
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇప్పటికిప్పడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ, యూపీఏ సమవుజ్జీలుగా నిలుస్తాయని రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. 28 సీట్లు ఉన్న కర్ణాటకలో ఎన్డీఏ 14, యూపీఏ 14 స్థానాలు గెలిచే అవకాశముందని సర్వేలో తేలింది. (ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం)
ఓట్ల శాతంలో ఎన్డీఏపై యూపీఏ పైచేయి సాధిస్తుందని వెల్లడించింది. యూపీఏకు 47.9 శాతం, ఎన్డీఏకు 44 శాతం, ఇతరులు 8.1 శాతం ఓట్లు దక్కించుకోనున్నారు. గత డిసెంబర్‌లో జరిపిన సర్వేతో పోలిస్తే ఇప్పుడు ఎన్డీఏకు 4 సీట్లు తగ్గాయి. యూపీఏ తన ఓట్ల శాతాన్ని 37.6 నుంచి 47.9 శాతానికి పెంచుకుంది. (మోదీకి భారీ షాక్)
Comments
Please login to add a commentAdd a comment