rss chief
-
రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాగ్‌పూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. రిజర్వేషన్లపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వివక్ష ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని అభిప్రాయపడ్డారాయన. బుధవారం నాగ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ఆరెస్సెస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. వ్యవస్థలో మనం.. తోటి మనుషులను(కొన్ని వర్గాలను) చాలా ఏండ్లు వెనుకే ఉంచుతూ వచ్చాం. దాదాపు 2 వేల ఏళ్లుగా ఇది కొనసాగింది. ఎప్పుడైతే సమానత్వం లాంటివి ప్రత్యేకాంశాలను వాళ్లకు కల్పించామో.. ప్రత్యేకించి రిజర్వేషన్లలాంటివి వాళ్లకు ఎంతో మేలు చేస్తున్నాయి. వెనకబడిన వర్గాలకు పూర్తిస్థాయిలో మనతో సమానావకాశాలు దొరికేవరకు.. రిజర్వేషన్లలాంటి ప్రత్యేక చర్యలు అవసరమే. అందుచేత.. వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు అన్ని విధాలా ఆరెస్సెస్ మద్దతు ఉంటుంది అని ప్రకటించారాయన. దాదాపు 2 వేల సంవత్సరాలపాటు కొన్ని వర్గాలు సంఘంలో నిర్లక్ష్యానికి గురయ్యాయన్న ఆయన.. వివక్ష ఎదుర్కొని వర్గాలు కనీసం 200 ఏండ్లైనా సరే కొంత ఇబ్బంది ఎదురైనా అంగీకరించాల్సిందేనని తెలిపారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ల ఉద్యమం మరోసారి ఉపందుకుంటున్న వేళ.. భగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదీ చదవండి: భారత్ మూలాలపై రిషి సునాక్ భావోద్వేగం -
ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు జాతీయ జెండా పంపిన మోహన్ మార్కం, ఎందుకంటే?
రాయ్‌పూర్: ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్‌కు జాతీయ జెండాను కొరియర్లో పంపారు ఛత్తీస్‌గఢ్ పీసీసీ అధ్యక్షుడు మోహన్ మార్కం. ఖాదీతో తయారు చేసిన ఆ త్రివర్ణ పతాకాన్ని మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఎగురవేయాలని కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరు జాతీయ జెండాను తమ డీపీలుగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అలాగే ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని కోరారు. మోదీ పిలుపుతో విపక్ష నాయకులు, ప్రముఖులు ఇప్పటికే తమ డీపీలను మార్చుకున్నారు. కానీ ఆర్ఎస్ఎస్, దాని చీఫ్ మోహన్ భగవత్ మాత్రం డీపీని మార్చలేదు. దీంతో ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను సంస్థ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసేలా విజ్ఞప్తి చేయాలని ప్రధాని మోదీని కోరారు మోహన్ మార్కం. గత 52 ఏళ్లుగా ఆ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయలేదని పేర్కొన్నారు. అందుకే ఈసారైనా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలన్నారు. చదవండి: ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం -
'ఆర్ఎస్ఎస్ బీజేపీ కీలుబొమ్మ కాదు'
మొరాదాబాద్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, దేశంలో నైతికత, సాంస్కృతిక, మానవ విలువలను పెంపొందించేందకు మాత్రమే పనిచేస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. మొరాదాబాద్‌లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు నాలుగు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. శనివారం ముగింపు కార్యక్రమం సందర్భంగా మొరాదాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. మోహన్ భగవత్ మాట్లాడుతూ.. దేశంలో జరిగే ఎలాంటి ఎన్నికలైనా తాము పరిగణలోకి తీసుకోమని, గత 60 సంవత్సరాలుగా దేశ అత్యున్నత విలువలను కాపాడడమే ముఖ్యమని పేర్కొన్నారు. తమకు రాజకీయాల కన్నా 130 కోట్ల మంది భారతీయుల నైతిక విలువలే తమకు ముఖ్యమని, వారికోసమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీ చేతిలో ఆర్ఎస్ఎస్ ఒక కీలు బొమ్మ అంటూ వచ్చిన ఆరోపణలను భగవత్ ఖండించారు. 1925 లో ఆర్ఎస్ఎస్ ఏర్పడినప్పుడు చాలా కొద్ది మంది వ్యక్తులతో మాత్రమే ప్రారంభమయిందన్న విషయాన్ని గుర్తుచేశారు. కాగా కాలక్రమంలో మా సంస్థ దేశ నిర్మాణానికి నిరంతర అంకితభావంతో ముందుకు సాగినట్లు పేర్కొన్నారు. దీని ఫలితమే ప్రసుత్తం దేశవ్యాప్తంగా 1.3 లక్షల సభ్యత్వాన్ని ఆర్ఎస్ఎస్ కలిగి ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నామని భగవత్ వెల్లడించారు. దేశంలోని చాలా మంది అగ్రశ్రేణి మేధావులు, సామాజిక సంస్కర్తలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను తమ భావజాలంలో పుణికిపుచ్చుకోవడం తాము సాధించిన గొప్ప విజయమని అన్నారు. రష్యా, చైనా, అమెరికా దేశాలు అభివృద్ధి పరంగా శక్తివంతమైన దేశాలుగా ముందుకు సాగుతున్నప్పటికి వాటి వల్ల ఇతర దేశాలకు కలుగుతున్న సమస్యలను చూస్తుంటే వారు తమ గౌరవాన్ని కోల్పోతున్నారని వివరించారు. గంటపాటు తన ప్రసంగాన్ని కొనసాగించిన మోహన్ భగవత్ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. -
దేశాభివృద్ధే అందరి లక్ష్యం కావాలి : మోహన్ భగవత్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు ఎప్పుడూ సమాజం కోసమే కృషి చేస్తారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. సరూర్‌నగర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశ విజయం కోసం చేస్తున్న సంకల్పమని, సంఘ్ కార్యకర్తలు ఎప్పుడూ ప్రపంచ విజయాన్నే కోరుకుంటారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ను ప్రతి ఒక్కరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వెల్లడించారు. స్వార్థం కోసం కొంతమంది ప్రజల మధ్య విద్వేశాలు సృష్టిస్తున్నారని, దేశాభివృద్ధే అందరి లక్ష్యం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎదుటివారి వినాశనాన్ని కోరుకోవడం మంచిది కాదని, ఎప్పటికైనా ధర్మమే జయిస్తుందని, మన భారతీయులకు నాగరికత అనేది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో పుట్టిన వారంతా హిందువులేనని, మతాచారాలు వేరైనా అందరం భరతమాత బిడ్డలమేనని మోహన్ భగవత్ తెలిపారు. -
‘కోట్ల మంది ఆగ్రహం, కసి ఆ దాడుల్లో కనిపించాయ్’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారుజామున భారత వాయుసేన చేపట్టిన వైమానిక దాడులపై ఆరెస్సెస్ స్పందించింది. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల వీరమరణం భారత్‌లో తీవ్ర ఆగ్రహం, ఆందోళన పెల్లుబికిందని కోట్లాది భారతీయుల ఆగ్రహాన్ని నేటి వైమానిక దాడులు ప్రతిబింబించాయని భారత వాయుసేనను, కేంద్ర ప్రభుత్వాన్ని ఆరెస్సెస్ ఓ ప్రకటనలో ప్రశంసించింది. పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రదాడులతో యావత్ దేశం తీవ్ర ఆగ్రహం, ఆందోళనలో మునిగిపోయిందని, వైమానిక దాడులతో పాక్‌లోని జైషే ఉగ్రశిబిరాలను మట్టుబెట్టడం ద్వారా కోట్లాది భారతీయుల ఆగ్రహం, ఆందోళనలను సైన్యం శత్రువుపై విరుచుకుపడుతూ నేరుగా ప్రతిబింబించిందని ఆరెస్సెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, పుల్వామా ఉగ్ర దాడి అనంతరం ఉగ్రవాదులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆరెస్సెస్ చీఫ్ సురేష్ భయ్యాజీ జోషీ డిమాండ్ చేశారు. -
ఆ నినాదంతో సంబంధం లేదు: ఆర్ఎస్ఎస్
పుణే: ‘కాంగ్రెస్–ముక్త్ భారత్’ వంటి నినాదాలు కేవలం రాజకీయపరమైనవనీ, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ‘అటువంటివి రాజకీయ నినాదాలు. అది ఆర్ఎస్ఎస్ భాష కాదు. విముక్తి అనే మాటను రాజకీయాల్లోనే వాడుతుంటారు. ఎవరినీ వేరుగా చూసే భాష మేము వాడబోమ’ని అన్నారు. ఆర్ఎస్ఎస్ను సిద్ధాంత కర్తగా చెప్పుకుంటున్న బీజేపీ.. మోదీ ప్రభుత్వం చేస్తున్న ‘కాంగ్రెస్ విముక్త భారత్’ నినాదంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. జాతి నిర్మాణంలో భాగంగా వ్యతిరేకించిన వారిని సైతం కలుపుకుని పోవాలనేదే తమ సిద్ధాంతమని భగవత్ తెలిపారు. పుణేలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సానుకూల వైఖరి ఎంతో అవసరమని నొక్కిచెప్పారు. ప్రతికూల భావాలున్నవారే సంక్షోభాలు, విభేదాల గురించే ఆలోచిస్తారన్నారు. అలాంటి వారు జాతినిర్మాణ ప్రక్రియలో ఎంత మాత్రం ఉపయోగపడలేరని స్పష్టం చేశారు. -
ఆర్ఎస్ఎస్ నెం.2గా మోదీ అనుచరుడు?
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ ప్రతినిధి సభ శుక్రవారం నాగపూర్‌లో ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరవుతున్న ఈ సభలో ఆర్ఎస్ఎస్ కొత్త సర్కార్య వాహ్గా అంటే, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకొంటారు. ప్రస్తుతం ఈ పదవిలో సురేశ్ భయ్యాజీ జోషి కొనసాగుతున్నారు. ఆయన 2015 సంవత్సరంలోనే పదవి నుంచి దిగిపోవాల్సి ఉండగా, ఆయన పదవీకాలాన్ని పొడగిస్తూ వస్తున్నారు. ఆయన స్థానంలో ఆర్ఎస్ఎస్ సహ్ కార్యవాహ్ లేదా సంయుక్త కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే ఎన్నికవుతారని భావించారు. ఆయన ఎన్నిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. హొసబలే ఎన్నికయితే ఆర్ఎస్ఎస్పై కూడా నరేంద్ర మోదీ ప్రభావం ఉంటుందని, తత్ ఫలితంగా ఆయన ప్రభుత్వంపైన ఆర్ఎస్ఎస్ ప్రభావం లేదా పట్టు కోల్పోతుందని భావించిన ఆర్ఎస్ఎస్ అధిష్టానం భావిస్తూ వచ్చింది. అందుకని హొసబలేను ఎన్నుకునేందుకు ప్రయత్నం జరిగినప్పుడల్లా అడ్డుకుంటూ వస్తోంది. దత్తాత్రేయ హొసబలే ప్రధాని నరేంద్ర మోదీ మనిషి. రాజకీయాల పట్ల అమితాసక్తి కలిగిన వ్యక్తి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మనిషిగా ఆయన కీలక పాత్ర వహించారు. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ చీఫ్‌గా కొనసాగుతున్న సురేశ్ భయ్యాజీ జోషి రాజకీయాల పట్ల ఆసక్తి లేని వ్యక్తి. పైగా సంస్థ ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. నరేంద్ర మోదీ 2015లోనే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా హొసబలేను ప్రతిపాదించారు. అప్పుడు ఆయన్ని కాదని జోషికే మరో మూడేళ్లపాటు పదవీకాలాన్ని పెంచారు. మధ్యలో జోషి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన స్థానంలో హొసబలే నియామకాలనికి ప్రయత్నాలు జరిగాయి. మోకాలి చిప్ప ఆపరేషన్, 30 కిలోల బరువు తగ్గడం వల్ల జోషినే కొనసాగిస్తూ వచ్చారు. ఆర్ఎస్ఎస్ అధిష్టానంలో ప్రధాన కార్యదర్శి (సర్కార్య వాహ్), డిప్యూటీ ప్రధాన కార్యదర్శి (సర్ సంఘ్‌చాలక్), నలుగురు సంయుక్త కార్యదర్శులు (సహ్ సర్కార్య వాహ్) ఉంటారు. ప్రధాన కార్యదర్శి కార్యవర్గం అధిపతిగా ఉంటారు. డిప్యూటి ప్రధాన కార్యదర్శి సంస్థకు గైడ్‌గా, ఫిలాసఫర్‌గా ఉంటారు. ప్రస్తుతం ఈ హోదాలో మోహన్ భగవత్ కొనసాగుతున్నారు. హొసబలే సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి సంస్థ అఖిల భారతీ ప్రతినిధి సభకు అధ్యక్షత వహించడమే కాకుండా సంస్థ కేంద్ర కమిటీని ఎన్నుకుంటారు. ప్రస్తుతం సర్ సంఘ్‌చాలక్ నే సంస్థ చీఫ్‌గా, ప్రధాన కార్యదర్శిని నెంబర్ -2గా పరిగణిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆర్ఎస్ఎస్లో నరేంద్ర మోదీ బలం మరింత పెరిగిందని, ఈ కారణంగా ఈసారి హోసబలే ఆర్ఎస్ఎస్ చీఫ్‌గా ఎన్నిక కావచ్చని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. -
మోదీ సర్కార్‌పై ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు
బెంగుళూర్: మోదీ సర్కార్‌పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచ దేశాల్లో భారత్ స్థాయిని మోదీ ప్రభుత్వం ఇనుమడింపచేసిందని ప్రస్తుతించారు. దేశ భద్రత, రక్షణ విషయాల్లో దేశం ఎవరికీ తలవంచదని ప్రభుత్వం విస్పష్టంగా చాటిందని డోక్లాంఅంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్నీ ఆయన స్వాగతించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో భారత్ స్థాయిని పెంచాయని. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నదని చెప్పారు. మాందలోని ఓ కళాశాలలో దివంగత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి స్మారక కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు. స్వచ్ఛ భారత్‌కు మోదీ ప్రజల మద్దతు కూడగట్టడాన్ని 1965లో ఇండో-పాక్ యుద్ధానికి లాల్ బహుదూర్ శాస్ర్తి ప్రజాభిప్రాయాన్ని సమీకరించడంతో పోల్చారు. -
యోగిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ ఫైర్
లక్నోః ఉత్తర్ ప్రదేశ్‌లో శాంతిభద్రతల అంశంపై దృష్టి సారించాలని సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కోరారు. గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో 30 మంది చిన్నారులు మరణించిన ఉదంతాన్నీ ఈ సందర్భంగా యోగితో భగవత్ ప్రస్తావించారు. రాష్ట్రంలో నేరాలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఠాకూర్లు, దళితుల మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకోవడం, మహిళలపై లైంగిక దాడులు పెచ్చుమీరడం పట్ల ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల మూడు రోజుల సమన్వయ సదస్సు నేపథ్యంలో సీఎం యోగి, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మతో ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో గోరఖ్‌పూర్ ఘటన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భగవత్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సీఎంకు సూచించారు. మరోవైపు ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ ప్రజలపై చూపిన ప్రతికూల ప్రభావంపైనా చర్చ జరిగినట్టు సమాచారం. నోట్ల రద్దుతో ఆశించిన ఫలితం చేకూరకపోగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు అభిప్రాయపడినట్టు తెలిసింది. బీజేపీకి పూర్తి మద్దతుగా నిలిచే చిన్న వ్యాపారులు నోట్ల రద్దుతో తీవ్రంగా దెబ్బతిన్నారని ఆర్ఎస్ఎస్ నేతలు అనుబంధ సంఘాల సమన్వయ భేటీలో పేర్కొన్నారు. -
సీఎం వద్దన్నా.. ర్యాలీకి సై
సాక్షాత్తు ముఖ్యమంత్రి అడ్డుకుందామని అనుకున్నా కుదరలేదు. కోర్టు నుంచి అనుమతి తీసుకుని మరీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కోల్‌కతా నగరం నడిబొడ్డున ర్యాలీ నిర్వహిస్తున్నారు. మోహన్ భగవత్ ఈ ర్యాలీ నిర్వహించకుండా అడ్డుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శతవిధాలా ప్రయత్నించారు. పశ్చిమబెంగాల్ పాఠ్యపుస్తకాల్లో ఇప్పటివరకు ఉన్న రామ్‌ధోను అనే పదాన్ని రొంగ్‌ధోనుగా మమత మార్పించారు. రామ్‌ధోను అనేది ఇంద్రధనుస్సుకు బెంగాలీ పదం. దాన్నే ఇప్పుడు ఆమె రొంగ్‌ధొనుగా మార్చారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి సీఎం ఆదేశాలతో పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో.. ఆర్ఎస్ఎస్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. భగవత్ సభకు అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో మమత ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. ఇంతకుముందు కూడా అసన్సోల్ నగరంలో సంసద్ మేళా నిర్వహించాలని బీజేపీ భావించగా, అక్కడి మునిసిపల్ కార్పొరేషన్ అందుకు అనుమతి ఇవ్వలేదు. అప్పుడు సైతం హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని బీజేపీ సభ నిర్వహించింది. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన నిర్ణయం
లక్నో: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆలయాలను సందర్శించడం మామూలే. కానీ ఈసారి ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. మసీదును సందర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు. లక్నోలో కొత్తగా నిర్మించిన మసీదుకు ఆయన వెళ్లనున్నారు. ఆల్ ఇండియా ముస్లిం వుమన్ లా బోర్డ్(ఏఐఎంపీడబ్ల్యూ ఎల్బీ) చైర్ పర్సన్ షైస్తా అంబర్ ఆహ్వానం మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మోహన్ లాల్ గంజ్ లోని మాధో ఆశ్రమంలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి హాజరైన భాగవత్ ను అంబర్ కలిశారు. 'మాధో ఆశ్రమానికి సమీపంలో నేను నిర్మించిన మసీదును సందర్శించాలని భాగవత్ ను ఆహ్వానించాను. ఈసారి లక్నో వచ్చినప్పుడు మసీదుకు వస్తానని ఆయన నాకు హామీయిచ్చార'ని అంబర్ తెలిపారు. భాగవత్ మసీదును సందర్శిస్తే ఆర్ఎస్ఎస్ ముస్లింలకు వ్యతిరేకమనే భావన సమసిపోతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. జాతి నిర్మాణం, సామాజిక విషయాల గురించి కూడా భాగవత్ తో చర్చించినట్టు చెప్పారు. -
'రిజర్వేషన్ల విధానంపై సమీక్ష జరపాల్సిందే'
న్యూఢిల్లీ: ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పునరుద్ఘాటించారు. యూపీలోని గోరఖ్ పూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారని 'దైనిక్ జాగరణ్' పత్రిక తెలిపింది. రిజర్వేషన్లకు భాగవత్ వ్యతిరేకం కాదని, అయితే ప్రస్తుతమున్న విధానంలో లక్షిత వర్గాలకు లబ్ధి జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని భాగవత్ డిమాండ్ చేస్తున్నారని వెల్లడించింది. కాగా, రిజర్వేషన్ల విధానంపై పునరాలోచన చేయాల్సిన అవసరం లేదని రెండు రోజుల క్రితం ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భాగవత్ డిమాండ్ పై రాజకీయంగా వివాదం తలెత్తడంతో బీజేపీ మౌనం దాల్చింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని పక్కన పెట్టింది. -
మాట...మంట
-
ఆర్ఎస్ఎస్ చీఫ్ పుష్కర స్నానం @ రాజమండ్రి
రాజమండ్రి: మంగళవారం నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి వీవీఐపీలు తరలివస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్.. రాజమండ్రిలో పుష్కర స్నానం ఆచరించనున్నారు. మంగళవారం ఉదయం 9:30 గంటలకు రాజమండ్రి చేరుకోనున్న ఆయన 10 గంటలకు వీఐపీ ఘాట్ వద్ద పవిత్ర గోదావరిలో పుష్కర స్నానం చేస్తారని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ తరువాత నగరంలోని లాలా చెరువు వద్ద ఏర్పాటు చేసిన సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని, సాయంత్రం 4:30 గంటలకు సభ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. -
'మోడీ పాలనలో భారత్ దూసుకుపోతుంది'
నాగపూర్: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనలో భారత్ అన్ని రంగాల్లో దూసుకువెళ్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి ఆకాంక్షించారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల కాల వ్యవధిలోనే ... దేశ ఆర్థికాభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఆయన సాధించిన పురోగతిని వివరించారు. దసరా పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం నాగపూర్‌లో రేషంబాగ్ మైదానంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మోహన్ భగవతి ప్రసంగించారు. ఈ సందర్బంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మెహన్ భగవతి ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ పాలనతో భారత్ ప్రజలలో చిరు ఆశలు మొలకెత్తాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ఇవి ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. మోడీ తన పాలన ద్వారా మరి పథకాల అమలుకు కొంత సమయం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భగవతి ప్రసంగాన్ని డీడీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారమైంది.