
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ భారం మొత్తం కేంద్రప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను రెండేళ్లు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని స్పష్టం చేశారు. దీంతో పోలవరం నిర్మాణ పనులు ఎలంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయన్నారు. స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను పూర్తిగా రద్దు చేయాలని చూశామని, కానీ కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉండడం వలన అది కుదరలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్రమే చూసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.
(చదవండి : పోలవరానికి తొలగుతున్న చిక్కులు)