సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు అధికార బీజేపీలో చేరడంపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. వారంత చట్టబద్ధంగానే టీడీపీని వీడి బీజేపీలో చేరారని అన్నారు. వారి విలీనానికి సంబంధించిన ప్రక్రియ అంతా అయిపోయిందని.. రాజ్యసభలో వారు బీజేపీ సభ్యులుగా గుర్తింపబడతారని స్పష్టం చేశారు. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీ విలీనం చేస్తూ.. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావులు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆమోదించడంతో.. వారంత బీజేపీ సభ్యులుగా గుర్తింపబడనున్నారు. ఇదిలావుండగా.. పార్టీ మారిన నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు టీడీపీ నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment