లక్నో: ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేస్తారని ఆయన కుటుంబం శనివారం వెల్లడించింది. యోగి ఎక్కడపోటీ చేస్తే అక్కడి నుంచే అమితాబ్ కూడా పోటీ చేస్తారని ఆయన భార్య నూతన్ తెలిపారు. యోగి అప్రజాస్వామిక, వివక్షాపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిం చారు. అమితాబ్‌కు ఈ పోటీ విలువలతో కూడినదని చెప్పారు. యోగి తప్పులను అమితాబ్ ఎత్తిచూపుతారని పేర్కొన్నారు.
ప్రజా ప్రయోజనం కోసమంటూ మార్చి 23న కేంద్ర హోంశాఖ అమితాబ్‌ను బలవంతంగా రిటైర్ చేయించిన సంగతి తెలిసిందే. తనను బెదిరించారంటూ సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌పై ఆరోపణలు చేయడంతో అమితాబ్‌పై దుమారం రేగింది. అనంతరం ఆయన్ను హోంశాఖ 2015లో సస్పెండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment