జిమ్‌ చేస్తూ గాయపడ్డ కేటీఆర్‌ | BRS Leader KTR Injured While Doing Gym When His Leg Slipped, Check His Tweet Inside | Sakshi
Sakshi News home page

KTR Injury: జిమ్‌లో వర్కవుట్‌లు చేస్తూ.. గాయపడ్డ కేటీఆర్‌

Published Mon, Apr 28 2025 8:37 PM | Last Updated on Tue, Apr 29 2025 12:02 PM

BRS Leader KTR Injured While Doing Gym Details Here

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గాయపడ్డారు. జిమ్‌ వర్కవుట్‌ చేస్తుండగా గాయమైనట్లు ఆయన తన ఎక్స్‌ ఖాతా ద్వారా తెలియజేశారు. వైద్యులు కొన్నిరోజులు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలని సూచించారని, త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నట్లు KTR ఓ పోస్ట్‌ ఉంచారు.ఇదిలా ఉంటే.. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కేటీఆర్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే.

 

కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో ఊరట లభించింది.   రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ‘‘రేవంత్ రెడ్డి ఢిల్లీకి రూ.2,500కోట్లను పంపించారని కేటీఆర్‌ ఆరోపించగా, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ కేసును కొట్టేయాలని కేటీఆర్‌ పిటిషన్ వేశారు. ఇరువైపులా వాదనలు విన్నజస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం కేసును కొట్టేస్తున్నట్లు సోమవారం తీర్పు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement