
సాక్షి, హైదరాబాద్: సీఎల్పీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాజీ ఎంపీ వీ హనుమంతరావు భేటీ అయ్యారు. రేవంత్‌కి పీసీసీ ఇచ్చినప్పటి నుంచి కోమటిరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు నచ్చజెప్పే బాధ్యతను పొలిటికల్ అఫైర్స్ కమిటీ వీహెచ్‌కి అప్పగించింది.
ఇదిలా ఉండగా శనివారం సీఎల్పీ ఆఫీస్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'కామారెడ్డి- ఎల్లారెడ్డి నుంచి నా ఉద్యమం మొదలుపెడతా. రేపటి నుంచి నా సంగతి ఏంటో చూపిస్తా. కాంగ్రెస్ పార్టీ నా ప్రాణం- సోనియాగాంధీ నా దేవత. మా పార్టీ నేతలే అప్పుడు దయ్యం ఇప్పుడు దేవత అంటున్నారు. పెద్ద లీడర్లు అని చెప్పుకొని పదవుల పంపకాలు చేసుకున్నారు. నేను జిల్లా లీడర్‌ను వాళ్లంతా పెద్ద గొప్ప లీడర్లు. ఏపీలో కాంగ్రెస్ లేదనుకుంటే 6 వేల ఓట్లు వచ్చాయి. తెలంగాణలో ప్రభుత్వం వస్తదని చెప్పుకున్నా డిపాజిట్లు రాలే.
చదవండి: (ఇది చేతకాని ప్రభుత్వం: వైఎస్ షర్మిల)
గెలుపోటములు సహజం కేసీఆర్ ఇక రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల గురించి ఆలోచన చేయాలి. కేటీఆర్ సూటు, బూటు వేసుకుంటే పెట్టుబడులు రావు. కాంగ్రెస్ అభివృద్ధి వల్లే ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి. కేటీఆర్ ఎందుకు రైతుల గురించి వాళ్ల కష్టాల గురించి మాట్లాడరు. రైతుబంధు వల్ల ఎవరికి ఉపయోగం. మా ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రిని చూసి కేసీఆర్ బుద్ది తెచ్చుకోవాలి అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment