prakash jayadevkar
-
ఇండియాలో పబ్జీ మళ్లీ రానుందా?
భారతదేశంలో పబ్జీ నిషేధం తర్వాత గత ఏడాది నవంబర్‌లో పబ్జీ మొబైల్ ఇండియా తిరిగి తీసుకురానున్నట్లు పబ్జీ కార్పొరేషన్ ప్రకటించింది. చైనా సంస్థ టెన్సెంట్ గేమ్స్ పబ్జీ నుంచి వైదొలిగిన తర్వాత పబ్జీ కార్పొరేషన్ "పబ్జీ మొబైల్ ఇండియా" ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా గతంలో ప్రారంభించింది. అయితే, పబ్జీ ప్రియుల ఆశల మీద కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. పబ్జీ మొబైల్ ఇండియా గేమ్ హింసను ప్రేరేపిస్తున్న ట్లు గతంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు . ప్రస్తుతం అయితే అధికారికంగా పబ్జీ గేమ్ ను స్మార్ట్‌ఫోన్ లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం లేదు. కానీ, భారతదేశంలోని పబ్జీ లవర్స్ పబ్జీ గ్లోబల్ వెర్షన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పబ్జీ గ్లోబల్ వెర్షన్‌ను డౌన్లోడ్ చేసుకోవడం 'చట్టవిరుద్ధం' కాదని గతంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాబట్టి, దేశీయ గేమర్స్ వెబ్ నుంచి పబ్జీ మొబైల్ ఏపీకేలను డౌన్లోడ్ చేసుకొని ఆడవచ్చు. కానీ, ఏపీకే విషయంలో జర జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ పబ్జీ మొబైల్ ఇండియా అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా ఖాతాలలో 'త్వరలో రానున్నట్లు' ట్యాగ్‌ను చూపిస్తున్నాయి. పబ్జీ మొబైల్ ఇండియాకు సంబంధించి ఇప్పటికీ ఎటువంటి అధికారిక అప్డేట్ లేదు. కానీ చైనా, వియాత్నంలో పబ్జీ మొబైల్ గ్లోబల్ అప్డేట్ వెర్షన్ 1.3ని తీసుకొచ్చింది. దీనిలో హిందీ వెర్షన్ కి కూడా సపోర్ట్ చేసే సోర్స్ కోడ్ ఉంది. దీని బట్టి కొందరు ఇండియాలో మళ్లీ పబ్జీ మొబైల్ గేమ్ వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. అలాగే కొత్తగా తీసుకొచ్చిన గ్లోబల్ వెర్షన్ లో కాకారిన్ మ్యాప్, కొత్త స్నిపర్ రైఫిల్లు అందించారు. ఈ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా(భారతదేశం మినహా) వినియోగదారుల కోసం డౌన్లోడ్ కోసం గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ లలో అందుబాటులో ఉంది. మీరు కూడా పబ్జీ మొబైల్ డౌన్లోడ్ ఆండ్రాయిడ్ వెర్షన్ లింక్‌పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చదవండి: దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! -
అర్నాబ్ అరెస్టు; స్పందించిన కేంద్రమంత్రి
సాక్షి,న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవడేకర్ స్పందించారు. ఇది ‘‘పత్రికా స్వేచ్ఛపై దాడి" గా అభివర్ణించారు. ఈ ఘటన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందంటూ మహారాష్ట్ర పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్న ఆయన మీడియా పట్ల ఈ వైఖరి సరైంది కాదంటూ ట్వీట్ చేశారు. (రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు) కాగా డిజైనర్ ఆత్మహత్యకు పురికొల్పారనే ఆరోపణలతో నమోదైన కేసును సాక్ష్యాలు లేవంటూ పోలీసులు దర్యాప్తును నిలిపివేశారు. అయితే రెండేళ్లనాటి కేసును తిరిగి ప్రారంభించాలన్న కుటుంబ సభ్యుల విజ్ఞప్తి నేపథ్యంలో అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజ్, సాయుధులైన పోలీసులతో అర్నాబ్‌ను నిర్బంధించారని రిపబ్లిక్ టీవీ ఆరోపించింది. ఎడిటర్స్ గిల్డ్ ఖండన మరోవైపు అర్నాబ్ అరెస్ట్‌పై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఆకస్మిక అరెస్టును ఖండించింది. అర్నాబ్ గోస్వామి అరెస్టు విషయం తెలిసి షాక్ అయ్యామంటూ విచారం వ్యక్తం చేసింది. గోస్వామిని న్యాయపరంగా విచారణ జరగాలని, మీడియా విమర్శనాత్మక రిపోర్టింగ్‌పై అధికార దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సూచించింది. We condemn the attack on press freedom in #Maharashtra. This is not the way to treat the Press. This reminds us of the emergency days when the press was treated like this.@PIB_India @DDNewslive @republic — Prakash Javadekar (@PrakashJavdekar) November 4, 2020 -
ఆటోమొబైల్స్ విక్రయాల్లో స్వల్ప పురోగతి
న్యూఢిల్లీ : ఆటోమొబైల్స్ అమ్మకాలు క్రమేపీ పుంజుకుంటున్నట్లు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. గత ఏడాది ఆగస్టుతో పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టులో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 75.29 శాతం పెరిగినట్లుగా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని రాజ్యసభలో శనివారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ చెప్పారు. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రయాణీకుల వాహనాల విక్రయాల్లో 3.86 శాతం, మూడు చక్రాల వాహనాల విక్రయాల్లో 77.16 శాతం, ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 15.24 శాతం క్షీణత నమోదైనట్లుగా ఆయన తెలిపారు. (టెక్ షేర్లు వీక్- యూఎస్ వెనకడుగు) ఫైనాన్స్ లభ్యత తగినంత లేకపోవడం, కమర్షియల్ వాహనాల యాక్సిల్ లోడ్ పరిమితిని 25 శాతానికి పెంచడం వలన కొత్త వాహనాల అవసరం తగ్గిపోవడం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వసూళ్ళతో వాహన కొనుగోలు ఖర్చు పెరగడం, బీఎస్ 6 ప్రమాణాల ప్రకారం కొత్త వాహనాల తయారీ, కరోనా మహమ్మారి కారణంగా వాహన కొనుగోళ్ళకు ప్రజలు మొగ్గు చూపకపోవడం...ఇత్యాది కారణాలతో ఆటోమొబైల్ రంగం పురోగతి మందగించినట్లు మంత్రి చెప్పారు. ఈ రంగం తిరిగి పుంజుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజీల రూపంలో ఆర్థిక రంగంలో ఊపు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆటోమొబైల్స్ విక్రయాలపై జీఎస్టీ తగ్గింపు తమ చేతుల్లో లేదని జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల మేరకే పన్నుల విధింపు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. (రెండు దశాబ్దాలలో.. రికార్డ్ లిస్టింగ్స్) -
‘మిషన్ కర్మయోగి’కి కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులను మరింత సమర్థ్ధవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ‘మిషన్ కర్మయోగి’పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేబినెట్ ఈ ‘మిషన్ కర్మయోగి లేదా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్(ఎన్పీసీఎస్సీబీ)’కార్యక్రమానికి పచ్చ జెండా ఊపింది. ప్రభుత్వ ఉద్యోగులను సృజనాత్మకంగా, సానుకూల దృక్పథం కలిగినవారుగా, వృత్తి నిపుణులుగా, సాంకేతికంగా మరింత మెరుగైన వారిగా మార్చే అతిపెద్ద పాలనా సంస్కరణగా ‘మిషన్ కర్మయోగి’ని కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. సరైన దృక్పథం, లోతైన జ్ఞానం, ఆధునిక నైపుణ్యాలు కలగలసిన, భారతదేశ భవిష్యత్ అవసరాలను తీర్చగల సమర్థ్ధులైన ఉద్యోగులుగా వారిని సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ‘మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి ఇది అతిపెద్ద ప్రభుత్వ కార్యక్రమం’అని కేబినెట్ భేటీ అనంతరం సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిని దేశసేవకు ఉపయోగపడే అసలైన కర్మయోగిగా మార్చేలా ఈ కార్యక్రమం ఉంటుందని సిబ్బంది శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ‘2020 నుంచి 2025 వరకు దశలవారీగా రూ. 510.86 కోట్ల వ్యయంతో సుమారు 46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యులను చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, పథకానికి దిశానిర్దేశం చేసేందుకు ప్రధానమంత్రి నేతృత్వంలో కొందరు ఎంపిక చేసిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రఖ్యాత హెచ్ఆర్ నిపుణులు సభ్యులుగా ఒక కేంద్ర కమిటీని ఏర్పాటు చేస్తారు. భవిష్యత్ భారత అవసరాలను తీర్చగల సమర్ధులైన ఉద్యోగులను రూపొందించడం మిషన్ కర్మయోగి లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జమ్మూ, కశ్మీర్లో హిందీ, కశ్మీరీ, డోగ్రీలను అధికార భాషల్లో చేర్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇంగ్లీష్, ఉర్దూ అధికార భాషలుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ‘జమ్మూకశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్–2020’ని రానున్న సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెడ్తామని జావదేకర్ వెల్లడించారు. -
బీమా సంస్థల విలీనం వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బీమా సంస్థల విలీన ప్రక్రియ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. విలీన ప్రక్రియను నిలిపి వేసిన ప్రభుత్వం లాభదాయక వృద్ధి, నిధుల కేటాయింపు ద్వారా వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేయాలన్న దివంగత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రణాళికను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే తాజా నిర్ణయం ప్రకారం మూడు బీమా సంస్థలకోసం 12,450 కోట్ల రూపాయల నిధులను కేటాయించనుంది. ఇందులో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి 7,500 కోట్ల రూపాయలు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెరో 5 వేల కోట్ల రూపాయలను నిధులు కేటాయించినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. బలహీనమైన ఆర్థిక స్థితికితోడు సంస్థలు వినియోగిస్తున్న వివిధ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లు, తదితర కారణాల రీత్యా ప్రస్తుత ప్రరిస్థితుల్లో విలీనం ఒక సవాలుగా మారిందని అధికారులు పేర్కొన్నారు. -
కరోనా : ప్రజల ముందుకు రామాయణం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ సంస్కృతికి మూలస్తంభ గ్రంథాల్లో ఒకటైన రామాయణం మరోసారి భారతీయులను అలరించనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా హిందువులు ఎంతో ఆసక్తిగా వీక్షించే రామాయణం సీరియల్‌ను మరోసారి టీవీల్లో ప్రసారం చేయాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రసారశాఖమంత్రి ప్రకాశ్ జవడేకర్ శుక్రవారం ట్విటర్ వేదికగా ప్రకటించారు. (చైనాను అధిగమించిన అమెరికా) ‘ ఎంతో సంతోషంగా ఉంది.. ప్రజల డిమాండ్ మేరకు రామాయణాన్ని మరోసారి టీవీల్లో ప్రచారం చేస్తున్నాం. మార్చి 28 (శనివారం) నుంచి ఈ సీరియల్ ప్రారంభం కాబోతుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 9 నుంచి 10 గంటల వరకు డీడీ నేషనల్ (దూరదర్శన్) చానల్లో ప్రసారం కానుంది’ అని కేంద్రమంత్రి తెలిపారు. కాగా తొలిసారి రామయణం సీరియల్ 1987 నుంచి 1988 మధ్య కాలంలో దూరదర్శన్‌లో ప్రసారమైన విషయం తెలిసిందే. ఈ సీరియల్ ఇండియన్ టెలివిజన్ రేటింగ్స్‌లో ఓ సంచలనంగా నిలిచింది. ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకుని టెలివిజన్ రంగంలో ఓ మైలురాయిగా నిలిచింది. Happy to announce that on public demand, we are starting retelecast of 'Ramayana' from tomorrow, Saturday March 28 in DD National, One episode in morning 9 am to 10 am, another in the evening 9 pm to 10 pm.@narendramodi @PIBIndia@DDNational — Prakash Javadekar (@PrakashJavdekar) March 27, 2020 -
పీఎల్ఐ పథకాలకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: దేశీయంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించడానికి రూ.3,420 కోట్ల రూపాయలతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రూ.400 కోట్లతో మెడికల్ డివైజ్ పార్క్స్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది. పీఐఎల్ పథకం ద్వారా వచ్చే అయిదేళ్లలో రూ.68,437 కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలను ఉత్పత్తి చేయవచ్చునని కేంద్రం అంచనా వేస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్ ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటి ఏర్పాటుకు రూ.3,399.35 కోట్లు అవుతాయని అంచనా. ఈ భేటీ వివరాలను మంత్రి జవదేకర్ వెల్లడించారు. ఎలక్ట్రానిక్ కంపెనీలకు రూ.40,995 కోట్లు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీలకు రూ.40,995 కోట్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ను ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిసింది. మేకిన్ ఇండియా హబ్‌ను రూపుదిద్దడం కోసం ఎలక్ట్రానిక్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీకి వచ్చే అయిదేళ్లలో రూ.41వేల కోట్లు కేటాయించనున్నారు. దీంతో ఆయా రంగాలకు ఆర్థికంగా ఊతం వచ్చి 2025 నాటికి రూ.10 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని కేంద్రం భావిస్తోంది. మరోవైపు పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించడానికి రూ. 1,061 కోట్లు కేటాయించింది. అత్యవసర మందులు, పరికరాలు అందుబాటులో కరోనా నేపథ్యంలో అత్యవసరమైన మందులు, వైద్య పరికరాలను దేశంలో తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.14వేల కోట్లను మంజూరు చేసిందని మోదీ తెలిపారు. ఫార్మా సంస్థల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడారు. అవసరానికి సరిపడిన ఆర్ఎన్ఏ డయాగ్నోస్టిక్ (కోవిడ్‌ను గుర్తించే) కిట్లను ఉత్పత్తి చేయాలని కోరారు. మందులు, పరికరాలను అవసరాల మేరకు తయారు చేయడంతోపాటు నూతన పరిష్కారాలను కనుగొనాలని కోరారు. కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు, పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు గాను రూ.14వేల కోట్ల విలువైన పథకాలను ఆమోదించామని మోదీ అన్నారు. -
కేజ్రీవాల్ ఉగ్రవాదే
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అని నిరూపించడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం వెల్లడించారు. గతంలో కేజ్రీవాల్ తనకు తానుగా అరాచకవాదినని ప్రకటించుకున్నారని, నా దృష్టిలో అరాచకవాదికి, ఉగ్రవాదికి మధ్య పెద్ద వ్యత్యాసం లేదని ప్రకాశ్ జవదేకర్ స్పష్టంచేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ గురీందర్ సింగ్ నివాసమైన మోగాలో కేజ్రీవాల్ బస చేశారని గుర్తుచేశారు. అది ఉగ్రవాది నివాసమని తెలిసీ కేజ్రీవాల్ బసచేశారని ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. షహీన్‌బాగ్‌లో ఆందోళనలు చేస్తోన్న వారికి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారికి కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారన్నారు. షహీన్‌బాగ్‌లో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అరాచకవాదులకు మద్దతిచ్చిన నువ్వు నిజంగా ఉగ్రవాదివే అంటూ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
విస్తరించిన హరితావరణం
దేశంలో అటవీ ఆచ్ఛాదన నానాటికీ తగ్గిపోతున్నదని, పర్యావరణం ప్రమాదంలో పడుతున్నదని ఆందోళన పడేవారికి కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈమధ్య విడుదల చేసిన నివేదిక ఊరటనిస్తుంది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్(ఐఎస్ఎఫ్ఆర్, 2019) పేరిట విడుదల చేసిన ఆ నివేదిక ప్రకారం 2017తో పోలిస్తే 5,188 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. అంతేకాదు... దేశంలో దాదాపు నాలుగోవంతు భూభాగం... అంటే 25 శాతం అడవులతో, వృక్షాలతో నిండివుంది. అభివృద్ధి పేరుతో, ప్రాజెక్టుల పేరుతో అటవీ భూముల్ని తెగనరకడానికి ఉదారంగా అనుమతులిచ్చే దేశంలో ఇలా అటవీ శాతం పెరగడం చల్లని కబురే. మూడేళ్లక్రితం దేశంలో అడవులు, వృక్షాలు 8,02,088 చదరపు కిలోమీటర్లుంటే అవి ఇప్పుడు 8,07,276 చదరపు కిలోమీటర్ల మేరకు పెరిగా యన్నది నివేదిక సారాంశం. అయితే పర్యావరణ పరంగా భద్రంగా వుండాలంటే ఈ పెరుగుదల ఏమాత్రం సరిపోదు. పర్యావరణంపై 2015లో కుదిరిన అంతర్జాతీయ ఒడంబడిక కింద 2030నాటికి మనం 2.5 బిలియన్ టన్నులనుంచి 3 బిలియన్ టన్నుల మేర కార్బన్ డైఆక్సైడ్ ను వాతావరణం నుంచి పారదోలేలా వృక్షాలను పెంచాల్సివుంటుంది. ఆ లెక్కన దేశ భూభాగంలో 33 శాతం మేర అడవులు, వృక్షాలు ఉండాలి. 1952, 1988నాటి జాతీయ అటవీ విధానాలు దాన్నే సంకల్పంగా చెప్పుకున్నాయి. కానీ ఆ విషయంలో పదే పదే విఫలమవుతున్నామని ఏటా విడుదలవుతున్న అటవీ నివేదికలు చెబుతున్నాయి. యూపీఏ హయాంలో వివిధ ప్రాజెక్టుల కోసం 2.40 లక్షల హెక్టార్లలో వున్న అడవుల్ని తొలగించడానికి అనుమతులిచ్చింది. ఎన్డీఏ హయాంలో 2015–18 మధ్య గనులు, బొగ్గు, విద్యుత్ ప్రాజెక్టులు, రోడ్డు, రైల్వేలు, నీటిపారుదల ప్రాజెక్టులు వగైరాల కోసం 20,000 హెక్టార్ల అటవీ భూమిని వినియోగించడానికి అనుమతులు మంజూరయ్యాయని కేంద్రం 2018 డిసెంబర్లో పార్లమెంటులో తెలిపింది. 2006లో వచ్చిన అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీల అభిప్రాయాలు, గ్రామసభల అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకోకుండా కార్పొరేట్ సంస్థలకూ, ఆనకట్టల నిర్మాణానికి అటవీ భూముల్ని అప్పగించకూడదు. కానీ ప్రభుత్వాలేవీ ఈ నిబంధనల్ని సక్రమంగా పాటించడం లేదని ల్యాండ్‌కాన్‌ఫ్లిక్ట్ వాచ్ సంస్థ లోగడ ఆరోపించింది. ఇప్పుడు ఏదోమేర అటవీ విస్తీర్ణం పెరగడం సంతోషించదగ్గదే అయినా ఉదార అనుమతులు ఇవ్వడాన్ని బాగా తగ్గించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తాజా నివేదిక ప్రకారం దట్టమైన అటవీ భూములున్న రాష్ట్రాల్లో– మధ్యప్రదేశ్(77,482చదరపు కిలోమీటర్లు), అరుణాచల్‌ప్రదేశ్(66,688చ.కి.మీ.) ఛత్తీస్‌గఢ్(55,611చ.కి.మీ)లు మొదటి మూడు స్థానాల్లో వున్నాయి. ఆ తర్వాత ఒడిశా 51,619చ.కి.మీ.తో, మహారాష్ట్ర 50,778చ.కి.మీ.తో తర్వాతి స్థానాల్లోవున్నాయి. అడవుల్ని విస్తరించిన రాష్ట్రాల్లో తొలి స్థానం కర్ణాటకది. అది 1,025చ.కి.మీ. మేర పెంచగలిగింది. ఆంధ్రప్రదేశ్ 990 చ.కి.మీ.లతో రెండో స్థానంలోవుంది. కేరళ(823), జమ్మూ– కశ్మీర్(371), హిమాచల్ ప్రదేశ్ (334)తదనంతర స్థానాల్లోవున్నాయి. ఇప్పుడున్న చట్టాల్లో ఎక్కడా అడవికి సరైన, సమగ్రమైన నిర్వచనం లేదు. అడవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడేది. అందులో వుండేది ఆదివాసీలు మాత్రమే కాదు... వైవిధ్యభరితమైన వృక్షజాతులుంటాయి. జంతుజాలంవుంటుంది. అడవుల్ని నరికినప్పుడు ఏదోమేరకు ఆదివాసీలకు పునరావాసం కల్పిస్తున్నామని ప్రభుత్వాలు వాది స్తున్నా, అందులోని అరుదైన వృక్ష, జంతుజాలాల పరిస్థితేమిటన్నది పట్టించుకోవడం లేదు. ప్రభు త్వాలు చట్టాల్ని ఉల్లంఘించి అనుమతులిచ్చి అడవుల ధ్వంసానికి కారణమవుతుంటే అత్యంత విలు వైన ఎర్రచందనం, టేకు వగైరాలను దోచుకుపోతున్న దొంగలు చేసే నష్టం కూడా తక్కువేమీ కాదు. జనాభా పెరుగుతుండటం వల్ల అడవులపై ప్రభావం పడుతున్నదని తాజా నివేదిక చెబుతున్న మాట వాస్తవమే. దాని ప్రకారం దేశంలోని 6,50,000 గ్రామాల్లో 1,70,000 గ్రామాలు అడవులకు సమీ పంలో వున్నాయని, ఇక్కడి జనాభా వంటచెరుకు, పశుమేత, ఆవాసాల నిర్మాణం వగైరాల కోసం అడవులపైనే ఆధారపడుతున్నదని నివేదిక తెలిపింది. అయితే ప్రభుత్వాల వల్ల, అటవీ దొంగల వల్ల అడవులకు కలిగే నష్టంతో పోలిస్తే అత్యంత స్వల్పం. దీనికి సంబంధించిన లెక్కలు కూడా తీస్తే ఆ విషయం ధ్రువపడుతుంది. అడవుల్ని ప్రాణప్రదంగా చూసుకునే దేశాలున్నాయి. అలాగే అటవీ భూముల్ని కోల్పోయిన పర్యవసానంగా కష్టాలెదుర్కొని, తమను తాము సరిదిద్దుకుని వాటి పునరు ద్ధరణను ఒక యజ్ఞంగా భావించి విజయం సాధించినవి ఉన్నాయి. అవన్నీ మనకు పాఠం నేర్పాలి. ప్రపంచంలోని కాలుష్య నగరాల్లో సగం మన దేశంలోనేవున్నాయి. ఏటా వేల సంఖ్యలో చెట్లు నరికేస్తుండటం వల్ల హరితావరణం నాశనమవుతోంది. ఇది చివరకు ప్రకృతి వైపరీత్యాలకు కారణ మవుతోంది. అకాల వర్షాలు, కరువుకాటకాలు తప్పడం లేదు. రాగల 25 సంవత్సరాల్లో మార్గ దర్శకంగా వుండటం కోసమని కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లక్రితం జాతీయ అటవీ విధానాన్ని రూపొందించే పని ప్రారంభించింది. 2018లో ఆ విధానం ముసాయిదా విడుదల చేసి దానిపై అందరి అభిప్రాయాలు చెప్పాలని కోరింది. అయితే పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు, గిరిజన సంఘాల నేతలు ఆ విధానం లోపభూయిష్టంగా ఉన్నదని విమర్శించాయి. దాంతో కేంద్రం దాన్ని ముందుకు తీసుకుపోలేదు. కొత్త అటవీ విధానం కోసం నిర్దిష్టమైన కాలపరిమితిని విధించ లేదని, ఇప్పటికీ 1988నాటి విధానమే అమల్లోవుందని నిరుడు జూలైలో పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో పార్లమెంటులో చెప్పారు. ఇలా నిరవధికంగా వాయిదాపడటం మంచిది కాదు. అన్ని వర్గాల మన్ననలు పొందేవిధంగా, ముఖ్యంగా ఆదివాసీల హక్కుల్ని పరిరక్షించేవిధంగా వర్తమాన అవసరాలకు అనుగుణంగా మన జాతీయ అటవీ విధానం రూపొందాలి. అప్పుడు మాత్రమే అటవీ సంరక్షణ మరింత మెరుగ్గావుంటుంది. -
తేలని సీఎం అభ్యర్థి.. మోదీపైనే భారం!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అనేక ఉత్కంఠ పరిస్థితుల నడుమ జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. యావత్‌దేశ దృష్టిని హస్తిన ఆకర్షించింది. దేశ రాజకీయ పటంలోని ప్రధానమైన మూడు పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. ఆమ్ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య సాగే ఈ పోరులో విజయం కోసం నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్నడూలేని విధంగా బీజేపీలో ఈసారి ఓ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఒకవేళ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే సీఎం పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సీఎం అభ్యర్థిపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. (త్రిముఖ పోరులో పీఠం ఎవరిది..?) ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎదుర్కొనే ధైర్యం, తెగువ ప్రధాని నరేంద్రమోదీకి మాత్రమే ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రముఖ పాత్ర పోషిస్తారని, ఆయన బలంతోనే ఢిల్లీలో విజయం సాధించి తీరుతామని మంత్రి అభిప్రాయపడ్డారు. అయితే గతంలో మాదిరిగా సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించట్లేదని అన్నారు. ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఇలాంటి సరికొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిపారు. సీఎం అభ్యర్థి విషయంలో పలు రాష్ట్రాల్లో విభిన్న పరిస్థితులను ఎదుర్కొక తప్పదని పేర్కొన్నారు. పార్టీకి కట్టుబడి, విజయం కోసం నిబద్ధతతో పనిచేసే వారినే సీఎం పదవి వరిస్తుందని వ్యాఖ్యానించారు. కాగా 2008 ఎన్నికల్లో వీకే మల్హోత్రా, 2013 హర్ష వర్థన్, 2015 మధ్యంతర ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారిని కిరణ్‌బేడీని బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కమళనాధులు హస్తినలో అధికారానికి దూరంగా ఉండక తప్పడంలేదు. సరికొత్త ఎత్తుగడలతో, మోదీ మ్యానియాతో ఈసారి అధికారం కైవసం చేసుకోవాలని కట్టుదిట్టమైన వ్యూహాలు రచిస్తున్నారు. అయితే సీఎం అభ్యర్థిగా ఎంపీ మనోజ్ తివారీ పేరు మాత్రం బలంగా వినిపిస్తోంది. (మోగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా) కాగా విజయమే లక్ష్యంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇదివరకే ప్రచారంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అవినీతిరహిత సమాజమే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లోనే సంచలనం సృష్టించారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఏకంగా 67 స్థానాల్లో విజయం సాధించి చరిత్రలో నిలిచారు. అంతకుముందు ఏకదాటిగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న గ్రాండ్ ఓల్డ్‌పార్టీ కాంగ్రెస్ కనీసం ఒక్కస్థానం కూడా గెలవలేకపోయింది. ఈసారి మాత్రం మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేస్తోంది. సీనియర్ నేత అజయ్‌మాకెన్ ముందుండి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే బీజేపీ ఎంచుకున్న వ్యూహాన్ని కాంగ్రెస్ కూడా అనుసరించే అవకాశం ఉంది. పోలింగ్‌కు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఏమాత్రం కనిపించడంలేదు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
సుపరిపాలనలో రాష్ట్రానికి ఇండియా టుడే అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సుపరిపాలనకు గానూ ఇండియా టుడే ఏటా ఇచ్చే స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్క్లేవ్–2019 అవార్డు తెలంగాణకు దక్కింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఈ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతుల మీదుగా రాష్ట్ర సర్కార్ తరఫున టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఆర్థిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. సర్కార్ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు చేరువయ్యేలా సీఎం కేసీఆర్ నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. -
ఐడీబీఐ బ్యాంకునకు రూ. 9,300 కోట్ల నిధులు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకును గాడిన పెట్టే దిశగా రూ. 9,300 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ వెల్లడించారు. బ్యాంకు మూలధన స్థాయిని పెంచేందుకు, లాభాల్లోకి మళ్లించేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ఇందులో సుమారు 51 శాతం నిధులను (రూ. 4,743 కోట్లు) ఎల్ఐసీ సమకూర్చనుండగా, మిగతా 49 శాతం (రూ. 4,557 కోట్లు) కేంద్రం వన్–టైమ్ ప్రాతిపదికన అందించనుంది. మొండిబాకీలతో కుదేలైన ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ గత ఆగస్టులో తన వాటాలను 51 శాతానికి పెంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అదనపు మూలధనం లభించడంతో ఐడీబీఐ బ్యాంకు సొంతంగా మరిన్ని నిధులను సేకరించుకునే సామర్థ్యం పెంచుకోగలదని, వచ్చే ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల పరిధి (పీసీఏ) నుంచి కూడా బైటికి రాగలదని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కేంద్రం నుంచి మూలధనం అందిన రోజునే అదే మొత్తంలో ఐడీబీఐ బ్యాంకు రీక్యాపిటజైషన్ బాండ్లు కొనుగోలు చేయనుంది. ఈ ఏడాది చివరినాటికి అలహాబాద్ బ్యాంక్ విలీనం పూర్తి కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి అలహాబాద్ బ్యాంక్ విలీనం పూర్తికానుందని ఇండియన్ బ్యాంక్ అంచనావేస్తోంది. ఈ అంశంపై బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మజ చుండూరు మాట్లాడుతూ.. ఇరు బ్యాంకుల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమై విలీనానికి తగిన ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన తొలి సమావేశం జరగనుందని తెలిపారు. -
పోలవరంపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ భారం మొత్తం కేంద్రప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను రెండేళ్లు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని స్పష్టం చేశారు. దీంతో పోలవరం నిర్మాణ పనులు ఎలంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయన్నారు. స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను పూర్తిగా రద్దు చేయాలని చూశామని, కానీ కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉండడం వలన అది కుదరలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్రమే చూసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. (చదవండి : పోలవరానికి తొలగుతున్న చిక్కులు) -
పార్టీ మారిన నలుగురు ఎంపీలపై కేంద్రమంత్రి..
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు అధికార బీజేపీలో చేరడంపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. వారంత చట్టబద్ధంగానే టీడీపీని వీడి బీజేపీలో చేరారని అన్నారు. వారి విలీనానికి సంబంధించిన ప్రక్రియ అంతా అయిపోయిందని.. రాజ్యసభలో వారు బీజేపీ సభ్యులుగా గుర్తింపబడతారని స్పష్టం చేశారు. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీ విలీనం చేస్తూ.. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావులు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆమోదించడంతో.. వారంత బీజేపీ సభ్యులుగా గుర్తింపబడనున్నారు. ఇదిలావుండగా.. పార్టీ మారిన నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు టీడీపీ నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
పర్యావరణశాఖ మంత్రిగా జవదేకర్ బాధ్యతలు
-
అధ్యాపక రిజర్వేషన్లలో పాత పద్ధతి
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపక నియామకాల్లో 200–పాయింట్ రోస్టర్ ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టడం కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రతిపాదనను కేంద్రకేబినెట్ ఆమోదించింది. ఈ విషయంలో 2017లో అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు∙తీర్పుల నుంచి మినహాయింపు పొంది, రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయుల నియామకాల్లో ఒక్కో విభాగాన్ని లేదా ఒక్కో సబ్జెక్ట్‌ను ఒక యూనిట్‌గా పరిగణించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గతేడాది మార్చిలో స్పష్టం చేసింది. 2017 ఏప్రిల్‌లో అలహాబాద్ హైకోర్టు తీర్పును అనుసరించి యూజీసీ ఈ ఆదేశాలిచ్చింది. విశ్వవిద్యాలయం మొత్తాన్ని కాకుండా అందులోని ఒక్కో విభాగాన్ని ఒక్కో యూనిట్‌గా పరిగణించడం వల్ల ఒకటి లేదా రెండు ఉద్యోగ ఖాళీలే ఉన్న చోట రిజర్వేషన్ వర్తించేది కాదు. ఆ ఉద్యోగాలను జనరల్ కేటగిరీ కింద భర్తీ చేయాల్సి వచ్చేది. అదే విశ్వవిద్యాలయం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తే, అన్ని విభాగాల్లో కలిపి ఖాళీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కుతాయి. దీంతో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవరించాలనీ, యూజీసీ ఆదేశాలను రద్దు చేయాలంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కేంద్రం పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత నెలలో కొట్టేసింది. దీంతో 200–పాయింట్ రోస్టర్ ఆధారిత పాత రిజర్వేషన్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టడం కోసం కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొస్తుందని హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవడేకర్ గత నెలలో లోక్‌సభలో ప్రకటించారు. అధ్యాపక నియామకాలు ప్రారంభించండి కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో అధ్యాపక నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) దేశంలోని విశ్వవిద్యాలయాలను కోరింది. ఈ మేరకు యూజీసీ వర్సిటీ వైస్ చాన్స్లర్లకు సూచించింది. -
‘వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే’
డెహ్రాడూన్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. 2019 ఎన్నికల తరువాత కూడా తమ పార్టీ బలంగా ఉంటుందన్నారు. డెహ్రాడూన్‌లో ఓ కార్యక్రమంలో జవదేకర్ మాట్లాడారు. ఉపఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఉప ఎన్నికల ఫలితాలు స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని వాటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఏమాత్రం పడదన్నారు. ఉప ఎన్నికల్లో ఓడినంతమాత్రాన మోదీ ప్రభావం తగ్గినట్లు కాదన్నారు. ఇటీవల జరిగిన ఏ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా మోదీ పాల్గొన్నలేదని గుర్తుచేశారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే 2019లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని, బెంగాల్, ఒడిషా, కేరళ రాష్ట్రాల్లో కూడా గెలుస్తామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో తమ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందిని, ఏ మంత్రిపై కూడా అవినీతి ఆరోపణలు రాలేదని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం వందశాతం నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. -
రైతుల సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, బెంగళూరు: కర్ణాటక విధానసభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో అక్కడి రైతులు, విద్యార్థులు, పేద మహిళలపై బీజేపీ హామీల వర్షం కురిపించింది. జాతీయ, సహకార బ్యాంకుల్లో లక్ష వరకు పంట రుణమాఫీ, సాగు నీటి ప్రాజెక్టులకు లక్షల కోట్ల వ్యయం, విద్యార్థులకు ఫ్రీ ల్యాప్‌టాప్‌లు, పేద మహిళలకు ఉచిత స్మార్ట్ఫోన్లు వంటి హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రూ. 5 వేల కోట్లతో ‘రైతు బంధు మార్కెట్ మధ్యంతర నిధి’ని ఏర్పాటు చేసి పంట ధరల్లో వ్యత్యాసాలు వచ్చినప్పుడు ఆ ప్రభావం రైతులపై పడకుండా చూస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప చెప్పారు. వ్యవసాయంలో అత్యుత్తమ పద్ధతులను అధ్యయనం చేసేందుకు రైతులను ఇజ్రాయెల్, చైనా వంటి దేశాలకు పంపిస్తామన్నారు. వ్యవసాయ బోర్లకు 10 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ మేనిఫెస్టోలోని ఇతర హామీలు ► దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు చెందిన యువతుల పెళ్లి సమయంలో ప్రభుత్వ కానుకగా ‘వివాహ మంగళ’ పథకం కింద రూ.25 వేల నగదు, 3 గ్రాముల బంగారం. ► బీపీఎల్ కుటుంబాల్లోని మహిళల కోసం ‘స్త్రీ సువిధ’ పథకం కింద ఒక్క రూపాయికే శానిటరీ న్యాప్కిన్ ► పేదలకు అందుబాటు ధరల్లో ఆహారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 300 ‘ముఖ్య మంత్రి అన్నపూర్ణ క్యాంటీన్ల’ ఏర్పాటు ► లోకాయుక్తను కాంగ్రెస్ అవినీతి నిరోధక విభాగంలో ఉపవిభాగం చేయగా, దానికి మళ్లీ పూర్వస్థితి కల్పిస్తామని హామీ. ► అవినీతిపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు సీఎం కార్యాలయంలోనే హెల్ప్‌లైన్. ► అవినీతిని బయటపెట్టే సామాజిక కార్యక ర్తలకు రక్షణ కల్పించేలా కొత్త చట్టం. ► కళాశాలల్లో చేరే ప్రతి విద్యార్థికీ ‘ముఖ్యమంత్రి ల్యాప్‌టాప్ యోజనే’ కింద ఉచిత ల్యాప్‌టాప్. ► ‘ముఖ్యమంత్రి స్మార్ట్‌ఫోన్ యోజనే’ కింద పేద మహిళలకు ఉచిత స్మార్ట్‌ఫోన్. ► ఉద్యాన నగరి బెంగళూరును చెత్త రహిత నగరంగా మారుస్తామని హామీ. ► ఆవుల సంరక్షణ కోసం గతంలో బీజేపీ తీసుకురాగా కాంగ్రెస్ రద్దు చేసిన ‘గౌ సేవా ఆయోగ్’ పునరుద్ధరణ. -
‘ఆజాద్ వ్యాఖ్యలు విడ్డూరం’
సాక్షి, ఢిల్లీ : కథువా హత్యాచార బాధితురాలికి న్యాయం జరగుతుందని.. దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితులు బయటే ఉన్నారన్న గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రతి సమస్యను పెద్దది చేసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో అత్యాచార ఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఉన్నారని విమర్శించారు. గులాం నబీ ఆజాద్ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్ ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదనే బీజేపీ మంత్రులను రాజీనామా చేయించామని పేర్కొన్నారు. కాగా, బీజేపీ ఆరోపనలను కాంగ్రెస్ గట్టిగా తిప్పికొట్టింది. సమస్యలను ఎత్తి చూపడం ప్రతిపక్షాల విధి అని కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా అన్నారు. గత 14రోజుల వ్యవధిలో ఉత్తర్‌ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్లో మహిళలపై అత్యాచారాలు జరిగినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్రతిపక్షాలు, సోషల్ మీడియా చొరవ చూపడంతోనే ప్రధాని స్పందించారన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు -
సీబీఎస్ఈ పేపర్ లీక్.. రీ–ఎగ్జామ్
న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో రెండు పరీక్షలను మళ్లీ నిర్వహించాలని (రీ–ఎగ్జామ్) సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) బుధవారం నిర్ణయించింది. పదవ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రం, పన్నెండవ తరగతి విద్యార్థులకు ఎకనామిక్స్ పరీక్షలను మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పరీక్షల తేదీల వివరాలను వారం రోజుల్లో తమ వెబ్సైట్లో ఉంచుతామని సీబీఎస్ఈ ఓ సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ‘కొన్ని పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన వార్తలను మేం పరిగణనలోకి తీసుకుంటున్నాం. విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, పరీక్షల పవిత్రతను కాపాడటం కోసం రెండు సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తాం’ అని సర్క్యులర్‌లో సీబీఎస్ఈ తెలిపింది. 12వ తరగతికి సోమవారం జరిగిన ఆర్థిక శాస్త్రం పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాము అన్ని పరీక్షా కేంద్రాల నుంచీ సమాచారం తెప్పించుకున్నామనీ, పేపర్ లీక్ కాలేదని సీబీఎస్ఈ అప్పుడే స్పష్టం చేసింది. పరీక్షల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు దుండగులు పేపర్ లీక్ అయినట్లుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టి ఉంటారని సీబీఎస్ఈ పేర్కొంది. 12వ తరగతికే చెందిన అకౌంటెన్సీ పరీక్ష ప్రశ్నపత్రం కూడా లీక్ అయినట్లు తమకు ఫిర్యాదులు అందాయని మార్చి 15నే ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అలాంటిదేమీ లేదని సీబీఎస్ఈ వివరణ ఇచ్చినా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సోమవారం నుంచి కొత్త పద్ధతి.. ప్రశ్నప్రతాలు లీక్ అవుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి కొత్త పద్ధతిలో క్వశ్చన్ పేపర్లను పంపిణీ చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అలాగే లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం అంతర్గతంగా విచారణ జరుపుతోందన్నారు. ‘సీబీఎస్ఈకి దృఢమైన వ్యవస్థ ఉంది. అయినా పేపర్లు లీక్ అవుతుంటే, లేదా వ్యవస్థలో ఏదైనా లోపముంటే.. వాటిని సరిదిద్దేందుకు సోమవారం నుంచి కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నాం’ అని జవదేకర్ చెప్పారు. లీకేజీ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏం మాట్లాడారని అడగ్గా.. ప్రధానికి అన్ని వివరాలనూ తాను అందించాననీ, ఒత్తిడి లేకుండా పరీక్షలు నిర్వహించాలని మోదీ ఎప్పుడూ అంటుంటా రని జవదేకర్ చెప్పారు. పరీక్షల నిర్వహణను మోదీ ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారన్నారు. -
సగానికి తగ్గనున్న స్కూల్ సిలబస్
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థులపై సిలబస్ భారాన్ని తగ్గించే దిశగా కేంద్రం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతమున్న ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను 2019 విద్యాసంవత్సరం నుంచి సగానికి తగ్గించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. బీఏ, బీకాం డిగ్రీల సిలబస్ కన్నా స్కూల్ పాఠ్యప్రణాళికనే ఎక్కువగా ఉందన్నారు. చదువే కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన ఇతర కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాజ్యసభ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జవదేకర్ మాట్లాడారు. ‘సిలబస్‌ను సగానికి తగ్గించాలని ఎన్సీఈఆర్టీకి సూచించాను. 2019 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని అన్నారు. పాఠశాల స్థాయిలో డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. పరీక్షలు లేకుండా విద్యార్థుల మధ్య పోటీ ఉండదని, మెరుగైన ఫలితాలు రాబట్టాలంటే పోటీ వాతావరణం అవసరమని స్పష్టం చేశారు. పాఠశాల విద్యకు సంబంధించిన ఈ సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లును మలి విడత బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. మార్చి తరువాత మే.. మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు మేలో పరీక్షలు నిర్వహిస్తామని జవదేకర్ చెప్పారు. ఈ రెండింట్లోనూ ఫెయిలైన విద్యార్థులనే పై తరగతులకు వెళ్లకుండా డిటెన్షన్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ‘విద్యార్థుల సామర్థ్యాలు, బలహీనతలు తెలుసుకుని అందుకు అనుగుణంగా వారికి దిశానిర్దేశం చేయడం ఉపాధ్యాయుల ప్రాథమిక విధి’ అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యా హక్కు చట్టం కింద 2015 నాటికి దాదాపు 20 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, 5 లక్షల మందికి మాత్రమే శిక్షణనివ్వడం సాధ్యమైందన్నారు. మరోవైపు, 14 లక్షల మంది ఉపాధ్యాయులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ నెల చివరి నాటికి నూతన విద్యా విధానంపై నివేదిక సిద్ధమవుతుందని వెల్లడించారు. -
ఇంజినీరింగ్ బోధనకు ఐఐటీ పట్టభద్రులు
న్యూఢిల్లీ: వెనుకబడిన ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు బోధించేందుకు ఎన్ఐటీ, ఐఐటీలకు చెందిన 1225 మంది పట్టభద్రులను ఎంపికచేసినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. వీరంతా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 53 ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో మూడేళ్లపాటు బోధన చేస్తారని వెల్లడించారు. తమ మంత్రిత్వ శాఖ ఇచ్చిన పిలుపుమేరకు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని 5వేల మంది ఎంటెక్, పీహెచ్డీ పట్టభద్రులు స్పందించారని, వీరి నుంచి 1,225 మందిని ఎంపిక చేశామని చెప్పారు. వీరికి నెలకు రూ.70వేలు వేతనంగా చెల్లిస్తామన్నారు. అర్హులైన అధ్యాపకులు దొరక్కపోవటంతో వెనుకబడిన ప్రాంతాల్లోని ఈ కళాశాలల్లోని 60% బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
స్మృతి ఒప్పుకోలేదు.. ప్రకాశ్ చేసేశారు.!
దేశ అత్యున్నత మేనేజ్ మెంట్ విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎం)లకు బోర్డ్ ఆఫ్ గవర్నర్(బీఓజీ)లను నియమించుకునే అవకాశాన్ని కల్పిస్తూ మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జయదేవకర్ నిర్ణయం తీసుకున్నారు. ఐఐఎంలను స్వతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు బీఓజీలను సంస్థలే నియమించుకునే అవకాశాన్ని ఇవ్వాలని పీఎంవో సూచనలు చేసింది. ఈ ఏడాది మే నెలలో ఐఐఎం-అహ్మదాబాద్ తన బీఓజీగా పేర్కొన్న పేర్లను మానవవనరుల శాఖ మాజీమంత్రి స్మృతి ఇరానీ కాదని వాటిని వెనక్కు పంపిన విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరైన ఆర్. శేషసాయి, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు చైర్మన్ దీపక్ పరేఖ్, హీరో మోటర్ కార్ప్ సీఎండీ పవన్ ముంజల్ ల పేర్లలో ఒకరిని ఎంపిక చేయాలని ఐఐఎం-అహ్మదాబాద్ స్మృతిని కోరింది. వీరిలో ఎవరిని ఎంపిక చేయకపోవడానికి కారణం చెప్పకుండా ఆ డాక్యుమెంట్లను స్మృతి వెనక్కు పంపారు. కొద్దిరోజుల క్రితం మానవ వనరులశాఖ మంత్రిగా ప్రకాశ్ జయదేవకర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పీఎంవో సూచనలకు అనుగుణంగా ఐఐఎంలు సొంతంగా చైర్మన్లను నియమించేందుకు ఆయన అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన బిల్లును కేబినేట్ లో ఆమోదం పొందడానికి సిద్ధమైంది. ఇరానీ హయాంలోని బిల్లులో ఐఐఎం ఎంపిక చేసిన చైర్మన్ అపాయింట్ మెంట్ ను రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం రూపొందించిన బిల్లులో ప్రభుత్వానికి చైర్మన్ నియామకంతో ఎలాంటి సంబంధం ఉండదు.