BJP: Loses Third Minister In Uttar Pradesh As Dharam Singh Saini Resigns Viral - Sakshi
Sakshi News home page

యూపీలో బీజేపీకి భారీ షాక్‌.. పార్టీని వీడిన మూడో మం‍త్రి

Published Thu, Jan 13 2022 3:17 PM | Last Updated on Thu, Jan 13 2022 5:06 PM

BJP Loses Third Minister In Uttar Pradesh As Dharam Singh Saini Resigns - Sakshi

లక్నో: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే యూపీలో అధికార బీజేపీ నుంచి జోరుగా వలసలు  కొనసాగుతున్నాయి. తాజాగా, బీజేపీకి చెందిన మరో మంత్రి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన స్వతంత్ర మంత్రి ధరమ్‌సింగ్‌ సైనీ పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముఖేష్‌ వర్మ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే మంత్రి రాజీనామా చేయడం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. 

ఇప్పటికే ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీని మారిన విషయం తెలిసిందే. యూపీలో వరుస నిష్క్రమణలకు కేబినెట్‌ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య ఆద్యం పోసినట్లు చర్చకొనసాగుతుంది. పార్టీని వీడిన నాయకులు.. ప్రధానంగా బీజేపీ అధికార నాయకత్వం.. వెనుక బడిన వర్గాలపై వివక్ష చూపిస్తుందని, ప్రజా ప్రతినిధులను  పట్టించుకోకుండా, అగౌరవ పర్చిందని ఎద్దేవా చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా ముఖేష్‌ వర్మ తన లేఖలో ఒక అడుగు ముందుకేసి ‘స్వామి ప్రసాద్‌ మౌర్య వెనుకబడిన వర్గాల గొంతు’అని, ‘మా నాయకుడని’ లేఖలో అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, స్వామి ప్రసాద్‌ మౌర్యతోపాటు.. మరికొందరు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరనున్నారో మరికొన్నిరోజుల్లో తెలువనుంది. ప్రస్తుతం బీజేపీ నుంచి వరుస వలసలతో పెద్ద రాజకీయా దుమారం కొనసాగుతుంది.    

చదవండి: యూపీ ఎన్నికలు.. ఉన్నవ్‌ అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్‌ టికెట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement