Free power supply
-
'అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ఉచిత్ విద్యుత్'
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గెలిస్తే గృహావసరాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని, వ్యవసాయానికి ఉచిత్ విద్యుత్‌ను సరఫరా చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. యూపీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అఖిలేశ్ శనివారం ట్విట్టర్లో ఈ మేరకు ప్రకటన చేశారు. యూపీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా గృహావసరాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామని 2021 సెప్టెంబరులోనే ప్రకటించింది. అధికారంలోకి వస్తే 38 లక్షల కుటుంబాలకు విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తామని, రోజుకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని కూడా హామీలు ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి– మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాలు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలోనూ ఆప్ ఇదే హామీ ఇచ్చింది. చదవండి: (హిజాబ్ ధరించారని క్లాస్‌లోకి రానివ్వలేదు) -
ఉచిత విద్యుత్తు..రోజంతా కరెంటు
చండీగఢ్: పంజాబ్‌లో 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందివ్వాలని, రోజంతా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు. పరిశ్రమలకు కూడా తక్కువ ధరకే కరెంటు సరఫరా చేయాలని ఆదివారం ట్విట్టర్లో కోరారు. ‘పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే 9వేల కోట్ల సబ్సిడీ ఇస్తోంది. దీంతోపాటు, గృహ, పారిశ్రామిక అవసరాలకు ప్రస్తుతం ఒక్కో యూనిట్‌పై రూ.10–12వరకు విధిస్తున్న సర్ఛార్జిని రూ.3–5కు తగ్గించాలి’అని ట్వీట్ చేశారు. ఆప్ పంజాబ్‌లో అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా, అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేస్తామంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో సిద్దూ ఈ మేరకు పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా డిమాండ్ చేయటం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధిష్టానం సూచించిన 18 అంశాలతో కూడిన ప్రజానుకూల ఎజెండాను అమలు చేయాలన్నారు. జాతీయ విధానం ప్రకారం కొత్తగా విద్యుత్ కొనుగోలు ధరలను నిర్ణయిస్తూ పంజాబ్ శాసనసభ కొత్త చట్టాలను ఆమోదించాలని సూచించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో పలు అంశాలపై విభేదిస్తూ వస్తున్న సిద్ధూ ఈ మేరకు ట్వీట్లు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
అలా జరిగితే పదవి వదులుకుంటా: బాలినేని
-
అలా జరిగితే పదవి వదులుకుంటా: బాలినేని
సాక్షి, ఒంగోలు : విద్యుత్ సంస్కరణల విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని ,లేనిపోని అపోహలు సృష్టించవద్దని ఆ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ఉచిత విద్యుత్‌కి ఎటువంటి విఘాతం కలగదని అన్నారు. ఎట్టి పరిస్థితిలో రైతులు డబ్బు కట్టే పరిస్థితి రాదని బాలినేని స్పష్టం చేశారు. రైతులు ఒక్క రూపాయి కట్టే పరిస్థితి వస్తే తన మంత్రి పదవి వదులుకుంటానని తెలిపారు. (రైతుల ఖాతాలోకే విద్యుత్ సబ్సిడీ) మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పధకం ఎట్టి పరిస్థితిలో ఆపే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఆనాడు ఉచిత విద్యుత్ గురించి వైఎస్సార్ మాట్లాడితే ..తీగల మీద బట్టలు ఆరవేసుకోవాల్సిందే అని చంద్రబాబు ఎద్దేవా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాలినేని గుర్తుచేశారు. విద్యుత్ గురించి మాట్లాడితే బషీర్ బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలో భాగంగా రైతులకు ,ఉచిత విద్యుత్‌కు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బాలినేని తెలిపారు. రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని అన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే డబ్బులు జమచేసి ఆ బిల్లు డబ్బును డిస్కం ఖాతాలో జమచేయడం ద్వారా రైతులకు ఎటువంటి నష్టం లేదని మంత్రి బాలినేని పేర్కొన్నారు. కాగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతన్నల అజమాయిషీ పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసింది. ఈ పథకం ద్వారా ఇంతకాలం విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు)కు చెల్లిస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఇక నేరుగా రైతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ తరువాతే ఆ డబ్బు డిస్కమ్‌లకు చేరుతుంది. ఉచిత విద్యుత్తు ద్వారా వ్యవసాయదారులు ఎంత కరెంట్ వాడుకున్నా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. -
‘18.5 లక్షల రైతు కుటుంబాలకు ఉచిత విద్యుత్’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 18.5 లక్షల రైతు కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవంతరాలు లేకుండా చూడాలని అధికారులను మంత్రి బాలినేని శ్రీనివాస్ ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ ప్లీడర్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకాలపై అధికారులు తక్షణమే స్పందించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని హెచ్చరించారు. -
తుని: నాడు తండ్రి..నేడు తనయుడు..
సాక్షి, తుని రూరల్(తూర్పు గోదావరి): సార్వత్రిక ఎన్నికల ముందు నవరత్నాల పథకాల్లో భాగంగా వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామన్న హామీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ఆదిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా సోమవారం నియోజకవర్గంలో ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలు వరకు, ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటలు వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు ట్రాన్స్‌కో అధికారులు ట్రయిల్‌రన్ నిర్వహించారు. ట్రయిల్‌రన్ నిర్వహించి ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లలో మార్పులు గమనిస్తున్నట్టు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. ఏ విధమైన ఒత్తిడి ఉందో ఉన్నత అధికారులకు నివేదిక ఇవ్వనున్నట్టు తుని రూరల్ ఏఈ కామేశ్వర శాస్త్రి తెలిపారు. నియోజకవర్గంలో 3,593 వ్యవసాయ విద్యుత్ బోరుబావులు ఉన్నాయి. అమలులో జగన్ వాగ్దానం నవరత్నాల పథకాల్లో అమలు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు ట్రాన్స్‌కో అధికారులు 9గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఏడు గంటలు ఉచిత విద్యుత్ అందించి రైతుల గుండెళ్లో నిలిచిపోయారు. దివంగత రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రైతులకు అండగా నిలిచేందుకు పగలే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రాత్రివేళల్లో సరఫరా అయ్యే ఉచిత విద్యుత్ కోసం పంట పొలాల్లో కష్టపడుతూ, విద్యాద్ఘాతానికి గురై ఎంతో మంది కర్షకులు మృత్యువాత పడ్డారు. అటువంటి సంఘటనలు తన ప్రభుత్వంలో జరగకుడదన్న సంకల్పంతో పగలే రెండు షిఫ్టులుగా ఉచిత విద్యుత్‌ను సరఫరాకు ఆదేశించారు. ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో... తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాలన్న రైతులు కల నెరవేరనుంది. ఉదయం ఐదు గంటల నుంచి మొదటి షిప్టు, పది గంటల నుంచి రెండో షిప్టు ఉచిత విద్యుత్‌ను తొమ్మిది గంటలు సరఫరా చేయనున్నారు. అనుకున్నట్టు రెండు మూడు రోజులు ట్రయిల్ రన్లు నిర్వహించి అవాంతరాలు సవరించి పట్టపగలే వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసి సాగుకు కొత్త కళ తీసుకురానున్నారు. తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సరఫరా సమర్థవంతంగా అమలయితే వేలాది ఎకరాలకు సాగునీరు లభించడంతో మెట్ట భూములు సస్యశ్యామలమవుతాయిన రైతులు పేర్కొన్నారు. నాడు తండ్రి, నేడు తనయుడు రైతులు కష్టాలను కళ్లారా చూసిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2004లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఏడు గంటలు అందిస్తే, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పగలే తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అమలకు చర్యలు చేపట్టడం వ్యవసాయం, రైతులపై తండ్రికొడుకులకు ఉన్న నిబద్ధత తెలియజేస్తుంది. – నాగం దొరబాబు, రైతు, చామవరం కరెంట్ కష్టాలు తీరినట్టే పగలనక రాత్రనక ఉచిత విద్యుత్ ఎప్పుడు సరఫరా అవుతుందాని పంట పొలాల్లో కాపలాకాసే రోజులు పోయాయి. వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అందించడం సహసమే. రైతులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను పాదయాత్రలో చూసిన ముఖ్యమంత్రి జగన్ు రైతులకు కరెంట్ కష్టాలను తీర్చారు. – పరవాడ అప్పారావు, రైతు, కుమ్మరిలోవ వాణిజ్య సాగుకు ఊతం పట్టపగలే వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అందించడం వాణిజ్య పంటల సాగుకు ఊతం ఇచ్చి నట్టయ్యింది. సూక్ష్మ పరికరాలు ఏర్పాటు చేసుకుంటే ఎనిమిది నుంచి పది ఎకరాలకు సాగునీరు అందనుంది. పగలే భూగర్భ జలాలను తోడుకోవడం వల్ల రాత్రులు పొలాల్లో కష్టాలు పడాల్సిన పనిలేదు. – దాట్ల సతీష్ వర్మ, రైతు, తేటగుంట -
9 గంటల ఉచిత కరెంట్ నిర్ణయంపై రైతుల హర్షం
-
విద్యుత్ ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
ఏదీ ఆ ఆపన్నహస్తం?
2004 సంవత్సరానికి ముందు ప్రతి జిల్లాలోనూ పింఛన్ల సంఖ్య పరిమితమే. అన్ని అర్హతలు ఉన్నవారు సైతం పింఛను కోసం అప్పటి లబ్ధిదారులలో ఎవరో ఒకరు కన్ను మూసే దాకా వేచి ఉండక తప్పని పరిస్థితి. అదికూడా నెలకి కేవలం రూ. 75. సంఖ్యతో సంబంధం లేకుండా, కులమతాలతో నిమిత్తం లేకుండా, రాజకీయాలకు అతీతంగా అర్హు లందరికీ పింఛన్లు మంజూరు చేయకుంటే అది నేరమని వైఎస్ భావించారు. ఆయన పాలనాకాలంలో దాదాపు 50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ మూడు దశాబ్దాలలో నేను ఎందరో రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తూ సన్నిహితంగా మెలిగాను. ముఖ్యంగా ముఖ్యమంత్రులు, మంత్రుల దగ్గర చాలా నేర్చుకున్నాను. నా అభిరుచి మేరకు తెలుగువారి రాజకీయ చరిత్రను కూడా అధ్యయనం చేశాను. వారందరిలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అద్వితీయుడని ఎలాంటి సంకో చాలు లేకుండా చెప్పగలను. ఆయన పుట్టుకతో నాయకుడు. క్రమశిక్షణ కలిగి నవారు. ధైర్యశాలి, కష్టపడి పనిచేసేవారు. క్లిష్టమైన అంశాల మీద నిర్ణయాలు చేయడానికి వెనుకాడేవారు కాదు. అనుయాయులంటే ప్రాణమిచ్చేవారు. ఇదే లక్షణం మిత్రులను, అనుయాయులను వైఎస్ వెనుక కలకాలం నిలబడేటట్టు చేసింది. వీటన్నిటికీ మించి వైఎస్ గొప్ప దయార్ద్ర హృదయులు. దారిద్య్రాన్ని చూస్తే ఆయన మనసు ద్రవించేది. చెప్పుకోదగిన ఎన్నో విశేషాలు కలిగిన అలాంటి నేతతో దాదాపు దశాబ్దంపాటు సన్నిహితంగా పనిచేయడం నా జీవితంలోనే ఎంతో చెప్పు కోదగ్గ విషయం. వైఎస్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అత్యున్నత స్థాయిలో ఆర్థిక వృద్ధి రేటును సాధించింది. ఆర్థికాభివృద్ధి ఫలితాలు అట్టడుగువర్గాలకు చేరింది కూడా అప్పుడే. అందుకే ఐదేళ్ల మూడు మాసాలు సాగిన వైఎస్ పరి పాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఓ అద్భుతం. సీఎస్‌వో (కేంద్ర గణాంకాల సంస్థ) సమాచారం ప్రకారం 2004-2009 మధ్య ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ సగటు వార్షిక ఆర్థిక (జీఎస్డీపీ) వృద్ధి రేటు 9.6 శాతం. ఇది అప్పటి జాతీయ సగటు 8.5 శాతం కంటే ఎక్కువే కాకుండా, అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ (1999-2004) సాధించిన ఐదేళ్ల సగటు వార్షిక వృద్ధి రేటు 6.06 శాతం కన్నా అధికం. 2004-2009 మధ్య సాధించిన 9.6 శాతం ఆర్థిక వృద్ధి రేటు 1956 తరువాత ఐదేళ్ల కాల పరిమితిలో మొద టిసారి నమోదైన అత్యున్నత వృద్ధి రేటు. రైతుల కోసం ఉచిత విద్యుత్ సరఫరాకు ఆదేశాలు ఇస్తూ, మే 14, 2004 వరకు ఉన్న రైతుల విద్యుత్ బకాయిలు రూ. 1,300 కోట్లు మాఫీ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ తొలి ఫైలు మీద సంతకం చేసినప్పుడు చాలా మంది ఇది తాత్కాలిక వ్యవహారమని జోస్యం చెప్పారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ పుణ్యమా అని ఇతర వర్గాలకు సరఫరా చేసే విద్యుత్‌పై టారిఫ్‌ను ఇతోధికంగా పెంచుతారని కూడా పలువురు భావించారు. కానీ వైఎస్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు సంపూర్ణంగా రైతులకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసింది. 2004లో 800 కోట్ల యూనిట్లుగా ఉన్న వ్యవసాయ రంగ విద్యుత్ వినియోగం 2009 నాటికి 1,500 కోట్లకు పెరిగినప్పటికీ ఇతర వర్గాల మీద ఏమాత్రం టారిఫ్ భారం పడకుండానే వైఎస్ ప్రభుత్వం పూర్తికాలం రైతులకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసింది. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించిన తరువాత ఏ వర్గం వినియోగదారుల మీద కూడా వరసగా ఐదేళ్లు విద్యుత్ టారిఫ్‌ను పెంచకుండా ఉన్న కాలం ఇదొక్కటే. ఒకసారి ప్రణాళికా సంఘం సమావేశానికి డాక్టర్ వైఎస్ఆర్తో కలసి నేను హాజరయ్యాను. అప్పుడు డాక్టర్ మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా సంఘం ఉపాధ్యక్షులు. ఆ సందర్భంలోనే, ఇతర వర్గాల వినియోగదారులకు చార్జీలు పెంచకుండానే మీరు రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? దే శం మొత్తం మీద విశేష స్థాయిలో సంక్షేమ పథకాలూ అమలు చేస్తున్నారు. అది కూడా పన్నులు పెంచకుండా, ఆదాయ లోటు బాధ లేకుండా అమలు చేస్తున్నారు. ఇదెలా సాధ్యపడుతోందని సింగ్ డాక్టర్ వైఎస్ఆర్ను అడిగారు. ఇంకా, మీకు అవకాశం ఉన్న మేర రుణం కూడా తీసుకోరు. అయినప్పటికీ చాలా అభివృద్ధి పథకాలను అమలు చే స్తున్నారు. మీ దగ్గర మంత్రదండం ఏదైనా ఉందా? అని కూడా అడిగారాయన. నా మంత్రదండం ఏదైనా ఉన్నదీ అంటే అది, నా నిబద్ధత, నాకున్న పరిపూర్ణ విశ్వాసం అని నవ్వుతూ జవాబిచ్చారు వైఎస్. ఆరోగ్య పరిరక్షణ అందరికీ అందుబాటులో లేని కాలంలో, ముఖ్యంగా పేదవర్గాలకీ, మధ్యతరగతికీ అందరానిదిగా ఉన్న కాలంలో, ఈ వర్గాలు వైద్యసేవల కోసం రుణాల ఊబిలో కూరుకుపోతున్న సమయంలో డాక్టర్ వైఎస్ ఆరోగ్య రక్షణ ప్యాకేజీలను ప్రవేశపెట్టారన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఫిక్స్డ్ డే వైద్యసేవలు (104), అత్యవసర వైద్యానికి రాకపోకల సేవలు (108), రాజీవ్ ఆరోగ్యశ్రీలను ఆ పరిస్థితులలో ఆయన ప్రవేశపెట్టారు. ఇలాంటి సేవలు అమలులోకి రావడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడానికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా వెనుకాడుతున్న సమయంలో రాష్ట్రంలో వైఎస్ అమలు చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు తీవ్ర రుగ్మతలకు గురైనప్పుడు సంవత్సరంలో ఒకసారి రెండు లక్షల రూపాయల వరకు వైద్యసేవల నిమిత్తం చెల్లించే సదుపాయం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద కల్పించారు. వృద్ధులకీ, అనాథలుగా మిగిలిన మహిళలకీ, అభాగ్య విధవలు లేదా దివ్యాంగులు - ఇలాంటి వారందరికీ ఆపన్నహస్తం అందివ్వాలన్న ఆయన తపన ఎప్పటికీ గుర్తుంటుంది. అర్హులందరికీ అందే విధంగా ఆనాటి పింఛను పథకాన్ని వైఎస్ విస్తరించారు. 2004 సంవత్సరానికి ముందు ప్రతి జిల్లా లోనూ పింఛన్ల సంఖ్య పరిమితమే. అన్ని అర్హతలు ఉన్నవారు సైతం పింఛను కోసం అప్పటి లబ్ధిదారులలో ఎవరో ఒకరు కన్నుమూసే దాకా వేచి ఉండక తప్పని పరిస్థితి. అదికూడా నెలకి కేవలం రూ. 75. సంఖ్యతో సంబంధం లేకుండా, కులమతాలతో నిమిత్తం లేకుండా, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయకుంటే అది నేరమని వైఎస్ భావించారు. ఆయన పాలనా కాలంలో దాదాపు 50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. మహిళా సాధికారతను పటిష్టం చేయడానికి స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) నెట్‌వర్క్‌ను ఆయన బలోపేతం చేసిన తీరు దేశంలోనే అపూర్వం. తాగు, సాగు అవసరాల కోసం ప్రతి నీటి బిందువునూ సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో చేపట్టిన జలయజ్ఞం కూడా దేశంలో అద్వితీయమైనది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి కోసం చేసిన కృషి డాక్టర్ వైఎస్ ప్రభుత్వం నమోదు చేసుకున్న గొప్ప విజయగాథలలో ఒక గాథ. 2004-2009 సంవత్సరాలలో వ్యవసాయ రంగంలో 6 శాతం వాస్తవ వార్షిక వృద్ధి రేటును లక్ష్యంగా నిర్దేశించుకుంటూ వైఎస్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. నాటి రాష్ట్ర గవర్నర్ సుర్జీత్ సింగ్ బర్నాలా జూన్ 1, 2004న శాసనసభలో చేసిన ప్రసంగంలో ఈ అంశం పేర్కొన్నారు. అప్ప టివరకు పదే ళ్లలో రాష్ట్రంలో సాధించిన వాస్తవ వృద్ధి రేటు 3 శాతం. యూపీఏ జాతీయ స్థాయిలో నిర్దేశించుకున్న లక్ష్యం 4 శాతం. దీనిని కూడా ఆనాడు పలువురు అత్యాశగానే పరిగణించారు. అయితే వైఎస్ కృషి ఫలితంగా రాష్ట్రం పశుగణాభివృద్ధి, మత్స్య పరిశ్రమాభివృద్ధి, ఫలపుష్ప సాగు వంటి అను బంధ రంగాలతో కలిపి వ్యవసాయం 6.87 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును సాధించింది. అయితే 2004-2009 ఐదేళ్ల కాలంలో జాతీయ స్థాయిలో సాధించిన వృద్ధి రేటు 3.26 శాతమే. 2004లో 136 లక్షల టన్నులు ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి 2009 నాటికి 204 లక్షల టన్నులకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఏ ఐదేళ్ల కాలంలోనూ ఇంత అధికంగా సగటు వార్షిక వృద్ధి రేటును సాధించిన సందర్భం కనిపించదు. ఇదంతా యాదృచ్ఛికంగా సంభవించింది కాదు. దీని వెనుక అకుంఠిత కృషి, దీక్ష ఉన్నాయి. పేదలకు ఇంటి సౌకర్యం కల్పించే సంకల్పంతో గుడిసె రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో వైఎస్ ఆరంభించిన ‘ఇందిరమ్మ’ (ఇంటిగ్రేటెడ్ నోవెల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ మోడరన్ మునిసిపల్ ఏరియాస్) కూడా ఎంతో ఘనమైనది. ఆంధ్రప్రదేశ్ అవతరణ నుంచి 31-03-2004 వరకు రాష్ట్రంలో మొత్తం 47 లక్షల గృహాల నిర్మాణం జరిగితే, 2004 మే మాసం నుంచి, 2009 సెప్టెంబర్ మధ్య మరో 45 లక్షల గృహాల నిర్మాణం జరిగింది. 25 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. పారిశ్రామిక రంగంలో కూడా 1956 తరువాత ఏనాడూ కానరాని రీతిలో 2004-2009 మధ్య 10.9 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు సాధ్యమైంది. నారా చంద్రబాబునాయుడు పాలించిన 1994-2004 మధ్య కాలంలో సాధించిన వార్షిక వృద్ధి రేటు 6. 51 శాతమే. క్యాటో సంస్థ ప్రచురించిన ఆర్థిక స్వాతంత్య్ర సూచీ నివేదిక ప్రకారం: 2005-2009 మధ్య ఆర్థిక స్వాతంత్య్ర సాధనలో 0.11 స్కోర్లు సాధించి భారీ అభివృద్ధిని నమోదు చేసిన రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్. ఆంధ్రప్రదేశ్ స్కోరు 0.40 నుంచి 0.51కి పెరిగింది. గుజరాత్ సాధించిన 0.46 నుంచి 0.57 స్కోరును దామాషా ప్రకారం చూస్తే, ఆంధ్రప్రదేశ్ సాధించిన స్కోరే వేగవంతమైనది. 2005లో ఏడో స్థానంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ 2009 నాటికి మూడో స్థానానికి ఎదిగింది. సాఫ్ట్వేర్ ఎగుమతులలో కూడా 2004లో 8 శాతం ఉన్న ఆంధ్రప్రదేశ్ వాటా 2009 నాటికి 12 శాతానికి పెరిగింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం తలంపు చంద్ర బాబుదే కావచ్చు. కానీ ఆయన అందుకు పునాదిరాయి కూడా వేయలేదు. వైఎస్ పునాదిరాయి వేయడమే కాదు, పూర్తయిన విమానాశ్రయాన్ని చూశారు. అలాగే ఆ విమానాశ్రయం కోసం తలపెట్టిన పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, రికార్డు సమయంలో పూర్తి చేయించారు. రాకపోకలకు మరింత వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో హైదరాబాద్ చుట్టూ 12 లేన్ల రింగ్ రోడ్డు నిర్మాణం కూడా వైఎస్ హయాంలోనే జరిగింది. 74 కిలోమీటర్ల దూరంతో, రూ.16,000 కోట్లతో తలపెట్టిన మెట్రో రైలు పథకం కూడా వైఎస్‌దే. హైదరాబాద్ నగర మంచినీటి అవసరాల కోసం రెండో దశ కృష్ణా పథకం, గోదావరి నీటి సరఫరా పథకం కూడా అప్పుడే పూర్తయ్యాయి. ఐఐటీ, బిట్స్ పిలానీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, టాటా ఎనర్జీ రీసెర్చ్ సంస్థ, సింబయోసిస్, ఐఎంటీ ఘజియాబాద్, నేపియర్, డాక్టర్ సీవీరావు స్టాటిస్టికల్ సంస్థ, ఫిషరీస్ బోర్డు - ఇవన్నీ వైఎస్ హయాంలో వచ్చినవే. మన ప్రియతమ నేత వైఎస్ 68వ జయంతిని జరుపుకుంటున్న సందర్భంలో కన్నీరు ఉబికిన ప్రతి కంటినీ తుడవాలన్న ఆయన ఆశయాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేయడమే ఆయనకు నిజమైన నివాళి. ఒక హెలికాప్టర్ ప్రమాదంలో ఆయనను మనం కోల్పోయాం. భగ వంతుని లీలలు అర్థంకావు. వైఎస్ నిజమైన మహానేత. జూలియస్ సీజర్ అంత్యక్రియల సందర్భంగా మార్కస్ ఆంటోనీ ఇచ్చిన ఉపన్యాసం నాకు గుర్తుకు వస్తోంది. ఇక్కడొక సీజర్ ఉండేవాడు. అలాంటి వారు మరొకరు ఎప్పుడు వస్తారు? వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు, వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల సంఘం సభ్యుడు - డీఏ సోమయాజులు -
విద్యుత్ చార్జీల బాంబు!
1,100 కోట్ల రూపాయలు ఏప్రిల్ నుంచి విద్యుత్తు బాదుడుకు కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం? 941 కోట్ల రూపాయలు 2015-16లో బాబు సర్కారు పెంచిన కరెంటు చార్జీలు సాక్షి, హైదరాబాద్: మరోసారి కరెంటు చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు పెరగడం ఇది రెండోసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.941 కోట్ల మేరకు విద్యుత్ చార్జీలు పెంచిన బాబు సర్కారు.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మరో రూ.1,100 కోట్లకు పైగా ప్రజలపై అదనపు భారం వేయనుంది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. బాబు అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే మొత్తం రూ.2 వేల కోట్లకు పైగా భారం మోపుతూ నిర్ణయం తీసుకున్నారన్నమాట. 2016-17 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల రూపంలో ప్రజల నుంచి మొత్తం రూ. 22 వేల కోట్లు వసూలు చేయాలని పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.17,700 కోట్ల ఆదాయాన్ని డిస్కమ్‌లు అంచనా వేశాయి. ఉచిత విద్యుత్ సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.3,188 కోట్లు ఇచ్చింది. వచ్చే ఏడాది కూడా ప్రభుత్వం ఇదే మొత్తం సబ్సిడీగా ఇచ్చే పక్షంలో రూ.1,100 కోట్లకు పైగా అదనపు ఆదాయం అవసరమవుతుందని డిస్కమ్‌లు తమ వార్షిక ఆదాయ, అవసర నివేదికల్లో పేర్కొన్నాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వమైనా ఇవ్వాలని లేదా చార్జీల పెంపుద్వారా రాబట్టుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ప్రజలపై భారం వేసేందుకే ప్రభుత్వం మొగ్గుచూపినట్లు సమాచారం. వాస్తవానికి అధిక ధర వెచ్చించి ఎడాపెడా ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్న ప్రభుత్వం.. అందుకవుతున్న వ్యయాన్ని కూడా తానే భరించాల్సి ఉండగా.. ఎప్పటికప్పుడు విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజల నుంచి వసూలు చేస్తోంది. ఇప్పుడు కూడా రూ.1,100 కోట్లకు పైగా చార్జీల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. మరోవైపు ఉచిత విద్యుత్ కూడా కత్తెర వేసే యోచనలో ప్రభుత్వం ఉందని, ఆ మేరకు సబ్సిడీ కూడా తగ్గిస్తే ప్రజలపై మరింత భారం (రూ.1,100 కోట్లకు అదనంగా) పడే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఇలావుండగా అవసరాన్ని బట్టి శ్లాబుల్లో మార్పునకూ రాష్ట్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ళను వచ్చే ఏడాది కూడా యథాతథంగా కొనసాగించాలని తీర్మానించింది. భవిష్యత్‌లోనూ విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతుందనే అశాస్త్రీయమైన లెక్కలు కడుతూ వచ్చే ఏడాది సైతం ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లను కొనసాగించాలని నిర్ణయించింది. నేడు ఏఆర్‌ఆర్‌లు మాత్రమే! విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి గురువారం 2016-17 వార్షిక ఆదాయ, అవసర నివేదికలు మాత్రమే సమర్పించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించుకున్నాయి. ఏఆర్‌ఆర్‌లలో కేవలం రాబోయే సంవత్సరానికి విద్యుత్ డిమాండ్ ఎంత? ఎంత మొత్తంలో రాబడి ఉండాలనే అంశాలనే పేర్కొంటారు. శ్లాబ్‌ల వారీ వివరాలతో చార్జీల (టారిఫ్) ప్రతిపాదనలను ఆ తర్వాత ఇచ్చే వీలుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కొత్త విద్యుత్ చార్జీలకు ఈఆర్సీ ఆమోదం లభిస్తే వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఉచితానికి 3 వేల ఎంయూల కోత! రాష్ట్రంలో ఏటా 54 వేల మిలియన్ యూనిట్ల మేరకు విద్యుత్ డిమాండ్ ఉంటుంది. ఇందులో 11,700 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి సరఫరా అవుతోంది. 2015-16లో వరుసగా తుపాన్లు రావడం, ఖరీఫ్, రబీ సాగు తగ్గడంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ 3 వేల మిలియన్ యూనిట్ల వరకు తగ్గింది. ప్రభుత్వం ఇప్పుడు దీన్నే కొలమానంగా తీసుకునే ఆలోచనలో ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3 వేల మిలియన్ యూనిట్ల మేరకు వ్యవసాయ విద్యుత్‌కు కత్తెరేయాలని భావి స్తోంది. వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్‌ను తక్కువగా చూపించి, ప్రభుత్వం సబ్సిడీని తగ్గిస్తుందా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. సబ్సిడీని తగ్గిస్తే ఆ మేరకు విద్యుత్ చార్జీల్లో పెంపుదల (రూ.1,100 కోట్లకు అదనంగా) చోటు చేసుకుంటుందన్నమాట. ఒకవేళ డిమాండ్ పెరిగితే ఉచిత విద్యుత్ సరఫరాను తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక 50 నుంచి 100 యూనిట్ల వరకూ ఉన్న శ్లాబ్ రేట్‌ను తగ్గించే యోచనపై కూడా కేబినెట్లో చర్చ జరిగినట్టు తెలిసింది. -
కష్టాల్లో ఖరీఫ్..
బాన్సువాడ : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నిరాశాజనకం గా మారింది.ఆశించిన వర్షాలు లేక రైతులకు ప్రతి కూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. జూన్ ముగుస్తున్నా ఇంత వరకు జిల్లాలో సాధారణ ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో 25 శాతం మించి పంటలు సాగుకు నోచుకోలేదు. సాగైన పంటలు కూడా ఎండ దెబ్బకు వాడిపోతున్నాయి.ఖరీఫ్ ఆరంభంలో సాగుచేసే తక్కువ కాలం పంటల సాగునోచుకోక సుమారు రూ.50 కోట్ల రాబడిని రైతాంగం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇదీ పరిస్థితి... ఖరీఫ్ పంటల సాగుపై రైతాంగంలో ఆందోళన కనిపిస్తున్నది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సోయా 1.24 లక్షల హెక్టార్లలో, వరి 1.52 లక్షల హెక్టార్లలో, మొక్కజొన్న 57వేల హెక్టార్లలో సాగుచేయాల్సి ఉంది. అత్యధికం గా వరి పంట 1.50 హెక్టార్లు సాగుచేస్తారు. మిగిలిన వివిధ రకాల పంటలు, పశుగ్రాస పంటలు సుమారు మరో 20 వేల హెక్టార్ల వరకు ఉంటాయి. ఇప్పటి వరకు కేవలం పది శాతం పంటలు కూడా సాగుకు నోచుకోలేదు.సాధారణంగా మే నెలలో కురిసే జల్లులతో దుక్కులు దున్ని రైతులు సిద్ధమవుతారు. జూన్ మొదటి వారంలో సోయా, పత్తి విత్తనాలను వేస్తారు. రెండవ వారం నుంచి కీలకమైన ఖరీఫ్ పంటలైన వరి, మొక్కజొన్న పంటలను జిల్లా రైతులు సాగుచేస్తారు. సోయా సాగుకు మొగ్గు... వర్షాలు కురవకపోవడంతో సోయావైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. తొలకరిలో సాగుచేసే పంటలు మూడు నెలల్లో చేతికి వస్తాయి. అదే భూమిలో రబీలో సోయా , పొద్దుతిరుగుడు ఇతరత్రా పంటలు సాగుచేస్తారు. ఆ విధంగా మే ఆఖరు నుంచి జూన్ మూడవ వారంలోపు జిల్లాలో సుమారు 2లక్షల హెక్టార్లలో తొలకరి పంటలను సాగుచేస్తారు. తొలకరి పంటలకు సక్రమంగా వాతావరణం అనుకూలిస్తే పెట్టిన పెట్టుబడులు పోనూ హెక్టారుకు సుమారు రూ. 25వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం లభిస్తుంది. దానిని ఆ భూముల్లో రబీలో సాగుచేసే పంటలకు పెట్టుబడులుగా జిల్లారైతులు వాడుకొంటారు. అలాం టిది ఈ ఏడాది జిల్లాలో మే, జూన్ నెలల్లో వర్షాలు లేక తొలకరి సాగు నిలిచిపోయింది. జిల్లాలో జూన్‌లో 131 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ సీజన్లో కేవలం 60.05 మిల్లీమీటర్ల వర్షాపాతం మాత్రమే నమోదైంది. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో పశుగ్రాస సమస్య తీవ్రమైంది. బోర్లకు అందని నీరు... జిల్లాలో విద్యుత్ కోతల వల్ల బోర్లు, బావులను ఆధారంగా చేసుకొని పంటలు సాగుచేస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. బాన్సువాడ, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్లలో అధిక శాతం రైతులు బోర్లపైనే ఆధారపడి పంటలు సాగుచేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వరినాట్లు వేసుకున్న రైతులు కరెంటుకోసం రాత్రింబవళ్లు పొలాల దగ్గరే వేచి ఉంటున్నారు. వ్యవసాయానికి ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, ఆ మేరకు విద్యుత్ సరఫరా జరగడం లేదు. కొన్నిచోట్ల రెండు దఫాలుగా,మరికొన్నిచోట్ల మూడు దఫాలుగా విద్యు త్ సరఫరా చేస్తున్నారు. విద్యుత్ కోతలు, లోఓల్టేజీ వల్ల బోరు మోటర్లు మొరాయించి కాలిపోతున్నాయి. విద్యుత్ సరఫరా సమయమంటూ లేకపోవడంతో బోర్లపై ప్రభావం పడుతోంది. మోటార్లు కాలి, ట్రాన్స్ఫార్మర్లు పేలడం వల్ల రైతులు నష్టపోతున్నారు.