నైతికంగా ఓడిపోయినా మోదీలో అహంకారం తగ్గలేదు: ఖర్గే
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. అప్పట్లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించి అమలుచేస్తే, గత పదేళ్లలో నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ ప్రకటించకుండానే అమలు చేశారని విమర్శించారు.
మోదీ విధించిన అప్రకటిత అత్యవసర పరిస్థితికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ముగింపు పలికారని పేర్కొన్నారు. ఈ మేరకు ఖర్గే సోమవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని వెల్లడించారు. ఎన్నికల్లో నైతికంగా ఓడిపోయినప్పటికీ మోదీలో అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదని మండిపడ్డారు. పరీక్ష పేపర్లు లీక్ కావడంతో యువత నష్టపోయారని, ప్రధాని మోదీ కనీసం సానుభూతి తెలపడం లేదని తప్పుపట్టారు. బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంపై మాట్లాడడం లేదని ఆక్షేపించారు.
Comments
Please login to add a commentAdd a comment