఆకర్షించడం కూడా సాధ్యం కాదు. పంకజ్ కుమార్ వ్యాసకర్త పీహెచ్‌డి స్కాలర్, సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్,జేఎన్‌యూ -
యూపీ సీఎం యోగిపై మాజీ ఐపీఎస్ పోటీ
లక్నో: ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేస్తారని ఆయన కుటుంబం శనివారం వెల్లడించింది. యోగి ఎక్కడపోటీ చేస్తే అక్కడి నుంచే అమితాబ్ కూడా పోటీ చేస్తారని ఆయన భార్య నూతన్ తెలిపారు. యోగి అప్రజాస్వామిక, వివక్షాపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిం చారు. అమితాబ్‌కు ఈ పోటీ విలువలతో కూడినదని చెప్పారు. యోగి తప్పులను అమితాబ్ ఎత్తిచూపుతారని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనం కోసమంటూ మార్చి 23న కేంద్ర హోంశాఖ అమితాబ్‌ను బలవంతంగా రిటైర్ చేయించిన సంగతి తెలిసిందే. తనను బెదిరించారంటూ సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌పై ఆరోపణలు చేయడంతో అమితాబ్‌పై దుమారం రేగింది. అనంతరం ఆయన్ను హోంశాఖ 2015లో సస్పెండ్ చేసింది. -
యూపీలో 350 స్థానాలు గెలుచుకోవడం ఖాయం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పిలుపునిచ్చారు. చిన్న పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆదివారం చెప్పారు. యూపీలోని చిన్న పార్టీలన్నింటికీ ద్వారాలు తెరిచి ఉంచామని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఎటువైపు ఉన్నాయో తేల్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీఎస్పీలు ఎవరిపై పోరాడుతున్నాయి? బీజేపీపైనా లేక సమాజ్‌వాదీ పార్టీపైనా? అని ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీపై ఇటీవలి కాలంలో కాంగ్రెస్, బీఎస్పీలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే చాలా చిన్న పార్టీలు తమతో చేతులు కలిపాయని, త్వరలో మరిన్ని పార్టీలు సైతం ముందుకొస్తాయని అఖిలేశ్ వెల్లడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 350 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఉద్ఘాటించారు. పెగసస్ స్పైవేర్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఆయన తప్పుపట్టారు. లోక్‌సభలో ఎన్డీయేకు 350కిపైగా స్థానాలున్నాయని, చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, అలాంటప్పుడు స్పైవేర్‌తో ఏం సాధించాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ శక్తులకు కేంద్రం సహరిస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలను సైతం దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. న్యాయమూర్తులపైనా నిఘా పెట్టడం ఏమిటని ధ్వజమెత్తారు. కుల సమ్మేళనాలు.. యాత్రలు అఖిలేశ్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ పరిణామంపై అఖిలేశ్ స్పందించారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇతర పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ) అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ నేతృత్వంలోని ‘భాగీదారి మోర్చా’తో తాము ఇప్పటిదాకా ఎలాంటి చర్చలు జరుపలేదని వివరించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కుల సమ్మేళనాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ నిర్వాకాలను ప్రజలకు వివరించడానికి యాత్రలు చేపడతామని అన్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని మండిపడ్డారు. -
యూపీలో పొత్తులపై ఇప్పుడే చెప్పలేం: ప్రియాంక గాంధీ
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తెలిపారు. అయితే, ఆ విషయంలో సానుకూలంగానే ఉన్నామని, తమ లక్ష్యం బీజేపీని ఓడించడమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మీరు ఉన్న సమయంలోనే పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రియాశీలంగా ఉంటారని, మీరు వెళ్లిన వెంటనే మళ్లీ పార్టీ స్తబ్దుగా మారుతుందని వ్యాఖ్యకు స్పందిస్తూ.. ‘నేను ఇక్కడ ఉన్నప్పుడు మీ(మీడియా) అటెన్షన్ ఉంటుంది. కనుక క్రియాశీలంగా ఉన్నట్లు మీకు కనిపిస్తుంది. నేను లేని సమయంలో మాపై మీ దృష్టి ఉండదు. కనుక స్తబ్దుగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ పార్టీ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి’ అని వివరించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేనా అన్న ప్రశ్నకు.. ఇప్పుడే చెప్పలేమని సమాధానమిచ్చారు. యూపీకి ప్రియాంక పొలిటికల్ టూరిస్ట్ అన్న బీజేపీ విమర్శలపై స్పందిస్తూ.. తనను, సోదరుడు రాహుల్‌ని సీరియస్ రాజకీయవేత్తలు కాదని ప్రచారం చేయడం బీజేపీ ఎజెండా అన్నారు. -
యూపీ సీఎం మళ్లీ యోగియే!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని ఐఏఎన్ఎస్–సి ఓటరు సర్వేలో వెల్లడైంది. 52% మంది యోగిదే మళ్లీ సీఎం పదవి అభిప్రాయపడితే, 37% మంది మళ్లీ ఆయన అధికారంలోకి రాలేరని అన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో విఫలమయ్యారని ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, కుంభమేళా, గంగానదిలో శవాలు కొట్టుకొని రావడం వంటివన్నీ ఆయనపై వ్యతిరేకతను పెంచాయి. అయినప్పటికీ 52% మంది యోగికే మొగ్గు చూపించారని ఐఏఎన్ఎస్–సీఓటరు సర్వే పేర్కొంది. ఇక కొత్త కేబినెట్‌తో దేశంలో పరిస్థితులు మెరుగవుతాయని సర్వేలో 46% మంది అభిప్రాయపడితే, 41% మంది పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదని అన్నారు. ఐఎఎన్ఎస్–సీ ఓటరు మొత్తం 1,200 మంది ఇంటర్వ్యూలు తీసుకొంది. బీడీసీ సభ్యుడి బంధువు హత్య యూపీ బహరిచ్లో బ్లాక్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడి బావమరిది దారుణ హత్యకు గురయ్యాడు. బీజేపీ అభ్యర్థి భర్త కిడ్నాప్ చేస్తూ ఉంటే అడ్డుకోవడంతో ఆయనను దారుణంగా చంపారని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. -
యూపీలో ఒంటరిగానే పోటీ
లక్నో: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తుండదని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతి ప్రకటించారు. అదేవిధంగా, యూపీ ఎన్నికల్లో ఎంఐఎంతోనూ ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె పలు ట్వీట్లు చేశారు. ‘రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, అసదుద్దీన్‌కు చెందిన ఏఐఎంఐఎం పార్టీతో కలిసి పోటీ చేస్తుందంటూ ఓ టీవీ చానెల్లో నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఎంత మాత్రం నిజం కాదు. వాస్తవాన్ని తప్పుదోవ పట్టించేలా ఉంది. ఇందులో ఇసుమంత కూడా నిజం లేదు. బీఎస్పీ దీనిని తీవ్రంగా ఖండిస్తోంది’అని పేర్కొన్నారు. పంజాబ్‌ను మినహాయిస్తే, యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోము’అని మాయావతి స్పష్టం చేశారు. పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్‌తో ఇటీవల బీఎస్పీ జత్తు కట్టిన విషయం తెలిసిందే. యూపీలో 100 స్థానాల్లో పోటీ: ఎంఐఎం వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ చేయనున్నట్లు ఆలిండియా మజ్లిస్–ఇ– ఇత్తెహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఓం ప్రకాశ్ రాజ్‌భర్ సారథ్యంలోని సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ), చిన్న పార్టీల కూటమి అయిన భాగీదారీ సంకల్ప్ మోర్చాతో కలిసి బరిలోకి దిగుతామన్నారు. ఎన్నికలకు సంబంధించి మరే ఇతర పార్టీలతోనూ తాము చర్చలు జరపలేదన్నారు. -
అక్కడ మహిళలే మహారాణులు కానీ..
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఈ రాష్ట్రం నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు ఉమాభారతి, మేనకా గాంధీ కూడా యూపీ నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యారు. బీఎస్పీ చీఫ్ కూడా మహిళే. మాయావతి మాజీ ముఖ్యమంత్రి కూడా. అప్నాదళ్‌లోనూ కృష్ణ పటేల్, అనుప్రియ పటేల్‌దే ఆధిపత్యం. ఇక ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఎంపీగా ఉన్నారు. ములాయం మరో కోడలు అపర్ణా యాదవ్ (ప్రతీక్ భార్య) శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నారీమణుల జాబితా చూస్తే యూపీలో మహిళలదే ఆధిపత్యం అనిపిస్తుంది. అయితే ఇదంతా నాణేనికి ఓ పార్శం మాత్రమే. యూపీ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంతమాత్రమే. అందులోనూ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నవారిలో, చట్టసభలకు ఎన్నికైన వారిలో చాలామంది వారసత్వంగా వచ్చినవారే. యూపీలో మొత్తం 403 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. మొత్తం 4822 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో మహిళా అభ్యర్థులు కేవలం 445 మందే. మొత్తం అభ్యర్థుల్లో మహిళలు 9.16 శాతం మంది మాత్రమే. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి మహిళా అభ్యర్థుల సంఖ్య కేవలం 0.66 శాతం పెరిగింది. గత ఎన్నికల్లో మొత్తం 6839 మంది అభ్యర్థులు రంగంలో దిగగా, వీరిలో మహిళ అభ్యర్థులు 583 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 44, ఎస్పీ 33, ఆర్ఎల్డీ 25, బీఎస్పీ 19, కాంగ్రెస్ 11, ఇతర పార్టీలు మరో 18 మంది మహిళలకు టికెట్లు ఇచ్చాయి. -
వారణాసి వార్
► గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న బీజేపీ ► కీలకంగా మారిన 20 శాతం ముస్లింల ఓట్లు వారణాసి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వారణాసిలో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దీంతో మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు నెలకొంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో పాటు ముస్లిం ఓట్లు కూడా బీజేపీకి బాగా కలిసొచ్చాయి. ఈ సారి బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ–కాంగ్రెస్‌లు ఏకమవడం, పట్టున్న నేతలకు మిగతా పార్టీలు సీట్లివ్వగా... అభ్యర్థుల ఎంపికలో తడబడడం బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశముంది. ప్రచారంలో హోరెత్తించిన బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే వారణాసిలో బహిరంగ ర్యాలీల్లో ప్రసంగించడంతో పాటు పలు రోడ్‌షోలు నిర్వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతల్ని వారణాసిలో ప్రచారం కోసం మోహరించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గంలోని ఐదు అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీ మూడింటిని గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ముగ్గురు సిట్టింగ్‌ల్లో ఇద్దరు అభ్యర్థుల్ని మార్చింది.వారణాసి సౌత్ స్థానం నుంచి ఏడు సార్లు విజేతగా ఉన్న శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరీ స్థానంలో నీలకంఠ తివారీకి అవకాశమిచ్చింది. ఇక వారణాసి కంటోన్మెంట్ నుంచి జోత్సానా శ్రీవాత్సవకు బదులు ఆమె కుమారుడు సౌరభ్ శ్రీవాత్సవ పోటీ చేయనున్నారు. ఈ మార్పులు పార్టీలో కొందరు నేతలకు రుచించలేదు. కాగా వారణాసి నార్త్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర జైశ్వాల్‌కే అవకాశమిచ్చింది. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో జైశ్వాల్ గట్టెక్కారు. నియోజక వర్గంలోని ముస్లింలు ఈసారి ఎస్సీ – కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీచేయడం కలిసొచ్చే అంశం. రోహనియా నుంచి బీజేపీ, మిత్రపక్షం అప్నా దళ్ల మధ్య పొత్తు కుదరకపోవడంతో విడి విడిగా పోటీ చేయడం మరో ఎదురుదెబ్బ. ‘ఎందుకు ఓటేయాలి’ వారణాసి నియోజకవర్గంలో దాదాపు 20 శాతం ముస్లిం జనాభా ఉన్నారు. ఈసారి వారంతా బహిరంగంగా ఎస్పీ–కాంగ్రెస్ కూటమికే ఓటేయవచ్చని అంచనా వేస్తున్నారు. నిజానికి 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల్లో చీలిక బీజేపీ మూడు సీట్లు గెల్చేందుకు సాయపడింది. మోదీ రోడ్ షోల్లో ముస్లింలు కనిపించినా అవన్నీ ఓట్లుగా మారకపోవచ్చని అంచనా వేస్తున్నారు. యూపీలో బీజేపీ ఎంత మంది ముస్లింలకు సీట్లిచ్చింది? ఒక్కరికి కూడా ఇవ్వలేదు.. మేం ఎందుకు బీజేపీకి ఓటేయ్యాలి అంటూ ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. -
ఆరో దశలో 57% పోలింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. శనివారం జరిగిన ఆరో దశ పోలింగ్‌లో 57.03 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1.72 కోట్ల ఓటర్లున్న 49 స్థానాలకు 635 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో 63 మంది మహిళలున్నారు. భారీ బందోబస్తు మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని యూపీ ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ అజాంగఢ్తో పాటు, బీజేపీ ఫైర్‌బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్, కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా డియోరియా వంటి కీలక నియోజకవర్గాలు ఈ దశ పోలింగ్‌లో ఉన్నాయి. బీఎస్పీ ముఖ్యనేత స్వామి ప్రసాద్ మౌర్య (పద్రౌనా), ఎస్పీ తరఫున మాజీ గవర్నర్ రాంనరేశ్‌యాదవ్ తనయుడు శ్యాంబహదూర్ యాదవ్ (ఫుల్పూర్ పవాయ్) ఈ దశలో బరిలో నిలిచిన ప్రముఖలు. మణిపూర్‌లో 84 శాతం పోలింగ్ ఇంఫాల్: మణిపుర్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో గురువారం రికార్డు స్థాయిలో 84 శాతం పోలింగ్ నమోదైంది. 38 స్థానాల్లో 168 మంది పోటీపడ్డారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు అధికారులు చెప్పారు. -
యూపీ ఫలితాలపై జోరందుకున్న బెట్టింగ్‌లు
లక్నో: అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అధికారం నిలబెట్టుకునేందుకు ఎస్పీ పోరాడుతుండగా.. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ, బీఎస్పీ.. ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ బరిలో దిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ యూపీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. యూపీలో విజయం ఎవరిది, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధిస్తారా అనేదానిపై సర్వేల్లో స్పష్టత రావడం లేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు జోరందుకున్నా.. ఎవరు గెలుస్తారనే విషయంలో బుకీలు కూడా గందరగోళంలో పడ్డారు. యూపీ అసెంబ్లీకి ఏడు దశల్లో ఎన్నికలు జరగుతున్న సంగతి తెలిసింది. మొదటి రెండు దశల ఎన్నికల వరకు ఎస్పీ గెలుస్తుందని జోరుగా పందేలు కాశారు. ఆ తర్వాత బెట్టింగ్ రాయుళ్లు బీజేపీ వైపు మొగ్గుచూపడం మొదలెట్టారు. ప్రస్తుతం ఐదు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. హాంగ్ వస్తుందని భావించిన బుకీలు.. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం చూసి మనసు మార్చుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పందేలు కాయడానికి వెనుకంజ వేస్తున్నారు. మహారాష్ట్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ మంచి ఫలితాలు సాధించడంతో.. సర్జికల్ దాడులు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వంటి అంశాలు బీజేపీకి సానుకూలంగా పనిచేస్తున్నాయని బుకీలు భావిస్తున్నారు. 403 స్థానాలకు గాను బీజేపీ 161, ఎస్పీ-కాంగ్రెస్ కూటమి 150, బీఎస్పీ 72 సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. పందేలు కూడా ఇదే లెక్కన కాస్తున్నారు. -
బీజేపీపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం
లక్నో: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి నిప్పులు చెరిగారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బాలియాలో నిర్వహించిన ర్యాలీలో మాయావతి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇప్పటివరకూ ప్రకటించని బీజేపీ యూపీలో ఎలా గెలుస్తుందని ఆశిస్తున్నారని ప్రశ్నించారు. యూపీలో బీజేపీ నెగ్గే ప్రసక్తే లేదని చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు అని అన్నారు. బీజేపీకి ఈ ఎన్నికలపై నమ్మకం లేనందున అభ్యర్థి పేరును ప్రకటించడం లేదన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని మాయావతి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేస్తుందని, అందుకే బీజేపీకి ఓటేయవద్దని ఓటర్లకు సూచించారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఆరెస్సెస్ అజెండాను ఇక్కడ ప్రవేశపెడతారని, దాంతో రిజర్వరేషన్లకు మంగళం పాడతారని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ వివక్షాపూరితమైన రాజకీయాలు చేస్తారని విమర్శించారు. సీఎం అఖిలేశ్ యాదవ్ తమ పార్టీ పాలసీలనే ఫాలో అవుతున్నారని ఆరోపించారు. గతంలో తమ బీఎస్పీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను అఖిలేశ్ కొనసాగిస్తున్నారని, అయితే పథకాల పేర్లలో కాస్త మార్పు చేశారని ఆమె ఎద్దేవా చేశారు. రేపు (సోమవారం) యూపీలో ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. 11 జిల్లాల్లోని 51 నియోజక వర్గాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాపూర్ నియోజకవర్గం పోలింగ్ ను వచ్చే నెల 9కి వాయిదా వేశారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి మృతిచెందడంతో ఈ స్థానానికి పోలింగ్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
మూడో విడత 61% పోలింగ్
యూపీలో ఓటేసిన రాజ్‌నాథ్, అఖిలేశ్, మాయావతి లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మూడో విడతలో 12 జిల్లాల్లోని 69 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 826 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఉదయం 7 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ క్రమంగా పుంజుకొంది. ఈ స్థానాల్లో 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 59.96 శాతం, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 58.43 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 55 స్థానాలను, బీఎస్పీ ఆరు, బీజేపీ ఐదు, కాంగ్రెస్ రెండు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. ఓటేసిన ప్రముఖులు కాగా మూడో విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. లక్నోలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బహుజనన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కుటుంబసభ్యులతో కలసి వచ్చి ఓటేశారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కేంద్ర మంత్రులు ఉమాభారతి, కల్రాజ్ మిశ్రా, సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైశ్వాల్, బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ తదితరులు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆశాభావం ఈ సందర్భంగా ప్రధాన పక్షాలన్నీ అధికారం తమదేనని ఘంటాపథంగా చెప్పాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ ‘బీఎస్పీ 300 సీట్లను సాధించి ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’అని అన్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా యూపీలో బీజేపీ మెజారిటీ సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్పీ, కాంగ్రెస్ కూటమికే ప్రజలు పట్టం కడతారని ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. అఖిలేశే మళ్లీ సీఎం: ములాయం యూపీకి అఖిలేశ్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ గాంధీలు ఎవరికి ఓటేశారో! యూపీ మూడో దశ పోలింగ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీలు ఓటేశారు. వీరు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారులు కాదులెండి. లక్నోలోని ఓ కుటుంబంలోనూ రాజీవ్ గాంధీ (46), సంజయ్ గాంధీ (45), సోనియా గాంధీ (40)లు ఉన్నారు. రాజీవ్, సంజయ్‌లు అన్నదమ్ములు కాగా, సోనియా మాత్రం ఇక్కడ సంజయ్ భార్య. మరి ఈ గాంధీలను ఎవరికి ఓటేశారని అడగ్గా బయటకు వెల్లడించేందుకు నిరాకరించారు. -
తొలిదశలో 64 శాతం పోలింగ్
► యూపీలో 73 నియోజకవర్గాలకు ముగిసిన ఎన్నికలు ► ఓటింగ్ స్వల్ప హింసాత్మకం లక్నో: దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో తొలిదశ కింద శనివారం 15 జిల్లాల్లోని 73 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి. ఓటింగ్ సందర్భంగా అక్కడక్కడా స్వల్ప హింసాత్మక ఘటనలు జరిగాయి. 64.22 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఓటరు స్లిప్‌లను దౌర్జన్యంగా లాక్కోవడం, రాళ్లు రువ్వుకోవడం వంటి ఘటనలు తమ దృష్టికి వచ్చాయని ముఖ్య ఎన్నికల అధికారి వెంకటేష్ చెప్పారు. ఇవే నియోజకవర్గాల్లో 2012 ఎన్నికలతో పోలిస్తే తాజాగా పోలింగ్ మూడు శాతం పెరిగింది. ఈ దశలో మొత్తం ఓటర్లు 2.6 కోట్లు కాగా వారిలో 1.17 కోట్ల మంది మహిళలు. 839 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటిదాకా ఎన్నికల సంఘం ఇక్కడ రూ.9.56 కోట్ల నగదు, 14కోట్ల విలువైన 4.44 లక్షల లీటర్ల మద్యం, రూ.14 కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. శనివారం హాపూర్, షామ్లీ, ముజఫర్‌నగర్, బాగ్పట్, మీరట్, ఘజియాబాద్, గౌతమ బుద్ధ నగర్, బులంద్ షహర్, అలీగఢ్, మథుర, హత్రాస్, ఆగ్రా, ఫిరోజాబాద్, ఎటా, కాస్గంజ్ జిల్లాల్లో పోలింగ్ ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం జిల్లాలు 75. మీరట్, బాగ్‌పట్‌లో ఘర్షణలు... బాగ్‌పట్‌లో ఓటర్లను అడ్డుకుంటున్నారంటూ వివిధ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 10 మంది గాయపడ్డారు. బాగ్పట్ జిల్లాలోని మరో గ్రామంలో ఆర్ఎల్డీ కార్యకర్తలు దళితులను ఓటు వేయకుండా అడ్డుకోగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మీరట్‌లో ఓ బీజేపీ నేత సోదరుడు పోలింగ్ బూత్‌కు తుపాకీ తేవడంతో పోలీసులు అరెస్టుచేశారు. తొలిదశలోని ప్రముఖులు వీరే... తొలిదశ పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తనయుడు పంకజ్ సింగ్ (నోయిడా), కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు ప్రదీప్ మాథుర్ (మధుర), బీజేపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌శర్మ, బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ కూతురు మృగాంకా సింగ్ (కైరానా), బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీ కాంత్ (మీరట్), ఆర్జేడీ అధినేత లాలూ అల్లుడు రాహుల్ సింగ్ (సికింద్రాబాద్), రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్ మనవడు సందీప్ (అత్రౌలి) తదితర ప్రముఖులు పోటీలో నిలిచారు. బీజేపీ ఖాతాలోకి 3 ఎమ్మెల్సీలు రాష్ట్రంలోæ అసెంబ్లీ ఎన్నికల హడావుడి నడుస్తుండగానే.. బీజేపీకి శుభ సంకేతాలు కనబడుతున్నాయి. కాన్పూర్, బరేలీ, గోరఖ్‌పూర్ స్థానాలకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఈ మూడు చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం, పేదల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మోదీ తీసుకొచ్చిన పథకాలే తమను గెలిపించాయని అభ్యర్థులు తెలిపారు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించటమే.. యూపీలో మళ్లీ కమలం వికసించేందుకు సంకేతమని కేంద్ర మంత్రి వెంకయ్య అన్నారు. -
యూపీలో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. పశ్చిమ యూపీలోని మీరట్, ఆగ్రా తదితర 15 జిల్లాల్లో 73 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 73 నియోజకవర్గాల్లో 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 839 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుతం పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 9గంటలకు 10.56 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముజఫర్‌నగర్ సహా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తొలిదశ పోలింగ్ మిగతా ఆరు దశల పోలింగ్‌పై ప్రభావం చూపే అవకాశముంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. మొత్తం 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 11న ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే. (చదవండి : 'ఉత్తర'దిశ చూపే ‘పశ్చిమం’! ) కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కుమారుడు పంకజ్(నోయిడా), ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ అల్లుడు రాహుల్ సింగ్(బులంద్‌షహర్ జిల్లా సికందరాబాద్ నుంచి ఎస్పీ తరఫున) బరిలో ఉన్నారు. ముజఫర్‌నగర్ అల్లర్ల నిందితుడైన సర్దానా సిటింగ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న పశ్చిమ యూపీలో ఎంఐఎం కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. -
తండ్రి కొడుకుల మధ్య ఇప్పటికైతే రాజీ లేదు!
-
ఇప్పటికైతే రాజీ లేదు!
ఎస్పీ సంక్షోభంపై కొనసాగుతున్న ఉత్కంఠ ♦ రెండు గంటలపాటు ములాయం, అఖిలేశ్ భేటీ ♦ ఇప్పటికే సమయం మించిపోయిందని అఖిలేశ్ వర్గం నేత వ్యాఖ్య ♦ సైకిల్ గుర్తు తమదేనంటూ ఈసీని కలిసిన సీఎం వర్గం న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ సంక్షోభంపై మంగళవారం కూడా ఉత్కంఠ కొనసాగింది. ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సైకిల్ గుర్తును తమకే కేటాయించాలంటూ అఖిలేశ్ వర్గం ఢిల్లీలో ఈసీకి విన్నవించింది. మరోవైపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి లక్నో చేరుకున్న ములాయం సింగ్ యాదవ్‌తో సీఎం అఖిలేశ్ యాదవ్ రెండు గంటల పాటు భేటీ అయ్యారు. దీంతో తండ్రీకొడుకుల మధ్య రాజీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సంధి యత్నాలు ఫలించలేదని అఖిలేశ్ వర్గం నేతలు తేల్చిచెప్పారు. అఖిలేశ్ విధేయ నేతలు రాంగోపాల్ యాదవ్, నరేష్ అగర్వాల్, కిరణ్మయ్ నందలు ఎన్నికల సంఘాన్ని కలిశారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా అఖిలేశ్ కొనసాగుతున్నారని, ములాయం కాదంటూ ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించారు. అసలైన ఎస్పీ తమదేనని, సైకిల్ గుర్తు కూడా తమకే చెందుతుందంటూ వాదనలు వినిపించారు. ఈసీని కలసిన అనంతరం రాంగోపాల్ మాట్లాడుతూ‘ 90 శాతం మంది మద్దతిస్తున్నందున అసలైన సమాజ్‌వాదీ పార్టీ మాదే’ అని పేర్కొన్నారు. అఖిలేశ్ ఎన్నిక చెల్లదని, తానే పార్టీ అధ్యక్షుడినంటూ సోమవారం ములాయం ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే సైకిల్ గుర్తును కూడా తమ వర్గానికే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫలించని సీనియర్ల ప్రయత్నాలు తండ్రీకొడుకులు ములాయం, అఖిలేశ్‌ల మధ్య రాజీ ప్రయత్నాల వార్తలతో లక్నోలో ఉత్కంఠ ఏర్పడింది. ఢిల్లీ నుంచి లక్నో చేరుకున్న ములాయం ఇంటికి వెళ్లిన అఖిలేశ్ రెండుగంటల పాటు మంతనాలు జరిపారు. అదే సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన శివ్‌పాల్ యాదవ్ కూడా చర్చల్లో పాల్గొన్నారు. సైకిల్ గుర్తును ఈసీ రద్దు చేస్తే పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని, ఇద్దరు చెరో అడుగు వెనక్కి తగ్గాలని ఆజంఖాన్ వంటి సీనియర్ నేతల రాయబారం నడిపారు. ఎన్నికల గుర్తుపై ఈసీ షాక్ నేపథ్యంలో విభేదాలన్నీ పక్కనపెట్టి తండ్రీకొడుకులు రాజీ పడతారని సీనియర్లు భావించినా రాజీ కుదరలేదు. అయితే సమాజ్‌వాదీ అధ్యక్షుడిగా తప్పుకునేందుకు సిద్ధమని, ములాయంను తిరిగి ఎన్నుకుంటామని ప్రతిపాదించిన అఖిలేశ్... అందుకు ప్రతిగా అమర్‌సింగ్‌ను పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల ఇన్చార్జిగా, శివ్‌పాల్‌ను జాతీయ రాజకీయాలకు పంపాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. తండ్రీకొడుకుల భేటీపై అఖిలేశ్ వర్గానికి చెందిన సీనియర్ నేత స్పందిస్తూ... ‘ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రస్తుత తరుణంలో రాజీకి ఎలాంటి అవకాశం లేదు. ఎస్పీ ఎన్నికల గుర్తు సైకిల్‌పై ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది’ అని పేర్కొన్నారు. ఈసీ కోర్టులో సమాజ్‌వాదీ భవితవ్యం పార్టీ గుర్తుపై ఇరు వర్గాలు తలుపు తట్టడంతో బంతి ఈసీ కోర్టులోకి వచ్చి చేరింది. ఏ క్షణంలోనైనా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమాజ్‌వాదీ పంచాయితీ తీర్చేందుకు ఎన్నికల సంఘానికి తగినంత సమయం లేదు. దీంతో తాత్కాలిక పరిష్కారంగా సైకిల్ గుర్తును ఫ్రీజ్ (ఎవరికీ కేటాయించకుండా) చేయాలని భావిస్తోంది. కొత్త ఎన్నికల గుర్తుపై పోటీచేయాలంటూ ఇరు వర్గాల్ని ఆదేశించనుంది. సమాజ్‌వాదీ పార్టీ, సైకిల్ గుర్తుకు అసలైన హక్కుదారులు తేలేవరకూ ములాయం, అఖిలేశ్ వర్గాలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్త పార్టీ పేర్లు కేటాయించవచ్చని భావిస్తున్నారు. నిర్ణయం వెలువరించే ముందు... ప్రత్యర్థి వర్గం వాదనలపై స్పందిం చాలంటూ ములాయం, అఖిలేశ్‌ను కోరతారని ఈసీ వర్గాలు తెలిపాయి. తుది తీర్పుకు 4 నెలలు పట్టే అవకాశముందన్నాయి. సంధి కోసం యత్నిస్తున్నాం ఢిల్లీలో ఉన్న ములాయం సన్నిహితుడు ఆజం ఖాన్ మాట్లాడుతూ... ఇరు వర్గాల మధ్య సంధి కోసం తాను చేయగలినదంతా చేస్తానని చెప్పారు. ‘ఏదైనా జరగొచ్చు. బహిష్కరణ ఎత్తివేస్తారని ఎవరు మాత్రం అనుకున్నారు’ అని అన్నారు. -
యూపీలో బాహాబాహీ
త్రికాలమ్ ఉత్తరప్రదేశ్(యూపీ)లో చారిత్రక పోరాటానికి తెరలేచింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి, మార్చి మాసాలలో ఏడు విడతలుగా జరిగే పోలింగ్ తర్వాత వెలువడే ఫలితం 2019 ఎన్నికలను విశేషంగా ప్రభావితం చేస్తుంది. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గత రెండున్నర సంవత్సరాలలో చెప్పుకోదగిన ఎన్నికల విజయం ఏదీ నమోదు చేయలేకపోయింది. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన పరాభవం పూర్వ పక్షం కావాలంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో అసాధారణ స్థాయిలో సీట్లు గెలుచు కోవాలి. కాంగ్రెస్ అథమస్థానంలో ఉంది. ఆ పార్టీకి ఊపిరిపోసే ప్రయత్నంలో రాహుల్‌గాంధీ నెలరోజుల పాటు కిసాన్ యాత్ర సాగించారు. కాంగ్రెస్ పార్టీకి ఇది జీవన్మరణ సమరం. ఈ ఎన్నికలలో రెండంకెల స్థానాలు సాధించకపోతే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని అధిష్ఠానవర్గానికి తెలుసు. అందుకే విశ్వ ప్రయత్నం. ప్రతిపక్ష నాయకురాలు మాయావతి అయిదేళ్ళుగా వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. మొత్తం 403 స్థానాలకూ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసు కొని అన్ని పార్టీల కంటే ముందుగానే పోరాటానికి సిద్ధమైపోయారు. అధికా రంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీలో అబ్బాయ్–బాబాయ్ పోరు సాగుతున్నప్పటికీ ఈ వెర్రిలో ఏదో మతలబు ఉన్నదేమోనన్న అనుమానం కలుగుతోంది. ఎస్పీకి సైతం ఇది ప్రతిష్ఠాత్మకమైన పోరాటం. ఈ ఎన్నికలలో నాలుగు పక్షాలూ చావోరేవో తేల్చుకోవలసిన పరిస్థితి. పోటాపోటీగా యాత్రలు శనివారంనాడు రెండు ప్రధాన పార్టీలూ సమరశంఖం పూరించాయి. లక్నోలో ఎస్పీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత ములాయంసింగ్, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో పాటు మాజీ ప్రధాని దేవెగౌడ, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)అధినేత లాలూప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. వేదికపైన ఉన్న నాయ కులంతా కత్తులు దూశారు. ఈ సభను ఐకమత్యసాధన సభగా అభివర్ణించి నప్పటికీ అఖిలేశ్, బాబాయి శివపాల్యాదవ్ల మధ్య మాటల తూటాలు నడిచాయి. బిహార్ మాదిరిగా యూపీలో సైతం మహాకూటమిని ఏర్పాటు చేయాలన్నది ములాయం సంకల్పం. అందుకు బిహార్ ముఖ్యమంత్రి, జనతా దళ్ (యూ) నాయకుడు నితీశ్ కుమార్ అంతగా ఆసక్తి చూపడం లేదని వినికిడి. నాలుగు స్థానాలు మాత్రమే కేటాయించారంటూ అలిగి బిహార్ మహా కూటమి నుంచి ఎస్పీ వైదొలిగిన విషయం నితీశ్ విస్మరించలేదు. జనతా పరివారం అంతా ఒక్కతాటిపై నిలిచి బీజేపీని మట్టి కరిపించాలంటూ దేవెగౌడ ఆకాం క్షించారు. లక్నోలో ఎస్పీ రజతోత్సవ సంబరాలు జరిగిన రోజే సహారన్‌పుర్‌లో పరివర్తన్యాత్రను బీజేపీ అధినేత అమిత్‌షా ప్రారంభించారు. 15,000 మంది పరివర్తన సారథులను తయారు చేశారు. వీరు 50,000 గ్రామాలను సంద ర్శిస్తారు. పరివర్తన యాత్ర 1,700 కిలోమీటర్లు సాగుతుంది. ఇది గురువారం మొదలైన అఖిలేశ్ రథయాత్రకు పోటీ. పాతికేళ్ళ కిందట నాటి బీజేపీ వరిష్ఠనేత లాల్‌కృష్ణ అద్వానీ రథయాత్ర చేశారు. సంఘ్ పరివారాన్ని అధికారపీఠం వైపు నడిపించారు. ఇప్పుడు అఖిలేశ్ రథయాత్ర జనతాపరివారాన్ని సమైక్యబాటలో నడిపించి అధికారాన్ని నిలబెట్టుకునే లక్ష్యంతో సాగుతోంది. బీజేపీ పరివర్తన యాత్రకు పశ్చిమ యూపీలోని సహారన్పుర్ని ఎన్నుకోవడం వెనుక చరిత్ర ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సహారన్‌పుర్ జిల్లా జనాభాలో 51శాతం మంది హిందువులైతే 46 శాతం మంది ముస్లింలు. ఇక్కడ హిందూ ఓట్లను సంఘటితపరచుకోవడం బీజేపీకి చాలా అవసరం. అందుకే మొన్న మేలో సైతం ప్రధాని మోదీ సహారన్‌పుర్ బహిరంగసభలో ప్రసంగించారు. తాను యూపీ వాడినేననీ, యూపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైనవాడిననీ గుర్తు చేశారు. సహారన్ పుర్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. యూపీ కాంగ్రెస్ ఉపాద్యక్షుడు ఇమ్రాన్ మసూద్ సొంత జిల్లా ఇది. 2014 నాటి ఎన్నికల ప్రచారంలో మసూద్ వీడియో క్లిప్ ఒకటి హల్చల్ చేసింది. నరేంద్ర మోదీని ముక్కలు ముక్కలుగా నరికే స్తానని మసూద్ అన్నట్టు ఈ వీడియోలో ఉంది. దానివల్ల బీజేపీ ప్రాబల్యం విశేషంగా పెరిగింది. మసూద్ పోస్టర్లు విరివిగా అతికించి బీజేపీ ప్రచారం పతాక స్థాయిలో చేసింది. ఇప్పుడు రాహుల్ వ్యూహంలో మసూద్ ముఖ్యుడు. ఇక్కడ బీజేపీ ప్రాబల్యాన్ని పెంచుకొని కాంగ్రెస్‌ను తుంచవలసిన అవసరం ఉంది. పరివర్తన యాత్రలో భాగంగా ప్రధాని మోదీ ఆరు సభలలో పాల్గొంటారు. లక్నోలో ఈ యేడాది ఇప్పటికే రెండు సభలలో మాట్లాడారు. డిసెంబర్లో మూడోసారి అక్కడ ప్రసంగించబోతున్నారు. బీజేపీ ఏ అవకాశాన్నీ విడిచి పెట్టకుండా సర్వశక్తులూ వినియోగించి పోరాటం చేస్తున్నది. ముఖ్యమంత్రిగా ఒక నాయకుడిని ముందు పెట్టుకోకపోవడం ఒక్కటే లోపం. మెజారిటీ వచ్చే అవకాశాలు ఏమాత్రం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ సైతం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల అభ్యంతరంతోనే రీటా బహుగుణ బీజేపీలో చేరిపోయారు. ఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థి అఖిలేశ్ అని ములాయం స్పష్టం చేశారు. బిఎస్పీ గెలిస్తే మాయావతే ముఖ్యమంత్రి. ఇటువంటి స్పష్టత బీజేపీకి లేదు. మాయావతి ముందంజ మాయావతి ఈసారి బాగా ముందుగానే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. ముస్లింలకూ, అగ్రవర్ణ హిందువులకూ ప్రాధాన్యం ఇవ్వడంతో కినిసి పార్టీ నుంచి కొందరు దళిత ప్రముఖులు వైదొలిగి బీజేపీ పంచన చేరారు. దళితుల అభ్యున్నతి కోసం కాన్షీరామ్ స్థాపించిన పార్టీలో దళితులను పక్కన పెట్టి ఇతర వర్గాలకు ప్రాముఖ్యం ఇవ్వడం ఏమిటన్నది వారి ప్రశ్న. ఎస్పీలో లుకలుకలు కారణంగా, అధికారంలో ఉన్న అయిదు సంవత్సరాలూ ఆ పార్టీ ముస్లింలకు రక్షణ కల్పించడంలో విఫలమైనదనే విమర్శ సర్వత్రా వినిపిస్తున్న కారణంగా ఈసారి ముస్లింలు బీఎస్పీవైపు మొగ్గుతారని మాయావతి ఆశ. అందుకే అభ్య ర్థులను ఖరారు చేసే క్రమంలో ముస్లింలకు పెద్దపీట వేయడం. యూపీలో ఉన్న చిన్నాచితకా ముస్లిం పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి ‘ఇత్తె హాద్ ఫ్రంట్’ను నెలకొల్పడం భారత రాజకీయాలలో ఒక చారిత్రక పరిణామం. మతం ఆధారంగా ఓట్లు అడగడం అవినీతి కిందికే వస్తుందంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఫ్రంట్ ఏర్పడటం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో మరి. ఈ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి పీస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్. వైద్య వృత్తి నుంచి రాజకీయాలలో ప్రవేశించి 2008లో పీస్ పార్టీని నెలకొల్పిన అయూబ్ ఖాన్ మతవాది. ముస్లిమేతరుల నాయకత్వంలో ఉన్న పార్టీలను బలపరచడం కంటే ముస్లింల నాయకత్వంలోనే కూటమి ఏర్పడి నట్లయితే ముస్లింలలో ఐకమత్యం సాధించవచ్చుననీ, ముస్లిం నేతలంతా కలసి సమష్టిగా ప్రచారం చేస్తే ముస్లిం ఓటర్లలో మనస్థయిర్యం పెరుగుతుందనీ ఇండి యన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు మతీన్ విశ్లేషణ. ముజఫర్‌నగర్ అల్లర్లు జరిగినప్పటి నుంచి గత రెండేళ్ళలో ముస్లింలపైన దాడులు వరుసగా జరుగుతు న్నాయనీ, హింసాకాండలో ముస్లింలే అధికంగా బలి అవుతున్నారనీ మతీన్ వాదన. ‘ఇత్తెహాద్ ఫ్రంట్’ యూపీలోని ముస్లిం ఓటర్లందరికీ ప్రాతినిధ్యం వహించకపోయినప్పటికీ భవిష్యత్తులో ఈ ఫ్రంట్ ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంది. ఇది జాతీయ సమైక్యతకు ముప్పుగా పరి ణమించే అవకాశమూ లేక పోలేదు. యూపీ ఎన్నికలలో ఈ ఫ్రంట్ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అఖిలేశ్ హయాంలో తమకు రక్షణ లభించలేదనే భావన ముస్లిం జనాభాలో బలంగా ఉన్నది కనుక వారు బీఎస్పీ వైపు చూసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి దళిత పక్షపాతి అయినప్పుడు సీట్లు తగ్గాయని దళిత నాయకులు అలగడంలో అర్థం లేదన్నది మాయావతి వాదన. దళిత ఓట్లు సరిపోవు కనుక ఇతర వర్గాల నుంచి మద్దతు కూడకట్టుకోవలసిన అవసరాన్ని మాయావతి చాలాకాలం కిందటే గ్రహించారు. అందుకే బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కానీ పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పటి నుంచి బ్రాహ్మణ నాయ కులలో ఎక్కువమంది తిరిగి బీజేపీ శిబిరంలోకి వెళ్ళారనే అభిప్రాయం ఉంది. ఇండియా టుడే–యాక్సిస్ అభిప్రాయ సేకరణ ఫలితాల ప్రకారం ఏ ఒక్క పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ (403 స్థానా లున్న అసెంబ్లీలో 202 స్థానాలు) రాకపోవచ్చుననీ, అతి పెద్ద పార్టీగా 170 నుంచి 183 స్థానాలతో బీజేపీ (2012 ఎన్నికలలో 47స్థానాలు), రెండో స్థానంలో 115 నుంచి 124 స్థానాలతో బీఎస్పీ (2012లో 80 స్థానాలు), మూడో స్థానంలో 94 నుంచి 103 స్థానాలతో ఎస్పీ (2012లో 224 స్థానాలు) నిలుస్తాయి. గత శాసనసభ ఎన్నికలలో 28 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ సారి 8 నుంచి 12 స్థానాలు మాత్రమే దక్కుతాయని ఇండియా టుడే–యాక్సిస్ సర్వే లెక్కకట్టింది. అఖిలేశ్ తిరుగుబాటు చేస్తాడా? పాతతరం నాయకులను పూర్వపక్షం చే సి యువజన మనోరథుడుగా అఖిలేశ్ బలమైన ముద్ర వేయగలిగితే, మహాకూటమి స్వప్నం సాకారమైతే ఎస్పీకి విజయావకాశాలు మెరుగు కావచ్చు. నిజలింగప్ప, ఎస్కె పాటిల్, అతుల్యఘోష్ వంటి సిండికేట్ నాయకులను తోసిరాజని 1969లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని చీల్చినట్టు ఇప్పుడు అఖిలేశ్ తనదంటూ ప్రత్యేక పంథాను నిర్ణయించు కోగలిగితే యువ ముఖ్యమంత్రిగా మరో అవకాశం అతనికి లభించవచ్చు. అఖి లేశ్పైన అవినీతి ఆరోపణలు లేవు. ఆధునిక భావాలు కలిగిన యువ నాయ కుడిగా పేరున్నది. నేర చరిత్ర ఉన్నవారు పార్టీలో చేరకుండా అడ్డుతగిలిన నాయ కుడిగా పేరు తెచ్చుకున్నారు. అభివృద్ధికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలు కల్పించే క్రమంలో మంచి రోడ్లు వేయించాలనీ, విమానాశ్రయాలు కట్టించాలనీ, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి పెంచాలనీ తాపత్రయ పడుతున్న ముఖ్యమంత్రిగా ప్రజలలో ఒక అవగాహన ఉంది. అయితే, చిన్నాన్నలూ, మామలూ, ఇతర బంధువులూ, ములాయంసింగ్ సహచరులూ పెత్తనం చేస్తున్నారనీ, అఖిలేశ్‌కు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదనీ ప్రచారం బాగా జరిగింది. తిరుగుబాటు బావుటా ఎగర వేసిన నాయ కుడుగా పేరు తెచ్చుకుంటే అఖిలేశ్‌కి అవకాశం ఉంటుంది. అఖిలేశ్ నాయకత్వం కొనసాగించి స్వేచ్ఛ ఇస్తేనే తాము మహాకూటమిలో చేరే విషయం ఆలోచి స్తామని అజిత్‌సింగ్ (ఆర్ఎల్డి నాయకుడు), శరద్‌యాదవ్ సూచించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం ఢిల్లీలో ములాయంసింగ్తోనూ, అమర్సింగ్తోనూ రెండుగంటల పాటు సమా లోచనలు జరిపినట్టు భోగట్టా. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అభి లాషను మాయావతి ఇంతవరకూ వెలిబుచ్చలేదు. కాంగ్రెస్‌తో పొత్తు కార ణంగా ఎస్పీకి కానీ బీఎస్పీకి కానీ ముస్లిం ఓట్లలో అధిక భాగం వచ్చే అవకా శాలున్నాయి. ఎస్పీ నాయకత్వంలోని మహాకూటమిలో కాంగ్రెస్ చేరితే ఆ మేరకు బీఎస్పీకి నష్టం. అదేవిధంగా బీఎస్పీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఎస్పీకి నష్టం. కాంగ్రెస్ పార్టీకి స్వయంగా పెద్ద ఓటు బ్యాంక్ లేకపోయినప్పటికీ ముస్లిం ఓటును ప్రభావితం చేసే శక్తి ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపైన భారత సైన్యం ఇటీవల జరిపిన మెరుపు దాడుల (సర్జికల్ స్ట్రయిక్స్) గురించి బీజేపీ విధిగా ప్రచారం చేస్తుంది. మోదీ, షా, రాజ్‌నాథ్‌సింగ్ ఈ దాడులను ఎన్నికల ప్రచారంలో నిస్సందేహంగా వినియోగించుకుంటారు. హిందూ ఓట్లను కూడగట్టడానికి అవసరమైన అన్ని విద్యలనూ బీజేపీ ప్రదర్శిస్తుంది. ప్రజలు ఈ విద్యల ప్రభావానికి ఎంతవరకూ లోను అవుతారనే అంశం పైనా, కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనే విషయంపైనా యూపీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ సరళి ఆధారపడి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధిస్తే 2019లో ఆ పార్టీని పట్టుకోవడం కష్టం. బీజేపీకి యూపీలో బిహార్ ఎదురైతే ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం. అందుకే యూపీ ఎన్నికలు ప్రభావ రీత్యా సార్వత్రిక ఎన్నికలతో సమానం. (వ్యాసకర్త : కె.రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ ) -
మీ సేవలకు దండం.. ఇక పార్టీ నుంచి వెళ్లిపోండి!
పనిచేయని కాంగ్రెస్ నేతలకు పార్టీ చీఫ్ హుకుం లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ప్రజల్లోకి చొచ్చుకెళ్లి ప్రచారం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో కార్యకర్తలను, నేతలను సన్నద్ధం చేస్తోంది. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని, ప్రజల సమస్యలు తెలుసుకొని వారితో మమేకం కావాలని పార్టీ శ్రేణులకు హస్తం అగ్రనాయకత్వం పిలుపునిచ్చింది. యూపీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా నిద్రలేవాలని, తమ విశ్రాంత ధోరణిని విడనాడి.. రాష్ట్రమంతటా విస్తారమైన ప్రచారం చేసేందుకు సన్నద్ధం కావాలని యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. పార్టీ హైకమాండ్ ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసిందని, పార్టీ శ్రేణులు మొద్దునిద్ర వదలకపోతే బయటకు పంపిస్తామని బబ్బర్ హెచ్చరించారు. నిష్క్రియగా వ్యవహరించే నేతలంతా తమ దారి తాము చూసుకోవచ్చునని, పనిచేయని నేతలను పార్టీ నుంచి పంపించేస్తామని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం పార్టీ నిర్వహిస్తున్న ప్రచారంలో చురుగ్గా పాల్గొనే నేతలనే క్రియాశీలంగా ఉన్న నేతలుగా భావిస్తామని ఆయన 'ఇండియా టుడే'తో మాట్లాడుతూ స్పష్టం చేశారు. -
'మేం ఒంటరిగానే బరిలోకి..'
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ పార్టీ నేత, ఆ పార్టీతరుపున ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్ చెప్పారు. ఏ ఒక్కపార్టీతో పొత్తుపెట్టుకోబోమని అన్నారు. 2017లో జరిగే ఈ ఎన్నికల్లో ఫలితాలు ప్రతి ఒక్కరని అబ్బురపరుస్తాయని, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పక ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, మీరు ఎక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని షీలా చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు ఇప్పటికే బీజేపీ, సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్ వాది పార్టీల పాలనను చూశారని ఇప్పుడు వారంతా గొప్ప ఆశతో కాంగ్రెస్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అభివృద్ధి నినాదంతో ప్రజల ముందుకెళ్లి వారి మద్దతు పొందుతామని చెప్పారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పరిపాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని, మతం పేరిట దాడులు పెరిగాయని ఆరోపించారు. -
మాయవతిపై మొరటు వ్యాఖ్యలు
♦ ఆమె తీరు వేశ్యకంటే ఘోరమన్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు ♦ దయాశంకర్‌సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం ♦ పార్టీలకతీతంగా ఆయన వ్యాఖ్యలను ఖండించిన నేతలు ♦ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ ♦ కమలనాథులపై విరుచుకుపడిన మాయావతి ♦ ప్రజలు రోడ్లపైకి వస్తే ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరిక ♦ దయాశంకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ ♦ నోరు జారా.. క్షమించండి.. మాయవతి అంటే నాకు గౌరవం ఉంది: దయాశంకర్ కాన్షీరాం కలలను మాయావతి ఛిద్రం చేస్తున్నారు. రూ. కోటి ఎవరిస్తే వారికే టికెట్లు అమ్ముకుంటున్నారు. ఎవరైనా రెండు కోట్లిస్తే.. గంటలోనే ఆ టికెట్ వేరొకరికి సొంతమవుతోంది. సాయంత్రం మరొకరు వచ్చి మూడు కోట్లిస్తానంటే అతనికే టికెట్ ఇచ్చేస్తున్నారు. మాయావతి తీరు వేశ్యకంటే దారుణం - దయాశంకర్‌సింగ్ దయాశంకర్‌ను పార్టీ నుంచి తొలగించాలి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ అంశంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆయన వ్యాఖ్యలు పెట్టుబడిదారీ ఆలోచనా ధోరణికి అద్దంపడుతున్నాయి. - మాయావతి న్యూఢిల్లీ/మావు: ‘‘కాన్షీరాం కలలను మాయావతి ఛిద్రం చేస్తున్నారు. రూ. కోటి ఎవరిస్తే వారికే టికెట్లు అమ్ముకుంటున్నారు. ఎవరైనా రెండు కోట్లిస్తే.. గంటలోనే ఆ టికెట్ వేరొకరికి సొంతమవుతోంది. సాయంత్రం మరొకరు వచ్చి మూడు కోట్లిస్తానంటే అతనికే టికెట్ ఇచ్చేస్తున్నారు. మాయావతి తీరు వేశ్యకంటే దారుణం’’అని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్.. బీఎస్పీ అధినేత్రి, మూడు సార్లు ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయవతిని ఉద్దేశించి సభ్యసమాజం తలదించుకునేలా చేసిన దారుణ వ్యాఖ్యలివీ. ఓ దళిత నాయకురాలిని ఉద్దేశించి చేసిన ఈ హేయమైన వ్యాఖ్యలు పార్లమెంట్ లోపలా.. వెలుపలా ప్రకంపనలు సృష్టిం చాయి. ఒక మహిళా నాయకురాలిని, ఓ పార్టీ అధినేతను పట్టుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీలకతీతంగా నాయకులంతా ముక్త కంఠంతో ఖండించారు. దయాశంకర్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఆయనను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ మాయావతి ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక చేశారు. ఈ పరిణామాలతో ఇరకాటంలో పడిన బీజేపీ.. తక్షణం దయాశంకర్‌ను పార్టీ పదవుల నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ నిబంధనల ప్రకారం ఆయనపై నిషేధం ఆరేళ్లపాటు ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దళితులకు దగ్గరయ్యేందుకు బీజేపీ విఫలయత్నం చేస్తోంది. ఇటువంటి సమయంలో దయాశంకర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. రాజ్యసభలో దుమారం.. బీజేపీ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మంగళవారం తొలిసారి మావుకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాయావతిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బుధవారం రాజ్యసభలో దుమారం రేగింది. గుజరాత్లో దళితులపై అరాచకాల అంశంలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ అంశం సభ ముందుకొచ్చింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఈ అంశాన్ని లెవనెత్తారు. గౌరవనీయ మహిళా నాయకురాలు, మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన మాయావతిపై ఇటువంటి వ్యాఖ్యలు దారుణమని ఖండించారు. డీఎంకే నాయకురాలు కనిమొళి, టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రయాన్, కాంగ్రెస్ సభ్యులు కుమారి షెల్జా, రేణుకాచౌదరి, సీపీఎం ఎంపీ టీకే రంగరాజన్, బీఎస్పీ నాయకుడు సతీశ్ చంద్ర మిశ్రా తదితరులు ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఆయన వ్యాఖ్యలు క్షమార్షం కానివని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సభ్యులతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభ తరఫున ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. సభా నాయకుడు అరుణ్‌జైట్లీ స్పందిస్తూ.. దయాశంకర్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నానని, ఈ అంశంలో మాయావతికి తాము పూర్తి మద్దతుగా ఉంటామన్నారు. జైట్లీ హామీతో శాంతించని మాయావతి.. దయాశంకర్‌ను పార్టీ నుంచి తొలగించాలని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు పెట్టుబడిదారీ ఆలోచనా ధోరణికి అద్దంపడుతున్నాయని మండిపడ్డారు. తనను అంతా బెహెన్జీ (సోదరి)గా భావిస్తారని, అటువంటి తనపై చేసిన వ్యాఖ్యలు ఆయన కుమార్తె, సోదరికి కూడా వర్తిస్తాయని ధ్వజమెత్తారు. దేశంలో దోపిడీకి, అణచివేతకు గురవుతున్న ప్రజలకు తాను ప్రాతిని ధ్యం వహిస్తున్నానని, వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేశానని చెప్పారు. కాన్షీరాం ప్రారంభించిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పెట్టుబడిదారుల నుంచి కాక పేదల నుంచే తాము విరాళాలు స్వీకరిస్తున్నామని వివరించారు. నోరు జారా.. క్షమించండి.. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో పాటు పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకోవడంతో దయాశంకర్‌సింగ్ క్షమాపణలు చెప్పారు. పేద కుటుంబం నుంచి వచ్చి అగ్రనేతగా ఎదిగిన మాయావతి అంటే తనకు గౌరవం ఉందని, అయితే ఈ విషయంలో తాను నోరు జారానని పేర్కొన్నారు. అయితే దయాశంకర్‌ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రకటించారు. అటువంటి భాషకు పార్టీలో స్థానం లేదని, ప్రసంగాలు ఇచ్చే సమయంలో నాయకులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. కోర్టుకీడుస్తాం: బీఎస్పీ ఎంపీ ఎస్సీ మిశ్రా పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ.. తాము ఈ అంశాన్ని వదిలిపెట్టబోమని, దయాశంకర్‌పై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఆయనను ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కోర్టుకీడుస్తామన్నారు. మాయాకు జయ బాసట మాయావతిపై బీజేపీ నాయకుడు దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు సీఎం జయలలిత ఖండించారు. సింగ్ మాటలు ఆయన పార్టీని అప్రతిష్టపాలు చేస్తాయని, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడుల గురించి మాయావతి పార్లమెంటులో లేవనెత్తినందునే సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో మహిళలు తరచుగా ఇలాంటి ‘దాడుల’ను ఎదుర్కొంటున్నారని, తాను కూడా ఇలాంటి చెడు క్షణాలను ఎదుర్కొన్నానని చెప్పారు. కాగా, దయాశంకర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ బీఎస్పీ గురువారం లక్నోలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. దయాశంకర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీలోని అధికార సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం చెప్పింది. దయాశంకర్‌పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ బీఎస్పీ నాయకులు చేసిన ఫిర్యాదుమేరకు లక్నో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఐపీసీ 153ఏ, 504, 509 సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు. -
యూపీ సీఎం అభ్యర్థిగా షీలాదీక్షిత్
ఖరారు చేసిన కాంగ్రెస్ న్యూఢిల్లీ: రాజకీయంగా ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోం ది. అపార అనుభవమున్న నాయకురాలు షీలాదీక్షిత్‌ను సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపుతోంది. వరుసగా మూడుసార్లు ఢిల్లీకి సీఎంగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన షీలా పేరును ఖరారు చేస్తూ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్, మరో నాయకుడు జనార్దన్ ద్వివేదీతో కలసి గురువారమిక్కడ ప్రకటన చేశారు. యూపీలో ప్రభావం చూపగల స్థాయిలో బ్రాహ్మణులున్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన షీలా అభ్యర్థిత్వం రాబోయే ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఏసీబీ విచారణ ఎదుర్కొం టున్న షీలాదీక్షిత్‌ను ఎలా ఎంపిక చేశారని ఆజాద్‌ను ప్రశ్నించగా... ఛత్తీస్‌గఢ్, రాజ స్థాన్, మధ్యప్రదేశ్ సీఎంలతో పాటు మహారాష్ట్రలోని చాలామంది బీజేపీ మం త్రులపై కూడా అవినీతి ఆరోపణలున్నాయన్నారు. ఒకవేళ ఆ సీఎంలు రాజీనామాకు సిద్ధపడితే... తాము కూడా షీలా పేరును వెనక్కి తీసుకొంటామన్నారు. పంజాబీ ఖత్రి కుటుంబంలో జన్మించిన 78 ఏళ్ల షీలాదీక్షిత్ యూపీలోని కాంగ్రెస్ సీనియర్‌నేత శంకర్ దీక్షిత్ కోడలు. కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా సుదీర్ఘ కాలంపాటు ఆయన పనిచేశారు. 1984లో యూపీలోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన షీలా కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2010 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా బ్రాహ్మణులకు అధిక టికెట్లు ఇచ్చి వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టగలిగారు. ఈ క్రమంలో షీలా ఏ స్థాయిలో బ్రాహ్మణ ఓట్లను రాబడతారో వేచిచూడాల్సిందే. -
షీలా దీక్షిత్ కే జై కొట్టిన కాంగ్రెస్
-
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభం
అలహాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం ఉదయం అలహాబాద్‌లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ ఎంపీలు హాజరుకానున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలతో అమిత్ షా భేటీయ్యారు. ఈ సమావేశంలో వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా వ్యూహాలు రచించనున్నారు. ఈ సమావేశాలను యూపీ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శంఖారావ సభగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్ అభివర్ణించిన విషయం తెలిసిందే.