సాక్షి, హైదరాబాద్: గత 9 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించామని, దేశంలో మరే రాష్ట్రం సాధించని అభివృద్ధిని తెలంగాణ సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. దీనికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్ ప్రణాళికలేనని చెప్పారు. తన 34 ఏళ్ల సర్వీసులో రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి గతంలో చూడలేదని ఆమె వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా శనివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో నిర్వ హించిన తెలంగాణ సుపరిపాలన దినోత్సవంలో సీఎస్ మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో 2014కి ముందు వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఉండేదని, వాటర్ ట్యాంకర్ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేయాల్సి వచ్చేదన్నారు. అప్పట్లో వేసవి కాలం వచ్చిందంటే జిల్లా కలెక్టర్లతో సహా రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ యాక్షన్ ప్లాన్లు రూపొందించుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడా పరిస్థితులు లేవన్నారు.
అన్ని రంగాల్లో రాష్ట్రం రికార్డు
నీటి పారుదల, వ్యవసాయం, ఐటీ, పరిశ్ర మలు, విద్యా, ఆరోగ్యం, సంక్షేమం, సుపరి పాలన, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అన్ని రంగాల్లో రాష్ట్రం రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందన్నారు. హరితహారంలో నాటిన 90 శాతం మొక్కలు మనుగడ సాధించడం ఒక అద్భుతమని శాంతికుమారి పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రసూతి మరణాల్లో గణనీయమైన తగ్గుదల సాధించామని, ఇమ్యూనైజేషన్ పెరిగిందని, వైద్యారోగ్య రంగంలో అద్భుతాలు చవిచూశామని ఆమె వివరించారు. కార్య క్రమంలో ప్రభుత్వ శాఖల కార్యదర్శులు తమ శాఖల విజయాలను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. డీజీపీ అంజనీకుమార్, పీసీసీ ఎఫ్ డోబ్రియాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment