ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం మధ్యాహ్నం ఒక లిస్ట్‌ను ప్రకటించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. ఈ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ నుంచి బరిలోకి దిగుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీ, యోగిపై సెటైర్లు పేల్చాడు.
ఇంతకు ముందు ఆయన అయోధ్య, మథుర, ప్రయాగ్‌రాజ్ నుంచి యోగి పోటీ చేయొచ్చని బీజేపీ బహిరంగంగా ప్రకటించుకుంది. ఇప్పుడేమో ఆయన్ని.. బీజేపీ ఆయన సొంత స్థానానికే పంపించింది. యోగిగారు మీరు అక్కడే ఉండిపోండి. మీరు మళ్లీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అంటూ సెటైర్లు పేల్చాడు అఖిలేష్. ఇదిలా ఉంటే.. పార్టీ ప్రకటన తర్వాత ‘పార్టీ ఎక్కడి నుంచి ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాన’ని సీఎం యోగి ప్రకటించడం తెలిసిందే. అయితే గోరఖ్‌పూర్ ఎంపికపై యోగి అసంతృప్తితో ఉన్నారంటూ వస్తున్న మీడియా కథనాలను రాష్ట్ర ఇన్‌చార్జి ధర్మేంద్ర ప్రధాన్ కొట్టిపారేశారు.
గతంలో యోగి గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మఠ్‌లోమహంత్(ప్రధాన అర్చకుడిగా) పని చేశారు. ఆపై రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించాక.. గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానంలో 1998 నుంచి ఐదుసార్లు వరుసగా ఐదు సార్లు ఎంపీగా గెలుపొందారు. 2017 నుంచి ఎమ్మెల్సీ హోదాలో యూపీ సీఎంగా ఆయన కొనసాగుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నుంచి మొట్టమొదటిసారి పోటీ చేయనున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
ఇక మొదటి, రెండో దశ పోలింగ్‌కు సంబంధించి.. మొత్తం 105 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్‌ను రిలీజ్ చేసింది బీజేపీ. ఇందులో 63 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపేర్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 10 నుంచి మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది.
రెయిన్‌బో కూటమి ద్వారా ప్రాంతీయ పార్టీలతో జతకట్టిన మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. రూలింగ్ పార్టీకి గట్టి పోటీనే ఇవ్వబోతున్నారు. కొన్నిసర్వేలు యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండడంతో ఎస్పీకి జంప్ అవుతున్న బీజేపీ నేతల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment