మోదీ సర్కార్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ప్రశంసలు | India has made clear it won't get cowed down: Mohan Bhagwat on Doklam | Sakshi
Sakshi News home page

మోదీ సర్కార్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ప్రశంసలు

Published Tue, Sep 5 2017 6:17 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

మోదీ సర్కార్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ప్రశంసలు - Sakshi

మోదీ సర్కార్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ప్రశంసలు

బెంగుళూర్‌: మోదీ సర్కార్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ స్థాయిని మోదీ ప్రభుత్వం ఇనుమడింపచేసిందని ప్రస్తుతించారు. దేశ భద్రత, రక్షణ విషయాల్లో దేశం ఎవరికీ తలవంచదని ప్రభుత్వం విస్పష్టంగా చాటిందని డోక్లాం​అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్‌ చేపట్టిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్నీ ఆయన స్వాగతించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో భారత్‌ స్థాయిని పెంచాయని. ప్రపంచమంతా ఇప్పుడు భారత్‌ వైపు చూస్తున్నదని చెప్పారు. మాందలోని ఓ కళాశాలలో దివంగత ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి స్మారక కార్యక్రమంలో మోహన్‌ భగవత్‌ మాట్లాడారు.
 
స్వచ్ఛ భారత్‌కు మోదీ ప్రజల మద్దతు కూడగట్టడాన్ని 1965లో ఇండో-పాక్‌ యుద్ధానికి లాల్‌ బహుదూర్‌ శాస్ర్తి ప్రజాభిప్రాయాన్ని సమీకరించడంతో పోల్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement