సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొంత కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ ఛానెల్ ఇండియా టుడే ‘టూ ది పాయింట్’ కార్యక్రమం కోసం సీనియర్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్‌దేశాయ్ దాదాను ఇంటర్వ్యూ చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంభాషణ బయటకు వచ్చింది.
ఇంటర్వ్యూలో భాగంగా ఓ ప్రశ్నకు ప్రణబ్ సమాధానం చెప్పబోతుంటే.. మధ్యలో రాజ్‌దీప్ కలగజేసుకుని ఏదో అడగాలని యత్నించారు. దీంతో సహనం కోల్పోయిన ప్రణబ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ‘ మాట్లాడేటప్పుడు మధ్యలో కలగజేసుకునే అలవాటు నీకు మంచిది కాదు. ముందు నన్ను పూర్తి చెయ్యనివ్వు. నీ ముందుంది ఓ మాజీ రాష్ట్రపతి అని గుర్తుంచుకుని ప్రవర్తించు. నేను మాట్లాడేటప్పుడు విను. నా సమాధానం పూర్తయ్యాకే మరో ప్రశ్న అడుగు. నేనేం టీవీల్లో కనిపించేందుకు ఆత్రుతతో రాలేదు. మీరు పిలిస్తేనే వచ్చా’ అంటూ ప్రణబ్ మందలించాడు. అయితే చివర్లో ఇంటర్వ్యూ అయ్యాక తాను చేసిన కఠువు వ్యాఖ్యలపై ప్రణబ్ క్షమాపణలు చెప్పబోతుండగా.. వాటిని సానుకూలంగానే తీసుకున్నట్లు రాజ్‌దీప్ చెప్పటం కొసమెరుపు.
మాములుగా అయితే ఇలాంటి వీడియోలు ఎడిటింగ్‌లో లేపేయటం జరుగుతుంటుంది. కానీ, రాజ్‌దీప్‌కు అలా చెయ్యటం ఎంత మాత్రం ఇష్టం లేదంట. అందుకు ఆ సంభాషణను యథాతథంగా ఉంచేశారు. అయితే రాజ్‌దీప్‌ను ఏకేసిన ప్రణబ్ అంటూ... దీనిని కొందరు మరోలా వైరల్ చెయటం సీనియర్ జర్నలిస్ట్‌కు చికాకు తెప్పించింది. అంతే వెంటనే మరో ట్వీట్ చేశారు. ‘మేం(జర్నలిస్టులు) బొద్దింకల్లాంటి వాళ్లం. సెలబ్రిటీలు సీతాకోకచిలుకలాంటోళ్లు. మర్యాదగా నడుచుకోవటం మేం వారి దగ్గరి నుంచే నేర్చుకుంటాం. అందుకే మేం వారిని గౌరవిస్తాం అంటూ ఓ ట్వీట్‌లో తెలిపారు. అయినా ఆ ట్రోలింగ్ ఆపకపోవటంతో కాస్త చికాకుగా ఇక తర్వాతి ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తే మంచిందంటూ ఆ ఎపిసోడ్‌కు పుల్ స్టాప్ పెట్టేశారు.
Journalists are cockroaches my friend. VVIPs are butterflies who teach us manners when we question them. I respect their greater intellect. https://t.co/7jF4mABoTz
— Rajdeep Sardesai (@sardesairajdeep) 14 October 2017
Comments
Please login to add a commentAdd a comment