
'మోడీ పాలనలో భారత్ దూసుకుపోతుంది'
నాగపూర్: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనలో భారత్ అన్ని రంగాల్లో దూసుకువెళ్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి ఆకాంక్షించారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల కాల వ్యవధిలోనే ... దేశ ఆర్థికాభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఆయన సాధించిన పురోగతిని వివరించారు. దసరా పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం నాగపూర్లో రేషంబాగ్ మైదానంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మోహన్ భగవతి ప్రసంగించారు.
ఈ సందర్బంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మెహన్ భగవతి ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ పాలనతో భారత్ ప్రజలలో చిరు ఆశలు మొలకెత్తాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ఇవి ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. మోడీ తన పాలన ద్వారా మరి పథకాల అమలుకు కొంత సమయం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భగవతి ప్రసంగాన్ని డీడీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారమైంది.