
అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కోడుమురు పార్టీ కార్యాలయంలో సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బతీసిందని ఆయన విమర్శించారు.
ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు ఊడిగం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను విస్మరించిందని ఎమ్మెల్యే ఎద్దెవా చేశారు. అయితే, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారని అన్నారు. అందుకే, అధికారంలోకి వచ్చిరాగానే నవరత్నాల ద్వారా ప్రతి గడపకి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని పేర్కొన్నారు.
కరోనా కష్టకాలంలో కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా పథకాలు అమలు చేస్తూ, సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని సుధాకర్ కొనియాడారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అన్నారు.