సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సుపరిపాలనకు గానూ ఇండియా టుడే ఏటా ఇచ్చే స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్‌క్లేవ్–2019 అవార్డు తెలంగాణకు దక్కింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఈ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతుల మీదుగా రాష్ట్ర సర్కార్ తరఫున టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఆర్థిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. సర్కార్ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు చేరువయ్యేలా సీఎం కేసీఆర్ నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment