India Today Interview
-
పోలింగ్‌లో అంతటి వ్యత్యాసం.. నిజంగా ఆందోళనకరం: మాజీ సీఈసీ ఖురేషి
న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై దేశమంతటా నెలకొన్న అనుమానాలను, ఆందోళనలను మరింత పెంచే మరో పరిణామం చోటుచేసుకుంది. వాటి విశ్వసనీయతపై స్వయంగా భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ కీలక సందేహాలు లేవనెత్తారు. తాజాగా ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతానికి సంబంధించి నెలకొన్న వివాదంపై గురువారం ప్రముఖ న్యూస్ చానల్ ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగడం తెలిసిందే.‘ఆ రోజు సాయంత్రం 5 గంటలకల్లా 55 శాతం మేరకు ఓటింగ్ (ప్రొవిజనల్ ఓటర్ టర్నౌట్–పీవోటీ) న మోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ.. మర్నాడు ఈసీ ప్రకటించిన తుది గణాంకాల్లో అది కాస్తా ఏకంగా 66.05 శాతానికి పెరిగిపోయింది’ అని రాజ్‌దీప్ పేర్కొనగా.. ఇంతటి వ్యత్యాసం అత్యంత ఆందోళన కలిగించే అంశమని ఖురేషీ చెప్పారు. దీనిపై తన అనుమానాలు, అభ్యంతరాలు, ఆందోళనలను ఖురేషీ ఈ సందర్భంగా పంచుకున్నారు. ఓటింగ్ శాతం గణాంకాలు ఎప్పటికప్పుడు (రియల్ టైమ్) నమోదవుతూనే ఉంటాయన్నారు. అలాంటప్పుడు పోలింగ్ నాటి సాయంత్రానికి, మర్నాటికి ఇంతటి వ్యత్యాసం కచి్చతంగా అత్యంత ఆందోళన కలిగించే విషయమేనని స్పష్టం చేశారు. ‘ఓటింగ్ శాతం ఇలా నమోదవుతుంది’ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ శాతం నమోదు ప్రక్రియ ఎలా జరుగుతుందో ఖురేషీ వివరించారు. ‘ఓటేయడానికి వచ్చే ప్రతి ఒక్కరి హాజరునూ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి విధిగా ఫారం–17సీలో నమోదు చేస్తారు. పోలింగ్ ముగిశాక ఆనాటి పరిణామాలన్నిటినీ అందులో నమోదు చేస్తారు. అలా ఫారం–17సీని పూర్తిగా నింపి, దానిపై అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్ల సంతకం తీసుకున్న తర్వాతే ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ బూత్‌ను వీడతారు’ అని వివరించారు. ‘ప్రతి పోలింగ్ బూత్లోనూ పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను 17సీ నమోదు చేస్తుంది. పైగా ఇది అదే రోజు, రియల్ టైమ్ (ఎప్పటికప్పుడు)లో నమోదయ్యే డేటా’ అని తెలిపారు. అలాంటప్పుడు పోలింగ్ జరిగిన మర్నాడు అది మారడం ఎలా సాధ్యమన్నది తనకే అర్థం కావడం లేదని ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇది ఎన్నో సందేహాలకు తావిచ్చే పరిణామమన్నారు. ‘దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చి తీరాల్సిందే.ఇప్పటికే ఆ పనిచేసి ఉండాల్సింది. ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు’ అన్నారు. ‘కీలకమైన ఈ సందేహాలకు ఈసీ ఇప్పటికైనా బదులివ్వాలి. జాతీయ మీడియాను పిలిచి పోలింగ్ గణాంకాలకు ³Nర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలి’ అన్నారు. ‘ఈవీఎంల పనితీరు తదితరాలపై ఇప్పటికే దేశమంతటా అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి. వాటిని ఈసీ వెంటనే తీర్చకపోతే జనాల మెదళ్లలోకి మరింతగా చొచ్చుకుపోతాయి. అప్పుడు మొత్తం వ్యవస్థల మీదే విశ్వాసం పోతుంది’ అంటూ ఖురేషీ ఆందోళన వెలిబుచ్చారు. ఓటింగ్ శాతంలో అనూహ్య పెరుగుదల అంశం ఐదేళ్ల కింద సుప్రీంకోర్టు వరకు వెళ్లిందన్నారు. ఈసీ తుది గణాంకాల మేరకు మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల తర్వాత ఏకంగా 11 శాతం ఓటింగ్ జరిగినట్టు భావించాలని కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ అన్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ అనుమానాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు ఖురేషీ చెప్పారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సి ఉందన్నా్డరు. ఆయన 2010–12 మధ్య కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా పనిచేశారు.ఏపీ పోలింగ్ శాతంలో 12.54 శాతం తేడా!ఆంధ్రప్రదేశ్‌లో మే 13న నాలుగో దశలో ఎన్నికలు నిర్వహించగా.. అదే రోజున రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ తర్వాత రాత్రి 11.45 గంటలకు 76.50 శాతం పోలింగ్ జరిగినట్టు ప్రకటించింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన నాలుగు రోజులకు అంటే మే 17న తుది పోలింగ్ శాతం 80.66 అని ప్రకటించింది. అంటే.. తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి తుది పోలింగ్ శాతానికి మధ్య 12.54 శాతం పెరుగుదల ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఆ తర్వాత వెల్లడించిన పోలింగ్ శాతానికి భారీ తేడా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. ఒడిశా (12.48 శాతం) రెండో స్థానంలో నిలిచాయి.పోలింగ్ శాతం పెరుగుదలకు ప్రధాన కారణం ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం లేదా ఈవీఎంలు మార్చేయడం లేదా ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడం వంటి ఏదో ఒకటి అయి ఉండొచ్చని ఏడీఆర్ (అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారŠమ్స్), వీఎఫ్‌డీ (వోట్ ఫర్ డెమొక్రసీ) సంస్థల ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపించారు. పోలింగ్ శాతంలో భారీగా తేడా ఉండటం వల్ల పోలైన ఓట్లలో 49 లక్షల ఓట్లు పెరిగాయి. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్ శాతంలో పెరుగుదల వల్ల ఒక్కో లోక్‌సభ స్థానంలో సగటున 1.96 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఇది లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని వీఎఫ్‌డీ సంస్థ వెల్లడించింది.ఎన్నికల సంఘం పోలింగ్ శాతం తొలుత వెల్లడించిన దానికీ, ఆ తర్వాత ప్రకటించిన దానికీ తేడా ఉండకపోయి ఉంటే ఎన్డీఏకు 14, వైఎస్సార్సీపీకి 11 లోక్‌సభ స్థానాలు దక్కేవని స్పష్టం చేసింది. పోలింగ్ శాతంలో తేడా వల్ల ఒంగోలు, నరసరావుపేట, ఏలూరు, హిందూపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం లోక్‌సభ స్థానాల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది. -
ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను: వైఎస్ జగన్
‘‘ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ప్రతి కాంట్రాక్టునూ పారదర్శకంగా పరిశీలిస్తాం. అవినీతి ఉందని తెలిస్తే తిరిగి టెండర్లు పిలుస్తాం. కాంట్రాక్టర్లతో ఎలాంటి లాలూచీ ఉండదు. వాళ్లు తప్పు చేస్తే టెండర్లు రద్దు చేసి, మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ప్రక్రియను మారుస్తాం. అతి తక్కువ కోట్ చేసేవాళ్లకే టెండర్లు ఇస్తాం. చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి కాంట్రాక్టునూ రద్దు చేస్తాం. తిరిగి టెండర్లు పిలుస్తాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మరో మూడు రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ‘ఇండియా టుడే’ ప్రతినిధి రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు. పగ తీర్చుకోవాలన్నది తన అభిమతం కాదని చెప్పారు. తనను కేసులతో వేధించిన వారిని దేవుడే శిక్షిస్తాడని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు... రాజ్‌దీప్ సర్దేశాయ్: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత భారీ విజయం సాధ్యమవుతుందని మీరు ఊహించారా? జగన్మోహన్రెడ్డి: ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప విజయం. ఇదంతా దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్లే సాధ్యమైంది. నేను 14 నెలల పాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినప్పుడే కిందిస్థాయి నుంచి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని గ్రహించాను. మా పార్టీ అఖండ విజయం సాధించబోతోందని అవగతమైంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నేను చేసిన తొలి ప్రకటన మీకు గుర్తుండే ఉంటుంది. వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించబోతోందని చెప్పాను. సర్దేశాయ్: మీ పార్టీని చీల్చుతూ 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తమ పార్టీలోకి తీసుకున్నారు. మీ పార్టీని లేకుండా చేయాలనుకున్నారు. అసలు మీ విజయంలో మలుపు తిప్పిన అంశం ఏమిటి? జగన్: నా పాదయాత్రనే ఈ విజయంలో ప్రధాన పాత్ర వహించింది. మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారు. ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను రూ 20–30 కోట్లిచ్చి, ప్రలోభాలకు గురిచేసి తీసుకోవడమే కాకుండా వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అది చట్ట విరుద్ధం కానట్లుగా వ్యవహరించారు. పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా కూడా చేయలేదు. వారి చేత రాజీనామాలు కూడా చేయించలేదు. స్పీకర్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అన్యాయంగా వ్యవహరిస్తోందో ప్రజలు తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి తారస్థాయికి చేరుకుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని రుజువయ్యాయి. సర్దేశాయ్: మీరేమో చంద్రబాబు అవినీతి, దుశ్చర్యల వల్ల ఆగ్రహంతో ఓట్లేశారని అంటున్నారు. మరి ఇందులో జగన్‌కు సానుకూల ఓటు లేదా? ఇంతకీ ఈ ఓటు చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటా? లేక జగన్ అనుకూల ఓటా? జగన్: ఇందులో రెండూ కలిసి ఉన్నాయి. ఎన్నికలప్పుడు ప్రజలు రెండు అంశాలు చూస్తారు. ప్రభుత్వంలో ఉన్న వారిపై వ్యతిరేకతతో పాటు తమ ఆశలను నెరవేర్చే నాయకుడు ఎవరని కూడా చూస్తారు. ఈ రెండు అంశాలు కలిసినప్పుడే సహజంగా అది అఖండ విజయం అవుతుంది. ఉన్న నాయకుడిని వద్దనుకున్నప్పుడు, మరో నాయకుడిని కావాలనుకున్నప్పుడే ప్రజలు అఖండ విజయాన్ని అందిస్తారు. సర్దేశాయ్: ఏపీలో ఎన్నికలు మీకు, చంద్రబాబుకు మధ్య హోరాహోరీగా జరిగాయి కదా. ఎన్నికల ప్రచారంలో ఆయన మిమ్మల్ని టార్గెట్ చేశారు. మీరు ఆయన్ను తీవ్రస్థాయిలో విమర్శించారు కదా. చివరకు వచ్చేటప్పటికి మీ ఇద్దరిలో ఒకరిని ఎన్నుకునే పరిస్థితిని కల్పించారు కదా! జగన్ : మౌలికంగా ఇది ప్రాంతీయ పార్టీల సమరం. జాతీయ పార్టీలకు ఇక్కడ ఆ అవకాశం లేకుండా పోయింది. అలాంటప్పుడు నాకు, చంద్రబాబుకూ మధ్యనే పోరాటం జరుగుతుంది కదా! సర్దేశాయ్: రాష్ట్రాన్ని 12 నెలల్లో మారుస్తానని చెప్పారు? మీరు అనేక హామీలు ఇచ్చారు. అసలు మీ ఎజెండా ఏంటి? మోడల్ స్టేట్ అంటే ఏంటి? జగన్: ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ప్రజలు మెచ్చుకునే పారదర్శక పాలన అందిస్తా. ఏం చేస్తామో, ఎలా చేస్తామో చెబుతాం. ఒక్క ఏడాదిలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మారుస్తా. పూర్తిగా ప్రక్షాళన చేస్తా. అప్పుడు మీరే వెల్డన్ అంటారు. ప్రతీ కాంట్రాక్టును పారదర్శకంగా పరిశీలిస్తాం. అవినీతి ఉందని తెలిస్తే తిరిగి టెండర్లు పిలుస్తాం. కాంట్రాక్టర్లతో ఎలాంటి లాలూచీ ఉండదు. వాళ్లు తప్పు చేస్తే టెండర్లు రద్దు చేసి, మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ప్రక్రియను మారుస్తాం. అతి తక్కువ కోట్ చేసేవాళ్లకే టెండర్లు ఇస్తాం. రివర్స్ టెండరింగ్ విధానానికి ప్రాధాన్యం ఇస్తాం. చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి కాంట్రాక్టునూ రద్దు చేస్తాం. సర్దేశాయ్: వచ్చే ఏడాదిలో కాంట్రాక్టర్ల వ్యవస్థలో మార్పు తెస్తారా? జగన్: అవును. పెద్ద మార్పు ఉంటుంది. ఉదాహరణకు పవర్ టారిఫ్‌నే తీసుకోండి. సంప్రదాయేతర ఇంధన వనరులను పరిశీలిద్దాం. సౌర విద్యుత్ గ్లోబల్ టెండర్ల ద్వారా అయితే యూనిట్ రూ.2.65కే లభిస్తోంది. పవన విద్యుత్ విషయంలో నరేంద్ర మోదీ అనుసరించిన పారదర్శక విధానం అభినందనీయం. దీనివల్ల యూనిట్ రూ.3కే లభిస్తోంది. కానీ, మన రాష్ట్రంలో విద్యుత్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పవన విద్యుత్ యూనిట్ రూ.4.84 ఉంది. పీక్ అవర్స్‌లో ఏకంగా రూ.6 పెట్టి కొనడానికి ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలో సిస్టమ్ ఏమిటంటే, నువ్వో రూపాయి తీసుకో. నాకో రూపాయి అనే విధానం కొనసాగుతోంది. చంద్రబాబు ఆయనకు కావాల్సింది తీసుకుని ఇలాంటివి ప్రోత్సహించాడు. మేము ఈ వ్యవస్థను మారుస్తాం. గ్లోబల్ స్థాయిలోకి వెళ్లి ఇప్పుడున్న ధరలు తగ్గిస్తాం. ఇదొక్కటే కాకుండా జ్యుడీషియల్ కమిటీ వేస్తాం. న్యాయబద్ధంగా వ్యవహరిస్తాం. రాష్ట్రంలో ఒక వర్గం మీడియా చంద్రబాబుకు అనుకూలంగా మారింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి వాటికి చంద్రబాబు ఎంత చెబితే అంత. వాళ్లు వేరే పక్షాన్ని మట్టిలో కలపాలని కంకణం కట్టుకున్నారు. రాష్ట్రంలో సిస్టమ్‌ను పూర్తిగా మార్చాలని చూస్తున్నాం. జ్యుడీషియల్ కమిటీని వేసి, సిట్టింగ్ జడ్జిని పెడతాం. జరిగే ప్రతి టెండర్‌ను ఆయన ముందుంచుతాం. ఆయన ఏ విధమైన మార్పులు సూచిస్తే దాన్ని అనుసరిస్తాం. వాళ్ల నిర్ణయానికి అడ్డురాము. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ఏ మీడియా అడిగినా ఫైళ్లు చూపిస్తాం. అసత్య ప్రచారం చేసే మీడియాపై పరువు నష్టం కేసులు వేసేందుకు కూడా వెనుకాడం. సర్దేశాయ్: మీకు కూడా సొంత మీడియా ఉంది కదా? ఇది మీడియా పోరాటం కాదా? జగన్: ఉద్దేశపూర్వకంగా ప్రతిష్ట దిగజారిస్తే వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కదా! ఇది అమలు జరిగితే దేశానికే మంచి సంకేతాలు వెళ్తాయి. గుడ్ గవర్నెన్స్ అంటే ఇదీ అని అందరికీ తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా ఉండి అవినీతిపరుడని పేరు తెచ్చుకోకూడదు. కానీ, రాష్ట్రంలో ఒక వర్గం మీడియా వాస్తవాలు కాకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. సర్దేశాయ్: రాష్ట్రం ఇమేజ్, మీ ఇమేజ్ మీ టార్గెట్. మోడల్ స్టేట్‌గా మార్చడం మీ ప్రధాన ఆశయం.. అంతేనా? ఏడాది తర్వాత మళ్లీ మీ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. మీకు బలమైన ఎజెండా ఉంది. మోదీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తారా? ఆయన సహకారం కోరుకుంటున్నారా? కేంద్రంతో మంచిగా ఉండాలనుకుంటున్నారా? జగన్: మోదీని కలిసిన ప్రతీసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతాను. ఆయన ప్రధానమంత్రి. ఆయన ఆశీస్సులు అవసరం. మోదీ నుంచి మనకు నిధులు రావాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా నేను చెయ్యాల్సింది నేను చేస్తా. సర్దేశాయ్: గతం వదిలేద్దాం. ఇప్పుడు మీరు సాధించిన ఘన విజయం తరువాత వెంటనే మీకేమనిపించింది? జగన్: అఖండ విజయం సాధించిన క్షణంలో ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను. అవి నిజంగా భావోద్వేగమైన క్షణాలు. సర్దేశాయ్: ప్రజల్లో మీ బలం ఏమిటో అంచనా వేసుకోవడానికి ఓదార్పు యాత్ర తలపెట్టారనేది కాంగ్రెస్ పార్టీ భావన. పదేళ్ల తరువాత ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు సొంతంగా గెలిచి ఏపీకి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు తమ తప్పు తెలుసుకుని మిమ్మల్ని మళ్లీ ఆ పార్టీలోకి ఆహ్వానిస్తే మీరు వెళ్లే విషయం పరిశీలిస్తారా? లేక ఇక ఎప్పటికీ ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: (ఆవేదనగా) కాంగ్రెస్ పార్టీ నా విషయంలో ఏం చేసిందో నాకు తెలుసు. పగ తీర్చుకోవాలన్నది నా అభిమతం కాదు. వారిని దేవుడే చూసుకోవాలి. నేను రోజూ బైబిల్ చదువుతాను. నేను దేవుడిని ప్రార్థిస్తాను. దేవుడే వారికి శిక్ష వేస్తాడు. సర్దేశాయ్: అంటే ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: నాకు సంబంధించినంత వరకూ నాపై చేసిన దానికి ఎప్పుడో క్షమించేశాను. ఎందుకంటే క్షమిస్తే శాంతి వస్తుంది. ప్రస్తుతం నా దృష్టి అంతా నా రాష్ట్రంపైనా, నా ప్రజలపైనా మాత్రమే ఉంది. నా వ్యక్తిగత అంశాలు దేనికీ అడ్డు కారాదు. ఇవాళ నా ఆలోచన అంతా నా ప్రజల గురించే. నేను ఆలోచించాల్సిందల్లా నా రాష్ట్రానికి ఎలా మంచి జరుగుతుందనే. నేనిప్పుడు ఏపీ ప్రజల తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాను. వారికి నేను బాధ్యుడిగా ఉన్నాను. నాపై వారు పెట్టుకున్న నమ్మకం గురించి ఆలోచించకుండా వ్యక్తిగత విషయాలను తీసుకురావడం మంచిది కాదు. సర్దేశాయ్: ఒకవేళ ఇవాళ సోనియాగాంధీ కనుక మీ వద్దకు వచ్చి... ‘జగన్ కమాన్.. మళ్లీ మన ఇంటికి వచ్చేయ్. మీ తండ్రి మా కాంగ్రెస్ వారే’ అని ఆహ్వానిస్తే స్పందిస్తారా? లేక ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: మీరే చెప్పారు కాంగ్రెస్‌కు అత్యల్పంగా ఓట్లు వచ్చాయని. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? వారితో నాకు అవసరం ఏమిటి? సర్దేశాయ్: మీకు వాళ్ల అవసరం లేదు. కానీ, వాళ్లకు మీ అవసరం ఉంది. జగన్: వాళ్లకు నా అవసరం ఉందంటే అది వారి సమస్య. -
‘ఆ విషయంలో మోదీని చూసి నేర్చుకోవాలి’
న్యూఢిల్లీ : రాజకీయాలపరంగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ బద్ధ శత్రువులనే చెప్పవచ్చు. అయితే ఈ వైరం కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం. ఈ క్రమంలో ఇండియాటుడే మ్యాగ్జైన్కిచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ప్రధాని గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ నుంచి ఎలాంటి లక్షణాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారని విలేకరి ప్రశ్నించారు. రాహుల్ ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘మోదీ ఒకే సమయంలో వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు సందేశాలు ఇస్తారు. ఆ లక్షణాన్ని నేను కూడా అలవర్చుకోవాలనుకుంటున్నాను’ అని తెలిపారు. ‘కానీ అది సాధ్యం కావడం లేదు. అలా ప్రయత్నించిన ప్రతిసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇది చాలా గొప్ప లక్షణం. ఎందుకంటే ఇప్పుడు మీతో ఒక విషయం చెప్తూ.. సరిగ్గా అదే సమయంలో మరో వ్యక్తికి మరో విషయం చెప్పడం నిజంగా గొప్ప విషయమే కదా’ అన్నారు రాహుల్. అంతేకాక ‘ఈ మధ్య కాలంలో నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను. దానిలో ఆయన నరేంద్ర మోదీని కేవలం నరేంద్ర మోదీ మాత్రమే సవాలు చేయగలరని పేర్కొన్నారు. అది విని నా మైండ్ బ్లాక్ అయ్యింద’న్నారు రాహుల్. ఎందుకంటే ‘ప్రతి వ్యక్తి.. ప్రతి విషయం నాకొక సవాలుగానే కనిపిస్తుంది. నాకు కొన్ని విషయాలు తెలుసు.. మరికొన్నింటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు ప్రతి దాని గురించి తెలుసుకోవాలని లేదు. ప్రతీది తెలుసుకోవడం అంటే పిచ్చితనానికి నిదర్శనం అవుతుంది. కానీ నేను సాధరణ మనిషిని’ అని పేర్కొన్నారు. 2014 ఎన్నికల ఓటమి తనకు చాలా మంచి పాఠం నేర్పిందన్నారు. -
మోదీకి అధికారం దక్కనివ్వం!
ముంబై: ప్రధాని మోదీ ప్రభుత్వంలో దేశ పౌరుల్లో భయం, ఆందోళన పెరిగిపోయాయని యూపీఏ చైర్పర్సన్, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తోందన్నారు. కాంగ్రెస్, మిత్రపక్షాలన్నీ కలిసికట్టుగా పోరాడి 2019 ఎన్నికల్లో మోదీకి అధికారం దక్కకుండా అడ్డుకుంటామని ఆమె ఉద్ఘాటించారు. ముంబైలో ఇండియాటుడే సదస్సులో పాల్గొన్న సోనియా.. మోదీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యం అంటే ఒక్కరే మాట్లాడటం కాదని.. వ్యవస్థలో భిన్నాభిప్రాయాలు, చర్చ ఉండాలని పరోక్షంగా మోదీనుద్దేశించి వ్యాఖ్యానించారు. మూడున్నరేళ్లుగా దేశ ప్రజల స్వాతంత్య్రం పద్ధతిప్రకారం ప్రమాదంలో పడుతోందని.. భారతీయ మౌళిక సిద్ధాంతాలను పునర్నిర్వచించే ప్రయత్నం జరుగుతోందన్నారు. మూడున్నరేళ్లుగా దేశ చరిత్రను తిరగరాసేందుకు, వాస్తవాలను అబద్ధాలుగా చెప్పే ప్రయత్నం జరుగుతోందని సోనియా విమర్శించారు. మే, 2014 ముందు దేశంలో భారీగా అవినీతి జరుగుతోందని దుష్ప్రచారం చేశారని.. మరి బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి దిశగా వెళ్తోందా? అని ఆమె ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో రాయ్‌బరేలీలో పోటీ చేయటంపై పార్టీదే తుదినిర్ణయమన్నారు. ఈ సదస్సులో దేశంలో ప్రజాస్వామ్యం పాత్ర, ప్రభుత్వం నడుస్తున్న తీరు, దేశవ్యాప్తంగా పరిస్థితులు, ఆమె కుటుంబం, బయటకు తక్కువగా రావటం వంటి విస్తృతాంశాలపై తొలిసారిగా ఆమె మనసువిప్పి మాట్లాడారు. టార్గెట్ ప్రధాని మోదీ బీజేపీ ప్రభుత్వంలో అందరినీ కలుపుకుపోయే స్ఫూర్తి లేదని సోనియా విమర్శించారు. దీని కారణంగానే వారం రోజులుగా పార్లమెంటు సమావేశాలు రసాభాసగా మారుతున్నాయన్నారు. దేశంలో దళితులు, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని అయినా వీటిని నియంత్రించటంలో ప్రభుత్వం విఫలమైందని సోనియా విమర్శించారు. దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు, దేశ ప్రతిష్టను మసకబార్చేందుకు పదేపదే ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘2014కు ముందు దేశం తీవ్రమైన ప్రమాదంలో ఉందా? నాలుగేళ్లలోనే దేశం అభివృద్ధివైపు పరిగెడుతోందా? ప్రజల మేధస్సును అవమానించే ప్రయత్నం కాదా ఇది?’ అని ఆమె ప్రశ్నించారు. ‘జాతి నిర్మాతలను దూషిస్తున్నారు. స్వాతంత్య్రం అనంతరం కాంగ్రెస్ పార్టీ, ప్రధానులు సాధించిన విజయాలను రంధ్రాన్వేషణతో తక్కువచేసి చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు. వాజ్‌పేయితో మోదీని పోల్చలేం: ‘2014 ఎన్నికల్లో మేం నరేంద్ర మోదీ ప్రచారంతో పోటీపడలేకపోయాం. అందుకే ఓటమిపాలయ్యాం. కానీ 2019లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను మేం గెలవనివ్వం’ అని ఆమె వెల్లడించారు. ‘మోదీకి నేను సలహాలిచ్చే ధైర్యం చేయను. మోదీ వ్యక్తిగతంగా నాకు తెలియదు. వాజ్‌పేయితో మోదీని పోల్చలేం. వాజ్‌పేయి పార్లమెంటరీ విధానాలను గౌరవించారు. అప్పుడు కూడా మేం రాజకీయ ప్రత్యర్థులమే. చాలా అంశాల్లో భిన్నాభిప్రాయాలుండేవి. కానీ.. సభ సజావుగా సాగింది’ అని సోనియా పేర్కొన్నారు. ప్రమాదంలో దేశం: ‘అధికార పార్టీనుంచి రెచ్చగొట్టే ప్రకటనలు రావటం ఓ వ్యూహాత్మక విధానంలో భాగం. ఇది రాబోయే ప్రమాదానికి సంకేతం’ అని అన్నారు. ‘ప్రభుత్వ నిర్ణయంతో విభేదించేందుకు, నచ్చింది తినేందుకు స్వేచ్ఛ లేదు. ఓవైపు నిరుద్యోగులు ఉపాధికోసం అలమటిస్తుంటే.. 2017లో ఏడున్నర లక్షల ఉద్యోగాలు సృష్టించామని ప్రకటించటంలో వాస్తవముందా?’ అని ఆమె ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకల అణచివేత: ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే వారిని అణచివేసే ప్రయత్నాలు జరగుతున్నాయని సోనియా విమర్శించారు. ‘దేశాన్ని బలమైన శక్తిగా నిలిపిన సిద్ధాంతాలు, విధానాలు యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతున్నాయి. పార్లమెంటులో మెజారిటీని.. చర్చ జరగకుండా అణచివేయటం, చట్టాలను బలవంతంగా అమలుచేసేందుకు ఇచ్చిన లైసెన్స్‌గా భావిస్తున్నారు. విచారణ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని సోనియా ఆరోపించారు. మన్మోహన్ నాకన్నా సమర్థుడు: 2004 ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మంత్రిగా ఎవరిని నియమించాలనే ప్రశ్న ఎదురైనపుడు.. మన్మోహన్ సింగ్ కన్నా సమర్థుడైన వ్యక్తి తనకు కనిపించలేదన్నారు. ‘నా పరిమితులు నాకు తెలుసు. నాకన్నా మన్మోహన్ సింగ్ సమర్థుడైన ప్రధాని అని తెలుసు’ అని స్పష్టం చేశారు. ‘బహిరంగ వేదికలపై సహజంగా మాట్లాడటం నాకు రాదు. అందుకే నన్ను ఓ లీడర్ కన్నా రీడర్‌గానే చూస్తారు’ అని తెలిపారు. రాజకీయ పార్టీలపై..: భావసారూప్యత ఉన్న పార్టీ్టలు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక సమస్యలను పరిష్కరించుకోవాలి. ‘కాంగ్రెస్ పార్టీ భావసారూప్యత ఉన్న పార్టీల నేతలతో తరచూ సమావేశమవుతోంది. పార్లమెంటులోనూ ఈ పార్టీలతో చక్కటి సమన్వయం ఉంది. అయితే జాతీయస్థాయిలో అందరినీ కలుపుకుని పోవటం అంత సులువేం కాదు. అయినా.. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తాం’ అని అన్నారు. ఏం చేయాలో రాహుల్‌కు తెలుసు ‘రాహుల్‌కు తన బాధ్యతలేంటో బాగా తెలుసు. అవసరమైతే నేనున్నా. అంతేగానీ.. అతని ప్రయత్నాల్లో జోక్యం చేసుకోను. యువ రక్తంతో సీనియర్ల అనుభవాన్ని జోడించాలని రాహుల్ ఆలోచిస్తున్నారు ’ అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పీఠంపై గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాకుండా బయటివారు ఉండేందుకు అవకాశముందని సోనియా పేర్కొన్నారు. ‘ప్రియాంక రాయ్‌బరేలీ, అమేథీలకు పరిమితమైంది. రాజకీయాల్లోకి రావటం ఆమె వ్యక్తిగత నిర్ణయం’ అని ఆమె చెప్పారు. ‘నా గురించి ఆలోచించుకునేందుకు కొంత సమయం దొరికింది. నా భర్త (రాజీవ్), అత్త (ఇందిర)లకు సంబంధించిన పాత లేఖలను సేకరిస్తున్నాను. వాటిని డిజిటలైజ్ చేయిస్తాను’ అని సోనియా పేర్కొన్నారు. -
దాదాకు బాగా కోపమొచ్చింది
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొంత కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ ఛానెల్ ఇండియా టుడే ‘టూ ది పాయింట్’ కార్యక్రమం కోసం సీనియర్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ దాదాను ఇంటర్వ్యూ చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంభాషణ బయటకు వచ్చింది. ఇంటర్వ్యూలో భాగంగా ఓ ప్రశ్నకు ప్రణబ్ సమాధానం చెప్పబోతుంటే.. మధ్యలో రాజ్‌దీప్ కలగజేసుకుని ఏదో అడగాలని యత్నించారు. దీంతో సహనం కోల్పోయిన ప్రణబ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ‘ మాట్లాడేటప్పుడు మధ్యలో కలగజేసుకునే అలవాటు నీకు మంచిది కాదు. ముందు నన్ను పూర్తి చెయ్యనివ్వు. నీ ముందుంది ఓ మాజీ రాష్ట్రపతి అని గుర్తుంచుకుని ప్రవర్తించు. నేను మాట్లాడేటప్పుడు విను. నా సమాధానం పూర్తయ్యాకే మరో ప్రశ్న అడుగు. నేనేం టీవీల్లో కనిపించేందుకు ఆత్రుతతో రాలేదు. మీరు పిలిస్తేనే వచ్చా’ అంటూ ప్రణబ్ మందలించాడు. అయితే చివర్లో ఇంటర్వ్యూ అయ్యాక తాను చేసిన కఠువు వ్యాఖ్యలపై ప్రణబ్ క్షమాపణలు చెప్పబోతుండగా.. వాటిని సానుకూలంగానే తీసుకున్నట్లు రాజ్‌దీప్ చెప్పటం కొసమెరుపు. మాములుగా అయితే ఇలాంటి వీడియోలు ఎడిటింగ్‌లో లేపేయటం జరుగుతుంటుంది. కానీ, రాజ్‌దీప్‌కు అలా చెయ్యటం ఎంత మాత్రం ఇష్టం లేదంట. అందుకు ఆ సంభాషణను యథాతథంగా ఉంచేశారు. అయితే రాజ్‌దీప్‌ను ఏకేసిన ప్రణబ్ అంటూ... దీనిని కొందరు మరోలా వైరల్ చెయటం సీనియర్ జర్నలిస్ట్‌కు చికాకు తెప్పించింది. అంతే వెంటనే మరో ట్వీట్ చేశారు. ‘మేం(జర్నలిస్టులు) బొద్దింకల్లాంటి వాళ్లం. సెలబ్రిటీలు సీతాకోకచిలుకలాంటోళ్లు. మర్యాదగా నడుచుకోవటం మేం వారి దగ్గరి నుంచే నేర్చుకుంటాం. అందుకే మేం వారిని గౌరవిస్తాం అంటూ ఓ ట్వీట్లో తెలిపారు. అయినా ఆ ట్రోలింగ్ ఆపకపోవటంతో కాస్త చికాకుగా ఇక తర్వాతి ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తే మంచిందంటూ ఆ ఎపిసోడ్‌కు పుల్ స్టాప్ పెట్టేశారు. Journalists are cockroaches my friend. VVIPs are butterflies who teach us manners when we question them. I respect their greater intellect. https://t.co/7jF4mABoTz — Rajdeep Sardesai (@sardesairajdeep) 14 October 2017 -
సొంత నేతలే మోదీని విమర్శిస్తుంటే...
సాక్షి, న్యూఢిల్లీ : రెండు దఫాలు అధికారంలో కొనసాగిన యూపీఏ ప్రభుత్వం.. మూడోసారి మాత్రం దారుణంగా పరాభవాన్ని మూటగట్టుకుంది. కారణాలేవైనా తమ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ.. ఈ మూడేళ్లలో రాష్ట్రపతిగా కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ మోదీ ప్రభుత్వంతో సత్సంబంధాలనే కొనసాగించటం అప్పట్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇప్పుడు ఆయన రాష్ట్రపతి భవన్‌ను వీడి నాలుగు నెలలు అయ్యింది. ఇంతకాలం ఎక్కడా కనిపించని ఆయన.. ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చి ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఓవైపు బీజేపీ సీనియర్ నేతలే సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వేళ.. మోదీ ప్రభుత్వానికి ప్రణబ్ పలు సూచనలు చేయటం గమనార్హం. ‘మార్పుతో కూడిన నిర్ణయాలను వెను వెంటనే తీసుకోవటం మంచిది కాదు. అవి మంచి ఫలితాను ఇవ్వకపోగా.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తాయి అని ప్రణబ్ చెప్పారు. ఇక జీఎస్టీ మంచి నిర్ణయమే అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉత్పన్నం కావటం సాధారణమేనని.. వాటిని మోదీ సర్కార్ అధిగమించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా-పాకిస్థాన్లతో భారత్ దౌత్యపరమైన అంశాల ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన.. యుద్ధం అనేది ఎప్పటికీ శాశ్వత పరిష్కారం కాలేదని.. కేవలం చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని... ఆ సూత్రాన్నే తానూ బలంగా నమ్ముతానని చెప్పారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను అంచనావేస్తూ... ‘కాంగ్రెస్ పార్టీ పని అయిపోలేదు. అది 132 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. తిరిగి పుంజుకుంటుంది’ అని ప్రణబ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాను రాష్ట్రపతిగా ఉన్న సమయంలో అనుభవాలతోపాటు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో తన అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు. మన్మోహన్ సింగ్ తో ఎలాంటి విభేధాలు లేవన్న దాదా.. తాను ప్రధాని రేసు నుంచి వైదొలగటానికి హిందీ భాష రాకపోవటం కూడా ఓ కారణమని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి సొంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం ఓ కారణం కాగా, బీజేపీ నేత పీయూష్ గోయల్ అంచనాలు ఆ పార్టీ అందుకోవటం ఆశ్చర్యం ప్రణబ్ కలిగించిందన్నారు. ప్రణబ్ వెలువరించిన పలు ఆసక్తికర విషయాలతో కూడిన ఈ ఇంటర్వ్యూను ప్రముఖ పాత్రికేయుడు రాజ్ చెంగప్ప చేయగా.. అక్టోబర్ 23 ఇండియా టుడే సంచికలో ప్రచురితం కానుంది. -
వాట్ ఐ యామ్ 'నాట్' సేయింగ్..
* మీరడిగింది కాదు... నే చెప్పిందే వినాలన్నట్లుగా వ్యవహరిస్తున్న బాబు * తప్పించుకునే ప్రయత్నంలో మీడియాకు అడ్డంగా దొరికిపోతున్న వైనం సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా ఇరుక్కుపోయిన నారావారు... తప్పించుకునే దారిలేక.., చేసిన తప్పును ఒప్పుకోలేక.. అసలు విషయాన్ని పక్కకునెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను, ప్రభుత్వ సంస్థలనేకాదు మీడియాను కూడా తప్పుదోవపట్టించేలా తన చాణక్యతను ప్రదర్శిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందా? టేపులో గొంతు తనదా? కాదా? అనే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా ట్యాపింగ్, ఫిరాయింపులంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇండియా టుడే ఇంటర్వ్యూలో కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు విచిత్ర సమాధానాలు చూద్దాం. - ఇలా కొన్ని ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలిస్తూ దాటవేసేందుకు ప్రయత్నించిన బాబు - మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. రాజ్‌దీప్: స్టీఫెన్సన్కు డబ్బులిస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందని, అదే స్టీఫెన్ సన్తో.. కమిట్మెంట్లు అన్నీ ఫుల్‌ఫిల్ చేస్తామని మీరు చెప్పారని టీఆర్ఎస్ అంటోంది. దీనిపై మీరేమంటారు? బాబు: అధికారం లేకున్నా వాళ్లు స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఈ పనులన్నీ ఎలక్షన్ కమిషన్ చేయాలి. (స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది నిజమేనా?) రాజ్‌దీప్: వాళ్లు స్టింగ్ ఆపరేషన్ చేసింది మీ సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే కదా? బాబు: నేనేమంటానంటే.. ప్రతీ ప్రభుత్వం ఎమ్మెల్యేలపై ఇలా చేసుకుంటూ పోతే ఎలక్షన్ కమిషన్ ఏమవుతుంది? ఎలక్షన్ కమిషన్ ఉన్నదెందుకు?(చేసిన తప్పు గురించి మాట్లాడకుండా...) రాజ్‌దీప్: మీ ఎమ్మెల్యే 50 లక్షలు ఎందుకు తీసుకెళ్లారు? బాబు: అది వేరే విషయం(దాటవేసేందుకు ప్రయత్నిస్తూ..) విచారణ జరగాలి(అంటూనే..)అందులోకి నన్ను లాగవద్దు. రాజ్‌దీప్: ఏసీబీ మీకు సమన్లు జారీ చేస్తుందని కేసీఆర్ సంకేతాలిస్తున్నారు కదా.. బాబు: ఆయన(కేసీఆర్) ఏమీ చే యలేడు.. రాజ్‌దీప్: అంటే మీకు సమన్లు పంపలేడా? బాబు: ముందు సమన్లు పంపమనండి.. అపుడు నేనేం చేయాలో అది చేస్తాను. రాజ్‌దీప్: మీకు సమన్లు జారీ చేసేందుకు అవసరమైన అనుమతి కోసం ఆయన గవర్నర్ వద్దకు వెళ్లారు కదా? బాబు: మాకేం అధికారాలున్నాయో.. మా దగ్గర ఏం ఆధారాలున్నాయో మేం చూపిస్తాం. -
పాక్‌లో ‘ఉగ్ర’ స్థావరాలను ఒప్పుకోం
-
పాక్‌లో ‘ఉగ్ర’ స్థావరాలను ఒప్పుకోం
భారత్ నిజమైన అంతర్జాతీయ భాగస్వామి * భారత్-అమెరికా బంధానికే అత్యధిక ప్రాధాన్యం * ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో ఒబామా.. మోదీపై ప్రశంసల వర్షం న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని ప్రాంతాలు ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండ టాన్ని అంగీకరించేది లేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టంచేశారు. భారత్‌ను నిజమైన అంతర్జాతీయ భాగస్వామిగా అభివర్ణించారు. ముంబై దాడుల వెనకున్న కుట్రదారులకు తగిన శిక్ష పడాల్సిందేనన్నారు. ‘ఇండియా టుడే’ వార పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పత్రిక తదుపరి సంచికలో అమెరికా ఈ ఇంటర్వ్యూని ప్రచురించనుంది. భారత గణతంత్ర వేడుకల్లో ఒబామా ముఖ్యఅతిథిగా పాల్గొననున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రవాదంపై పోరులో అమెరికా వెనక్కి తగ్గేది లేదని, ఇందుకోసం భారతీయులు, అమెరికన్లు ఏకమవుతారని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాతో సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ప్రధాని మోదీ చూపుతున్న చొరవతో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని దృఢం చేసుకునేందుకు తమకు మరో గొప్ప అవకాశం లభించిందన్నారు. భారత్, అమెరికాలు నిజమైన అంతర్జాతీయ భాగస్వాములుగా మారాలన్న తన లక్ష్యం నెరవేరే సమయం వచ్చిందన్నారు. అందుకే గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనే తొలి అమెరికా అధ్యక్షుడిగా భారత్ ఆహ్వానాన్ని ఆమోదించినట్లు చెప్పారు. భారత్‌లో రెండుసార్లు పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడిగా కూడా ఒబామా ప్రత్యేకత చాటుకోనున్నారు. 2010లో పర్యటించిన సందర్భంగా పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత్-అమెరికా భాగస్వామ్యం విజయవంతం కావాలని అభిలషించారు. పరస్పర గౌరవంతో ఇరుపక్షాల ప్రయోజనాలను గుర్తించి అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆ దిశగానే ఇరు దేశాలు సాగుతున్నాయని ఒబామా పేర్కొన్నారు. ద్వైపాక్షిక బంధానికి గట్టి పునాది వేసేందుకు ఈ పర్యటనను సద్వినియోగం చేసుకుంటానన్నారు. తన విదేశాంగ విధానంలో భారత్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యముంటుందన్నారు. ప్రపంచ భద్రత కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీపై ఒబామా ప్రశంసలు కురిపించారు. ఆయన చాయ్‌వాలా స్థాయి నుంచి ప్రధానిగా ఎదగడాన్ని బట్టి.. విజయం సాధించడానికి భారతీయుల సంకల్ప బలం ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు. భారత్ అభివృద్ధి కోసం మోదీకి నిర్దిష్ట దృక్పథముందని పేర్కొన్నారు. 25, 29న కార్యాలయాల మూసివేత గణతంత్ర దినోత్సవ పరేడ్, బీటింగ్ రిట్రీట్ వేడుక సందర్భంగా ఈ నెల 25, 29న నార్త్, సౌత్ బ్లాకులు, వాటి సమీపంలోని కార్యాలయాలను తొందరగా మూసివేయనున్నట్టు శిక్షణ సిబ్బంది శాఖ శుక్రవారం తెలిపింది. ‘అణు’ చర్చల్లో పురోగతి! లండన్: అమెరికాతో అణు ఒప్పందంలో ప్రతిష్టంభన తొలగించేందుకు భారత్ అనేక మార్గాలను అన్వేషిస్తోంది. అణు సరఫరాదారులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న ‘అణు పరిహార చట్టం’లోని నిబంధనలపై దృష్టి సారించింది. ఈ చట్టంపై విదేశీ అణు సరఫరాదారుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుందని తెలపనుంది. అణు ప్రమాదాలు చోటుచేసుకుంటే సరఫరాదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు విపత్తు బాండ్లు జారీ చేయాలని భావిస్తోంది. అమెరికాతో ఈ ఒప్పందాన్ని పట్టాలెక్కించేందుకు ఇరుదేశాల ఉన్నతాధికారులు లండన్‌లో చర్చలు జరుపుతున్నారు. ఈ రెండు ప్రతిపాదనలపై చర్చించారు. విపత్తు బాండ్ల జారీ ప్రతిపాదనను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(ఐఆర్డీఏ) ముందుకు తెచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కీలకమైన అంశాలపై పురోగతి కనిపించిందని, మరికొన్నింటిపై రాజకీయస్థాయిలో నిర్ణయాలు జరగాల్సి ఉందని పేర్కొన్నాయి. పౌర అణు పరిహార చట్టం-2010 ప్రకారం అణు రియాక్టర్ల నిర్వాహకులు ముందుగానే రూ.1,500 కోట్లను పక్కన పెట్టాలి. ప్రమాదం జరిగితే ఈ మొత్తాన్ని బాధితులకు అందించేందుకు వీలుగా చట్టంలో ఈ నిబంధన పొందుపరిచారు. నిర్వహకులు అణుసరఫరాదారుడి నుంచి పరిహారం అడిగే హక్కునూ చట్టంలో కల్పించారు. అణురియాక్టర్లకు బీమా రక్షణ కల్పించాలని జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ(జీఐసీ)కి ప్రభుత్వం సూచించింది. విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించాలని సర్కారు యోచిస్తోంది. రూ.1,500 కోట్ల నిధిని సమకూర్చడం ప్రభుత్వ బీమా కంపెనీలకు భారంగా మారింది. నిబంధనల ప్రకారం వీటిద్వారా రూ.750 కోట్లు మాత్రమే సమకూరే అవకాశం ఉంది. దీంతో విదేశీ కంపెనీలకు ఇందులో చోటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీమా కిందకు రాని అణు నష్టాలను ‘విపత్తు బాండ్ల’ ద్వారా భరించేలా కసరత్తు చేస్తోంది.