సాక్షి, హైదరాబాద్: మిర్చి పంటను ఇప్పటికే 40శాతం దాకా రైతులు అమ్మేసుకున్నారని, వారికీ కేంద్రం అందించే ధర, బోనస్‌ను ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం కనీసం క్వింటాలు మిర్చికి రూ.10 వేలు ఇవ్వాల్సిందన్నారు. మిర్చి పంటను కొనుగోలు చేయ లేని అసమర్థత నుంచి, దృష్టి మళ్లించడానికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌పై టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేసులను పెట్టిందని ఆరోపించారు.