లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన ‘బుల్డోజర్’ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. బుల్డోజర్ పేరుతో అఖిలేశ్ యాదవ్ బెదిరింపులను బుధవారం యోగి తోసిపుచ్చారు. బుల్డోజర్‌ను నడపడానికి ధైర్యం, తెలివి దృఢ సంకల్పం అవసరమని అన్నారు. ఎవరుపడితే వాళ్లు నడపలేరని, ముఖ్యంగా బుల్డోజర్ నడిపే శక్తి అఖిలేశ్ యాదవ్‌కు లేదని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాల పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని సీఎం యోగి మాట్లాడారు. ‘‘బుల్డోజర్‌ను నడపడానికి అందరికీ చేతులు సరిపోవు. వాటిని నడపాలంటే.. హృదయం, మనస్సు రెండూ అవసరం. బుల్డోజర్ లాంటి సామర్థ్యం, దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే వాటిని ఆపరేట్ చేయగలరు. అల్లరిమూకల ముందు మాట్లాడేవారు కనీసం బుల్డోజర్ ముందు నిలబడలేరు’’ అని అన్నారు. ఇప్పటిదాకా ‘టిపు’గా ఉన్న అఖిలేశ్ యాదవ్ కొత్తగా సుల్తాన్‌లా మారడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఇక.. ‘టిపు’ అనేది అఖిలేశ్ యాదవ్ నిక్ నేమ్‌గా తెలుస్తోంది.
#WATCH | Lucknow | Uttar Pradesh CM Yogi Adityanath speaks at the distribution of jobs appointment letters, he says, "...Not everyone's hands can fit on a bulldozer...Iske liye dil aur dimaag dodo chahiye. Bulldozer jaise shamta aur pratigya jismein ho wahi bulldozer chala sakta… pic.twitter.com/VpbzY8BQV9
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 4, 2024
ఇదిలా ఉండగా.. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మంగళవారం మాట్లాడుతూ.. తాము 2027లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని బుల్డోజర్లను సీఎం యోగి సొంత నియోజకర్గమైన గోరఖ్‌పూర్‌కు పంపిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment