హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతున్న రాజ్‌దీప్ సర్దేశాయ్
సాక్షి, హైదరాబాద్ : వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రెస్‌మీట్‌లు పెట్టట్లేదని, మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వారు సిద్ధంగా లేరని ప్రముఖ జర్నలిస్టు, ఇండియా టుడే కన్సల్టింగ్ గ్రూపు ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ 53వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన ‘మీడియా ఇన్ బ్రేకింగ్ న్యూస్ ఎరా’ అనే అంశంపై మాట్లాడారు. హైదరాబాద్ అనేక మంది గొప్ప పాత్రికేయులను ఇచ్చిందని, ఇక్కడికి రావడం తనకు గర్వంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు.
ప్రస్తుత మీడియాను అడ్వటైజ్‌మెంట్ విభాగాలే శాసిస్తున్నాయిని అన్నారు. కేవలం సంచలనాల కోసమే ఇప్పటి మీడియా ప్రయత్నిస్తుందని, ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, వ్యవసాయంపై అవసరమైన మేర స్పందించట్లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియా విస్తరణ తర్వాత అందరూ జర్నలిస్టులుగా వ్యవహరిస్తున్నారని, అయితే సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య వార్తాలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment