25న పాఠశాలలకు సెలవు: కేంద్రం
న్యూఢిల్లీ: డిసెంబర్ 25వ తేదీన క్రిస్‌మస్ పండుగ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులో ఎలాంటి మార్పు ఉండబోదని మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభకు తెలిపారు. డిసెంబర్ 25ను ‘గుడ్ గవర్నెన్స్’ దినంగా పాటించాలన్న కేంద్రం ప్రకటనలతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొందని సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు.
మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే కేంద్రీయ గురుకుల విద్యాలయాలు మాత్రం పనిచేస్తాయన్నారు.గాంధీ జయంతిన విద్యా సంస్థల్లో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మాజీ ప్రధాని వాజ్‌పేయి జన్మదినమైన డిసెంబర్ 25న వేడుకలు జరుపకూడదంటే ఎలాగని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.