
'ఆధిపత్య ధోరణిలో ఇందిరా, మోదీలకు దగ్గర పోలికలు'
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిత్వ తీరు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పోలి ఉంటుందని సీనియర్ జర్నలిస్ట్, ప్రఖ్యాత న్యూస్ యాంకర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిత్వ తీరు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పోలి ఉంటుందని సీనియర్ జర్నలిస్ట్, ప్రఖ్యాత న్యూస్ యాంకర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ లాగానే నరేంద్రమోదీ కూడా వ్యవస్థ కన్నా వ్యక్తే అధికుడనే తీరులో వ్యవహరిస్తుంటారని పేర్కొన్నారు.తాజా పుస్తకం ‘2014- ద ఎలక్షన్ దట్ చేంజ్‌డ్ ఇండియా’లో పలువురు జాతీయ స్థాయి రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలను ఆ పుస్తకంలో వెల్లడించారు.
ప్రతిపక్షాన్ని కలుపుకుపోవడంపై కూడా ఇందిర తరహాలోనే ప్రతికూల ధోరణితోనే ఉంటారు. అందుకే కాంగ్రెస్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయంలో ఆ పార్టీ ఒత్తిడికి ఏమాత్రం తలొగ్గలేదన్నారు.