వాట్ ఐ యామ్ 'నాట్' సేయింగ్..
* మీరడిగింది కాదు... నే చెప్పిందే వినాలన్నట్లుగా వ్యవహరిస్తున్న బాబు
* తప్పించుకునే ప్రయత్నంలో మీడియాకు అడ్డంగా దొరికిపోతున్న వైనం
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా ఇరుక్కుపోయిన నారావారు... తప్పించుకునే దారిలేక.., చేసిన తప్పును ఒప్పుకోలేక.. అసలు విషయాన్ని పక్కకునెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను, ప్రభుత్వ సంస్థలనేకాదు మీడియాను కూడా తప్పుదోవపట్టించేలా తన చాణక్యతను ప్రదర్శిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందా? టేపులో గొంతు తనదా? కాదా? అనే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా ట్యాపింగ్, ఫిరాయింపులంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇండియా టుడే ఇంటర్వ్యూలో కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు విచిత్ర సమాధానాలు చూద్దాం.
- ఇలా కొన్ని ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలిస్తూ దాటవేసేందుకు ప్రయత్నించిన బాబు
- మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు.
రాజ్‌దీప్: స్టీఫెన్‌సన్‌కు డబ్బులిస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందని, అదే స్టీఫెన్ సన్‌తో.. కమిట్‌మెంట్లు అన్నీ ఫుల్‌ఫిల్ చేస్తామని మీరు చెప్పారని టీఆర్‌ఎస్ అంటోంది. దీనిపై మీరేమంటారు?
బాబు: అధికారం లేకున్నా వాళ్లు స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఈ పనులన్నీ ఎలక్షన్ కమిషన్ చేయాలి. (స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది నిజమేనా?)
రాజ్‌దీప్: వాళ్లు స్టింగ్ ఆపరేషన్ చేసింది మీ సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే కదా?
బాబు: నేనేమంటానంటే.. ప్రతీ ప్రభుత్వం ఎమ్మెల్యేలపై ఇలా చేసుకుంటూ పోతే
ఎలక్షన్ కమిషన్ ఏమవుతుంది? ఎలక్షన్ కమిషన్ ఉన్నదెందుకు?(చేసిన తప్పు
గురించి మాట్లాడకుండా...)
రాజ్‌దీప్: మీ ఎమ్మెల్యే 50 లక్షలు ఎందుకు తీసుకెళ్లారు?
బాబు: అది వేరే విషయం(దాటవేసేందుకు ప్రయత్నిస్తూ..) విచారణ జరగాలి(అంటూనే..)అందులోకి నన్ను లాగవద్దు.
రాజ్‌దీప్: ఏసీబీ మీకు సమన్లు జారీ చేస్తుందని కేసీఆర్ సంకేతాలిస్తున్నారు కదా..
బాబు: ఆయన(కేసీఆర్) ఏమీ చే యలేడు..
రాజ్‌దీప్: అంటే మీకు సమన్లు పంపలేడా?
బాబు: ముందు సమన్లు పంపమనండి.. అపుడు నేనేం చేయాలో అది చేస్తాను.
రాజ్‌దీప్: మీకు సమన్లు జారీ చేసేందుకు అవసరమైన అనుమతి కోసం ఆయన గవర్నర్ వద్దకు వెళ్లారు కదా?
బాబు: మాకేం అధికారాలున్నాయో.. మా దగ్గర ఏం ఆధారాలున్నాయో మేం చూపిస్తాం.