లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గెలిస్తే గృహావసరాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని, వ్యవసాయానికి ఉచిత్ విద్యుత్‌ను సరఫరా చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. యూపీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అఖిలేశ్ శనివారం ట్విట్టర్‌లో ఈ మేరకు ప్రకటన చేశారు.
యూపీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా గృహావసరాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామని 2021 సెప్టెంబరులోనే ప్రకటించింది. అధికారంలోకి వస్తే 38 లక్షల కుటుంబాలకు విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తామని, రోజుకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని కూడా హామీలు ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి– మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాలు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలోనూ ఆప్ ఇదే హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment