Good governance
-
‘ప్రగతి’ సూపర్ సక్సెస్
సాక్షి బెంగళూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, ప్రాజెక్టులపై ఎప్పటికప్పడు సమీక్ష జరుపుతూ సమయానికి పనులు పూర్తయ్యేలా చేసేందుకు నేరుగా ప్రధాని మోదీ పాల్గొని నిర్వహించే వర్చువల్ సమావేశం ప్రో–యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ (ప్రగతి) కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోందని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కితాబునిచ్చింది. రెండో తేదీన బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో జరిగిన కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ‘ప్రగతి’కార్యక్రమంపై జరిపిన అధ్యయనాన్ని ఒక బిజినెస్ స్కూల్ కేస్ స్టడీ రూపంలో విడుదల చేసింది. ‘గ్రిడ్లాక్ టూ గ్రోత్’పేరిట చేసిన అధ్యయనంలో ప్రగతి కార్యక్రమం అమలు, వాటి ఫలితాలను విశ్లేషించింది. దేశంలో భారీ ఎత్తున మౌలిక వసతులు, సామాజికాభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రగతి పథకం ద్వారా విజయవంతంగా అమలు చేస్తున్నారని ఆక్స్ఫర్డ్ ప్రశంసించింది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ పరిశోధనలో ‘ప్రగతి’కార్యక్రమం ద్వారా దేశంలో జరిగిన డిజిటల్ గవర్నెన్స్ అభివృద్ధిని ఆక్స్ఫర్డ్ ప్రస్తావించింది. 2015లో ‘ప్రగతి’ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 205 బిలియన్ డాలర్ల విలువైన 340 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశారని వెల్లడించింది. ‘ప్రగతి’కార్యక్రమంలో భాగంగా సుమారు 50 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, రెట్టింపు స్థాయిలో విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. మౌలికవసతుల కల్పన కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి జీడీపీలో రూ. 2.5 నుంచి రూ. 3.5 మేర తిరిగి లబ్ధి చేకూర్చినట్లు ఆక్స్ఫర్డ్ అధ్యయనం తెలిపింది. ప్రధాన మంత్రి మౌలికవసతుల అభివృద్ధి కోసం ఉద్దేశించిన పీఎం గతిశక్తి, పర్యావరణ అనుమతుల నిమిత్తం రూపొందించిన పరివేశ్లను నిర్వహించడంలో ఈ ప్రగతి ఎంతగానో దోహదపడిందని వర్సిటీ తెలిపింది. గతంలో పర్యావరణ అనుమతుల కోసం 600 రోజులు పడుతుండగా ప్రస్తుతం ‘ప్రగతి’కారణంగా జీఐఎస్ మ్యాపింగ్, డ్రోన్ పర్యవేక్షణ ద్వారా ఆ గడువు దాదాపు 75 రోజులకు తగ్గిందని వెల్లడించింది. గ్రామాల్లోని కుళాయి కనెక్షన్స్ కూడా కేవలం ఐదేళ్లలో 17 శాతం నుంచి 79 శాతానికి పెరిగినట్లు తెలిపింది. -
విప్లవ సారథీ.. విజయీభవ
ప్రజాస్వామ్యమంటే ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రజలే పాలకులను ఎన్నుకోవడం. ప్రజలకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి, నిబద్ధత, జవాబుదారీతనం పాలకుడికి ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే విప్లవాత్మక మార్పులతో రాష్ట్రం ప్రగతిపథంలో ఎలా దూసుకెళ్లగలదో గత 58 నెలల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించారు. సుపరిపాలనతో ప్రతి నియోజకవర్గం.. ప్రతి గ్రామం.. ప్రతి ఇంటా.. విప్లవాత్మక మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు కొనసాగాలని బలంగా కోరుకుంటున్న జనం ‘మేమంతా సిద్ధం’ అంటూ బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్‌కు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ యాత్రలో జననేతను చూసేందుకు.. మాట కలిపేందుకు.. కరచాలనంచేసేందుకు.. వీలైతే ఫొటో దిగేందుకు స్కూలు పిల్లల నుంచి వృద్ధుల వరకు మండుటెండైనా.. అర్ధరాత్రయినా పోటీ పడుతుండటం ఊరూరా కనిపిస్తోంది. ఈ పరిణామంతో మరో చారిత్రక విజయం ఖాయమైందని రాజకీయ పరిశీలకులతో పాటు జాతీయ స్థాయి సర్వే సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత 58 నెలలుగా విప్లవాత్మక మార్పులతో సుపరిపాలన అందిస్తున్నారు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 151 శాసనసభ (86.28 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాల్లో వైఎస్సార్సీపీ చరిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే సుపరిపాలనకు ఆయన శ్రీకారం చుట్టారు. గత పాలకులకు భిన్నంగా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో 99 శాతం అమలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాపన, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల నియామకాలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. కేవలం 58 నెలల్లోనే 2.32 లక్షల మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించడం గమనార్హం. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలోనే ఇంత భారీ ఎత్తున ఉద్యోగులను నియమించడం ఇదే ప్రథమం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకూ.. పట్టణాల్లో 75 నుంచి వంద ఇళ్లకు ఒకరి వంతున 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) విధానం ద్వారా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసి చరిత్ర సృష్టించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా పేదరిక నిర్మూలనకు విశేషంగా కృషి చేశారు. వివక్ష, లంచాలకు తావు లేకుండా అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పథకాలను 87 శాతం కుటుంబాలకు అందించారు. డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లను పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి.. దేశం మొత్తాన్ని మన వైపు చూసేలా చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చారు. సంక్షేమాభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకున్న ప్రజలు వాటి ద్వారా జీవనోపాధులను మెరుగుపర్చుకున్నారు. రాష్ట్రంలో పేదరికం టీడీపీ సర్కార్ హయాంలో 2015–16లో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి అది 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. ప్రగతి పథంలో ఏపీ పయనం ♦ అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులతో మన పిల్లలు పోటీ పడేలా విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టారు. సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తూనే.. రానున్న రోజుల్లో ఐబీ సిలబస్‌ను అమల్లోకి తెచ్చేందుకు నడుం బిగించారు. ♦ అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నికర నమోదు నిష్ఫత్తి రేటు 98.73 శాతానికి పెరిగింది. ♦ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనతో నాణ్యమైన ఉన్నత విద్యనందిస్తూ.. నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇస్తున్నారు. తద్వారా 2022–23లో 1.2 లక్షల మంది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు పొందారు. నైపుణ్యాలను మరింతగా పెంచేందుకు ఇప్పుడు ఎడెక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యా రంగంపై ఉద్యోగుల జీతభత్యాలు కాకుండా రూ.74 వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులకు మహర్దశ సర్కారు దవాఖానాల్లో నాణ్యమైన వైద్యం అందించేందుకు అనువుగా నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. అందులో 53,466 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడంతోపాటు.. చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు. ఇప్పటిదాకా 44.78 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా రూ.13 వేల కోట్ల విలువైన చికిత్సలు చేయించారు. ♦ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కొత్తగా 17 కాలేజీలకు శ్రీకారం చుట్టి, ఈ విద్యా సంవత్సరంలో 5 కాలేజీలు ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 ప్రారంభం కానున్నాయి. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటింటా జల్లెడ పడుతూ.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, విలేజ్ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. పారిశ్రామికాభివృద్ధికి ఊతం ♦ పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా పారదర్శక విధానాన్ని సీఎం వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చారు. సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ప్రతి ఏటా రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలవడమే అందుకు తార్కాణం. ♦ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే క్రమంలో.. కొత్తగా నాలుగు పోర్టులతోపాటు పది ఫిషింగ్ హార్బర్లు, మూడు ఇండ్రస్టియల్ కారిడార్లు, పది ఇండ్రస్టియల్ నోడ్స్ను అభివృద్ధి చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు. ♦ టీడీపీ హయాంలో రూ.32,803 కోట్లు పెట్టుబడులు వస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడులు రావడమే అందుకు నిదర్శనం. పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం టీడీపీ సర్కార్ హయాంలో 2018–19లో 22వ స్థానంలో నిలిస్తే.. ఇప్పుడు మూడో స్థానంలో నిలిచింది. పారిశ్రామికాభివృద్ధితో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా పెరిగాయి. సాగుకు సాయం ♦ ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు సీఎం జగన్ దన్నుగా నిలిచారు. ఫలితంగా వ్యవసాయ రంగం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. దేశంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా 17 నుంచి 18 శాతం ఉంటే.. గత నాలుగేళ్లలో దేశ జీడీపీలో మన రాష్ట్ర వ్యవసాయ రంగ వాటా 36 శాతంపైగా ఉండటం విశేషం. ♦ విప్లవాత్మక సంస్కరణలతో అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోంది. 2021–22లో 11.23 శాతం వృద్ధి రేటుతో దేశంలో ఏపీ అగ్రగామిగా నిలవడమే అందుకు నిదర్శనం. సామాజిక న్యాయంలో టార్చ్ బేరర్ సామాజిక న్యాయమంటే నినాదం కాదు.. అమలు చేయాల్సిన విధానమని సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే స్పష్టం చేశారు. కేబినెట్లో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన సీఎం వైఎస్ జగన్.. ఐదుగురు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు వర్గాలకే ఇచ్చారు. హోంశాఖ మంత్రిగా ఎస్సీ మహిళను నియమించారు. సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన మాయవతి, బీసీ వర్గానికి చెందిన అఖిలేష్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న స్టాలిన్ కూడా ఆ వర్గాలకు కేబినెట్లో ఇంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని సామాజిక వేత్తలు చెబుతున్నారు. రాజ్యసభ, శాసన మండలి సభ్యులుగా అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా నామినేటెడ్ పనుల్లో, పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. మహిళలకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చారు. గత 58 నెలలుగా సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన దన్నుతో ఆ వర్గాలు సామాజిక సాధికారత సాధించాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సామాజిక న్యాయంలో సీఎం వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేశారు. రాష్ట్రంలో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలు వెరసి మొత్తం 200 స్థానాలకుగాను వంద స్థానాల్లో అంటే సగం స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులనే సీఎం జగన్ బరిలోకి దించారు. సామాజిక న్యాయం చేయడమంటే ఇదీ అని దేశానికే సీఎం జగన్ ఎప్పటికప్పుడు చాటిచెబుతూ వస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ఇదే పాలన కోరుకుంటున్న జనం ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో వైఎస్ జగన్ మార్కు పాలన కనిపిస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే.. రాష్ట్రం ప్రగతి పథంలో మరింతగా దూసుకెళ్లాలంటే విప్లవాత్మక పరిపాలన కొనసాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలు.. ప్రస్తుతం మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్రలో సీఎం జగన్‌కు జనం నీరాజనాలు పలకడం ద్వారా తమ తీర్పును ముందే వెల్లడిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది వైఎస్సార్సీపీ మరో చారిత్రక విజయానికి బాటలు వేస్తుందని స్పష్టం చేస్తున్నారు. టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్ వంటి డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని వెల్లడైంది. -
భ్రమరావతిని వీడి.. కళ్లు తెరిచి నిజాలు చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేదనేవారికి, సంపద సృష్టించడం లేదనేవారికి, పరిశ్రమలపై అబద్దాలు రాసే వారికి ఇది పెద్ద సమాధానమే అవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఒక కధనం ప్రకారం గత మూడేళ్లలో ఆదాయపన్ను రిటర్న్ లు ఫైల్ చేస్తున్న వారిలో పెరుగుదల వివరాలు చూస్తే ఏపీ దేశంలోనే మొదటిస్థానం సాధించింది. ఈ మూడేళ్లలో ఏపీలో 18 లక్షల మంది అదనంగా ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేశారు. ఇదేదో ఊహాగానం కాదు. కల్పిత విషయం అంతకన్నా కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ITRలపై ఇచ్చిన తాజా నివేదిక వెల్లడించిన సంగతి. ఆదాయపన్ను వసూళ్లలో అగ్రస్థానంలో ఉండే మహారాష్ట్రలో గడిచిన మూడేళ్లలో 13.9 లక్షల మంది కొత్త అస్సెసీలు పెరిగితే, ఉత్తరప్రదేశ్ లో 12.7 లక్షలు, గుజరాత్ లో 8.8 లక్షల మంది కొత్త అస్సెసీలు వచ్చారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో విచిత్రంగా ఆదాయపన్ను మదింపుదార్లు పెరగకపోగా తగ్గిందని SBI నివేదిక చెబుతోంది. మొత్తం అన్ని రాష్ట్రాల ర్యాంకింగ్ లలో తెలంగాణ 20వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, కేరళలలో సగటున 3.4 లక్షల మందే కొత్త ఆదాయపన్ను అసెసీలు వచ్చారని ఈ నివేదిక పేర్కొంది. దీనికి కారణాలు కూడా ఈ నివేదిక విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్ లో మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమలు, సంస్థలు బాగా పెరగడం వల్లే అని అందులో స్పష్టం చేశారు. ఏపీలో మొత్తం మీద పదిన్నర లక్షల MSME రిజిస్ట్రేషన్ లు జరిగాయని నివేదికలో తెలిపారు. ఏతావాతా చూస్తే AP ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు కూడా ఇందుకు బాగా దోహదపడ్డాయని అర్ధం అవుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చంద్రబాబు ప్రభుత్వ టైమ్ లో పెండింగ్ లో ఉన్న సబ్సిడీ బకాయిలను సుమారు వెయ్యి కోట్లకు పైగా విడుదల చేశారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం వారికి ఇవ్వవలసిన రాయితీలను చాలావరకు ప్రభుత్వం ఇస్తూ వస్తోంది. దాంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో ఉపాది పొందేవారికి రక్షణ కల్పించినట్లయింది. ఒక భారీ పరిశ్రమ పెట్టడానికి వేల కోట్లు అవసరం అవుతాయి. పరిశ్రమను నెలకొల్పడానికి సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది. వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటూనే చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తే లక్షల మదికి ఉపాధి కలుగుతుందన్నది ఆర్దిక రంగ నిపుణులు చెబుతారు. దానికి అనుగుణంగా YSRCP ప్రభుత్వం చర్యలు తీసుకుందని భావించవచ్చు. ఆదాయ పన్ను రిటర్న్ లు దాఖలు చేసే స్థాయికి పద్దెనిమిది లక్షల మంది వెళ్లారంటే వారి ఆర్దిక స్తోమత పెరిగిందన్నమాట. దీనిని ఒక రకంగా సంపద సృష్టించడం అన్నమాట. అందులోను కొత్త పరిశ్రమలు నెలకొల్పి ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసే స్థితికి వచ్చారని అర్ధం చేసుకోవచ్చు. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా నిత్యం ఏపీలో అసలు ఏమీ జరగడం లేదని విషం చిమ్ముతుంటుంది. వారు ఇలాంటి వార్తలను, అసలు నిజాలను కప్పిపుచ్చుతుంటారు. చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో సంపద అంటే రియల్ ఎస్టేట్ సంపదే అనే అభిప్రాయం కల్పించారు. అందులో ధనవంతులు మరింత ధనికులు అవడమే ఆ విదానం. కేవలం దళారులు బాగుపడడం అందులో జరుగుతుంది. కాని చిన్న పరిశ్రమలు ఎక్కువగా రావడం వల్ల పేద, మద్య తరగతివారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే GSDPలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి నాలుగు స్థానాలలో ఉంటోంది. దానికి కారణం ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే అన్న విశ్లేషణ వస్తుంది. RBI మాజీ గవర్నర్ రఘురామరాజన్ దీనిని సమర్ధిస్తుంటారు. ఇందులో ఆయా స్కీముల కింద ప్రజల చేతులలోకి నేరుగా డబ్బు వెళ్లేటట్లు చేయడం, దీనివల్ల అవినీతి పూర్తిగా లేకుండా పోయి లబ్దిదారుల బ్యాంకు ఖాతాలలో సొమ్ము జమ అవుతుంది. ఈ డబ్బు పొందినవారంతా పేదలు, మధ్య తరగతి వారే కనుక దానిని పొదుపు చేసుకునే పరిస్థితి ఉండదు. వెంటనే వారు తమ అవసరాల కోసం మార్కెట్ లో వెచ్చిస్తారు. తద్వారా ఆయా ఉత్పత్తులకు గిరాకి పెరుగుతుంది. వ్యాపారాలు అధికం అవుతాయి. తద్వారా పన్నులు కూడా ప్రభుత్వానికి జమ అవుతుంటాయి. ఇదంతా ఒక ప్రక్రియ. పైకి చూస్తే డబ్బు పంపిణీనే అనుకుంటారు. కాని ఇందులో లోతుగా పరిశీలిస్తే ఈ విషయాలు అర్ధం అవుతాయి. జగన్ చేపట్టిన మరో స్కీమ్ చేయూత కింద నలభై ఐదేళ్లు పైబడిన ప్రతి మహిళకు ఏడాదికి 18,750 రూపాయలు చొప్పున ఆర్దిక సాయం చేశారు. ఈ డబ్బును తీసుకున్నవారు వ్యాపారులు, కుటీర పరిశ్రమలు స్థాపించుకోవడానికి వీలుగా బ్యాంకులతో టై అప్ చేశారు. వారి ఉత్పత్తుల విక్రయానికి గాను రిలయన్స్, ఐటిసి తదితర మల్టి నేషనల్ సంస్థలతో టై అప్ చేశారు. తద్వారా సుమారు నాలుగు లక్షల మంది యూనిట్లు నెలకొల్పుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది కూడా ఆర్ధిక అభివృద్దికి దోహదం చేసేదే. మరో అంశం చూద్దాం. జగన్ ప్రభుత్వం ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు సమకూర్చింది. అక్కడ ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టింది. సగటున గ్రామం, పట్టణం,నగరాలను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో లబ్దిదారుడికి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఆస్తి సమకూరింది. దీనిని లెక్క వేస్తే ఎన్ని వేల కోట్ల సంపద సృష్టించింది తెలుసుకోవచ్చు. చంద్రబాబు టైమ్ లో ఇలాంటివి ఒక్కటైనా చేసి తాను సంపద సృష్టించానని చెప్పగలరా? లేదా ఆయన తరపున ప్రచారం చేసే రామోజీరావు ,రాధాకృష్ణ వంటివారు టీడీపీ తెచ్చిన సంపద ఏమిటో వివరించగలుగుతారా? ఇవే కాదు. స్కూళ్లు బాగు చేయడం, అక్కడ డిజిటల్ క్లాస్ లు పెట్టడం తదితర చర్యల వల్ల ఎన్ని లక్షల టీవీలు,ఇతర పరికరాలు కొనుగోలు చేశారో అంచనా వేసుకోండి. అలాగే వేలాది స్కూళ్లను బాగు చేయడం ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించారు. గ్రామ,వార్డు సచివాలయాలను వేల సంఖ్యలో నిర్మించారు. రైతు భరోసా కేంద్రాలను, విలేజ్ క్లినిక్స్ ను కొత్త భవనాలు ఏర్పాటు చేసి నెలకొల్పారు. మరి అదంతా సంపద కింద రాదా? కేవలం అమరావతిలో ఒక ఏభై అంతస్థుల భవనం కడతామని, అది కట్టలేకపోయిన చంద్రబాబు ఏమో సంపద సృష్టించినట్లు ప్రచారం చేస్తుంటారు. ప్రాక్టికల్‌గా గ్రామాలలో, నగరాలలో ప్రత్యక్షంగా కనిపించేలా సంపదను ప్రజలకు అందిస్తేనేమో జగన్ పై దుర్మార్గపు విష ప్రచారం చేస్తుంటారు. అదంతా విధ్వంసం అని అబద్దపు రాతలు రాస్తారు. అభివృద్ది పరంగా చూస్తే చంద్రబాబు టైమ్ లో నిర్మించలేకపోయిన ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, ఉద్దానం కిడ్నీ బాదితులకు ఆస్పత్రి, భారీ నీటి పధకం , విశాఖ అభివృద్ది , ఇన్ ఫోసిస్, అదాని డేటా సెంటర్, నక్కపల్లి ఫార్మాహబ్ మొదలైనవి జగన్ చేపట్టిన ప్రగతికి నిదర్శనంగా నిలుస్తాయి. విద్యుత్ రంగంలో లక్ష మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తికి గాను మెరుగైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యక్షంగా అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వం వల్ల ఏపీ అభివృద్ది పధంలో సాగుతోందని చెప్పవచ్చు. అందుకే ఏపీలో ఆదాయపన్నుశాఖ చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వాస్తవాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఏపీ వ్యతిరేక మీడియా సంస్థలు జీర్ణించుకోలేకపోవచ్చు కానీ, ఆ రాష్ట్ర ప్రజలకు మాత్రం సంతోషం కలిగించే విషయమే అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
సుపరిపాలనకు మారుపేరు బీజేపీ
న్యూఢిల్లీ: సుపరిపాలనకు బీజేపీ ఒక పర్యాయపదంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గత కొన్ని దశాబ్దాల అసెంబ్లీ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే ప్రజలు బీజేపీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేటతెల్లం అవుతోందని అన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్, ఇతర పారీ్టల కంటే బీజేపీ రికార్డు చాలా మెరుగ్గా ఉన్నట్లు గుర్తుచేశారు. గురువారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇటీవల మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది ఏ ఒక్కరి ఘనత కాదని, బృంద స్ఫూర్తితో అందరూ కలిసి పనిచేయడం వల్లే చక్కటి ఫలితాలు వచ్చాయని అన్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో గెలిచామని, తెలంగాణ, మిజోరం రాష్ట్రల్లో బీజేపీ బలం పెరిగిందని పేర్కొన్నారు. సామాన్య ప్రజలతో వారికి సులువుగా అర్థమయ్యే భాషలోనే సంభాíÙంచాలని బీజేపీ నేతలకు, కార్యకర్తలకు మోదీ సూచించారు. ఉదాహరణకు ‘మోదీజీ కీ గ్యారంటీ’ బదులు ‘మోదీ కీ గ్యారంటీ’ అనాలని చెప్పారు. ఇదిగో మా సక్సెస్ రేటు కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు 40 సార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొందని, కానీ, ఏడుసార్లు మాత్రమే గెలిచిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. కాంగ్రెస్ సక్సెస్ రేటు 18 శాతంగా ఉందన్నారు. బీజేపీ 39 సార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని 22 సార్లు నెగ్గిందని ఉద్ఘాటించారు. బీజేపీ సక్సెస్ రేటు 56 శాతమని వివరించారు. ఈ విషయంలో కాంగ్రెస్ కంటే ప్రాంతీయ పారీ్టలే మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ పారీ్టలు 36 సార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని, 18 సార్లు గెలిచాయని, 50 శాతం సక్సెస్ రేటు సాధించాయని వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే అధికారం అప్పగించే విషయంలో ప్రజలు బీజేపీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలను సమర్థవంతంగా నడిపించే శక్తి బీజేపీకి ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. తమ పార్టీ ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత లేదని, సానుకూలత ఉందని వివరించారు. పారీ్టలో తాను ఒక సాధారణ కార్యకర్తను మాత్రమేనని చెప్పారు. ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో పాల్గొనండి తన దృష్టిలో దేశంలో పేదలు, యువత, మహిళలు, రైతులు అనే నాలుగు పెద్ద కులాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆయా కులాల సంక్షేమం కోసం కృషి చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి ఉద్దేశించిన ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో పాల్గొనాలని పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పనితీరు పట్ల తమ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
హ్యాట్రిక్‌కు గ్యారంటీ
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన హ్యాట్రిక్ విజయం.. 2024 ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల్లో సాధించబోయే హ్యాట్రిక్‌కు గ్యారంటీ అని ప్రధాని మోదీ అభివరి్ణంచారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో పార్టీ ఘన విజయం తర్వాత ఆదివారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ వందలాది మంది పార్టీ శ్రేణులనుద్దేశిస్తూ ప్రసంగించారు. ‘‘ మూడు రాష్ట్రాల్లో కలిపి హ్యాట్రిక్ సాధించాం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించబోయే హ్యాట్రిక్ గెలుపునకు ఈరోజు విజయం గ్యారంటీని ఇస్తోంది. ఇది చక్కని సంకేతం. ఈ ఫలితాలు అహంకార ‘ఇండియా’ కూటమికి గట్టి హెచ్చరిక. ఆత్మనిర్భరత, పారదర్శక, సుపరిపాలన భారత్‌ను కాంక్షించే బీజేపీ ఎజెండాకు ఈ గెలుపు మద్దతుగా నిలిచింది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమి ఏర్పాటు సందర్భంగా గతంలో విపక్షాల అగ్రనేతలు గ్రూప్ ఫొటో దిగటాన్ని మోదీ ఈ సందర్భంగా ఎద్దేవాచేశారు. ‘‘ స్టేజీ మీద వారసత్వ నాయకులంతా ఒక్క చోటకు చేరితే మంచి ఫొటోలు దిగగలరు. కానీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని మాత్రం గెలుపొందలేరు. ఈ ఫలితాలు కాంగ్రెస్, దాని గర్విష్ఠి కూటమికి పెద్ద గుణపాఠం నేర్పాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచదేశాల నమ్మకాన్ని పెంచుతోంది మోదీ సర్కార్ ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి తెచ్చి తమ నేతలపై తప్పుడు అవినీతి కేసులను బనాయిస్తోందంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను మోదీ ప్రస్తావించారు. ‘ అవినీతికి వ్యతి రేకంగా మేం చేస్తున్న పోరాటానికి ప్రజలు ఈ ఫలితాల రూపంలో మాకు మద్దతు పలికారు. అవినీతిలో మునిగిన పారీ్టలకు ఓటర్లు ఈ ఫలితాల రూపంలో వారి్నంగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధికి, ప్రజలకు మధ్య మరెవరూ రాలేరు. ఎవరైనా వచ్చేందుకు ప్రయత్నిస్తే ఓటర్లు ఇలాగే తీసి పక్కనపడేస్తారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలకు నాదో విన్నపం. దేశాభివృద్ధి ఊపందుకున్న ఈ తరుణంలో దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాజకీయాలు చేయొద్దు. దేశాన్ని విభజించే, విచి్ఛన్నం చేసే శక్తులతో జట్టుకట్టొద్దు’’ అని హితవు పలికారు. ‘‘ఇలాంటి సందర్భాల్లో దేశ వ్యతిరేక శక్తులు ఏకమయ్యేందుకు కష్టపడుతుంటాయి. అదను కోసం ఎదురుచూస్తుంటాయి. ఇలాంటి వారితో జాగ్రత్త’ అంటూ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. ‘ఈ గెలుపు భారత్‌పై ప్రపంచదేశాలు పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెంచుతుంది. ఇది భారత్‌లో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ‘అభివృద్ధి చెందిన భారత్’ సాకారం కోసం మనం చేపడుతున్న ఎజెండాకు ప్రజా మద్దతుకు లభిస్తోందని ఈ ఫలితాలు చాటుతున్నాయి. దేశంలో చక్కటి మెజారిటీతో అధికారంలోకి వచ్చే సుస్థిర ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారన్న విషయాన్ని ప్రపంచదేశాలు కళ్లారా చూశాయి’’ అని మోదీ అన్నారు. ఈ భూతాలను బీజేపీయే తరిమికొట్టగలదు ‘అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందని ఈ ఫలితాల ద్వారా ప్రజలు తీర్పు చెప్పారు. అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలనే ఈ మూడు భూతాలను తరిమికొట్టే సత్తా ఒక్క బీజేపీకే ఉందని యావత్ భారతదేశమే భావిస్తోంది. అవినీతి భరతం పట్టే బీజేపీకి ఇప్పటికే దేశవ్యాప్త మద్దతు దక్కుతోంది. అవినీతితో అంటకాగే నేతలకు ఇది సూటి హెచ్చరిక. అవినీతిపరులకు రక్షణగా ఉండే వ్యక్తులు, తప్పులను దాచిపెట్టే వ్యక్తులే దర్యాప్తు సంస్థల ప్రతిష్టను దిగజార్చేలా ఆరోపణలు గుప్పిస్తున్నారు. వాళ్లొకటి గమనించాలి. అవినీతి వ్యతిరేక పోరాటానికి ప్రజా మద్దతు ఉందని ఈ ఎన్నికల ఫలితాలను చూసైనా ఈ వ్యక్తులు అర్ధం చేసుకోవాలి’’ అని విపక్షాలను పరోక్షంగా విమర్శించారు. ఆ కులాల సాధికారత దేశ సాధికారత ‘‘దేశంలో మహిళలు, యువత, పేదలు, రైతులు అని దేశంలో నాలుగే పెద్ద కులాలున్నాయి. ఈ కులాలు సాధికారత సాధించిననాడే దేశ సాధికారత సాధ్యపడుతుంది. దేశంలో దాదాపు అన్ని ఓబీసీ వర్గాలు, షెడ్యూల్డ్ తెగల వారంతా ఈ నాలుగు వర్గాల్లోనే ఉన్నారు. బీజేపీ తమ విధాన నిర్ణయాలు, పథకాల ద్వారా వీరి సాధికారతకు కృషిచేస్తోంది. ఈ ఫలితాలొచ్చాక మేం గెలిచామని ప్రతి ఒక్క రైతు, యువజన ఓటరు, పేద, అణగారిన వర్గాల వ్యక్తులు గొంతెత్తి నినదిస్తున్నారు. గొప్ప భవిష్యత్తు కోసం యువత కలలు కంటోంది. ఈ రోజు ఫలితాలు చూశాక 2027కల్లా అభివృద్ధిచెందిన భారత్ సాకారం అవుతుందని ప్రతి ఒక్క పౌరుడు భరోసాగా ఉన్నాడు. నిజాయితీగా ఒక్కటి చెప్పదలుచుకున్నా. మీ స్వప్నం సాకారమవ్వాలనేదే నా సంకల్పం. ప్రపంచంలో భారత ఆర్థికాభివృద్ధి దూసుకుపోతూ దేశ మౌలికరంగ ముఖచిత్రాన్ని మార్చేస్తోంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ స్వప్నాలు సాకారం కావాలనుకునే ప్రతి ఒక్కరూ మోదీనే ఎంచుకుంటారు’’ అని రాసి ఉన్న భారీ కటౌట్‌ను బీజేపీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. -
Kudumbashree Mission: బడి రెక్కలతో మళ్లీ బాల్యంలోకి...
ఆ క్లాసురూమ్‌లో చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపించేంత నిశ్శబ్దం. స్కూల్ యూనిఫామ్‌లో మెరిసిపోతున్న విద్యార్థులు టీచర్ చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారు. పాఠం పూర్తయిన తరువాత ‘ఏమైనా డౌట్స్ ఉన్నాయా?’ అని టీచర్ అడిగితే ఒక్కొక్కరు తమ డౌట్స్‌ను అడగడం మొదలు పెట్టారు...‘ఈ దృశ్యంలో విశేషం ఏముంది... అన్ని స్కూళ్లలో కనిపించేదే కదా’ అనే డౌటు రావచ్చు. అయితే ఈ క్లాస్‌రూమ్‌లో కూర్చున్న విద్యార్థులు పిల్లలు కాదు. ముప్ఫై నుంచి డెబ్బై ఏళ్ల వయసు వరకు ఉన్న మహిళలు. ఏవో కారణాల వల్ల చదువును మధ్యలోనే మానేసిన వీరు ‘బ్యాక్–టు–స్కూల్’ ప్రోగ్రామ్‌తో మళ్లీ బడిపిల్లలయ్యారు.... దేశంలోనే పెద్దదైన స్వయం సహాయక బృందం ‘కుదుంబశ్రీ మిషన్’ చదువును మధ్యలోనే మానేసిన మహిళలను తిరిగి స్కూల్‌కు తీసుకువచ్చే విధంగా రెండు నెలల పాటు విస్తృత ప్రచారం చేసింది. మెసేజ్‌లు, పోస్టర్లు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలోనూ ప్రచారం నిర్వహించింది. వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసింది. కేరళలోని 14 జిల్లాలలోని రెండువేలకు పైగా స్కూల్స్‌లో తిరిగే స్కూల్లిల్ (బ్యాక్ టు స్కూల్) కార్యక్రమంలో భాగంగా వందలాది మంది మహిళలు వీకెండ్ క్లాస్‌లకు హాజరవుతున్నారు. ‘నా వయసు యాభై సంవత్సరాలు దాటింది. పెళ్లివల్ల పదవతరగతి పూర్తి కాకుండానే చదువు మానేయవలసి వచ్చింది. బ్యాక్ టు స్కూల్ కార్యక్రమంలో భాగంగా వీకెండ్ క్లాస్‌కు హాజరయ్యే ముందు అందరూ నవ్వుతారేమో అనిపించింది. నవ్వడానికి నేను చేస్తున్న తప్పేమిటి? అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఈ క్లాసులకు హాజరవడానికి ముందు మామూలు సెల్‌ఫోన్‌ను ఆపరేట్ చేయడం ఎలాగో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం డిజిటల్‌కు సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నాను. బ్యాంకు వ్యవహారాల్లో నేర్పు సంపాదించాను. ఒకప్పుడు ఇతరులు ఎవరైనా నాతో వస్తేనే బ్యాంకుకు వెళ్లేదాన్ని. ఇప్పుడు మాత్రం సొంతంగా బ్యాంకింగ్ వ్యవహారాలను చక్కబెడుతున్నాను. సొంతంగా వ్యాపారం మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాను. స్కూల్ ద్వారా ఎన్నో విలువైన సలహాలు తీసుకున్నాను’ అంటుంది కొట్టాయం జిల్లాకు చెందిన నీల. ‘బ్యాక్ టు స్కూల్’ వీకెండ్ క్లాస్‌లు అకడమిక్ పాఠాలకే పరిమితం కావడం లేదు. సుపరిపాలన, స్త్రీ సాధికారత, కష్టాల్లో ఉన్న వారికి కలిసికట్టుగా సహాయం చేయడం... ఇలా ఎన్నో సామాజిక, సేవా సంబంధిత చర్చలు క్లాస్‌రూమ్‌లో జరుగుతుంటాయి. ఈ చర్చలేవీ వృథా పోలేదు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ క్లాసులకు హాజరవుతున్న ఒక మహిళ భర్తకు కిడ్నీ మార్పిడి చేయాల్సి వచ్చింది. ఇందుకోసం మహిళలు అందరూ కలిసి ఇందుకు అవసరమైన డబ్బును సేకరించారు. ‘తరగతులకు హాజరు కావడం ద్వారా ఆర్థిక స్వతంత్రత, డిజిటల్ అక్షరాస్యత, వ్యాపారదక్షత ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. ఎంతోమంది సొంతంగా వ్యాపారం ప్రారంభించారు’ అంటుంది శ్రీష్మ అనే ట్రైనర్. ‘యాభై దాటిన వారు స్కూల్‌కు రారేమో అనుకున్నాం. అయితే యాభై నుంచి అరవైఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉండడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. వారి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అంటుంది హసీనా అనే టీచర్. స్కూల్‌కు హాజరవుతున్న వాళ్లలో భిన్నమైన సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లు, భిన్నమైన ప్రతిభాపాటవాలు ఉన్న మహిళలు ఉన్నారు. పాలక్కాడ్ జిల్లా పుదుక్కోడ్ గ్రామానికి చెందిన రాధ రెండున్నర సంవత్సరాలుగా క్యాంటీన్ నడుపుతోంది. వీకెండ్ క్లాసులకు క్రమం తప్పకుండా హాజరవుతుంది. ‘ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోగలిగాను అనేది ఒక సంతోషం అయితే, నేర్చుకున్న వాటి ద్వారా వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడం మరో సంతోషం’ అంటుంది రాధ. ‘ఫైనాన్సియల్ ప్లానింగ్, మహిళకు కొత్త జీవనోపాధి అవకాశాలు పరిచయం చేయడం, డిజిటల్ అక్షరాస్యత, సామాజిక ఐక్యత మొదలైన అంశాలకు సంబంధించి మాడ్యుల్ తయారు చేశాం’ అంటున్నాడు కుదుంబ శ్రీ మిషన్ స్టేట్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ నిషాద్. ‘డిజైనింగ్‌కు సంబంధించి ఎన్నో క్లాసులు తీసుకున్నాను. క్లాసుకు హాజరవుతున్న మహిళల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే వారు భవిష్యత్‌లో తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం కలుగుతుంది’ అంటుంది మనప్పదం గ్రామానికి చెందిన పుష్పలత. ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్‌ను నెలకొల్పి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది పుష్పలత. -
సచివాలయ వ్యవస్థ : పేదజనానికి ప్రగతిపథం
ప్రపంచ దేశాలతో సుస్థిర అభివృద్ధి గమనంలో పోటీ పడుతున్న భారతదేశం స్వాతంత్య్ర శతాబ్ది 2047 నాటికి అగ్రస్థానంలో నిలవాలని పరితపిస్తోంది. అధిక ఆదాయ స్థితిసాధనకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి శక్తిమంతంగా పని చేస్తోంది. ఒకవైపు కేంద్రం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనలో మునిగిపోయాయి. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నీతి ఆయోగ్ వెల్లడించిన జాతీయ బహుముఖ పేదరిక సూచిక (ఎంపీఐ)తాజా నివేదిక ప్రకారం, రాష్ట్రంలో పేదరికం రేటు 11.77 శాతం నుంచి 6.06 శాతానికి తగ్గింది. గ్రామాల్లో పేదరికం తగ్గింపు రేటు సగానికి పైగా దిగింది. పోషకాహారం, శిశు, కౌమార దశ మరణాలు; ప్రసూతి ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు, వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగు నీరు, విద్యుత్, గృహాలు, ఆస్తులు, బ్యాంకు ఖాతాల గణాంకాలను వినియోగించి నీతి ఆయోగ్ తాను ఈ నివేదికను రూపొందించినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ అనుసరించని పాలనా పద్ధతుల్ని జగన్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమాన్ని పొందవచ్చో తెలియజేసే వాలంటీరు వ్యవస్థ పేద ప్రజల వెంట నడుస్తోంది. అర్హులయిన లబ్దిదారులంతా నవరత్నాలతో పాటు ఎప్పటికప్పుడు అమల్లోకి వస్తున్న మిగతా ప్రభుత్వ పథకాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు ప్రభుత్వాన్ని మరింతగా చేరువ చేసింది. దీంతో ప్రజాపాలనలో రెట్టింపు వేగం పెరిగింది. మానవ వనరుల సంపదకు పునాదివేయడానికి వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ మూలస్తంభాలని ముఖ్యమంత్రి బలంగా విశ్వసిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైనది. రాష్ట్రంలో 67 శాతానికి పైగా ప్రజలు ఈ రంగంలో నిమగ్నమై జీవిస్తున్నారు. కాబట్టి వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడానికి సుస్థిర విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలో 70 శాతం మంది సన్నకారు రైతులకు ‘రైతు భరోసా’తో రబీ, ఖరీఫ్ పంటల్లో బాసటగా నిలుస్తుంది. పంటలు విఫలమయితే తదుపరి పంటపనులకు ముందుగానే రైతులకు బీమా అందిస్తోంది. పాడి, మత్స్య పరిశ్రమలకు తగిన సహకారం లభించింది. రాష్ట్ర అభివృద్ధిలో ఈ పరిశ్రమల వాటా పెరిగింది. ప్రభుత్వం స్వయం ఉపాధి, సాంప్రదాయ వృత్తుల నేత కార్మికులు, టైలర్లు, డ్రైవర్లు తదితర చేతివృత్తిదారులకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలకు సకాలంలో రుణ సహాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయం. ‘‘అందుకు నేను నా వంతు కృషి చేస్తున్నాను. నిజానికి నేను చేయలేనిది చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించడం. మీరు నా ప్రభుత్వం నుండి లబ్ది పొందితేనే నాకు ఓటు వేయండి అనే నినాదంతో రేపటి ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తాను. నాకు ప్రజలు అద్భుత ఫలితాలు అందిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను’’ అంటున్నారు ఆయన. పేద ప్రజలను ప్రగతిపథంలో నడిపిస్తున్న ఆయన అభివృద్ధి, సంక్షేమ పాలన మీద ఆయనకున్న నమ్మకం ఇది. – జి. యోగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్, 95028 12920. -
సుపరిపాలనకు సమష్టిగా కృషిచేయండి
ముంబై: సుపరిపాలనకు శాసనసభ్యులు సమష్టిగా కృషిచేయాలని ప్రధాని మోదీ ఉద్భోదించారు. ముంబైలో మూడ్రోజులుగా జరుగుతున్న జాతీయ శాసనసభ్యుల సదస్సుకు ప్రధాని మోదీ శనివారం ఒక సందేశం పంపించారు. అందులో మోదీ ఏమన్నారంటే.. ‘ సుపరిపాలన, విజయవంతమైన శాసనాల పరిశీలన, అభివృద్ధి నమూనాలు వంటి ప్రజాస్వామ్య విధానాల రూపకల్పన, వాటి పటిష్టత కోసం భిన్న పార్టీల ప్రతినిధులైన శాసనసభ్యులు ఇలా ఒక్క చోటుకు చేరడం నిజంగా విశేషమైన పరిణామం. దేశం అమృతకాలంలో పయనిస్తున్న ఈ తరుణంలో విధాననిర్ణేతలంతా సమష్టిగా చేసే కృషి.. దేశం అభివృద్ధి పథంలో సమున్నత శిఖరాలకు చేరుస్తుందన్న దృఢ విశ్వాసం నాలో ఇనుమడిస్తోంది. క్షేత్ర స్థాయి నుంచే నిరంతరాయంగా అభివృద్ధిని కాంక్షిస్తూ చేసే కృషి చివరకు ‘వైభవోపేత, అభివృద్ధి చెందిన భారత్’ అనే స్వప్నాన్ని నిజం చేస్తుంది’ అని అన్నారు. ‘ ప్రజలతో మమేకమవడంలో, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకం. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన శాసనసభ్యులు ఒకరినొకరు తెల్సుకుని ఆయా నియోజకవర్గాల్లో వారి సమర్థ పనితీరును అర్థం చేసుకునేందుకు జాతీయ శాసనసభ్యుల సదస్సు చక్కని వేదిక. పనితీరును బేరేజువేసుకుని మెరుగైన అభివృద్ధి నమూనాలతో శాసనసభ్యులు మరింతగా దూసుకుపోగలరనే నమ్మకం నాలో ఎక్కువైంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఐఎంఐ–స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ఈ సదస్సును ఏర్పాటుచేసింది. శనివారంతో ముగిసిన ఈ మూడ్రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా మొత్తంగా 1,500 మందికిపైగా శాసనసభ్యులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థ చట్టాలు చేయలేదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చట్టాల రూపకల్పనలో అత్యున్నతమైన, తుది నిర్ణయాధికారం శాసనవ్యవస్థదేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం ముంబైలో జాతీయ శాసనసభ్యుల సదస్సులో ఆయన ప్రసంగించారు.‘ చట్టాలు చేయడంలో శాసనవ్యవస్థ పాత్ర సర్వోన్నతం. ఈ ప్రక్రియలో న్యాయవ్యవస్థకు ఎలాంటి పాత్ర లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థల పాత్రలను రాజ్యాంగం సుస్పష్టంగా నిర్వచించింది. ఏదైనా అంశంలో తామే సర్వోన్నతులమని భావించి పరిధులను దాటడానికి ఈ వ్యవస్థలు ప్రయత్నించకూడదు. శాసనాలను చేసే బాధ్యత రాజ్యాంగం కేవలం శాసనవ్యవస్థలకే అప్పజెప్పింది. రాజ్యాంగానికి బద్దమై ఆయా చట్టాలు ఉన్నాయో లేదో అని తేల్చే సమీక్షాధికారం మాత్రం న్యాయవ్యవస్థకే ఉంది. కోర్టులు చట్టాన్ని రూపొందించలేవు. ఈ విషయాన్ని అవి మననం చేసుకుంటే చాలు’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు. -
34 ఏళ్ల సర్వీసులో ఇంత ప్రగతి చూడలేదు
సాక్షి, హైదరాబాద్: గత 9 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించామని, దేశంలో మరే రాష్ట్రం సాధించని అభివృద్ధిని తెలంగాణ సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. దీనికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్ ప్రణాళికలేనని చెప్పారు. తన 34 ఏళ్ల సర్వీసులో రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి గతంలో చూడలేదని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా శనివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వ హించిన తెలంగాణ సుపరిపాలన దినోత్సవంలో సీఎస్ మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో 2014కి ముందు వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఉండేదని, వాటర్ ట్యాంకర్ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేయాల్సి వచ్చేదన్నారు. అప్పట్లో వేసవి కాలం వచ్చిందంటే జిల్లా కలెక్టర్లతో సహా రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ యాక్షన్ ప్లాన్లు రూపొందించుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడా పరిస్థితులు లేవన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం రికార్డు నీటి పారుదల, వ్యవసాయం, ఐటీ, పరిశ్ర మలు, విద్యా, ఆరోగ్యం, సంక్షేమం, సుపరి పాలన, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అన్ని రంగాల్లో రాష్ట్రం రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందన్నారు. హరితహారంలో నాటిన 90 శాతం మొక్కలు మనుగడ సాధించడం ఒక అద్భుతమని శాంతికుమారి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రసూతి మరణాల్లో గణనీయమైన తగ్గుదల సాధించామని, ఇమ్యూనైజేషన్ పెరిగిందని, వైద్యారోగ్య రంగంలో అద్భుతాలు చవిచూశామని ఆమె వివరించారు. కార్య క్రమంలో ప్రభుత్వ శాఖల కార్యదర్శులు తమ శాఖల విజయాలను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. డీజీపీ అంజనీకుమార్, పీసీసీ ఎఫ్ డోబ్రియాల్ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా పాలనా వ్యవస్థ
న్యూఢిల్లీ: ప్రజలపై ప్రభుత్వ పరిపాలన ప్రభావాన్ని పెంచడానికి, వారి జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రతిస్థాయిలో విధానాలను, ప్రక్రియలను సులభతరం చేయడం ద్వారా పాలనా వ్యవస్థను పారదర్శకంగా, వేగవంతంగా తీర్చదిద్దడానికి శ్రమిస్తున్నామని అన్నారు. సుపరిపాలనా వారం(సుశాసన్ సప్తాహ్) సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఈ మేరకు దేశ ప్రజలకు సందేశామిచ్చారు. దేశవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 25వ తేదీ దాకా సుపరిపాలనా వారం జరుపుకోనున్నారు. ‘ప్రజలే కేంద్రంగా’ కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని మోదీ వివరించారు. ఫిర్యాదుల పరిష్కారం, ఆన్లైన్ సేవలు, దరఖాస్తుల స్వీకరణ–పరిష్కారం, సుపరిపాలనా విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తుచేశారు. కాలం చెల్లిన వేలాది చట్టాలను రద్దు చేశామన్నారు. అనవసర విధానాలు, పద్ధతులకు స్వస్తి పలికామని వెల్లడించారు. ప్రభుత్వానికి ప్రజలను చేరువ చేయడంలో టెక్నాలజీ పాత్ర చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. ప్రజలు సాధికారత సాధించడంలో సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. -
ఎనిమిదేళ్లుగా అభివృద్ధికే పట్టం
జైపూర్: దేశంలో తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధికే పట్టం కడుతోందని.. సుపరిపాలన, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలంతా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని, ప్రతిపక్షాలు విసిరే వలలో చిక్కుకోవద్దని సూచించారు. ముఖ్యమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతుంటాయని, బీజేపీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. శుక్రవారం రాజస్తాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన బీజేపీ ఆఫీసు బేరర్ల సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. దేశ ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీపరంగా రాబోయే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్ధారించుకోవాల్సిన సమయం వచ్చిందని నొక్కిచెప్పారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. మనకు దేశభక్తే స్ఫూర్తి ‘‘బీజేపీ అభివృద్ధి కోసం తపన పడుతోంది. కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటున్నాయి. సమాజంలోని చిన్నపాటి ఉద్రిక్తతలు, బలహీనతలను అడ్డం పెట్టుకొని మరింత విషం చిమ్ముతున్నాయి. కులాలు, మతాల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి శక్తులు, పార్టీల నుంచి కాపాడుకునేలా ప్రజలను అప్రమత్తం చేయాలి. జన సంఘ్ కాలం నుంచి దేశభక్తి, జాతి ప్రయోజనాలు, జాతి నిర్మాణమే మన విధానం, కార్యక్రమంగా కొనసాగుతోంది. అభివృద్ధి, విశ్వాసంపై బీజేపీ దృష్టి పెట్టడానికి దేశభక్తే స్ఫూర్తినిస్తోంది. ఎలాంటి షార్ట్కట్లు మనకు వద్దు. మనం వేసే అడుగులు దారి తప్పకూడదు. మాట తూలకూడదు. అభివృద్ధి, సామాజిక న్యాయం, భద్రత పేదల సంక్షేమం, వారి జీవనాన్ని సరళతరం చేయడమే మనకు ముఖ్యం. పేదల సాధికారత కోసం కృషిని కొనసాగించాలి. మన మార్గం నుంచి పక్కకు వెళ్లకూడదు. మన దృష్టిని మళ్లించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతుంటాయి. వాటిని లెక్కచేయాల్సిన అవసరం లేదు. ఎల్లవేళలా అభివృద్ధికే కట్టుబడి ఉండాలి. భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటోంది. రాబోయే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ధారించుకుంటోంది. పార్టీపరంగా కూడా 25 ఏళ్లకు లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. వాటిని సాధించేందుకు కృషి చేయాలి. ఎన్డీయే ప్రభుత్వానికి ఈ నెలలోనే 8 ఏళ్లు నిండుతాయి. ఈ 8 ఏళ్లలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేశాం. పేదలు, కార్మికులు, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాం. సమతుల అభివృద్ధి, సామాజిక న్యాయం, సామాజిక భద్రత కల్పించాం. దేశంలో భాషల ప్రాతిపదికగా వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి ప్రాంతీయ భాషలోనూ భారతీయ సంస్కృతి ప్రతిబింబాన్ని బీజేపీ చూస్తోంది. జాతీయ విద్యా విధానం ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రాంతీయ భాషల పట్ల మన నిబద్ధతకు ఇదే నిదర్శనం. భాషా వైవిధ్యం దేశానికి గర్వకారణం. ఇప్పుడు ప్రపంచమంతా గొప్ప అంచనాలతో భారత్ వైపు చూస్తోంది. అలాగే భారత్‌లోనూ ప్రజలు బీజేపీపై ప్రత్యేకమైన అనురాగం కురిపిస్తున్నారు. గొప్ప నమ్మకం, ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించి, బలోపేతం చేయడానికి వంశపారంపర్య పార్టీలపై బీజేపీ పోరాటం సాగిస్తూనే ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి. ఈ విషయంలో బీజేపీ నేతలు చొరవ తీసుకోవాలి’’ అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. -
‘జన సురాజ్’ ప్రకటించిన ప్రశాంత్ కిశోర్
పట్నా: బిహార్‌లో మా ర్పుతీసుకువచ్చేందుకు ‘జన్ సురాజ్’ వేదికను ఆరంభిస్తున్నట్లు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురువారం ప్రకటించారు. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, భవిష్యత్‌లో జన్ సురాజ్ వేదికే పార్టీగా మారే అవకాశాలుండొచ్చని చెప్పారు. బిహార్‌లో మార్పుకోరుకునే తనలాంటి 18వేల మందితో టచ్‌లో ఉన్నానని చెప్పారు. వీరందరినీ తాను తలపెట్టిన పాదయాత్రకు ముందే వ్యక్తిగతంగా కలిసేందుకు యత్నిస్తానని చెప్పారు. గాంధీజీ చెప్పిన సరైన చర్యలే మంచి రాజకీయమన్న సూక్తి ఆధారంగా తానీ జన్ సురాజ్‌ను ఆరంభించానని తెలిపారు. సంవత్సరంలో 3వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని, రాష్ట్రం నలుమూలలా వీలైనంత మందిని కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. లాలూ, నితీశ్ సాధ్యమైనంత మేర సాధికారత తెచ్చేందుకు యత్నించారని, కానీ రాష్ట్రం అభివృద్ధి సూచీల్లో అట్టడుగునే ఉందని తెలిపారు. బిహార్‌కు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమన్నారు. అదే సమయంలో బెంగాల్లో మమతతో పనిచేయడంపై జవాబిస్తూ అక్కడ టీఎంసీకి పూర్తి యంత్రాంగం ఉందని, బిహార్‌లో అంతా కొత్తగా ఆరంభించాలని చెప్పారు. బిహార్‌లో ఓబీసీల హవా అధికం, తాను బ్రాహ్మిణ్ కావడం వల్లనే భవిష్యత్ సీఎంగా ముందుకురాలేకపోయారన్న ప్రశ్నకు బదులిస్తూ బిహార్‌లో ప్రస్తుతం మోదీకి అత్యధిక ఓట్లు రాబట్టే సత్తా ఉందని, కానీ బిహార్‌లో ఆయన కులస్తులెందరున్నారని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: తమిళనాడులో నీట్‌పై రగడ.. ఢిల్లీ తలుపు తట్టిన గవర్నర్ -
Good Governance Index 2021: సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ
సాక్షి, అమరావతి: ప్రధాన రంగాలన్నింటిలో మన రాష్ట్రం గతంలో కంటే మెరుగైన పురోగతి సాధించింది. ఆర్థిక ఇబ్బందులు, కరోనా కష్టాలు ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ అధిగమించి సర్వతోముఖాభివృద్ధి దిశగా వేగంగా అడుగులు ముందుకు వేసింది. కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్–2021 ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ నివేదికలో రాష్ట్రాన్ని ‘ఏ’ గ్రూపులో చేర్చారు. ఈ నివేదికలో 2019–20, 2020–21 సంవత్సరాలకు సంబంధించిన గణాంకాలను బేరీజు వేశారు. చదవండి: మీ ఆనందమే నా తపన: సీఎం జగన్ మానవాభివృద్ధి సూచికల్లో రాష్ట్రం గతంలో కన్నా ఎక్కువ పాయింట్లు సాధించింది. విద్యారంగం పరంగా.. నాణ్యమైన విద్య, లింగ సమానత్వ సూచిక, ఎన్రోల్మెంట్ రేషియో ఆఫ్ ఎస్సీ, ఎస్టీ (ఎస్సీ, ఎస్టీల చేరికలు), రిటెన్షన్ రేట్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ (ప్రాథమిక విద్య స్థాయిలో డ్రాపవుట్లు అరికట్టడం), స్కిల్ ట్రెయినింగ్ (నైపుణ్య శిక్షణ), ప్లేస్మెంట్ రేషియో (ఉద్యోగ, ఉపాధి కల్పన) అంశాలలో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. నాణ్యమైన విద్య పరంగా 2019లో గరిష్ట స్కోరు 39 శాతం ఉండగా 2021లో 63 శాతానికి పెరిగింది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.. మెరుగైన భద్రత ♦ప్రజల భద్రతకు భరోసానిస్తూ మెరుగైన పోలీసు వ్యవస్థతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మెరుగైన పనితీరు కనబరుస్తోంది. 2019–20లో 26.10 శాతం నేరాల్లో దోషులను గుర్తించి శిక్షలు విధించగా, 2020–21లో అది 38.40 శాతానికి పెరిగింది. ♦2019–20లో పోలీసు శాఖలో మహిళా పోలీసులు 4.17 శాతం ఉండగా.. 2020–21లో 5.85 శాతానికి పెరిగారు. ♦పీహెచ్‌సీల్లో వైద్యుల అందుబాటు 2019–20తో పోలిస్తే 2020–21లో 6.4 శాతం వృద్ధి చెందింది. 1,145 పీహెచ్సీలలో ఇద్దరు వైద్యుల విధానం, 650 మంది మెడికల్ ఆఫీసర్ల నియామకం, సుమారు 3 వేల మంది సిబ్బంది నియామకం, ఏపీవీవీపీ, డీఎంఈ పరిధిలో 11 వేలకు పైగా పోస్టుల భర్తీ, మరో 4,142 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండటం, కొత్తగా 3,483 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇందుకు దోహదపడింది. ♦మాతృ మరణాలు 74 నుంచి 65కు, శిశు మరణాలు 32 నుంచి 29కి తగ్గాయి. ♦ప్రజల ఆరోగ్యం, విద్య, ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, ఆహారం, నివాసం తదితర విషయాల్లో ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఈ విషయంలో 0.546 స్కోర్‌తో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పౌరులు ప్రత్యక్ష లబ్ధిదారులుగా నిలవడం అభివృద్ధి నమూనాకు కీలకం. ♦2019–20లో 42.05 శాతంగా ఉన్న మహిళల ఆర్థిక స్వావలంబన 2020–21లో 58.2 శాతానికి పెరిగింది. ఆడబిడ్డల జననాల పెరుగుదల ఆశాజనకంగా ఉంది. 2019–20లో 26.96 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు 2020–21లో 12.62 శాతానికి తగ్గాయి. -
రాష్ట్రంలో గవర్నెన్స్ ‘గుడ్’
సాక్షి, హైదరాబాద్: సుపరిపాలనలో తెలంగాణ ముందంజలో ఉంది. కేంద్రం విడుదల చేసిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్–2021లో రెండు కేటగిరీల్లో మొదటి స్థానంలో నిలిచింది. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పరిపాలన సం స్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వ ర్యంలో రూపొందించిన ఈ ఇండెక్స్‌ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు. ఆ ప్రకారం వాణిజ్యం–పరిశ్రమలు, సాంఘిక సంక్షేమం–అభి వృద్ధి కేటగిరీల్లో మన రాష్ట్రం గ్రూప్–ఏలో కేరళతో సమానంగా తొలి స్థానం దక్కించుకుంది. తెలంగాణతో పాటు ఏపీ, పంజాబ్, కేరళ, గోవా, గుజరాత్, తమిళనాడు, హరియానా తదితర రాష్ట్రాలను గ్రూప్–ఏ కింద పరిగణించగా, గ్రూప్–బీ కింద మరికొన్ని రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు.. ఇలా 4 గ్రూపుల్లో 10 కేటగిరీల్లో మొత్తం 58 సూచికల ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, వాణిజ్యం–పరిశ్రమలు, మానవ వనరుల అభివృద్ధి, ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక పరిపాలన, సాంఘిక సంక్షేమం–అభివృద్ధి, న్యాయం–ప్రజా భద్రత, పర్యావరణం, పౌర కేంద్రిత పాలన కేటగి రీల్లో అన్ని రాష్ట్రాల పనితీరును పరిశీలించి ఈ ర్యాంకులిచ్చారు. ఈ 10 కేటగి రీల్లో ఆయా రాష్ట్రాల పనితీరు ఆధారంగా ఇచ్చిన కాంపోజిట్ ర్యాంకింగ్స్‌లో గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో మొదటి స్థానాలు నిలిచాయి. రాష్ట్రం ర్యాంకు సాధించిన రెండు కేటగిరీల్లోని సూచికలివే ఈ 10 కేటగిరీల్లో పలు సూచికల ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించారు. రాష్ట్రానికి మొదటి స్థానం లభించిన 2 కేటగిరీల విషయానికి వస్తే.. వాణిజ్యం–పరిశ్రమల విభాగం లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రాష్ట్రంలోని పరిశ్రమల సంఖ్య, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి ప్రాతిపదికగా ర్యాంకులు కేటాయించారు. సాంఘిక సంక్షేమం–అభివృద్ధి కేటగిరీలో లింగ నిష్పత్తి, ఆరోగ్య బీమా కవరేజీ, గ్రామీణ ఉపాధి, నిరుద్యోగం, అందరికీ ఇళ్లు, మహిళా ఆర్థిక సాధికారత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాధికారత, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కేసుల పరిష్కారం అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. -
సుపరిపాలనతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యం
-
మంచి పాలన అందించండి
సాక్షి బెంగళూరు: ప్రజలకు ఉత్తమ పాలన అందించాలని కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బసవరాజబొమ్మై తొలిసారిగా శుక్రవారం ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలను కలుసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి సీఎంగా బాధ్యతలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర షెకావత్, హోం మంత్రి అమిత్ షాతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అన్ని విధాల సహకారం అందిస్తాం... ప్రధానితో భేటీ సందర్భంగా సీఎం బసవరాజ బొమ్మై కర్ణాటక రాష్ట్ర పరిస్థితులను వివరించారు. మోదీ స్పందిస్తూ ప్రజలకు మంచి పాలన అందించాలని, కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించారు. ఇదే సమయంలో వరద నష్ట పరిహారం అందించాలని, హుబ్లీ–ధారవాడ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్, రాయచూరుకు ఎయిమ్స్ తరహాలో వైద్య సంస్థను మంజూరు చేయాలని ప్రధానికి సీఎం విన్నవించారు. కలబురిగి ఈఎస్ఐ వైద్య కళాశాల, స్థానిక ఆస్పత్రిని ఎయిమ్స్‌గా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. సీఎం విజ్ఞప్తులపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించి.. రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించి వారం రోజుల్లోగా మంత్రివర్గ విస్తరణ చేపడతానని తెలిపారు. -
ప్రైవేట్ సంస్థలకు చంద్రబాబు ఊడిగం చేశారు..
అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కోడుమురు పార్టీ కార్యాలయంలో సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బతీసిందని ఆయన విమర్శించారు. ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు ఊడిగం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను విస్మరించిందని ఎమ్మెల్యే ఎద్దెవా చేశారు. అయితే, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారని అన్నారు. అందుకే, అధికారంలోకి వచ్చిరాగానే నవరత్నాల ద్వారా ప్రతి గడపకి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా పథకాలు అమలు చేస్తూ, సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని సుధాకర్ కొనియాడారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అన్నారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం
-
డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు?
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. డిసెంబర్ మొదటివారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం సమావేశమైంది. ఆయా పార్టీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న ఎస్ఈసీ... దీపావళి పండుగ అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్తో పాటు విపక్షాలు సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికలపై పార్టీలతో భేటీ మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి, ఎమ్మెల్సీ, గ్రేటర్ ఎన్నికలపై చర్చించారు. ఈ సమావేశానికకి ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. వార్డుల విభజనలో అవకతవకలు గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో జరిగినట్లు ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ సంస్థ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ లోపాలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేసినట్లు సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. వార్డుల వారీగా ఈనెల 7న జారీచేసిన ఓటరు పట్టికలను పరిశీలిస్తే వార్డుల విభజన చట్టంలో పేర్కొన్న విధంగాలేదని ఆక్షేపించింది. ఈ సందర్భంగా గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. కొన్ని వార్డుల్లో ప్రజలకు నష్టం, మరికొన్ని వార్డుల్లో ప్రజలకు లాభం కలుగుతుందని తెలిపారు. చట్టం ప్రకారం వార్డు వారీగా సగటు ఓట్లు 49,360 కాగా.. 140 వార్డుల్లో ఉండాల్సిన ఓటర్ల కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. కేవలం పది వార్డుల్లో మాత్రమే చట్టం ప్రకారం ఓటర్లున్నారని సంఘం కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు. చదవండి: ‘గ్రేటర్’ ఎన్నికలకు తొందరొద్దు వార్డుల విభజనలో అసమతుల్యం కారణంగా ఆయా వార్డులకు బడ్జెట్ కేటాయింపుల్లో వ్యత్యాసాలు భారీగా ఉండి ఆయా ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదాహరణకు మైలార్‌దేవ్‌పల్లి(59)వార్డులో 79,290 మంది ఓటర్లుండగా.. రామచంద్రాపురం(112)లో 27,831 మంది ఓటర్లున్నారన్నారు. బాధ్యతారాహిత్యంగా వార్డుల విభజన చేపట్టడం వల్లే ఈ అక్రమాలు వెలుగుచూశాయన్నారు. వార్డుల విభజన సక్రమంగా చేసేందుకు 5 సంవత్సరాలు సమయం ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ ఏమి చేయలేక మళ్లీ అదే తప్పు చేస్తుందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన జరగాలని కోరారు. వార్డుల వారీగా ఓటర్ల విభజన సరిచేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలివ్వాలని ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. -
సీఎం, మంత్రులపై క్రిమినల్ కేసులు పెండింగ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రితోపాటు ఏడుగురు మంత్రుల మీద క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వచ్ఛంద సంస్థ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంస్థ కోర్టును కోరింది. ఈ మేరకు ఆ సంస్థ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి శుక్రవారం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ‘10 మంది ఎంపీల మీద 133 కేసులు, 67 మంది ఎమ్మెల్యేల మీద 150, గోషామహల్ ఎమ్మెల్యే మీద 43, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే మీద 14, కరీంనగర్ ఎమ్మెల్యే మీద 7 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులకు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసిన తర్వాత న్యాయస్థానం అనుమతి లేకుండా కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి వీల్లేదు, అయినా ప్రభుత్వం కేసులను ఉపసంహరిస్తూనే ఉంది. స్థానిక పోలీసులు సాక్ష్యులను కోర్టుల ముందు హాజరుపర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలి. స్పెషల్ కోర్టుకు ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను, సిబ్బందిని ఏర్పాటు చేయాలి. కేసుల విచారణ పురోగతిని నెల రోజులకొకసారి హైకోర్టుకు సమర్పించేలా ఆదేశించండి’అని పిటిషన్లో కోరారు. -
సుపరిపాలనలో రాష్ట్రానికి ఇండియా టుడే అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సుపరిపాలనకు గానూ ఇండియా టుడే ఏటా ఇచ్చే స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్క్లేవ్–2019 అవార్డు తెలంగాణకు దక్కింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఈ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతుల మీదుగా రాష్ట్ర సర్కార్ తరఫున టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఆర్థిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. సర్కార్ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు చేరువయ్యేలా సీఎం కేసీఆర్ నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. -
నూతన అర్బన్ పాలసీ పై కేసీఆర్ సమీక్ష
-
అర్బన్ పాలసీ అదరాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేనివిధంగా ప్రజలకు పారదర్శకమైన సేవలు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరిగేలా తెలంగాణ నూతన అర్బన్ పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అర్బన్ పాలసీతోపాటు కొత్త రూరల్ పాలసీ, కొత్త రెవెన్యూ పాలసీలను కూడా రూపొందించాలన్నారు. నూతన అర్బన్ పాలసీలో భాగంగా నూతన మున్సిపల్ చట్టం, నూతన కార్పొరేషన్ల చట్టం, నూతన హైదరాబాద్ నగర కార్పొరేషన్ చట్టం తీసుకురావాలని, హెచ్ఎండబ్ల్యూఏతోపాటు ఇతర నగరాల అభివృద్ధి సంస్థల పాలనకు సంబంధించి కూడా కొత్త చట్టం రూపొందించాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లోనే ఈ చట్టాల ముసాయిదా తయారు చేయాలన్న కేసీఆర్... త్వరలోనే అసెంబ్లీని సమావేశపరిచి కొత్త చట్టాలు తెస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర నూతన అర్బన్ పాలసీ రూపకల్పనపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా... అవినీతికి ఏమాత్రం ఆస్కారం కలిగించని విధంగా, అక్రమ కట్టడాలకు ఏమాత్రం వీలులేని విధంగా, పచ్చదనం–పరిశుభ్రత వెల్లివిరిసేలా నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దడానికి ఉపయోగపడే కొత్త చట్టాలు ఉండాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు. ఈ చట్టాల ప్రకారమే నగర పాలన జరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. బాధ్యతలను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా చట్టమే కల్పిస్తుందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిస్థితిని చక్కదిద్దే బృహత్తర ప్రయత్నంలో కలెక్టర్లు క్రియాశీల బాధ్యత పోషించేలా చట్టంలో నిబంధనలు పెడతామని చెప్పారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు నిధులు ఖర్చు చేయకుండా ఆయా నగరాలు, పట్టణాల ప్రాధాన్యతలు, సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసమే నిధులు వెచ్చించాలన్నారు. మున్సిపాలిటీలకు ఆదాయం రావాలని, వచ్చిన ఆదాయం సద్వినియోగం కావాలని చెప్పారు. రాష్ట్రంలో పద్ధతి ప్రకారం నగర–పట్టణ పాలన సాగేందుకు నూతన పాలసీ, కొత్త చట్టాలు ఉపయోగపడాలని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ఏర్పడిన వెంటనే రాష్ట్ర ప్రాధాన్యతలను గుర్తించాం. సంక్షేమ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించుకున్నాం. మంచినీటి సమస్యను తీర్చుకున్నాం. సాగునీటి కోసం ప్రాజెక్టులు కడుతున్నాం. పారిశ్రామికాభివృద్ధి కోసం టీఎస్ ఐపాస్ చట్టం చేసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మరో మెట్టు ఎక్కాలి. దీనికోసం మంచి విధానాలు రావాలి. కొత్తగా పంచాయతీరాజ్ చట్టం చేసుకున్నాం. ఇదే విధంగా రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు కూడా రావాలి. పరిపాలన పారదర్శకంగా, వేగంగా, అవినీతికి ఆస్కారంలేని విధంగా సాగాలి’’అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ సమ్మేళనాలు... తెలంగాణ పల్లెలు పచ్చదనంతో, పరిశుభ్రతతో కళకళలాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు గ్రామాల వికాసానికి పూనుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు గ్రామాల వికాసానికి, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించడానికి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ సమ్మేళనాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు చోట్ల సమ్మేళనాలు నిర్వహిస్తామని, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్పర్సన్లతోపాటు పంచాయతీ కార్యదర్శులు, ఈఓపీఆర్డీలు, ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, సీఈఓలను ఈ సమ్మేళనాలకు ఆహ్వానిస్తామని చెప్పారు. జిల్లా పరిషత్తులను, గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామాల అభివృద్ధికి ఏటా దాదాపు రూ. 7 వేల కోట్లను, ఐదేళ్లలో రూ. 35 వేల కోట్లను ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిధులను సమర్థంగా వినియోగించుకొనే విధంగా స్థానిక సంస్థలు తయారు కావాలని చెప్పారు. గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా తయారు కావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలనే విషయంపైనా సమ్మేళనాల్లో చర్చించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. సమ్మేళనాల తరువాత అధికారులతో కూడిన 100 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తామని, అవి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతాయన్నారు. పచ్చదనం, పరిశుభ్రత విషయంలో అలసత్వం ప్రదర్శించినట్లు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో మూడు నెలల్లో మార్పు కనిపించాలన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఇందుకోసం త్వరలోనే హైదరాబాద్‌లో కలెక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలకశాఖ డైరెక్టర్ శ్రీదేవి, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పల్లెలు పచ్చదనంతో, పరిశుభ్రతతో కళకళలాడాలి. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు గ్రామాల వికాసానికి పూనుకోవాలి. -
సుపరిపాలన కోసమే చట్ట సవరణలు
సాక్షి, హైదరాబాద్: గ్రామాలు, పట్టణాల గుణాత్మక అభివృద్ధిలో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల పటిష్ట అమలు కీలకమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడానికి ఉన్న చట్టాలను సవరించి పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరముందని, తద్వారా ప్రజలకు గ్రామాలు, మున్సిపాలిటీ స్థాయిల్లో సుపరిపాలన అందించగలుగుతామన్నారు. రాష్ట్రంలో పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పంచాయితీరాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కార్యాచరణ తయారీతోపాటు కొత్త మున్సిపల్ చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ‘‘పంచాయితీరాజ్ చట్టాన్ని పటిష్టంగా రూపొందించిన పద్ధతిలోనే అవినీతిరహితంగా పాలన అందే విధంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా మున్సిపల్ చట్టం రూపకల్పన చేయాలె. నూతన పంచాయతీరాజ్ చట్టానికి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలె. మనం మనుసు పెట్టి పనిచేస్తే గ్రామాలు, మున్సిపాలిటీ స్థాయిల్లో కావాల్సినంత పని ఉన్నది. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రహించాలె. విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన నుంచి గ్రామాల్లో పచ్చదనం పరిశ్రుభ్రతతోపాటు ఇతర మౌలిక రంగాల అభివృద్ధి చేపట్టాల్సిన బాధ్యత మనమీదున్నది’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మున్సిపాలిటీలు దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజలకు సుపరిపాలన అందించాల్సి అవసరం ఉందన్నారు. ఈ దిశగా చట్టం అమలు చేసేందుకు ప్రభుత్వ అధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను కూడా బాధ్యులను చేస్తూ పకడ్బందీగా మున్సిపల్ చట్టాన్ని రూపొందించాలని సూచించారు. మున్సిపల్ చట్టాన్ని ఎంత మెరుగ్గా రూపొందించగలిగితే ప్రజలకు అంత గొప్పగా సేవలందిచగలుగుతామని అధికారులకు సూచించారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మల్యే ఆరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సుపరిపాలన మన జన్మహక్కు
న్యూఢిల్లీ: స్వపరిపాలన లాగే.. సుపరిపాలన కూడా భారతీయుల జన్మ హక్కు అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ఈ దిశగానే పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. వినియోగంలోలేని పాత చట్టాలను రద్దుచేసి నవభారతం కోసం కొత్త రూపుతో ముందుకెళ్తున్నామని మోదీ వ్యాఖ్యానించారు. మాసాంతపు రేడియో కార్యక్రమం మన్‌కీ బాత్ ద్వారా ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘బాలాగంగాధర్ తిలక్ ఇచ్చిన స్వరాజ్యం నా జన్మహక్కు అనే పిలుపును గుర్తుచేసుకోవాలి. ఇప్పుడు సుపరిపాలన మన జన్మహక్కు అని కోరే సమయం ఆసన్నమైంది. ప్రతి భారతీయుడు సుపరిపాలన ఫలాలు పొందాలి. సానుకూల అభివృద్ధి ఫలితాల్లో భాగస్వామి కావాలి. నవభారత నిర్మాణం కోసం మేం చేస్తున్న ప్రయత్నాల అంతిమ లక్ష్యం కూడా ఇదే’ అని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బాలాగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్‌ల పోరాటాన్ని మన్‌కీబాత్‌లో మోదీ గుర్తుచేశారు. చెత్త ఏరుకునే కుటుంబం నుంచి వచ్చిన ఆశారామ్ చౌదరీ అనే విద్యార్థి ఎయిమ్స్‌లో వైద్యవిద్యకు సీటును సంపాదించడం దేశానికి గర్వకారణమన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో ‘కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన’ అనే నినాదాన్ని ప్రధాని తరచుగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. పర్యావరణ అనుకూల గణేశ్ ఉత్సవాలు ప్రకృతితో విభేదించే మార్గాలు సరైనవి కావన్న ప్రధాని పర్యావరణ సమతుల్యతను కాపాడటం ద్వారానే మానవ మనుగడను కొనసాగించగలమన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్నిచోట్ల వర్షాల్లేకపోవడమే సమతుల్యత దెబ్బతినడానికి ఉదాహరణలన్నారు. ప్రకృతిని ప్రేమించడం, కాపాడటం, వన సంరక్షణ వీటన్నింటిలో ప్రజల సామూహిక భాగస్వామ్యం అవసరమన్నారు. ఈ ఏడాది వినాయక ఉత్సవాలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ఉత్సవాల అలంకరణ సామగ్రి నుంచి నిమజ్జనం వరకు ప్రతి చోటా పర్యావరణ హితాన్ని గుర్తుంచుకోవాలన్నారు. విద్యార్థుల జీవితంలో పుస్తకాలు, చదువులకు ప్రత్యామ్నాయమేదీ లేదని ప్రధాని అన్నారు. ఒత్తిడిని పక్కనపెట్టి ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని ఉన్నత చదువులకోసం కాలేజీల్లో చేరిన విద్యార్థులకు మోదీ సూచించారు. ‘యువత తమ జీవితం కొత్త దశలోకి అడుగుపెట్టే నెల జూలై. విద్యార్థుల దృష్టి ఇంటినుంచి హాస్టళ్ల వైపు మళ్లుతుంది. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. కానీ సరైన మిత్రులను ఎంచుకోవాలి’ అని ఆయన సూచించారు. లక్నోలో భూమిపూజ కార్యక్రమంలో ఇటుకపై సంతకంచేస్తున్న ప్రధాని మోదీ. -
అవినీతిపై ఐఎంఎఫ్ మరింత దృష్టి
వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో అవినీతిని రూపుమాపేందుకు తీసుకోతగిన చర్యలకు సంబంధించి ఐఎంఎఫ్ కొత్త విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం ఉగ్రవాదులకు నిధులను అడ్డుకునేందుకు కీలకమైన ఆర్థిక సంస్థలు, సెంట్రల్ బ్యాంకులు, మార్కెట్ల నియంత్రణ సంస్థలు, మనీ లాండరింగ్ చట్టాలు తీసుకుంటున్న చర్యలపై ఐఎంఎఫ్ మరింతగా దృష్టి సారిస్తుంది. చిన్నవైనా, పెద్దవైనా.. సభ్యత్వం ఉన్న మొత్తం 189 దేశాలూ అమలు చేసేలా గుడ్ గవర్నెన్స్ మార్గదర్శకాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. సామాన్యుల ప్రయోజనాలను, ఆర్థిక పురోగతి అవకాశాలను అవినీతి దెబ్బతీస్తుందని, అందుకే మరింత సమర్ధంగా అవినీతిని నిరోధించేందుకు తాజా ప్రమాణాలను రూపొందించామని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్ తెలిపారు. ఇప్పటిదాకా సంపన్న దేశాలకు ఒక రకం, ఇతర దేశాలకు మరో రకం విధానాలను అమలు చేస్తూ వస్తున్న ఐఎంఎఫ్ తాజాగా అన్ని దేశాలకూ ఒకే రకమైన విధానాలు అమలు చేయాలని నిర్ణయించడం గమనార్హం. 17.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీ కోసం ఉక్రేనియా ప్రభుత్వం మరింత కఠినమైన అవినీతి నిరోధక సంస్కరణలు అమలు చేస్తున్న తరుణంలో ఐఎంఎఫ్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. -
మాకూ ఒక చాన్సివ్వండి!
ఫుల్బరీ/కోహిమా: మేఘాలయకు సుపరిపాలన అందించేందుకు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లో మేఘాలయ భద్రంగా ఉండబోదని విమర్శించారు. తమకు అవకాశం ఇస్తే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని.. ప్రతి రూపాయి సద్వినియోమయ్యేలా పనిచేస్తామని అందుకు తనదే భరోసా అని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ వ్యతిరేకత లేకపోవటాన్ని అలుసుగా తీసుకుని అవినీతికి పాల్పడుతోందన్నారు. మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ‘మేఘాలయలో అధికార ముకుల్ సంగ్మా ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయింది. గర్భిణులు ఇంట్లోనే ప్రసవించే దారుణ పరిస్థితిని కల్పిస్తున్నారు. ఇది తల్లీబిడ్డలకు ప్రమాదకరం. చాలా అంశాల్లో రాష్ట్రం అభద్రతతో తల్లడిల్లుతోంది’ అని మోదీ విమర్శించారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఈశాన్య భారతాన్ని.. ఆగ్నేయాసియాతో అనుసంధానిస్తామని నాగాలాండ్ ప్రచారంలో పునరుద్ఘాటించారు. తద్వారా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. నిధుల దుర్వినియోగం మేఘాలయలో 1100 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 470 కోట్లు విడుదల చేస్తే.. అందులో కనీసం 50 శాతం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించలేదన్నారు. కేంద్రం ఇచ్చిన చాలా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. షిల్లాంగ్‌లో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రూ.180 కోట్లు ఖర్చుచేయనున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధి, ఉపాధికల్పన పెరుగుతుందన్నారు. ఇరాక్, సిరియాల్లో చిక్కుకున్న కేరళ నర్సులను కేంద్ర ప్రభుత్వం క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిందన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. క్రిస్టియన్ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. సుస్థిర ప్రభుత్వం అవసరం ‘రవాణా ద్వారా ఈశాన్యరాష్ట్రాల్లో పరివర్తన తీసుకొచ్చే దిశగా, ఈ ప్రాంతం వేగవంతమైన అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం’ అని నాగాలాండ్ ప్రచారంలో మోదీ పేర్కొన్నారు. ‘నవభారత నిర్మాణ స్వప్నం సాకారం.. నవ నాగాలాండ్ కోరుకుంటున్న ప్రజల ఆకాంక్షలతో పాటుగానే జరుగుతుంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి జరగనంతవరకు దేశాభివృద్ధి స్వప్నం లక్ష్యాన్ని చేరదు. అందుకే ఈ ప్రాంతంపై బీజేపీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. సుస్థిర, బలమైన రాష్ట్ర ప్రభుత్వం నాగాలాండ్‌కు చాలా అవసరం’ అని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 27న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ తరపున 20 మంది, మిత్రపక్షం ఎన్డీపీపీ తరపున 40 మంది బరిలో ఉన్నారు. -
అందరి ఎజెండా ఒక్కటే!
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలపై ఏకాభిప్రాయం రెండు జిల్లాల ఏర్పాటు... తుది దశకు పునర్విభజన.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘పునర్విభజన’పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో శుక్రవారం జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతిని«ధులు భేటీ అయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉపసంఘం భేటీ అవుతోంది. ఇందులో భాగంగా మొదటగా శుక్రవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆడిటోరియంలో సమావేశం అయ్యారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రుల తుమ్మల నాగేశ్వర్రావు, ఈటల రాజేందర్ తదితరుల కమిటీ జిల్లాల పునర్విభజనపై పలు అంశాలపై చర్చించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ప్రజాప్రతినిధులతో వేర్వేరుగా నిర్వహించిన సమావేశంలో జిల్లా నుంచి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, జెడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, పాతూరు సుధాకర్‌రెడ్డి, డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, బాజిరెడ్డి గోవర్దన్, బిగాల గణేష్‌గుప్త పాల్గొన్నారు. ఇప్పటికే పలు కమిటీలు.. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై రెండు నెలలుగా కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ జిల్లాల ఏర్పాటు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో అధ్యయన కమిటీలు కూడా వేశారు. జిల్లాకు సంబంధించి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్‌లను అధ్యయన కమిటీ సభ్యులుగా సీఎం కేసీఆర్ నియమించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా వేర్వేరుగా జరిగే కొత్త జిల్లాల ఏర్పాటు అధ్యయనం జూన్ 2లోగా ముగించారు. జిల్లాలో జనాభా, భౌగోళిక పరిస్థితులు, నియోజకవర్గాలు, రెవెన్యూ డివిజన్లను పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. వీటిపైనా మరో రెండు మార్లు సీసీఎల్ఏ, చీఫ్ సెక్రటరీలు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కూడా నిర్వహించి ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వాలని కోరారు. కొత్త జిల్లాలపై సీఎం నిర్ణయం, ప్రతిపాదనలకే సభ్యులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దులు, గ్రామ, మండల జిల్లా స్థాయిల్లో పునర్విభజనకు సంబంధించి స్వరూపాలు, మార్పులు, ప్రాంతాల వారీగా ప్రజల మనోభావాలు తెలుసుకున్నారు. ఆ తర్వాతే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఏర్పాటుకు సీఎం ఆమోద ముద్ర కూడ వేశారు. అయితే ఈ నెల 22న కొత్త జిల్లాల ఏర్పాటుపై ముసాయిదా ప్రకటించనుండగా.. ఏవైనా మార్పులు చేర్పులుంటే మాట్లాడేందుకు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులతో సబ్‌కమిటీ సమావేశాలు నిర్వహిస్తుంది. తుదిదశకు చేరిన ‘పునర్విభజన’ జిల్లాల పునర్విభజనపై అందరి ఎజెండా ఒక్కటే. సుపరిపాలన, ప్రజలకు అందుబాటులో పాలన లక్ష్యంగా పునర్విభజన చేస్తున్నట్లు ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. వీటికి కట్టుబడే అందరి ఎజెండా ‘సుపరిపాలన’గా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సబ్‌కమిటీతో శుక్రవారం హైదరాబాద్‌లో భేటీ అయిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత, ఇతర ప్రజాప్రతినిధులు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాలతో నిజామాబాద్ జిల్లాగా... కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలు కలిపి కామారెడ్డి జిల్లాగా ఏర్పడనున్న విషయం తెలిసిందే. ఈ రెండు జిల్లాల్లో కొత్తగా ఏర్పడే 10 మండలాలు ఏర్పడనుండగా... ఏయే మండలాలు ఏ జిల్లాలో ఉండాలన్న విషయమై ఉపసంఘంలో చర్చించినట్లు తెలిసింది. బాన్సువాడ నియోజకవర్గం కామారెడ్డి జిల్లాలో ఉన్న కోటగిరి, వర్ని మండలాలను నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని మంత్రి సూచించినట్లు సమాచారం. బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో భాగంగానే జిల్లాల పునర్విభజన, కొత్త మండలాల ఏర్పాటు చేస్తుందని, అయితే ఇవన్నీ ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చూడాలని ఎంపీ కవిత సూచన చేసినట్లు తెలిసింది. సుపరిపాలన దిశగా ప్రభుత్వం ముందుగా సాగుతుందని, ఇందులో భాగంగానే పునర్విభజన జరుగుతుందని, తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా జిల్లాల పునర్విభజనపై ఉపసంఘం పలు సూచనలు చేసినట్లు సమాచారం. -
పాలనా దక్షతే... సుపరిపాలనకు రక్ష
పరిపాలన - సుపరిపాలన- ప్రభుత్వం అనే భావనల మధ్య తేడా ఏంటి? భారతదేశంలో సుపరిపాలన సాధ్యమేనా? అవరోధాలేంటి? వాటిని ఎలా అధిగమించాలి? దీనికి సమాధానం... పాలనా దక్షతే అనడంలో సందేహం లేదు. పరిపాలన (Governance) అనే పదానికి గ్రీకు భాషలోని Kubernao అనేది మూల పదం. దీనికి అర్థం సారథ్యం వహించడం. సుప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త ప్లాటో మొదటిసారిగా ఈ పదాన్ని రూపకాలంకారం (Metaphorical)గా వాడారు. అనంతరం లాటిన్, ఇంగ్లిష్ భాషల్లో ఈ పదాన్ని పలు అర్థాలతో వాడారు. కాలానుగుణంగా దీని వాడకంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ భావనను ‘పాలక చర్య’ గా నిర్వచించడం జరుగుతోంది. నాయకత్వ, నిర్వహణ ప్రక్రియలో ఒక అంశంగా పరిగణిస్తున్నారు. కౌటిల్యుడు.. తన అర్థశాస్త్రంలో ప్రభుత్వం న్యాయబద్ధంగా, నైతికంగా తన కార్యకలాపాలను నిర్వహించడమే పరిపాలన (Governance) అని భాష్యం చెప్పాడు. మహాత్మా గాంధీ దృష్టిలో రామరాజ్య భావనేసుపరిపాలన. ‘నియమ నిబంధనల మేరకు అధికారాన్ని వినియోగించే ప్రవృత్తి (Process) పరిపాలన’ అని చెప్పవచ్చు. సుపరిపాలనకు కొలమానాలు ప్రపంచబ్యాంకు 1989వ సంవత్సరంలో సహారా ఎడారి దిగువ (SubSahara) ఉన్న ఆఫ్రికా దేశాల్లో పాలనా ప్రక్రియను మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ పరిపాలన, సుపరిపాలన అనే పదాలను తాను రూపొందించిన నివేదికలో ప్రస్తావించింది. అప్పటినుంచి ఈ భావాలకు విస్తృత ప్రచారం లభించింది. ప్రపంచబ్యాంకు 1996లో విడుదల చేసిన అధ్యయనంలో పరిపాలనకు సంబంధించి ఆరు ప్రామాణిక కొలమానాలను (Dimensions) ప్రస్తావించింది. అవి 1. జవాబుదారీతనం, 2. రాజకీయ సుస్థిరత, 3. ప్రభావవంతమైన ప్రభావం, 4. గుణాత్మక నియంత్రణ, 5. సమన్యాయ పాలన, 6. అవినీతిని అదుపులో పెట్టడం. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో ఒకటైన ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం (యూన్‌డీపీ ) 1997లో సుపరిపాలన ప్రధాన లక్షణాలను గుర్తించింది. వాటిలో 1. భాగస్వామ్యం, 2. సమన్యాయ పాలన, 3. పారదర్శకత. 4. ప్రతిస్పందన ((Responsiveness), 5. ఏకాభిప్రాయం, 6. సమత, 7. ప్రభావవంతం, సమర్థత, 8. జవాబుదారీతనం, 9. వ్యూహాత్మక దృష్టి (Strategic Vision). పరిపాలన, సుపరిపాలన అనే ఈ రెండు పదాలు దాదాపు ఒకే అర్థంతో వాడటం జరుగుతుంది. కాకపోతే సుపరిపాలన అనే పదం సకారాత్మక భావనను కలిగిస్తే, పరిపాలన అనే పదం తటస్థ (Neutral) భావననిస్తుంది. మరి ప్రభుత్వమంటే ఏంటి? శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల కార్యకలాపాలకు సంబంధించినది. అన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ప్రజారంజకంగా వ్యవహరిస్తాయని చెప్పలేం. అధికార దుర్వినియోగం, అసమర్థత, అవినీతి మొదలైన అవలక్షణాలు ప్రభుత్వ వ్యవస్థలలో కనిపిస్తున్నాయి. వీటిని నివారించి బాధ్యతాయుతంగా వ్యవహరించే ప్రవృత్తిని సుపరిపాలన/పరిపాలన అనే అర్థంతో వాడుతున్నారు. ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు మార్కెట్, పౌర సమాజం ప్రజా వసరాలను తీర్చడంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. వీటి సమష్టి కృషినే సుపరిపాలన/పరిపాలనగా అభివర్ణించడం జరుగుతోంది. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా పౌర సంక్షేమానికి జరిపే కార్యకలాపాలన్నీ సుపరిపాలన / పరిపాలనలో అంతర్భాగాలే. ప్రభుత్వ ప్రాధాన్యత క్రమేణా తగ్గుతూ పౌర సమాజ పాత్ర పెరగడం సుపరిపాలన లక్షణం. సుపరిపాలన అంటే ఎలా ఉండాలి? 1.నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలను మెరుగుపరచాలి. 2.మౌలిక సదుపాయాలైన రహదారులు, వంతెనలు, విద్యుచ్ఛక్తి, టెలిఫోన్, నీటిపారుదల, రవాణా సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండాలి. 3.సమర్థవంతంగా శాంతిభద్రతలను నిర్వర్తిస్తూ ఆస్తి, ప్రాణ రక్షణ కల్పించాలి. 4.ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఉద్యోగాలు కల్పించాలి. 5.సమర్థనీయ, ప్రభావవంతమైన ప్రభుత్వం ఉండాలి. 6.వాణిజ్య కార్యకలాపాలకు అనువైన వాతావరణాన్ని సృష్టించాలి. 7.సమాజంలోని కృత్రిమ అసమానతలు తొలగించడానికి అణగారిన వర్గాలకు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించాలి. 8.ప్రాథమిక హక్కులను అనుభవించడానికి అనుకూల పరిస్థితులు కల్పించడం. ఈ విధంగా పైన ప్రస్తావించిన అంశాల్లో ప్రభుత్వం జోక్య రహిత విధానాన్ని అవలంబించాలి. 9.పౌరులు ప్రధాన కేంద్ర బిందువుగా సేవలు (Citizen centric services) అందించాలి. 10.ఎలాంటి వివక్షను చూపకుండా స్వచ్ఛమైన సేవలను పౌరులకు చేరేలా చూడాలి. సుపరిపాలన-ఎదురవుతున్న సమస్యలు అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలతో పోల్చిచూస్తే.. మన దేశం గణనీయమైన ప్రగతి సాధించినప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరాలంటే నేరపూరిత రాజకీయాలు, అవినీతి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. నేరమయ రాజకీయ ప్రవృత్తి, ప్రభుత్వోద్యోగులు, వ్యాపారవేత్తలు, మాఫియా శక్తులు ఒక విషవలయంగా రూపొందాయి. ప్రభుత్వ విధాన రూపకల్పన, అమల్లో ఈ దుష్టశక్తుల ప్రభావం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. సుపరిపాలనకు అరిష్టాలు ఈ దుష్ట చతుష్టయమే. అదృష్టవశాత్తూ చురుకైన పౌర సమాజం, క్రియాశీలక న్యాయ వ్యవస్థ, శక్తిమంతమైన ప్రసార మాధ్యమాలు వీరి ఆటకట్టించడానికి తమవంతు కృషి చేస్తున్నాయి. కళంకితులు, నేర పూరితులైన రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, వ్యాపారవేత్తలు కటకటాలపాలయ్యారు. అయితే కొందరు ధన, రాజకీయ బలాలతో బెయిలు సంపాదించి తిరిగి అవే నేరాలను కొనసాగిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని (1951) సవరించి నేర చరితుల్ని ఎన్నికల్లో పోటీచేయడాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు, అక్రమ సంపాదనను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలుగా అవినీతి వ్యతిరేక చట్టాన్ని(1989) మరింత పటిష్టం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అలాంటప్పుడే సుపరిపాలన సుసాధ్యమవుతుంది. 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు గనుల వేలంలో అక్రమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే భారీ కుంభకోణాలెన్నో దేశంలో వెలుగుచూశాయి. నేటి ఏలికల ఏలుబడిలో ఇలాంటి అవినీతి పర్వాలు సర్వసాధారణమయ్యాయి. అవినీతికి పాల్పడటం మానవ నైజమని సమర్థించడం తప్పు. వ్యవస్థాపరమైన లొసుగులు, జవాబుదారీతనం లోపించడం, కఠినతరమైన శిక్షలు అమలుచేయకపోవడం, సగటు పౌరునిలో నిరాసక్తత, పటిష్టమైన లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పడకపోవడం లాంటివి సుపరిపాలన పరిమళాలను భ్రష్టు పట్టిస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం, శక్తిమంతమైన అవినీతి నిరోధక వ్యవస్థలు పనిచేయడం ప్రారంభమైననాడే సర్కారు సుపరిపాలనను అందించగలదు. సుపరిపాలన శోభిల్లాలంటే.. సత్పరిపాలనను కోరుకోవడం పౌరుని హక్కు. దాన్ని పొందాలంటే జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన పాలనా యంత్రాంగం అవసరం. గాంధీజీ కలలు గన్న అంత్యోదయ సూత్రానికి ప్రాధాన్యతనిస్తే సుపరిపాలన సాధ్యమవుతుంది. ప్రజల సగటు ఆదాయం పెరుగుతుంది. సంపూర్ణ అక్షరాస్యత సాకారమవుతుంది. సరైన వైద్య సదుపాయాలు కల్పించి సగటు ఆయుః ప్రమాణాన్ని పెంచవచ్చు. ప్రతి పౌరునిలో దేశభక్తి, సత్యాన్వేషణ, రుజు ప్రవర్తన ప్రభవిల్లినప్పుడే ఏలికలు తలపెట్టిన సుపరిపాలన చిరకాలం శోభిల్లుతుంది. డా॥బి.జె.బి. కృపాదానం సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్సీరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
నేరచరిత్ర కలిగిన అభ్యర్ధుల జాబితా విడుదల
-
సద్విమర్శను స్వీకరిస్తేనే సుపరిపాలన సాధ్యం
సార్వత్రిక ఎన్నికలు జరిగి సంవత్సరం పూర్తి కావస్తున్నది. కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇప్పటికీ కుదుటపడలేదు. ఢిల్లీలో నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబునాయుడు, తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరి శైలిలో వారు ప్రభుత్వాలు నడుపుతున్నారు. మోదీ సర్కార్ పనితీరుపైన భారతీయ జనతా పార్టీ మేధావి, మాజీ మంత్రి అరుణ్‌శౌరీ ‘హెడ్‌లైన్స్ టుడే’ చానల్లో కరణ్‌థాపర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన విమర్శలు నిర్మాణాత్మకమైనవి. కటువుగా కనిపించవచ్చును కానీ శౌరీ చెప్పిన అంశాలు అక్షరసత్యాలు. కాంగ్రెస్ నాయకుడూ, మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ ఎన్డీటీవీ వెబ్ సైట్లో మోదీని ఉతికి ఆరవేస్తూ రాసిన పది వ్యాసాలూ ఒక పెట్టు, అరుణ్‌శౌరీ ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూ ఒక పెట్టు. మూడు ప్రభుత్వాలలో కనిపించే సామ్యం పారదర్శకత లేకపోవడం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి కావడం. చేసిన వాగ్దానాల అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం. లేనిపోని పేచీలు పెట్టుకొని ప్రతిపక్షాలతో కయ్యానికి కాలు దువ్వి, చట్టసభలలో చర్చ జరగకుండా ప్రతిష్టంభనకు దారి తీయడం లేదా ప్రతిపక్షాన్ని సభనుంచి బహిష్కరించడం. సర్వసాధారణంగా ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వాలు రెండు, మూడు మాసాలలో ఒడిదుడుకులను అధిగమించి సజావుగా పని చేయడం ఆరంభిస్తాయి. చట్టసభకు ఎన్నికైనవారిలో సమర్థులను మంత్రివర్గంలోకి తీసుకుంటే అది ప్రధాని లేదా ముఖ్యమంత్రి ఆత్మవిశ్వాసానికీ, విశాల దృక్పథానికీ నిదర్శనం. సమర్థమైన పాలన అందించేందుకు సాధనం. కేంద్రమంత్రిమండలిలో అనుభవజ్ఞులకూ, సమర్థులుగా పేరున్నవారికీ స్థానం కల్పించినప్పటికీ వారిని పూర్తి స్థాయిలో పనిచేయనీయడం లేదన్నది శౌరీ విమర్శ. రాజ్‌నాథ్‌సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. నితీన్ గడ్కరీ పరిపాలనా సామర్థ్యం ఉన్న నాయకుడు. వాజపేయి హయాంలో స్వర్ణచతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల నిర్మాణానికి గడ్కరీ దార్శనికతే కారణం. సుష్మాస్వరాజ్ మంచి వక్త, ప్రతిపక్షంతో సైతం సత్సంబంధాలు నెరపే పార్లమెంటేరియన్ కావడంతో పాటు పరిపాలనలో దిట్ట. ఒకానొక దశలో బీజేపీ ప్రధాని అభ్యర్థులుగా పరిగణించిన ఇద్దరు ముగ్గురిలో ఒకరు. ఇటువంటి సమర్థుల సేవలను సద్వినియోగం చేసుకోకుండా వారిని అదుపులో పెట్టడం, వారిపైన ఆంక్షలు విధించడం, నిఘా పెట్టడం మోదీ అభద్రతాభావానికి నిదర్శనం. దేశ సమస్యలను ఆకళింపు చేసుకొని పరిష్కరించవలసిన ప్రధాని అదే పనిగా విదేశాలలో పర్యటించడం వల్ల అంతర్జాతీయ సంబంధాలు కొంత మేరకు మెరుగు కావచ్చునేమో కానీ విదేశాంగమంత్రిని పూర్వపక్షం చేయడం అభిలషణీయం కాదు. సుష్మాస్వరాజ్‌ను నామమాత్రపు విదేశాంగమంత్రిగా పక్కన పెట్టి సర్వం తానే అయినట్టు మోదీ విశ్వరూపం ప్రదర్శించడంలో ఔచిత్యం లేదన్నది శౌరీ చేసిన మరో విమర్శ. ప్రపంచ వేదికపైన చైనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో భారత్ కీలకపాత్ర పోషించడం అవసరమే. కానీ ఆర్థికంగా ఎదగనంత కాలం కేవలం దౌత్యవిధానాలతో అంతర్జాతీయ రంగంలో ప్రాముఖ్యం లభించదు. జవహర్లాల్ నెహ్రూకు మించిన దౌత్యవేత్త ఎవరున్నారు? ఆయన పంచశీలకు మించిన శాంతిసాధనం ఏమున్నది? అయినా సరే, ఆర్థికంగా ఎదగని కారణంగా నెహ్రూ విదేశాంగ విధానానికి కానీ ఇండియాకు కానీ తగినంత ప్రాధాన్యం దక్కలేదు. అన్నీ తె లిసిన అధినేతలు ఆర్థికరంగంలో మోదీ సర్కార్ మందకొడిగానే సాగుతున్నది. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు. కొత్త పెట్టుబడులు రావడంలేదు. పన్నుల విధానంలో నిలకడ లేదు. విదేశీ పెట్టుబడిదారులకు నమ్మకం కుదరలేదు. 2013లో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూ సేకరణ బిల్లును సమర్థించిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట సవరణ గురించి ఆలోచించడం, దానికోసం ఆర్డినెన్స్ జారీ చేయడం అనవసరమని అరుణ్‌శౌరి వాదన. చట్టసవరణ బిల్లును ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న మోదీ ప్రతిపక్షాన్ని మరింత దూరం చేసుకొని చట్టసభలలో బిల్లులు ఆమోదం పొందలేని పరిస్థితిని కొనితెచ్చుకుంటున్నారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాలంటే కూడా ప్రతిపక్ష సహకారం అవసరం. భూసేకరణ చట్టం సవరణ బిల్లులో రాజీపడితే జీఎస్టీ బిల్లును ప్రతిపక్షాలు అంగీకరించవచ్చు. ఆ దిశగా అడుగులు వేయకుండా విదేశీగడ్డపైన ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం అవివేకం. కార్యసాధకులు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించాలి. గాంధీనగర్ నుంచి ఢిల్లీ స్థాయికి మానసికంగా కూడా ఎదగాలి. తెలంగాణ మంత్రివర్గంలో ఒక్క మహిళ సైతం లేకపోవడం లోపంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు కనిపించకపోవడం విచిత్రం. తొలుత మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు పురుషులకు మాత్రమే అన్నట్టు ఒక్క మహిళకూ అవకాశం ఇవ్వలేదు. అనంతరం విస్తరించినప్పుడు కూడా మహిళ ఊసే లేదు. దళితులకూ, రాజకీయ ప్రాబల్యం కలిగిన ఇతర సామాజికవర్గాలకూ ప్రాధాన్యం ఇవ్వాలన్న స్పృహ కలిగిన కేసీఆర్ జనాభాలో సగం ఉన్న మహిళలకు మాత్రం ఒక్క మంత్రిత్వశాఖ సైతం ఇవ్వకుండానే సంవత్సరం పూర్తి చేస్తున్నారు. మంత్రులలో ఎవ్వరూ స్వతంత్రంగా వ్యవహరించే సాహసం చేయరనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అంతా ముఖ్యమంత్రి కనుసన్నలలో జరగవలసిందే. ‘ఆయనకు అన్నీ తెలుసు. ఆయన బుర్రలో అన్ని నక్షాలూ ఉంటాయి. కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే’ అంటూ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. మంత్రివర్గ నిర్మాణంలో చంద్రబాబునాయుడి సూత్రం తెలిసిందే. అన్ని బలమైన కులాలకూ ప్రాతినిధ్యం ఇస్తారు. మహిళలకు కూడా చోటు కల్పిస్తారు. కానీ విషయపరిజ్ఞానం ఉన్నవారిని దూరం పెట్టి విధేయులుగా ఉంటూ ఏది చెప్పినా తలలూపేవారికి మంత్రిపదవులు ఇస్తారు. ఐఏఎస్ అధికారుల ద్వారా ప్రభుత్వాన్ని ఆయనే నడిపిస్తారు. ముగ్గురు నలుగురు వ్యక్తులపైనే ఎక్కువగా ఆధారపడతారు. వారసులొస్తున్నారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరూ తమ వారసులను భవిష్యత్తులో బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధం చేస్తున్నారు. పనిగట్టుకొని ఆ పని చేస్తున్నట్టు కనిపించకుండానే ఆచరణలో తమ తర్వాత ఎవరు ముఖ్యులో పార్టీ సభ్యులకూ, అధికారయంత్రాంగానికీ, మీడియాకీ, సాధారణ ప్రజలకూ తెలిసేవిధంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ చేసిన సాహసం చంద్రబాబు నాయుడు చేయలేకపోయారు. మేనల్లుడు హరీశ్‌రావుతో పాటు కొడుకు తారకరామారావు (కేటీఆర్)ను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాకుండా కుమారుడికి ముఖ్యమైన రెండు శాఖలు ఇచ్చారు. సమాచార సాంకేతిక శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖను కూడా కేటీఆర్‌కు అప్పగించడం ద్వారా ఒక వైపు పారిశ్రామికవేత్తలతో, వణిక్ ప్రముఖులతో భుజాలు రాసుకుంటూనే మరోవైపు గ్రామీణ స్థాయి పార్టీ కార్యకర్తలతో సంబంధాలు పెట్టుకునే అవకాశం కల్పించారు. ఉత్తరోత్తరా ఈ అనుభవం కేటీఆర్ రాజకీయంగా ఎదగడానికి దోహదం చేస్తుంది. లోకేశ్‌ను శాసనసభ ఎన్నికల రంగంలో దించకుండా ప్రచారానికే పరిమితం చేసిన చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రులుగా కేఈ కృష్టమూర్తినీ, నిమ్మకాయల చినరాజప్పనూ నియమించినప్పటికీ పార్టీలో, ప్రభుత్వంలో తన తర్వాత తన కుమారుడే ముఖ్యుడనే విషయం అందరికీ అర్థమయ్యేవిధంగా చేశారు. అవరోధంగా పరిణమిస్తాడనే అనుమానంతోనే జూనియర్ ఎన్టీఆర్‌ను నిర్దాక్షిణ్యంగా వెనక్కు నెట్టివేశారు. కేటీఆర్‌కు హరీశ్ పెద్ద అవరోధం. తన కంటే ముందు రాజకీయాలలో ప్రవేశించడమే కాకుండా క్షేత్రస్థాయిలో సమర్థుడైన, చురుకైన, విశ్వసనీయత కలిగిన రాజకీయ నాయకుడుగా హరీశ్‌కు మంచి పేరు ఉండటం కేటీఆర్ భవిష్యత్తును ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. లోకేశ్‌కు అటువంటి సమస్య లేదు. చంద్రబాబునాయుడు సింగపూర్, జపాన్, చైనా పర్యటనలకు వెళ్ళినా, ఢిల్లీ వెళ్లినా ఉపముఖ్యమంత్రులతో సహా మంత్రులం దరూ లోకేశ్‌ను కలుసుకొని ఆదేశాలు అందుకుంటున్నారు. మొదట్లో కాస్త ఇబ్బంది పడిన సీనియర్లు క్రమంగా అలవాటు పడ్డారు. ఎంత సీనియర్ మంత్రి అయినా, కొమ్ములు తిరిగిన పార్టీ నాయకుడైనా ముందు అనుమతి (అపాయింట్మెంట్) తీసుకొని లోకేశ్‌బాబుని కలుసుకోవలసిందే కానీ ఎప్పుడుపడితే అప్పుడు అతని గదిలోకి వెళ్లే అవకాశం లేదు. రేపు మహానాడులో వారసుడిగా లోకేశ్ మరింత స్పష్టంగా ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రత్యేకించి ఏ వర్గాన్నీ దూరం చేసుకోలేదు. కానీ మోదీ, చంద్ర బాబు నాయుడు అధికారంలోకి వస్తూనే అన్నదాతలతో పేచీ పెట్టుకున్నారు. సాక్షీమహరాజ్ వంటి సహచరులుండగా మోదీకి వేరే శత్రువులు అక్కరలేదు. డబ్బుని కొలిచే నయాసంపన్నులను చుట్టూ పెట్టుకున్న చంద్రబాబునాయుడికి ప్రజలు దూరం కావడానికి వారే కారకులవుతారు. నరేంద్రమోదీకి హితవు చెప్పడం ద్వారా భవిష్యత్తులో తనకు ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ పదవీ రాకుండా అరుణ్‌శౌరీ చేజేతులా చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో అటువంటి త్యాగం చేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అధినేత ఏమి చేసినా, ఏమి చెప్పినా అద్భుతం, పరమాద్భుతం అంటూ ఆకాశానికెత్తి తమ పబ్బం గడుపుకుంటున్నారు. వాస్తవాలు చెప్పే హితైషులు లేకపోవడం పాలకులకు వరం కాదు. శాపం. -
న్యాయవ్యవస్థ, సుపరిపాలనపై భేటీ
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సమావేశం ఆదివారం ఢిల్లీలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో న్యాయవ్యవస్థ-సుపరిపాలన అంశంపై చర్చిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు ఈ సమాశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ గుప్తా కూడా ఈ భేటీకి హాజరయ్యారు. -
సుపరిపాలనే లక్ష్యం
ఓకే అంటే..? బాధ్యతలు స్వీకరించాక తన చాంబర్‌కు వచ్చిన అధికారులతో జేసీ పౌసుమిబసు ముచ్చటించారు. డీఆర్వో వీరబ్రహ్మయ్యను ప్రజావాణి ప్రగతిపై అడిగారు. ఆయన ‘ప్రజావాణి ఓకే’ అని సమాధానమివ్వడంతో.. ఓకే అంటే ఏంటని జేసీ ప్రశ్నించారు. తన పరిధిలోని పెండింగ్ సమస్యలు, కేసుల వివరాలు నిర్వహించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ముకరంపుర : ‘ప్రభుత్వ పథకాల అమలుపై పారదర్శకంగా వ్యవహరిస్తా.. ప్రజవాణిని మరింత పటిష్టంగా అమలు చేయిస్తా... సమస్యలు పెండింగ్ లేకుండా సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పని చేస్తా..’ అని కొత్త జాయింట్ కలెక్టర్ పౌసుమి బసు స్పష్టం చేశారు. వరంగల్ నుంచి బదిలీపై వచ్చిన ఆమె మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అన్ని శాఖల సిబ్బందిని, అధికారులను పరిచయం చేసుకున్నారు. శాఖాపరమైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేలా ఉండాలని సూచించారు. పెండింగ్ రికార్డులు సిద్ధం చేసి పండుగ పూర్తికాగానే తనకు నివేదించాలని చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా చేపట్టిన సంక్షేమ పథకాలను జిల్లాలో సక్రమంగా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఆహారభద్రత కార్డుల జారీ, సన్నబియ్యం భోజన పథకం, దళితులకు మూడెకరాల భూమి పథకాలకు అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రజావాణి అత్యంత ముఖ్యమైనదని, ఈ కార్యక్రమాన్ని మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. అందరి సహకారంతో అర్హులకు పథకాలు అందేలా చూస్తామని, పథకాల అమలును వేగవతం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో వీరబ్రహ్మయ్య, డీఎస్వో చంద్రప్రకాశ్, సివిల్సప్లై డీఎం సంపత్‌కుమార్, ఆర్డీవో చంద్రశేఖర్, కలెక్టరేట్ ఏవో రాజాగౌడ్, డీపీఆర్వో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పర్సనల్ టచ్ పేరు : పౌసుమి బసు పుట్టిన తేది : 03-01-1980 స్వరాష్ట్రం : పశ్చిమబెంగాల్ మాతృభాష : బెంగాలీ చదువు : కోల్‌కతా యూనివర్సిటీ నుంచి జాగ్రఫీలో బీఎస్సీ ఆనర్స్. ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించారు. ఢిల్లీలోని జవహర్‌నెహ్రూ యూనివర్సిటీ నుంచి జాగ్రఫీలో పీజీ ఫస్ట్ డివిజన్. అదే యూనివర్సిటీ నుంచి జాగ్రఫీలో ఎంఫిల్ పట్టా పొందారు. సివిల్స్‌కు ఎంపిక : 2007 ఐఏఎస్ బ్యాచ్ నిర్వహించిన బాధ్యతలు : ఖమ్మం జిల్లా పాల్వంచ సబ్ కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ 30-08-2009 నుంచి 07-08-2010 వరకు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా 18-04-2011 నుంచి 18-06-2011 వరకు కాకినాడలో వాణిజ్య పన్నుల శాఖ డెప్యూటీ కమిషనర్‌గా 18-06-2011 నుంచి 08-10-2013 వరకు.. అనంతరం వరంగల్ జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. -
25న పాఠశాలలకు సెలవు: కేంద్రం
న్యూఢిల్లీ: డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులో ఎలాంటి మార్పు ఉండబోదని మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభకు తెలిపారు. డిసెంబర్ 25ను ‘గుడ్ గవర్నెన్స్’ దినంగా పాటించాలన్న కేంద్రం ప్రకటనలతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొందని సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే కేంద్రీయ గురుకుల విద్యాలయాలు మాత్రం పనిచేస్తాయన్నారు.గాంధీ జయంతిన విద్యా సంస్థల్లో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మాజీ ప్రధాని వాజ్‌పేయి జన్మదినమైన డిసెంబర్ 25న వేడుకలు జరుపకూడదంటే ఎలాగని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. -
'మోడీ పాలనలో భారత్ దూసుకుపోతుంది'
నాగపూర్: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనలో భారత్ అన్ని రంగాల్లో దూసుకువెళ్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి ఆకాంక్షించారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల కాల వ్యవధిలోనే ... దేశ ఆర్థికాభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఆయన సాధించిన పురోగతిని వివరించారు. దసరా పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం నాగపూర్‌లో రేషంబాగ్ మైదానంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మోహన్ భగవతి ప్రసంగించారు. ఈ సందర్బంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మెహన్ భగవతి ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ పాలనతో భారత్ ప్రజలలో చిరు ఆశలు మొలకెత్తాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ఇవి ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. మోడీ తన పాలన ద్వారా మరి పథకాల అమలుకు కొంత సమయం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భగవతి ప్రసంగాన్ని డీడీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. -
రాజకీయాలపై ఆలోచించండి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలలో ఓటు వేయడానికే పరిమితం కాకుండా రాష్ట్రంలో సుపరిపాలన కోసం మంచి పార్టీకి మద్దతు పలికేలా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రజలలో చైతన్యం కలిగించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోరారు. ఐటీ నిపుణులు రాజకీయాలు గురించి ఆలోచించాలని ఉద్బోధించారు. రాష్ట్రంలో సుపరిపాలన ఉన్నప్పడే ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. ‘ప్రజా చైతన్యానికి మీరు నాంది పలకండి. మీ భవిష్యత్‌కు నేను రూపకల్పన చేస్తా’ అని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో సైబర్ టవర్స్ నిర్మాణం జరిగి 15 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా చంద్రబాబు శుక్రవారం అక్కడ పర్యటించారు. సైబర్టవర్స్ ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను అధికారంలో ఉన్నప్పుడు సైబర్ టవర్స్ నిర్మాణం కోసం చేసిన కృషిని వివరించారు. 15 ఏళ్ల క్రితం ఇదే రోజు తాను, అప్పటి ప్రధాని వాజపేయి ఈ కార్యక్రమానికి నాంది పలికామన్నారు. ఈ నిర్మాణం ఇప్పుడు తనకెంతో తృప్తినిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం విస్తరణకు 15 రోజుల పాటు అమెరికాలో పర్యటించానన్నారు. గతంలో హైదరాబాద్ అంటే చార్మినార్ గుర్తుగా ఉండేదని.. ఎన్టీ రామారావు వచ్చాక బుద్ధ విగ్రహం ఆ జాబితాలో చేరిం దని... తాను తొమ్మిదేళ్లలోనే సైబరాబాద్ నిర్మాణం పూర్తి చేసినట్టు చెప్పారు. వైఎస్ రాజశే ఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి ఆగిపో యిందని ఆరోపించారు. తాను అనుకున్న విధంగా ముందుకు పోలేదన్నారు. సాక్షిపై టీడీపీకి అదే అక్కసు: టీడీపీ మరోసారి సాక్షి దినపత్రికపై అక్కసు వెళ్లగక్కింది. పార్టీ నిర్వహిస్తున్న పత్రికా విలేకరుల సమావేశాలతో పాటు, సమావేశాలకు, కార్యక్రమాలకు సంబంధించి ఈ ఏడాది జూన్ 12 వ తేదీ నుంచి సాక్షి దినపత్రిక, టీవీ చానల్‌కు ఎలాంటి ఆహ్వానాలు పంపడం లేదని తెలిపింది. అయినప్పటికీ వైఖరి మార్చుకోకుండా తమ పార్టీకి సంబంధించిన వార్తలు ప్రచురిస్తున్నారని ఆక్రోశం వెలిబుచ్చింది. పార్టీ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ పేరిట శుక్రవారం రాత్రి ఒక ప్రకటనను తెలుగుదేశం రాష్ర్ట కార్యాలయం విడుదల చేసింది. పార్టీ నిర్వహించే విలేకరుల సమావేశానికి సాక్షి ప్రతినిధి హాజరు కాకపోయినప్పటికీ వార్తలు ప్రచురిస్తూ... మా విలేకరి వస్తే ఈ ప్రశ్నలు అడిగేవారంటూ ప్రశ్నలు వేస్తోందని పేర్కొంది.