కరోనా : ప్రజల ముందుకు రామాయణం | Government Re Telecast Of Ramayana In DD National Channel | Sakshi
Sakshi News home page

కరోనా : ప్రజల ముందుకు రామాయణం

Published Fri, Mar 27 2020 10:24 AM | Last Updated on Fri, Mar 27 2020 1:07 PM

Government Re Telecast Of Ramayana In DD National Channel - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ సంస్కృతికి మూలస్తంభ గ్రంథాల్లో ఒకటైన రామాయణం మరోసారి భారతీయులను అలరించనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా హిందువులు ఎంతో ఆసక్తిగా వీక్షించే రామాయణం సీరియల్‌ను మరోసారి టీవీల్లో ప్రసారం చేయాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రసారశాఖమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ శుక్రవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. (చైనాను అధిగమించిన అమెరికా)

‘ ఎంతో సంతోషంగా ఉంది.. ప్రజల డిమాండ్‌ మేరకు రామాయణాన్ని మరోసారి టీవీల్లో ప్రచారం చేస్తున్నాం. మార్చి 28 (శనివారం) నుంచి  ఈ సీరియల్‌ ప్రారంభం కాబోతుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 9 నుంచి 10 గంటల వరకు డీడీ నేషనల్‌ (దూరదర్శన్‌) చానల్‌లో ‍ప్రసారం కానుంది’ అని కేంద్రమంత్రి తెలిపారు. కాగా తొలిసారి రామ‌య‌ణం సీరియ‌ల్‌ 1987 నుంచి 1988 మ‌ధ్య కాలంలో దూర‌ద‌ర్శన్‌లో ప్రసారమైన విషయం తెలిసిందే. ఈ సీరియ‌ల్ ఇండియ‌న్ టెలివిజ‌న్ రేటింగ్స్‌లో ఓ సంచలనంగా నిలిచింది. ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకుని టెలివిజన్‌ రంగంలో ఓ మైలురాయిగా నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement