ఆర్ఎస్ఎస్ చీఫ్ పుష్కర స్నానం @ రాజమండ్రి | rss chief mohan bhagath to take holy dip at rajahmundry | Sakshi
Sakshi News home page

ఆర్ఎస్ఎస్ చీఫ్ పుష్కర స్నానం @ రాజమండ్రి

Published Mon, Jul 13 2015 7:02 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM

ఆర్ఎస్ఎస్ చీఫ్ పుష్కర స్నానం @ రాజమండ్రి

ఆర్ఎస్ఎస్ చీఫ్ పుష్కర స్నానం @ రాజమండ్రి

రాజమండ్రి: మంగళవారం నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి వీవీఐపీలు తరలివస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్.. రాజమండ్రిలో పుష్కర స్నానం ఆచరించనున్నారు.

మంగళవారం ఉదయం 9:30 గంటలకు రాజమండ్రి చేరుకోనున్న ఆయన 10 గంటలకు వీఐపీ ఘాట్ వద్ద పవిత్ర గోదావరిలో పుష్కర స్నానం చేస్తారని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ తరువాత నగరంలోని లాలా చెరువు వద్ద ఏర్పాటు చేసిన సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని, సాయంత్రం 4:30 గంటలకు సభ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement