సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 18.5 లక్షల రైతు కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవంతరాలు లేకుండా చూడాలని అధికారులను మంత్రి బాలినేని శ్రీనివాస్ ఆదేశించారు.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ ప్లీడర్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకాలపై అధికారులు తక్షణమే స్పందించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment