లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో టీ తాగేందుకు నిరాకరించారు ఎస్పీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్. పోలీసులపై తనకు ఏ మాత్రం నమ్మకం లేదన్నారు. టీలో విషం కలిపి ఇస్తారేమో? అని వ్యాఖ్యానించారు. తాను బయటి నుంచి టీ తెప్పించుకుంటానని అన్నారు. అవసరమైతే కప్పు మాత్రం తీసుకుంటానన్నారు. ఆదివారం ఉదయం లక్నోలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లి అఖిలేశ్ ఇలా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
#WATCH समाजवादी पार्टी प्रमुख अखिलेश यादव ने पुलिस मुख्यालय में चाय पीने से इंकार किया।
— ANI_HindiNews (@AHindinews) January 8, 2023
उन्होंने कहा,"हम यहां की चाय नहीं पियेंगे। हम अपनी (चाय) लाएंगे, कप आपका ले लेंगे। हम नहीं पी सकते, ज़हर दे दोगे तो? हमें भरोसा नहीं। हम बाहर से मंगा लेंगे।"
(वीडियो सोर्स: समाजवादी पार्टी) pic.twitter.com/zwlyMp8Q82
సమాజ్‌వాదీ పార్టీ ట్విట్టర్ ఖాతాను హ్యాండిల్ చేసే మనీశ్ జగన్ అగర్వాల్‌ను పోలీసులు ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. కించపరిచేలా పోస్టులు పెట్టినందుకు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మనీశ్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలేశ్ యాదవ్ పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అతడ్ని అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.
చదవండి: 'ఉత్తరాదిలో జెండా పాతేస్తాం.. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన..'
Comments
Please login to add a commentAdd a comment