
సాక్షి, అమరావతి: ప్రజల మనోగతం పేరుతో సీ–ఓటర్ సంస్థ నిర్వహిస్తున్న సర్వేలకు ఏమాత్రం విశ్వసనీయత లేదనేందుకు ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికలతోపాటు 2019 ఎన్నికల్లో ఆ సంస్థ లెక్కలు తప్పడమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. గత నవంబర్‌లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో సీ ఓటర్ అంచనాలు గల్లంతయ్యాయి. టైమ్స్ నౌ లాంటి డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని, టీడీపీ ఉనికి కోల్పోవడం ఖాయమని ఇప్పటికే వెల్లడించాయి.
ఎలాంటి విశ్వసనీయత లేని సీ–ఓటర్ మాత్రం తనకు అలవాటైన రీతిలో సర్వే చేసినట్లు పేర్కొనగా దాన్ని పట్టుకుని టీడీపీ, ఎల్లో మీడియా చంకలు గుద్దుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కోతికి కొబ్బరి చిప్ప మాదిరిగా సీ–ఓటర్ సర్వే పేరుతో హడావుడికి తెర తీశారని పేర్కొంటున్నారు. 2019లో ఎన్నికల్లో టీడీపీ 14 లోక్‌సభ, 90–100 శాసనసభ స్థానాల్లో విజయం సాధిస్తుందని తన సర్వేలో వెల్లడైనట్లు సీ–ఓటర్ ప్రకటించింది. చివరకు ఫలితాలను చూస్తే 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేయగా టీడీపీ 23 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది.
చెప్పిందంటే.. జరగదంతే!
దేశంలో ఇప్పటిదాకా జరిగిన అధిక శాతం ఎన్నికల్లో సీ–ఓటర్ నిర్వహించిన ప్రీ–పోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలు లెక్కలు తప్పాయి. ఏదైనా ఓ పార్టీ అధికారంలోకి వస్తుందని సీ–ఓటర్ తేలి్చందంటే కచ్చితంగా మరో పారీ్టనే అధికారంలోకి వస్తుందని పలు సందర్భాల్లో రుజువు కావటాన్ని బట్టి ఆ సంస్థ విశ్వసనీయత ఎంతన్నది వెల్లడవుతోంది.